రెట్రో స్టైల్ ఎప్పుడూ బెస్ట్‌గా మార్కులు కొట్టేస్తూ ఉంటుంది.ఫుట్‌వేర్‌లోనూ కంఫర్ట్ మిస్ కాకుండా కలరఫుల్‌గా ఆకట్టుకుంటుంది. జిమ్, ఆఫీస్, క్యాజువల్ వేర్‌గా పేరున్న స్నీకర్స్ ఈ ఏడాది ఫుట్‌వేర్ ట్రెండ్‌లో ముందుండబోతున్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ కోరుకునే ఈ స్నీకర్స్ బ్రైడల్ వేర్‌గానూ పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గానూ నిలుస్తున్నాయి. తమ ప్రత్యేక రోజును మరింత చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకునే వధువులకు స్నీకర్స్ సరైన ఎంపిక అవుతున్నాయి. ఈ స్టైలిష్ కిక్స్ సంప్రదాయ హైహీల్స్‌కు సౌకర్యవంతమైన, ఫ్యాషన్‌ని అందిస్తున్నాయి.
పెళ్లి వేడుక అనగానే సంగీత్, రిసెప్షన్ హంగామాలు కళ్లముందు కదలాడతాయి. హుషారెత్తించే డ్యాన్సులు, డీజే సాంగ్స్‌తో యువత ఆటాపాటల్లో మునిగితేలుతుంటారు. వీరి స్పీడ్ చిందులకు స్నీకర్స్ బెస్ట్ ఎంపిక. కాక్‌టెయిల్ పార్టీకి సంగీత్‌కి జిగేల్మనిపించే డ్రెస్సులే కాదు వాటికి ΄ోటీగా నిలిచే హ్యాండీక్రాఫ్టెడ్ స్నీకర్స్ కలర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటున్నాయి.
కస్టమైజ్డ్
హీల్స్‌ను వదులుకుని ఫ్యాషన్ కంటే సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారు ఈ తరం వధువులు. దీంతో ట్రెండ్‌ను తామే కొత్తగా సెట్ చేస్తున్నారు. దీంతో ఫుట్‌వేర్ నిపుణులు, డిజైనర్లు కలిసి అందరి దృష్టిని ఆకర్షించేలా స్నీకర్లు అదంగా తయారుచేస్తున్నారు. క్లాసిక్ వైట్ స్నీకర్స్‌తో కాకుండా అద్భుతమైన సాంప్రదాయ డిజైనర్ స్నీకర్లను అందిస్తున్నారు.
హీల్స్ నుంచి ప్లాట్
లెహెంగా స్నీకర్, శారీ స్నీకర్ .. అంటూ ఫ్యాబ్రిక్ మోడల్‌కు తగిన విధంగానే కాదు పూర్తి భిన్నమైన రంగులను ఫన్ ఇష్టపడే వధువులు ఎంచుకుంటున్నారు. హల్దీ, సంగీత్, బ్యాచిలర్ పార్టీలకు తగిన విధంగా తమ పాదరక్షలను కూడా ఎంచుకుంటున్నారు. ఎత్తున్న హీల్స్ నుంచి ఫ్లాట్‌గా ఉండే స్నీకర్స్‌ను ధరించడం వల్ల మడమల నొప్పి లేకుండా రెచ్చి΄ోయి డ్యాన్స్ చేయవచ్చు అనేది నవతరం ఆలోచన. వీటిలో గోటా ఎంబ్రాయిడరీ స్నీకర్స్. స్టైప్ స్నీకర్స్, కాన్వాస్ స్నీకర్స్...గా అందుబాటులో ఉన్నాయి.
స్పెషల్ డిజైనింగ్‌కి ఆర్డర్
ఏ బ్రాండ్ స్నీకర్ అయినా వాటిని ప్రింటెడ్, లేస్, స్వరోస్కి, పూసలు, అద్దాలు, కుందన్స్‌తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. సోషల్‌మీడియా వేదికగానూ కస్టమైజ్డ్ షూ/స్నీకర్స్ డిజైనింగ్‌కి ఆర్డర్ మీద అందంగా తయారు చేసి ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment