సీఎం రేవంత్‌రెడ్డికి టాలీవుడ్‌ డైరెక్టర్‌ బహిరంగ లేఖ | Tollywood Director Sanjeev Reddy Write Letter To Telangana CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి టాలీవుడ్‌ డైరెక్టర్‌ బహిరంగ లేఖ

Published Tue, Dec 12 2023 3:26 PM | Last Updated on Tue, Dec 12 2023 3:39 PM

Tollywood Director Sanjeev Reddy Write Letter To Telangana CM Revanth Reddy - Sakshi

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి..తనదైన మార్క్‌ పాలనను ప్రారంభించారు. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం అమలు చేశాలు చేశాడు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ‘ప్రజావాణి’ని నిర్వహిస్తున్నాడు.

నేటి నుంచి రైతుబంధు నిధులను కూడా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశాడు. సినీ, ప్రజా సమస్యలను తెలియజేస్తూ..వాటిని త్వరగా పరిష్కరించాలని సీఎం రేవంత్‌కు, సినిమాటోగ్రపీ మినిస్టర్‌ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాడు. తెలంగాణలో సినిమా అవార్డులను, ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ని నిర్వహించాలని కోరారు.

అలాగే అర్హులైన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, పాత్రికేయులకు ఇల్లు లేదా స్థలాలు ఇచ్చి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, చైతన్యవంతమైన సృజనాత్మక వాతావరణానికి దోహదపడగలరని లేఖలో పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌ వాసిగా ఓ విజ్ఞప్తి అంటూ.. నాళాల సమస్యలను, ట్రాఫిక్‌ కష్టాలను వివరిస్తూ.. కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు.

(చదవండి: ఎక్కడా కనిపించని 'సలార్‌' బజ్‌.. మరి సినిమా పరిస్థితి ఏంటి..?)

సంజీవ్‌ రెడ్డి సినిమా విషయాలకొస్తే.. తెలుగులో యంగ్‌ హీరో అల్లు శిరీష్‌తో ABCD అనే సినిమా తెరకెక్కించాడు. ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌ హీరోగా ‘ఆహా నా పెళ్లంట’అనే వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కించాడు. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement