నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హలో సార్.. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా నాన్న తన అక్క కూతుర్ని(మా అమ్మను) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మేనరికం కావడంతో నాకు ఒక కాలు వంకరగా ఉంటుంది. బాగానే నడుస్తాను. బట్ ఇప్పుడు నా సమస్య ఏంటంటే.. మా అక్క కూతురు కూడా నన్ను లవ్ చేస్తోంది. నాకోసం చనిపోవడానికి కూడా సిద్ధమయ్యింది. అందుకే తన ప్రేమకు కరిగిపోయాను. మా పెద్దలు కూడా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాకు పుట్టబోయే పిల్లల గురించి భయమేస్తోంది. నా పిల్లలను బాధపెట్టలేను. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. – మణివర్ధన్
మేనరికం వద్దు. చాలా మంది చేసుకుంటారు. కొందరి సంతానానికి ఏమీ కాదు. కానీ కొంతమందికి నీలాగా అవుతుంది. ఇప్పుడు మరదలి కోసం తలొగ్గితే.. రేపు పిల్లలకు ఎలాంటి సమాధానం చెబుతావు..? నీకు పిల్లలు క్షేమంగానే పుట్టవచ్చు. కానీ, ఎప్పటికయినా నీ స్వార్థం కోసం మా లైఫ్‌తో అంత రిస్క్ తీసుకున్నావా అని నీ పిల్లలే అడిగితే నీ దగ్గర సమాధానం ఉండదు.
నీ మరదలికి అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఆల్ రెడీ అలాగే ఆలోచిస్తున్నావు. బ్లెస్ యు. ‘అవును సార్. మణివర్ధన్ నిజంగా లవ్లీవర్ధన్.’ తనకే లైఫ్ ఒక ఛాలెంజ్ అయినా, తన మరదలి కోసం ఆలోచిస్తున్నాడు. హీ ఈజ్ ద ట్రూ లవర్ అండ్ ద గ్రేట్ మ్యాన్! ‘అరటిపండు లాంటి మనస్సు కదా సార్!’ అని నవ్వింది నీలాంబరి.
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com