FireFox
-
మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్లు యూజర్ల ఏటాను చోరీ చేస్తున్నాయా? అంటే నివేదికలు అవుననే అంటున్నాయి. మోడ్రన్ టాప్ బ్రాండ్స్ కార్లలో డేటా ప్రైవసీ అనేది పీడకలే అంటూ కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ తన తాజా పరిశోధనలో వెల్లడించింది. దాదాపు 25 కార్ బ్రాండ్లను సమీక్షించింది. ఆ సందర్బంగా సెక్స్ లైఫ్ నుంచి ఇష్టా ఇష్టాలు, పాలిటిక్స్ గగుర్పాటు కలిగించే ఇతర విషయాలు అన్నీ లీక్ అవుతున్నాయంటూ సంచలన అధ్యయన నివేదికను ప్రకటించింది. (గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్ ) మొజిల్లా ఫౌండేషన్ నిర్వహించిన వినియోగదారు గోప్యతా పరీక్షల్లో అవన్నీ విఫలమయ్యాయని తేలింది. పరిశోధనలో 84శాతం కార్ కంపెనీలు కారు యజమానుల నుండి సేకరించిన డేటాను సమీక్షించాయి, పంచుకుంటాయి లేదా విక్రయించాయి అని వెల్లడించింది. డ్రైవింగ్ డిజిటల్‌గా మారుతున్న యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, విక్రయించడంపై ఆందోళన వ్యక్తం చేసిన మొజిల్లా అసలు తమ పరిశోధనలోని కంపెనీలేవీ గోప్యతపై దాని ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరచలేదని తెలిపింది. సెక్స్ టాయ్‌లు ,మానసిక ఆరోగ్య యాప్‌ల తయారీదారులతో సహా ఇంత పేలవమైన సమీక్ష రాలేదని తెలిపింది. కార్ల తయారీదారులు తమ కార్లను 'కంప్యూటర్ ఆన్ వీల్స్' అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అంతా డొల్ల అని ప్రైపసీ ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌కు ప్రసిద్ధి చెందిన మొజిల్లా రిపోర్ట్ చేసింది. "ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే డోర్‌బెల్‌లు, గడియారాలు తమపై గూఢచర్యం చేస్తున్నాయని ఆందోళన నేపథ్యంలో కార్ బ్రాండ్లు కూడా తమ వాహనాలను డేటా-గాబ్లింగ్ మెషీన్లుగా మార్చడం ద్వారా నిశ్శబ్దంగా డేటా వ్యాపారంలోకి ప్రవేశించాయని మొజిల్లా పేర్కొంది. అధ్యయనం ప్రకారం టెస్లా టాప్‌లో ఉందంటూ మరో బాంబు పేల్చింది.నిస్సాన్ రెండో స్థానంలో నిలిచింది. నిస్సాన్ సేకరించే డేటాలో “లైంగిక కార్యకలాపాలు” ఎక్కువగానూ, అలాగే కియా కంపెనీ ప్రైవసీ సిస్టం ప్రకారం, జాతి, మతపరమైన లేదా తాత్విక విశ్వాసాలు, లైంగిక ధోరణి, లైంగిక జీవితం, రాజకీయ అభిప్రాయాలతోపాటు "ట్రేడ్ యూనియన్ సభ్యత్వం" సమాచారంతో సహా "ప్రత్యేక వర్గాల" డేటాను ప్రాసెస్ చేయవచ్చని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!) 84 శాతం బ్రాండ్స్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు , ఇతర బహిర్గతం చేయని వ్యాపారాలతో పంచుకున్నట్లు అంగీకరించినట్లు అధ్యయనం తెలిపింది. ఎక్కువమంది, 76 శాతం కస్టమర్ల డేటాను విక్రయించినట్లు చెప్పడం గమనార్హం. సగం కంటే ఎక్కువమంది డేటాను షేర్ చేస్తున్నట్టు చెప్పారు. కనెక్టెడ్ వాహనాలు డ్రైవింగ్ డేటామాత్రమే కాకుండా, వాహనంలోని వినోదం, శాటిలైట్ రేడియో మ్యాప్ లాంటి థర్డ్-పార్టీ ఫంక్షన్లను ట్రాక్ చేస్తున్నాయట. అత్యధిక సంఖ్యలో కార్ బ్రాండ్లు, 92 శాతం, కేవలం ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్, Dacia బ్రాండ్‌తో వినియోగదారులకు వారి వ్యక్తిగత