Indian music
-
కొరియన్ నోట భారతీయ సంగీతం..'ఔరా' అంటున్న నెటిజన్లు
‘సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఆసక్తి. పాటలు వింటాను. మ్యూజిక్ వీడియోలు చూస్తుంటాను’ అంటున్న కొరియన్ ఆర్టిస్ట్ ఔర సింగర్–సాంగ్ రైటర్ శిరీష భాగవతులతో కలిసి ‘థీ థీ తారా’ (కుట్టనాడన్ డ్రీమ్స్) ఆలపించాడు. గత సంవత్సరం చివరిలో బిగ్‌బాస్ సీజన్ 17లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా కనిపించాడు.ఈ సంవత్సరం ప్రారంభంలో ఝలక్ దిఖ్లా సీజన్ 11లో కూడా కనిపించాడు. ఈ క్రమంలో ఇండియన్ మ్యూజిక్‌పై లవ్ పెంచుకున్నాడు. ‘ఛలో’ ‘రోకో’లాంటి పదాలు పలుకుతున్న ఔర హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాడు.‘ఔరా ఉచ్చారణ చాలా భిన్నంగా ఉంటుంది. దీని కోసం ఐదు వారల పాటు పనిచేశాడు. అతడి అంకితభావం నాకు ఎంతగానో నచ్చింది’ అంటున్న శిరీష ఔరాను మన దేశంలోని ఇంటిపేరుగా అభివర్ణించింది. ‘మార్నింగ్ నూన్ ఈవెనింగ్’ ‘బ్లూ ఒషియన్’ ‘ఫైర్‌వర్క్’....ఇలాంటి ఎన్నో సింగిల్స్‌తో పేరు తెచ్చుకున్న ఔరా 2014లో బాయ్ బ్యాండ్ ఎఎతో కెరీర్ ప్రారంభించాడు. (చదవండి: ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్‌చేస్తే నేడు ఆమె..!) -
సంగీతంలో అపశ్రుతి
సంగీతంలో సప్తస్వరాలు ఉన్నాయి. పశుపక్ష్యాదుల ధ్వనుల నుంచి ఇవి పుట్టినట్లు ప్రతీతి. శ్రుతి లయలు స్వరాల గమనానికి దిశానిర్దేశం చేసి, సంగీతాన్ని మనోరంజకం చేస్తాయి. సంగీతానికి ఆధారభూతమైన సప్తస్వరాలైనా, శ్రుతిలయాదులైనా– అన్నీ ప్రకృతి నుంచి పుట్టినవే! ప్రకృతికి కులమతాలు లేవు. ప్రకృతి నుంచి పుట్టిన సంగీతానికి కూడా కులమతాలు లేవు, సరిహద్దులు లేవు. చక్కని సంగీతానికి శ్రావ్యతే గీటురాయి. సంగీత కళను శాస్త్రబద్ధం చేసిన తొలి రోజుల్లో సంగీతానికి సంబంధించిన శాస్త్రీయ సంప్రదాయాలు కొన్ని ఏర్పడ్డాయి. తర్వాతి తరా లలో కొందరు సంగీత విద్వాంసులు పూర్వసంప్రదాయాలను, చాదస్తాలను తోసిపుచ్చి, తమదైన సృజనతో కొత్త ఒరవడికి నాంది పలికారు. తొలినాళ్లలో ఏకరీతిలో ఉన్న భారతీయ సంగీతంలో పద్నాలుగో శతాబ్దం నాటికి విభజన ఏర్పడింది. భారతీయ సంగీతంలో హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో ఎన్ని శాఖలు ఉన్నా, అవన్నీ శైలీభేదాల వల్ల ఏర్పడి నవి మాత్రమే! కర్ణాటక సంగీతానికి పురందరదాసు పితామహుడిగా పేరుగాంచారు. ఆయన తర్వాతి కాలంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ‘కర్ణాటక సంగీత త్రిమూ ర్తులు’గా పేరుపొందారు. వీరందరూ ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేసిన వారే గాని, పూర్వ శాస్త్రగ్రంథాల్లోని పాఠాలకు కట్టుబడి, వాటినే తు.చ. తప్పకుండా వల్లెవేసిన వారు కాదు. వారంతా మడిగట్టుకుని పూర్వగ్రంథాల్లోని పద్ధతులకే పరిమితమై ఉన్నట్లయితే, ఈనాడు కర్ణాటక సంగీతం ఇంతటి ఉత్కృష్ట స్థాయికి చేరుకునేదే కాదు. ముత్తుస్వామి దీక్షితార్ సాహసోపేతమైన ప్రయోగాలే చేశారు. ఈస్టిండియా కంపెనీ అధికారి కర్నల్ జేమ్స్ బ్రౌన్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ సంగీత బాణీలకు సంస్కృత రచనలు చేశారు. ఈస్టిండియా కంపెనీ బ్యాండ్ ఆర్కెస్ట్రాలో ఉపయోగించే వయొలిన్‌ను చూసి ముచ్చటపడి కర్ణాటక సంగీత కచేరీల్లోకి తీసుకువచ్చారు. ముత్తుస్వామి సోదరుడు బాలుస్వామి తొలిసారిగా కర్ణాటక సంగీత కచేరీలో వయొలిన్ వాయించారు. పాశ్చాత్య శైలిలో ‘నోటు స్వరాలు’ కూర్చి సంప్రదాయ కచేరీల్లో వినిపించడం ప్రారంభించారు. ముత్తుస్వామి దీక్షితార్ చేసిన ప్రయోగాలు ఆనాటిసంప్రదాయవాదులకు మింగుడుపడనివే! చాదస్తపు విమర్శలకు భయపడి ముత్తుస్వామి తన ప్రయోగాలను విరమించుకున్నట్లయితే, ఆయన అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయేవారు. ముత్తుస్వామి దీక్షితార్ తర్వాతికాలంలో కూడా కొందరు విద్వాంసులు క్లారినెట్, శాక్సాఫోన్, మాండొలిన్, గిటార్, వయోలా, పియానో వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. త్యాగరాజు కాలం నాటికి అప్పటి తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య సంగీతానికి కూడా సమాదరణ ఉండేది. త్యాగరాజు రాజాశ్రయానికి దూరంగా తనసంగీత సాధన కొనసాగించినా, ఆయనపైనా పాశ్చాత్య సంగీత ప్రభావం లేకపోలేదు. త్యాగరాజు ఏటా వేసవిలో ఎక్కువగా తిరువయ్యారులో గడిపేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన పాశ్చాత్యసంగీతాన్ని ఆస్వాదించారు. త్యాగరాజు ఆ తర్వాతి కాలంలో శంకరాభరణ రాగంలో కూర్చిన ‘వరలీలా గానలోలా’, ‘సారస నేత్ర’, సుపోషిణి రాగంలో కూర్చిన ‘రమించు వారెవరురా’ వంటి కొద్ది కీర్తనల్లో పాశ్చాత్య సంగీత ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రయోగాలు లేకుండా ఏ కళా, ఏ శాస్త్రమూ అభివృద్ధి చెందదు. మన కాలానికి చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి శ్రోతలను మెప్పించారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆరోహణ అవరోహణలలో ఒక రాగానికి కనీసం ఐదేసి స్వరాలు ఉండాలి. ఆరోహణ అవరోహణలలో ఐదు కంటే తక్కువ స్వరాలను ఉపయో గించి ఆయన కొత్త రాగాలను సృష్టించారు. నేటితరంలో టి.ఎం.కృష్ణ తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. సంప్రదాయ కచేరీ నమూనాలోనే మార్పులను తీసుకొచ్చారు. వర్ణాలు, కృతులు, తిల్లానాలు వంటి వాటితోనే సాగే కర్ణాటక సంగీత కచేరీల్లో టి.ఎం.కృష్ణ క్రైస్తవ గీతాలను, ఇస్లాం గీతాలను, తమిళ కవుల గేయాలను కూడా పాడటం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు. కచేరీల్లో టి.ఎం. కృష్ణ ఈ మార్పులను తెచ్చినప్పటి నుంచి మతతత్త్వవాదులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తు న్నారు. టి.ఎం.కృష్ణ సంగీత రంగానికి మాత్రమే పరిమితం కాకుండా; దేశంలోని సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే తీరు, దళితవాడలకు వెళ్లి కచేరీలు చేస్తూ సంగీతాన్ని సామాన్యుల చెంతకు చేరుస్తున్న పద్ధతి కూడా వారికి కంటగింపుగా మారింది. ఇదివరకు టి.ఎం. కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు వచ్చినప్పుడు రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఆయనకు మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రకటించింది. దీనికి నిరసనగా గాయనీమణులు రంజని, గాయత్రి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కచేరీ చేయబోమంటూ, అకాడమీ అధ్యక్షుడికి లేఖ రాశారు. మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి ఆ లేఖకు ఇచ్చిన సమాధానంలో వారి తీరును తప్పుపట్టారు. టి.ఎం.కృష్ణపై అక్కసు వెళ్లగక్కుతున్న వారంతా ఆయన సంగీత సామ ర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా, ఆయన సంప్రదాయాన్ని మంటగలిపేస్తున్నాడంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రంజని, గాయత్రి వంటి వారి తీరు సంగీత ప్రపంచంలో ఒక అపశ్రుతి. అయితే, సంగీతం ఒక స్వరవాహిని. ఇలాంటి అపశ్రుతులను సవరించుకుంటూ తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. -
మన సంగీతానికి నీరాజనం!
మనిషి జీవితంలో ఓ అంత ర్భాగం సంగీతం. అన్ని సందర్భాల్లోనూ ఆయా భావాలను వ్యక్తం చేయడానికి సంగీతం ఒక వాహిక. అయితే ప్రపంచంలో అనేక రకాల సంగీత సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో భారతీయ సంగీత సంప్రదాయాలకు చాలా విశిష్ట స్థానం ఉంది. భారతీయ సంగీతం రాగ ప్రధానమైనది అయితే పాశ్చాత్య సంగీతం స్వరమేళన ప్రధానం. భారతీయ సంగీతం గురించి వేదాల్లో ఒకటైన సామ వేదంలోనూ ప్రస్తావితమయ్యింది. భరతముని తన ‘నాట్యశాస్త్రం’ (క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 2 వ శతాబ్దం)లో భారతీయ సంగీతం గురించి విపులంగా వివరించాడు. మధ్య ఆసియా నుండి వచ్చిన తుర్కీయులు, తాతార్లు, పర్షియన్లు, అఫ్గాన్లు పాలన చేస్తున్నప్పుడు భారతీయ సంగీతం ఉత్తర, దక్షిణ సంగీత సంప్రదాయాలుగా విడిపోయింది. ఉత్తర సంప్రదాయాన్ని ‘హిందుస్తానీ’ సంగీతమనీ, దక్షిణపు సంప్రదాయాన్ని∙‘కర్ణాటక’సంగీతం అనీ పిలవడం ప్రారంభమయింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో పార్శీ దేశానికి చెందిన అమీర్ ఖుస్రూ ఉండేవాడు. ఇతడు పార్శీ సంగీతంలోని రాగ క్రమ పద్ధతిని భారతీయ సంగీతంతో మేళవించి ఒక కొత్త సంగీత సంప్రదాయాన్ని సృష్టించాడు. అదే ‘హిందుస్తానీ’ సంగీతం. హిందూస్తానీ సంగీతం ‘రాగ రాగిణుల’ చిత్ర కళా సంప్రదాయాన్ని కూడా సృష్టించింది. ఒక రాగాన్ని వినేప్పుడు కలిగే భావనావృత్తి కొన్ని దృశ్యరూపాలతో సంలగ్నమై ఉంటుంది. అటువంటి దృశ్యరూపాన్ని చిత్రరూపంలో పొందుపరచేందుకు ఉత్తర భారతంలో కృషి జరిగింది. ఆ కృషి ఫలితాలే రాగరాగిణి చిత్రాలు. హిందూస్తానీ సంప్రదాయంలో సూరదాసు, తులసీదాసు, మీరాబాయి, జయదేవుడు వంటివారు భక్తి సంగీతాన్ని సుసంపన్నం చేశారు. కొందరు గజల్స్ రూపంలో మధురభక్తిని సృష్టించారు. దక్షిణ భారతదేశంలో పేరు పొందిన భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం. ‘కర్ణాటిక్’ అనే పదానికి సంస్కృత పదం అయిన ‘కర్ణేషు అతతి’ (చెవులకు ఇంపైన సంగీతం కనుక కర్ణాటక సంగీతం) మూలం అని కొందరి పరిశోధకుల అభిప్రాయం. ‘కరనాడు’ అంటే సముద్ర తీరం అనీ, మూడు వైపులా సముద్ర తీరం గల దక్షిణ భారతదేశంలో పుట్టిన సంగీతం కనుక దక్షిణ సంగీత సంప్రదాయానికి కర్ణాటక సంగీతం అనే పేరు వచ్చింది అనీ మరికొందరి అభిప్రాయం. కర్ణాటక సంగీత సంప్రదాయంలో హిందుస్తానీ సంప్రదాయంలాగా భక్తి, శృంగార రసాలకు ప్రాధా న్యం ఎక్కువగా ఉంటుంది. శృంగార రసం కొన్ని సందర్భాల్లో పరిణతి చెంది భక్తిగా రూపాంతరం చెందుతుంది. త్యాగయ్య, శ్యామశాస్త్రి, పురంధరరాసు, రామదాసు వంటి వాగ్గేయకారుల పదసాహిత్యం భక్తి కోవకి చెందినది. జావళీలు, ప్రత్యేకించి క్షేత్రయ్య పదాలు శృంగార రసానికి చెందినవి. కర్ణాటక సంగీతంలో ప్రధాన లక్షణంగా పరిగణించే రాగాన్ని పతంగుడు పేర్కొన్నాడు. రాగాల్లో కొన్ని రాగాలు ఉల్లాసాన్నీ, మరికొన్ని రాగాలు విషా దాన్నీ, కొన్ని కరుణ రసాన్నీ స్ఫురింపజేస్తాయి. ఈ విధంగా ఆ యా రాగాలు శ్రోతల హృదయంలో ఆయా అనుభూతులను కలిగించగలుగుతున్నాయి. కర్ణాటక సంగీతశాస్త్రంలో మరో ప్రాధాన్య లక్ష్యం ‘శ్రుతి’. ‘శ్రు’ (అంటే వినుట) అనే ధాతువు నుండి ‘శ్రుతి’ అనే పదం పుట్టింది. భారతీయ సంగీతానికి గమకాలు ఒక విశిష్టతను చేకూర్చాయి. గానానికి వీటిని మాల అలంకారాలుగా వర్ణింపవచ్చునని సంగీతవేత్తల అభిప్రాయం. కర్ణాటక సంగీత సంప్రదాయంలో తెలుగు భాష ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు భాష మధురమైన భాష. ఈ భాష పదాలకూ, వ్యాకరణానికీ సరైన ప్రాధా న్యమిస్తూ శ్రావ్యమైన కూర్పులను అందిస్తుంది. అలాంటి కూర్పులు వాగ్గేయకారులచే స్వరపరచబడి పద్యం అందాన్ని మరింత పెంచాయి. అందుకనే కాబోలు ఆనాటి తొలి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య మొదలుకొని రామదాసు, క్షేత్రయ్య; సంగీత మూర్తి త్రయంలోని త్యాగయ్య, శ్యామశాస్త్రి, తమిళులైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, ముత్తయ్య భాగవతార్; కన్నడ దేశానికి చెందిన మైసూర్ వాసుదేవాచారి ఇత్యాది వాగ్గేయకారులు తెలుగు భాషనే ఎంచుకొని, తమ రచనలు సాగించారు. అంతటి విశిష్టమైనది మన తెలుగు భాష. అందుకనే తెలుగు రాష్ట్రాల పునర్విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ‘కృష్ణ వేణి సంగీత నీరాజనం’ అనే సంగీతోత్సవాన్ని ఈ డిసెంబరు 10 నుండి 12 వరకు విజయ వాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో, అలాగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, కృష్ణానది దుర్గా ఘాట్ల వద్ద ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ నిర్వహిస్తోంది. ఈ సంగీతోత్సవం ముఖ్య ఉద్దేశ్యం మన అద్భుతమైన సంగీత సంప్రదాయాలను పరిరక్షించడం... తద్వారా హరికథ, నామ సంకీర్తన సంప్రదాయాలపై దృష్టిని పునరుద్ధరించే ప్రయత్నం చేయడం; తెలుగు భాష గొప్పతనాన్నీ, వారసత్వాన్నీ వెలుగులోకి తీసుకు రావడం. ఈ ఉత్సవం సంగీత కళాశాలల విద్యా ర్థులకూ, విశ్వ విద్యాలయాల విద్యార్థులకూ నేర్చుకోవ డానికీ, వారి ప్రతిభను ప్రదర్శించ డానికీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఆర్. మల్లికార్జున రావు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు -
శాంతం–సంగీతం
వాగ్గేయకారులైన వారు రచించిన గీతాలు మహాకవులయిన ఇతరులు రచించిన పద్యాల సందర్భాల్లాగే ఉంటాయి. శివలింగం అంటే శివుడితో మాట్లాడుతున్నట్లే, ఇది విగ్రహం కాదు రాముడే, ఇది శిల కాదు.. అక్కడ ఉన్నది కామాక్షియే, అది మూర్తి కాదు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే.. అని పరవశాన్ని పొంది లోపలి భావాలను గీతాలుగా స్వరయుక్తంగా ప్రవహింపచేశారు. అవి అజరామరమై ఎన్ని శతాబ్దాలు గడిచినా రామాయణ, భారత, భాగవతాల్లాగే ఉండిపోతున్నాయి. వారికి అనేక శాస్త్రాల్లో నిష్ఠ ఉండేది. త్యాగరాజ స్వామివారి ‘‘మా జానకిచేతపట్టగ..’ కీర్తననే చూడండి.రామాయణాన్ని భవిష్యపురాణంతో కలిపారు. రామావతారంలోంచి శ్రీవేంకటేశ్వర అవతారం లోకి వెళ్ళింది. అంటే వారికి సమస్త పురాణేతిహాసాలు, వేదవేదాంగాలు సప్తధాతువుల్లో జీర్ణమయిపోయాయి. అన్ని సంగీత పరికరాల్లోకి అత్యంత ప్రధానమైన నాదోపాసనకు సాధనమైన వీణ మీద వీరు అధికారం పొందారు. ‘‘వీణావాదనతత్త్వజ్ఞః శృతిజాతి విశారదః తాళజ్ఞప్రయాసేన మోక్షమార్గం సగచ్ఛతి’’ ఎవరయితే ఆ వీణావాద తత్త్వాన్ని, నాదోపాసన చేయగలిగిన స్థితిని పొంది ఉన్నారో, సంగీతంలో ఉన్న అన్ని శబ్దాల గురించి పరిపూర ్ణజ్ఞానాన్ని పొంది ఉన్నారో, తాళం వినగానే తాళ లక్షణాల గురించి చెప్పగలరో వారు మోక్షమార్గంలో పోతున్నారనడం నిస్సందేహం. అంటే భారతీయ సంగీతం మోక్షానికి కారణం. త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, రామదాసు, అన్నమాచార్యులూ ఆ స్థితినే పొందారు. కేవలం మనోరంజకత్వం కాదు, భగవంతునిలో ఐక్యమయిపోవడానికి దివ్యసాధనంగా మనకు ఆ సంగీతాన్ని çపవిత్రమైన వస్తువుగా, గంగాజల భాండంగా, ఆవుపాల కుండగా అందించారు. వారి సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో, సాహిత్యం కూడా అంత గంభీరంగా ఉంటుంది. వీరిలో మరో విశేషం కనపడుతుంది. అది సర్వకాల సర్వావస్థల్లో పరమ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితి. మనం ఎంత సాధన చేసినా, ఏ యజ్ఞయాగాదులు, జపాలు, పూజలు చేసినా ఎక్కడో ఒకచోట శాంతం తప్పుతాం. అందుకే త్యాగరాజస్వామి అంటారు...‘శాంతములేక సౌఖ్యము లేదు...’ అని. శాంతం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండడం. నాకిది కావాలని కానీ, నాకు వారంటే కోపం అని కానీ, వీరంటే చికాకని కానీ ఉండదు. ఎవరిమీదా ప్రేమా ఉండదు, ద్వేషం ఉండదు. రాగద్వేషా లు లేకుండా ఎలా ..? అమ్మ ఈ రెండే పట్టుకుని ఉంటుంది.‘‘రాగ స్వరూపపాశాధ్య క్రోధాంకారేంమేశోజ్వలా..’’ నన్ను ఉపాసన చేయగా చేయగా నీకున్న రాగం అన్న పాశం తీసి భక్తి అన్న పాశం వేసి నా దగ్గరకు లాక్కుంటాను... అంటుంది. అంకుశం పెట్టి పొడిస్తే ఏనుగు ఎంత బాధ పడుతుందో తన కోపం తన శత్రువయి అంత బాధపెడుతుంది. అందువల్ల రాగద్వేషాలు లేని ప్రశాంత స్థితిని పొందాలి. సాధన చేస్తున్నప్పుడు ఈ స్థితిని కొంతవరకే పొందగలం. కానీ ఎప్పుడూ అలా ఉండడం అంత సులభం కాదు. దానిని సాధ్యం చేసేది ఒక్క సంగీతం మాత్రమే. అలా సాధ్యం చేసి చూపారు మనకు వాగ్గేయకారులు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
G20 Summit: 78 భిన్న వాయిద్యాలతో సంగీత సౌరభం!
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ నేతలకు వీనుల విందైన సంగీతం వినిపించేందుకు వాయిద్యకారులు సిద్ధమయ్యారు. భారతీయ సంగీత వారసత్వ సంపద ఎంతటి గొప్పదో ప్రత్యక్షంగా చూపేందుకు సమాయత్తమయ్యారు. శాస్త్రీయ సంగీతంతోపాటు సమకాలీన సంగీతంలో వినియోగించే భిన్న వాద్య పరికరాలతో సంగీత విభావరి అతిథులను ఆకట్టుకోనుంది. గాంధర్వ ఆతిథ్యం బృందం ‘భారత వాద్య దర్శనం’ పేరిట గొప్ప ప్రదర్శన ఇవ్వనుంది. జీ20 దేశాధినేతలకు సెప్టెంబర్ తొమ్మిదో తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో ఈ సంగీత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సంతూర్, సారంగీ, జల్ తరంగ్, షెహనాయ్ ఇలా దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన మొత్తం 78 రకాల వాద్య పరికరాల నుంచి ఉద్భవించే అద్భుతమైన సంగీతం ఆహుతులను అలరించనుంది. ‘సంగీత మార్గంలో భారత్ సాగించిన సామరస్య ప్రయాణం తాలూకు అపురూప జ్ఞాపకాలను ఇప్పుడు మరోసారి గుర్తుచేస్తాం’ అని ఆహా్వన ప్రతి సంబంధ బ్రోచర్ కాన్సెప్ట్ నోట్లో పేర్కొన్నారు. ఈ ప్రదర్శన విలాంబిత్ లయతో మొదలై మధ్య లయలో కొనసాగి ధృత లయతో ముగుస్తుంది. ఈ వాయిద్య పరికరాల సమ్మేళనంలో 34 హిందుస్తానీ సంగీతం తాలూకు వాద్య పరికరాలు, 18 కర్ణాటక సంగీత సంబంధ పరికరాలు, 26 జానపద సంబంధ పరికరాలు వినియోగిస్తున్నారు. 11 మంది చిన్నారులు, 13 మంది మహిళలు, ఆరుగురు దివ్యాంగులు, 26 మంది యువకులు, 22 మంది నిష్ణాతులుసహా 78 మంది కళాకారులు ఈ వాద్య పరికరాలను వాయిస్తారు. తమ ప్రాంత విశిష్ట వారసత్వ సంగీత సంపదను ఘనంగా చాటుతూ భిన్న ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయక వేషధారణలో వేదకాలంనాటి పరికరాలు, గిరిజనుల, జానపదుల పరికరాలతోపాటు లలిత సంగీతం తాలూకు పరికరాలు వాయిస్తారు. -
Anna Katharina Valayil: సింగర్ మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా..
అన్న కేథరిన్ వలయిల్ ఇండియాలో పుట్టి నైజీరియాలో పెరిగింది. మళ్లీ వారి కుటుంబం స్వదేశానికి వచ్చింది. కొచ్చిన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. సౌత్ ఆస్ట్రేలియాలో మూడు సంవత్సరాల పాటు ఇండిజినస్ మ్యూజిక్‌ను స్టడీ చేసింది. డెబ్యూ మ్యూజిక్ వీడియో ‘హాని బీ’ తనకు మంచి పేరు తెచ్చింది. కేథరిన్ చక్కని సింగర్ మాత్రమే కాదు చక్కని కవయిత్రి కూడా. ‘ఏబీసిడీ’ ‘బెంగళూరు డేస్’ ‘లైలా ఓ లైలా’ సినిమాలలో పాటలు రాసింది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కోసం ఒక మ్యూజిక్ వీడియో తయారు చేసి ఇచ్చింది. తన గొంతే కాదు..పాటలు కూడా బాగుంటాయి అని చెప్పడానికి ఈ వాక్యాలు సాక్ష్యంగా నిలుస్తాయి... ‘నాలుగు గోడల ఇల్లే నీ ప్రపంచం కాదు ఈ ప్రపంచమే నీ ఇల్లు పక్షులు ఆకాశంలో స్చేచ్ఛగా విహరించాలని మాత్రమే అనుకుంటాయి అక్కడ ఖరీదైన గూడు ఒకటి కట్టాలనుకోవు!’ చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం.. -
రెహమాన్‌తో పాడాలనుంది
సెలీనా గోమేజ్... హాలీవుడ్ పాప్ సింగర్. పాతికేళ్లకే పాప్ సంగీతంలో బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈ భామకు ఇండియన్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అట. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఓ పాట పాడాలనుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇండియన్ మ్యూజిక్ మీద తన ఇంట్రెస్ట్ గురించి సెలీనా మాట్లాడుతూ – ‘‘నేను ఇండియన్ మ్యూజిక్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాను. వండర్ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అభిమానిస్తుంటాను. ఈ రోజు ఆయన కేవలం ఇండియన్ మ్యుజిషియన్ మాత్రమే కాదు. గ్లోబల్ ఫిగర్. ఆయన కంపోజిషన్‌లో పాడాలని లేదా ఆయనతో కలసి వర్క్ చేయాలని ఉంది. ఓ బాలీవుడ్ సాంగ్ పాడితే కూడా బావుంటుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సెలీనా. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చిన రెహమాన్ హాలీవుడ్ సింగర్స్‌తో కలసి వర్క్ చేయడం కొత్తేమీ కాదు. ఇగ్గీ అజేలా, కేటీ టన్స్టిల్ వంటి వారితో ఆల్రెడీ పని చేశారు. చూద్దాం మరి.. సెలీనా ఆకాంక్ష తీరుతుందో? లేదో. -
బాంబే రాగశ్రీ
బాంబే జయశ్రీ... భారతీయ సంగీతంలో పరిచయం అక్కర్లేని పేరు. ‘శశివదనే శశివదనే... స్వరనీలాంబరి నీవా...’ పాటను ఇష్టపడని సంగీత ప్రియులుండరు. ‘మనోహరా నా హృదయంలో...’ అంటూ కూనిరాగాయలు తీయని చెలి ఉండదు. ఇలాంటి పాటలతో తెలుగువారి చెవుల్లో తేనెలు కురిపించిన జయశ్రీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. రవీంద్రభారతిలో సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన కచేరీలో తన గాన మాధుర్యంతో శ్రోతలకు వీనులవిందు చేశారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ఆమెను పలకరించింది. ఆ సంగీత ఝరి పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: కట్ట కవిత హైదరాబాదీలెప్పుడూ కొత్త ఆలోచనలను స్వాగతిస్తారు. ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో అంతే ఎనర్జిటిక్ కూడా. 1990 తొలినాళ్లలో నేను ఇక్కడ మొదటి ప్రదర్శన ఇచ్చాను. అప్పటినుంచే నాకు సిటీ అంటే అమితమైన ప్రేమ. బీఆర్సీ అయ్యంగార్ నిర్వహించే కన్సర్ట్స్‌లో పాల్గొనడానికి తరచూ వచ్చేదాన్ని. ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. నా పుస్తకం వాయిసెస్ వితిన్ మొదట ప్రింట య్యింది కూడా ఇక్కడే. కర్ణాటక సంగీతం తెలుగులో చాలా కంపోజ్ అయింది. అయితే ఈ విషయంలో తమిళనాడుతో పోల్చు కుంటే మాత్రం తక్కువే. ఈ 20 ఏళ్లలో నగరంలో కర్ణాటక సంగీత ప్రేమికులు తగ్గిపోయారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారికి మాత్రం దీనిపై ప్రేమ తగ్గలేదు. నేర్చుకుంటున్నారు, పాడుతున్నారు, వింటున్నారు. కర్ణాటక సంగీతం ఓ మంచి స్నేహితుడి సాంగత్యం వంటిది. శ్రోతల్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆస్వాదిస్తారు. ఈ సంగీతాన్ని వింటూ కొందరు ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తే... మరికొందరు అందులోని సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇవ్వాల్సిన సమయం... కోల్‌కత్తాలో పుట్టి, ముంబైలో పెరిగి, ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నా... నా పేరు పక్కన బాంబే ఉండడాన్నే ఇష్టపడతాను. ముంబై అంటే అంతిష్టం. సంగీతమే సర్వం అయిపోయింది కానీ.. తొలినాళ్లలో అమ్మ నా మెంటార్. తరువాత నా గురువులు టి.ఆర్.బాలమణి, లాల్గుడి జయరామన్‌ల ఆశీస్సులతో ఇంత ఎదిగాను. అలాగే హిందుస్థానీ సంగీతాన్ని నాకందించిన మహవీర్ జయపూర్వాలే, అజయ్ పొహంకర్లను మరువలేను. ఇప్పటిదాకా ఎంతో నేర్చుకున్నాను, ఎంతో పొందాను. కానీ ఇది నేను సమాజానికి ఎంతోకొంత ఇవ్వాల్సిన సమయం. అందుకే ‘హితం’ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా విద్యార్థులతో కలిసి గ్రామీణ విద్యార్థులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్‌కు సంగీతాన్ని నేర్పిస్తున్నాను. సంగీతంతో సంతోషాన్ని నలుగురికి పంచడంలో ఆనందం ఉంది.