ఆమె ఫొటోకు ఆల్‌టైమ్ రికార్డు! | Selena Gomez, Queen of Instagram, Has the Most Liked Photo of All Time | Sakshi
Sakshi News home page

ఆమె ఫొటోకు ఆల్‌టైమ్ రికార్డు!

Published Sat, Jul 23 2016 12:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

ఆమె ఫొటోకు ఆల్‌టైమ్ రికార్డు!

ఆమె ఫొటోకు ఆల్‌టైమ్ రికార్డు!

పెద్దగా అందమైన ఫొటో కాదు.. ఎరుపు రంగు టాప్ వేసుకొని.. ఓల్డ్ ఫ్యాషన్‌ కోకాకోలా బటిల్ పట్టుకొని సింగర్ సెలెనా గోమెజ్ పెట్టిన ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ 23 ఏళ్ల చిన్నది సాదాసీదాగా దిగి పెట్టిన ఈ ఫొటోకు ఏకంగా 40లక్షలకుపైగా లైకులు లభించాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ చరిత్రలోనే అత్యధిక లైకులు తెచ్చుకున్న ఫొటోగా ఇది ఆల్‌ రికార్డు సృష్టించింది.

గత ఏడాది విడుదలైన తన పాప్ ఆల్బం ‘మి అండ్ రిథమ్’లోని ‘యు ఆర్ ద స్పార్క్’ అనే పదాలు ఉన్న కోక్ బాటిల్ పట్టుకొని సాధారణంగా సెలెనా పెట్టిన ఈ ఫొటోకు విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముగ్ధమోహనరూపం అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ సుందరి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించింది. సెలెనాను 8.92 కోట్లమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండగా.. టైలర్ స్విఫ్ట్ర్‌ను 8.52 కోట్లమంది, జస్టిన్ బీబర్‌ను 7.46 కోట్లమంది, కిమ్‌ కర్దాషియన్‌ను 7.68 కోట్లమంది ఫాలో అవుతున్నారు. తాజా రికార్డుతో ఇన్‌స్టాగ్రామ్‌ క్వీన్‌గా సెలెనా తన పాపులారిటీని చాటుకుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement