ఇండో–వెస్ట్రన్ స్టైల్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండేదే. బ్రైడల్ అయినా క్యాజువల్ అయినా ప్రత్యేక సందర్భం అయినా మీ డ్రెస్‌ని కేప్/షావల్/ జాకెట్‌గా పేరున్న ఒకే ఒక టాప్‌తో లుక్‌ని పూర్తిగా మార్చేయవచ్చు.
మెడ నుంచి భుజాల మీదుగా చేతులను కప్పుతూ ఉంటుంది కాబట్టి దీనిని షావల్ టాప్ అంటుంటారు. ఈ టాప్ లుక్ మోడల్‌ని స్టైల్‌కి తగినట్టు మార్చుకోవచ్చు. ట్రెండ్‌లో ఉన్న ఈ మోడల్ జాకెట్స్ హుందాతనం, రిచ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి.
వివాహ వేడుకల్లో గ్రాండ్‌గా వెలిగిపోవాలంటే ఎంబ్రాయిడరీ చేసిన కేప్‌ని ఎంచుకోవచ్చు.
గెట్ టు గెదర్ వంటి ఈవెనింగ్ పార్టీలకు లేస్‌తో డిజైన్ చేసిన టాప్‌తో స్టైల్ చేయచ్చు.
శారీ గౌన్స్ మీదకు మాత్రమే అచ్చమైన పట్టు చీరలకు కూడా ఈ సింగిల్ పీస్‌తో స్పెషల్ అట్రాక్షన్‌ను తీసుకురావచ్చు.
లెహంగా బ్లౌజ్ మీదకు దుపట్టా ప్లేస్ షాల్ జాకెట్ మరింత ప్రత్యేకతను తీసుకు వస్తుంది.
థ్రెడ్ వర్క్, ప్రింటెడ్ షావల్ జాకెట్స్ ఇండో వెస్ట్రన్ డ్రెస్సులకు స్పెషల్ లుక్‌ని జత చేస్తాయి.
సందర్భాన్ని బట్టి ఒక డ్రెస్‌ను గ్రాండ్‌గా ధరించవచ్చు అదే మోడల్‌ని సింపుల్‌గానూ అలంకరించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment