నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నా పేరు డి. నా ఫ్రెండ్ పేరు కె. తను ప్రేమిస్తున్న అబ్బాయి పేరు ఎస్. వాళ్లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ల నేపథ్యాలు వేరు. మొదటి ఆరునెలలు బాగానే ఉన్నారు. తరువాత నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. కె ఎంబీఏ పూర్తి చేసింది. ఎస్ డిగ్రీ పూర్తి చేసి... ఫ్లవర్ షాప్‌లో పని చేస్తున్నాడు. కె లవ్ మేటర్ ఇంట్లో తెలిసిపోయింది. దాంతో తనని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంత జరిగినా ఎస్ నుంచి రియాక్షన్ లేదు. వాళ్ల ఇంట్లో ఒప్పించేందుకు ప్రయత్నం చెయ్యమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. కానీ కె మాత్రం ఎస్‌నే ఇష్టపడుతోంది. వద్దని ఎంత చెప్పినా వినడం లేదు. తన లైఫ్ ఏం అవుతుందో అని భయంగా ఉంది సార్! ప్లీజ్ ఏదైనా సలహా ఇవ్వండి.
– దీపు
‘ఏ’ ‘‘ఏ ఫర్ ఆపిల్’’ కాదు ‘‘ఏ ఫర్ ఏంటి?’’ కరెక్ట్ ‘‘అంటే...’’ అంటే కాదు ఏంటి..? ‘‘ఏంటి సార్’’ ‘ఏ’ ఫర్ ఏంటి? ‘‘ఓహో అలాగా..!’’ ‘డి’ ఫర్? ‘‘డి ఫర్ డివోషన్’’ ఓహో ఫ్రెండ్ అంటే డివోషన్ అన్నమాట.. మరి ‘కె’ ఫర్? ‘‘కె ఫర్ కేరింగ్’’ కేరింగ్ ఇంగ్లీషులో ‘సి’ అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ‘‘మనం తెలుగు లవ్ డాక్టర్ కదా సార్ అందుకే ‘కె’ అంటే కేరింగ్ అన్న మాట’’ మరి ‘ఎస్’ ఫర్? ‘‘సచ్చినోడు!’’
ఏంటి నీలూ! అలా అనేశావు!! ‘మీకేం తెలుసు సార్ ‘కె’ పడుతున్న ఆవేదన’’ ‘ఎస్’ ఫీల్ అవుతాడేమో!? ‘‘యస్, యస్, యస్ ‘ఎస్’ ఫీల్ అవ్వాలి. మీరు అరటిపండు తిని సైలెంట్ అయిపోవాలి.’’
- ప్రియదర్శిని రామ్‌లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com