డేటాపై ఎటువంటి నియంత్రణ లేకుండా అందిస్తోంది. బహుశా యూరోపియన్ యూనియన్ చట్టానికి లోబడి డేటా డిలిట్ రైట్ను వినియోగదారులకు అనుమతించి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. కనీస భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్నుటికీ ఫోర్డ్, చేవ్రొలెట్, టయోటా, వోక్స్వ్యాగన్ , BMW వంటి కార్ల బ్రాండ్లు ఏవీ కూడా గత మూడేళ్లుగా 68 శాతం డేటా లీక్‌లు, హ్యాక్‌లు లేదా ఉల్లంఘన బారిన పడుతున్నాయని మొజిల్లా ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్టడీపై టాప్ కంపెనీలేవీ ఇంకా ఎలాంటి స్పందన ప్రకటించలేదు. (రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?) కాగా ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్లు, భద్రత, డేటా నియంత్రణ, ఏఐ కి సంబంధించిన అన్ని రివ్యూల్లో ఫెయిల్ అనే విమర్శలను ఎదుర్కొంది. కస్టమర్ల కార్లలోని కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు,ఫోటోలు ను ఉద్యోగులు పంచుకోవడం దుమారాన్ని రేపింది. అయితే 2021లో, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా చైనా సైనిక మిలిటరీకి ఈ వాహనాలను నిషేధించిన తర్వాత చైనాలో కెమెరాలు నిలిపివేసినట్టు టెస్లా ప్రకటించింది. -
యూజర్లూ బీ అలర్ట్! 2022 మోస్ట్ రిస్కీ బ్రౌజర్ ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే మీకొక షాకింగ్ న్యూస్. 2022లో అత్యంత ప్రమాదకరమైన ఇంటర్నెట్ బ్రౌజర్‌గా క్రోమ్ తేలిందట. అట్లాస్ వీపీఎన్ తాజా విశ్లేషణ ప్రకారం 10 నెలల వ్యవధిలో గూగుల్ క్రోమ్ అత్యధికంగా 303 సమస్యలను ఎదుర్కొన్నట్లు కనుగొంది. అలాగే లైఫ్ టైంలో ఈ బ్రౌజర్ మొత్తం 3,159 వల్నరబులిటీలను ఎదుర్కొందని విశ్లేషించింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) గూగుల్ క్రోమ్ తరువాత మొజిల్లా ఫైర్ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, యాపిల్ సఫారీ ఈ కోవలో నిలిచాయి. డేటా దుర్బలత్వ డేటాబేస్ (VulDB) నుండి వచ్చిందని ఈ నివేదిక తెలిపింది. జనవరి 1 నుండి అక్టోబర్ 5 వరకు డేటాను ఇది రివ్యూ చేసింది. పరిశోధన ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు Google Chrome మాత్రమే సమస్యలక గురైంది. ముఖ్యంగా CVE-2022-3318, CVE-2022-3314, CVE-2022-3311, CVE-2022-3309, CVE-2022-3307 ఈ కొత్త భద్రతా సమస్యలు ప్రతీ డివైస్ మెమరీని దెబ్బతీస్తాయని పేర్కొంది. అయితే బ్రౌజర్ వెర్షన్ 106.0.5249.61కి అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చని వెల్లడించింది. 2022లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 103 భద్రతా సమస్యలను, మొజిల్లా ఫైర్ఫాక్స్ 117 సమస్యలను ఎదుర్కొంది. మైక్రోసాప్ట్ ఎడ్జ్ లాంచ్ తరువాత మొత్తం 806 వల్నరబులిటీస్ని ఫేస్ చేసింది. 2021 నుండి 62 శాతం పెరుగుదల. ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ ఇటీవల వినియోగదారుల సంఖ్య ఇటీవల ఒక బిలియన్‌ను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సఫారీ రెండవ స్థానానికి చేరుకుంది. 2022లో, ఈ బ్రౌజర్ అతి తక్కువ సమస్యలొచ్చాయి. ఈ పరిశోధన సమయంలో కేవలం 26 వల్నరబులిటీస్ని మాత్రమే ఎదుర్కొంది. అయితే మొత్తంగా 1,139 దుర్బలత్వాలను ఎదుర్కోవడం గమనార్హం. చివరగా, మొత్తం లైఫ్ టైంలో 344 భద్రతా సమస్యలను ఎదుర్కొన్న ఒపెరా బ్రౌజర్‌కు ఈ కాలంలో ఎలాంటి సమస్యా రాలేదు. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా బ్రౌజర్లు ఒకే Chromium ఇంజిన్‌పై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు వాటిని ప్రభావితం చేయవచ్చని పరిశోధన వెల్లడించింది. -
ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం భారీ అలర్ట్.. వెంటనే బ్రౌజర్ అప్డేట్ చేయండి?
ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ వినియోగిస్తున్న యూజర్లను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్) మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో పలు భద్రతా లోపాలను కనుగొన్నట్లు తెలిపింది. ఈ భద్రతా లోపాల వల్ల యూజర్ అనుమతి లేకుండానే కీలక సమాచారాన్ని హ్యకర్ చేతికి చెరవేస్తున్నట్లు సీఈఆర్ టీ-ఇన్ పేర్కొంది. తాజాగా మొజిల్లా ఫైర్ఫాక్స్ 98 అప్డేట్కు రాకముందు.. అన్ని మొజిల్లా ఫైర్ఫాక్స్ వెర్షన్లు ఈ భద్రతా లోపాలతో ప్రభావితమైనట్లు భద్రతా ఏజెన్సీ వెల్లడించింది. అదనంగా, 91.7 వెర్షన్‌కి ముందు మొజిల్లా ఫైర్ఫాక్స్ ఈఎస్ఆర్ వెర్షన్లు 91.7కి ముందున్న మొజిల్లా ఫైర్ఫాక్స్ థండర్బర్డ్ వెర్షన్లు కూడా ఇలాంటి భద్రతా లోపాలను ఎదుర్కొంటున్నాయి. మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ‘ఉచిత ఇన్-టెక్స్ట్ రీఫ్లోలు(use-after-free in-text reflows), థ్రెడ్ షట్‌డౌన్, యాడ్-ఆన్ సిగ్నేచర్ వెరిఫై సమయంలో టైమ్-ఆఫ్-చెక్ టైమ్-యూజ్ బగ్, శాండ్బాక్స్ చేసిన iframe కంటెంట్లను నియంత్రిస్తోంది. ఈ లోపం కారణంగా Mozilla ప్రొడక్టుల్లో అనేక భద్రతా లోపాలు తలెత్తుతున్నట్లు భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మీరు గనుక ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ని ఇప్పటివరకూ అప్డేట్ చేయలేదంటే వెంటనే చేయండి. మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ఎలా అప్డేట్ చేయాలి? మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.. ఫైర్ఫాక్స్ టూల్బార్ కుడి వైపున ఉన్న మెనూ బటన్‌ను క్లిక్ చేయండి. ఇక్కడ మీరు Help ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫైర్ఫాక్స్ ఏబౌట్ ఆప్షన్ ఎంచుకోండి. ఫైర్ఫాక్స్ అప్డేట్స్ కోసం సర్చ్ చేయండి. అప్డేట్ అందుబాటులో ఉంటే.. బ్రౌజర్ ఆటోమాటిక్‌గా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ పూర్తయిన తర్వాత ఫైర్ఫాక్స్'ని Restart to Update క్లిక్ చేయండి. (చదవండి: చమరు ధరలపై అంతర్జాతీయ ఇంధన సంస్థ కీలక వ్యాఖ్యలు..!) -
గూగుల్ దెబ్బ.. ఆ బ్రౌజర్‌కు ఘోరంగా తగ్గిన యూజర్లు
