నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను మీ అభిమానిని. నేను– ఒక అబ్బాయి 5 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. తరువాత వాళ్ల పేరెంట్స్ వచ్చి మాట్లాడి వెళ్లారు. ఏమైందో ఏమో! ఇప్పుడు తను పెళ్లి వద్దంటున్నాడు. 2 మంత్స్ నుంచి మాట్లాడడం లేదు. నేను మాత్రం మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. దయచేసి ఏదైనా సలహా ఇవ్వండి సర్.
– రాణి
వద్దన్నా కూడా కావాలనిపించేది ఏది?‘మామిడి పండు’నీ..లా..అంబా...రీ!‘మరి కాదా సార్... ఎక్కువ తింటున్నాం... షేప్ కొంచెం అవుట్ అవుతుంది. అద్దం నవ్వుతుంది. కుర్చీ కిర్ మంటుంది. చొక్కా బటన్ తడబడుతుంది. వద్దూ! వద్దూ! మామిడిపండు చాలించు! స్టాప్‌మామిడి పండు అని బాడీ ఎంత మొత్తుకున్నా మైండ్ కావాల్సిందే అని అడిగేది మామిడి పండు కాదా సార్?’నీది ఎమోషనో కమోషనో అర్థం చేసుకోవడం వెరీ డిఫికల్ట్ నీలాంబరీ!‘థ్యాంక్ యు సార్ మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేక పోతున్నారంటే... ఐ యామ్ సో ఇంటెలిజెంట్’వద్దన్నా కూడా కావాలనిపించేది ఏది?‘సరే సార్ మీ బాధ అర్థం అయ్యిందిలెండి సార్.’ఏంటో అది? వాట్ ఈజ్ దట్ బాధ?
‘మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా ఐ అండర్‌స్టాండ్ యు... వద్దన్నా కావాలనిపించేది మామిడి పండు కాదు.. అరటిపండు... ఆమ్ ఐ కరెక్ట్?’వద్దన్నా కావాలనిపించేది లవ్.. ఫ్యూర్ లవ్.. వాడి లవ్‌లో ఫ్యూరిటీ లేదు కాబట్టి వాడు గేమ్స్ ఆడుతున్నాడు. నీ లవ్ ఫ్యూర్ కాబట్టి వాడు వద్దన్నా నువ్వు కావాలనుకుంటున్నావు. వద్దు నాన్నా! మనకి అలాంటోడు వద్దే వద్దు!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com