selena gomez
-
ప్రియుడితో స్టార్ సింగర్ ఎంగేజ్మెంట్ : డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్
అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది ఈ హాలీవుడ్ బ్యూటీ. ప్రియుడు బెన్నీ బ్లాంకోతో ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన సెలెనా గోమెజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె చేతి డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో రిలేషన్ ఎప్పటినుంచో వార్తల్లో ఉన్నప్పటికీ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. చిరకాల ప్రయాణం షురూ(ఫరెవర్ బిగిన్స్ నౌ) గురువారం (డిసెంబర్ 12) ఎంగేజ్మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది ‘సింగిల్ సూన్’ సింగర్ . దీనికి స్పందించిన ఆమె కాబోయే భర్త బెన్నీ బ్లాంకో ఈ పోస్ట్‌పై ‘హే వెయిట్... ఆమె నా భార్య’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ లవ్‌బర్డ్స్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అద్భుతమైన మార్క్విస్ సాలిటైర్ డైమండ్ రింగ్‌తో సెలెనా గోమెజ్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Selena Gomez (@selenagomez) బెన్నీ బ్లాంకో ఎవరు?బెన్నీ బ్లాంకో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత , రచయిత. ప్రధానంగా బీటీఎస్ , స్నూప్ డాగ్, హెల్సే, ఖలీద్, ఎడ్ షీరాన్, జస్టిన్ బీబర్, ది వీకెండ్, అరియానా గ్రాండే, బ్రిట్నీ స్పియర్స్ , సెలీనా గోమెజ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశాడు. బెన్నీ సెలీనా ట్రాక్ ఐ కాంట్ గెట్ ఎనఫ్‌ను కూడా నిర్మించారు. సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్లో తమ సంబంధాన్ని ధృవీకరించారు. -
వేలకోట్లు ఉండి ఏం లాభం? సాయం చేసేందుకు చేతులే రావట్లేదుగా!
హాలీవుడ్ పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ మంచి చేయబోయి విమర్శలపాలైంది. న్యూయార్క్‌లో తను కారు ఎక్కేముందు ఓ వ్యక్తి తనకు దానం చేయమని కోరాడు. తలదాచుకోవడానికి నిలువ నీడ కూడా లేని అతడికి కేవలం 20 డాలర్లు దానం చేసి బాగా భోజనం చేయు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.పాప్ సింగర్‌పై ట్రోలింగ్ఇంకేముంది, నెటిజన్లు ఆమెపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. దాదాపు పదివేల కోట్ల సామ్రాజ్యానికి మహారాణివి, ఇల్లు లేని వ్యక్తికి కేవలం రూ.1600 చిల్లర (20 డాలర్లు) ఇస్తావా? నువ్వు తల్చుకుంటే నిరాశ్రయుడైన వ్యక్తికి ఏకంగా ఒక ఇల్లే కొనివ్వచ్చు, కానీ మరీ చిల్లర ఇవ్వడం బాగోలేదు, అంత డబ్బు ఏమాత్రం సరిపోతాయో.. అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం.. తను ఆ మాత్రమైనా చేసిందని వెనకేసుకొస్తున్నారు. హడావుడిగా వెళ్లిపోకుండా ఆగి మరీ తనకు తోచింది సాయం చేయడం గొప్ప విషయమేనని చెప్తున్నారు.చదవండి: రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్ -
ఆ నటుడితో సింగర్ డేటింగ్?
మార్వెల్ సంస్థ నిర్మించిన అవెంజర్స్ సిరీస్‌లో కెప్టెన్ అమెరికాగా చేసిన క్రిస్ ఎవాన్స్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే పాప్ సింగర్ సెలెనా గోమెజ్‌కి కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి గురించి క్రేజీ రూమర్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. గతంలో ఓ షోలో పాల్గొన్న సెలెనాని ‘ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు, మీ నంబర్ వన్ హాలీవుడ్ క్రష్ ఎవరు? అని హోస్ట్ అడగగా.. ‘నాకు క్రిస్ ఎవాన్స్‌పై క్రష్ ఉంది. అతను చాలా అందంగా ఉంటాడ’ని తెలిపింది. కాకపోతే అతనితో ప్రేమ అనేది జరగక పోవచ్చని ఈ బ్యూటీ చెప్పింది. అయితే తాజాగా కెప్టెన్ అమెరికా నటుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సెలెనాని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారి అభిమానులు సైతం వారు ప్రేమలో ఉన్నారంటూ కొన్ని పిక్స్‌ను వైరల్ చేస్తున్నారు. కాగా వారిద్దరూ కలిసినట్లు ఫోటోకి ఒకటి కూడా లేకపోవడం గమనార్హం. కాగా క్రిస్ ఇంతకుముందు జెస్సికా బీల్, జెన్నీ స్లేట్తో డేటింగ్ చేయగా.. ఈ పాప్ సింగర్ ఫేమస్ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్, ప్రియాంక చోప్రా హజ్బెండ్‌తో డేటింగ్ చేసింది. చదవండి: జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం -
అవును.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు గురయ్యా: సింగర్
తన మాజీ ప్రియుడు జస్టిన్ బీబర్‌తో సహజీవనం సమయంలో ‘ఎమోషనల్ బ్లాక్మెయిల్’కు గురయ్యానని అన్నారు అమెరికా పాప్ సింగర్ సెలెనా గోమేజ్. తాజాగా సెలెనా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టీన్ బీబర్‌తో బ్రేకప్ తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. బీబర్‌తో విడిపోయిన తర్వాత జీవితంలో ముందుకు సాగడం మీకు కష్టం అనిపించిందా అని అడిగిన ప్రశ్నకు.. ‘అవును.. అనిపించింది. ఇష్టమైన వారితో విడిపోవడం అనేది చాలా బాధకరం. మానసికంగా బాధించే ఆ బాధను మాటల్లో చెప్పలేం. దాని నుంచి బయటపడటం అంత సులువు కాదు. అయితే నేను దీని నుంచి మరింత బలవంతురాలినయ్యాను. అంతే తప్పా దీన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ నేను కూడా కొన్ని భావోద్వేగ దూషణలకు బాధితురాలిననే అనుకుంటున్నాను’ అంటూ సమాధానం ఇచ్చారు. అదేవిధంగా ‘పరిణతి చెందిన అమ్మాయిగా నేను ఈ విషయం నుంచి బయటపడాలి అనుకున్నాను. జీవితంలో ఎప్పటికీ దీని గురించి బాధపడనంతగా మారాలి అనుకున్నాను. మారాను కూడా. అప్పుడప్పుడు నాకంటే బలవంతులు లేరని గర్వపడుతుంటాను’ అన్నారు. కాగా సెలినా, జస్టిన్ బీబర్లు 2011లో ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. కొంత కాలం హాలీవుడ్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన వీరిద్దరూ 2018లో విడిపోయారు. ఆ తర్వాత సెలినాకు బ్రేకప్ చేప్పినా కొద్ది రోజులకే బీబర్ టాప్ మోడల్ హేలీ బోల్డ్విన్ను వివాహమాడిన సంగతి తెలిసిందే. -
సరస్వతీ దేవి నిన్ను వదిలిపెట్టదు..
అమెరికన్ పాప్ సింగర్ సెలెనా గోమెజ్ తాను చేసిన పొరపాటుకు విమర్శలపాలైంది. సెలెనా తాజాగా ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ ‘పూమా’ వాణిజ్య ప్రకటనలో కనిపించింది. ఇందులో పూమా కంపెనీకి చెందిన స్పోర్ట్స్ దుస్తులు ధరించి మంచి ఔట్ఫిట్తో కనిపించింది. చుట్టూరా పుస్తకాలున్న లైబ్రరీలో ఫొటోలు దిగిన సెరెనా పనిలో పనిగా పుస్తకాల దొంతరలపైనా నిలబడి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ చర్యే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. జ్ఞానాన్ని అందించే పుస్తకాలపై నిలబడటాన్ని పలువురు తీవ్రంగా దుయ్యబట్టారు. ‘భారతీయ సంస్కృతిలో పుస్తకాలకు ప్రత్యేక గౌరవం ఉంది. వాటిని కళ్లకద్దుకుని పూజిస్తారే తప్పితే కాలికిందేసి అవమానించరు’.. ‘తనకు వేరే ప్రదేశమే దొరకలేదా? ఎందుకు ఆ పుస్తకాలపై నిల్చుంది’.. ‘నువ్వు చేసిన తప్పుకు సరస్వతీ దేవీ నిన్ను వదిలిపెట్టదు.. తప్పుకుండా శిక్షించి తీరుతుంది’ అంటూ నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పుస్తకాలు జ్ఞాన సంపదలని, వాటిని అగౌరవపర్చవద్దని మరో నెటిజన్ వేడుకున్నాడు. ప్రస్తుతం సెలెనా పూమా యాడ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. -
మరోసారి పెళ్లి చేసుకుంటున్న బీబర్!
హుషారెత్తించే పాటలతో పాటు, ప్రేమ వ్యవహారాలతోనూ ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్ తన గర్ల్‌ఫ్రెండ్, టాప్ మోడల్ హేలీ బోల్డ్విన్ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు బీబర్. ఈ సందర్భంగా పెళ్లిలో ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పాలంటూ అభిమానుల అభిప్రాయం కోరాడు. ఈ మేరకు... ‘పెళ్లి డ్రెస్ ఎంపికలో నాకు సహాయం చేయండి. ఈ ఐదింటిలో ఏ సూట్ బాగుందో చెప్పండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు ఫొటోలను షేర్ చేశాడు. ఈ క్రమంలో బీబర్ ఇన్‌స్టా అకౌంట్‌కు ఉన్న 119 మిలియన్ల ఫాలోవర్లలో ఎక్కువ మంది ఇంధ్రధనుస్సు రంగులతో కూడిన సూట్‌కే ఓటు వేశారు. మరికొంత మంది మాత్రం బేబీ పింక్ కలర్లో ఉన్న సూటైతే మీకు అదిరిపోతుంది బాస్ అని కామెంట్లు పెడుతుండగా.. ఇంకొంత మంది.. ‘ఈ డ్రెస్సులన్నీ భలేగా ఉన్నాయి. ఈ కలెక్షన్ ఎక్కడ దొరికింది’ అంటూ ఫన్నీగా బీబర్‌కు బదులిస్తున్నారు. అయ్యో అసలు విషయం చెప్పలేదు కదూ.. బీబర్ మరోసారి పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. అతడి భార్యనే. అవును కొన్ని నెలల కిందట హేలీని రహస్యంగా పెళ్లి చేసుకున్న బీబర్ ప్రస్తుతం అట్టహాసంగా వివాహ వేడుక చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా గతంలో పాప్ సింగర్ సెలీనా గోమెజ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన బీబర్.. ఆమెకు పలుమార్లు బ్రేకప్ చెప్పినప్పటికీ ఆమెతో బంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో జలీనా జంట(సెలీనా గోమెజ్, జస్టిన్ బీబర్ జంటకు ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు) మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమవడంతో తాము విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల అంగీకారంతో తన మరో గర్ల్‌ఫ్రెండ్ హేలీతో నిశ్చితార్థం చేసుకున్న బీబర్.. ఆమెను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ కరోలినాలోని ఓ అందమైన ప్రదేశంలో ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram Help me choose a tux for my wedding. It’s between these three A post shared by Justin Bieber (@justinbieber) on Sep 26, 2019 at 12:36pm PDT View this post on Instagram Help me choose my tuxedo for the wedding here are two more options A post shared by Justin Bieber (@justinbieber) on Sep 26, 2019 at 12:47pm PDT -
మాజీ ప్రియుడికి సింగర్ భావోద్వేగమైన లేఖ!
ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్.. తన కొత్త గర్ల్‌ఫ్రెండ్, మోడల్ హేలీ బోల్డ్‌విన్‌తో ఇటీవల ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల(జూలై)8న వీరి నిశ్చితార్థం జరిగినట్లుగా బీబర్, హేలీ తల్లిదండ్రులు ధ్రువీకరించారు. తాజాగా ఈ విషయంపై బీబర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్, పాప్ సింగర్ సెలీనా గోమెజ్ స్పందించారు. బీబర్, హేలీలకు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత లేఖ రాయడంతోపాటు ‘బాక్ టు యు’ అనే కొత్త ఆల్బమ్‌ను రిలీజ్ చేసింది. సుమారు ఎనిమిదేళ్ల పాటు కొనసాగిన తమ ప్రేమ బంధానికి ముగింపునిస్తూ, బీబర్ కొత్త జీవితానికి నాంది పలకడంతో సెలీనా ఉద్వేగానికి లోనైందని ఆమె సన్నిహితులు తెలిపారు. కానీ తనకెంతో విశాల హృదయం ఉందని, బీబర్ ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని కోరుకునే స్వభావం ఆమెదని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల బంధానికి ముగింపు.. జలీనా.. సెలీనా గోమెజ్, జస్టిన్ బీబర్ జంటకు ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు ఇది. సెలీనా- బీబర్ జంట 2010లో తమ ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎన్నోసార్లు లవ్, బ్రేకప్‌లతో వార్తల్లో నిలిచిన ఈ జంట 2017 అక్టోబర్‌లో మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రకటించారు. దీంతో వీరి అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ బీబర్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ హేలీ బోల్డ్‌విన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అభిమానులతోపాటు సెలీనా కూడా షాక్‌కి గురయ్యారు. కాగా బీబర్, హేలీలు త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
రెహమాన్‌తో పాడాలనుంది
సెలీనా గోమేజ్... హాలీవుడ్ పాప్ సింగర్. పాతికేళ్లకే పాప్ సంగీతంలో బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈ భామకు ఇండియన్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అట. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఓ పాట పాడాలనుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇండియన్ మ్యూజిక్ మీద తన ఇంట్రెస్ట్ గురించి సెలీనా మాట్లాడుతూ – ‘‘నేను ఇండియన్ మ్యూజిక్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాను. వండర్ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అభిమానిస్తుంటాను. ఈ రోజు ఆయన కేవలం ఇండియన్ మ్యుజిషియన్ మాత్రమే కాదు. గ్లోబల్ ఫిగర్. ఆయన కంపోజిషన్‌లో పాడాలని లేదా ఆయనతో కలసి వర్క్ చేయాలని ఉంది. ఓ బాలీవుడ్ సాంగ్ పాడితే కూడా బావుంటుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సెలీనా. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చిన రెహమాన్ హాలీవుడ్ సింగర్స్‌తో కలసి వర్క్ చేయడం కొత్తేమీ కాదు. ఇగ్గీ అజేలా, కేటీ టన్స్టిల్ వంటి వారితో ఆల్రెడీ పని చేశారు. చూద్దాం మరి.. సెలీనా ఆకాంక్ష తీరుతుందో? లేదో. -
‘జలీనా’ అభిమానులకు షాక్
హుషారెత్తించే పాటలతో పాటు, ప్రేమ వ్యవహారాలతోనూ ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న స్టార్ సింగర్ జస్టిన్ బీబర్ వివాహ బంధంలో అడుగుపెట్టడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. కొత్త గర్ల్‌ఫ్రెండ్ మోడల్ హేలీ బోల్డ్‌విన్‌తో బీబర్ ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా అతడి సన్నిహితులు మీడియాకు తెలిపారు. ‘బీబర్ జీవితంలో మొదలుకాబోతున్న కొత్త అధ్యాయం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ బీబర్ తండ్రి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. హేలీ తండ్రి కూడా.. ‘జేబీ, హెచ్‌బీ హృదయపూర్వకంగా కోరుకున్నదే జరుగుతుంది’ అంటూ ట్వీట్ చేసి, శుభాకాంక్షలు అంటూ బీబర్ తల్లిదండ్రులను ట్యాగ్ చేయడంతో ఇరు కుటుంబాల పరస్పర అంగీకారంతోనే ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. జస్టిన్ బీబర్ ఎంగేజ్మెంట్ విషయం తెలియగానే ‘జలీనా’ (సెలీనా గోమెజ్, జస్టిన్ బీబర్ జంటకు ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు) అభిమానులు షాక్‌కు గురయ్యారు. గత కొన్నేళ్లుగా స్టార్ సింగర్ సెలీనా గోమెజ్‌తో లవ్, బ్రేకప్‌లతో వార్తల్లో నిలిచిన జస్టిన్ 2017 అక్టోబర్‌లో మళ్లీ ఆమెతో ప్రేమలో పడినట్లు ప్రకటించారు. దీంతో జలీనా అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే 2016లో హేలీతో విడిపోయిన బీబర్ ప్రస్తుతం ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం బీబర్, హేలీ జంట బహమాస్ టూర్లో ఉన్నట్లు వాళ్ల సోషల్ మీడియా అప్డేట్స్ చూస్తే తెలుస్తోంది. -
పాపం ప్రేమికుడు
ప్రేమలో ఉన్నవాళ్లు వింతగా కనిపిస్తారు. ఎప్పుడెలా ఉంటారో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రేమలో విఫలమైన వాళ్లూ అంతే! ఈ రెండింటికీ మధ్యన ఉండే వాళ్లతోనే అసలు సమస్య అంతా. వాళ్లకు ఏం జరుగుతోందో అర్థం కాదు. ఏం చేస్తున్నారో అంతకుమించి అర్థం కాదు. నవ్వుతారు. ఏడుస్తారు. ఇంకేదేదో చేస్తుంటారు. అచ్చం మన పాప్ సింగర్ జస్టిన్ బీబర్లాగా! జస్టిన్, సెలెనా గోమేజ్లది ఎనిమిదేళ్ల ప్రేమ. అలా అని ఎనిమిదేళ్లుగా కలిసే ఉంటున్నారా అంటే లేదు. కొన్నాళ్లు కలిసి ఉంటారు. కొన్నాళ్లకు విడిపోతారు. మళ్లీ ఎప్పటికో కలిసిపోతారు. ఇలా ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది జస్టిన్ – సెలెనా లవ్‌స్టోరీ. ఈమధ్యే వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని చక్కగా కనిపించారు. సెలెనా, జస్టిన్ కోసం తన తల్లితో కూడా గొడవ పడి బయటకొచ్చింది. ఇంత జరిగాక ఇంక ఈ లవ్‌స్టోరీ సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటే, చిన్న ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ పేరే బాస్కిన్ చాంపియన్. జస్టిన్ గత కొద్దికాలం క్రితం ప్రేమించిన అమ్మాయే బాస్కిన్. సెలెనా తిరిగొచ్చేశాక బాస్కిన్తో తెగతెంపులు చేసుకున్నాడు జస్టిన్. కాకపోతే ఇప్పుడు జస్టిన్, బాస్కిన్ ఎలా దగ్గరయ్యారో మళ్లీ దగ్గరయ్యారు. ఈ విషయం సెలెనాకు నచ్చలేదు. జస్టిన్ను వదిలేసి పోయింది. దీంతో ఎనిమిదేళ్ల ప్రేమకథ ఇప్పుడు ఇక్కడికొచ్చి ఆగింది. ఇదిక్కడే పూర్తిగా ఆగిపోతుందా? చూడాలి!! ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం జస్టిన్ ఎప్పుడెలా ప్రవర్తిస్తున్నాడో అతనికే అర్థం కావట్లేదు పాపం! -
లవ్.. బ్రేకప్.. ప్యాచప్...
‘ప్రేమలో ఉండకుండా ఉండలేరెవ్వరూ..’ అని ఏ కవో ఎక్కడో చెప్పే ఉంటాడు. అలాగే ఉంటాయి ప్రేమకథలు. కొన్ని అప్పుడప్పుడే చూసుకుంటున్న ప్రేమలు. కొన్ని చేతులందుకున్న ప్రేమలు. కొన్ని చెయ్యి జారిన ప్రేమలు. కొన్ని జారవిడిచిన చెయ్యిని మళ్లీ అంది పట్టుకున్న ప్రేమలు. అవి ఏ కథలైనా ప్రేమకు అటో.. ఇటో.. ఉంటూనే ఉండడమే మ్యాజిక్. హాలీవుడ్లో ఇప్పుడు ఇలా అటూ, ఇటూ, ఆ మధ్యలో కొట్టుకుంటున్న కొన్ని ప్రేమకథలను చూద్దాం... దాచేదేముంది.. ప్రేమే ఎమ్మా వాట్సన్ కథ ఇలా ఉంటే, మరో స్టార్ హీరోయిన్ టేలర్ స్విఫ్ట్ మాత్రం ‘దాచడానికి ఏముంది? ప్రేమేగా!’ అంటూ బాయ్‌ఫ్రెండ్ జాయ్ అల్విన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోంది. టేలర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పుడు, ఒకవేళ జాయ్ ఖాళీగా ఉంటే ఆమెతో పాటు షూటింగ్స్‌కు వెళ్లిపోతున్నాడు. ఇద్దరూ ఒకరి టైమింగ్స్, షెడ్యూల్స్ ప్రకారం ఇంకొకరు అడ్జస్ట్ అయిపోతూ, ప్రేమలో పడిన కొత్తల్లో, దూరం ఉండలేని ఒక ఫీలింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాలీవుడ్లో ఇప్పుడున్న హాట్ కపుల్స్‌లో వీళ్లూ టాప్ ప్లేసెస్‌లోనే ఉంటున్నారు. టేలర్ స్విఫ్ట్, జాయ్ అల్విన్ వాళ్లు విడిపోయారు మార్చి 4న ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది షేప్ ఆఫ్ వాటర్’ బెస్ట్ పిక్చర్ అవార్డు అందుకుంది. అదే ఫంక్షన్లో ఆయన బెస్ట్ డైరెక్టర్‌గా కూడా అవార్డు అందుకున్నాడు. ఆయనే గెలెర్మో డెల్‌టోరో. ఆరోజుకు సరిగ్గా ఏడాది క్రితం తన జీవితంలో జరిగిన ఓ కీలక విషయాన్ని మాత్రం ఆయన ఆరోజు తర్వాతిరోజు వరకూ దాచాడు. అదే.. భార్య లొరెంజో న్యూటన్తో వేరు పడడం. ముప్పై ఏళ్ల తమ బంధానికి గతేడాది ఫిబ్రవరిలో బ్రేకప్ చెప్పుకున్నారు గెలెర్మో, న్యూటన్. అయితే ఆ విషయాన్ని ఆస్కార్ అందుకున్న రోజు వరకూ ప్రపంచానికి చెప్పలేదు గెలెర్మో. ఆయన వయస్సు ఇప్పుడు 53 సంవత్సరాలు. లొరెంజో న్యూటన్, గెలెర్మో డెల్‌టోరో వీళ్లు మళ్లీ కలిసిపోయారు ఈ దశాబ్దంలో హాలీవుడ్లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌లో ఒకరైన జెన్నిఫర్ లారెన్స్ ప్రేమకథలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటాయి. ‘‘నా లైఫ్‌లో బెస్ట్ రొమాన్స్ ఎప్పుడూ చూడలేదు. నాకది ఇష్టం లేదేమో కూడా!’’ అంటుందామె. 2014కు ముందువరకూ నికోలస్ హౌల్ట్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న లారెన్స్, కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతనికి బ్రేకప్ చెప్పేసింది. అయితే తాజాగా ఈ జంట మళ్లీ కలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా పాత రొమాన్స్‌ను తలుచుకుంటూ మళ్లీ ప్రేమలో పడిపోతోంది. ఈ ప్రేమ జంట మళ్లీ పూర్తిగా కలిసిపోతే మాత్రం, ఇద్దరూ ప్రేమను వెతుక్కుంటూ ఒకే దగ్గర ఆగారని చెప్పుకోవచ్చు. జెన్నీఫర్ లారెన్స్, నికోలస్ హౌల్ట్ లవ్వా? అదేం లేదే ‘‘నేనంటూ ప్రేమలో ఉంటే అది నా పర్సనల్ విషయం. బయటకు అస్సలు చెప్పను. నాకు నచ్చదు.’’ అంది ఎమ్మా వాట్సన్ ఒక ఇంటర్వ్యూలో. ఈ హ్యారీపాటర్ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. సో, ప్రేమలో ఉంటే ఎలాగూ చెప్పనని ముందే చెప్పింది కాబట్టి, ఎమ్మా ప్రేమకథ ఏదైనా ఉంటే అది అఫీషియలా కాదా ఎవ్వరూ చెప్పలేరు. తాజాగా ఎమ్మా వాట్సన్ ఆస్కార్ పార్టీలో కోర్డ్ ఓవర్స్ట్రీట్తో కనిపించింది. మరో రెండు పార్టీల్లోనూ ఈ జంటే కలర్ఫుల్గా కనిపించింది. ఈ ఫొటోలు, వీళ్లిద్దరు కలిసి ఉండడం చూసి కోర్డ్తో ఆమె ప్రేమలో ఉందనుకున్నారంతా. కాకపోతే, కోర్డ్ తనకు ‘జస్ట్ ఫ్రెండ్’ అని చెబుతోందట ఎమ్మా. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, ఇంకా అఫీషియల్‌గా ప్రేమలో అయితే పడలేదని హాలీవుడ్ సమాచారం. మరి ఇష్టపడుతున్నారంటే, త్వరలోనే ప్రేమలోనూ పడొచ్చైతే.. చూడాలి! ఎమ్మా వాట్సన్, కోర్డ్ ఓవర్ స్ట్రీట్ అటో.. ఇటో.. ఎటో.. అన్ని ప్రేమకథలదీ ఒక ఎత్తు. జస్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ల ప్రేమకథ ఇంకో ఎత్తు. వీళ్లిద్దరూ ఎప్పుడు కలిసుంటారో, ఎప్పుడు విడిపోతారో, మళ్లీ ఎప్పుడు కలుస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ఎనిమిదేళ్లుగా ఈ ప్రేమకథ ఇలాగే నడుస్తోంది. గత జనవరిలో మళ్లీ కలిసి ఒక్కటైన ఈ జంట, తాజాగా మరోసారి ‘టేక్ ఎ బ్రేక్’ అనుకున్నారట. ఇప్పుడు జస్టిన్‌కు కాస్తంత దూరంగానే ఉంటోందట సెలెనా. అయితే ఇది బ్రేకప్ కాదు. టేక్ ఎ బ్రేక్ అంతే. అంటే మళ్లీ త్వరలోనే ఒక్కటైపోతారని అనుకోవాలి. ఇంకొన్నాళ్లకైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ ప్రేమకథ ఒక దగ్గర ఆన్ అయి అలా వెలుగుతూనే ఉండాలని కోరుకుందాం. స్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ -
ఒక బ్రేకప్ ప్రేమకథ!
ప్రేమంటేనే కలవడం, విడిపోవడం; కలవడం విడిపోవడం. కొన్నిసార్లు ప్రేమలో ఉన్నప్పుడే కలిసి విడిపోతుంటారు. కొన్నిసార్లు ఇంకఈ ప్రేమలేం వద్దంటూ విడిపోయి, మళ్లీ కలుస్తుంటారు. వీళ్లూ వాళ్లుఅనేం లేదు అందరూ ఇలాంటి ప్రేమల్లో చిక్కుకున్నవారే! తమ పాటలతో ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్స్ జస్టిన్ బీబర్, సెలీనా గోమెజ్ కూడా ఓ మంచి ప్రేమకథ నడిపించారు. నడిపించారు అనేకంటే నడిపిస్తూనే ఉన్నారు అనాలి. కాకపోతే అది వింత ప్రేమకథ! ఒక బ్రేకప్ ప్రేమకథ!! 2010 డిసెంబర్.. అçప్పటికే తమ తమ కెరీర్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారిద్దరూ. ఏదో మ్యాజిక్ పనిచేసింది ఇద్దరి మధ్య. ఇక అంతే.. ప్రేమలో పడిపోయారు. అప్పటికి జస్టీన్ బీబర్ వయసు 16 ఏళ్లు. సెలీనా గోమెజ్‌కు 18 ఏళ్లు. లేలేత ప్రాయం. టీనేజ్ ప్రేమల్లో ఉండే ఉత్సాహం అంతా వాళ్లలో కనిపించేది. ఇక్కడా, అక్కడా అని లేదు.. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపించేది. ఫంక్షన్లు, అవార్డ్ వేడుకలు, పార్టీలు, హాలీడేలు.. జస్టిన్, గోమెజ్ కలిసి ఉన్నారంటే ఫోటోలు దిగాల్సిందే, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పడాల్సిందే! ఇక ఫ్యాన్స్ హంగామా ఎలాగూ ఉండేదే! రెండేళ్లు ఇలా సూపర్ కూల్ అన్నట్టు సాగిపోయింది జస్టిన్, గోమెజ్ల ప్రేమ జీవితం. ఫ్యాన్స్ వీరిద్దరి ప్రేమకు ‘జలీనా’ అన్న పేరు కూడా పెట్టుకున్నారు. రెండేళ్లు గడిచాయి. 2012 వచ్చింది.. ఇద్దరికీ గొడవలు. ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితులు కూడా వచ్చాయి. ‘జస్టిన్ను నమ్మలేం!’ అంది సెలీనా. ‘సెలీనాతో ఉండలేం!’ అన్నాడు జస్టిన్. ఇద్దరూ విడిపోయారు. ‘జలీనా’ ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు. ఇద్దరూ ట్విట్టర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. కోపమొస్తే ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్స్ డిలీట్ చేసేసుకుంటారు. ఇదో రెగ్యులర్ గేమ్‌లా సాగిపోతూనే వచ్చింది. ఎన్ని మలుపులో! 2013, 2014, 2015.. ఇలా సంవత్సరాలు గడుస్తున్నాయి. జస్టిన్ జీవితంలోకి కొత్త గర్ల్‌ఫ్రెండ్స్ వస్తున్నారు, వెళుతున్నారు. సెలీనా జీవితంలోకీ కొత్త బాయ్‌ఫ్రెండ్స్ వస్తున్నారు, వెళుతున్నారు. మధ్యలో ఎప్పుడో ఒకసారి, ఏ ఆరు నెలలకో మాత్రం కలిసి కనిపిస్తారిద్దరూ. ‘వీళ్లు మళ్లీ కలిశారు’ అని అభిమానులు సంబరపడిపోయేంతలో, ‘అబ్బే అలాంటిదేం లేదే!’ అన్నట్టు విడిపోతారు. ఎప్పుడు కలుస్తారో, ఎందుకు విడిపోతారో ఎవ్వరికీ అర్థం కాదు. సెలీనాకు తగిలేలా తన పాటల్లో లిరిక్స్ ఉండేలా చూసుకుంటాడు జస్టిన్. దానికి మళ్లీ పాటతోనే సమాధానమిస్తుంది సెలీనా. ఈ బ్రేకప్ ప్రేమకథ అలాంటి ట్విస్టులతోనే 2017వరకూ నడిచి, 2017లో క్లైమాక్స్‌కు దగ్గరైనట్టు కనిపిస్తోంది. లవర్స్‌కి గుడ్‌బై చెప్పిన జస్టిన్, సెలీనా 2017లో ఈ ఇద్దరి లవ్‌స్టోరీలో ఎన్నో మలుపులు. డ్రగ్ అడిక్ట్ అని, పిచ్చోడిలా మారిపోయాడని జస్టిన్ బీబర్‌ను అభిమానులే విమర్శించడం మొదలై అప్పటికే రెండేళ్లు. జస్టిన్ అందులోనుంచి బయటకు రావాలనుకొని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సూపర్‌హిట్ పాటలను అందించాడు. ఆ పాటల్లో సెలీనా రిఫరెన్స్ కనిపించింది. అభిమానులు మళ్లీ వీళ్ల మధ్య ఏదో జరుగుతుందనుకున్నారు. కాకపోతే సెలీనా.. సింగర్ ది వీకెండ్‌తో కొత్తగా ప్రేమలో పడిపోయింది. దానిపై జస్టిన్ కొన్ని సెటైర్లు కూడా వేశాడు. సడెన్‌గా ఈ కథకు ఇంకో మలుపు, సెలీనా కిడ్నీ పాడవ్వడం. ఫ్రాన్సియా రైజా సెలీనాకు తన కిడ్నీ దానం చేసింది. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. సెలీనాకు ఇలా ఆపరేషన్ జరిగిందన్న విషయం జస్టిన్‌కు తెలియలేదంటారు. సెప్టెంబర్‌లో ఇది జరిగితే, అక్టోబర్ నెలాఖరుకు బాయ్‌ఫ్రెండ్ వీకెండ్‌కు బ్రేకప్ చెప్పేసింది సెలీనా. కారణాలు ఎవ్వరికీ తెలీదు. అలాగే జస్టిన్ కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేశాడు. ఆ తర్వాత ఇద్దరూ సింగిల్. మళ్లీ ప్రేమలో.. 2017 నవంబర్ వచ్చింది. జస్టిన్ బీబర్, సెలీనా గోమెజ్ మళ్లీ దగ్గరయ్యారు. ఇది సెలీనా తల్లి మ్యాండీ టిఫీకి ఏమాత్రం నచ్చలేదు. జస్టిన్‌కు దూరంగా ఉండమని చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. కానీ సెలీనా, జస్టిన్‌కు దూరం కావాలనుకోలేదు. తల్లితో గొడవ పెట్టుకొని మరీ జస్టిన్‌తో మళ్లీ ప్రేమలో పడిపోయింది. ఏడేళ్ల ప్రేమకథలో ఎన్నిసార్లు విడిపోయారో అన్నిసార్లూ కలిసిపోయారు వీళ్లిద్దరూ. ఈసారి ఇంక విడిపోయేదే లేదు అంటున్నారు. ఇద్దరూ కలిసి సిడ్నీలోని హిల్సంగ్ చర్చిలో కపుల్ థెరపీకి కూడా హాజరయ్యారు. ఇప్పుడింక ఇద్దరి మధ్య అన్నీ సర్దుకున్నాయి అంటున్నారు. మరి ఇది క్లైమాక్సే అనుకోవచ్చా? ఏమో!! స్టార్‌వార్స్ జస్ట్ ఓకే హాలీవుడ్లో ‘స్టార్‌వార్స్’కు ఉన్న క్రేజ్ మరే ఇతర సిరీస్‌కు లేదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్‌లో బాక్సాఫీస్ వద్ద ‘స్టార్ వార్స్’ సినిమాలు కొన్నేళ్లుగా సృష్టిస్తూ వచ్చిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ ఏడాది ‘స్టార్ వార్స్’ సీక్వెల్ ట్రయాలజీలో రెండో సినిమా అయిన ‘స్టార్ వార్స్ : ది లాస్ట్ జేడి’ వచ్చింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 15న విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా బాక్సాఫీస్ వద్ద నిలబడడం లేదు. నిజానికి ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్స్‌లో టాప్‌లో ఈ సినిమా నిలుస్తుందనుకున్నా అంత సీన్ అయితే కనపడడంలేదు. ఇక క్రిస్మస్ వారానికి కూడా లెక్కలేనన్ని సినిమాలు వచ్చేయడంతో ‘స్టార్‌వార్స్’ కథ ఈసారికి ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ సినిమా 650 మిలియన్ డాలర్లు (4,161 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇది హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి నంబరే కానీ, ‘స్టార్‌వార్స్’ రేంజ్ కాదన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ఈ ఏడాది చివర్లో వచ్చినా టాప్‌లో నిలబడుతుందనుకున్న సినిమా మొత్తానికి అంతంత మాత్రమే అనిపించుకుంది. సెలీనా గోమెజ్ -
సింగర్‌కు కిడ్నీ దానం చేసిన నటి
సాక్షి, హాలీవుడ్: ప్రముఖ పాప్‌సింగర్, నటి సెలెనా గోమెజ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఆమెకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అయినట్లు ప్రకటించింది. ‘నా బెస్ట్ ఫ్రెండే నా ప్రాణం నిలిపిందంటూ’ ఆపరేషన్ సమయంలో బెడ్ మీద ఉన్న ఓ ఫోటోను సెలెనా షేర్ చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సెలెనాకు లూపస్ అనే వ్యాధి సోకింది. దాని వల్ల ఆమె శరీరంలోని గుండె, మెదడు, కిడ్నీల్లాంటి కీలక అవయవాలు పాడయిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. వెంటనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తే ఫలితం ఉంటుందని ఆమెకు సూచించారు. దీంతో 29 ఏళ్ల ప్రముఖ నటి ఫ్రాన్సియా రైసా కిడ్నీ దానానికి ముందుకు వచ్చింది. ఆపరేషన్ విజయవంతం అయ్యింది కూడా. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ... తన ఇన్స్టాగ్రామ్ లో సెలెనా ఓ పోస్టు ఉంచింది. ‘తాను గత కొంత కాలంగా మౌనంగా ఉండటంపై అభిమానుల్లో చాలా అనుమానాలు నెలకొన్నాయి. నా కొత్త ఆల్బమ్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కూడా. కానీ, లూపస్ వ్యాధి కోసం శస్త్ర చికిత్స అయ్యాక కోలుకునేందుకు కాస్త సమయం పట్టింది. నా కుటుంబ సభ్యులకు, వైద్య బృందానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఫ్రాన్సియా తనకు అరుదైన బహుమతి(కిడ్నీ)ని ఇచ్చిందని, ఆమె చేసిన త్యాగానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సెలెనా తెలిపింది. పనిలో పనిగా లూపస్ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన లింకును కూడా ఆమె పోస్ట్ చేసింది. సెలెనా ఆరోగ్య సమస్య.. ఆమె ఆపరేషన్ విషయం పాప్ సింగర్, మాజీ ప్రియుడు జస్టిన్ బీబర్ కు కూడా తెలియదంట. ఆ మధ్య ట్విట్టరెక్కి ఒకరినొకరు పబ్లిగ్గా తిట్టిపోసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందన్న విషయం తెలుసుకున్న బీబర్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
మాజీ ప్రియుడు చాలాసార్లు మోసం చేశాడు!
కొంతకాలం ప్రేమించుకొని.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్న యువ పాప్ సింగర్స్ జస్టిన్ బీబర్- సెలెనా గోమెజ్ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారినట్టు కనిపిస్తోంది. ఈ మాజీ ప్రేమికులు తాజాగా ట్విట్టరెక్కి రచ్చచేశారు. ఒకరినొకరు పబ్లిగ్గా తిట్టిపోసుకున్నారు. తన కొత్త గర్ల్ ఫ్రెండ్ సోఫియా రీచి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆపకుంటే.. తన అఫీషియల్ పేజీని మూసివేస్తానని ఈ నెల 14న బీబర్ అభిమానులను హెచ్చరించాడు. ఈ పోస్టుపై సెలెనా ఘాటుగా స్పందించింది. 'నువ్వు అభిమానుల నెగిటివ్ వ్యాఖ్యలను భరించలేకపోతే.. నీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోలను పోస్టు చేయడం మానేయ్. అది మీ ఇద్దరి పర్సనల్ విషయం. అంతేకానీ అభిమానుల మీద వీరంగం వేయకు. వాళ్లు నిన్ను ప్రేమిస్తున్నారు' అని సెలెనా కామెంట్ చేసింది. అనంతరం ఈ కామెంట్ ను తొలగించినప్పటికీ బీబర్ మాత్రం సెలెనా మీద కారాలు మిరియాలు నూరాడు. 'ఒకప్పుడు నన్ను ఉపయోగించుకొని ప్రజల దృష్టిని ఆకర్షించిన వ్యక్తులు ఇప్పుడు నన్నే వేలెత్తి చూపిస్తున్నారు. ఇది నిజంగా ఫన్నీగా ఉంది' అంటూ సెలెనాను విమర్శించాడు. దీంతో 'హ్యాండ్స్ టు మై సెల్ఫ్' సింగర్ సెలెనా మళ్లీ కామెంట్ చేసింది. బీబర్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు అతను తనను ఎన్నోసార్లు మోసం చేశాడని పేర్కొంది. అతడి మోసాలను క్షమించి.. మద్దతుగా నిలిచిన తన మీదనే బీబర్ విమర్శలు చేస్తున్నాడని వాపోయింది. అయినా, అభిమానులు అనేవాళ్లు పిచ్చివాళ్లని, ఏం చేసినా అభిమానిస్తూనే ఉంటారని పేర్కొంది. కొంతకాలంపాటు ప్రేమలో మునిగిపోయి.. చాలా సన్నిహితంగా మెలిగిన బీబర్-సెలెనా 2014లో వేరయిన సంగతి తెలిసిందే. -
ఆమె ఫొటోకు ఆల్‌టైమ్ రికార్డు!
పెద్దగా అందమైన ఫొటో కాదు.. ఎరుపు రంగు టాప్ వేసుకొని.. ఓల్డ్ ఫ్యాషన్ కోకాకోలా బటిల్ పట్టుకొని సింగర్ సెలెనా గోమెజ్ పెట్టిన ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ 23 ఏళ్ల చిన్నది సాదాసీదాగా దిగి పెట్టిన ఈ ఫొటోకు ఏకంగా 40లక్షలకుపైగా లైకులు లభించాయి. దీంతో ఇన్స్టాగ్రామ్ చరిత్రలోనే అత్యధిక లైకులు తెచ్చుకున్న ఫొటోగా ఇది ఆల్ రికార్డు సృష్టించింది. గత ఏడాది విడుదలైన తన పాప్ ఆల్బం ‘మి అండ్ రిథమ్’లోని ‘యు ఆర్ ద స్పార్క్’ అనే పదాలు ఉన్న కోక్ బాటిల్ పట్టుకొని సాధారణంగా సెలెనా పెట్టిన ఈ ఫొటోకు విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముగ్ధమోహనరూపం అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ సుందరి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించింది. సెలెనాను 8.92 కోట్లమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండగా.. టైలర్ స్విఫ్ట్ర్ను 8.52 కోట్లమంది, జస్టిన్ బీబర్‌ను 7.46 కోట్లమంది, కిమ్ కర్దాషియన్‌ను 7.68 కోట్లమంది ఫాలో అవుతున్నారు. తాజా రికార్డుతో ఇన్స్టాగ్రామ్ క్వీన్‌గా సెలెనా తన పాపులారిటీని చాటుకుంది. -
బోయ్‌ఫ్రెండు కావాలంటున్న హీరోయిన్
ప్రముఖ గాయని, హీరోయిన్ సెలెనా గోమెజ్‌కు ఓ బోయ్ ఫ్రెండు కావాలట. ఇంతకుముందు తనతో కలిసి కార్ పూల్ కరావోకే షో హోస్ట్ అయిన జేమ్స్ కార్డెన్కు ఈ బాధ్యత అప్పజెప్పింది. తనకు మంచి బోయ్‌ఫ్రెండును చూసిపెట్టాలని కార్డెన్ను కోరిందీ అమ్మడు. ఈనెల 20వ తేదీన వీళ్లిద్దరూ కలిసి కార్‌పూల్ కారవోకే ఎపిసోడ్ చేశారు. ఆ సెషన్లో 23 ఏళ్ల సెలెనా తన హిల్ ఆల్బంల లోంచి కొన్ని పాటలు పాడింది. తన జీవితం గురించి, ప్రేమ గురించి కూడా చాలా ముచ్చట్లు చెప్పింది. టేలర్ స్విఫ్ట్ స్క్వాడ్ చాలా సెక్సీగా ఉంటుందని, అందులో సెలెనా గోమెజ్ కూడా ఉంటే మరింత బాగుంటుందని కార్డెన్ కామెంట్ చేశాడట. అయితే అందులో అందరూ అమ్మాయిలే ఉన్నారు తప్ప అబ్బాయిలను అసలు పిలవడం లేదని బుంగమూతి పెట్టుకున్నాడట. సరిగ్గా అదే సమయంలో సెలెనా గోమెజ్ కలగజేసుకుని, ముందు తనకో బోయ్‌ఫ్రెండును చూసిపెట్టాలని కోరింది. దాంతో కుర్రాడు ఒక్కసారిగా షాకయ్యాడట. నిజంగా కొత్త బోయ్ప్రెండు కోసం వెతుకుతున్నావా అని అడిగితే.. అవును, అందులో తప్పేంటని వాదించిందట ఆ బుల్లెమ్మ. -
మాజీ ప్రేయసితో ఐవాన్నా ఫాలో.. ఫాలో యూ అంటూ..