వెబ్ బ్రౌజర్‌గా ఒకప్పుడు ఊపుఊపిన మోజిల్లా ఫైర్ఫాక్స్.. కాలక్రమంలో తన యూజర్లను కోల్పోతోంది. గడిచిన 3 ఏళ్ల కాలంలో 46 మిలియన్ల మంది యూజర్లు.. మోజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌కు దూరం అయినట్లు రెడ్డిట్‌లో ఓ పబ్లిక్ డేటా రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. 2002లో విడుదలైన మోజిల్లా ఫైర్ఫాక్స్.. వెబ్ బ్రౌజర్ యూజర్లను ఆకట్టుకోవడంతో అనతి కాలంలో విశేష ఆధారణ లభించింది. ముఖ్యంగా థర్డ్ వెర్షన్‌ను రిలీజ్ చేసిన ఒక్కరోజులోనే సుమారు 8 మిలియన్లు పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. కానీ, అప్రతిహితంగా కొనసాగుతూ వచ్చిన ఫైర్ఫాక్స్ ఉనికికి.. గూగుల్ 2008లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ తీసుకొచ్చి బ్రేకులు వేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ బ్రౌజర్ ఇన్ బిల్ట్‌గా రావడం, ఎక్కువ సంఖ్యలో వెబ్సైట్లు గూగుల్ క్రోమ్‌కు అప్టిమైజ్ కావడం, అదే టైంలో ఫైర్ఫాక్స్ బ్రౌజర్ నెమ్మదించడం లాంటి కారణాలతో క్రోమ్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. పబ్లిక్ డేటా రిపోర్ట్ ప్రకారం.. 2018లో మోజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ యూజర్లు 244 మిలియన్ల మంది.. 2021 నాటికి ఆ సంఖ్య 198 మిలియన్ యూజర్లకు పడిపోయింది. అయితే మరో బ్రౌజర్ ఏదీ గూగుల్ క్రోమ్‌కి ప్రత్యామ్నాయంగా లేకపోవడంతో రెండో స్థానంలో మోజిల్లా ఫైర్ఫాక్స్ కొనసాగుతోందని టెక్ గురూస్ అంచనా వేస్తున్నారు. ఇక ఒకప్పుడు పాపులర్ బ్రౌజర్‌గా ఉన్న మోజిల్లా ఫైర్ఫాక్స్కు ఆదరణ తగ్గడానికి కారణం దాని పనితీరేనని అంచనా వేస్తున్నారు. మోజిల్లా అప్ డేట్ల గురించి ఫిర్యాదులతో పాటు యూజర్ ఇంటర్ ఫేస్ వెర్షన్ (యూఐ) ఫైర్ఫాక్స్ 89 కూడా ఆకట్టుకోలేక పోయింది. -
మైక్రోసాఫ్ట్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్ నిలిచిపోనుంది. ఈ రోజు(నవంబర్ 30) నుండి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో తన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్‌కి సపోర్ట్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఒక వేల మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను ఉపయోగించాలని అనుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ని ఉపయోగించాలని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో టీమ్స్ సేవలు నిలిచిపోనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో వినియోగదారులందరని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను ఉపయోగించుకునేలా చేయాలని సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. (చదవండి: మోటో జీ 5జీ లాంచ్ నేడే) 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశల వారీగా వీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 9, 2021 తరువాత నుంచి ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉండనుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ను మైక్రో సాఫ్ట్ కొత్తగా తీసుకొచ్చింది. క్రోమ్ బ్రౌజర్ మాదిరిగానే ఇది కూడా సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తుందని తెలిపింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 25 సంవత్సరాల క్రితం, 1995 ఆగస్టులో విడుదలైంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. 2003 ఏడాదిలో 95 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి వాటితో పోటీ నేపథ్యంలో ఈ కొత్త వెబ్ బ్రౌజర్ ని తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. -
మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫైర్ఫాక్స్ దృష్టి
వెబ్ బ్రౌజింగ్‌ను సులభతరం చేసి ఫైర్ఫాక్స్ నెటిజన్ల మనసు దోచుకుంది. ఇప్పుడు ఈ సంస్థ సెల్ఫోన్ల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. మార్కెట్లో పాతుకుపోయిన ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్‌లకు పోటీ ఇవ్వాలని ఫైర్ఫాక్స్ ఒక ప్రయత్నం చేస్తోంది. ఐదేళ్ల క్రిందట సెల్ఫోన్లలో ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)కు ఎంతో ప్రాధాన్యం ఉండేది. మొబైల్ ఫోన్ల తయారీలో అప్పట్లో కింగ్‌లా ఉన్న నోకియా ఈ ఓఎస్‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించక తీవ్రంగా దెబ్బతింది. సరిగ్గా అదే సమయంలో గూగుల్ సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. ఓఎస్‌పై ఆధారపడే భవిష్యత్తులో సెల్‌ఫోన్ అమ్మకాలు జరుగుతాయని గ్రహించింది. ఆ క్రమంలో ఆండ్రాయిడ్ అనే సంస్థను కొనుగోలు చేసింది. తాను సొంతంగా సెల్ఫోన్లు తయారు చేయనప్పటికీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా సెల్‌ఫోన్ రంగాన్ని శాసించే స్థితికి చేరుకుంది. 75 శాతం మార్కెట్ వాటాతో నెంబర్‌వన్‌గా నిలిచింది. యాపిల్ కంప్యూటర్స్ ఐఫోన్ కోసం రూపొందించి ఐఓఎస్ కూడా ఈ క్రమంలో బాగా వెనక్కు వెళ్లిపోయింది. నోకియా తన సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎంత ఎగదోసినా లాభం లేకుండా పోయింది. కొత్త గాడ్జెట్లను మెరుపు వేగంతో కాపీ కొట్టే స్యాంసంగ్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో చతికిలబడింది. బడా పేరుతో తీసుకువచ్చిన ఓఎస్ ఫోన్లు ఆదరణ పొందలేదు. ఇంకా బ్లాక్‌బెర్రీతో పాటు పలు సంస్థలు రూపొందించిన ఓఎస్‌లు కూడా మార్కెట్లో నిలబడలేదు. మొబైల్ ఫోన్లు చొచ్చుకురావడంతో మైక్రోసాప్ట్ కూడా విండోస్ మొబైల్ ఓఎస్‌ను రూపొందించింది. అయితే దానికి అంతంతమాత్రంగానే ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్బ్రౌజర్గా విజయవంతమైన ఫైర్ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద దృష్టి పెట్టింది. లైనెక్స్ ఆధారంగా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఇప్పటికే జెడ్‌టీఈ, సోనీ కంపెనీలు వినియోగిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఫైర్ఫాక్స్ ఫోన్లను కూడా విడుదల చేసింది. మన దేశంలో ఇంటెక్స్, స్పైస్ కంపెనీలు ఫైర్ఫాక్స్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. నోకియా, స్యాంసంగ్, బ్లాక్‌బెర్రీ , మైక్రోసాప్ట్ లాంటి దిగ్గజాలు సరైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించలేక చతికిలబడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఫైర్ఫాక్స్ రూపొందించిన ఓఎస్ ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది ప్రశ్నార్థకమే. అయితే ఈ ఓఎస్ ఓపెన్ సోర్స్ కాబట్టి, సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు తమకు కావాల్సిన రీతిలో మార్చుకోవడానికి వీలవుతుంది. ఈ వెసులుబాటు ఆధారంగా ఫైర్ఫాక్స్కు కొంత మేర ఆదరణ లభించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. **