
ఏఆర్ రెహమాన్, సెలీనా గోమేజ్
సెలీనా గోమేజ్... హాలీవుడ్ పాప్ సింగర్. పాతికేళ్లకే పాప్ సంగీతంలో బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈ భామకు ఇండియన్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అట. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఓ పాట పాడాలనుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇండియన్ మ్యూజిక్ మీద తన ఇంట్రెస్ట్ గురించి సెలీనా మాట్లాడుతూ – ‘‘నేను ఇండియన్ మ్యూజిక్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాను. వండర్‌ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అభిమానిస్తుంటాను.
ఈ రోజు ఆయన కేవలం ఇండియన్ మ్యుజిషియన్ మాత్రమే కాదు. గ్లోబల్ ఫిగర్. ఆయన కంపోజిషన్‌లో పాడాలని లేదా ఆయనతో కలసి వర్క్ చేయాలని ఉంది. ఓ బాలీవుడ్ సాంగ్ పాడితే కూడా బావుంటుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సెలీనా. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చిన రెహమాన్ హాలీవుడ్ సింగర్స్‌తో కలసి వర్క్ చేయడం కొత్తేమీ కాదు. ఇగ్గీ అజేలా, కేటీ టన్‌స్టిల్ వంటి వారితో ఆల్రెడీ పని చేశారు. చూద్దాం మరి.. సెలీనా ఆకాంక్ష తీరుతుందో? లేదో.
Comments
Please login to add a commentAdd a comment