
అన్న కేథరిన్ వలయిల్
అన్న కేథరిన్ వలయిల్ ఇండియాలో పుట్టి నైజీరియాలో పెరిగింది. మళ్లీ వారి కుటుంబం స్వదేశానికి వచ్చింది. కొచ్చిన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. సౌత్ ఆస్ట్రేలియాలో మూడు సంవత్సరాల పాటు ఇండిజినస్ మ్యూజిక్‌ను స్టడీ చేసింది. డెబ్యూ మ్యూజిక్ వీడియో ‘హాని బీ’ తనకు మంచి పేరు తెచ్చింది.
కేథరిన్ చక్కని సింగర్ మాత్రమే కాదు చక్కని కవయిత్రి కూడా. ‘ఏబీసిడీ’ ‘బెంగళూరు డేస్’ ‘లైలా ఓ లైలా’ సినిమాలలో పాటలు రాసింది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కోసం ఒక మ్యూజిక్ వీడియో తయారు చేసి ఇచ్చింది. తన గొంతే కాదు..పాటలు కూడా బాగుంటాయి అని చెప్పడానికి ఈ వాక్యాలు సాక్ష్యంగా నిలుస్తాయి...
‘నాలుగు గోడల ఇల్లే నీ ప్రపంచం కాదు
ఈ ప్రపంచమే నీ ఇల్లు
పక్షులు ఆకాశంలో స్చేచ్ఛగా విహరించాలని మాత్రమే అనుకుంటాయి
అక్కడ ఖరీదైన గూడు ఒకటి కట్టాలనుకోవు!’
Comments
Please login to add a commentAdd a comment