నన్నడగొద్దు ప్లీజ్‌ | Love Doctor Returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Apr 13 2017 11:39 PM | Updated on Sep 5 2017 8:41 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ రామ్‌ అన్నయ్యా! మాది హైదరాబాద్‌. నేను వర్క్‌ చేసే ఆఫీస్‌లో నా జూనియర్‌ కొలీగ్‌ నన్ను ప్రపోజ్‌ చేశాడు.

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

హాయ్‌ రామ్‌ అన్నయ్యా! మాది హైదరాబాద్‌. నేను వర్క్‌ చేసే ఆఫీస్‌లో నా జూనియర్‌ కొలీగ్‌ నన్ను ప్రపోజ్‌ చేశాడు. నేను యాక్సెప్ట్‌ చేయలేదు. రెండు మూడు నెలలు రోజూ పొద్దునే నాకు గుడ్‌మార్నింగ్‌ అంటూ విషెస్‌ చెప్పేవాడు. నేను రెస్పాండ్‌ అయ్యేదాన్ని కాదు. తర్వాత నేను మెస్సేజ్‌ చెయ్యడం స్టార్ట్‌ చేశాను. సో... అలా అలా మీట్‌ అయ్యాం. తను నన్ను మ్యారేజ్‌ చేసుకుంటాను అని చెప్తే.. నేను తనకి నా బయోడేటా అంతా చెప్పాను. నేను తనకంటే రెండేళ్లు పెద్దదాన్ని. అతను ఓకే అన్నాడు. ‘అయితే వెళ్లి ముందు మీ అమ్మతో మాట్లాడు. తను ఒకే అంటే చూద్దాం’ అన్నాను. వాళ్ల మదర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నెక్ట్స్‌ మా మధ్య కొన్ని గొడవలు వచ్చాయి. రిలేషన్‌ బ్రేకప్‌ అయింది. నేను కాల్స్‌ చేసినా, మెసేజెస్‌ పెట్టినా అతను రెస్పాండ్‌ అవలేదు. సిక్స్‌ మంత్స్‌ గ్యాప్‌ వచ్చింది. ఎగైన్‌ రీసెంట్‌గా వన్‌మంత్‌ బ్యాక్‌ తను నన్ను కాంటాక్ట్‌ అయ్యాడు. ‘నీతో మాట్లాడ్డానికి నేనెంత ట్రై చేసినా నన్ను ఇగ్నోర్‌ చేశావ్‌. మళ్లీ ఎందుకు వచ్చావ్‌?’ అని అడిగితే ‘సారీ’ అంటూ ఏవో కహానీలు చెప్పాడు.  మళ్లీ రిలేషన్‌షిప్‌ కంటిన్యూ చేశాం.

స్టార్టింగ్‌లో వాళ్ల మదర్‌ మా పెళ్లికి ఓకే అంది. ఎప్పుడైతే మా రిలేషన్‌ బ్రేకప్‌ అయిందో అప్పటి నుంచి వాళ్ల మదర్‌కి నా మీద బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడిపోయింది. రీసెంట్‌గా వాళ్ల మదర్‌తో మా రిలేషన్‌షిప్‌ గురించి చెప్పాడంట. వాళ్ల అమ్మ.. ‘నో లవ్‌.. నథింగ్‌! నోర్మూసుకొని పనిచేసుకో. నీకు ఆ అమ్మాయే కావాలంటే ఇంట్లో నుంచి వెళ్లిపో’ అంటూ వార్నింగ్‌ ఇచ్చిందట. ఈ విషయం చెప్పినప్పటి నుంచి తనతో మాట్లాడట్లేదంట. ‘ఇంక నాకు మెస్సేజ్‌లు, కాల్స్‌ చేయకు. మీ అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకో’ అని చెప్పాను. ఫస్ట్‌టైమ్‌ ట్రస్ట్‌ చేస్తే చీట్‌ చేశాడు. సెకండ్‌టైమ్‌ కూడా తనంటే ఉన్న ఇష్టంతో ఎగైన్‌ ట్రస్ట్‌ చేశాను. మళ్లీ చీట్‌ చేశాడు. ఇప్పుడు చెప్పండి అన్నయ్యా.. దీనికి సొల్యూషన్‌ ఏంటి? – సిరి స్వాతి

ఏముంది నాన్నా.. చెప్పడానికి? డుగామ వాళ్ల బుద్ధే అంత! వాళ్ళ నేచర్‌ అంతే! నమ్మినంతసేపు వాడుకుంటారు. ఆ తర్వాత కుదరదని నమ్మిస్తారు. ప్రేమించినప్పుడు అమ్మను అడిగి ప్రేమించాడా డర్టీఫెలో!? పెళ్లికొచ్చేసరికి మమ్మీ.. మమ్మీ అని ఏడుస్తాడా బ్లడీ కవర్డ్‌?
బీ స్ట్రాంగ్‌.. వాడి ఊసు వాష్‌బేసిన్‌లో యాక్‌ థూ... అని ఊసెయ్‌. గాయం మానాలంటే నీ సెల్ఫ్‌వర్త్‌ పెంచుకో! సెల్ఫ్‌రెస్పెక్ట్‌తో బాధకు మందు రాయి! కెరీర్‌ మీద కాన్‌సన్‌ట్రేట్‌ చెయ్యి బంగారం! ‘ఒక్కోసారి మీ మీద విపరీతంగా గౌరవంతో కూడిన ప్రేమ కలుగుతుంది సర్‌.. ఐస్‌క్రీమ్‌లో ముంచిన అరటిపండులా!’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement