నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్!! నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. చెప్పకుండా ఉండటం సరికాదని దైర్యం చేసి చెప్పేశాను. త్రీఇయర్స్‌గా తన మాట కోసం వెయిట్ చేస్తున్నా. నాతో క్లోజ్‌గానే ఉంటాడు, బాగా మాట్లాడతాడు.. కానీ నేనంటే ఇష్టమని చెప్పడ్డంలేదు. నేను వెయిట్ చేస్తానని కూడా చెప్పాను తనకి. అయినా ఇంత వరకూ ఎలాంటి రిప్లై లేదు. అలా అని వేరే వాళ్లని పెళ్లి చేసుకోలేను. తన స్థానంలో ఎవరినీ ఊహించుకోలేను. మనసులో ఒకరిని పెట్టుకుని రేపు వచ్చే వ్యక్తిని మోసం చెయ్యలేను.
ఎందుకంటే ప్రేమ అనేది మానసికమైన సంబంధమని నేను నమ్ముతాను. గతాన్ని మరచిపోలేక, భవిష్యత్‌ను ఆహ్వానించలేక.. అనుక్షణం చస్తూ బతుకుతున్నాను. ఇప్పటికీ మేం మంచి స్నేహితుల గానే ఉన్నాం. నేను ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి అన్నయ్యా.. మరోసారి ధైర్యం చేసి అడగనా? – ఉష
ఏం చెయ్యగలుగుతాం బంగారం..? ‘ఏంటి సార్ క్వశ్చన్‌కి క్వశ్చన్ ఆన్సర్‌గా చెబుతున్నారు?’ అంటే..? ‘అంటే గింటే కాదు అక్కడ మీ చెల్లెలు లైఫ్‌లో టెన్షన్ భరించలేక రాస్తే క్వశ్చన్‌కి క్వశ్చన్ ఆన్సర్‌గా చెబుతారా?’ అంటే..? ‘అంటే ఏంటి సార్.. అంటే... అంటే... అని నసుగుతున్నారు?’ సరే నువ్వు చెప్పు!! ‘ఫొటో మీది పెడుతున్నారు సార్ ఆన్సర్ నేనెందుకు ఇవ్వాలి...? యూ ఓన్లీ టెల్..’నువ్వూ నేనూ చెప్పగలిగింది ఏమీ లేదు.. ఆ అబ్బాయే చెప్పాలి. ధైర్యంగా అడిగెయ్యాలి.
ఇప్పటికే ఒకసారి అడిగా, మరోసారి అడిగితే మనం చీప్ అయిపోతాం అని అనుకోవడం కంటే... అడిగి ఆ వలయంలో నుంచి బయటపడటం ఎంతో బెటర్! బీ కాన్ఫిడెంట్ అండ్ బీ షూర్ ఆల్‌వేస్! ‘అరటిపండు లాంటి ఆన్సర్ సార్.. క్వశ్చన్‌కి క్వశ్చన్ అన్సర్‌గా చెప్పేముందు... ముందే ఈ ఆన్సర్ చెప్పుంటే..!?’ మేడమ్! నీకో దండం పెడతా చెబుదామనే లోపలే రియాక్ట్ అవుతున్నావు... ఒక అరటిపండు ఇస్తే నేను తింటా... నువ్వు బ్రెయిన్ తిను..!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com