All Time
-
వెడ్డింగ్ అయినా, ఈవినింగ్ పార్టీ అయినా.. ఆల్‌టైమ్ అట్రాక్షన్ షావల్ టాప్స్
ఇండో–వెస్ట్రన్ స్టైల్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండేదే. బ్రైడల్ అయినా క్యాజువల్ అయినా ప్రత్యేక సందర్భం అయినా మీ డ్రెస్‌ని కేప్/షావల్/ జాకెట్‌గా పేరున్న ఒకే ఒక టాప్‌తో లుక్‌ని పూర్తిగా మార్చేయవచ్చు. మెడ నుంచి భుజాల మీదుగా చేతులను కప్పుతూ ఉంటుంది కాబట్టి దీనిని షావల్ టాప్ అంటుంటారు. ఈ టాప్ లుక్ మోడల్ని స్టైల్‌కి తగినట్టు మార్చుకోవచ్చు. ట్రెండ్‌లో ఉన్న ఈ మోడల్ జాకెట్స్ హుందాతనం, రిచ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. వివాహ వేడుకల్లో గ్రాండ్‌గా వెలిగిపోవాలంటే ఎంబ్రాయిడరీ చేసిన కేప్‌ని ఎంచుకోవచ్చు. గెట్ టు గెదర్ వంటి ఈవెనింగ్ పార్టీలకు లేస్తో డిజైన్ చేసిన టాప్‌తో స్టైల్ చేయచ్చు. శారీ గౌన్స్ మీదకు మాత్రమే అచ్చమైన పట్టు చీరలకు కూడా ఈ సింగిల్ పీస్తో స్పెషల్ అట్రాక్షన్‌ను తీసుకురావచ్చు. లెహంగా బ్లౌజ్ మీదకు దుపట్టా ప్లేస్ షాల్ జాకెట్ మరింత ప్రత్యేకతను తీసుకు వస్తుంది. థ్రెడ్ వర్క్, ప్రింటెడ్ షావల్ జాకెట్స్ ఇండో వెస్ట్రన్ డ్రెస్సులకు స్పెషల్ లుక్‌ని జత చేస్తాయి.సందర్భాన్ని బట్టి ఒక డ్రెస్‌ను గ్రాండ్‌గా ధరించవచ్చు అదే మోడల్ని సింపుల్‌గానూ అలంకరించవచ్చు. -
డైలాగుల్లో తాతకు సరిసాటి
-
నోకియా మొబైల్స్.. ఈ మోడల్స్ ఎప్పుడైనా చూశారా?
-
టాప్ లేపేస్తున్న ‘పాప్’ సింగర్స్
-
ఆల్‌టైం మందుల మిషన్ ప్రారంభం
ధర్మవరం రూరల్ : ఆల్ టైం మందుల పంపిణీ మిషన్‌ను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ యుగంధర్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని దర్శనమల పీహెచ్సీలో ఈ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు అందుబాటులో లేని సమయంలో ఏఎన్ఎంల సహాయంతో బటన్ నొక్కి రోగులు మందులను తీసుకెళ్లవచ్చన్నారు. నంబర్ల ఆధారంగా ఏ మందులు కావాలో వాటికి సంబంధించిన నంబర్లు నొక్కితే మందులు బయటకు వస్తాయన్నారు. జిల్లాలో రాయదుర్గం నియోజవర్గంలోని నాగలాపురం, దర్శనమల పీహెచ్సీలో మిషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డాక్టర్ చెన్నారెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆమె ఫొటోకు ఆల్‌టైమ్ రికార్డు!
పెద్దగా అందమైన ఫొటో కాదు.. ఎరుపు రంగు టాప్ వేసుకొని.. ఓల్డ్ ఫ్యాషన్ కోకాకోలా బటిల్ పట్టుకొని సింగర్ సెలెనా గోమెజ్ పెట్టిన ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ 23 ఏళ్ల చిన్నది సాదాసీదాగా దిగి పెట్టిన ఈ ఫొటోకు ఏకంగా 40లక్షలకుపైగా లైకులు లభించాయి. దీంతో ఇన్స్టాగ్రామ్ చరిత్రలోనే అత్యధిక లైకులు తెచ్చుకున్న ఫొటోగా ఇది ఆల్ రికార్డు సృష్టించింది. గత ఏడాది విడుదలైన తన పాప్ ఆల్బం ‘మి అండ్ రిథమ్’లోని ‘యు ఆర్ ద స్పార్క్’ అనే పదాలు ఉన్న కోక్ బాటిల్ పట్టుకొని సాధారణంగా సెలెనా పెట్టిన ఈ ఫొటోకు విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముగ్ధమోహనరూపం అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ సుందరి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించింది. సెలెనాను 8.92 కోట్లమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండగా.. టైలర్ స్విఫ్ట్ర్ను 8.52 కోట్లమంది, జస్టిన్ బీబర్‌ను 7.46 కోట్లమంది, కిమ్ కర్దాషియన్‌ను 7.68 కోట్లమంది ఫాలో అవుతున్నారు. తాజా రికార్డుతో ఇన్స్టాగ్రామ్ క్వీన్‌గా సెలెనా తన పాపులారిటీని చాటుకుంది. -
‘ఆల్‌టైమ్’ అలక్ష్యం..
= ఏటీఎంలలో కానరాని సెక్యూరిటీ గార్డులు = జిల్లాలో దాదాపు సగం ఏటీఎంలలో రక్షణ లేదు = భద్రతను పట్టించుకోని బ్యాంకర్లు = బెంగళూరు ఘటనతో పోలీసుల అప్రమత్తం = నోటీసులు ఇచ్చాం.. ఆకస్మిక తనిఖీలు చేస్తామంటున్న ఎస్పీ ప్రధాన ఘటన జరిగితే గానీ మనవాళ్లకు మెలకువ రాదు.. ఇటీవల బెంగళూరు ఏటీఎంలో జరిగిన ఘోర ఘటనతోనూ బ్యాంకర్లలో కదలిక రాలేదు.. జిల్లాలో అనేక ఏటీఎంలలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అసాంఘిక శక్తులకు అవకాశంగా మారింది. ఖాతాదారుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఏటీఎంల వద్ద ఖాతాదారుల భద్రత రీత్యా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని సాక్షాత్తూ ఎస్పీ ఆదేశించినా బ్యాంకర్లు అంతగా స్పందించలేదు. ఏటీఎంలకు బీమా ఉండటంతో సొమ్ము పోతే పరిహారం వస్తుంది కాబట్టి ఖాతాదారుల భద్రతను గాలికొదిలేశారన్న అపవాదు ఉంది. సాక్షి, మచిలీపట్నం : బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూలో ఉండి నగదు తీసుకునే పద్ధతి కష్టతరంగా మారడంతో పల్లెల్లోను, పట్టణాల్లోను ఏటీఎంలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల ఏటీఎంల వద్ద చోటుచేసుకుంటున్న ఘటనలతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. సెక్యూరిటీ గార్డు లేని ఏటీఎం వద్ద సీసీ కెమెరాలు పెట్టినా నేరాలను అదుపు చేసే పరిస్థితి లేదు. నేరం జరిగాక సీసీ కెమెరాలో చూసి అందుకు బాధ్యులను పట్టుకునేందుకు మాత్రమే అది దోహదం చేస్తుంది. అదే సెక్యూరిటీ గార్డు ఉంటే నేరాన్ని అదుపుచేసేందుకు అవకాశం ఉంటుంది. గతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలలో వ్యభిచారం జరిగిన ఉదంతాలు అనేకం సీసీ కెమెరాల్లో చిక్కి అటు తరువాత ఇంటర్నెట్ పోర్టల్స్‌లో హల్చల్ చేశాయి. తాజాగా బెంగళూరులో ఒక మహిళపై దాడిచేసి హత్యాయత్నం చేసిన ఆగంతకుడు అక్కడ సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దర్జాగా వెళ్లిపోయాడు. ఇటువంటి ఉదంతాలు ఎన్ని జరిగినా బ్యాంకర్లను కదిలించలేకపోతున్నాయి. ఇటీవల జిల్లాలోని బ్యాంకర్లకు ప్రత్యేకంగా పోలీసులు సమావేశాలు నిర్వహించి భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. తక్షణం సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని ఎస్పీ ఆదేశాల మేరకు ఆయా బ్యాంకర్లకు పోలీసులు నోటీసులు జారీచేసి రోజులు గడుస్తున్నాయి. అయినా వారిలో చలనం లేదు. అరకొర జీతానికి ఆసక్తి లేదు... వాస్తవానికి గంటల తరబడి నిలువు కాళ్లపై ఉండి విధులు నిర్వర్తించే సెక్యూరిటీ గార్డుల విషయంలో జీతం ప్రధాన సమస్యగా మారింది. వాస్తవానికి హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రముఖ పట్టణాలకు చెందిన సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు అవసరమైన సెక్యూరిటీ గార్డులను సమకూరుస్తాయి. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.8 వేల నుంచి 9 వేల వరకు జీతంగా ఇస్తారు. రికార్డుల్లో మాత్రం మొత్తం జీతం ఇచ్చినట్టు వారి చేత సంతకాలు తీసుకుని చేతికిచ్చేది రూ.3,500 నుంచి 4 వేలు మాత్రమే. దీంతో అరకొర జీతం చాలని సెక్యూరిటీ గార్డులు ఈ రంగం నుంచి వైదొలుగుతున్నారు. కొత్త వాళ్లెవరూ ఇటువైపు రావడంలేదు. దీంతో సెక్యూరిటీ గార్డుల కొరత తీవ్రంగా ఉంది. 16 నుంచి తనిఖీలు : ఎస్పీ ప్రభాకరరావు జిల్లాలోని ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు ఉన్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఈ నెల 16 నుంచి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు ‘సాక్షి’కి వివరించారు. ఇప్పటికే జిల్లాలోని బ్యాంకు మేనేజర్లకు ఏటీఎంల భద్రత విషయంలో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. తీసుకోవాల్సిన భద్రత చర్యలపై జిల్లాలోని అన్ని బ్యాంకులకు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. సోమవారం నుంచి జరిపే తనిఖీల్లో ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.