branded
-
రారండోయ్ వేడుక చూద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మూడు రోజులు పాటు ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో సాయంత్రం 5 గంటలకు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో లక్ష మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 7.30 గంటలకు ఎనీ్టఆర్ మార్గ్‌లో డ్రోన్ ప్రదర్శన, హుస్సేన్ సాగర్‌లో పెద్దఎత్తున బాణసంచా ప్రదర్శన, అనంతరం హెచ్ఎండీఏ మైదానంలో తమన్ నేతృత్వంలో సంగీత కచేరీ, సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది. ట్యాంక్‌బండ్, ఎనీ్టఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో ఫుడ్‌స్టాళ్లతో పాటు హస్తకళల, సాంస్కతిక, పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. బహు పసందుగా ఫుడ్ స్టాళ్లు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లలోని పలు పసందైన వంటకాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన పలు బ్రాండెడ్ హోటల్స్ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. హైదరాబాదీ బిర్యానీ, మొఘలాయి, తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో పాటు బేకరీ ఐటమ్స్ చాట్, ఐస్‌క్రీం.. ఇలా వందకు పైగా ఫుడ్‌స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ వంటకాలు పాలమూరు గ్రిల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటుకోడి చికెన్, పుడ్ జాయింట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నగరమంతా విద్యుత్ దీపాలంకరణతో జిగేమంటోంది. డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో తళుక్కుమంటున్నాయి. -
వచ్చిందే సగం ‘బ్లాక్’తో ఆగం!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్ : వానాకాలం ముంచుకొస్తోంది. ఈసారి మంచి వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ ప్రకటనతో.. రైతులు పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. కానీ బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. రైతులు కోరుకునే విత్తనాలను వ్యాపారులు ‘బ్లాక్’ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన, సాధారణ విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో మంచి విత్తనాల కోసం రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మరోవైపు అనుమతి లేని విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముతున్నట్టూ ఆరోపణలు ఉన్నాయి. అధిక దిగుబడి వస్తుందనే ప్రచారంతో.. శాస్త్రీయంగా అన్నిరకాల విత్తనాలు దాదాపు ఒకే రకమైన పంట, దిగుబడిని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాపారులు వ్యూహాత్మకంగా కొన్ని రకాలే మంచి దిగుబడులు ఇస్తాయని అపోహలు సృష్టిస్తూ దండుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీ ఏదైనా సరే.. బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ (475 గ్రాములు) ధర రూ.864గా నిర్ణయించారు. 30కిపైగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 200 రకాల విత్తనాలను ఇదే ధరపై విక్రయించాలి.కానీ మార్కెట్లో ఒక నాలుగైదు రకాలు అధిక దిగుబడులు ఇస్తాయనే ప్రచారం ఉంది. వ్యాపారులు అలాంటి వాటిని బ్లాక్ చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కో ప్యాకెట్ విత్తనాలకు రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. నిషేధిత విత్తనాలు అంటగడుతూ.. కొందరు వ్యాపారులు, దళారులు నిషేధిత బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బీటీ–2 కంటే తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని.. కలుపును తట్టుకుంటాయని చెప్తున్నారు. పత్తి చేన్లలో కలుపు నివారణ కోసం కూలీలు సకాలంలో దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. ఇలా డిమాండ్ సృష్టిస్తున్న వ్యాపారులు బీటీ–2 విత్తనాల కంటే బీటీ–3 విత్తనాలను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా ప్రాంతాలతోపాటు గుజరాత్‌లోని వివిధ పట్టణాల నుంచి ఈ బీటీ–3 విత్తనాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. నకిలీలు, నిషేధిత విత్తనాలను నియంత్రించడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అధికారులు.. కొందరు దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు సగం వరకు సరఫరా.. నైరుతి రుతుపవనాలతో కురిసే తొలకరి వానలతోనే రైతులు పత్తి విత్తనాలు చల్లుతారు. ఈసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాలే ఇవి. దీనిపై రైతులు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘ఇప్పటివరకు మొత్తం విత్తనాలను ఎందుకు జిల్లాలకు సరఫరా చేయలేదు? కొరతే లేదని చెప్తున్నప్పుడు రైతులు ఎందుకు క్యూలైన్లలో ఎందుకు ఉండాల్సి వస్తోంది? ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అధికారులే చెప్పాలి. రైతులు కోరుకునే కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడమే ఇందుకు ప్రధాన కారణం..’’ అని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఇతర కంపెనీల విత్తనాలు కూడా కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారని.. మరి వారు దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు ప్రశి్నస్తున్నారు. ఇంకా సేకరణలోనే యంత్రాంగం.. రాష్ట్రంలో నిర్ణయించుకున్న లక్ష్యంలో సగం వరకే పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయి. సీజన్ కూడా మొదలైపోతోంది. కానీ అధికారులు ఇంకా విత్తనాలను సేకరించే పనిలోనే ఉన్నారు. కంపెనీలతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక రకం బ్రాండ్ విత్తనాలకు డిమాండ్ ఉందని తెలిసి.. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆ రకం విత్తనాలు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల సమన్వయ లోపంతో.. వ్యవసాయ శాఖలోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని.. దిగువ స్థాయికి ఆదేశాలివ్వడంలో సరిగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాలని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తుంటే.. మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్టుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తున్నట్టు తెలిసింది. ఇలాగైతే ఏఈవోలు ఎవరి మాట వినాలి, ఏం చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. పత్తి విత్తనాల సరఫరా విషయంలోనూ ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏటా వానాకాలంలో 14 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. అందులో వరి తర్వాత పత్తిసాగు రెండో స్థానంలో ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇక్కడ రైతులకు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఆద్య రకం పత్తి విత్తనాలకు అధిక డిమాండ్ ఉంది. రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని విత్తన డీలర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విత్తన ప్యాకెట్‌ను రూ.1,800 వరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. ఇందుకోసం 7.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులోకి వచి్చన విత్తన ప్యాకెట్లు 3.76 లక్షలు మాత్రమే. తమకు అవసరమైన రకం లేకపోవడంతో రైతులు ఇతర విత్తనాలు కొనడం లేదు. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చోట్ల బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలాయి. వ్యాపారులు లైసెన్స్ లేకుండా లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. 2.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1.45 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ తమకు అవసరమైన రకాలు, కంపెనీల విత్తనాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 2.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా. కానీ ఇప్పటివరకు 1.20 లక్షల ప్యాకెట్లు మాత్రమే జిల్లాకు వచ్చాయి. ⇒ నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగవుతుందని అంచనా వేశారు. 15 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అవసరమంటూ వ్యాపారులు ఇండెంట్లు పెట్టారు. అందులో ఇప్పటివరకు 4 లక్షల ప్యాకెట్లు విత్తన దుకాణాల్లో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందులో రైతులు కోరుకునే రకాలు, బ్రాండ్లు మాత్రం కనిపించడం లేదు. ⇒ ఖమ్మం జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. 4.50 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతులు కోరుకుంటున్న విత్తనాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడి రైతులు యూఎస్ 7067 రకం విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు గత ఏడాది మంచి దిగుబడులు ఇచ్చాయని అంటున్నారు. కానీ దుకాణాల్లో ఆ రకం విత్తనాలు దొరకడం లేదు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారుల అంచనా. ఇందుకోసం 11.34 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు కావాలి. ఇప్పటివరకు డీలర్లు, వ్యాపారులకు చేరినది 8 లక్షల ప్యాకెట్లు మాత్రమే. చాలా చోట్ల రైతులకు అవసరమున్న రకాల విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా ఒక్కో ప్యాకెట్‌ను రూ.864కు బదులుగా రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూఎస్ 7067 రకం లేవంటున్నారు యూఎస్ 7067 రకం పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ఈ కాయల నుంచి పత్తి తీయడం సులువు. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లపైన దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది. దీన్ని తీసేశాక రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. కానీ మార్కెట్లో ఈ రకం విత్తనాలు లేవంటున్నారు. – నునావత్ కిషోర్, రైతు, పీజీ తండా, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా పోయినేడు దిగుబడి బాగా వచి్చంది.. మళ్లీ అదే వేస్తం నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత ఏడాది రాశి 659 రకం పత్తి విత్తనాలు సాగు చేస్తే.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. అందుకే ఆ రకం విత్తనాలు వచ్చే వరకు వేచి చూసిన. స్టేషన్‌ఘన్‌పూర్ ఎరువుల దుకాణంలో ఒక్కో ప్యాకెట్ రూ.864 చొప్పున 4 ప్యాకెట్లు కొన్నా. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. – కత్తుల కొమురయ్య, రైతు, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, జనగాం జిల్లా -
బేబమ్మ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
కృతి శెట్టి.. తెలుగు ప్రేక్షకుల అభిమాన ఉప్పెనలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆచితూచి సినీ అవకాశాలను అందుకుంటున్నట్టే ఫ్యాషన్ బ్రాండ్స్‌నూ ఆచితూచే ఎంచుకుంటూ కంఫర్ట్‌నే తన స్టయిల్‌గా మార్చుకుంది. ఆమె ఫాలో అవుతున్న బ్రాండ్స్‌లో ఓ రెండు ఇక్కడ.. మనల్ని మనలా ఇష్టపడటంలోనే అసలైన అందం ఉంటుంది ‘ఉప్పెన’లో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేం కదా! కొన్నిసార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రాన ప్లాస్టిక్ సర్జరీ అంటారా? నిజానికి మనల్ని మనలా ఇష్టపడటంలోనే అసలైన అందం ఉంటుంది! నితికా గుజ్రాల్.. ఎంతోమంది సెలబ్రిటీలకు ఇష్టమైన బ్రాండ్. ముంబైకి చెందిన నితికా అతి చిన్న వయసులోనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగింది. అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్‌ను రూపొందించడంలో ఆమెది ప్రత్యేక ముద్ర. ఈ బ్రాండ్‌కి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ధర మాత్రం లక్షల్లోనే. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. నితికా గుజ్రాల్ డిజైనర్ ధర రూ. 58,500/- అకోయ జ్యూలరీ.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ట్రెండ్‌కి తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్‌లో తెగ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజే ఈ బ్రాండ్‌ను సెలబ్రిటీలకూ డిజైన్స్‌ను అందించే స్థాయికి చేర్చింది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్లోనే కొనుగోలు చేసే వీలు ఉంది. ఈ జ్యూలరీ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: ముఖానికి ఫేస్ యోగా! దెబ్బకు మొటిమలు, మచ్చలు మాయం!) -
IAA MOBILITY 2023: ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ షో - ఔరా అనిపిస్తున్న బ్రాండెడ్ కార్లు (ఫోటోలు)
-
మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్లు యూజర్ల ఏటాను చోరీ చేస్తున్నాయా? అంటే నివేదికలు అవుననే అంటున్నాయి. మోడ్రన్ టాప్ బ్రాండ్స్ కార్లలో డేటా ప్రైవసీ అనేది పీడకలే అంటూ కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ తన తాజా పరిశోధనలో వెల్లడించింది. దాదాపు 25 కార్ బ్రాండ్లను సమీక్షించింది. ఆ సందర్బంగా సెక్స్ లైఫ్ నుంచి ఇష్టా ఇష్టాలు, పాలిటిక్స్ గగుర్పాటు కలిగించే ఇతర విషయాలు అన్నీ లీక్ అవుతున్నాయంటూ సంచలన అధ్యయన నివేదికను ప్రకటించింది. (గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్ ) మొజిల్లా ఫౌండేషన్ నిర్వహించిన వినియోగదారు గోప్యతా పరీక్షల్లో అవన్నీ విఫలమయ్యాయని తేలింది. పరిశోధనలో 84శాతం కార్ కంపెనీలు కారు యజమానుల నుండి సేకరించిన డేటాను సమీక్షించాయి, పంచుకుంటాయి లేదా విక్రయించాయి అని వెల్లడించింది. డ్రైవింగ్ డిజిటల్‌గా మారుతున్న యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, విక్రయించడంపై ఆందోళన వ్యక్తం చేసిన మొజిల్లా అసలు తమ పరిశోధనలోని కంపెనీలేవీ గోప్యతపై దాని ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరచలేదని తెలిపింది. సెక్స్ టాయ్‌లు ,మానసిక ఆరోగ్య యాప్‌ల తయారీదారులతో సహా ఇంత పేలవమైన సమీక్ష రాలేదని తెలిపింది. కార్ల తయారీదారులు తమ కార్లను 'కంప్యూటర్ ఆన్ వీల్స్' అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అంతా డొల్ల అని ప్రైపసీ ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌కు ప్రసిద్ధి చెందిన మొజిల్లా రిపోర్ట్ చేసింది. "ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే డోర్‌బెల్‌లు, గడియారాలు తమపై గూఢచర్యం చేస్తున్నాయని ఆందోళన నేపథ్యంలో కార్ బ్రాండ్లు కూడా తమ వాహనాలను డేటా-గాబ్లింగ్ మెషీన్లుగా మార్చడం ద్వారా నిశ్శబ్దంగా డేటా వ్యాపారంలోకి ప్రవేశించాయని మొజిల్లా పేర్కొంది. అధ్యయనం ప్రకారం టెస్లా టాప్‌లో ఉందంటూ మరో బాంబు పేల్చింది.నిస్సాన్ రెండో స్థానంలో నిలిచింది. నిస్సాన్ సేకరించే డేటాలో “లైంగిక కార్యకలాపాలు” ఎక్కువగానూ, అలాగే కియా కంపెనీ ప్రైవసీ సిస్టం ప్రకారం, జాతి, మతపరమైన లేదా తాత్విక విశ్వాసాలు, లైంగిక ధోరణి, లైంగిక జీవితం, రాజకీయ అభిప్రాయాలతోపాటు "ట్రేడ్ యూనియన్ సభ్యత్వం" సమాచారంతో సహా "ప్రత్యేక వర్గాల" డేటాను ప్రాసెస్ చేయవచ్చని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!) 84 శాతం బ్రాండ్స్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు , ఇతర బహిర్గతం చేయని వ్యాపారాలతో పంచుకున్నట్లు అంగీకరించినట్లు అధ్యయనం తెలిపింది. ఎక్కువమంది, 76 శాతం కస్టమర్ల డేటాను విక్రయించినట్లు చెప్పడం గమనార్హం. సగం కంటే ఎక్కువమంది డేటాను షేర్ చేస్తున్నట్టు చెప్పారు. కనెక్టెడ్ వాహనాలు డ్రైవింగ్ డేటామాత్రమే కాకుండా, వాహనంలోని వినోదం, శాటిలైట్ రేడియో మ్యాప్ లాంటి థర్డ్-పార్టీ ఫంక్షన్లను ట్రాక్ చేస్తున్నాయట. అత్యధిక సంఖ్యలో కార్ బ్రాండ్లు, 92 శాతం, కేవలం ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్, Dacia బ్రాండ్‌తో వినియోగదారులకు వారి వ్యక్తిగత డేటాపై ఎటువంటి నియంత్రణ లేకుండా అందిస్తోంది. బహుశా యూరోపియన్ యూనియన్ చట్టానికి లోబడి డేటా డిలిట్ రైట్ను వినియోగదారులకు అనుమతించి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. కనీస భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్నుటికీ ఫోర్డ్, చేవ్రొలెట్, టయోటా, వోక్స్వ్యాగన్ , BMW వంటి కార్ల బ్రాండ్లు ఏవీ కూడా గత మూడేళ్లుగా 68 శాతం డేటా లీక్‌లు, హ్యాక్‌లు లేదా ఉల్లంఘన బారిన పడుతున్నాయని మొజిల్లా ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్టడీపై టాప్ కంపెనీలేవీ ఇంకా ఎలాంటి స్పందన ప్రకటించలేదు. (రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?) కాగా ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్లు, భద్రత, డేటా నియంత్రణ, ఏఐ కి సంబంధించిన అన్ని రివ్యూల్లో ఫెయిల్ అనే విమర్శలను ఎదుర్కొంది. కస్టమర్ల కార్లలోని కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు,ఫోటోలు ను ఉద్యోగులు పంచుకోవడం దుమారాన్ని రేపింది. అయితే 2021లో, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా చైనా సైనిక మిలిటరీకి ఈ వాహనాలను నిషేధించిన తర్వాత చైనాలో కెమెరాలు నిలిపివేసినట్టు టెస్లా ప్రకటించింది. -
తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ
ప్రముఖ వ్యాపార సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించ నుంది. ఇప్పటికే పలురంగాల్లో దూసుకుపోతున్న కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని సంస్థ వేల కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆదిత్యా బిర్లా ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5000 కోట్ల పెట్టుబడితో 'నావల్ జ్యువెల్స్' అనే కొత్త వెంచర్ కింద ఆభరణాల వ్యాపారం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన డిజైన్, అధిక నాణ్యత కలిగిన ఆభరణాల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో కొత్త వెంచర్ ఉంటుందని పేర్కొంది. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియో అని, తద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ కావడానికి, సంస్థ ఉనికిని విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. ఇప్పటికే పెయింట్స్, B2B ఇ-కామర్స్‌లో ప్రవేశించడమే కాకుండా, మెటల్ పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఇపుడిక బ్రాండెడ్ జ్యువెలరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) దీంతో టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్, రిలయన్స్ జ్యువెల్స్‌తో పోటీ పడనుంది ఆదిత్య బిర్లా గ్రూప్. కంపెనీ డేటా ప్రకారం, దేశీయ ఆభరణాల మార్కెట్ 2025 నాటికి సుమారు రూ. 7.43 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత రత్నాభరణాల మార్కెట్ వాటా దేశ జీడీపీలో 7 శాతం. -
బ్రాండెడ్ గుడ్డు గురూ.. ‘ఎగ్గోజ్’తో మరో సంచలనం!
సాక్షి, అమరావతి : బ్రాండింగ్ మానియా ఇప్పుడు కోడిగుడ్లకూ వచ్చి చేరింది. వివిధ రంగుల్లో, వివిధ పరిమాణాల్లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి వివిధ బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నారు. ఆహార పదార్థాల కొనుగోళ్లలో వినియోగదారులు నాణ్యతకు అధిక ప్రాధాన్యతనిస్తుండటంతో వారి అంచనాలకనుగుణంగా గుడ్లను ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి రసాయనాలు, యాంటి బయోటిక్స్ వినియోగించని సహజ సిద్ధమైన కోడి గుడ్లు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న గుడ్లు, అధిక ప్రొటీన్లున్న గుడ్లు.. ఇలా రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. సాధారణ గుడ్డు ధరతో పోలిస్తే ఈ బ్రాండెడ్ గుడ్ల ధరలు అధికంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం సాధారణ గుడ్డు ధర బహిరంగ మార్కెట్లో రూ.6 ఉంటే, బ్రాండెడ్ గుడ్డు దాని లక్షణాలను బట్టి ధర రూ.10 నుంచి రూ.25 దాకా ఉంటోంది. ఉదాహరణకు హ్యాపీ హెన్స్ బ్రాండ్‌తో విక్రయిస్తున్న సంస్థ ఫ్రీ రేంజ్ ఎగ్స్‌ను ఒక్కోటి రూ.25కు విక్రయిస్తోంది. ఈ గుడ్డు బరువు 100 గ్రాములుండటమే గాక, అధిక ప్రొటీన్లు, విటమిన్లతో ఉంటుందని చెబుతోంది. ‘ఎగ్గోజ్’తో సంచలనం ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన అభిషేక్ నగీ 2017లో తొలిసారిగా ఎగ్గోజ్ పేరుతో బ్రాండెడ్ ఎగ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఐఐటీ పూర్తి చేశాక ఒక రిటైల్ సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటికీ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. కోడిగుడ్లు అధికంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుండటం, వినియోగం మాత్రం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండటాన్ని నగీ గమనించాడు. పైగా దక్షిణాది నుంచి ఉత్తరాదికి గుడ్డు రావడానికి ఎనిమిది రోజులకు పైగా సమయం పడుతోంది. ఈలోపు తనలో ఉన్న సహజసిద్ధమైన ప్రొటీన్లు కొన్నింటిని ఆ గుడ్డు కోల్పోతున్న విషయాన్ని గుర్తించారు. గుడ్డు పెట్టిన 24 గంటల్లోగా వినియోగదారుడికి చేర్చేలా ఎగ్గోజ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టి విజయం సాధించాడు. ఆ తర్వాత అనేక మంది బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ మార్కెట్లలో ఎగ్గోజ్తో పాటు కెగ్స్, గుడ్ మార్నింగ్, హలో, ఎగ్గీ, హెన్ ఫ్రూట్, ఫ్రెషో, ఫామ్ మేడ్, బీబీ కాంబో, హ్యాపీ హెన్ తదితర బ్రాండెడ్ గుడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కోళ్ల పెంపకం దగ్గర నుంచి గుడ్డు ఎంపిక వరకూ అంతా ప్రత్యేకం. కొన్ని కోళ్లను సహజసిద్ధమైన వాతావరణం అంటే తోటల్లో పెంచితే, మరికొన్నింటిని ఫామ్స్‌లో పెంచుతారు. వాటికి దాణా, మందులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని కోళ్లకు శాఖాహార దాణాను అందిస్తూ పెంచితే, మరికొన్నింటిని హెర్బల్స్, జీడిపప్పు, బాదంపప్పు వంటి ప్రత్యేక దాణాతో పెంచుతున్నారు. సాధారణంగా కోడిగుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాముల మధ్యలో ఉంటుంది. గుడ్డు పరిమాణం పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది. 53–60 గ్రాముల మధ్యలో ఉండే గుడ్లను ప్రీమియం గుడ్లుగా, 60 గ్రాముల దాటితే సూపర్ ప్రీమియంగానూ పరిగణించి ధర నిర్ణయిస్తుంటారు. బ్రాండెడ్ గుడ్డును ఎంపిక చేసేప్పుడు గుడ్డుపై పెంకు నాణ్యత కూడా కీలకం. మచ్చలు లేకుండా పరిశుభ్రంగా ఉండి, మరీ మందంగా కాకుండా పల్చగా ఉండే గుడ్లను ఎంపిక చేస్తున్నారు. వాటిని అందంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా గుడ్ల ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ రూ.25,412.32 కోట్లుగా ఉంటే, అది ఏటా 6 శాతంపైన వృద్ధి చెందడం ద్వారా 2028 నాటికి రూ.37,960.24 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశించాం.. బ్రాండెడ్ ఎగ్స్ మార్కెట్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. హలో బ్రాండ్ పేరుతో మేమూ ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాం. ఇందుకోసం దాణా దగ్గర నుంచి గుడ్ల ఎంపిక వరకు అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హై ఎండ్ ధరల సెగ్మెంట్లోకి కాకుండా సాధారణ గుడ్డు కంటే రెండు మూడు రూపాయలు అధికంగా ఉండే మార్కెట్‌పై తొలుత దృష్టిసారిస్తున్నాం. – సురేష్ చిట్టూరి, ఎండీ, శ్రీనివాస హేచరీస్ -
ఫాస్ట్‌ఫుడ్.. హెల్త్బ్యాడ్! తెల్లగా మారితే.. ఆరెంజ్ కలర్ వేసి మరీ.. వామ్మో!
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పద్నాలుగేళ్ల బాలుడు రాకేశ్ ఏడాదిగా అత్యధిక రోజులు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో తింటున్నాడు. పొట్టలో విపరీతమైన నొప్పి రావడంతో వైద్యుని వద్దకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడిందని ఫాస్ట్‌ఫుడ్ మానేయాలని సూచించాడు. గంభీరావుపేటకు చెందిన ఓ రైతు పది హేను రోజుల క్రితం పని నిమిత్తం సిరిసిల్లకు వచ్చి మధ్యాహ్నం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో నోటికి రుచికరమైన పదార్థాలు ఆరగించాడు. సాయంత్రం ఇంటికెళ్లేసరికి వాంతులు, విరేచనాలు కావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. దీనికి కారణం వెతకగా..ఫాస్ట్‌ఫుడ్‌గా తేల్చారు. సాక్షి, సిరిసిల్లటౌన్: జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. నాణ్యత లేని పదార్థాలతో చేస్తున్న వంటలు ప్రజలను ఆస్పత్రుల పాలుచేస్తుంది. జంక్‌ఫుడ్‌గా పిలిచే ఫాస్ట్‌ఫుడ్ అలవాటుగా చేసుకుంటే ప్రాణాల మీదికొచ్చే అవకాశం ఉన్నా జనాలు పట్టించుకోవడం లేదు. ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతున్నా నియంత్రించాల్సిన అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా జిల్లాలో ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న నాసిరకం, నిబంధనలు పాటించకుండా తయారు చేసే ఫాస్ట్‌ఫుడ్‌పై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.. రూ.కోట్లలో వ్యాపారం ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ ఒకప్పుడు నగరాల్లోనే ఉండేది. ఇప్పుడది ప్రతీ పల్లెకు విస్తరించింది. చిన్నపాటి గ్రామంలో సైతం ఫాస్ట్‌ఫుడ్‌ను జనాలు ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని పాడుచేసేదే అయినా అధిక లాభాలు వస్తుండడంతో వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, ప్రధాన పల్లెలు, హైవేపై ఉండే గ్రామాల్లో సైతం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వర్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 పైగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో రోజుకు తక్కువలో తక్కువగా రూ.10లక్షల వరకు దందా సాగుతోంది. నెలకు రూ.3కోట్లలో ఫాస్ట్‌ఫుడ్ దందా జరుగుతుంది. నిబంధనలు బేఖాతర్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, నూనెలు వినియోగించాల్సి ఉండగా.. ఎక్కువ ఫాస్ట్సెంటర్లలో నాసిరకం వాడుతున్నట్లు సమాచారం. నాణ్యమైనవి, బ్రాండెడ్ వాడాలంటే.. ఖరీదు కాబట్టి.. తక్కువ రేటుకు దొరికే పదార్థాలు, నూనెలు వాడుతున్నారు. రుచి కోసం ఆహారంలో నిశేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నాణ్యమైనవి వాడుతున్నామని ఫాస్ట్‌సెంటర్ నిర్వాహకులు చెబుతున్నా..ఏళ్ల తరబడిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వహణపై తనిఖీలు చేపట్టే అధికారం ఉన్న శాఖలు ‘మామూలు’గా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవీ ప్రభావాలు.. చికెన్ ఫ్రైడ్‌రైస్ చేసేటప్పుడు తెల్లగా మారిన చికెన్‌ను ఆరెంజ్ రంగు వేసి కనిపించకుండా చేస్తారు. ఈ కలర్ ప్రభావం ఒకసారి మన చేతికి అంటితే వారం రోజుల వరకు రంగు పోదు. సోయాసాస్ రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు లేదా కొన్ని రోజులుగా కాగిన నూనెను వాడుతున్నట్లు సమాచారం. ఖరీదు తక్కువ..ఆరోగ్యాన్ని దెబ్బతీసే పామాయిల్ వాడుతున్నట్లు తెలుస్తుంది. ఫ్రైస్ వంటి వంటకాలకు చేతికి దొరికిన పిండిని కలిపేస్తున్నారు. దానిలో పురుగులు ఉంటున్నాయి. టమాట సాస్ ఎక్కువ మోతాదులో ఒకేసారి కొని పెడతారు. కొన్ని సందర్భాలలో పాడైన వాటిని పడేయకుండా వాడతారు. చిల్లీసాస్ వాసన చూస్తే వాంతులు రావడం ఖాయంగా ఉంటోంది. దీని వాడకంతో డబ్బులు బాగానే సంపాదిస్తారు. కానీ ఆరోగ్యంపై పట్టింపు ఉండకుండా దందా సాగిస్తారు. నిబంధనలు పాటించకుంటే కేసులు ప్రజా ఆరోగ్యం దెబ్బతీసే పదార్థాలు వాడొద్దు. వంటశాలలు, హోటల్స్ పరిశుభ్రంగా ఉంచాలి. కస్టమర్లకు తాగునీరు ఇవ్వాలి. మాంసాహారం, సూప్‌లు నిలువ ఉంచినవి వాడొద్దు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, హోటల్స్ నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. లేకుంటే కేసులు నమోదు చేస్తాం. – వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ (చదవండి: గోదావరిఖని.. ఇక పర్యాటక గని!) -
బ్రాండెడ్, జనరిక్ మందుల మధ్య తేడా తెలుసుకోండి ఇలా..
సాక్షి, కర్నూలు: రోగమొచ్చిందంటే వ్యాధి కంటే దాని చికిత్సకయ్యే ఖర్చును తలచుకుని ఆందోళన, దిగులు చెందే పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా, తక్కువ ధరలో లభ్యమయ్యే మందులు ఉన్నా వాటిపై అవగాహన ఉండేది కొద్దిమందికి మాత్రమే. బ్రాండెడ్‌తో పోలిస్తే జనరిక్ మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నా యి. నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మూడు మెడికల్ షాపులు ఉన్నాయి. 