ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్‌లు యూజర్ల ఏటాను చోరీ చేస్తున్నాయా? అంటే నివేదికలు అవుననే అంటున్నాయి. మోడ్రన్ టాప్ బ్రాండ్స్ కార్లలో డేటా ప్రైవసీ అనేది పీడకలే అంటూ కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ తన తాజా పరిశోధనలో వెల్లడించింది. దాదాపు 25 కార్ బ్రాండ్‌లను సమీక్షించింది. ఆ సందర్బంగా సెక్స్ లైఫ్ నుంచి ఇష్టా ఇష్టాలు, పాలిటిక్స్ గగుర్పాటు కలిగించే ఇతర విషయాలు అన్నీ లీక్ అవుతున్నాయంటూ సంచలన అధ్యయన నివేదికను ప్రకటించింది. (గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్ )
మొజిల్లా ఫౌండేషన్ నిర్వహించిన వినియోగదారు గోప్యతా పరీక్షల్లో అవన్నీ విఫలమయ్యాయని తేలింది. పరిశోధనలో 84శాతం కార్ కంపెనీలు కారు యజమానుల నుండి సేకరించిన డేటాను సమీక్షించాయి, పంచుకుంటాయి లేదా విక్రయించాయి అని వెల్లడించింది. డ్రైవింగ్ డిజిటల్‌గా మారుతున్న యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, విక్రయించడంపై ఆందోళన వ్యక్తం చేసిన మొజిల్లా అసలు తమ పరిశోధనలోని కంపెనీలేవీ గోప్యతపై దాని ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరచలేదని తెలిపింది. సెక్స్ టాయ్‌లు ,మానసిక ఆరోగ్య యాప్‌ల తయారీదారులతో సహా ఇంత పేలవమైన సమీక్ష రాలేదని తెలిపింది.
కార్ల తయారీదారులు తమ కార్లను 'కంప్యూటర్ ఆన్ వీల్స్' అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అంతా డొల్ల అని ప్రైపసీ ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌కు ప్రసిద్ధి చెందిన మొజిల్లా రిపోర్ట్ చేసింది. "ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యే డోర్‌బెల్‌లు, గడియారాలు తమపై గూఢచర్యం చేస్తున్నాయని ఆందోళన నేపథ్యంలో కార్ బ్రాండ్‌లు కూడా తమ వాహనాలను డేటా-గాబ్లింగ్ మెషీన్‌లుగా మార్చడం ద్వారా నిశ్శబ్దంగా డేటా వ్యాపారంలోకి ప్రవేశించాయని మొజిల్లా పేర్కొంది.
అధ్యయనం ప్రకారం టెస్లా టాప్‌లో ఉందంటూ మరో బాంబు పేల్చింది.నిస్సాన్ రెండో స్థానంలో నిలిచింది. నిస్సాన్ సేకరించే డేటాలో “లైంగిక కార్యకలాపాలు” ఎక్కువగానూ, అలాగే కియా కంపెనీ ప్రైవసీ సిస్టం ప్రకారం, జాతి, మతపరమైన లేదా తాత్విక విశ్వాసాలు, లైంగిక ధోరణి, లైంగిక జీవితం, రాజకీయ అభిప్రాయాలతోపాటు "ట్రేడ్ యూనియన్ సభ్యత్వం" సమాచారంతో సహా "ప్రత్యేక వర్గాల" డేటాను ప్రాసెస్ చేయవచ్చని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!)
84 శాతం బ్రాండ్స్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు , ఇతర బహిర్గతం చేయని వ్యాపారాలతో పంచుకున్నట్లు అంగీకరించినట్లు అధ్యయనం తెలిపింది. ఎక్కువమంది, 76 శాతం కస్టమర్ల డేటాను విక్రయించినట్లు చెప్పడం గమనార్హం. సగం కంటే ఎక్కువమంది డేటాను షేర్ చేస్తున్నట్టు చెప్పారు. కనెక్టెడ్ వాహనాలు డ్రైవింగ్ డేటామాత్రమే కాకుండా, వాహనంలోని వినోదం, శాటిలైట్ రేడియో మ్యాప్ లాంటి థర్డ్-పార్టీ ఫంక్షన్‌లను ట్రాక్ చేస్తున్నాయట.
అత్యధిక సంఖ్యలో కార్ బ్రాండ్‌లు, 92 శాతం, కేవలం ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్, Dacia బ్రాండ్‌తో వినియోగదారులకు వారి వ్యక్తిగత డేటాపై ఎటువంటి నియంత్రణ లేకుండా అందిస్తోంది. బహుశా యూరోపియన్ యూనియన్ చట్టానికి లోబడి డేటా డిలిట్ రైట్‌ను వినియోగదారులకు అనుమతించి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. కనీస భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్నుటికీ ఫోర్డ్, చేవ్రొలెట్, టయోటా, వోక్స్‌వ్యాగన్ , BMW వంటి కార్ల బ్రాండ్‌లు ఏవీ కూడా గత మూడేళ్లుగా 68 శాతం డేటా లీక్‌లు, హ్యాక్‌లు లేదా ఉల్లంఘన బారిన పడుతున్నాయని మొజిల్లా ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్టడీపై టాప్ కంపెనీలేవీ ఇంకా ఎలాంటి స్పందన ప్రకటించలేదు. (రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?)
కాగా ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్లు, భద్రత, డేటా నియంత్రణ, ఏఐ కి సంబంధించిన అన్ని రివ్యూల్లో ఫెయిల్ అనే విమర్శలను ఎదుర్కొంది. కస్టమర్ల కార్లలోని కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు,ఫోటోలు ను ఉద్యోగులు పంచుకోవడం దుమారాన్ని రేపింది. అయితే 2021లో, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా చైనా సైనిక మిలిటరీకి ఈ వాహనాలను నిషేధించిన తర్వాత చైనాలో కెమెరాలు నిలిపివేసినట్టు టెస్లా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment