అచ్చుత్తమం
ఆరు గజాలు... అర ఇటో అర అటో.కట్టుకుంటే ఆహా...రే. ఏ నేత అయినా వాహ్వా...రే. నేత సరే... మిషన్ రంగంలోకి దిగితే... వేలాది డిజైన్లను ప్రింట్ చేస్తే? అదిరే... కన్ను చెదిరే... ప్రింటున్న చీర కట్టుకుంటే పోస్టరే!ఊదా రంగు క్రేప్ శారీ మీద మోడ్రన్ ఆర్ట్‌ను తీర్చిన భావనను తెస్తోంది ఈ డిజిటల్ ప్రింట్. క్యాజువల్ వేర్‌గానూ ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడుతుంది.సంప్రదాయపు జిలుగుల రంగులకు డిజిటల్ వేగం కలిస్తే వచ్చే సొగసుఈ హాఫ్ అండ్ హాఫ్ శారీ సొంతం. పసుపు, ఎరుపు కాంబినేషన్ ఫ్యాబ్రిక్ జత చేసి, క్రీమ్ కలర్ పల్లూ భాగం మీద పువ్వుల డిజిటల్ ప్రింట్లు వేయడంతో సింగారం రెట్టింపు అయ్యింది.
క్రీమ్, మస్టర్డ్ కలర్ కాంబినేషన్ చీర మీద చతురస్రాకారపుప్రింట్లు ఆధునికతను చాటుతున్నాయి.ఎరుపు, నలుపు క్రేప్ శారీ మీద వేసిన డిజిటల్ ప్రింట్లతో వచ్చినఅందం వేడుకలలోవైవిధ్యాన్ని చూపుతుంది. స్టైలిష్‌గానూ, మోడ్రన్‌గా ఉండే ఈ డిజిటల్ డిజైన్స్ ఎంపికలోనే ఉంది కొత్తదనం.
ఆర్గానిక్ లినెన్ మల్టీ కలర్ శారీ మీ వినూత్నంగా డిజైన్ చేసిన డిజిటల్ ప్రింట్లు చూపులను కట్టడి చేస్తున్నాయి.కళాకారుడు తన భావాలను అందమైన క్యాన్వాస్ మీదఆవిష్కరించినట్టు డిజిటల్ ప్రింట్లు చీర మీద కొత్త సింగారాలు పోతున్నాయి.