లండన్: తన మాజీ ప్రేయసిని ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి ఫాలో అవుతున్నాడు. ప్రముఖ సామాజిక అనుసంధాన వేధిక ఇన్‌స్టాగ్రమ్‌లో మరోసారి ఆమె వెంటపడుతున్నాడు. జస్టిన్ బీబర్‌కు సెలెనా గోమెజ్ అనే ప్రేయసి ఉన్న విషయం తెలిసిందే. ఆమెతో అతడు 2014 డిసెంబర్లో తెగదెంపులు చేసుకున్నాడు. దాంతో అప్పుటి నుంచి ఎవరికి వారే మాజీ ప్రేమికులుగా ఉండిపోయారు. ఈ రెండేళ్ల కాలంలో కనీసం వారు ఒకసారి కలుసుకున్నట్లు, కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించినట్లుగాని లేదు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ప్రేమికులను ఎప్పటి నుంచో తీక్షణగా చూస్తున్న అభిమానులకు ఒకేసారి బీబర్ షాకిచ్చాడు. ఈ నెల 5 నుంచి తన మాజీ ప్రేమికురాలు సెలెనాను ఫాలో అవడం మొదలుపెట్టాడు. దీంతో ఆ 23 ఏళ్ల అందాల్ పాప్ సింగర్‌పై బీబర్ కు ఇంకా ప్రేమ తగ్గలేనట్లుందని అతడి అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. -
'బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ నా వీక్ నెస్'
లాస్ ఏంజెలిస్: ప్రముఖ నటి, గాయని సెలెనా గోమెజ్ తన బలహీనతలను బయటపెట్టింది. తాను ఎప్పుడూ బ్యాడ్ బాయ్స్ తోనే డేటింగ్ చేయడానికి ఇష్టపడతానంది. గతంలో కూడా చాలా మంది బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ చేశానని చెప్పింది. మారీ క్లేరీ మేగజైన్ రిపోర్టర్ కు ఈ వివరాలు తెలిపింది. కొద్దికాలం కిందటే ఈ పాప్ అందగత్తె సెలెనా గోమెజ్ తన లవర్ జస్టిన్ బీబర్‌కు బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే. అయితే బీబర్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిందా? లేక ఆ తర్వాత మరెవరితోనైనా ఆమె డేటింగ్ చేస్తుందా అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. బ్యాడ్ బాయ్స్ తన వీక్ నెస్ అనటంతో అక్కడి యువకులు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. అమీ స్కూమర్, జెన్నిఫర్ లారెన్స్ లను ప్రశంసించింది. వారు అందరు మహిళల మాదిరిగా ఉండరని, అంతకంటే ఎక్కువ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది. సెలెనా తో బ్రేకప్ అయ్యాక జస్టిన్ బీబర్ మాత్రం కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుండగా, ఈ అమ్మడు మాత్రం తన మ్యూజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆల్బమ్స్ కోసం ఎంతో శ్రమ పడుతున్న సెలెనా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కునే పనిలో పడిందా.. గతాన్ని మళ్లీ తవ్వుకుంటూ బాధలో ఉందా సన్నిహితులు, అభిమానులు తెలుసుకోలేక పోతున్నారు. -
ఆ ఫొటోతో మాజీ ప్రియుడి కచేరికి వచ్చింది!
మాజీ ప్రియురాలిని ముద్దాడుతున్న ఫొటోను ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే.. సహజంగా అది విమర్శలకు దారితీస్తుంది. ఆ మాజీ ప్రియురాలు కూడా సదరు వ్యక్తిపై కోప్పడే అవకాశముంటుంది. కానీ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ కు ఇలాంటి ఫొటోనే బాగా కలిసొచ్చింది. కొద్దికాలం కిందటే పాప్ చిన్నది సెలెనా గోమెజ్‌తో బీబర్‌కు బ్రేకప్ అయింది. ప్రణయబంధంలో చాలాకాలం పీకల్లోతు కూరుకుపోయిన ఈ జంట ఉన్నట్టుండి వేరయింది. దీంతో బీబర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుండగా, సెలెనా తన మ్యూజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల బీబర్ ఓ చిలిపి పని చేశాడు. సెలెనాను తమకంగా పెదవులపై ముద్దాడుతున్న ఓ పాత ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ ఫొటో సెలెనాకు కోపం తెప్పించకపోగా.. అతనిపై తనకున్న ప్రేమను గుర్తుచేసినట్టుంది. అందుకే వెతుక్కుంటూ మరీ సెలెనా బీబర్ కన్సర్ట్కు వెళ్లింది. బుధవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లోని స్టాప్లెస్ సెంటర్లో జరిగిన బీబర్ కాన్సర్ట్‌లో సెలెనా దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగింది. ప్రేక్షకుల మాదిరిగా ఓ మూలకు నిలబడి సెలెనా బీబర్ కాన్సర్ట్‌ను వీక్షించింది. బీబర్ సెలెనాను గుర్తించినప్పటికీ పెద్దగా ఉద్వేగపడలేదు. ఆమె గురించే రాసిన పలు పాటలను బీబర్ ఆలకించాడు. అన్నట్టు 2014లో దిగినట్టు భావిస్తున్న ఈ కిస్సింగ్ ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల లైకులు వచ్చాయి. -
మాజీ ప్రియురాలి టాటూతో తంటాలు!
లండన్: ఆయన ఒంటిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50కిపైగా పచ్చబోట్లు ఉన్నాయి. దేహం నిండా ఉన్న ఆ పచ్చబోట్లతో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ఓ టాటూను చూసి మాత్రం పాప్ స్టార్ జస్టిన్ బీబర్ తెగ ఇదయిపోతున్నాడు. ఆ టాటూ ఎవరికంట పడకుండా దాచాలనుకుంటున్నాడు. ఇంకుతో కవర్ చేసి.. ఆ పచ్చబొట్టు కనిపించకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకూ ఆ బొమ్మ ఎవరిదంటే సింగర్ సెలెనా గోమెజ్ది. ఈ ఇద్దరు ఒకప్పుడు గాఢమైన ప్రేమికులు. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇప్పుడు బ్రేకప్ అయింది. అప్పట్లో ప్రేమగా తన చేతిపై పచ్చపొడుచుకున్న ఆ ముద్దుగుమ్మ బొమ్మను ఇప్పుడు చెరిపేయాలని బీబర్ భావిస్తున్నాడు. మాజీ ప్రియురాలి టాటూను కనిపించకుండా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు 21 ఏళ్ల బీబర్ చెప్పాడు. ఈ బొమ్మను ఇంకుతో కప్పివేయడానికి ప్రయత్నించానని, అయినా ప్రజలు ఈ పచ్చబొట్టు ఎవరిదో గుర్తుపడుతున్నారని అతను చెప్పాడు. 'వాట్ డూ యూ మీన్' ఆల్బంతో తాజాగా హిట్ కొట్టిన ఈ యువ సంచలనం ఇప్పుడు హేలీ బల్ద్విన్తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రణయ సల్లాపాల్లో మునిగి తేలుతున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు సింగర్ సెలెనా గోమెజ్ మాత్రం ఒంటరిగా గడుపుతూ.. తన స్నేహితురాళ్లతో వాలెంటైన్స్ డే జరుపుకున్నదట. -
ఆల్బం కోసం హీరోయిన్ నగ్న పోజులు!
ప్రముఖ నటి, గాయని సెలెనా గోమెజ్ తన కొత్త ఆల్బంను ప్రమోట్ చేసేందుకు సరికొత్త టెక్నిక్ కనుగొంది. 'రివైవల్' పేరుతో అక్టోబర్ 9వ తేదీన విడుదల కానున్న ఈ ఆల్బం ప్రమోషన్ కోసం సెలెనా పూర్తి నగ్నంగా ఓ ఫొటోకు పోజిచ్చి, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను పోస్ట్ చేసింది. నలుపు తెలుపులో తీసిన ఈ ఫొటోలో ఎక్కడా అసభ్యత అన్నది కనిపించకుండా సెలెనా పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. దానికి 'దిసీజ్ మై...' అనే టీజింగ్ క్యాప్షన్ కూడా పెట్టింది. సినిమాల ప్రమోషన్ కోసం, ఆల్బంల ప్రమోషన్ కోసం హాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతవరకైనా కూడా వెళ్తారు. ఆ కోవలోనే ఇప్పుడు సెలెనా గోమెజ్ కూడా వెళ్లింది. -
కిస్సర్ పర్ఫెక్ట్!
