‘సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఆసక్తి. పాటలు వింటాను. మ్యూజిక్ వీడియోలు చూస్తుంటాను’ అంటున్న కొరియన్ ఆర్టిస్ట్ ఔర సింగర్–సాంగ్ రైటర్ శిరీష భాగవతులతో కలిసి ‘థీ థీ తారా’ (కుట్టనాడన్ డ్రీమ్స్) ఆలపించాడు. గత సంవత్సరం చివరిలో బిగ్‌బాస్ సీజన్ 17లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా కనిపించాడు.
ఈ సంవత్సరం ప్రారంభంలో ఝలక్ దిఖ్లా సీజన్ 11లో కూడా కనిపించాడు. ఈ క్రమంలో ఇండియన్ మ్యూజిక్‌పై లవ్ పెంచుకున్నాడు. ‘ఛలో’ ‘రోకో’లాంటి పదాలు పలుకుతున్న ఔర హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాడు.
‘ఔరా ఉచ్చారణ చాలా భిన్నంగా ఉంటుంది. దీని కోసం ఐదు వారల పాటు పనిచేశాడు. అతడి అంకితభావం నాకు ఎంతగానో నచ్చింది’ అంటున్న శిరీష ఔరాను మన దేశంలోని ఇంటిపేరుగా అభివర్ణించింది. ‘మార్నింగ్ నూన్ ఈవెనింగ్’ ‘బ్లూ ఒషియన్’ ‘ఫైర్‌వర్క్’....ఇలాంటి ఎన్నో సింగిల్స్‌తో పేరు తెచ్చుకున్న ఔరా 2014లో బాయ్ బ్యాండ్ ఎఎతో కెరీర్ ప్రారంభించాడు.
(చదవండి: ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్‌చేస్తే నేడు ఆమె..!)
Comments
Please login to add a commentAdd a comment