నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ఇంటర్ నుంచి మా క్లాస్‌మేట్‌ని ఇష్టపడుతున్నా. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఇంటర్‌లో ఆకర్షణ మాత్రమే అనుకున్నా. కానీ, ఇప్పుడు మేము డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. తను గుంటూరు వెళ్లిపోయాడు. నేను వైజాగ్‌లో ఉంటున్నా. అయినా అదే ప్రేమ, అనురాగంతో ఒకరిని ఒకరం చాలా ఇష్టపడుతున్నాం. మా ప్రేమ వల్ల మా స్టడీస్‌ను మేము ఎప్పుడూ నెగ్లెక్ట్ చెయ్యలేదు. మంచి జాబ్‌లో సెటిల్ అయ్యాక మా పేరెంట్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. కానీ మా నేపథ్యాలు వేరు. అంత చిన్న వయస్సులో కలిగేది నిజమైన ప్రేమే అంటారా? మేము మా పేరెంట్స్‌కి చెబితే వాళ్లు ఒప్పుకుంటారా? – దివ్య
మమ్మీ డాడీకి నిన్ను మించిన ప్రపంచం లేదు! ఉండదు! నువ్వు సంతోషంగా ఉంటే అదే వాళ్లకు బెస్ట్ గిఫ్ట్. నన్ను ప్రేమించిన వ్యక్తి నేపథ్యం ఏదో తెలుసా? ‘‘ఎవరిని ప్రేమించారు సార్ చెప్పండి... చెప్పండి ప్లీజ్!’’ ముందు దివ్యకి ఆన్సర్ ఇచ్చి, ఆ తర్వాత నీకు చెబుతా! ‘‘లేదు సార్... నేను ఈ ఉత్కంఠ భరించలేను! రెండు అరటిపండ్లు ఇస్తా చెప్పండి... చెప్పండి.’’ నా లవ్ స్టోరీ మీద అంత ఇంట్రెస్ట్ వై..? అదర్స్ మేటర్స్‌లో ఇంత ఇంట్రెస్ట్ నాట్ గుడ్...!
‘‘అదర్స్ మేటర్స్... అంటారేంటి సార్..? నా లవ్ డాక్టర్ మేటర్ నాకు తెలియకపోతే హౌ..?’’ దివ్యకి చెప్పాక... నీకు చెబుతా... ‘‘దివ్య మేటర్ అదర్స్ మేటర్ కాదా సార్? అబ్బాయిల లవ్ మేటర్లో స్పెషల్‌గా వేలు పెట్టి... తిక్క తిక్క ఆన్సర్స్ ఇచ్చి వాళ్ల లవ్‌తో రోజూ ట్వంటీ ట్వంటీ ఆడుకుంటున్నారు. మీ ఆన్సర్లకు ఎంతగా ఫీల్ అయిపోతున్నారో తెలుసా? అయినా అందరికీ ఫ్రీగా చెబుతారు కదా సార్. నేను అరటిపండు ఇస్తానన్నా వై దిస్ వివక్ష..? ఐ డిమాండ్ ఎక్స్‌ప్లనేషన్!’’ నీకు దండం పెడ్తా, డజన్ అరటిపండ్ల హారం వేస్తా. దివ్యకి చెప్పి నీకు చెబుతా...! దివ్య బంగారం! నిన్ను ప్రేమించే అమ్మానాన్నలు అబ్బాయిలో చూసేది కులం, మతం, వర్ణం కాదు ‘ప్రేమ’, ‘మంచితనం’ ‘సంతోషం’. ఇక నీకు ఆన్సర్ చెప్పాలి కదా నీలూ! లవ్ డాక్టర్‌కి ఉత్తరం రాయి చెబుతా...!! ‘‘ఛీటింగ్ సార్! నో అరటిపండు ఫర్ యూ!!’’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com