ఏం కావాలో కోరుకో అనాలే గానీ.. టేస్ట్‌కు హద్దే లేదనిపిస్తుంది మనోడు నిక్ జోనస్‌ను చూస్తుంటే! ఓ రేడియో ఇంటర్వ్యూలో యాంకర్ ఓ ఫన్నీ క్వశ్చన్ అడిగింది... భార్యగా ఎవరిని కోరుకుంటారు... కిస్సింగ్కైతే ఎవరికి ఓటేస్తారు... అని. దానికి మూడు ఆప్షన్లు... మిలే సిరస్, డేమీ లోవోటో, సెలెనా గోమేజ్ పేర్లు కూడా ఇచ్చింది సదరు యాంకరు. అడిగిందే తడవుగా ఈ సింగర్ కుర్రాడు ఠక్కున బదులిచ్చేశాడు... సతిగా లోవోటోకు మార్కులేశాడు. ఇక కిస్సర్‌గా సెలెనా సూపరంటూ తెగ ఇదైపోతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అలీవియా కల్పోతో డేటింగ్ చేస్తున్న నిక్... గతంలో కొంత కాలం డేమీ లోవోటో, సెలెనా గోమేజ్లతో జతకట్టి తిరిగాడు. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే పర్ఫెక్ట్గా చెప్పగలిగా అంటూ మురిసిపోయాడు నిక్! -
పాత గర్ల్‌ఫ్రెండ్ చెంతకు జస్టిన్ బీబర్
ఎప్పటికప్పుడు కలుస్తుండటం, మళ్లీ విడిపోవడం, మళ్లీ కలవడం ఆ జంటకు మామూలే. అలాగే ఇప్పుడు మళ్లీ కలిశారు. తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఓ ఫొటోను జస్టిన్ బీబర్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో బీబర్ భుజాలను ముద్దాడుతున్నట్లుగా సెలెనా కనిపిస్తుంది. ఈ వారం మొదట్లోనే గోమెజ్ వాస్తవానికి జస్టిన్ బీబర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసింది. ప్యారిస్ నగరంలో కెండల్ జెన్నర్ అనే మోడల్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లినప్పుడు అతడు కనపడటంతో ఆమె మండిపడింది. అయితే, ఇంతలో ఏమైందో గానీ బీబర్ మాత్రం ఉన్నట్టుండి ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. గతవారం వీళ్లిద్దరూ కరేబియన్ దీవులకు ఒక రొమాంటిక్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ ఫొటో తీసుకుని ఉంటారని అంతా భావిస్తున్నారు. ఈ ఫొటోలో బీబర్ నల్లటి వెస్ట్ వేసుకుని, డిజైనర్ సన్‌గ్లాసులు పెట్టుకుని కనిపిస్తాడు. గోమెజ్ అతడి భుజాల మీద సుతారంగా ముద్దుపెట్టుకుంటున్నట్లు కనపడింది. ఇంతకుముందు కూడా వీళ్లిద్దరూ ఇవే దుస్తులతో ఒక ఫొటో దిగినా, ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లోంచి బీబర్ తొలగించాడు. -
ప్రియురాలితో ఉండగా జస్టిన్ బీబర్ అరెస్ట్!
టొరొంటో: వివాస్పద పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ను ఇటీవల కెనెడాలోని టోరంటోలో పోలీసులు అరెస్ట్ చేశారు. తన గర్ల ఫ్రెండ్, పాప్ స్టార్ సెలెనా గోమెజ్ తో డేటింగ్ లో ఉండగా బీబర్ అరెస్ట్ జరిగింది. బీబర్ అరెస్ట్ కావడానికి ఓ వ్యాన్ డ్రైవర్ తో గొడవ పడటమే కారణమైంది. ఆగస్టు 29 తేదిన స్టాట్ ఫోర్డ్ లో ఓ మినీ వ్యాన్ ను ఢికొట్టడమే కాకుండా డ్రైవర్ చేయి చేసుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆతర్వాత సెప్టెంబర్ 29 తేదిన కోర్టుకు హాజరవుతానని అంగీకరించడంతో స్వంత పూచికత్తుపై విడుదల చేశారు. యాక్సిడెంట్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమేమి కాదని, ఎవరూ గాయపడలేదని బీబర్ తెలిపారు. -
మిలియన్ డాలర్ టీనేజర్స్
పూర్వీకుల ఆస్తులు కలిసిరాలేదు. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేదు... ఇవేమీ లేకపోయినా టీనేజ్లోనే కోటీశ్వరులయ్యారు. డ బ్బుతో అనుభవించగల అన్ని సౌఖ్యాలు సొంతం చేసుకున్నారు. భారీ స్థాయిలో ఆస్తులు కూడబెడుతున్నారు. కొందరిలో అసూయను, మరికొందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు. వీళ్లు డబ్బున్న వాళ్ల పిల్లలు కాదు... డబ్బున్న పిల్లలు! ప్రతిభనే పెట్టుబడిగా చేసుకుని కోట్ల డాలర్లకు అధిపతులయ్యారు. అలాంటి వారిలో మొదటి స్థానాల్లో ఉన్నవారితో కూడిన ‘రిచెస్ట్ టీనేజర్స్ ఆన్ ది ప్లానెట్’ జాబితా ఇది... ఎమ్మావాట్సన్: మోడలింగ్ ద్వారా ప్రతి యేటా కోట్ల రూపాయలు సంపాదిస్తోంది ఈ ఇంగ్లిష్ నటి. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఫ్యాషన్ పరేడ్లలో ఎమ్మా ద్వారా తాము రూపొందించిన డ్రస్సులను ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. దీంతో ఎమ్మా బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఏడాదికి 12 మిలియన్ డాలర్ల సొమ్ము జమ అవుతోందని అంచనా. ఇది రూపాయల్లో 72 కోట్లు. జడెన్స్మిత్: ఈ కరాటే కిడ్‌ను చాలా సులువుగా గుర్తించవచ్చు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ కుమారుడు అయిన జడెన్ స్మిత్ ‘కరాటే కిడ్’ అనే సినిమాతో బాగా ఫేమస్అయ్యాడు. 13 ఏళ్ల వయసులోనే ఆ సినిమాలో నటించాడు ఈ జూనియర్ స్మిత్. అది సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కో సినిమాకు పారితోషి కంగా ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపు ముప్పై కోట్లు డిమాండ్ చేస్తున్నాడని భోగట్టా. సెలీనా గొమెజ్: హాలీవుడ్ సినిమాల ద్వారా భారతీయ యువతకు పరిచయమున్న అమెరికన్ యువతి. 19 ఏళ్ల వయసులోసెలీనా ఒక ఏడాదికి పొందుతున్న పారితోషికాన్ని లెక్కగడితే అది దాదాపు ఆరు మిలియన్ డాలర్లుగా తేలింది. అంటే దాదాపు 36 కోట్ల రూపాయలు. మిల్లీ సైరస్: 18 ఏళ్ల వయసులో ఒక ఏడాదిలోనే 48 మిలియన్ డాలర్ల డబ్బును సంపాదించి రికార్డు స్థాపించింది. రిచెస్ట్ టీనేజ్ గర్ల్‌గా నిలిచింది ఈ యాక్టర్ కమ్ సింగర్. జస్టిన్ బీబెర్ : 17 యేళ్ల వయసులో ఒకే ఏడాదికి 50 మిలియన్ డాలర్ల సొమ్మును సంపాదించాడు బీబెర్. దీన్ని రూపాయిల్లోకి మారిస్తే దాదాపు 300 కోట్లు! ఇదంతా ఒక ఏడాది సంపాదనే. బీబెర్ ఈ స్థాయిలో సంపాదన మొదలుపెట్టి మూడేళ్లు గడిచిపోయాయి! నిక్జొనస్: ఇతడూ పాప్ గాయకుడే. బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం కోసం భారీ స్థాయి పారితోషికాన్ని పొందుతున్నాడు. ఈ కుర్రాడి ఏడాది సంపాదన 20 మిలియన్ డాలర్ల పైమాటే! అంటే దాదాపు 120 కోట్ల రూపాయలు.