నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ఒన్ ఇయర్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు డైరెక్ట్‌గా ప్రపోజ్ చెయ్యలేదు. వాళ్ల ఫ్రెండ్స్ ద్వారా చెప్పించా! తను ‘నో’ అంది. తనకి లవ్ అంటేనే ఇష్టం లేదట. దాంతో మరిచిపోదాం అనుకున్నా... కానీ, నా వల్ల కావడంలేదు. ప్లీజ్ సర్ సలహా ఇవ్వండి. నా పేరు రాయకండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్లు లవ్ డాక్టర్ చదువుతారు.
– రాజు (పేరు మార్చాం)
నీలాంబరీ! నీ పేరు ఏంటి?‘సార్ షుగర్ లెవెల్స్æతక్కువయ్యి మైండ్ బ్లాంక్ అయినట్టు ఉంది. ఒక అరటిపండు తినండి మళ్లీ మనిషిలాగా ఉంటారు!’అంటే ఇప్పుడు నేను మనిషిలాగా లేనా?‘సార్! మీరు మనిషి కాదు లవ్ డాక్టర్ సార్!’డాక్టరా పాడా ఊరికే కోతలు కొయ్యకు ఎవరయినా నవ్వి పోగలరు.‘మన సీక్రెట్లు మనం బయట పెట్టకూడదు సర్’నీలాంబరీ! నీ పేరేంటి?‘ఇదిగో అరటిపండు’ఇదిగో తెల్ల చీర... ట్యూన్‌లో పాడుతున్నావు.
‘వేరే ట్యూన్‌లో...’వద్దు నీ పేరేంటి నీలాంబరీ?‘ఏమైంది సార్? పేరు పెట్టి పిలిచి మరీ పేరు అడుగుతున్నారు?’ప్రేమిస్తున్నా అంటాడు... కానీ పేరు చెప్పొద్దంటున్నాడు. ఇంట్లో వాళ్లు లవ్ డాక్టర్ చదువుతారట. మనోడిని వాయిస్తారట!‘పాపం ముందు పేరు చెప్పుకునే ధైర్యం తెచ్చుకుంటే... ప్రేమిస్తున్నా అని చెప్పే ధైర్యం వస్తుంది సార్!’ ఓ డజను అరటిపండ్లు పంపు ధైర్యం వస్తుంది!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com