బాంబే రాగశ్రీ | Bombay ragasri | Sakshi
Sakshi News home page

బాంబే రాగశ్రీ

Published Sun, Apr 26 2015 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

బాంబే రాగశ్రీ

బాంబే రాగశ్రీ

బాంబే జయశ్రీ... భారతీయ సంగీతంలో పరిచయం అక్కర్లేని పేరు. ‘శశివదనే శశివదనే... స్వరనీలాంబరి నీవా...’ పాటను ఇష్టపడని సంగీత ప్రియులుండరు. ‘మనోహరా నా హృదయంలో...’ అంటూ కూనిరాగాయలు తీయని చెలి ఉండదు. ఇలాంటి పాటలతో తెలుగువారి చెవుల్లో తేనెలు కురిపించిన జయశ్రీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. రవీంద్రభారతిలో సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన        కచేరీలో తన గాన మాధుర్యంతో శ్రోతలకు వీనులవిందు చేశారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ఆమెను పలకరించింది. ఆ సంగీత ఝరి పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే...
 ..:: కట్ట కవిత
 
హైదరాబాదీలెప్పుడూ కొత్త ఆలోచనలను స్వాగతిస్తారు. ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో అంతే ఎనర్జిటిక్ కూడా. 1990 తొలినాళ్లలో నేను ఇక్కడ మొదటి ప్రదర్శన ఇచ్చాను. అప్పటినుంచే నాకు సిటీ అంటే అమితమైన ప్రేమ. బీఆర్‌సీ అయ్యంగార్ నిర్వహించే కన్సర్ట్స్‌లో పాల్గొనడానికి తరచూ వచ్చేదాన్ని. ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. నా పుస్తకం వాయిసెస్ వితిన్ మొదట ప్రింట య్యింది కూడా ఇక్కడే. కర్ణాటక సంగీతం తెలుగులో చాలా కంపోజ్ అయింది. అయితే ఈ విషయంలో తమిళనాడుతో పోల్చు కుంటే మాత్రం తక్కువే. ఈ 20 ఏళ్లలో నగరంలో కర్ణాటక సంగీత ప్రేమికులు తగ్గిపోయారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారికి మాత్రం దీనిపై ప్రేమ తగ్గలేదు. నేర్చుకుంటున్నారు, పాడుతున్నారు, వింటున్నారు. కర్ణాటక సంగీతం ఓ మంచి స్నేహితుడి సాంగత్యం వంటిది. శ్రోతల్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆస్వాదిస్తారు. ఈ సంగీతాన్ని వింటూ కొందరు  ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తే... మరికొందరు అందులోని సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తారు.
 
ఇవ్వాల్సిన సమయం...
 
కోల్‌కత్తాలో పుట్టి, ముంబైలో పెరిగి, ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నా... నా పేరు పక్కన బాంబే ఉండడాన్నే ఇష్టపడతాను. ముంబై అంటే అంతిష్టం. సంగీతమే సర్వం అయిపోయింది కానీ.. తొలినాళ్లలో అమ్మ నా మెంటార్. తరువాత నా గురువులు టి.ఆర్.బాలమణి, లాల్‌గుడి జయరామన్‌ల ఆశీస్సులతో ఇంత ఎదిగాను. అలాగే హిందుస్థానీ సంగీతాన్ని నాకందించిన మహవీర్ జయపూర్‌వాలే, అజయ్ పొహంకర్‌లను మరువలేను. ఇప్పటిదాకా ఎంతో నేర్చుకున్నాను, ఎంతో పొందాను. కానీ ఇది నేను సమాజానికి ఎంతోకొంత ఇవ్వాల్సిన సమయం. అందుకే ‘హితం’ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా విద్యార్థులతో కలిసి గ్రామీణ విద్యార్థులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్‌కు సంగీతాన్ని నేర్పిస్తున్నాను. సంగీతంతో సంతోషాన్ని నలుగురికి పంచడంలో ఆనందం ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement