modern
-
మండే ఎండల్లో.. మీరు మెచ్చే, మీకు నప్పే దుస్తులు (ఫొటోలు)
-
పాల్ ల్యాబ్స్ తో ఆధునిక విద్యాబోధన
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాల్ ల్యాబ్స్‌కు శ్రీకారం చుట్టినట్లు పాల్ ల్యాబ్స్ రాష్ట్ర నోడల్ అధికారి విజయభాస్కర్ పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ (పాల్) కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు గుంటూరులోని ఏసీ కళాశాల వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఓరియెంటేషన్ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా నోడల్ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాల్ ల్యాబ్స్ మంజూరు చేసిన 60 పాఠశాలల పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో పాటు గణిత, సైన్స్ ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల మేధస్సుకు మరింత పదును పెట్టాలని చెప్పారు. రాష్ట్ర సమన్వయకర్త కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ పాల్ కార్యక్రమ ఉద్దేశం, ప్రధానోపాధ్యాయుల బాధ్యతలను వివరించారు. -
వేణువుకు నిర్దిష్ట రూపం ఇచ్చిందెవరు? పాశ్చాత్య సంగీతానికీ అనువుగా మలచినదెవరు?
పన్నాలాల్ ఘోష్.. ఆధునిక వేణుగాన పితామహునిగా పేరొందారు. వేణువును అటు జానపద వాయిద్యాలకు, ఇటు శాస్త్రీయ వాయిద్యాలకు సరితూగేలా మలచారు. పన్నాలాల్ ఘోష్ కృషి కారణంగానే నేటి ఫ్యూజన్ సంగీతంలో వేణువుకు ప్రముఖ స్థానం దక్కింది. పన్నాలాల్ ఘోష్ అనేక సినిమాలకు వాయిద్య సహకారాన్ని కూడా అందించారు. పన్నాలాల్ ఘోష్ బంగ్లాదేశ్‌లోని బరిసాల్‌లో జన్మించారు. అతని అసలు పేరు అమల్ జ్యోతి ఘోష్. అతని తాత హరి కుమార్ ఘోష్, తండ్రి అక్షయ్ కుమార్ ఘోష్ నిష్ణాతులైన సంగీత విద్వాంసులు. పన్నాలాల్ ఘోష్ తల్లి సుకుమారి ప్రముఖ గాయని. పన్నాలాల్ ఘోష్ ప్రారంభ విద్య ప్రసిద్ధ సితార్ వాద్యకారుడైన అతని తండ్రి అక్షయ్ కుమార్ ఘోష్ ఆధ్వర్యంలో మొదలయ్యింది. పన్నాలాల్ ఘోష్ సితార్ వాయించడం ద్వారా తన సంగీత విద్యను ప్రారంభించారు. తరువాతి కాలంలో పన్నాలాల్ ఘోష్ వేణువు వైపు ఆకర్షితులయ్యారు. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ దగ్గర వేణువు పాఠాలు నేర్చుకున్నారు. ప్రఖ్యాత హార్మోనియం వాద్యకారుడు ఉస్తాద్ ఖుషీ మహమ్మద్ ఖాన్ వద్ద రెండేళ్లపాటు సంగీత శిక్షణ తీసుకున్నారు. పన్నాలాల్ ఘోష్ ఆ కాలంలోని గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్, కాజీ నజ్రుల్ ఇస్లాంలకు అమితంగా ప్రభావితులయ్యారు. ఆ సమయంలో పన్నాలాల్ ఘోష్ స్వాతంత్ర్య ఉద్యమానికి సహకరించడమే కాకుండా, బెంగాల్ సమకాలీన సంగీతం, కవిత్వంలో పునరుజ్జీవానికి కూడా విశేష కృషి చేశారు. పన్నాలాల్ ఘోష్ వేణువును అటు జానపద సంగీతం నుండి ఇటు శాస్త్రీయ సంగీతం వరకు వాయించడానికి అనువుగా ఉండేలా సవరించారు. వేణువు పొడవు, పరిమాణం (7 రంధ్రాలతో 32 అంగుళాలు) నిర్థిష్ట రీతిలో ఉండేలా తీర్చిదిద్దారు. ఆయన అనేక కొత్త రాగాలను స్వరపరిచారు. పన్నాలాల్ ఘోష్ శిష్యులలో హరిప్రసాద్ చౌరాసియా, అమీనూర్ రెహమాన్, ఫకీరచంద్ర సామంత్, సుధాంశు చౌదరి, పండిట్ రాష్‌బెహారీ దేశాయ్, బి.జి.కర్నాడ్, చంద్రకాంత్ జోషి, మోహన్ నాద్కర్ణి, నిరంజన్ హల్దీపూర్ తదితరులు ఉన్నారు. అతను తన సంగీత ప్రతిభను మరింత ముందుకు తీసుకెళ్లడానికి 1940లో ముంబైకి చేరుకున్నారు. ముందుగా ‘స్నేహ బంధన్’ (1940) చిత్రానికి స్వర్తకర్తగా వ్యవహరించారు. పన్నాలాల్ ఘోష్ 1952లో ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్‌లతో కలిసి ‘ఆంధియాన్’ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్‌ను రూపొందించారు. ఏడు రంధ్రాల వేణువును పన్నాలాల్ ఘోష్ తొలిసారిగా పరిచయం చేశాడు. ఈ కొత్త రంధ్రాన్ని మధ్య రంధ్రం అని పిలుస్తారు. చిటికెన వేలు ఈ రంధ్రంలోకి చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఇదేవిధంగా పన్నాలాల్ ఘోష్ 42 అంగుళాల పొడవున్న కేవలం నాలుగు రంధ్రాలతో కూడిన మరో వెదురు వేణువును కనిపెట్టాడు. ఈ వేణువు భారతీయ ఫ్లూట్ పాశ్చాత్య సంగీతాన్ని కూడా ప్లే చేయగలుగుతుంది.పన్నాలాల్ ఘోష్ రూపొందించిన పొడవాటి వెదురు వేణువును హిందుస్థానీ శాస్త్రీయ సంగీతకారులు వాయిస్తుంటారు. ఇది కూడా చదవండి: ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఏది? ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది? -
మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్లు యూజర్ల ఏటాను చోరీ చేస్తున్నాయా? అంటే నివేదికలు అవుననే అంటున్నాయి. మోడ్రన్ టాప్ బ్రాండ్స్ కార్లలో డేటా ప్రైవసీ అనేది పీడకలే అంటూ కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ తన తాజా పరిశోధనలో వెల్లడించింది. దాదాపు 25 కార్ బ్రాండ్లను సమీక్షించింది. ఆ సందర్బంగా సెక్స్ లైఫ్ నుంచి ఇష్టా ఇష్టాలు, పాలిటిక్స్ గగుర్పాటు కలిగించే ఇతర విషయాలు అన్నీ లీక్ అవుతున్నాయంటూ సంచలన అధ్యయన నివేదికను ప్రకటించింది. (గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్ ) మొజిల్లా ఫౌండేషన్ నిర్వహించిన వినియోగదారు గోప్యతా పరీక్షల్లో అవన్నీ విఫలమయ్యాయని తేలింది. పరిశోధనలో 84శాతం కార్ కంపెనీలు కారు యజమానుల నుండి సేకరించిన డేటాను సమీక్షించాయి, పంచుకుంటాయి లేదా విక్రయించాయి అని వెల్లడించింది. డ్రైవింగ్ డిజిటల్‌గా మారుతున్న యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, విక్రయించడంపై ఆందోళన వ్యక్తం చేసిన మొజిల్లా అసలు తమ పరిశోధనలోని కంపెనీలేవీ గోప్యతపై దాని ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరచలేదని తెలిపింది. సెక్స్ టాయ్‌లు ,మానసిక ఆరోగ్య యాప్‌ల తయారీదారులతో సహా ఇంత పేలవమైన సమీక్ష రాలేదని తెలిపింది. కార్ల తయారీదారులు తమ కార్లను 'కంప్యూటర్ ఆన్ వీల్స్' అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అంతా డొల్ల అని ప్రైపసీ ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌కు ప్రసిద్ధి చెందిన మొజిల్లా రిపోర్ట్ చేసింది. "ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే డోర్‌బెల్‌లు, గడియారాలు తమపై గూఢచర్యం చేస్తున్నాయని ఆందోళన నేపథ్యంలో కార్ బ్రాండ్లు కూడా తమ వాహనాలను డేటా-గాబ్లింగ్ మెషీన్లుగా మార్చడం ద్వారా నిశ్శబ్దంగా డేటా వ్యాపారంలోకి ప్రవేశించాయని మొజిల్లా పేర్కొంది. అధ్యయనం ప్రకారం టెస్లా టాప్‌లో ఉందంటూ మరో బాంబు పేల్చింది.నిస్సాన్ రెండో స్థానంలో నిలిచింది. నిస్సాన్ సేకరించే డేటాలో “లైంగిక కార్యకలాపాలు” ఎక్కువగానూ, అలాగే కియా కంపెనీ ప్రైవసీ సిస్టం ప్రకారం, జాతి, మతపరమైన లేదా తాత్విక విశ్వాసాలు, లైంగిక ధోరణి, లైంగిక జీవితం, రాజకీయ అభిప్రాయాలతోపాటు "ట్రేడ్ యూనియన్ సభ్యత్వం" సమాచారంతో సహా "ప్రత్యేక వర్గాల" డేటాను ప్రాసెస్ చేయవచ్చని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!) 84 శాతం బ్రాండ్స్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు , ఇతర బహిర్గతం చేయని వ్యాపారాలతో పంచుకున్నట్లు అంగీకరించినట్లు అధ్యయనం తెలిపింది. ఎక్కువమంది, 76 శాతం కస్టమర్ల డేటాను విక్రయించినట్లు చెప్పడం గమనార్హం. సగం కంటే ఎక్కువమంది డేటాను షేర్ చేస్తున్నట్టు చెప్పారు. కనెక్టెడ్ వాహనాలు డ్రైవింగ్ డేటామాత్రమే కాకుండా, వాహనంలోని వినోదం, శాటిలైట్ రేడియో మ్యాప్ లాంటి థర్డ్-పార్టీ ఫంక్షన్లను ట్రాక్ చేస్తున్నాయట. అత్యధిక సంఖ్యలో కార్ బ్రాండ్లు, 92 శాతం, కేవలం ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్, Dacia బ్రాండ్‌తో వినియోగదారులకు వారి వ్యక్తిగత డేటాపై ఎటువంటి నియంత్రణ లేకుండా అందిస్తోంది. బహుశా యూరోపియన్ యూనియన్ చట్టానికి లోబడి డేటా డిలిట్ రైట్ను వినియోగదారులకు అనుమతించి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. కనీస భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్నుటికీ ఫోర్డ్, చేవ్రొలెట్, టయోటా, వోక్స్వ్యాగన్ , BMW వంటి కార్ల బ్రాండ్లు ఏవీ కూడా గత మూడేళ్లుగా 68 శాతం డేటా లీక్‌లు, హ్యాక్‌లు లేదా ఉల్లంఘన బారిన పడుతున్నాయని మొజిల్లా ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్టడీపై టాప్ కంపెనీలేవీ ఇంకా ఎలాంటి స్పందన ప్రకటించలేదు. (రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?) కాగా ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్లు, భద్రత, డేటా నియంత్రణ, ఏఐ కి సంబంధించిన అన్ని రివ్యూల్లో ఫెయిల్ అనే విమర్శలను ఎదుర్కొంది. కస్టమర్ల కార్లలోని కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు,ఫోటోలు ను ఉద్యోగులు పంచుకోవడం దుమారాన్ని రేపింది. అయితే 2021లో, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా చైనా సైనిక మిలిటరీకి ఈ వాహనాలను నిషేధించిన తర్వాత చైనాలో కెమెరాలు నిలిపివేసినట్టు టెస్లా ప్రకటించింది. -
కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్ కోడ్‌గా మారింది!..ఆ విధంబెట్టిదనినా..
కట్టు..బొట్టు తీరు.. ఇదివరకైతే కేవలం సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం! తర్వాత వ్యక్తిగత అభిరుచికి అద్దమైంది! అటు తర్వాత సమయ సందర్భాలకు సూచిక అయింది! ఇప్పుడు.. పార్టీలు.. ప్రత్యేక వేడుకలు.. అంతెందుకు సరదా కాలక్షేపాలలో ఆయా సందర్భాలకు తగ్గట్టుగా ఈ కట్టు.. బొట్టు.. తీరు మార్చుకుంది! సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తూ! దాన్నే మోడర్న్‌గా ‘డ్రెస్ కోడ్’ అంటున్నారు! పలు రంగుల్లో.. భిన్నమైన డిజైన్లలో.. క్లాస్‌గా.. మాస్‌గా.. ఫన్‌గా.. వియర్డ్‌గా.. ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా.. కనిపిస్తోంది! ఒకరకంగా ఇది.. దాన్ని ఫాలో అవుతున్న వాళ్ల అడ్రెస్ కోడ్‌గా మారింది!! ఆ విధంబెట్టిదనినా.. బార్బీ మూవీ ఫ్యాషన్.. మరిస్సా స్మిత్ అతి పెద్ద బార్బీ అభిమాని. గత సంవత్సరం బార్బీ సినిమా ట్రైలర్ విడదలైనప్పటి నుంచి ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను మొత్తం బార్బీ ట్రెండ్ తోనే నింపేసింది. అచ్చం బార్బీలాగే రెడీ అయి వీడియోలు చేసింది. బార్బీ చిత్రం విడుదలైనప్పుడైతే అచ్చం బార్బీలాగే వెళ్లి ‘పింక్ ఫ్యాషన్ చాలెంజ్’ విసిరింది. అలా బార్బీ అభిమానులు మొత్తం ఆ సినిమాకు పింక్ డ్రెస్ కోడ్‌లోనే వెళ్లి చూశారు. కొంతమంది ఆ చాలెంజ్ ఏమిటో తెలియకుండానే పింక్ డ్రెస్‌లో వెళ్లి చూశారు. ఇప్పుడు ఈ ట్రెండ్ మన దేశంలోనూ కొనసాగుతోంది. దశాబ్దాల నాటి బొమ్మ పట్ల ప్రజలు తమ ఇష్టాన్ని వ్యకం చేసే విధానాల్లో ఈ పింక్ ఫ్యాషనూ ఒకటైంది! ఇది ఎంతలా ట్రెండ్ అయిందంటే పలు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా బార్బీ అభిమానుల కోసం స్పెషల్ డిజైన్స్‌ను, ఆఫర్స్‌ను ప్రకటించేంతగా! ఇదే తరహాలో.. ఆ తర్వాత విడుదలైన ‘ఓపన్ హైమర్’ సినిమాకూ చాలా మంది బ్లాక్ డ్రెస్ కోడ్‌లో వెళ్లారు. దెయ్యాల డ్రెస్ కోడ్.. హాలోవీన్.. ఈ పండగ పేరు చెప్పగానే అరివీర భయంకరమైన వేషాధారణ గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ గ్లోబలైజేషన్లో భాగంగా మన దేశంలోకీ ప్రవేశించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత హాలోవీన్ థీమ్ పార్టీల్లో పాల్గొంటూ.. ఎంజాయ్ చేస్తోంది. నిజానికి ఈ ‘హాలోవీన్ డే’ రెండువేల సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. ప్రాచీనకాలంలో పేగన్లు (మధ్యయుగం నాటి ఓ మతానికి చెందినవారు) సమ్ హెయిన్’ అనే పండగను జరుపుకునేవాళ్లట. అదే ఈ హాలోవీన్ పండగకు ప్రేరణ అని చరిత్రకారులు చెబుతారు. పేగన్ల సంవత్సరం అక్టోబర్‌తో పూర్తయ్యేది. అక్టోబర్ మాసం ఆఖరి రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ వేడుకలు జరిగేవి. అయితే అప్పట్లో మొదలైన ఓ నమ్మకం వింత ఆచారాలకు తెరతీసింది. కొత్త సంవత్సరాది సందర్భంగా అంతకుముందు చనిపోయిన పెద్దల ఆత్మలన్నీ భూమిపైకి తిరిగి వస్తాయని పేగన్లు నమ్మేవారు. ఆరోజు రాత్రి భూమికి, ఆత్మలు నివసించే ప్రపంచానికి మధ్యలో ఉండే తలుపు తెరుచుకుంటుందని, ఆత్మలు తమ బంధువులను చూసి వెళ్లడానికి భూమిపైకి వస్తాయని నమ్మేవారు. వాటికి భయపడి అవి తమ జోలికి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఆత్మలు తమ పొలాలపై పడి వాటిని నాశనం చేయకుండా వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేసి ఆరుబయట పెట్టేవారు. నిప్పు అంటే ఆత్మలు భయపడతాయని ఇంటికి దగ్గరగా మంటలు వేసేవారు. ఆత్మలు తమ వద్దకు రాకుండా ఉండేందుకు తెల్ల దుస్తులు వేసుకొని ముఖానికి నల్లని రంగు పూసుకునేవారు. అలా మొదలైన ఆ నమ్మకం తర్వాత సంప్రదాయంగా.. పదహారో శతాబ్దానికి ఓ పండగగా మారిపోయింది. పెళ్లి డ్రెస్ కోడ్ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. ఆ పెళ్లి వేడుకను పదికాలాల పాటు గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. ఖర్చుకు వెనుకాడకుండా ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ పెళ్లిళ్లలోనూ డ్రెస్ కోడ్ మొదలైంది. మెహందీ, హల్దీ, పెళ్లి కూతురు ఫంక్షన్, సంగీత్, పెళ్లి. ఇలా ఒక్కో వేడుకకు పెళ్ళికూతురు, పెళ్లి కొడుకుతో పాటు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, ఆత్మీయులు కూడా డ్రెస్ కోడ్‌లో కనిపిస్తున్నారు. అంతేకాదు మతాలకనుగుణంగా ఆయా పెళ్లిళ్లలో ఆయా సంప్రదాయాల రీతిలో దుస్తులు ధరిస్తున్నారు. ఉదాహరణకు క్రిస్టియన్లలో వధూవరులు తెల్ల గౌన్, బ్లాక్ సూట్ వేసుకుంటే, హిందువుల్లో వధూవరులు పసుపు చీర, తెల్ల పంచెలు ధరించడం! ఇలా మతాలు, పద్ధతులే కాకుండా పలు ప్రాంతాల్లోని ఆచారవ్యవహారాలూ ఆ డ్రెస్ కోడ్‌లో భాగమవుతున్నాయి. పెళ్లి ఆపేస్తున్నారు.. చైనాలో వివాహ వేడుకకు సంబంధించి ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గతంలో పెళ్లి కోసం రిజిస్ట్రారు ఆఫీస్‌కి.. తమ ఇష్టానుసారమైన వస్త్రధారణతో వచ్చేవారట. దీంతో ఆ క్రమశిక్షణ రాహిత్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం.. ఓ డ్రెస్ కోడ్‌ను ప్రవేశ పెట్టింది. పెళ్లి చేసుకోవడానికి రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వచ్చే దంపతులు సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించాలి. లేనిపక్షంలో మ్యారేజ్ సర్టిఫికెట్ మంజూరు కాదు. కనీసం పెళ్లిరోజు అయినా దేశ సంప్రదాయాలను కాపాడాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. ఓనం చీర.. దక్షిణాదిన ఘనంగా జరుపుకునే పండగల్లో కేరళకు చెందిన ఓనం ఒకటి. ఆ పండగనాడు మిగిలిన ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా, బంగారు అంచుతో కూడిన తెల్లటి కాటన్ లేదా సిల్క్ చీరను కట్టుకుంటారు మలయాళ మహిళలు. ఆ చీరను కసవ్ అంటారు. ఇప్పుడు ఈ కట్టూ బొట్టూ ఓనం రోజున ఒక్క కేరళకే కాకుండా దేశమంతటికీ కోడ్‌గా మారింది. తమిళనాడులో అయితే కళాశాలలు, కార్యాలయాల్లోని విద్యార్థులు, ఉద్యోగినులు ఓనం చీరలను ధరించి తరగతులకు, విధులకు హాజరవుతున్నారు. అయితే కరోనా తర్వాత ఓనం చీర కోడ్ కేరళలో ఒకరకంగా యూనిఫామ్‌గా మారిందని చెప్పవచ్చు. కరోనా లాక్‌డౌన్‌తో అక్కడ నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. వాళ్లను ఈ కష్టం నుంచి గట్టెక్కించడానికి ‘సేవ్ ది లూమ్’ సంస్థ ఆ రాష్ట్ర మహిళా న్యాయవాదుల కోసం ఓనం చీరలనే మోనోక్రోమ్ చీరలుగా మార్చేసింది. ఇంకో అడుగు ముందుకు వేసి ప్రత్యేక కాలర్ గల జాకెట్, ఫార్మల్ గౌన్నూ నేయించింది! ఈ డిజైన్‌ను ‘విధి’ అంటున్నారు. ఇప్పుడది అక్కడ చాలా ఫేమస్. బ్లాక్ అండ్ వైట్.. నలుపు, తెలుపు.. న్యాయవాద వృత్తికి చిహ్నం.. ప్రపంచవ్యాప్తంగా! ప్రతి రంగుకున్నట్టే దీనికీ కొన్ని సానుకూల, ప్రతికూల అర్థాలున్నాయి. ఒక వైపు విషాదం.. నిరసనను సూచిస్తూనే ఇంకో వైపు బలం.. అధికారాన్నీ సూచిస్తుంది. న్యాయవాద వృత్తికి నలుపు రంగునే ఎంచుకోవడానికి మరో కారణం.. అప్పట్లో రంగులు అంతగా అందుబాటులో లేవు. విస్తారమైన ఫాబ్రిక్ నలుపు రంగులో మాత్రమే ఉండేది. అలాగే న్యాయవాది డ్రెస్‌లోని ఇంకో రంగు తెలుపు.. కాంతిని, స్వచ్ఛతను, మంచితనాన్ని సూచిస్తుంది. వాది, ప్రతివాది రెండు పక్షాల న్యాయవాదులు ఒకే విధమైన డ్రెస్ కోడ్‌ను ధరిస్తారు. స్కూల్ యూనిఫాం స్టోరీ.. 16 వ శతాబ్దంలో యూకేలో యూనిఫామ్‌లు ప్రారంభమయ్యేంత వరకు అవి పాఠశాల క్రమశిక్షణలో భాగం కాదు. పిల్లలు తమకు నచ్చిన దుస్తులను ధరించి బడికి వెళ్లేవారు. 16వ శతాబ్దంలో మెజారిటీ పాఠశాలలు స్వచ్ఛంద పాఠశాలలు. మెజారిటీ విద్యార్థులు వెనుకబడినవారే. కాబట్టి నాటి స్వచ్ఛంద సంస్థలు ఒకే రంగు, ఒకే డిజైన్ కుట్టిన దుస్తులను విరాళంగా ఇచ్చేవి. ఇవే యూనిఫామ్ పుట్టుకకు నాంది అయ్యాయి. అలా నాటి నుంచి చాలా బడులు తమ విద్యార్థులు అందరికీ డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేశాయి. ఈ యూనిఫామ్‌లు పిల్లల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యత్యాసాలకు చెల్లుచీటీ పాడి బడిలో పిల్లలంతా సమానమనే భావనను పెంచాయి. క్రమశిక్షణలో భాగం చేశాయి. చాలా దేశాలు విద్యార్థుల డ్రెస్ కోడ్ అయిన ఈ యూనిఫామ్‌ను అమోదించినప్పటికీ, యూనిఫామ్ అనే ఆ పదానికి అభ్యంతరం చెబుతున్న దేశాలూ ఉన్నాయి. అలాంటి దేశాలు యూనిఫామ్‌ను సున్నితంగా ‘స్కూల్ డ్రెస్’ అంటున్నాయి. మన దేశంలో ముంబైలోని కొన్ని పాఠశాలల్లో బ్లేజర్లు, ప్యాంటు, స్కర్టులు లేదా ట్యూనిక్స్, బూట్లు, సాక్స్‌లు వాళ్ల యూనిఫామ్‌లో భాగం. బ్రిటిష్ పాలకులు భారతదేశంలో ఇంగ్లిష్ మీడియం బడులను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా బడి యూనిఫాం కలోనియల్ డ్రెస్సింగ్ స్టైల్లోనే ఉంది. అయితే కొన్ని పాఠశాలలు మాత్రం దానిని మార్చుకున్నాయి. జపాన్‌లో బాలికల పాఠశాల యూనిఫామ్‌లు బ్రిటిష్ నావికాదళ యూనిఫామ్‌ను పోలి ఉంటాయి. అక్కడి పిల్లలు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు వారు తమ షూను తీసివేయాలి. తరగతి గదిలో వారు ప్రత్యేకమైన చెప్పులు వేసుకుంటారు. యూని కోడ్.. కేరళలోని ఎర్నాకుళం జిల్లా వలయాంచిరంగార గ్రామంలో వందేళ్ల చరిత్ర ఉన్న సర్కారు బడి ఒకటి ఉంది. అందులో టీచర్లతోపాటు బోధనేతర సిబ్బంది కూడా మహిళలే. ఈ ఆల్ విమెన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు సి.రాజి.. పిల్లల యూనిఫామ్ విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఒక సంప్రదాయ విభజన రేఖను చెరిపేశారు. అన్ని స్కూళ్లలాగే ఆ స్కూల్లో కూడా అబ్బాయిలకు షర్టు – నిక్కరు, అమ్మాయిలకు షర్టు– స్కర్టు యూనిఫామ్‌గా ఉండేది. ప్రిన్సిపల్ నిర్ణయంతో ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ‘షర్టు – నిక్కరు’ వేసుకుంటున్నారు. ఆటలు ఆడేటప్పుడు బాలికలకు సౌకర్యంగా ఉండటం కోసమే ఇలా యూని (డ్రెస్) కోడ్‌ను తెచ్చారు. బాడ్మింటన్, షటిల్ ఆడాలన్నా.. హై జంప్ చేయాలన్నా స్కర్టు పైకి ఎగురుతుందేమోననే బిడియంతో ఆడపిల్లలు ఆటలు ఆడడానికి ముందుకు రావడంలేదట. మంచి క్రీడాకారులు కాగల సత్తా ఉన్న అమ్మాయిలను వస్త్రధారణ కారణంతో అలా రెక్కలు విరిచి కూర్చోబెట్టడం ఏమిటి అని ఆలోచించిన సి. రాజి.. ఆ స్కూల్ డ్రెస్‌ని అలా మార్చేశారు. ఫ్రెషీ చాయిస్ ట్రాన్స్జెండర్లకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ యూనివర్సిటీ డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. ఫ్రెషర్స్‌లో ఆడవారికి, మగవారికి ప్రతిఏటా డ్రెస్ కోడ్‌ను ప్రకటించే ఆనవాయితీగల ఈ యూనివర్సిటీ ఈసారి తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు కూడా డ్రెస్ కోడ్‌ను ప్రకటించడం విశేషం. విద్యార్థినులకు బటన్లు కలిగిన షార్ట్ స్లీవ్స్, డార్క్ కలర్ లాంగ్ స్కర్ట్స్‌ను, విద్యార్థులకు వైట్ షర్ట్, నెక్ టై, బ్లాక్ ట్రౌజర్లను డ్రెస్ కోడ్‌గా నిర్ణయించింది. వీటిలో ఏ డ్రెస్‌నైనా ధరించే అవకాశాన్ని ‘ఫ్రెషీ చాయిస్’ పేరిట ట్రాన్స్జెండర్లకు కల్పించింది. ఆధ్యాత్మిక డ్రెస్ కోడ్ పలు ప్రసిద్ధ దేవస్థానాల్లో ఎప్పటి నుంచో డ్రెస్ కోడ్ అమలవుతోంది. ఆలయ అధికారుల నిర్ణయానికి భక్తులు కూడా ఆమోద ముద్ర వేశారు. జీన్స్, టీ షర్టులను ధరించిన యువతులకే కాదు పంజాబీ డ్రెస్‌పై చున్నీ లేని యువతులకు సైతం ఆలయాల్లో అనుమతి దొరకడం కష్టం. సంప్రదాయ పద్ధతి తప్పనిసరి కావడంతో చాలామంది పంచె, చీరలను కొనుగోలు చేసి, సంప్రదాయ పద్ధతిలో దైవాన్ని దర్శించుకుంటున్నారు. ఈ తరహాలోనే అయ్యప్ప దీక్ష భక్తులు నలుపు రంగులోనూ, భవానీ భక్తులు ఎరుపు రంగు, హనుమాన్ భక్తులు కాషాయం.. ఇలా భక్తులు ఆయా దైవ దీక్షల నియమాసారం ఆయా రంగుల డ్రెస్ కోడ్‌లో దీక్షలను కొనసాగిస్తున్నారు. అలాగే పలు మతాలకు సంబంధించిన అధిపతులు, పూజారులు, సన్యాసులకూ పలు రంగుల డ్రెస్ కోడ్ ఉంది. పోప్స్ తెల్లని, నల్లని దుస్తులు ధరిస్తే.. హిందూ, బౌద్ధ మతాల్లోని పూజారులు, సన్యాసులు, స్వామీజీలు, భిక్షువులు కాషాయ దుస్తుల ధరిస్తారు. జైనంలో శ్వేతాంబరులు పేరుకు తగ్గట్టు తెల్లటి డ్రెస్ కోడ్‌లో ఉంటారు. ముస్లిం మతంలో ప్రాంతాలను బట్టి ఆకు పచ్చ, తెలుపు, నలుపు వంటి రంగులు కనిపిస్తుంటాయి. లెక్కల్లో.. గణాంకాల ప్రకారం పదహారవ శతాబ్దంలోనే స్కూల్ యూనిఫామ్, సైనికుల యూనిఫామ్, బిజినెస్ యూనిఫామ్, ఉద్యోగుల యూనిఫామ్.. ఇలా రకరకాల డ్రెస్ కోడ్లను వారు చేస్తున్న పనికి అనుగుణంగా డిజైన్ చేశారు. ఇప్పుడు దాని పరిధి విస్తృతమైంది. అమెరికాలో ఒక యూనివర్సిటీ నిర్వహించిన సర్వే ప్రకారం 2022లో యూనిఫామ్‌ల రకాలు 80 వేల కంటే ఎక్కువే! చదువులు.. వృత్తులు.. విధులకు సంబంధించిన యూనిఫామ్స్‌ని పక్కనబెడితే.. విందు వినోదాలు.. వేడుకలు.. సరదా కాలక్షేపాలు వంటి వాటన్నిటికీ డ్రెస్ కోడ్ ఓ ట్రెండ్ అయింది. పార్టీలు, పబ్బులు సరే.. పాప్ స్టార్స్ కన్సర్ట్స్కీ.. ఆ పాప్ స్టార్స్ స్టయిల్స్‌ను ప్రతిబింబించే డ్రెస్ కోడ్‌లో హాజరవుతున్న అభిమానులూ ఉన్నారు. ఇలా డ్రెస్ కోడ్ కూడా ఫ్యాషన్‌లో చేరి.. ఎక్స్‌ప్రెషన్‌కి.. కమ్యూనికేషన్కీ ఓ టూల్‌గా మారింది! (చదవండి: ఆ చిన్న పింగాణి పాత్ర ధర తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే!) -
బైకులపై ఇంటింటికి వెళ్తున్న హరిదాసులు
-
యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబై: కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి హుస్సేన్ దల్వాయి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఆధునిక దుస్తులను ధరించడం అలవర్చుకోవాలని అన్నారు. ఈమేరకు యూపీ సీఎంపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే నెలలో(ఫిబ్రవరి) లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ క్రమంలో దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల నిమిత్తం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దల్వాయి మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి యోగి పరిశ్రమలను తీసుకెళ్లకుండా తన సొంత రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు దిశగా కృషి చేస్తే బాగుంటుందని మండిపడ్డారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లకండి! ‘పరిశ్రమలకు మహారాష్ట్ర మంచి సదుపాయలను కల్పించింది. కాబట్టి ఇక్కడి నుంచి పరిశ్రమలను తీసుకోకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. వాటి అభివృకి అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించండి. పరిశ్రమ అనేది ఆధునికతకు ప్రతీక ..యూపీ సీఎం కొంత ఆధునికతను పెంపొందించుకోవాలి. ప్రతి రోజు మతం గురించి మాట్లాడకండి. కాషాయ బట్టలు ధరించడం మానేయండి. కొంచెం మాడ్రన్‌గా ఉండటానికి ప్రయత్నించండి. ఆధునిక ఆలోచనలను అలవర్చుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి.. రాష్ట్రంలోని వివిధ రంగాలలలో ఉన్న అవకాశాలను వారికి అందించేందుకు స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బ్యాంకర్లతో పాటు ప్రముఖ సినీ ప్రముఖులతో గురువారం సమావేశమవ్వనున్నారు. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి దేశీయ రోడ్‌షోలను ప్రారంభించనున్నారు. చదవండి: ఎమ్మెల్యే ధనంజయ్ ముండేకు కారు ప్రమాదం -
చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...
ఎల్బీనగర్(హైదరాబాద్): ఆ శ్మశాన వాటికలో చితిమంటలు ఉండవు. కట్టెలతో కాల్చే పద్ధతి కానరాదు. ఎల్బీనగర్లో ఆధునిక విధానంలో సోలార్ శ్మశాన వాటిక త్వరలోనే అందుబాటులోకి రానుంది. నాగోలు వద్ద ఫతుల్లాగూడలో నిర్మించే శ్మశాన వాటిక ఇందుకు వేదిక కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఇక్కడి శ్మశాన వాటిక పనులు తుది దశకు చేరుకున్నాయి. సోలార్ బర్నింగ్ శ్మశాన వాటిక నిర్మాణ పనులు హెచ్ఎండీఏ పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టింది. సుమారు రూ.25 కోట్లతో దీని పనులు పూర్తి కావస్తున్నాయి. మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విదేశాల్లో ఉన్నవారు సైతం తమ బంధువుల అంత్యక్రియలను ఇంటర్నెట్ ద్వారా చూసే అవకాశముంది. ఇందుకోసం తెర ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 సీసీ కెమెరాలతో పాటు ఒక తెర ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం నగరంలోనే మొదటిది. ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని సుమారు 6 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇక్కడ మూడు మతాలకు చెందిన శ్మశాన వాటికలను రూపుదిద్దుకుంటున్నాయి. హిందు, క్రిస్టియన్, ముస్లింలకు వేర్వేరుగా అత్యున్నత ప్రమాణాలతో అన్ని హుంగులతో నిర్మాణం సాగుతోంది. సుందరమైన లాన్లు, పచ్చిక బయళ్లు, కూర్చునేందుకు విశాలమైన హాల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేశాం. ఇదొక అద్భుతమైన ప్రాజెక్టు. ఇక్కడికి వచ్చేవారికి అన్ని సదుపాయాలు కల్పించనున్నాం. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే (చదవండి: ఇదేమి ‘పని’ష్మెంట్!) -
మోడరన్ మామ్స్.. బేబీ ఫుడ్ కుకర్ గురించి మీకు తెలుసా?
బుల్లిబుజ్జాయిలకు బువ్వ తినిపించడం ఓ ఎత్తైతే.. ఆ బువ్వను వాళ్లకు నచ్చేలా, వాళ్లు తినగలిగేలా సిద్ధం చెయ్యడం మరోఎత్తు. అందుకే మోడరన్ మామ్స్ ఎంపికలో ఈ మల్టీ బేబీ ఫుడ్ మేకర్ చేరింది. 15 నిమిషాల సమయంలో రుచికరమైన బేబీ ఫుడ్ అందిచగలిగే ఈ మేకర్.. బ్లెండర్, గ్రైండర్, స్టీమర్, సెల్ఫ్ క్లీనింగ్, బాటిల్ వార్మర్.. వంటివెన్నో వెర్షన్స్‌లో పనిచేస్తుంది. గాడ్జెట్‌కి ఎడమవైపు డిటాచబుల్ వాటర్ ట్యాంక్, కుడివైపు మిక్సీజార్‌లో పట్టేంత స్టీమ్ బాస్కెట్ ఉంటాయి. ఎడమవైపు డిస్ప్లేలో జ్యూస్, బాయిల్, మిక్స్డ్ మీట్, ఆటోమెటిక్ క్లీన్, ఆన్/ఆఫ్ అనే ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఇందులో కూరగాయలు, పండ్లు, మాంసం వంటివన్నీ మెత్తగా ఉడికించి గుజ్జులా చేస్తుంది. వాటర్ ట్యాంక్‌లో వాటర్, స్టీమ్ బాస్కెట్లో ఆహారం వేసుకుంటే నిమిషాల్లో మెత్తగా ఉడుకుతుంది. స్టీమ్ బాస్కెట్‌కి యాంటీ హీటింగ్ హ్యాండిల్ ఉంటుంది. దాంతో కుక్ అయిన వెంటనే ఆ మిశ్రమాన్ని దాని కింద ఉన్న మిక్సీ జార్లో వేసుకుని ఒక స్విచ్ నొక్కితే మెత్తగా టేస్టీగా మారిపోతుంది. ఇక ఇందులో పిల్లలు తాగే వాటర్ బాటిల్స్, పాల సీసాలు వంటివి కూడా శుభ్రం చేసుకోవచ్చు. ధర 72 డాలర్లు (రూ.5,355) శాండ్విచ్ – వాఫిల్స్ మేకర్ చూడటానికి మినీ సూట్‌కేస్‌లా ఉన్న ఈ గాడ్జెట్.. రుచుల ప్రియులకు నిమిషాల్లో టేస్టీ బ్రేక్ఫాస్ట్స్ని అందిస్తుంది. రకరకాల ఫ్లేవర్స్‌లో శాండ్విచ్, వాఫిల్స్తో పాటు.. చికెన్ గ్రిల్, బ్రెడ్ టోస్ట్ వంటివి తయారు చేస్తుంది. హ్యాండిల్ దగ్గరే లాక్ చేసుకునే వీలు ఉండటంతో దీన్ని సులభంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుని వెళ్లొచ్చు. నాన్‌స్టిక్ పూత కలిగిన గ్రిల్ ప్లేట్స్, వాఫిల్స్ ప్లేట్స్‌తో.. కుకింగ్ వేగంగా అవ్వడంతో పాటు.. క్లీనింగ్ సులభమవుతుంది. సాధారణంగా చిన్నచిన్న వంటగదుల్లో మల్టీ మేకర్స్‌ని స్టోర్ చెయ్యడం మహా కష్టం. కానీ ఈ మేకర్‌తో ఆ సమస్య రాదు. వంట గదిలో లేదా ప్రయాణాల్లో దీన్ని నిలువుగా స్టోర్ చేసుకునే వీలు ఉండటంతో స్థలం బాగా కలిసి వస్తుంది. ఈ మేకర్ అనువుగా ఉండటంతో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ కొనసాగుతోంది. ధర 98 డాలర్లు (రూ.7,289) మల్టీ పర్పస్ స్టీమర్ ‘ఒకే మేకర్లో ఒకే వంట..’ అనే పాత పద్ధతికి ఏనాడో ఫుల్స్టాప్ పడింది. అందుకే ‘కుకింగ్ గాడ్జెట్స్ యందు మల్టీ గాడ్జెట్స్ వేరయా’ అంటారు వినియోగదారులు. ఏరికోరి మరీ వాటినే కొంటుంటారు. అలాంటిదే ఈ ఎలక్ట్రిక్ హాట్ పాట్. 1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మల్టీ కుకర్‌లో ఒకే సమయంలో రెండు వెరైటీలు సిద్ధం చేసుకోవచ్చు. పైన ఉన్న స్టీమర్ బౌల్‌కి ఇరువైపులా హ్యాండిల్ ఉంటుంది. ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ మూత కూడా ఉంటుంది. బాటమ్ బౌల్‌కి పొడవాటి హ్యాండిల్‌తో పాటు.. దానిపైనే ఆన్ /ఆఫ్ బటన్ ఉంటుంది. దాంతో ఇందులో గుడ్లు ఉడికించుకోవడం దగ్గర నుంచి చికెన్, మటన్, రొయ్యలు వంటి నాన్‌వెజ్ ఐటమ్స్, కూరగాయలు, ఆకుకూరలతో వంటలు సిద్ధం చేసుకోవచ్చు. నూడుల్స్, సూప్స్.. వంటివెన్నో వెరైటీలు రెడీ చేసుకోవచ్చు. పైగా ఈ మేకర్ స్టోర్ చెయ్యడానికి కన్వినెంట్‌గా ఉంటుంది. ధర 35 డాలర్లు (రూ.2,603) -
సకల విద్యాప్రాప్తిరస్తు!
ఈ ఆధునిక యుగంలో సమస్తానికీ మూల కారణం విద్య ఒక్కటే. చక్కటి విద్య కారణంగానే పిల్లలు సభ్యమానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. భాషాజ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే వారు ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతారు. పవిత్రంగా, మనస్ఫూర్తిగా, నిర్మలమైన మనస్సుతో అమ్మను ఆరాధిస్తే చాలు ఆ చదువుల తల్లి ప్రసన్నమై కోరిన విద్యలను ప్రసాదిస్తుంది.సకల విద్యాస్వరూపిణి, సకల వాజ్ఞయానికీ మూలకారకురాలు, భాష, లిపి, కళలకు అధిదేవత సరస్వతీమాత. పలుకు తేనెల బంగరు తల్లి, వేదాలకు జనయిత్రి, వీణాపుస్తక ధారిణి అయిన ఆ తల్లి దయ ఉంటే వెర్రిబాగులవాడు కూడా వేదవేదాంగవేత్త అవుతాడు. మూర్ఖుడు సైతం మహావిద్వాంసుడుగా మారిపోతాడు. ఆమెను తృణీకరిస్తే మహాపండితుడు కూడా వివేకశూన్యునిగా మారి సర్వం పోగొట్టుకుంటాడు. అందుకే ఆ చల్లని తల్లి కరుణ అందరికీ అవసరం. ఎవరైనా సరే, తమకుగాని, తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నతోద్యోగం, పదోన్నతి లభించాలన్నా సరస్వతీ దేవిని ఆరాధించవలసిందే. వసంత పంచమి ఉదయం పూట స్నానాదికాలు ముగించుకుని శుచి అయి, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవి ప్రతిమ లేదా చిత్రపటానికి తెల్లని పూలు, అక్షతలు, మంచిగంధం, తెల్లని నగలు అలంకరించి షోడశోపచారాలతో పూజించి, పాయసం నివేదించాలి. పూజానంతరం ఆ పాయసాన్ని ప్రసాదంగా భుజించి, అందరికీ పంచిపెట్టాలి. ఐదుగురు బాలలను అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి, నూతన వస్త్రాలు కట్టబెట్టి, పలకాబలపాలు లేదా పుస్తకం, కలం ఇచ్చి సంవత్సరంపాటు వారి చదువుకు అయ్యే ఖర్చును భరించాలి. సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్ల నువ్వులతో చేసిన లడ్లు, చెరుకు రసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్లు వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి. – డి.శ్రీలేఖ -
నాలుగు లక్షల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం?
అంచనాలు తారుమారు కావడం అంటే ఇదే. ఈ భూమి మీద ఆధునిక మానవుడు (హోమో సేపియన్) అవతరించి దాదాపు మూడు లక్షల ఏళ్లు అయిందని.. ఆఫ్రికాలో పుట్టి.. ఆ తరువాత ప్రపంచమంతా విస్తరించాడని అనుకుంటున్నామా? తాజా పరిశోధనలు ఈ అంచనాలన్నీ తప్పు అంటున్నాయి. భారత్ విషయాన్నే తీసుకుంటే సుమారు నాలుగు లక్షల ఏళ్ల క్రితమే హోమోసేపియన్ జాతి మానవులు ఇక్కడ సంచరించారనేందుకు తగ్గ ఆధారాలను పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీశారు. అలాగే ఇజ్రాయెల్‌లో లభించిన అవశేషాలు కూడా సుమారు రెండు లక్షల ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. భారత్‌లో లభించిన పురాతన రాతి పనిముట్లకు, ఆఫ్రికాలో లభించిన వాటికి ఉన్న దగ్గరి పోలికల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెన్నైలోని శర్మ సెంటర్ ఫర్ హెరిటేజ్ ఎడ్యుకేషన్‌కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్త పప్పు శాంతి తెలిపారు. చెన్నైకు నైరుతి దిక్కులో లభించిన ఈ పని ముట్లు నిజంగానే ఆఫ్రికా నుంచి వలస వచ్చిన హోమో సేపియన్లు తయారు చేశారా? లేక స్థానికంగానే అభివృద్ధి చెందిన మానవుల్లాంటి జంతువులు అభివృద్ధి చేశాయా? అన్నది ప్రస్తుతానికి స్పష్టం కావడం లేదని.. పనిముట్లతోపాటు శిలాజాలేవీ లభించకపోవడం దీనికి ఒక కారణమని వివరించారు. -
అచ్చుత్తమం
ఆరు గజాలు... అర ఇటో అర అటో.కట్టుకుంటే ఆహా...రే. ఏ నేత అయినా వాహ్వా...రే. నేత సరే... మిషన్ రంగంలోకి దిగితే... వేలాది డిజైన్లను ప్రింట్ చేస్తే? అదిరే... కన్ను చెదిరే... ప్రింటున్న చీర కట్టుకుంటే పోస్టరే!ఊదా రంగు క్రేప్ శారీ మీద మోడ్రన్ ఆర్ట్‌ను తీర్చిన భావనను తెస్తోంది ఈ డిజిటల్ ప్రింట్. క్యాజువల్ వేర్‌గానూ ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడుతుంది.సంప్రదాయపు జిలుగుల రంగులకు డిజిటల్ వేగం కలిస్తే వచ్చే సొగసుఈ హాఫ్ అండ్ హాఫ్ శారీ సొంతం. పసుపు, ఎరుపు కాంబినేషన్ ఫ్యాబ్రిక్ జత చేసి, క్రీమ్ కలర్ పల్లూ భాగం మీద పువ్వుల డిజిటల్ ప్రింట్లు వేయడంతో సింగారం రెట్టింపు అయ్యింది. క్రీమ్, మస్టర్డ్ కలర్ కాంబినేషన్ చీర మీద చతురస్రాకారపుప్రింట్లు ఆధునికతను చాటుతున్నాయి.ఎరుపు, నలుపు క్రేప్ శారీ మీద వేసిన డిజిటల్ ప్రింట్లతో వచ్చినఅందం వేడుకలలోవైవిధ్యాన్ని చూపుతుంది. స్టైలిష్‌గానూ, మోడ్రన్‌గా ఉండే ఈ డిజిటల్ డిజైన్స్ ఎంపికలోనే ఉంది కొత్తదనం. ఆర్గానిక్ లినెన్ మల్టీ కలర్ శారీ మీ వినూత్నంగా డిజైన్ చేసిన డిజిటల్ ప్రింట్లు చూపులను కట్టడి చేస్తున్నాయి.కళాకారుడు తన భావాలను అందమైన క్యాన్వాస్ మీదఆవిష్కరించినట్టు డిజిటల్ ప్రింట్లు చీర మీద కొత్త సింగారాలు పోతున్నాయి. -
దుపట్టు
మోడ్రన్, స్టైలిష్, లేటెస్ట్ ఖాదీ, కాందారీ టస్సర్, చందేరీ షిఫాన్, జార్జెట్ కుర్తా ఏదైనా కానీ పైన ఒక ‘పట్టు’ వేస్తే అదేనండి పట్టు దుపట్టా వేస్తే పోస్ట్ నియో మోడ్రన్ కట్ కూడా ట్రెడిషనల్ అయిపోతుంది. పట్టు దుపట్టా.. అదే దు‘పట్టు’. ► పాలనురుగు లాంటి తెల్లటి లాంగ్ అనార్కలీ ఫ్రాక్ మీదకు ఎరుపు రంగు పట్టు దుపట్టా సంప్రదాయానికి సిసలైన చిరునామాగా నిలుస్తుంది. ► లాంగ్ అనార్కలీ సెట్‌కి అదే రంగు జరీ జిలుగుల అంచు గల దుపట్టా ధరిస్తే, సంప్రదాయంగా కనువిందు చేస్తూనే స్టైలిష్ మార్కులు కొట్టేస్తారు. ► లాంగ్ అనార్కలీ సెట్ మీదకు పాత కాలం నాటి చీరలకుండేలా పెద్ద అంచున్న పట్టు దుపట్టా వేడుకను కళాత్మకంగా మార్చేస్తుంది. ► గోల్డ్ కలర్ లాంగ్ కుర్తాకి బెనారస్ పట్టు దుపట్టా ఏ వేదిక మీదనైనా, ఏ వేడుకలోనైనా సంప్రదాయపు హంగుతో ఆకట్టుకుంటుంది. ► తెల్లని కుర్తా పైజామా మీదకు మెజెంటా కలర్ ప్యూర్ సిల్క్ దుపట్టా ప్రత్యేక ఆకర్షణ. ► స్టైలిష్ ప్లెయిన్ రెడ్ కుర్తాకు క్రీమ్ కలర్ దుపట్టా ధరిస్తే చూపు తిప్పుకోలేని అందంతో మెరిసిపోవచ్చు -
ఆధునిక పద్ధతితో అధిక దిగుబడులు
షాద్‌నగర్ రూరల్ : రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ సుధారాణి సూచించారు. శుక్రవారం షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని కమ్మదనం, మధురాపూర్, ఉత్తరాశిపల్లి, ముట్పూరు, చెరుకుపల్లిలో వ్యవసాయశాఖ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా సబ్సిడీపై పొందిన పొలం యాంత్రీకరణ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా, పంట మార్పిడితో పంట ఎక్కువగా పండుతుందని, ట్రాక్టరుతో నడిచే పరికరాలకు బడ్జెట్ పెంచాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ భిక్షపతి, ఏఓలుప్రశాంతి, శిరీష, రవి తదితరులు పాల్గొన్నారు. -
హన్సిక నడుంపై దిష్టి చుక్క
దిష్టి చుక్కను ఎవరైనా బుగ్గపై పెడతారు. మరేంటి హన్సిక నడుంపై దిష్టి చుక్క అంటున్నారనేగా మీ ఉచ్చుకత.ఆ ముచ్చటైన సంగతేమిటో చూద్దాం. సాధారణంగా అందమైన అమ్మాయిల్ని పాలరాతి బొమ్మగా వర్ణించడం చూస్తుంటాం. నటి హన్సిక మాత్రం ఇక్కడ తైలంతో తయారైన బొమ్మలా నిగ నిగలాడుతూ కాంతులీనుతుంది. అలాంటి అందం కంటి ముందు కదలాడితే దాన్ని సిల్వర్ స్క్రీన్‌పై మరింత వన్నెతో ఆవిష్కరించి ఊరు ఊరంతా మైమరచేలా చేయడమేగా దర్శకుడి నైపుణ్యం. ఆ పనే చేశారు దర్శకుడు ఏఆర్.రాజశేఖర్.ఈయన దర్శకత్వం వహించిన చిత్రం ఉయిరే ఉయిరే. ఇందులో నాయకి అందాల భరిణి హన్సిక. ఆమెకు జంటగా సీనియర్ నటి జయప్రద కొడుకు సిద్ధు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దీన్ని నటి జయప్రద నిర్మించడం విశేషం. ఈ చిత్రంలోని అందమైన ప్రేమ దృశ్యాన్ని దర్శకుడు ప్రేమజంట అంటే ఇలా ఉంటారా? అని యువతే ఈర్శ్యపడేలా చిత్రీకరించారు. అది ముంబై నుంచి చెన్నైకి వెళ్లే విమానం. మధ్యలో గోవాలో ఆగింది. అక్కడ మంచి వయసులో ఉన్న అందాల భామ హన్సికకు చార్మింగ్ కుర్రాడు సిద్ధుకు మధ్య పరిచయం స్నేహంగా మారి గమ్మత్తుగా ప్రేమ చిగురించింది. ఈ దృశ్యాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఆ ప్రేమ పక్షులు అనూహ్యంగా ఒక వివాహ వేడుకలో పాల్గొంటారు. అప్పటి వరకూ మోడ్రన్ దుస్తులే ధరించిన హన్సికను చీర ధరించమని సిద్ధు రిక్వెస్ట్ చేస్తాడు.ప్రియుడి కోరికను మన్నించిన హన్సిక చీరతో సింగారించుకుని వస్తుంది.అందులో ఆమె అందాన్ని హీరో సిద్ధునే కాదు అక్కడున్న వారంతా మైమరచిపోతారు. దీంతో తేరుకున్న సిద్ధు పరుగెత్తుకుంటూ వెళ్లి హన్సిక కంటికి వేసుకున్న కాటుకను దిష్టి చుక్కగా ఆమె నడుంపై పెడతాడు. బుగ్గపైన దిష్టి చుక్క పెట్టేది అని మీరు అనవచ్చు.అయితే అక్కడి వారి దృష్టి అంతా హన్సిక నవ నవలాడే నడుంపైనే పడిపోవడంతో సిద్ధు దిష్టి చుక్కను అక్కడ పెట్టారు.ఉయిరే ఉయిరే చిత్రంలో ఈ అందాల సన్నివేశాలు చూసి మీరు మైమర చిపోవాలంటే ఎంతో కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. చిత్రం ఏప్రిల్ ఒకటో తేదీన తెరపైకి రానుంది. -
నాకు సెకండ్ హోమ్లా....
లాడ్‌బజార్‌లో.. మనసు లాక్.. హైదరాబాద్‌లో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే ఈ సిటీ అంటే చాలా ఇష్టం. నాది బెంగళూరు అయినప్పటికీ హైదరాబాద్‌ని కూడా నా హోమ్ టౌన్లానే భావిస్తాను. ఇక్కడివారు ఎంత మోడ్రన్‌గా ఉంటారో అంతే ట్రెడిషనల్‌గా కూడా ఉంటారు. ఒకసారి ఓల్డ్ సిటీకి వెళ్లాను. లాడ్‌బజార్‌ను చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ దొరికే రకరకాల గాజులు చూసి ఇన్ని రకాలుంటాయా..! అనిపించింది. ఆ ప్రాంతానికి కనెక్ట్ అయిపోయాను. హైదరాబాద్‌లో నేను చాలా ప్లేసెస్‌కి వెళ్లాను. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ ఫేమస్ అయినా, నేను నాన్-వెజ్ తినను కాబట్టి ఆ రుచి గురించి చెప్పలేను. నేనెంతగా సిటీకి కనెక్ట్ అయ్యానంటే నాకు సెకండ్ హోమ్లా అయిపోయింది. - ప్రణీత -
‘మోడర్న్’ బ్రెడ్ వ్యాపారాన్ని విక్రయించిన హెచ్‌యూఎల్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్).. ‘మోడర్న్’ బ్రాండ్‌పై నిర్వహించే బ్రెడ్, బేకరీ వ్యాపారాన్ని విక్రయించింది. ఎవర్‌స్టోన్ గ్రూప్‌నకు చెందిన నిమన్ ఫుడ్స్ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ వెల్లడి కాలేదు. రాబోయే రోజుల్లో లావాదేవీ పూర్తికి అవసరమైన అనుమతులు లభిస్తాయని హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. 2000లో కొనుగోలు చేసిన మోడర్న్ బ్రాండ్ వ్యాపారాన్ని లాభసాటిగా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మోడ్రన్ ఫుడ్ ఇండస్ట్రీస్‌ను అప్పట్లో హెచ్‌యూఎల్ కొన్నది. కేంద్రం జరిపిన తొలి డిజిన్వెస్ట్‌మెంట్ ఇదే. కేక్‌లు, బన్లు, క్రీమ్ రోల్స్ మొదలైనవి తయారు చేసే మోడర్న్ బ్రాండ్‌కి ఆరు ప్లాంట్లు ఉన్నాయి. -
అరచేతి ఆభరణం
ఆధునికం కథానాయికలు ఏం చేసినా అందమే! అలంకరణకు కొత్త భాష్యం చెప్పడానికి వారు రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. అవి అందరినీ ఆకర్షిస్తుంటాయి. అనుసరించేలా చేస్తుంటాయి. ఇటీవల హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి అటు నుంచి మన తెలుగు చిత్రసీమకు పరిచయం అయిందో ఆభరణం. ‘పామ్ కఫ్’గా పిలిపించుకుం టున్న ఈ అరచేతి ఆభరణానికి ఇటీవల క్రేజ్ వచ్చేసింది. సంప్రదాయ దుస్తులైనా, ఆధునిక వేషధారణ అయినా ఈ అరచేతి ఆభరణాన్ని ధరిస్తే ఫ్యాషనబుల్ అనిపిస్తారు. అందుకేనేమో అమెరికా నుంచి ఆసియా వరకు ప్రపంచ సుందరీమణులు అనదగ్గ వారిందరి కోమలమైన చేతులకు ఇది కొత్త కాంతులిస్తోంది. గాజు మాదిరిగానూ, బ్రేస్లెట్ లాగానూ, అత్యంత సౌకర్యమైన ఆభరణంగానూ పలువురు మెచ్చుకుంటున్న ‘పామ్ కఫ్’ ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా నడుస్తోంది. ఇవి బంగారు, వెండి, కాపర్, ఐరన్లలో.. ఎన్నో విభిన్న ఆకృతులతో అతివలను అలరిస్తున్నాయి. -
పండగవేళ.. పల్లె కళ..
నేటి ఆధునిక ఫ్యాషన్లు చిన్నాపెద్దను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అయితే, పరుగులు పెట్టే మోడ్రన్ ఏజ్‌లోనూ ఒక్కసారి ఆగి,ప్రకృతి సింగారాలను ఒళ్లంతా నింపుకొంటే... పల్లె సిరులను నట్టింటికి తెచ్చుకొంటే... ఆ అందం, ఆనందం ఇబ్బడి ముబ్బడి అవుతాయి. విఘ్నాధిపతి వినాయకుని మట్టితో మూర్తిగా మలిచి, అందంగా అలంకరించి శ్రద్ధగా పూజలు జరుపుతాం.అలాగే పడతుల అలంకరణలోనూ ప్రకృతి సిరులకు స్థానం ఇస్తే పండగ పూట కళగా వెలిగిపోతారు. చేనేత..కళనేత.. మంగళగిరి ప్రింటెడ్ కాటన్ మెటీరియల్‌తో పరికిణీని తీర్చిదిద్ది, ప్లెయిన్ షిఫాన్ ఓణీకి రాసిల్క్ బార్డర్ జత చేసి, డిజైనర్ బ్లౌజ్‌లు ధరిస్తే పల్లెకళతో వెలిగిపోతారు. వీటి మీదకు టైటా ఆభరణాలు, పొడవాటి కురులను అల్లిన జడలు ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. పోచంపల్లి, గద్వాల్, కలంకారీ, ఇక్కత్.. ఇలా మన చేనేత ఫ్యాబ్రిక్స్‌తో తయారుచేసుకున్న దుస్తులు ఎప్పటికీ కొత్తదనంతో ఆకట్టుకుంటూనే ఉంటాయి. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ ప్రాచీన కళ.. టైటా... ఏ లోహపు ఆభరణాలకూ తీసిపోని విధంగా ప్రత్యేకతను చాటుతున్న ఈ ఆభరణాలను ఆధునిక యువతులు అమితంగా ఇష్టపడుతున్నారు. నదీ తీరంలో కొట్టుకువచ్చిన ఒండ్రుమట్టిని సేకరించి, పొడిచేసి, ఉడికించి, తగిన అచ్చులలో పోసి ఈ ఆభరణాలను తయారుచేస్తాను. వీటిని వెలిసిపోని రంగుల తో తీర్చిదిద్దుతాను. సంప్రదాయ, ఆధునిక దుస్తుల మీదకు అందంగా నప్పే ఈ ఆభరణాలలో యాంటిక్ గోల్డ్ జుంకాలు, హారాలు ప్రాచీనకళతో ఉట్టిపడుతుంటాయి. వీటి ధరలు రూ.350 నుంచి 5వేల రూపాయల వరకు ఉన్నాయి. ధరించే దుస్తుల రంగులను బట్టి ఆభరణాలను తయారు చేయవచ్చు. - అరుణా దీపక్, టైటా ఆభరణాల నిపుణురాలు యాంటిక్ లుక్‌తో కనువిందుచేసే ఈ ఆభరణాలు కంచి, ధర్మవరం, ఉప్పాడ.. పట్టు చీరలకు సరైన ఎంపిక. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
సంపదను వీడి సన్యాసం తీసుకుంది!
వీక్షణం ఎంత ఆధునికంగా తయారవుదాం, ఎంత విభిన్న తరహాలో ఎంజాయ్ చేద్దాం అంటూ ఆలోచించే యువత ఉన్న ఈరోజుల్లో... అందుబాటులో ఉన్న సౌకర్యాలన్నీ వద్దనుకుని... సన్యాసం పుచ్చుకుందో యువతి. చైనా లోని జినన్ పట్టణానికి చెందిన టింగ్ అనే ఇరవై నాలుగేళ్ల యువతి... లగ్జరీ గూడ్స డిజైనింగ్‌లో శిక్షణ పొందు తోంది. సౌకర్యవంతమైన జీవితం, సరదాలు, షికార్లు... ఏ కొదువా లేదామెకి. అయితే ఏమయ్యిందో ఏమో... ఉన్నట్టుండి అన్నీ కట్టిపెట్టేసింది. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం మానేసింది. బయట తిరగడం ఆపేసింది. ఉన్నట్టుండి ఓరోజు మాయమైపోయింది కూడా! ఎక్కడికెళ్లిందోనని ఆరా తీస్తే... ఓ కొండ మీద కూర్చుని ధ్యానం చేసుకుంటోంది. గుండుతో, బౌద్ధ సన్యాస వస్త్రాలతో ఉన్న ఆమెను చూసి అవాక్కయ్యి ఏమిటిదంతా అంటే... ‘నాకు మనిషి పుట్టుక, మనుగడ, మరణాల లోతుల్ని తెలుసుకో వాలని ఉంది, ఈ ప్రపంచమంతా అసహజంగా, అవాస్తవంగా అనిపిస్తోంది, నన్ను వదిలేయండి’ అందట! ఎంత చెప్పినా వినకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు మౌనంగా ఉండి పోయారు. దాంతో పూర్తిగా బౌద్ధ సన్యాసిలా మారిపోయి, ధ్యానం చేసుకుంటూ గడిపేస్తోంది! -
కోటలో దెయ్యం ఉందా?!
విచిత్రం హారర్ సినిమాలు చూసి, దెయ్యం కథనాలు చదివి, పురాతన భవంతులు, కోటల గురించి తెలుసుకొని చాలామంది భయపడు తుంటారు. అలాంటి గమ్మత్తయిన అనుభవమే నాకూ ఎదురైంది. రెండేళ్ల క్రితం... శీతకాలంలో ఢిల్లీలో ఉన్న మా మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లాను. వారి ఇద్దరు అబ్బాయిలు చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘రాజస్థాన్ చూడటానికి వెళుతున్నాం. నువ్వూ రావాలి’ అంటే వెళ్లాను. వాళ్లతో ప్రయాణం అంటే మహా సరదా నాకు. పింక్‌సిటీగా పేరొందిన జైపూర్, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటూ చాలా సరదాగా గడిపాం. తర్వాత రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో ఉన్న భాన్‌గఢ్ కోటకు వెళ్లాం. 1613లో ఈ కోటను నిర్మించారు. అప్పటికే ఆ కోట గురించి కొంత సమాచారం తెలిసి ఉండటంతో మా అందరికీ ఆసక్తిగా అనిపించింది. విషయమేంటంటే ‘దెయ్యాలు వేటాడే ప్రాచీన పట్నంగా’ ఆ ప్రాంతానికి పేరుంది. మాకెంత మాత్రం ఇది నిజం అనిపించలేదు. కోటను చేరుకున్నాం. శిథిలమైన గోడలతో... సినిమాల్లో చూపే దెయ్యాల కోటలు గుర్తుకు వచ్చాయి. కోటకు వెళ్లే దారిలో పురావస్తుశాఖ వారు ఏర్పాటు చేసిన బోర్డు మీద ‘సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు ఈ కోట లోపలికి, చుట్టుపక్కలకు వెళ్లడం నిషిద్ధం’ అని రాసుంది. దెయ్యాలున్నాయనే కారణంగా ఆ బోర్డు ఏర్పాటు చేశారని తెలిసింది. ఆ కోటలో భాన్‌గఢ్ రాజ్యపు యువరాణి రత్నావతి, ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నించిన సింఘియా అనే మంత్రగాడు ఇద్దరూ యౌవనంలో మరణించారనీ, పగతో రగిలిపోయే వారు ఆ ప్రాంతంలోనే తిరుగాడుతున్నారనీ చెప్పుకుంటూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లోనూ దెయ్యాలున్నాయని గుడ్డిగా నమ్మడం ఆశ్చర్యమనిపించింది. కోట అంతా తిరిగి చూసి, ఇంటికి వచ్చాక కూడా మేము అక్కడి ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కోట జ్ఞాపకం అలాగే నిలిచిపోయింది. - వేదవ్యాస్, ఇ-మెయిల్