నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సార్, నేను టెన్త్ కంప్లీట్ చేశాను. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. తనకి నేనంటే చాలా ఇష్టం. తను హాస్టల్‌లో ఉండి చదువుకునేది. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుకునే వాళ్లం. ఒకరోజు తనని కలిసినప్పుడు తప్పు చేశాం. ఆ విషయం మా ఇద్దరి పేరెంట్స్‌కి తెలిసిపోయింది. తనని ఇంట్లో బాగా కొట్టారు. వాళ్ల డాడ్‌కి మా ఇద్దరి తరఫునా సారీ చెప్పాను. ఎంతో బతిమాలాను. బట్, పెళ్లికి నో అన్నారు. తను ఇప్పటికీ నన్ను లవ్ చేస్తూనే ఉంది. తనని దూరం చేసుకుని నేను బతకలేను. ఏదైనా సలహా చెప్పండి సార్!!
– ఆనంద్
ఫిఫ్త్ క్లాస్‌లో ప్రేమించడం ఏంటి? టెంత్ క్లాస్‌లో తప్పు చేయడం ఏంటి? నీలాంబరి, నేను ఈ క్లినిక్ మూసేసి సన్యాసం పుచ్చుకుంటాను.హ్యాపీగా నువ్వే.. లవ్ డాక్టర్ అయిపో! ఇక నేను ఈ వేదన భరించలేను. ఐయామ్ బికమింగ్ యోగీ!! ‘సార్... అన్యాయం సార్! డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు తోక ముడుచుకొని పారిపోవడం!! అబ్బే, నాట్ గుడ్ సార్, కమాన్ సార్, బి స్పోర్టివ్!!’
ఇద్దరూ జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా.. బాగా చదువుకుని.. ప్రయోజకులు అయ్యి.. తల్లిదండ్రులను మెప్పించి.. పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. ‘ఈ ఆన్సర్ నేను కూడా చెప్పచ్చు... కొంచెం తిక్కగా మీ స్టైల్‌లో చెప్పండి సార్!’ నా మూట ముల్లె కట్టి ఇస్తే నా దారిన నేను పోతా..!! ‘ఓకే.. ఓకే.. సార్...! ఈసారికి తిక్క ఆన్సర్ ఇవ్వకపోయినా క్షమించేస్తా కానీ, రేపు సూపర్ తిక్క ఆన్సర్ ఇస్తేనే... అరటిపండు’ అని నవ్వింది నీలాంబరి!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com