Attraction
-
కుంభమేళాకు వెళుతున్నారా? వీటిని తప్పకుండా దర్శించండి
దేశంలో ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోగల గంగా, యమున, సరస్వతుల సంగమాన ఈ మహోత్తర కార్యక్రమం జరగనుంది. జనవరి 13 నుండి జరిగే కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. కుంభమేళాకు హాజరయ్యేవారు సమీపంలోని కొన్ని ప్రాంతాలను తప్పనిసరిగా దర్శిస్తుంటారు. ఆ వివరాలు..త్రివేణీ సంగమంమహా కుంభమేళాలో స్నానానికి అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశం ఇది. ఇక్కడే కుంభ స్నానం ఆచరిస్తారు.నాగ్ వాసుకి ఆలయంప్రయాగ్రాజ్లోని నాగ్ వాసుకి దేవాలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. ఈ ఆలయ శిల్పకళ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చేవారు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తుంటారు.శయన హనుమంతుడుప్రయాగ్రాజ్లోని దర్గంజ్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున ఉన్న హనుమంతుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిని సంకట్ మోచన హనుమాన్ దేవాలయం అని అంటారు. సమర్థ గురు రాందాస్ ఇక్కడ హనుమంతుని శయన విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.ఆలోప్ శంకరి ఆలయంప్రయాగ్రాజ్లోని అలోపి బాగ్‌లోని అలోప్ శాంకరీ ఆలయం ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం సంగమ తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు.వేణుమాధవ దేవాలయంప్రయాగ్రాజ్లోని నిరాలా రోడ్లో ఉన్న ఈ ఆలయంలో విష్ణువు ధరించిన పన్నెండు రూపాల విగ్రహాలు ఉన్నాయి. శాలిగ్రామ శిలతో చేసిన విష్ణుమూర్తి విగ్రహం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. కుంభమేళాకు వచ్చేవారు ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శిస్తుంటారు.ప్రయాగ్‌రాజ్ మ్యూజియంప్రయాగ్రాజ్ మ్యూజియం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రయాగరాజ్ సాంస్కృతిక వారసత్వాన్ని ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ గంగా గ్యాలరీని దర్శించి, పలు శాస్త్రీయ అంశాలు తెలుసుకోవచ్చు.శంకర విమాన మండపంప్రయాగ్రాజ్లో 130 అడుగుల ఎత్తైన శంకర విమాన మండప ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ భారత శైలిలో నిర్మించారు. ఈ ఆలయంలో ఆదిశంకరాచార్య, కామాక్షి దేవి, తిరుపతి బాలాజీ తదితర విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి.ఆనంద్ భవన్ప్రయాగ్రాజ్లోని ఆనంద్ భవన్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఇది దేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధికారిక నివాసం. దీన్ని మ్యూజియంగా మార్చి దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఆనవాళ్లను ఇక్కడ ఉంచారు.విక్టోరియా మెమోరియల్ప్రయాగ్రాజ్లో ఇటాలియన్ పాలరాయితో నిర్మించిన విక్టోరియా మెమోరియల్ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. నాడు ఒక గొడుగు కింద క్వీన్ విక్టోరియా విగ్రహం నెలకొల్పారు. తరువాత విగ్రహం తొలగించినప్పటికీ, గొడుగు అలానే కనిపిస్తుంటుంది.తేలియాడే రెస్టారెంట్గంగా నదిలో తేలియాడే రెస్టారెంట్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. గంగానదిలో పడవ ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ పడవలో కూర్చొని భోజనం చేయవచ్చు? అలాగే గంగా ఒడ్డున జరిగే కార్యక్రమాలను కూడా చూడవచ్చు.ఇది కూడా చదవండి: Sanjay Gandhi Birthday: ఇందిరకు నచ్చని మేనక?.. అయినా సంజయ్‌తో పెళ్లెలా జరిగింది? -
ఈ ఏటి మేటి మహిళలు వీరే!
కొద్దిరోజుల్లో 2023 ముగియబోతోంది. డిసెంబరులో సగభాగం ఇప్పటికే గడిచిపోయింది. ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చర్చలలోకి వచ్చిన మహిళలు కొందరు ఉన్నారు. అత్యధిక సంపాదనతో.. టేలర్ స్విఫ్ట్: ఈ సంవత్సరం వార్తల్లో ప్రముఖంగా కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో టేలర్ స్విఫ్ట్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది అక్టోబర్‌లో టేలర్ స్విఫ్ట్ బిలియనీర్‌గా మారారు. టేలర్ స్విఫ్ట్ పేరొందిన సింగర్. ఆమె తన పాటలు, నటన ద్వారా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన మొదటి మహిళగా నిలిచారు. టేలర్ స్విఫ్ట్ తన పాటలు, రాయల్టీల ద్వారా 500 మిలియన్ డాలర్లు (ఒక మిలియన్ అంటే రూ. 10 లక్షలు) సంపాదించారు. ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ ఏడాది వార్తల్లో కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో మెలోని నాల్గవ స్థానంలో నిలిచారు. 2022, అక్టోబరు 22న మెలోని ఇటలీ పగ్గాలు చేపట్టారు. మెలోనీ ఇటలీకి తొలి మహిళా ప్రధానమంత్రి. మెలోని 2014 నుండి ఇటలీ రైట్ వింగ్ పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీకి అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానం.. కమలా హారిస్ కూడా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. కమలా హారిస్ అమెరికాకు చెందిన మొదటి నల్లజాతి మొదటి మహిళ. అలాగే ఆమె అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన మొదటి దక్షిణాసియా అమెరికన్. 2021, జనవరి 20న కమలా హారిస్ యూఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఫోర్బ్స్ జాబితాలో కమలా హారిస్ మూడో స్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలిగా.. క్రిస్టీన్ లగార్డ్.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు. ఈ ఉన్నత పదవిని చేపట్టిన మొదటి మహిళ క్రిస్టీన్ లగార్డ్. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. యూరో జోన్ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గించేందుకు ఆమె ప్రయత్నించారు. అత్యంత శక్తివంతమైన మహిళగా.. ఫోర్బ్స్ జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్లేయెన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఉర్సులా వాన్ డెర్లేయెన్ 2019, జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆమె యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా నియమితులైన మొదటి మహిళ. ఉర్సులా వాన్ డెర్లేయన్ అత్యంత శక్తివంతమైన మహిళగా పేరొందారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
సొంత సినిమా కాదు.. అయినా సరే స్టార్ యాక్టర్స్ అలా
ఒక సినిమా గురించి ఒక స్టార్ పరిచయం చేస్తే ఆ మాటలు మంత్రాల్లా పని చేస్తాయి. ప్రేక్షకుల దృష్టి ఆ సినిమావైపు మళ్లేలా చేస్తాయి. ఆ మాటలు సినిమాకి అదనపు ఆకర్షణ అవుతాయి. అందుకే కొన్ని చిత్రాలకు స్టార్స్‌తో ‘వాయిస్ ఓవర్’ చెప్పిస్తుంటారు. అలా ఈ మధ్యకాలంలో ‘వాయిస్ ఓవర్’ ఇచ్చిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. దళపతికి ఉలగ నాయగన్ మాట ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. ఈ సినిమాకి ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్‌హాసన్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. ‘మాస్టర్’ తర్వాత విజయ్–లోకేష్ కాంబినేషన్లో ‘లియో’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో త్రిష హీరోయిన్గా, సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్ రిలీజ్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌కి కమల్‌హాసన్‌తో వాయిస్ ఓవర్ చెప్పించారని టాక్. అలాగే ఈ చిత్రంలో కమల్ హాసన్ అతిథి ΄పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. అక్టోబర్ 19న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సాలే గురించి చెప్పిన టిల్లు ‘డీజే టిల్లు’ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రత్యేకించి యూత్‌లో అతని ఫాలోయింగ్ రెట్టింపయ్యింది. ఈ క్రేజ్ దృష్ట్యా ‘భాగ్ సాలే’ చిత్ర యూనిట్ సిద్ధు జొన్నలగడ్డతో వాయిస్ ఓవర్ చెప్పించింది. తన వాయిస్‌తో ‘భాగ్ సాలే’ చిత్ర నేపథ్యాన్ని వివరిస్తారు సిద్ధు. కేడీ కోసం మల్టీ స్టార్స్ యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’. ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీష్మా నానయ్య హీరోయిన్. శిల్పా శెట్టి, సంజయ్ దత్, విజయ్ సేతుపతి కీలకపాత్రలు చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూ΄÷ందుతోన్న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ విడుదలకానుంది. ఈ సినిమా టైటిల్ టీజర్‌కి కన్నడలో చిత్ర దర్శకుడు ప్రేమ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, హిందీలో సంజయ్ దత్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో విజయ్ సేతుపతి ఇచ్చారు. ఇంకా తెలుగు వాయిస్ ఓవర్ పూర్తి కాలేదట. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. -
ఇది మామూలు విషయం కాదు.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్..
ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక ఆశయం, ఒక విధానం, ఒక మార్గం, ఒక దిశ... ఇవన్ని మనకు జీవితంలో చాలా మంది పెద్దవారు, చాలామంది తత్వవేత్తలు బోధించే పదాలు.. వీటిని ఆచరించడం అందరికి సాధ్యం కాదు. అలా సాధించగలిగినవారు నాయకులు అవుతారు. మార్గదర్శకులు అవుతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఒక ప్రజా నాయకుడుగా రూపాంతరం చెందడంలో వీటిలో పలు అంశాలు కీలకంగా కనిపిస్తాయి. ఆయన తన లక్ష్యాన్ని తానే ఎంపిక చేసుకున్నారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అనుసరించిన సంక్షేమ, అభివృద్ది విధానాన్నే ఆశయంగా పెట్టుకున్నారు. ఇంత పట్టుదలతో తన గమ్యం చేరుకున్న నాయకుడిగా, సినీ గ్లామర్‌ను మించి ప్రజాకర్షణలో సరికొత్త రికార్డును సృష్టించిన అధినేతగా జగన్ పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయనపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా తట్టుకుని నిలబడ్డ అతికొద్ది మంది నేతలలో ఆయన ఒకరు. ఆయన వెన్నుపోట్లతోనో, ఎదురుపోట్లతోనో అధికారంలోకి రాలేదు. కేవలం ప్రజలను నమ్ముకుని వారి విశ్వాసాన్ని చూరగొని ముఖ్యమంత్రి అయ్యారు. అనూహ్య పరిస్థితులలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడుగా జగన్ ఎంచుకున్న మార్గం చాలా క్లిష్టతరమైనది, కష్టమైనది. తన దారిలో ముళ్లు ఉంటాయని తెలిసినా, అదే మార్గంలో ఆయన వెళ్లారు. కొండను ఢీకొంటున్నావని సన్నిహితులు హెచ్చరించినా వెనక్కి తగ్గని మనస్తత్వమే ఆయనను విజయతీరాలకు చేర్చింది. అంతా అనుమానించినట్లుగానే ఆనాటి అత్యంత శక్తిమంతమైన నేత సోనియాగాంధీ కక్షకు జగన్ గురి కావల్సి వచ్చింది. ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి కేసులు పెట్టించారు. జైలుకు పంపారు. బెయిల్ రాకుండా పదహారు నెలలపాటు ఉంచగలిగారు. అయినా జైలులో ఉండే తన పవర్ ఏమిటో చూపించారు. 18 ఉప ఎన్నికలు జరిగితే 15 చోట్ల తన కొత్త పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. తద్వారా తనపై ప్రజలలో ఎంత అభిమానం ఉందో చాటిచెప్పగలిగారు. బహుశా రాజకీయాలలోకి వచ్చిన అనతికాలంలోనే ఇంతగా కష్టాలు పడిన నేత దేశంలో మరొకరు ఉండకపోవచ్చు. అయినా ఆయన సాహసంతో నిలబడగలిగారు. ధైర్యంతో పరిస్థితులను ఎదిరించారు. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలలో 2014లో తన పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పుడు పార్టీని ఖతం చేయడానికి కొందరు ప్రయత్నించకపోలేదు. అయినా ఆయన నిలబడి పోరాడారు. 23 మంది ఎమ్మెల్యేలను ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసినా ఏ మాత్రం చలించలేదు. వారిలో నలుగురికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చి అప్రతిష్టపాలైతే, ఆ ఘట్టాన్ని తనకు అనుకూలంగా మలచుకుని మొత్తం ప్రజాభిప్రాయాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఆయన వ్యూహకర్త ప్రశాంత కిషోర్ టీమ్‌ను ఎంపిక చేసుకుని వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పావులు కదిపారు. 2017లో ఎన్నికల ఎజెండాను ప్రకటించినప్పుడు ఇదంతా అయ్యేపనేనా?అని అనుకున్నవారే ఎక్కువ మంది ఉంటారు. కాని పాదయాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్లి పేదల గుండెల తలుపుతట్టారు. తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో వివరించి వారి మద్దతు కూడగట్టారు. తండ్రి మాదిరి ప్రజాభిమానం చూరగొనాలన్న ఆశయాన్ని పెట్టుకున్న జగన్ ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. ఎన్నికల మానిఫెస్టో ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం అంటే ఆషామాషీ కాదు. అందులోను వ్యతిరేక శక్తులు బలంగా ఉన్నప్పుడు మరీ కష్టం. అందుకే ఆయన ప్రజలలోనే నిత్యం సంచరించి తానేమిటో రుజువు చేసుకున్నారు. 2014 నాటి ఓటమి అనుభవం ఆయనకు విజయసోపానం అయింది. ఎన్నికల వ్యూహాలు ఎంత పదునుగా, ఎంత తెలివిగా ఉండాలో ఆయన నేర్చుకున్నారు. సొంత మామనే పదవి నుంచి పడవేసి, అధికారాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబు నాయుడును చాలా మంది వ్యూహరచనలో సిద్దహస్తుడిగా భావిస్తారు. తెరచాటు రాజకీయాలు చేయడంలో కాని, కుట్రలు పన్నడంలో కాని చంద్రబాబు నేర్పరి అని అనుకుంటారు. అప్పటికే 14 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును పదవి నుంచి దించడం అంటే అయ్యే పనేనా అనుకుంటున్న తరుణంలో అదేమీ కష్టం కాదని, కుట్ర రాజకీయాల కన్నా, ప్రజా రాజకీయాల ద్వారానే అది సాధ్యమని స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు సాగి తన లక్ష్యాన్ని చేరుకున్న నేత జగన్. అందువల్లే జగన్‌కు 151 సీట్లతో ప్రజలు పట్టం కట్టారు. సామాజిక సమీకరణలన్నీ తనవైపే ఉండేలా చూసుకున్న అసలైన వ్యూహకర్త ఈయనే అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి అయిన తొలిరోజే తాను ప్రభుత్వ సారధిగా కులం చూడను, మతం చూడను, రాజకీయ పార్టీని చూడను, ప్రాంతాన్ని చూడను, అర్హులైన ఎవరికైనా ప్రభుత్వ స్కీములు వర్తింప చేస్తానని చెప్పి అదే పద్దతి పాటిస్తున్న నేత జగన్. ఆయన ముఖ్యమంత్రి అవడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడపడం మరో ఎత్తుగా ఉంది. తన ఎన్నికల మానిఫెస్టోని మంత్రులు, అధికారుల ముందు దానిని అమలుపర్చాల్సిందేనని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల మానిఫెస్టోని వెబ్సైట్ల నుంచి తొలగించిన టీడీపీకి, తన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం ఏమిటో ఆయన అందరికి తెలిసేలా చేసి చూపించారు. అంతేకాదు. ప్రతిపక్ష టీడీపీ వారు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నా, ఎక్కడా వెనుకడుగు వేయకపోవడం విశేషమే. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నన్ని మార్పులను పాలన వ్యవస్థలో తీసుకు వచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిది. వలంటీర్ల వ్యవస్థను సృష్టించారు. గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి ప్రజల గడపవద్దకు పాలనను చేర్చిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే. గతంలో టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధిస్తే, జగన్ అలాంటివేమీ లేకుండా, ఏ స్కీము ప్రయోజనం అయినా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా చేయడంలో సఫలం అయ్యారు. తత్ఫలితంగా సంక్షేమ పదకాల అమలులో అవినీతి లేకుండా చేయగలిగారు. అది సరికొత్త రికార్డు అని చెప్పాలి. ఇలా ఒకటేమిటి!. రైతు భరోసా కేంద్రాలు, విలేజీ క్లినిక్స్, స్కూళ్ల లో నాడు-నేడు, ఆంగ్ల మీడియంలో బోధన, విద్యాదీవెన, గోరుముద్ద, సిబిఎస్, ఈ విధానం, ఆస్పత్రులలో నాడు-నేడు, పల్లెలకు డాక్టర్ లు, ఆరోగ్యశ్రీలో చికిత్సకు అర్హమైన వ్యాధుల సంఖ్యను 3వేలకు పైగా పెంచడం, చేయూత, వృద్దులకు పెన్షన్ పెంచడమే కాదు. ప్రతి నెల మొదటి రోజే వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అందించడం అంటే మామూలు విషయం కాదు. చదవండి: పేదోడి కోసం ఓ సీఎం ఇంతలా పరితపిస్తారా? అది జగన్ సాధించారు. కేవలం సంకల్ప బలంతోనే ఆయన చేయగలిగారు. అభివృద్దిపరంగా చూస్తే గతంలో ఏ సీఎం దృష్టి కేంద్రీకరించని తీర ప్రాంత అభివృద్దిని ఆయన తలపెట్టారు. పోర్టులు, పిషింగ్ హార్బర్లు, పలు పరిశ్రమలు రావడానికి వీలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ ఒన్ స్థానం, కొప్పర్తి పారిశ్రామికవాడ, వేల కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, విశాఖలో ఐటి అభివృద్ది, ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు యత్నాలు మొదలైవన్ని ఆయన చేపట్టారు. ఇవన్ని పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల జగన్ మరోసారి విజయం సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. జగన్ ఎంత బలంగా ఉన్నారంటే ఒంటరిగా పోటీచేస్తే ఆయనను ఏమీ చేయలేమని ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు బహిరంగంగానే ఒప్పుకుంటున్నాయి. ఎలాగొలా పొత్తులు పెట్టుకుని ఫైట్ ఇవ్వాలని ఆ పార్టీలు యత్నిస్తున్నాయి. ప్రజలలో ఆయనను వ్యతిరేకించేవారు సైతం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే భావిస్తున్నారు. దానికి కారణం ఆయా వర్గాలలో ముఖ్యంగా పేదలలో ఆయన ఆపారమైన అభిమానం చూరగొన్నారు. పేదవర్గాలకు,పెత్తందార్లకు మధ్య పోటీ అన్న నినాదాన్ని ఆయన తీసుకువచ్చారు. జగన్ గెలిస్తేనే తమకు సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయని పేదలు భావిస్తున్నారు. ఇలా తనదైన శైలిలో ముఖ్యమంత్రిగా పదవి నిర్వహిస్తున్న ఆయనకు సవాళ్లు లేవని అనజాలం. మూడు రాజధానుల అంశం, ఆర్ధిక ఇబ్బందులు మొదలైవని ఉన్నా, జనంలో తీరుగులేని నేతగా జగన్ ఎదిగారు. ఆయనకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘రోప్మ్యాప్’తో పర్యాటకం పరుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకానికి ‘రోప్ మ్యాప్’ వేస్తూ ప్రభుత్వం సరికొత్త అందాలను తీసుకురానుంది. విదేశాల్లో ఎక్కువగా కనిపించే రోప్‌వేలను రాష్ట్రంలోని 25 ప్రముఖ విహార, ఆధ్యా త్మిక కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. తద్వారా పర్యాటక రంగం అభి వృద్ధిలో కొత్తపుంతలు తొక్కనుందని భావిస్తోంది. ఇప్పటికే రెండు రోప్‌వేలకు అనుమతి.. విజయవాడలోని ఇంద్రకీలాద్రి, కృష్ణానది మీదుగా తెలంగాణలోని ఈగలపెంట నుంచి శ్రీశైలానికి కొత్తగా రోప్ వేలను నిర్మించేందుకు ఇప్పటికే అనుమతులు లభించాయి. మరోవైపు గండికోటలో రోప్‌వే నిర్మాణ దశలో ఉంది. పర్వతమాల పథకంలో భాగంగా జాతీయ రహదారుల మౌలిక వసతుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఎల్ఎంఎల్) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వంతో రోప్‌వేల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి, ఎన్హెచ్ఎ ల్ఎంఎల్ మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం బిడ్డింగ్ నిర్వహించ నున్నారు. మిగిలిన ప్రతిపాదిత రోప్‌వేల నిర్మాణానానికి సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపాదనలు ఇలా.. గుంటూరు జిల్లా కోటప్పకొండ, విజయవాడలోని భవాని ద్వీపం–బెరంపార్క్, శ్రీకాళహస్తిలోని భరద్వాజతీర్థం, చిత్తూరు జిల్లాలో బోయకొండ గంగ మ్మ, సిద్ధేశ్వర స్వామి దేవాలయం–తలకోన జలపా తం, విశాఖ జిల్లాలోని గాలికొండ వ్యూ– అరకు కటికి జలపాతం, గంభీరం కొండ–గంభీరం డ్యామ్, లంబసింగి–అరకు కొండపైకి, తూర్పుగో దావరి జిల్లా అన్నవరం, కోరుకొండ ఆలయం– బౌద్ధస్థూపం, కొండపాదల నుంచి పైనగుడికి, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట జగతిపల్లి కొండ, హిరమండలం రిజర్వాయర్, శాలిహుండం, వైఎస్సార్ కడప జిల్లాలోని పెన్నానది మీదుగా పుష్పగి రిపట్నం – చెన్నకేశవ ఆలయం, అనంతపురం జిల్లాలోని పెనుకొండ, గుత్తి కోట, కర్నూలు జిల్లాఅహోబిలం, యాగంటి, మద్దలేటి స్వామి ఆలయం, విజయనగరం జిల్లా రామతీర్థం, తాటిపూడి, పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాంతాల్లో రోప్‌వేలు నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా రోప్‌వేలు.. రాష్ట్రానికి విదేశీయులను ఆకర్షించేంత పర్యాటక సౌందర్యం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 25 చోట్ల రోప్‌వేలు నిర్మించాలనే యోచనలో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలోనే ఇంద్రకీలాద్రి, శ్రీశైలం రోప్‌వే పనులు చేపట్టి వేగంగా పూర్తి చేస్తాం. – సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ (చదవండి: సరికొత్త శకం) -
ఇప్పటివరకు 25 వేల పక్షులు.. వావ్ వాట్ ఏ సీన్!
బరంపురం: నగర శివారులోని బహుదా నదీ తీరాన విదేశీ అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. తొలిసారిగా ఇక్కడికి విచ్చేస్తున్న విహంగాలను చూసి నగరవాసులు ఆనందం వ్యక్త చేస్తున్నారు. ఏటా శీతాకాలంలో గంజాం జిల్లా, బరంపురం దగ్గరలోని చిలికా సరస్సులో ఉన్న 24 దీవులకు విదేశాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో వలస పక్షులు వచ్చి, విడిది చేస్తుంటాయి. ఎప్పటిలాగే కాకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 185 జాతులకు చెందిన దాదాపు 10 లక్షల పక్షులు చిలికాకు చేరుకోవడంతో, వాటిలో కొన్నింటి నివాసం ఏర్పాటుకు కాస్త అడ్డంకి ఏర్పడింది. దీంతో విడిది కోసం సరస్సుకు సమీపంలోని బహుదా నదికి కొన్ని పక్షులు చేరుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తున్న అక్కడి వారు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల పక్షులు నదీ తీరానికి చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల నదీ తీరంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అక్కడి అడవిలోకి తరలించేందుకు వెళ్లిన బరంపురం అటవీ శాఖ అధికారుల ద్వారా అతిథి పక్షుల ఆచూకీ వెలుగులోకి రావడం విశేషం. ప్రస్తుతం నది పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకుని 25 వేల వరకు పక్షులు ఉన్నట్లు గుర్తించినట్లు డీఎఫ్ఓ అముల్యకుమార్ ప్రధాన్ తెలిపారు. చదవండి: కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి -
ఒకరిపై ప్రేమ అనేది ఆకర్షణతో మొదలవుతుంది..
హరియాణా : గణిత శాస్త్రం.. ఈ పేరు వింటేనే కొంతమంది స్టూడెంట్స్ బెంబేలెత్తిపోతారు. లెక్కల మాస్టారు తరగతి గదిలోకి ప్రవేశిస్తేనే బోర్‌గా ఫీలవుతారు. ఎప్పుడెప్పుడు మ్యాథ్స్ క్లాస్ అయిపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ మన లెక్కల మాస్టారు చెప్పే క్లాసులు విద్యార్థులు మాత్రం అస్సలు మిస్సవ్వరు. ఇంకా కాసేపు చెబితే బాగుండు అనేలా క్లాసులు వింటారు. అయితే ఈ మాస్టారు చెప్పే లెక్కలు కొంచెం తేడా. గణితానికి ప్రేమను జోడించి ప్రేమ లెక్కలు చెబుతూ వివాదస్పందంగా నిలిచారు హరియాణా ప్రభుత్వ మహిళా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చరణ్ సింగ్. స్నేహం, ఆకర్షణ, క్రష్‌ల మధ్య తేడాను గణిత రూపంలో వివరిస్తున్న వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. ఆయన చెప్పిన ప్రేమ లెక్కలు.. ఫ్రెండ్షిప్ : సాన్నిహిత్యం నుంచి ఆకర్షణను తీసివేస్తే వచ్చేదే స్నేహం (క్లోజ్‌నెస్- అట్రాక్షన్ = ఫ్రెండ్షిప్). భార్యభర్తలు వృద్ధాప్యంలో స్నేహితులుగా ఉంటారు. వృద్ధాప్యంలో శారీరక ఆకర్షణ తగ్గిపోయి స్నేహితులుగా మారుతారు. లవ్ : సాన్నిహిత్యం, ఆకర్షణల కలయికనే ప్రేమ. (క్లోజ్‌నెస్ + అట్రాక్షన్) . రొమాంటిక్ లవ్ : స్నేహం, సాన్నిహిత్యం, ఆకర్షణల కలయికనే రొమాంటిక్ లవ్ ( రోమాంటిక్ లవ్ = ఫ్రెండ్షిప్ + క్లోజ్‌నెస్ + అట్రాక్షన్). ఏ సంబంధం అయినా ఆకర్షణ, స్నేహం, సాన్నిహిత్యంపైనే ఆధారపడి ఉంటుంది. ‘ఒకరిపై ప్రేమ అనేది ఆకర్షణతో మొదలవుతుంది. వారిమధ్య సాన్నిహిత్యం కొరవడితే వైరం ఏర్పడుతుంది. దీంతో విడిపోతారు. ఇలాంటి ప్రేమ ఎక్కువగా విదేశాలలో ఉంటుంది. కొన్ని దేశాల్లో వాహనాలు, ఇళ్లను మార్చినట్లుగా ఈజీగా జీవిత భాగస్వామిని మారుస్తారు. దానికి గల కారణం సాన్నిహిత్యం లేకపోవడం. కానీ భారతదేశంలో అలాకాదు. వారిలో ఆకర్షణ, సాన్నిహిత్యం తగ్గిపోయినా వారి పిల్లల కోసం కలిసి ఉంటారు’ అని చరణ్ సింగ్ వివరించారు. ఇక క్రష్ గురించి చెబుతూ.. ఆకర్షణ నుంచి సాన్నిహిత్యాన్ని తీసివేస్తే వచ్చేదే క్రష్ అని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రష్ అనేది ఎప్పడో ఒకసారి పుడుతుందని స్టూడెంట్స్‌కు వివరించారు. ఇక ప్రొఫెసర్ చెప్పే ప్రేమ లెక్కలను విద్యార్థులు నవ్వుతూ శ్రద్దగా విన్నారు. వారికి ఉన్న సందేహాలను కూడా తీర్చుకున్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా అతనిపై ఫిర్యాదు చేయలేదు. సామాజిక కార్యకర్త ఒకరు చరణ్ సింగ్‌పై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చరణ్ సింగ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారో లేదో తెలియరాలేదు. -
అవినీతికి పరాకాష్ట
కొత్తమరువాడ అంగన్వాడీకేంద్రంలోఅక్రమాలు ఆన్లైన్ హాజరు పేరిట మోసం 14 ఏళ్లుగా తెరచుకోని కేంద్రం పిల్లలకు, గర్భిణులకు అందని పౌష్టికాహారం బయట ప్రాంతాల్లో ఉంటున్న వారి పేర్లతో హాజరు సరుకులను దోపిడీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్త ఇది అవినీతికి పరాకాష్ట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్లుగా జరుగుతున్న దోపిడీ. వంగర మండలం కొత్తమరువాడ అంగన్వాడీ కేంద్రం–2లో అవినీతి విశ్వరూపం కనిపిస్తోంది. ఆన్లైన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాకుతో ప్రతినెలా ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారాన్ని అక్కడి కార్యకర్తే మింగేస్తున్నారు. అధికారుల కళ్లు గప్పి, పాలకులకు తెలియకుండా జరుగుతున్న ఈ అక్రమం ఆనవాళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. పేరుకు మారుమూల గ్రామమే అయినా ఈ ఘటనతో కొత్త మరువాడ జిల్లాను ఉలిక్కి పడేలా చేస్తోంది. వంగర: ఇక్కడ అధికారుల పర్యవేక్షణ ఉం డదు. నాయకుల రాక అంతంతమాత్రమే. ఇంకేం అవినీతి వృక్షం వేళ్లూనుకుపోయింది. పద్నాలుగేళ్లుగా అడ్డూ అదుపు లేనంతగా ఇక్కడ మింగుడు కార్యక్రమం జరుగుతోం ది. వంగర మండల పరిధి కొత్తమరువాడ అంగన్వాడీ కేంద్రం–2లో అవినీతి జరుగుతోంది. ఇక్కడ పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త వడ్డి శోభారాణి ఆన్లైన్లో కార్యకలాపాలు జరిపినట్లు నమోదు చేసి ప్రతి నెల గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారం కాజేస్తున్నారు. వలస వెళ్లిన వారు, గ్రామంలో పూర్తిగా లేని వారి పేర్లతో, ఇతర దేశాలు, దేశంలోని వివిధ పట్టణాల్లో నివాసం ఉన్న వారి పేర్లు, ఉద్యోగుల పిల్లల పేర్లు రికార్డుల్లో నమోదు చేసుకొని ఆన్లైన్లో హాజరు పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారు. 14 ఏళ్లుగా.. గ్రామస్తుల కథనం ప్రకారం అంగన్వాడీ కేంద్రం 14 ఏళ్లుగా తెరుచుకోవడం లేదు. కేంద్రంలో 15 మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఉన్నట్లు లెక్కలు చూపి అవకతవకలకు పాల్పడుతున్నారు. వీరికి ప్రతి నెల అందజేసే పౌష్టికాహారం అందడం లేదు సరికదా, సరుకులు కూడా స్వాహా చేస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో నెలవారీ హాజరు ముందుగానే పూర్తి చేయ డం ఆ కార్యకర్త అవినీతికి నిదర్శనం. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన యువత ‘సాక్షి’కి చెప్పడం ‘సాక్షి’ ఇంటింటా సర్వే చేపట్టింది. ఈ క్రమంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంతులేని అవకతవకలు కేంద్రంలో వంట చేయడం అప్పుడప్పుడూ మాత్రమే జరుగుతోంది. కానీ ఇక్కడ ప్రతి రోజూ లబ్ధిదారులకు పౌష్టికాహారం ఇస్తున్నట్లు నమోదు చేశారు. ఇక్కడ ఎనిమిది మంది గర్భిణులు, ఐదు మంది బాలింతలున్నట్లు గత ఎనిమిది నెలలుగా రికార్డుల్లో నమోదై ఉంది. గర్భిణుల్లో గుళిపల్లి రేణుక, పైల విజయలక్ష్మిలు గ్రామంలో ఉన్నప్పటికీ పౌష్టికాహారం అందించలేదు. మరడాన వేణమ్మ(విశాఖపట్నం పరిధి గాజువాకలో నివాసం), శింగిరెడ్డి శిరీష(విశాఖ జిల్లా నక్కపల్లిలో నివాసం)లో ఉండడం విశేషం. బాలింతల జాబితాకి వస్తే పెద్దింటి లలిత గ్రామంలో ఉండగా శింగిరెడ్డి అనిత(హైదరాబాద్‌లో నివాసం), మరవాడన ఉమా (భర్త ఐఐటీ ప్రొఫెసర్ కావడంతో ఖరఖ్పూర్లో నివాసం), శింగిరెడ్డి సుమతి(విశాఖపట్నం–గాజువాకలో నివాసం), రెడ్డి సత్యవతి (ఈ గ్రామానికి చెందిన వ్యక్తి కాదు) ఇలా బయట నివాసం ఉన్న వారి పేర్లతో భారీగా సరుకులు దోపిడీకి పాల్పడుతున్న విషయం వెలుగుచూసింది. పిల్లల విషయంలోనూ.. ఏడు నెలల నుంచి మూడేళ్లు నిండిన పిల్లలకు టేక్ హోమ్ రేషన్ అందించాల్సి ఉంది. ఈ జాబితాలో మొత్తం 22 మంది చిన్నారుల పేర్లు రికార్డుల్లో నమోదయ్యాయి. వీరిలో సిం గిరెడ్డి మోహిత్, శింగిరెడ్డి రిషిత, చింత శంకరరావు, మరడాన జస్వంత్, గాడి భరధ్వజ్, శింగిరెడ్డి జ్యోతిర్మయిలకు నెలలో ఒకటి, రెండు సార్లు టేక్‌హోమ్ రేషన్ ఇచ్చి అంగన్వాడీ కార్యకర్త చేతులు దులుపుకుంటోంది. గంట తరుణ్( గ్రామంకాదు), శింగిరెడ్డి హాసినివేద (విశాఖపట్నంలో నివా సం), వేగిరెడ్డి సియా(లండన్ దేశంలో నివాసం), శింగిరెడ్డి బిందు, శింగిరెడ్డి బింద్యా (వీరిద్దరూ కవలలు–విశాఖపట్నం లో నివాసం), మరడాన కిరణ్మయి (విశాఖపట్నం గాజు వాకలో నివాసం), శింగిరెడ్డి చైతన్య (ఈ గ్రామం కాదు), శింగిరెడ్డి సుజిత్ (ఏడేళ్లుగా గ్రామంలో నివాసం లేరు), గాడి చరిత్ (విశాఖపట్నం–ఆరిలోవలో నివాసం), శింగిరెడ్డి యువరాజు(విశాఖపట్నం–గాజువాకలో నివాసం), మరిపి అభిజిత్ (బొబ్బిలి మండలం అలజింగి), నల్ల హేమలత (విశాఖపట్నం హెచ్‌బీ కాలనీ నివాసం), కల్యంపూడి శ్రీకీర్తి(హైదరాబాద్‌లో నివాసం), గేదెల మోనిష (విజయనగరంజిల్లా బాడంగి మండలం కూనాయివలసలోనివాసం), గాడి గీతాదీపిక (తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో ఉపాధ్యాయుడిగా గీతాదీపిక తండ్రి పనిచేయడంతో అక్కడ నివాసం), మరడాన లక్ష్మిప్రియ (విశాఖపట్నం గాజువాకలో నివాసం)లో ఉంటున్నారు. వీరి పేర్లను రికార్డుల్లో నమోదు చేసి ఆన్లైన్ ద్వారా హాజరు వేసుకొని సరుకుల స్వాహాకు పాల్పడుతున్నారు. అలాగే 3–6 ఏళ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ నిర్వహణ, భోజనం అందజేయాల్సి ఉంది. అయితే ఏదీ ఇక్కడ అమలు కావడం లేదు. మొత్తం 12 మంది ఉన్నప్పటికీ జాబితాలో బోగస్ పేర్లుతో రికార్డు నమోదు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. మరడాన కార్తీక్, చింత లిఖిత ఈ ఇద్దరు చిన్నారులు మాత్రమే గ్రామంలో ఉన్నప్పటికీ వీరికీ ఎలాంటి పౌష్టికాహారం, ప్రీ స్కూల్ నిర్వహణ జరగడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. బొంతు ఝాన్సీ (విశాఖపట్నం–గాజువాక), అంపిల్లి సింహాచలం(విశాఖపట్నం–మాధవధార), వేమిరెడ్డి నిత్య (లండన్ దేశంలో నివాసం), మరడాన తేజశ్వని(విశాఖపట్నం–గాజువాకలో నివాసం), గాడి మహిధర్(విశాఖపట్నం–హెచ్‌బీ కాలనీలో నివాసం), పెరుమాళి జశ్వంత్(విశాఖపట్నం–గోపాలపట్నంలో నివాసం), అంపిల్లి షన్ముఖ(కైకలూరు), శింగిరెడ్డి జినిత్ (విజయనగరంజిల్లా పూసపాటిరేగ), గాడి నర్తనకుమార్(తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో నివాసం), శింగిరెడ్డి షన్ముఖ( గ్రామం కాదు) ఇలాంటి పేర్లతో మాయాజాలం నడుస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు కంది పప్పు రెండుక్వింటాళ్లు, ఆయిల్ 140 లీటర్లు, ఆరువేల గుడ్లు, 322 లీటర్లు పాలు ప్రభుత్వం పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ గ్రామంలో లబ్ధిదారులెవ్వరికీ అందడం లేదని చెబుతున్నారు. యువత నుంచి వ్యతిరేకం... గ్రామ యువత రగిలిపోతున్నారు. గత దశాబ్ద కాలం నుంచి కేంద్రం తెరవకుండా విధులు నిర్వహించినట్లు జీతం డ్రా చేయడం, సరుకులు స్వాహా చేస్తున్నారని, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో లక్షలాది రూపాయల సరుకులు దారి మళ్లిస్తున్నారని యువత గుంట్రెడ్డి హరీష్, జామి నరేష్, శింగిరెడ్డి అనంత్, గాడి సంతోష్, శింగిరెడ్డి అశోక్,శింగిరెడ్డి సత్యన్నారాయణ, జామి శివప్రసాద్, చింత ప్రసాద్ తదితరులు గళమెత్తి అవినీతిని వెల్లడించారు. అంగన్వాడీ నిర్వహిస్తున్న భవనం కూడా ఆమె సొంత గృహమే. కార్యకలాపాలు నిర్వహించకుండా నెలనెలా అద్దె తీసుకుంటున్నారు. కూరగాయల బిల్లులు, గ్యాస్ బిల్లులు ఏవీ వదల్లేదు. కొసమెరుపు.. ‘సాక్షి’ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త అవినీతిపై దర్యాప్తు జరుగుతోందని వివరాలు తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ రత్నం హుటాహుటిన గ్రామానికి చేరుకోగా కేంద్రంలో ఒక్కరూ కూడా లేకపోవడం గుర్తించారు. ఈ విషయాన్ని వీరఘట్టం ఐసీడీఎస్ పీఓ వి.రమాదేవికి తెలియజేయగా మరో గంటలో ఆమె కేంద్రం వద్దకు చేరుకొని అవకతవకలున్నట్లు వెల్లడించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు రికార్డులో హాజరు పూర్తిగా వేసినట్లు, కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులెవరూ లేనట్లు గుర్తించారు. వంటలు వండడం లేదని, ప్రీ స్కూల్ ని ర్వహించడం లేదని, సరుకులు లబ్ధి దారులకు ఇవ్వడం లేదని పలువురు యువకులు, లబ్ధిదారులు పీఓ దృష్టికి తేవడం కొసమెరుపు. ఒక్కరోజూ భోజనం పెట్టలేదు కేంద్రంలో ఒక్కరోజూ భోజనం పెట్టలేదు. ఏ రోజూ సరుకులు కూడా ఇవ్వలేదు. ఏ రోజూ కేం ద్రం కూడా తెరవలేదు. సరుకులు స్వాహా చేస్తున్నారు. – పైల విజయలక్ష్మి, గర్భిణి, కొత్తమరువాడ ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు మరిపి గౌరీ. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజింగి గ్రామానికి చెందిన మహిళ. ఈమె గర్భిణిగా ఉన్నప్పుడు, అబ్బాయి పుట్టి ఏడు నెలలు కిందట నుంచి వీరికి పౌష్టికాహారం అందిస్తున్నట్లు రికార్డులో నమోదు చేశారు. అయితే తమకు ఏ ఒక్క రోజూ కేంద్రం నుంచి భోజనం కానీ, సరుకులు కానీ ఆమె అందలేదని తెలిపారు. చిత్రంలో కనిపిస్తున్న బాలింత పేరు పెద్దింటి లలిత. వంగర మండలంలోని ఇరువాడ గ్రా మానికి చెందిన మహిళ. ఈమె పేరుతో తొమ్మిది నెలల నుంచి కేంద్రం వద్ద భోజనం అందిస్తున్నామని రికార్డులో రాశారు. వాస్తవానికి ఏ ఒక్క రోజూ కేంద్రంలో భోజనం పెట్టలేదని, సరుకులు కూడా పంపిణీ చేయలేదని ఆమె తెలిపారు. మేమే కాపలా కాస్తున్నాం అంగన్వాడీ కేంద్రం తెరవకపోవడంతో చిన్నపిల్లలను మేమే ఇంటి వద్ద కాపలా కాస్తున్నాం. కేంద్రం తెరవకపోవడంతో పనులకు కూ డా వెళ్లలేకపోతున్నాం. – మరడాన అప్పలనాయుడు, కొత్తమరువాడ కేంద్రం ఎన్నడూ తెరవరు అంగన్వాడీ కార్యకర్త కేంద్రాన్ని ఎన్నడూ తెరవదు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఏనాడూ వండలేదు. గ్రామంలో లేని వారి పేర్లతో మోసం చేస్తున్నారు. – గాడి కృష్ణవేణి, సర్పంచ్, మరువాడ సమగ్ర దర్యాప్తు గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తాం. అర్జెంట్ మెమో జారీ చేస్తాం. అవకతవకలు గుర్తించాం. కార్యకర్తపై చర్యలు తీసుకుంటాం. – వి.రమాదేవి, సీడీపీఓ, వీరఘట్టం -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్!! నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. చెప్పకుండా ఉండటం సరికాదని దైర్యం చేసి చెప్పేశాను. త్రీఇయర్స్గా తన మాట కోసం వెయిట్ చేస్తున్నా. నాతో క్లోజ్‌గానే ఉంటాడు, బాగా మాట్లాడతాడు.. కానీ నేనంటే ఇష్టమని చెప్పడ్డంలేదు. నేను వెయిట్ చేస్తానని కూడా చెప్పాను తనకి. అయినా ఇంత వరకూ ఎలాంటి రిప్లై లేదు. అలా అని వేరే వాళ్లని పెళ్లి చేసుకోలేను. తన స్థానంలో ఎవరినీ ఊహించుకోలేను. మనసులో ఒకరిని పెట్టుకుని రేపు వచ్చే వ్యక్తిని మోసం చెయ్యలేను. ఎందుకంటే ప్రేమ అనేది మానసికమైన సంబంధమని నేను నమ్ముతాను. గతాన్ని మరచిపోలేక, భవిష్యత్‌ను ఆహ్వానించలేక.. అనుక్షణం చస్తూ బతుకుతున్నాను. ఇప్పటికీ మేం మంచి స్నేహితుల గానే ఉన్నాం. నేను ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి అన్నయ్యా.. మరోసారి ధైర్యం చేసి అడగనా? – ఉష ఏం చెయ్యగలుగుతాం బంగారం..? ‘ఏంటి సార్ క్వశ్చన్‌కి క్వశ్చన్ ఆన్సర్‌గా చెబుతున్నారు?’ అంటే..? ‘అంటే గింటే కాదు అక్కడ మీ చెల్లెలు లైఫ్‌లో టెన్షన్ భరించలేక రాస్తే క్వశ్చన్‌కి క్వశ్చన్ ఆన్సర్‌గా చెబుతారా?’ అంటే..? ‘అంటే ఏంటి సార్.. అంటే... అంటే... అని నసుగుతున్నారు?’ సరే నువ్వు చెప్పు!! ‘ఫొటో మీది పెడుతున్నారు సార్ ఆన్సర్ నేనెందుకు ఇవ్వాలి...? యూ ఓన్లీ టెల్..’నువ్వూ నేనూ చెప్పగలిగింది ఏమీ లేదు.. ఆ అబ్బాయే చెప్పాలి. ధైర్యంగా అడిగెయ్యాలి. ఇప్పటికే ఒకసారి అడిగా, మరోసారి అడిగితే మనం చీప్ అయిపోతాం అని అనుకోవడం కంటే... అడిగి ఆ వలయంలో నుంచి బయటపడటం ఎంతో బెటర్! బీ కాన్ఫిడెంట్ అండ్ బీ షూర్ ఆల్వేస్! ‘అరటిపండు లాంటి ఆన్సర్ సార్.. క్వశ్చన్‌కి క్వశ్చన్ అన్సర్గా చెప్పేముందు... ముందే ఈ ఆన్సర్ చెప్పుంటే..!?’ మేడమ్! నీకో దండం పెడతా చెబుదామనే లోపలే రియాక్ట్ అవుతున్నావు... ఒక అరటిపండు ఇస్తే నేను తింటా... నువ్వు బ్రెయిన్ తిను..! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సార్. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. నన్ను చూసి నవ్వుతుంది. పైగా నేనంటే ఇష్టమని వాళ్ల ఫ్రెండ్స్‌తో చెప్పిందట. దాంతో నేను ప్రపోజ్ చేశాను. నో అంది. కానీ తను నన్ను చూడకుండా అసలు ఉండలేదు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. వేరే వాళ్లు చాలా మంది నాకు ప్రపోజ్ చేశారు ఏం చెయ్యమంటారు? – సునీల్ మనకి అంత డిమాండ్ ఉన్నప్పుడు ఎందుకన్నా ఇక్కడే వేలాడ్డం? ‘ఏంటి సార్! పాపం... అంతగా బాధపడుతుంటే ఎందుకా తుంటరి ఆన్సర్ సార్?’ తానే చెబుతున్నాడు కదా చాలా మంది ప్రపోజ్ చేస్తున్నారని... మూవ్ ఎహెడ్ అని చెప్పా! ‘లేదులే సార్, ఆ ఆన్సర్లో విపరీతమైన వెటకారం గుప్పుమంటోంది!!’ నీకు అనుమానం ఎక్కువయిపోయింది!! ‘సరే సార్ నాకోసం ఇంకో టైప్ ఆన్సర్ చెప్పండి!!’ ప్రేమ ఎంత పవిత్రమో... నా ఆన్సర్ కూడా సో పవిత్రం ఇంకో టైప్ ఉండదు!! ‘చ్చా! ట్రై చేస్తారా.. పస్తుంటారా?’ నిన్న నో చెప్పింది! ఇవాళ నవ్వుతోంది!! రేపు ఎస్ అనొచ్చు! అనకపోతే.. ఎల్లుండి ఓకే అనొచ్చు!! అనకపోతే... ఆవలెల్లుండి.... ‘సార్.. సార్... అర్థమయింది! ఇదిగో మీ అరటిపండు!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ రామ్, ప్లీస్ సజెస్ట్ మి సమ్‌థింగ్ ప్లీజ్. నేను నా లవ్ మేటర్ 3 నెలల క్రితం ఇంట్లో చెప్పాను. ఆ అబ్బాయి బ్రాహ్మిన్, మేము రెడ్డి. మా ఇంట్లో వాళ్లకి చాలా క్యాస్ట్ పిచ్చి ఉంది. అస్సలు ఒప్పుకోవట్లేదు. నన్ను బలవంతంగా వాళ్ల మాటకు ఒప్పుకునేలా చేస్తున్నారు. ఏమైనా అంటే చస్తాం అంటున్నారు. ‘బంధువులందరి ముందు మేము ఈ పెళ్లి చేయలేం. అసలు నువ్వు చేసింది తప్పు అవన్నీ మర్చిపో’ అన్నారు. 3 నెలలు టైమ్ తీసుకున్నా. ఆఫీస్‌కి వెళ్లలేదు. ఇంట్లోనే ఉన్నా కానీ నో ఛేంజ్. నాకు వేరే లైఫ్ అంటే భయంగా ఉంది. మళ్లీ మా ఇంట్లో ఆ మాటే చెప్పాను. వేరే వాళ్లతో లైఫ్ అంటే నాకు డైజెస్ట్ అవట్లేదు అని. వాళ్లు చాలా సీరియస్ అయ్యారు.‘ ఇన్ని ఏళ్లు మేం నిన్ను పెంచాం. మా కోసం అంత కూడా చెయ్యవా? అంటున్నారు. ఊర్లో పరువు పోతుంది. మేం తల ఎత్తుకోలేం. దానికన్నా చావు బెటర్’ అంటున్నారు. ‘నువ్వు మేం చెప్పింది వింటాను, మారుతాను అంటే మేము బతుకుతాం. లేకపోతే లేదు’ అన్నారు. ఆ అబ్బాయి వాళ్ల ఇంట్లో వాళ్లు ‘ఆ అమ్మాయి వాళ్లింట్లో ఒప్పుకున్నప్పుడు చూద్దాం’ అన్నారట. వాళ్లు కూడా ‘వేరే క్యాస్ట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక మీరే ఆలోచించుకోండి’ అని చెప్పారట. మొన్న ఓ రోజు మా అమ్మ చచ్చిపోతానంది. అప్పుడు ఆమెను ఆపి ‘నేను ఇక ఎప్పుడూ ఆ టాపిక్ తీయను. మర్చిపోతా అని’ ప్రామిస్ చేశాను. ఆఫీస్‌కి వెళ్లడం స్టార్ట్ చేశాను. ఆఫీస్‌కెళ్తే ఆ అబ్బాయి కనిపిస్తాడు, కానీ ఇంట్లో ఉంటే నాకు ఇంకా ఎక్కువగా గుర్తొస్తున్నాడు. నేను మామూలు అవ్వాలి అని ఆఫీస్‌కి వెళదాం అనుకున్నాను. ఆ అబ్బాయి కూడా కెరీర్ స్పాయిల్ చేసుకున్నాడు. ఆఫీస్‌కి రావడం లేదు. ఆ అబ్బాయిని మర్చిపోతానని ఇంట్లో అయితే చెప్పాను. కానీ మరొకరిని జీవితంలోకి ఆహ్వానించే పరిస్థితిలో లేను. అక్టోబర్‌లో పెళ్లి చేస్తాం అంటున్నారు. నాకు ఇప్పుడే వద్దు అంటే వినట్లేదు. ‘ఇప్పటికే బంధువులందరూ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు అని అడుగుతున్నారు. మేం చేద్దాం అనుకునే సరికి నువ్వు ఇలాంటి పని చేశావు. మేమయితే అక్టోబర్‌లో చేసేస్తాం’ అన్నారు. కానీ నాకు ఆ మాట వింటుంటే కోపం వస్తోంది. పెళ్లి అంటే ఏడుపొస్తోంది. బాధ అనిపిస్తోంది. నచ్చట్లేదు. వేరే అతనితో లైఫ్‌ని స్టార్ట్ చేయాలి అని తలుచుకుంటేనే ఉండాలని లేదు. కానీ నాకు ఏ చాన్సూ లేదు. ప్లీజ్ ఏమైనా హెల్ప్ చేయండి. నేను త్వరగా ఆ అబ్బాయి ఆలోచన నుండి బయటకు రావాలి అండ్ పెళ్లి లైఫ్ అంటే ఇంట్రస్ట్ రావాలి. రిప్లై ప్లీజ్... – మానస మానసా! కులాల మధ్య పెళ్లిళ్లకు పెద్దలు వద్దనడానికి ఒక కారణం ఉంది. మీ ట్రెడిషన్స్ వాళ్ళ ట్రెడిషన్స్ ఒకలాగే ఉండవు. అమ్మాయి కష్టపడుతుందేమోనని. నువ్వెలాగూ అబ్బాయిని మరిచిపొయ్యి పెళ్లికి సిద్ధం కావాలని నిర్ణయించుకున్నావు. అలాంటప్పుడు తొందరపడవద్దని అమ్మానాన్నలకు ప్రేమగా అర్థమయ్యేలాగా చెప్పు. మానసికంగా పెళ్లికి రెడీగా లేనప్పుడు పెళ్లి చేస్తే వివాహబంధం గట్టిగా ఉండదని ఎక్స్ప్లెయిన్ చెయ్యి. నీ సంతోషాన్ని మించి నీ పేరెంట్స్‌కి వేరే ఆలోచనే ఉండదు, వాళ్ల భయం అంతా నువ్వు ఈ లోపు ఆ పిల్లోడిని చేసుకోవాలనుకుంటున్నావేమో అని అనుమానమే! ‘‘ఏంటి సార్ మీరు కూడా ఇవాళ్టి యూత్‌కి కులం బయట పెళ్లిళ్లు వద్దని చెబుతున్నారు. కులాంతర వివాహాలు ఉంటేనే కదా ఈ కుల గజ్జి ఖతం అయ్యేది సార్!?!’’ తొక్కలోపల అరటిపండు ఉండడం ఎంత నిజమో కులాంతర వివాహాల్లో కొత్త సమాజం ఇమిడి ఉందన్నది అంతే నిజం. కానీ మానస అమ్మానాన్నలను కూడా ప్రేమిస్తుంది. అందుకే వాళ్ల ఆలోచనను గౌరవిస్తోంది. ‘‘అరటిపండును కులాంతర వివాహాలతో భలే కలిపారు సార్ యూ డిజర్వ్ అరటిపండు’’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ అన్నయ్య! నేను రోజూ మీ లవ్ డాక్టర్ చదువుతాను. నాకు ఒక చిన్న హెల్ప్... మా సిస్టర్ ఒకరిని లవ్ చేస్తోంది. అతన్నే పెళ్లి చేసుకుంటా, లేదంటే చచ్చిపోతా అంటోంది. వాడేమో అమెజాన్‌లో డెలివరీ బాయ్. మా ఇంట్లో చెబితే ఒప్పుకోరు. వాడికి ఫ్యామిలీ ఏమీ లేదు సింగిల్. ఈ టైమ్‌లో మా పేరెంట్స్ మా అక్కకు సంబంధాలు చూస్తున్నారు. ఇంకా నలుగురు సిస్టర్స్ ఉన్నారు. అన్నయ్యా ఏం చేయమంటారు చెప్పండి. మా సిస్టర్ కూడా రోజూ లవ్ డాక్టర్ చదువుతుంది. – మహీపాల్ చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు చిన్నవాళ్లు కాదు. నా కళ్లల్లో్ల గొప్పవాళ్లు!చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు పెద్ద వాళ్లు కారని రూల్ కూడా లేదు!ఎవరు ఏమవుతారనేది దేవుడు నిర్ణయిస్తాడు. కష్టపడి పని చెయ్యడం గ్రేట్! అమెజాన్‌లో డెలివరీ పని అంటే చాలా కష్టమయిన పని! ఏ పని చెయ్యకుండా ఉంటే మన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఆలోచించాలి! గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్లు పెంట పనులు చెయ్యరనుకుంటున్నావా? ఎంచుకోవడానికి చిన్న, గొప్ప కాదన్నా.. మంచి చెడు చూడాలి! ఆల్ ది బెస్ట్! ‘సార్... చంపేశారు సార్! యూ ఆర్ మాస్... మ..మ..మ..మాస్స్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సార్, నేను టెన్త్ కంప్లీట్ చేశాను. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. తనకి నేనంటే చాలా ఇష్టం. తను హాస్టల్లో ఉండి చదువుకునేది. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుకునే వాళ్లం. ఒకరోజు తనని కలిసినప్పుడు తప్పు చేశాం. ఆ విషయం మా ఇద్దరి పేరెంట్స్‌కి తెలిసిపోయింది. తనని ఇంట్లో బాగా కొట్టారు. వాళ్ల డాడ్‌కి మా ఇద్దరి తరఫునా సారీ చెప్పాను. ఎంతో బతిమాలాను. బట్, పెళ్లికి నో అన్నారు. తను ఇప్పటికీ నన్ను లవ్ చేస్తూనే ఉంది. తనని దూరం చేసుకుని నేను బతకలేను. ఏదైనా సలహా చెప్పండి సార్!! – ఆనంద్ ఫిఫ్త్ క్లాస్‌లో ప్రేమించడం ఏంటి? టెంత్ క్లాస్‌లో తప్పు చేయడం ఏంటి? నీలాంబరి, నేను ఈ క్లినిక్ మూసేసి సన్యాసం పుచ్చుకుంటాను.హ్యాపీగా నువ్వే.. లవ్ డాక్టర్ అయిపో! ఇక నేను ఈ వేదన భరించలేను. ఐయామ్ బికమింగ్ యోగీ!! ‘సార్... అన్యాయం సార్! డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు తోక ముడుచుకొని పారిపోవడం!! అబ్బే, నాట్ గుడ్ సార్, కమాన్ సార్, బి స్పోర్టివ్!!’ ఇద్దరూ జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా.. బాగా చదువుకుని.. ప్రయోజకులు అయ్యి.. తల్లిదండ్రులను మెప్పించి.. పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. ‘ఈ ఆన్సర్ నేను కూడా చెప్పచ్చు... కొంచెం తిక్కగా మీ స్టైల్లో చెప్పండి సార్!’ నా మూట ముల్లె కట్టి ఇస్తే నా దారిన నేను పోతా..!! ‘ఓకే.. ఓకే.. సార్...! ఈసారికి తిక్క ఆన్సర్ ఇవ్వకపోయినా క్షమించేస్తా కానీ, రేపు సూపర్ తిక్క ఆన్సర్ ఇస్తేనే... అరటిపండు’ అని నవ్వింది నీలాంబరి! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను ఇంటర్ నుంచి మా క్లాస్మేట్ని ఇష్టపడుతున్నా. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఇంటర్లో ఆకర్షణ మాత్రమే అనుకున్నా. కానీ, ఇప్పుడు మేము డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. తను గుంటూరు వెళ్లిపోయాడు. నేను వైజాగ్‌లో ఉంటున్నా. అయినా అదే ప్రేమ, అనురాగంతో ఒకరిని ఒకరం చాలా ఇష్టపడుతున్నాం. మా ప్రేమ వల్ల మా స్టడీస్‌ను మేము ఎప్పుడూ నెగ్లెక్ట్ చెయ్యలేదు. మంచి జాబ్‌లో సెటిల్ అయ్యాక మా పేరెంట్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. కానీ మా నేపథ్యాలు వేరు. అంత చిన్న వయస్సులో కలిగేది నిజమైన ప్రేమే అంటారా? మేము మా పేరెంట్స్‌కి చెబితే వాళ్లు ఒప్పుకుంటారా? – దివ్య మమ్మీ డాడీకి నిన్ను మించిన ప్రపంచం లేదు! ఉండదు! నువ్వు సంతోషంగా ఉంటే అదే వాళ్లకు బెస్ట్ గిఫ్ట్. నన్ను ప్రేమించిన వ్యక్తి నేపథ్యం ఏదో తెలుసా? ‘‘ఎవరిని ప్రేమించారు సార్ చెప్పండి... చెప్పండి ప్లీజ్!’’ ముందు దివ్యకి ఆన్సర్ ఇచ్చి, ఆ తర్వాత నీకు చెబుతా! ‘‘లేదు సార్... నేను ఈ ఉత్కంఠ భరించలేను! రెండు అరటిపండ్లు ఇస్తా చెప్పండి... చెప్పండి.’’ నా లవ్ స్టోరీ మీద అంత ఇంట్రెస్ట్ వై..? అదర్స్ మేటర్స్లో ఇంత ఇంట్రెస్ట్ నాట్ గుడ్...! ‘‘అదర్స్ మేటర్స్... అంటారేంటి సార్..? నా లవ్ డాక్టర్ మేటర్ నాకు తెలియకపోతే హౌ..?’’ దివ్యకి చెప్పాక... నీకు చెబుతా... ‘‘దివ్య మేటర్ అదర్స్ మేటర్ కాదా సార్? అబ్బాయిల లవ్ మేటర్‌లో స్పెషల్‌గా వేలు పెట్టి... తిక్క తిక్క ఆన్సర్స్ ఇచ్చి వాళ్ల లవ్‌తో రోజూ ట్వంటీ ట్వంటీ ఆడుకుంటున్నారు. మీ ఆన్సర్లకు ఎంతగా ఫీల్ అయిపోతున్నారో తెలుసా? అయినా అందరికీ ఫ్రీగా చెబుతారు కదా సార్. నేను అరటిపండు ఇస్తానన్నా వై దిస్ వివక్ష..? ఐ డిమాండ్ ఎక్స్ప్లనేషన్!’’ నీకు దండం పెడ్తా, డజన్ అరటిపండ్ల హారం వేస్తా. దివ్యకి చెప్పి నీకు చెబుతా...! దివ్య బంగారం! నిన్ను ప్రేమించే అమ్మానాన్నలు అబ్బాయిలో చూసేది కులం, మతం, వర్ణం కాదు ‘ప్రేమ’, ‘మంచితనం’ ‘సంతోషం’. ఇక నీకు ఆన్సర్ చెప్పాలి కదా నీలూ! లవ్ డాక్టర్‌కి ఉత్తరం రాయి చెబుతా...!! ‘‘ఛీటింగ్ సార్! నో అరటిపండు ఫర్ యూ!!’’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నా పేరు డి. నా ఫ్రెండ్ పేరు కె. తను ప్రేమిస్తున్న అబ్బాయి పేరు ఎస్. వాళ్లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ల నేపథ్యాలు వేరు. మొదటి ఆరునెలలు బాగానే ఉన్నారు. తరువాత నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. కె ఎంబీఏ పూర్తి చేసింది. ఎస్ డిగ్రీ పూర్తి చేసి... ఫ్లవర్ షాప్‌లో పని చేస్తున్నాడు. కె లవ్ మేటర్ ఇంట్లో తెలిసిపోయింది. దాంతో తనని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంత జరిగినా ఎస్ నుంచి రియాక్షన్ లేదు. వాళ్ల ఇంట్లో ఒప్పించేందుకు ప్రయత్నం చెయ్యమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. కానీ కె మాత్రం ఎస్నే ఇష్టపడుతోంది. వద్దని ఎంత చెప్పినా వినడం లేదు. తన లైఫ్ ఏం అవుతుందో అని భయంగా ఉంది సార్! ప్లీజ్ ఏదైనా సలహా ఇవ్వండి. – దీపు ‘ఏ’ ‘‘ఏ ఫర్ ఆపిల్’’ కాదు ‘‘ఏ ఫర్ ఏంటి?’’ కరెక్ట్ ‘‘అంటే...’’ అంటే కాదు ఏంటి..? ‘‘ఏంటి సార్’’ ‘ఏ’ ఫర్ ఏంటి? ‘‘ఓహో అలాగా..!’’ ‘డి’ ఫర్? ‘‘డి ఫర్ డివోషన్’’ ఓహో ఫ్రెండ్ అంటే డివోషన్ అన్నమాట.. మరి ‘కె’ ఫర్? ‘‘కె ఫర్ కేరింగ్’’ కేరింగ్ ఇంగ్లీషులో ‘సి’ అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ‘‘మనం తెలుగు లవ్ డాక్టర్ కదా సార్ అందుకే ‘కె’ అంటే కేరింగ్ అన్న మాట’’ మరి ‘ఎస్’ ఫర్? ‘‘సచ్చినోడు!’’ ఏంటి నీలూ! అలా అనేశావు!! ‘మీకేం తెలుసు సార్ ‘కె’ పడుతున్న ఆవేదన’’ ‘ఎస్’ ఫీల్ అవుతాడేమో!? ‘‘యస్, యస్, యస్ ‘ఎస్’ ఫీల్ అవ్వాలి. మీరు అరటిపండు తిని సైలెంట్ అయిపోవాలి.’’ - ప్రియదర్శిని రామ్లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హలో సార్! నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను కూడా నన్ను లవ్ చేసింది. కానీ తనని వాళ్ల మామ ఇష్టపడుతున్నాడు. అతని వయస్సు 32. ఈ అమ్మాయి వయస్సు 20. నా వయస్సు 22. వాళ్ల అమ్మతో నేను మాట్లాడాను కానీ, ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ల ఫ్యామిలీలో 60% నాకు సపోర్ట్‌గానే ఉన్నారు. నా లవర్ వాళ్ల మామ వాళ్ల పేరెంట్స్‌కి మా ఇద్దరి లవ్ గురించి తెలుసు. తెలిసినా కూడా నా లవర్నే కోడలిగా కావాలంటున్నారట. పక్కవాళ్ల మాటలు విని ఇప్పుడు మా లవర్ వాళ్ల అమ్మ కూడా వాళ్ల పెళ్లికే సపోర్ట్ చేస్తుందట. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సలహా ఇవ్వండి. – ఉదయ్ ‘సార్ ఐ ప్యాడ్‌ని ఎటు తిప్పి చదివినా ఒక్క ముక్క అర్థం కాలేదు. ఐ ప్యాడ్‌ని స్ట్రైట్‌గా పెట్టి నేను శీర్షాసనం వేసి చదివినా ఫ్చ్... ∙సమర్ నహీ ఆయా!’ ఈ కథకి మళ్లీ ట్రాన్స్లేషన్ కూడానా? ‘చెప్పండి సార్ ప్లీజ్ చెప్పండి సార్!’ మామ కోడలికి ‘లైన్’ వేశాడు! మామ పేరెంట్స్‌కి కూడా అమ్మాయికి లవర్ ఉన్న విషయం తెలుసు.. అయినా అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడానికి రెడీ! అమ్మాయి అమ్మకు మనోడు తన ‘లైన్’ గురించి ‘లీక్’ ఇచ్చాడు! అమ్మాయి అమ్మ ‘లీక్’కు ఫెవికాల్ పెట్టేసింది! ఇప్పుడు మనోడికి గుండెలోంచి ‘లీక్’ మొదలయ్యింది! దానికి ఏమి పెట్టాలి అని అడుగుతున్నాడు! ‘ఏం పెడదాము సార్?’ మామ–కోడళ్ల పెళ్లి పుట్టబోయే పిల్లలకు మంచిది కాదు అన్న జ్ఞానం మామ పేరెంట్స్‌కి ‘లీక్’ చేస్తే.. మనోడి పెయిన్ ‘లీక్’ బంద్ అవుతుంది! ‘ఇంకా అరటి తొక్క రాసుకోమంటారేమో అని అనుకున్న... శభాష్ సర్!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నన్ను ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు. నాకోసం చనిపోడానికి కూడా రెడీ అన్నాడు. నాకు భయం వేసి... నువ్వు అంటే నాకు ఇష్టమే అని చెప్పాను. కానీ, అతడితో లైఫ్ పంచుకోలేకపోతున్నాను. ఇంతలో నాకు తెలియకుండానే మరో అబ్బాయికి నా మనసు ఇచ్చేశాను. అతడికి నేనంటే ప్రాణం. చెప్పండి సర్ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి. నేను ఎవరితో నా లైఫ్ షేర్ చేసుకోవాలి? – లావణ్య ‘సార్ ఇదేమయినా ఫేస్బుక్ పోస్టింగా?’ వాట్ ఆర్ యూ టాకింగ్? ‘లైక్ చెయ్యడం! షేర్ చెయ్యడం...! సార్’ ఫేస్బుక్ స్టైల్ అంటావు! ‘అవును సార్ ఇద్దరికీ కమిట్మెంట్ ఇచ్చి...’ ఒకడిని బతికించుకోవాలా? ఇంకొకడి ప్రేమను బతికించుకోవాలా? అన్నది ప్రాబ్లమ్! ఒకడిని ఐ.సి.యూలో ఎడ్మిట్ చేసి... ‘ఇంకొకడి ప్రేమలో మనం పడిపోయాం...’ నువ్వు చాలా షార్ప్ నీలు..! ‘అబ్బా! ఇంకోసారి అనండి సార్.’ మాటి మాటికీ చెబితే.. పడతావు పళ్లు రాలతాయి! ‘మీ చెల్లెలు ప్రేమలో పడితే ఓకే, నేను మాయలో పడితే రాలుతాయా? ఇదేమి న్యాయం సార్!’ చెల్లెళ్లకు ఏమి తెలియదు. మనం దగ్గర ఉండము. అందుకే జాగ్రత్తగా చెప్పాలి. ‘అవును సార్ యు ఆర్ ఎ స్వీట్ బ్రదర్.’ బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించిన తరువాత ప్రేమ గీమా చూద్దాం. ముందే కన్ఫ్యూజన్లో ఉన్నావు. టేక్ టైమ్ లావణ్య! ‘మరి ఐ.సి.యూ కేస్ సార్..!’ సెండ్ ఒన్ డజన్.... ‘అరటి పండ్లు’ అని నవ్వింది నీలాంబరి! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హలో సర్! అమ్మాయిలు... ఫ్రెండ్స్‌ని దూరంగా పెట్టి వన్ ఇయర్‌గా ఈ హైదరాబాద్‌లో బానే చదువుకుంటున్నా. అయితే సడన్‌గా ఓ అమ్మాయి నా లైఫ్‌లోకి వచ్చింది. తను మా సిస్టర్‌కి సీనియర్. ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. నీపై ఇంట్రెస్ట్ ఉండటం వల్లే మాట్లాడుతున్నా, ఇప్పటి దాకా ఎవరితోనూ ఇలా మాట్లాడలేదు అనేది. దాంతో నాకు దోమ కుట్టింది. తన గురించి తెలుసుకునే క్రమంలో తన కాల్ లిస్ట్ తీయిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. దాన్ని చూపించి... ‘ఏంటిది’ అని నిలదీస్తే... ‘నాకు లవర్ ఉన్నాడు నన్ను వదిలెయ్యి’ అని చెప్పింది. అసహ్యంతో మరిచిపోదాం... అంటే మరిచిపోలేకపోతున్నా. దయచేసి మంచి సలహా ఇవ్వండి. లేదంటే.. నేను ఏ అరటి చెట్టుకో ఉరి వేసుకోవాలి! – నరేష్ ఎందుకు లే అన్నా... నన్ను భయపెడతావు చెట్టు... ఉరి అని. పాపం అరటిచెట్టు ఏం పాపం చేసింది. దాన్నెందుకు నేల కూలుస్తావు!దోమ కుట్టిందంటే జ్వరం రాక మానదు. కుట్టిన తరువాత మందు వేసుకోవాలి కానీ.. ఇప్పుడు దోమతెరలో దూరితే ఏం దొరుకుద్ది?‘సార్... ఈ దోమతెర ఏంటి సార్?’b ప్రేమ విఫలమైతే దూరి ఏడవడానికి దోమతెర గుడ్ ప్లేస్! ‘అందరికీ కనబడుద్ది కదా సార్... ఏం లాభం?’ కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ కాల్స్ వల్ల గుండెకు పడ్డ చిల్లుల కంటే ఎక్కువ చిల్లులేమీ ఉండవులే దోమతెరలో..! ‘అబ్ క్యా కర్నా..?’లక్కీగా ప్రేమా దోమా వద్దనుకునే ఒరిజినల్ మనిషివి అవడానికి మంచి ఛాన్స్ వచ్చింది. పుటుక్కున పట్టేసుకుని, తపుక్కున ప్రేమ మీద నుంచి జంప్ కొట్టి కొత్త లైఫ్‌కి దోమతెర ఓపెన్ చేసుకో! ‘గబుక్కున నేను డజను అరటిపండ్లు పంపుతా సార్ మంచిగా చదువుకుని లవ్ డాక్టర్ అయిపోమని మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి’ అని నవ్వింది నీలాంబరి.బ్రో అసలు టెన్షన్ పడకు. బీ బ్రేవ్. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్‌తో ప్రాబ్లమ్ షేర్ చేసుకో. లైఫ్‌లో ప్రాబ్లమ్ వస్తేనే మనం స్ట్రాంగ్ అవుతాం. ‘అరటిపండు తింటే కూడా స్ట్రాంగ్ అవుతాం... నరేష్.. బీ హ్యాపీ’ అంది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను మీ అభిమానిని. నేను– ఒక అబ్బాయి 5 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. తరువాత వాళ్ల పేరెంట్స్ వచ్చి మాట్లాడి వెళ్లారు. ఏమైందో ఏమో! ఇప్పుడు తను పెళ్లి వద్దంటున్నాడు. 2 మంత్స్ నుంచి మాట్లాడడం లేదు. నేను మాత్రం మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. దయచేసి ఏదైనా సలహా ఇవ్వండి సర్. – రాణి వద్దన్నా కూడా కావాలనిపించేది ఏది?‘మామిడి పండు’నీ..లా..అంబా...రీ!‘మరి కాదా సార్... ఎక్కువ తింటున్నాం... షేప్ కొంచెం అవుట్ అవుతుంది. అద్దం నవ్వుతుంది. కుర్చీ కిర్ మంటుంది. చొక్కా బటన్ తడబడుతుంది. వద్దూ! వద్దూ! మామిడిపండు చాలించు! స్టాప్మామిడి పండు అని బాడీ ఎంత మొత్తుకున్నా మైండ్ కావాల్సిందే అని అడిగేది మామిడి పండు కాదా సార్?’నీది ఎమోషనో కమోషనో అర్థం చేసుకోవడం వెరీ డిఫికల్ట్ నీలాంబరీ!‘థ్యాంక్ యు సార్ మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేక పోతున్నారంటే... ఐ యామ్ సో ఇంటెలిజెంట్’వద్దన్నా కూడా కావాలనిపించేది ఏది?‘సరే సార్ మీ బాధ అర్థం అయ్యిందిలెండి సార్.’ఏంటో అది? వాట్ ఈజ్ దట్ బాధ? ‘మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా ఐ అండర్‌స్టాండ్ యు... వద్దన్నా కావాలనిపించేది మామిడి పండు కాదు.. అరటిపండు... ఆమ్ ఐ కరెక్ట్?’వద్దన్నా కావాలనిపించేది లవ్.. ఫ్యూర్ లవ్.. వాడి లవ్‌లో ఫ్యూరిటీ లేదు కాబట్టి వాడు గేమ్స్ ఆడుతున్నాడు. నీ లవ్ ఫ్యూర్ కాబట్టి వాడు వద్దన్నా నువ్వు కావాలనుకుంటున్నావు. వద్దు నాన్నా! మనకి అలాంటోడు వద్దే వద్దు! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను డిగ్రీ చదువుతున్నాను. రెండేళ్ల క్రితం మా సిస్టర్ పెళ్లికి ఒక కర్నాటక అమ్మాయి వచ్చింది. అప్పటి పరిచయంతోనే మేము మంచి స్నేహితులమయ్యాం. తనని కలవడానికి కర్నాటక కూడా వెళ్లాను. నా ఫ్రెండ్ ఒకడు ఆ అమ్మాయిని తాను లవ్ చేస్తున్నట్లు చెప్పాడు. దాంతో మా మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. కానీ... తరువాత తను కూడా నన్ను లవ్ చేసింది. అయితే కొన్ని రోజుల తరువాత ఎగ్జామ్స్ కారణంగా నేను తన ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. మెసేజ్‌లకు కూడా బదులివ్వలేదు. తన నాకోసం చాలా వెయిట్ చేసింది. కానీ తరువాత నా ఫోన్ మిస్ కావడం వల్ల... తనను కాంటాక్ట్ చెయ్యలేక పోయాను. అందుకే మా మధ్య 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఈ మధ్యే తన నెంబర్ దొరికింది. కాల్ చేస్తే చాలా హర్ట్ అయ్యింది. జరిగింది చెప్పినా నాపై కోపంగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో సలహా ఇవ్వండి. – మధు ఫోన్ పోయిందా? ‘పోయిందని చెబుతున్నాడు కదా సార్ ఎందుకు డౌట్?’ గేమ్స్ ఆడుతున్నాడు! ‘సిన్సియర్ కాదని ఎలా... ఎలా తెలుస్తుంది..?’ ప్రేమించే అమ్మాయిని అంతగా ఫాలో అయిన వాడికి... ఫోన్ నంబర్ గుర్తు ఉండదా? ప్రేమించేవాడు నిద్రలో ఉన్నా ఒక్క తన్ను తన్నితే అమ్మాయి నంబర్ టక్కున చెప్పేస్తాడు. ఫోన్ పోయిందట! అందుకే గ్యాప్ వచ్చిందట! గ్యాప్‌లో ఇంకో లవ్ స్టోరీ జరిగింది! అదీ అసలు కథ! ‘మీరు లవ్ డాక్టర్ కాదు సార్ లవ్ డిటెక్టివ్ సార్’ అని అరటిపండు ఇచ్చింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను ఒన్ ఇయర్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు డైరెక్ట్‌గా ప్రపోజ్ చెయ్యలేదు. వాళ్ల ఫ్రెండ్స్ ద్వారా చెప్పించా! తను ‘నో’ అంది. తనకి లవ్ అంటేనే ఇష్టం లేదట. దాంతో మరిచిపోదాం అనుకున్నా... కానీ, నా వల్ల కావడంలేదు. ప్లీజ్ సర్ సలహా ఇవ్వండి. నా పేరు రాయకండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్లు లవ్ డాక్టర్ చదువుతారు. – రాజు (పేరు మార్చాం) నీలాంబరీ! నీ పేరు ఏంటి?‘సార్ షుగర్ లెవెల్స్æతక్కువయ్యి మైండ్ బ్లాంక్ అయినట్టు ఉంది. ఒక అరటిపండు తినండి మళ్లీ మనిషిలాగా ఉంటారు!’అంటే ఇప్పుడు నేను మనిషిలాగా లేనా?‘సార్! మీరు మనిషి కాదు లవ్ డాక్టర్ సార్!’డాక్టరా పాడా ఊరికే కోతలు కొయ్యకు ఎవరయినా నవ్వి పోగలరు.‘మన సీక్రెట్లు మనం బయట పెట్టకూడదు సర్’నీలాంబరీ! నీ పేరేంటి?‘ఇదిగో అరటిపండు’ఇదిగో తెల్ల చీర... ట్యూన్లో పాడుతున్నావు. ‘వేరే ట్యూన్లో...’వద్దు నీ పేరేంటి నీలాంబరీ?‘ఏమైంది సార్? పేరు పెట్టి పిలిచి మరీ పేరు అడుగుతున్నారు?’ప్రేమిస్తున్నా అంటాడు... కానీ పేరు చెప్పొద్దంటున్నాడు. ఇంట్లో వాళ్లు లవ్ డాక్టర్ చదువుతారట. మనోడిని వాయిస్తారట!‘పాపం ముందు పేరు చెప్పుకునే ధైర్యం తెచ్చుకుంటే... ప్రేమిస్తున్నా అని చెప్పే ధైర్యం వస్తుంది సార్!’ ఓ డజను అరటిపండ్లు పంపు ధైర్యం వస్తుంది! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ అన్నయ్యా! నేను ఒకతన్ని ప్రాణంగా ప్రేమించా. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎప్పుడూ దూరం పెట్టలేదు. నాకు ఏ కష్టం వచ్చినా తను తోడుగా ఉండేవాడు. కానీ... ఈ మధ్య తను... కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. ఫోన్లో నాతో ఎలా ప్రేమగా మాట్లాడుతాడో... అలానే మరో అమ్మాయితో కూడా మాట్లాడుతున్నాడు. చాట్ చేస్తున్నాడు. ‘ఐ లవ్ యూ’ అని కూడా చెబుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను తనకి ఏం తక్కువ చేశానో అర్థం కావడం లేదు. అబ్బాయిలు ఇలా ఎందుకు ఉంటారు? ఏడుపొస్తోంది అన్నయ్యా! ఈ విషయం తనని అడగాలా వద్దా? అడిగితే నాతో మాట్లాడడేమో అని భయంగా ఉంది అన్నయ్యా! ప్లీజ్ సలహా ఇవ్వండి. – రమ్య టెన్షన్ పడకు తల్లీ! లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నథింగ్ టు వర్రీ. ఆ డర్టీ ఫెలో అంటేనే యాక్ అనిపిస్తోంది. బ్లడీ రాస్కెల్ గురించి వింటేనే ‘బువాక్’ అని వాంతి వస్తోంది. ఇంకా వాడి తోక పట్టుకుని తిరుగుతానంటావేంటి తల్లీ! సెకెండ్ అమ్మాయికి ఫోన్ చేసి... వీడు ఫస్ట్ హ్యాండ్ రోగ్ అని చెప్పెయ్. వీలయితే ఇద్దరూ కలిసి స్ట్రెయిట్‌గా వాయించేయండి. డోంట్ బి వీక్ చెల్లెమ్మా.. ఏసెయ్ కొడుకుని! ‘సార్ ఇవాళ్ల మీ యాక్కు... దొక్కు... బువాక్ మూడ్‌లో అరటిపండు దిగదు’ అని విలన్లా నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హలో సార్.. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా నాన్న తన అక్క కూతుర్ని(మా అమ్మను) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మేనరికం కావడంతో నాకు ఒక కాలు వంకరగా ఉంటుంది. బాగానే నడుస్తాను. బట్ ఇప్పుడు నా సమస్య ఏంటంటే.. మా అక్క కూతురు కూడా నన్ను లవ్ చేస్తోంది. నాకోసం చనిపోవడానికి కూడా సిద్ధమయ్యింది. అందుకే తన ప్రేమకు కరిగిపోయాను. మా పెద్దలు కూడా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాకు పుట్టబోయే పిల్లల గురించి భయమేస్తోంది. నా పిల్లలను బాధపెట్టలేను. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. – మణివర్ధన్ మేనరికం వద్దు. చాలా మంది చేసుకుంటారు. కొందరి సంతానానికి ఏమీ కాదు. కానీ కొంతమందికి నీలాగా అవుతుంది. ఇప్పుడు మరదలి కోసం తలొగ్గితే.. రేపు పిల్లలకు ఎలాంటి సమాధానం చెబుతావు..? నీకు పిల్లలు క్షేమంగానే పుట్టవచ్చు. కానీ, ఎప్పటికయినా నీ స్వార్థం కోసం మా లైఫ్‌తో అంత రిస్క్ తీసుకున్నావా అని నీ పిల్లలే అడిగితే నీ దగ్గర సమాధానం ఉండదు. నీ మరదలికి అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఆల్ రెడీ అలాగే ఆలోచిస్తున్నావు. బ్లెస్ యు. ‘అవును సార్. మణివర్ధన్ నిజంగా లవ్లీవర్ధన్.’ తనకే లైఫ్ ఒక ఛాలెంజ్ అయినా, తన మరదలి కోసం ఆలోచిస్తున్నాడు. హీ ఈజ్ ద ట్రూ లవర్ అండ్ ద గ్రేట్ మ్యాన్! ‘అరటిపండు లాంటి మనస్సు కదా సార్!’ అని నవ్వింది నీలాంబరి. ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను 5 ఇయర్స్ నుంచి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. తను 3 ఇయర్స్ బ్యాక్ అమెరికా వెళ్లిపోయాడు. అతని బాగోగులు తెలుసుకోవాలనే ఆశతో అతనికి ఎఫ్బి రిక్వెస్ట్ పెట్టాను. ‘ఒక అబ్బాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్.’ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనే భయంతో తన బర్త్‌డే రోజునే ప్రపోజ్ చేశాను. ‘ఐ లవ్ యూ’ అంటే ‘థ్యాంక్యూ’ అన్నాడు. నా ఎఫ్బీ పోస్ట్‌లకు లైక్ కూడా కొట్టడు. మిగిలిన అమ్మాయిల విషయంలో కామెంట్స్ పెడుతుంటాడు. వాళ్ల ఇంట్లో వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇంట్లో చెప్పి సంబంధాలు ఆపుదామా అంటే... ‘తను నిన్ను ఇష్టపడుతున్నాడా..?’ అనే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నా బ్రైనేమో... ‘రెస్పెక్ట్ ఇవ్వని వాడితో పెళ్లి ఎందుకు?’ అంటోంది. నా మనసేమో తనతో జీవితాన్ని కోరుకుంటోంది. వేరే వాళ్లని భర్తగా ఊహించుకోలేకపోతున్నాను. 3 ఇయర్స్ నుంచి ఇలానే బాధ పడుతున్నా. ప్లీజ్ సర్ మంచి సలహా ఇవ్వండి..? – మహాలక్ష్మి సారుకు గీర ఎక్కువ. మనం గ్రౌండ్ మీద ఉంటే సారు స్టార్లల్లో ఉన్నారు. మనది జొన్న రొట్టె అయితే... సారుది పిజ్జా స్టైల్. మనది షల్వార్ కమీజ్ అయితే... సారుది బికినీ కల్చర్. మనది ప్రేమ అయితే... సారుది టైమ్ పాస్. ‘మనది అరటిపండు అయితే... సారుది పైనాపిల్ పండు’ అని మాట కలిపింది నీలాంబరి. గౌరవం లేని చోట ప్రేమ బతకదు బంగారం. ప్రేమ లేని పెళ్లి బాధల కుండీ. ‘సార్ పాటలాగా ఉంది, నేనూ ఓ లైన్ తగిలిస్తా..’ ఓకే..! ‘లైఫ్‌లో లవ్ ఉంటే వైఫ్‌కి రెస్పెక్ట్. లేదంటే జిందగీ అన్‌హ్యాపీ బకెట్..!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ గురువుగారూ! మీకు నేను పెద్ద ఫ్యాన్నండీ. మా క్లాస్‌లో ఒక అమ్మాయి నాతో బాగా క్లోజ్‌గా ఉంటుంది. నాతో పాటు ఇతరులతో కూడా అలానే ఉంటోంది. నాకు బాగా కోపం వస్తోంది. తను ఎప్పుడూ నాతోనే మాట్లాడాలనిపిస్తుంటుంది. తను కాలేజ్‌కి రాకపోతే.. చాలా బాధగా ఉంటుంది. తన మెసేజ్ కోసం, ఫోన్ కోసం చాలా ఎగై్జట్‌మెంట్‌తో వెయిట్ చేస్తుంటాను. ‘తను నాకంటే టు ఇయర్స్ పెద్దది. మా కులాలు కూడా వేరు. అయినా.. నాకు ఎందుకు ఇలా అవుతుందో తెలీడంలేదు. అసలు ఇది ప్రేమా, ఆకర్షణా లేక ఇన్ఫ్యాక్చుయేషనా... దయచేసి చెప్పండి. నేను రిలాక్స్డ్గా నిద్రపోవడానికి మంచి సలహా ఇవ్వండి గురువు గారూ. – ప్రేమ్‌కుమార్ మంచం చుట్టూ 30 రౌండ్స్ క్లాక్ వైజ్‌గా తిరగండి. రెండు కాళ్లు త్రీ ఫీట్ ఎడంగా పెట్టి లెఫ్ట్ లెగ్ బొటనవేలిని... రైట్ హ్యాండ్ చిటికెనవేలితో టచ్ చెయ్యండి. మళ్లీ రైట్ లెగ్ బొటన వేలిని... లెఫ్ట్ హ్యాండ్ చిటికెన వేలితో 30 టైమ్స్ టచ్ చెయ్యండి. కాళ్లు అలాగే ఉంచి ఫుల్‌గా ముందుకు బెండ్ అయ్యి... నుదుటిని గ్రౌండ్‌కి టచ్ చెయ్యండి. వెంటనే హెడ్‌ను వెనక్కి తిప్పి సీలింగ్ ఫ్యాన్‌ను చూడండి. త్రీ అరటి పండ్లు తినండి. వెచ్చని పాలు ఒక గ్లాస్ తాగండి. మంచం మీద కూలబడండి. నిద్రలోకి జారుకుంటారు. ‘సార్! అన్యాయం సార్..! అబ్బాయిలు కష్టాలు చెప్పుకుంటే మీరు చీప్‌గా చూస్తున్నారు. అదే అమ్మాయి రాస్తే... తల్లీ, చెల్లీ, బంగారం... అని గారం చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. వెరీ బ్యాడ్ సర్..! పాపం సరిగ్గా చెప్పండి సార్ ప్లీజ్...!’ టెన్షన్ పడకు బ్రో నీది ప్రేమ కాదు... అమాయకంతో కూడిన... అట్రాక్షన్‌తో కూడిన... ఇన్ఫ్యాచ్యుయేషన్తో కూడిన... జెలసీ కలిసిన... భయం మాత్రమే. క్లోజ్‌గా మూవ్ అయితే వచ్చే ప్రాబ్లమ్... అంతే! డిస్టెన్స్ మెయిన్‌టెన్ చేస్తే ప్రేమలో కాలు వేసి పడే అవసరమే ఉండదు. ఆల్ ది బెస్ట్. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com