
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! నాకొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. తను గత సంవత్సరం నాకు ప్రపోజ్ చేశాడు.
లవ్ డాక్టర్
హాయ్ సర్! నాకొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. తను గత సంవత్సరం నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఒప్పుకోలేదు. కారణం మా పేరెంట్స్‌కి ఇలాంటివి ఇష్టం ఉండదు. వాళ్లకంటే ఎవరూ ఎక్కువ కాదు నాకు. కొన్ని రోజులు తరువాత తను మళ్ళీ కలిశాడు. మామూలుగా మాట్లాడాడు. ఈ విషయం ఇంకెప్పుడూ తీసుకురానన్నాడు. అయితే ఈ మధ్య తరచూ ‘ఐ మిస్ యు’ అంటూ తేడాగా మాట్లాడుతున్నాడు. దాంతో తనని బ్లాక్ చేశాను. కొద్ది రోజుల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ గుర్తుకొచ్చి బాగా డిస్ట్రబ్ అవుతున్నాను. ప్లీజ్ సార్ మరిచిపోవడానికి ఏదైనా మందుంటే చెప్పండి. – అనగ
‘మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు సార్..’ బెస్ట్ ఎనిమీ కదా..? ‘ఎందుకు సార్ అరటిపండు పెట్టే వాళ్లపై మీకు పగ..?’ మరి బెస్ట్ ఫ్రెండ్ కాదన్నావు? ‘లైఫ్‌లో కాంప్లికేషన్ ఉండకూడదు సార్’ బెస్ట్ ఫ్రెండ్‌తో కాంప్లికేషన్ ఏముంది? ‘చాలా ఉంది సార్’ కొంచెం అర్థమయ్యేలా చెప్పు నీలూ..! ‘నన్ను నీలూ అని పిలవకండి సార్... టెన్షన్ వచ్చేస్తోంది.’ సరే చెప్పు అంబరీ..! ‘ఈ తోక పేరు అస్సలు బాగోలేదు’
నీకు దండం పెడతా చెప్పు..!
‘ఏమీ చెప్పాలి..!?! మరిచిపోయాను.’ మరిచిపోయావా..? ‘మీరు ప్రేమగా నీలూ..! అంబరీ..! అని పిలుస్తుంటే... డైవర్ట్ అయిపోయా.’
బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు కాకూడదు అన్నది క్వశ్ఛన్..? ‘మనసులో ఏదో పెట్టుకుని ఫ్రెండ్స్‌లా ఉండాలంటే ప్రాణం పోతుంది సార్.’ ఫ్రెండ్ ఫ్రెండే. లవర్ లవరే. అన్న క్లారిటీ ఉంటే కాంఫ్లికేషన్ ఏముంటుంది? ‘చెప్పడం ఈజీ సార్ మీకు హార్ట్ లేదు. ఇక అమ్మాయి కష్టం ఎలా తెలుస్తుంది..?’ నిజమే హార్ట్ కాంప్లికేటెడ్, బ్యూటిఫుల్ కూడా. అందుకే, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ‘అబ్బో మీకు హార్ట్ ఉన్నట్టుంది సార్..!’ తల్లీ ‘అనగా’... టేక్ ఇట్ ఈజీ. హార్ట్ పనే డాన్స్ చెయ్యడం. కాసేపు హార్ట్‌లో కూడా బ్లాక్ చెయ్యి. అంతా సెట్ అయిపోతుంది. ‘సార్! అరటిపండు సెట్ చేయండి’ అని నీలు... అంబరి నవ్వింది.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com