నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ్‌రెడ్డి
మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ గురువారం ఖరారు చేసింది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆకస్మికంగా మృతి చెందిన కృష్టారెడ్డి కుమారుడు సంజీవ్‌రెడ్డిని అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల ఫిబ్రవరి 13వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు 16వ తేదీన జరుగుతుంది.
ఈ ఉప ఎన్నికపై జనవరి 20వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 30వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కృష్టారెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుంది.