
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్... మీకు ఒక అబ్బాయి... ‘టెన్త్ క్లాస్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా’ అని చెప్పాడు కదా.
లవ్ డాక్టర్ రీవిజిట్
హాయ్ సర్... మీకు ఒక అబ్బాయి... ‘టెన్త్ క్లాస్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా’ అని చెప్పాడు కదా. ఆ అబ్బాయి (భరత్ కుమార్) ఆ అమ్మాయిని లవ్ చేస్తుంటే నేను ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నా. సార్... నాకు భరత్ అంటే చాలా ఇష్టం. తాను ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. బట్, ఆ అమ్మాయి బ్యాడ్ లక్. అతణ్ణి మిస్ చేసుకుంది. కానీ నేను ఆ అమ్మాయిలాగా అతణ్ణి మిస్ చేసుకోవాలనుకోవడం లేదు. తను రెస్పెక్టబుల్ పర్సన్.
బట్ తనకు ప్రపోజ్ చేస్తే ‘నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు బాధలో ఉన్నా. నీ లవ్‌ని యాక్సెప్ట్ చేస్తే నేను తనని మోసం చేసిన వాడినవుతా...’ అని అంటున్నాడు. బట్ తను ఒప్పుకుంటే నా ఫ్యామిలీని ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది. తను లేకుండా నాకు లైఫ్ లేదు. తనను ఎలా ఒప్పించాలో, అసలు ఏమి చేయాలో నాకు ఆన్సర్ చెప్పండి. తనను ఒకరోజు చూడకపోయినా తట్టుకోలేను. మీ చెల్లెలనుకుని చెప్పండి సర్. నీలాంబరి అని కాకుండా నాకు, నా లైఫ్‌కి ఆన్సర్ చెప్పండి. – సృజన
రూమ్‌లో కాలు పెట్టగానే ఆల్మోస్ట్ జారి కింద పడబోయాను. రూమంతా అరటి తొక్కలే. రూమ్ చివరిలో నీలాంబరి. చాలా జాగ్రత్తగా తొక్కల మీద కాలు పెట్టకుండా నీలాంబరి దగ్గరకు చేరాను. ‘వాట్ ఈజ్ దిస్ తొక్క వెల్కమ్?’ అని అడిగా... ‘ఈ ప్రశ్న రాసింది అమ్మాయి అనుకుంటున్నారా?’ అని చేతిలో ఐ–పాడ్ పెట్టింది. ‘సృజన అమ్మాయి పేరు కాదా?’ ‘పేరు అమ్మాయిదే. మేటర్ అబ్బాయిది’ ‘హౌ..?’
‘పోకిరీ సార్. అప్పుడు రాస్తే తిట్టారని మళ్లీ సింపతీ కోసం చీర కట్టుకుని రాశాడు’ ‘తొక్కలా ఉంది నీ డిటెక్టివ్ పని’ ‘రూమ్‌లో తొక్కలు దాటినంత ఈజీ కాదు సర్, బీ కేర్‌ఫుల్!’ అని హెచ్చరించింది.
డియర్ సృజనా... నీలాంబరి నువ్వే భరత్ అంటోంది. ఒకవేళ అదే నిజం అయితే భరత్ లవ్ మటాష్ అయిపోవాలని శపిస్తోంది. నీలాంబరి శాపమయినా, శపథమైనా అన్‌స్టాపబుల్. కానీ నేననుకున్నట్టు నువ్వు సృజన అయ్యుంటే – వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి నో థ్యాంక్యూ చెప్పింది. వాడు తెగ ఫీలయిపోతున్నాడు. వాడి కోసం నువ్వు ఫీలయిపోతున్నావు. నీకు ఉన్నది సింపతీనే లవ్ కాదు. ఎంత తొందరగా ఈ ఫీలింగ్ నుంచి బయట పడతావో నీకు అంత మంచిది. అలాంటి డిప్రెషన్ క్యాండేట్‌తో గీక్కుంటే మనకూ డిప్రెషన్ దురద పట్టుకుంటుంది. టేక్ కేర్.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌డాక్టర్,సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com