
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్, నేను ఐదేళ్లుగా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా.
లవ్ డాక్టర్
హాయ్ సర్, నేను ఐదేళ్లుగా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. తను ప్రపోజ్ చేస్తేనే నేను లవ్ చేశాను. ఒక్క రోజు కూడా నాతో ప్రేమగా మాట్లాడడు. కారణం అడిగితే నా ప్రేమ కనబడదు అంటాడు. వేరే అమ్మాయిలకు ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వడు. నా ఫోన్ లిఫ్ట్ చెయ్యడానికి కూడా ఇష్టపడడు. కొన్ని నెలలు నుంచి నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. తను అంటే నాకు ఇష్టం. మరి నన్ను పట్టించుకోని తనను పెళ్లి చేసుకొని నేను హ్యాపీగా ఉండగలనా? సలహా ఇవ్వండి. – రమ్య
వాడితో పెళ్లా..? నీకు దండం పెడతా. వద్దే వద్దు. గౌరవం లేని చోట లైఫ్ చాలా పెయిన్‌ఫుల్ తల్లీ.. డోంట్ బీ సిల్లీ! అసలు వాడి ఊసే వద్దు. ప్లీజ్! మరిచిపో. ఆట ఆడేసుకుంటాడు నీ లైఫ్‌తో కీప్ అవే! పెళ్లి చేసుకోక ముందే అలా బిహేవ్ చేశాడంటే.. ఆ తరువాత కేర్ చెయ్యడు. నువ్వు కుమిలిపోతావు, వాడు ఎంజాయ్ చేస్తాడు. డు... ర్గు.. ర్మా... దు ‘ఏంటి సార్.. ఈ తల తిక్క తిట్లు అర్థం కావడం లేదు..’ బెటర్ నాట్ టు అండర్‌స్టాండ్.
‘మరి రమ్యకు ఎలా అర్థం కావాలి సార్’ ఎమోషన్ అర్థం అయితే చాలు తిట్లు వాడికి అర్థం అయితే చాలు. ‘తనకు ఎలా అర్థం అవుతుంది సార్’ వాడికి తలతిక్క కదా వాడికి సమజ్ మే ఆతా.. ‘అవును సార్ వాడు గీడు అంటున్నారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని బ్రహ్మానందం గారు చెబుతారు కదా సార్’ కరెక్ట్ ‘వా..డు..’ అనకూడదు సరే ‘డు.. వా..’ అంటా.‘సార్... ఐ అండ్ డు.. వా.. అండ్ డు.. పం.. టి.. ర.. అ.. ఆర్ హర్టెడ్’ అని నవ్వింది నీలు.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com