
నన్నడగొద్దు ప్లీజ్
‘చచ్చారు సార్’ అంతేనంటావా..? ‘చూపులోనే అన్నీ అయిపోయాయి’ మరి నేనేమి చెయ్యాలి.?
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా! నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తోంది. తనని చూడకుండా నేను ఉండలేను. నన్ను చూడకుండా తను కూడా ఉండలేదు. ఇంత వరకూ తనతో మాట్లాడింది లేదు. మాట్లాడితే ఎక్కడ నన్ను రిజెక్ట్ చేస్తుందో అని చాలా భయంగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు. – అభి
‘చచ్చారు సార్’ అంతేనంటావా..? ‘చూపులోనే అన్నీ అయిపోయాయి’ మరి నేనేమి చెయ్యాలి.? ‘కంటి చూపుతో ఆన్సర్ ఇచ్చేయండి..’
అదెలా సాధ్యం.? ‘సార్ మీ కంటి పవర్ మీకు తెలియదు’ నాకు మునగకాయలంటే నచ్చవు. ఐ యామ్ ఏ బనానా గయ్. అనవసరంగా మునగ చెట్టు ఎక్కించకు... చూపులో పవర్ ఉందంటూ..! ‘నిజం సార్, కొంచెం ఏజ్ వచ్చింది కానీ రేంజ్ మారలేదు’. ఇప్పుడు ఏం చెయ్యాలి..? ‘మీరు మిస్టర్ అభి లాగ కళ్లతో సైగలు చెయ్యండి. నేను ఆన్సర్ రాస్తా’ ఆర్ యు రెడీ..? కమాన్ స్టార్ట్. నా కళ్ల స్పీడ్‌ను అందుకో చూద్దాం. డియర్ అభీ! డూడ్ ఏంటి నీ పంతం..? ఇలా అయితే లవ్ స్టోరీ అవుతుంది అంతం. అమ్మాయిని చేసుకోవాలంటే సొంతం... మాట్లాడాలి కొంతం...
‘సార్ ఈ కొంతం ఏంటి సార్ అలాంటి వర్డ్ లేదు... అయినా మీ ఫ్లోని ఆపాను. ఎగరెయ్యండి కళ్లు.. కమాన్ కంటిన్యూ..’
డియర్ అభీ డూడ్... ఏంటి నీ పంతం..? ఇలా అయితే లవ్ స్టోరీ అవుతుంది అంతం. అమ్మాయిని చేసుకోవాలంటే సొంతం.. మాట్లాడాలి కొంతం.. ‘ఏంటి సార్ మళ్లీ రిపీట్ చేస్తున్నారు..?’ నువ్వు మధ్యలో మాట్లాడితే నీలాంబరి, నేను డిస్టర్బ్ అవుతున్నా.. అందుకే స్టార్టింగ్ నుంచి.... డియర్ అభీ డూడ్ ఏంటి నీ పంతం..? ఇలా అయితే లవ్ స్టోరీ అవుతుంది అంతం. అమ్మాయిని చేసుకోవాలంటే సొంతం.. మాట్లాడాలి కొంతం.. ‘సార్ మీరు ఆలా కళ్లతో మాట్లాడుతుంటే నేను డిస్టర్బ్ అవుతున్నా..’ అర్థమయ్యిందా మిస్టర్ అభీ! సైటు కొట్టడం ఆపి... టైపు కొట్టడం మొదలు పెట్టు. పోస్టుపోన్ చెయ్యకు. మేటర్ పోస్ట్ చెయ్యి. ‘సార్.. ఈ కళ్ల భాష చాలా డేంజర్ సార్. చూపంతా ఏదోలా అయిపోయింది. ఒక్కో అరటిపండు నాలుగు నాలుగుగా కనపడుతున్నాయి.’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com