2014 నుంచి ఈ మూడు దుకాణాలను జనరిక్ మందుల విక్రయశాలలుగా మార్చారు. ప్రస్తుతం జీవనధార మందుల దుకాణాలుగా ఇవి చెలామణి అవుతున్నాయి. చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు వీటితో పాటు ప్రైవేటుగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో పలువురు వ్యక్తులు జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇవి 10కి పైగా ఉన్నాయి. అయితే వైద్యుల ప్రోత్సాహం లేని కారణంగా వీటికి ఆదరణ తక్కువగా ఉంటోంది. జనరిక్ మందులు నాణ్యత ఉండవని చెబుతూ అధికంగా బ్రాండెడ్ మందులనే వైద్యులు సూచిస్తున్నారు. ఎవరైనా రోగం తగ్గించుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యులు బ్రాండెడ్ మందులనే రోగులకు రాస్తున్నారు. బ్రాండెడ్ మందులు రోగులకు రాస్తే ఆయా ఫార్మాకంపెనీలు వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టజెబుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ కారణంగానే వారు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులను ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. భారతీయ వైద్య విధాన మండలి సైతం జనరిక్ మందులే రాయాలని పలుమార్లు హెచ్చరించినా వైద్యుల్లో మార్పు రావడం లేదు. చివరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రభుత్వ వైద్యులు సైతం జనరిక్ మందులు కాకుండా బ్రాండెడ్ మందులే రోగులకు రాస్తున్నారు. జనరిక్ మందులు రాస్తే రోగులకు 70 నుంచి 80 శాతం ఖర్చు తగ్గుతుందని తెలిసినా వారు ఆ పనిచేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి మార్పూ ఉండదు బ్రాండెడ్, జనరిక్ మందుల్లో ఉండేది ఒకే రకమైన ఔషధమే. బ్రాండెడ్ మందులకు ఉత్పత్తి ఖర్చుతో పాటు డీలర్, హోల్‌సేల్, రిటైల్ల లాభాలు, వైద్యుల కమీషన్లు అందులోనే ఉంటాయి కాబట్టి వాటి ధర అధికం. ఉదాహరణకు డోలో 650 అనేది బ్రాండెడ్ మందు. కేవలం పారాసిటమాల్ అనేది దాని జనరిక్ పేరు. వైద్యులు పారాసిటమాల్ అని రాయాలి. కానీ అలా చేయడం లేదు. నోవామాక్స్ అనేది బ్రాండెడ్ కాగా అందులోని అమాక్సిలిన్ జనరిక్ మందు పేరు. అయితే కొన్ని ఫార్మాకంపెనీలు ఏది బ్రాండెడ్ మందో, ఏది జనరిక్ మందో తెలియనంతా మందులు తయారు చేస్తూ వైద్యులనే అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోంది జనరిక్ మందులు నాణ్యతలో బ్రాండెడ్ మందులతో ఏ మాత్రం తీసిపోవు. పైగా ఇవి బ్రాండెడ్ మందుల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తోంది. –ఎ.రమాదేవి, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు -
కంపెనీలకే దడ పుట్టిస్తున్న ఫేక్ యాక్సెసరీస్.. ఆశపడ్డారో.. అంతే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌కు దేశంలో బలమైన డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు బ్రాండెడ్ ఉత్పత్తుల తయారీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. బ్రాండెడ్ ఉత్పత్తులతో సమాంతరంగా నకిలీలు, దొంగిలించిన, చట్ట విరుద్ధంగా దిగుమతి చేసుకున్న ప్రొడక్ట్స్‌తో ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్కెట్ వృద్ధి చెందడం ఇందుకు కారణం. నకిలీలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం, చైనా నుండి తక్కువ ధరలకు పెద్దమొత్తంలో ఉత్పత్తులు వెల్లువెత్తుతుండడం కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టిసారిస్తూనే మరోవైపు నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆహోరాత్రులూ శ్రమించాల్సిన పరిస్థితి బ్రాండెడ్ కంపెనీలది. 2019 సెప్టెంబర్‌లో ఫిక్కీ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌తో సహా అయిదు రంగాల్లో నకిలీ ఉత్పత్తులు, అక్రమ రవాణా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏటా రూ.1.17 లక్షల కోట్లు నష్టపోతోంది. పట్టుపడుతూనే ఉన్నాయి.. ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో ఇయర్‌ఫోన్స్, చార్జర్స్, అడాప్టర్స్, యూఎస్బీ కేబుల్స్ వంటి రూ.73.8 లక్షల విలువైన 9 వేల పైచిలుకు నకిలీ ఉత్పత్తులను సీజ్ చేసినట్టు షావొమీ ప్రకటించింది. 2020లో కంపెనీ రూ.33.3 లక్షల విలువైన సుమారు 3 వేల ఉత్పత్తులను సీజ్ చేసింది. దీనినిబట్టి చూస్తే నకిలీలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఈ నకిలీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయని షావొమీ అంటోంది. కోవిడ్ రాకతో ఈ ఉత్పత్తులను ఏకంగా ఆన్లైన్ వేదిక ద్వారా విక్రయిస్తున్నారని వెల్లడించింది. జేబీఎల్, ఇన్ఫినిటీ బ్రాండ్ నకిలీ ఉత్పత్తులను ఢిల్లీలో ఇటీవలే స్వాధీనం చేసుకున్నట్టు శాంసంగ్ అనుబంధ కంపెనీ హర్మాన్ తెలిపింది. కాగా, ఐడీసీ గణాంకాల ప్రకారం భారత మార్కెట్లో 2022 జనవరి-జూన్ కాలంలో 3.8 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. నియంత్రణ లేక.. చిన్న గ్యాడ్జెట్స్‌లో నకిలీలను సులువుగా తయారు చేయవచ్చని, వీటిని చైనా నుంచి సులభంగా తీసుకు రావొచ్చని టెక్ఆర్క్ ఫౌండర్ ఫైజల్ కవూసా తెలిపారు. ‘ఆఫ్‌లైన్ మార్కెట్లు ప్రధాన విక్రయ కేంద్రంగా ఉన్నప్పటికీ.. ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లో కఠినమైన తనిఖీలు లేకపోవడం వల్ల నకిలీ ఉత్పత్తుల చెలామణి పెరిగింది. ఆన్లైన్లో ఎవరైనా ఉత్పత్తులను నమోదు (లిస్ట్) చేసి విక్రయించవచ్చు. ఇది నకిలీలను విక్రయించడాన్ని సులభతరం చేసింది’ అని వివరించారు. ఐఎంఈఐ నంబర్‌తో స్మార్ట్ఫోన్లను ట్రాక్ చేయడానికి, గుర్తింపునకు ఆస్కారం ఉంది. యాక్సెసరీస్‌కు ఇటువంటి సౌకర్యం లేదు. యాపిల్‌ఎయిర్‌పాడ్స్‌ను ఫోన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. -
రష్యా అకృత్యాలు.. మాటలు రావడం లేదు
Ukrainian Member of Parliament Lesia Vasylenk: ఉక్రెయిన్ పై నెలరోజులకు పైగా దాడులు కొనసాగిస్తున్న రష్యా ఇప్పుడు మరింత దారుణమైన అకృత్యాలకు పాల్పడుతోంది. రష్యా బలగాలను వెనక్కి మళ్లించి సైనిక దాడిని తగ్గించింది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పుడు యుద్ధ నేరాలకు పాల్పడుతోంది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కి సమీపంలో బుచా నగరంలో రష్యా బలగాలు పౌరులపై అత్యంత దారుణంగా కాల్పులు జరపడమే కాకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెనియన్ ఎంపీ, పార్లమెంటు సభ్యురాలు లెసియా వసిలెంక్ ట్విట్టర్లో రష్యా ఆగడాల పై విరుచుకుపడ్డారు. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని ప్రజలను దోచుకోవడమే కాకుండా అత్యాచారాలు చేసి చంపుతున్నారని ఆక్రోశించారు. రష్యాని అనైతిక నేరాల దేశంగా అభివర్ణించారామె. మైనర్లని కూడా చూడకుండా అత్యాచారాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పార్ట్‌లను నాశనం చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా రేప్ చేసి శరీరాలపై స్వస్తిక్ ఆకారంలోని ముద్రలు వేస్తున్నారని చెప్పారు. అత్యాచారం చేసి చంపేసిన మహిళ మృతదేహం ఇది. మాటలు రావడం లేదు. నా మనస్సు కోపం, ద్వేషంతో స్తంభించిపోయింది అని ట్వీట్ ఆమె చేశారు. యుద్ధానికి సంబంధించిన ముఖ్యాంశాలు: ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. అప్పటి నుంచి నిరవధిక దాడులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతూనే ఉంది. యుద్ధంలో వేలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోగా, 4 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాజధాని కైవ్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లి ఉక్రెయిన్ తూర్పు భాగాలపై దృష్టి సారిస్తామని రష్యా గత వారం ప్రకటించింది. రష్యా బలగాల తిరోగమనం నేపథ్యంలో వారు విధ్వంసాన్ని విడిచిపెట్టి నరమేథానికి పాల్పడుతున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్‌లో బుచా నగరం చుట్టూ అనేక మృతదేహాలు పడి ఉన్నాయి. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించగా, రష్యా ఆరోపణలను ఖండించింది. Russian soldiers loot, rape and kill. 10 y.o. girls with vaginal and rectal tears. Women with swastika shaped burns. Russia. Russian Men did this. And Russian mothers raised them. A nation of immoral criminals — Lesia Vasylenko (@lesiavasylenko) April 3, 2022 (చదవండి: భయానకం: ఉక్రెయిన్ బుచాలో శవాల గుట్టలు.. అత్యాచార బాధితుల శవాలు!) -
బ్లాక్‌మనీ తగ్గింది
75–80 శాతం తగ్గిన నల్లధనం లావాదేవీలు ∙తుది వినియోగదారులతో గృహాలకు డిమాండ్: అనరాక్ కన్సల్టెన్సీ పెద్ద నోట్ల రద్దు అనే చెట్టు ఫలాలు చేతికొస్తున్నాయి. డీమానిటైజేషన్ తర్వాత దేశీయ గృహ విభాగం గతుకుల రోడ్ల మీద ప్రయాణంలా మొదలై.. నేడు హైవే మీద దూసుకెళుతోంది. ఊహాజనిత కొనుగోళ్లు, విక్రయాలు పూర్తిగా తొలగిపోయాయి. దేశీయ గృహ విభాగంలో నల్లధనం లేదా నగదు లావాదేవీలు 75–80 శాతం మేర క్షీణించాయి. తుది వినియోగదారులతో గృహ విభాగంలో అసలు డిమాండ్ ఏర్పడింది. ఇంటిని ఎందుకు కొంటున్నాం.. ఎందుకు విక్రయిస్తున్నామనే ప్రాథమిక అంశాలను నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకునేలా నోట్ల రద్దు మార్చేసింది. సాక్షి, హైదరాబాద్: దేశంలో 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) అమల్లోకి వచ్చింది. రియల్టీ రంగాన్ని డీమానిటైజేషన్‌కు ముందు, తర్వాత అని విభజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోట్ల రద్దు తర్వాత కొత్త గృహాల ప్రారంభాలు క్షీణించగా.. విక్రయాలు పెరిగాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. తొలి ఏడాది కాలం పాటు గందరగోళం, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన నగరాల్లోని రియల్టీ మార్కెట్ ప్రతికూలంలోకి వెళ్లిపోయింది. దీంతో గృహాల ప్రారంభాలు గణనీయంగా తగ్గిపోయాయి. డీమానిటైజేషన్‌కు ముందు ((2013 నుంచి 2016 మూడో త్రైమాసికం– క్యూ3) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 16.15 లక్షల యూనిట్లు లాంచింగ్ కాగా.. డీమో తర్వాత (2016 క్యూ4 నుంచి 2021 క్యూ3) 9.04 లక్షల యూనిట్లకు తగ్గాయి. సుమారు 44 శాతం లాంచింగ్‌లు క్షీణించాయి. విక్రయాలలో వృద్ధి.. పెద్ద నోట్ల రద్దుకు ముందు 11.78 లక్షల గృహాలు అమ్ముడుపోగా.. నోట్ల రద్దు తర్వాత 10.37 లక్షల గృహాలు సేలయ్యాయి. తుది వినియోగదారుల కొనుగోళ్లతో ప్రధాన నగరాల్లో రియల్టీ మార్కెట్ బలపడింది. డీమానిటైజేషన్ తర్వాత లగ్జరీ మార్కెట్ కూడా కాసింత ప్రభావానికి లోనైనప్పటికీ.. కరోనా మహమ్మారితో సానుకూల డిమాండ్‌ను కొనసాగిస్తుంది. డెవలపర్లు సప్లయి, డిమాండ్లను నిశితంగా పరిశీలిస్తున్నారని.. విక్రయాలను బట్టి కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. సరఫరా కంటే విక్రయాలకు డిమాండ్ ట్రెండ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. రీసేల్‌పై ఎక్కువ ప్రభావం.. ప్రాథమిక మార్కెట్ కంటే సెకండరీ, రీసేల్ ప్రాపర్టీలపై డీమానిటైజేషన్ ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. ఈ విభాగంలోని లగ్జరీ ప్రాపర్టీలు కూడా నగదు లావాదేవీలను ఎక్కువగా కలిగి ఉండటమే ఇందుకు కారణం. డెవలపర్లు విక్రయించే అఫర్డబుల్, మధ్యస్థాయి గృహాలకు (ప్రాథమిక ప్రాపర్టీలు) డిమాండ్ పెరిగింది. అయితే దేశీయ రియల్టీ మార్కెట్లో నల్లధన లావాదేవీలు పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు. కాకపోతే గతంలో మాదిరిగా కాకుండా చాలా మంది తుది వినియోగదారులు ఆస్తి లావాదేవీలను పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు. చిన్న పట్టణాలు, పెరీ అర్బన్ ఏరియాలలో నేటికీ నల్లధన లావాదేవీలు జరుగుతున్నాయి. బ్రాండెడ్ గృహాలకు డిమాండ్.. పెద్ద నోట్ల తర్వాత బ్రాండెడ్, లిస్టెడ్ రియల్టీ కంపెనీలు గృహ విక్రయాలపై మెజారీటీ వాటాను కైవసం చేసుకున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లో నల్లధన లావాదేవీలు క్షీణించాయి. మరోవైపు డీమానిటైజేషన్, రెరా, జీఎస్టీ తర్వాత గృహ కొనుగోలుదారులు బ్రాండెడ్ డెవలపర్ల ప్రాపర్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో లగ్జరీ ప్రాపర్టీలపై దృష్టి పెట్టిన డెవలపర్లు.. ప్రస్తుతం అఫర్డబుల్, మధ్యస్థాయి గృహాల వైపు దృష్టిని మళ్లించారు. దీంతో ఈ తరహా గృహాల సప్లయి కంటే డిమాండ్ పెరిగింది. దేశంలోని 8 ప్రధాన మార్కెట్లలో 2017 ఆర్థిక సంవత్సరంలోని ప్రాపర్టీ విక్రయాలలో లిస్టెడ్ డెవలపర్ల విక్రయాల వాటా 6 శాతంగా ఉండగా.. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ నాటికి 22 శాతానికి పెరిగింది. అలాగే ప్రముఖ నాన్ లిస్టెడ్ డెవలపర్ల వాటా 11 శాతం నుంచి 18 శాతానికి వృద్ధి చెందింది. -
డెస్క్‌టాప్స్ మళ్లీ ఊపందుకున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్ వచ్చాక డెస్క్‌టాప్ కంప్యూటర్ల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కార్యాలయాల్లో మాత్రం ఇప్పటికీ డెస్క్టాప్స్ను వినియోగిస్తున్నారు. కొన్నేళ్లుగా సంప్రదాయ డెస్క్‌టాప్ పీసీల స్థానాన్ని ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లు ఆక్రమించుకుంటున్నాయి. అయితే భారత్‌లో ఈ ఏడాది జనవరి–మార్చిలో పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) అమ్మకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆల్ ఇన్ వన్స్‌తో కలిపి డెస్క్‌టాప్ పీసీల విక్రయాలు సుమారు 5.2 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2020 జనవరి–మార్చితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికం. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ తరగతుల మూలంగా వీటికి తిరిగి డిమాండ్ వచ్చింది. విద్యార్థుల కోసం గతేడాది ట్యాబ్లెట్ పీసీలను ఎంచుకున్న కస్టమర్లు ఈ ఏడాది డెస్క్‌టాప్‌లకు మళ్లారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆఫ్‌లైన్‌లోనే అధికం.. ఆల్ ఇన్ వన్స్ పూర్తిగా వ్యవస్థీకృత రంగానిదే. ఈ విభాగంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. ఇక డెస్క్‌టాప్స్‌లో అసెంబుల్డ్ వాటా 65–70 శాతం, మిగిలినది బ్రాండెడ్ కంపెనీలది. వీటికి కావాల్సిన విడిభాగాలను 100 వరకు టాప్ బ్రాండ్లు, 250 దాకా లోకల్ బ్రాండ్స్ సరఫరా చేస్తున్నాయి. 95 శాతం డెస్క్‌టాప్స్ అమ్మకాలు ఆఫ్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. డెస్క్‌టాప్స్ రూ.17,000ల నుంచి రూ.65,000 వరకు లభిస్తాయి. ఆల్ ఇన్ వన్స్ ధరల శ్రేణి రూ.24–70 వేల వరకు ఉంది. గేమింగ్ శ్రేణి రూ.45,000 నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. ల్యాప్టాప్స్ రూ.20 వేల నుంచి లభిస్తాయి. ఇదీ పీసీ మార్కెట్.. దేశవ్యాప్తంగా 2021 జనవరి–మార్చిలో సుమారు 31 లక్షల ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్స్, వర్క్‌స్టేషన్స్ అమ్ముడయ్యాయి. తొలి త్రైమాసికంలో ఈ స్థాయి విక్రయాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 2020 క్యూ1తో పోలిస్తే 73.1 శాతం వృద్ధి నమోదైందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ చెబుతోంది. పీసీ మార్కెట్లో 75 శాతంపైగా వాటాతో దూసుకెళ్తున్న ల్యాప్టాప్స్ అమ్మకాలు 116.7 శాతం అధికమయ్యాయి. తొలి స్థానంలో ఉన్న హెచ్‌పీ వాటా 32.9 శాతంగా ఉంది. రెండవ స్థానంలో నిలిచిన డెల్ టెక్నాలజీస్ 21.8 శాతం వాటా కైవసం చేసుకుంది. లెనోవో 20.1 శాతం, ఏసర్ గ్రూప్‌నకు 7.7 శాతం వాటా ఉంది. పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగే అమ్మకాలు 10 శాతం ఉంటాయని పరిశ్రమ వర్గాల సమాచారం. అప్‌గ్రేడ్‌కు అనువైనవి.. గతేడాది ఒక్కసారిగా ఆన్లైన్ క్లాసులు తెరపైకి రావడంతో కస్టమర్లు ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ఫోన్లను కొన్నారు. దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది డెస్క్టాప్స్కు మళ్లారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు సైతం వీటిని ఎంచుకుంటున్నారు. అప్‌గ్రేడ్ విషయంలో ల్యాప్‌టాప్‌తో పోలిస్తే డెస్క్‌టాప్ అనువైనది. కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా హార్డ్ డిస్క్, ర్యామ్, గ్రాఫిక్స్ కార్డ్, ఎస్ఎస్డీ సులువుగా మార్చుకోవచ్చు. నచ్చిన సైజులో స్క్రీన్‌ను, కావాల్సిన కెమెరాను అమర్చుకోవచ్చు. పైగా దీర్ఘకాలిక మన్నిక కూడా. – అహ్మద్, ఎండీ, ఐటీ మాల్ -
బ్రాండెడ్ గృహాలదే బాజా
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోళ్లలో బ్రాండ్ మోగిపోతుంది. నాణ్యత, గడువులోగా నిర్మాణాల పూర్తి, ఆధునిక వసతుల కల్పన, రుణాల మంజూరులో ప్రాధాన్యత.. కారణాలేవైనా బ్రాండెడ్ నిర్మాణ సంస్థల గృహాలకు డిమాండ్ పెరిగింది. రెరా, జీఎస్టీ వంటి నిర్మాణాత్మక విధానాల అమలు తర్వాత వీటి ఆధిపత్యం పెరిగింది. లగ్జరీతో పాటు అఫర్డబుల్, మధ్య ఆదాయ విభాగాల గృహాలను నిర్మిస్తుండటంతో లిస్టెడ్, ప్రముఖ డెవలపర్ల విక్రయాలు ప్రతికూల సమయంలోనూ జోరుగా సాగుతున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్స్ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2021 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాలలో (ఏప్రిల్–డిసెంబర్) 93,140 గృహాలు విక్రయమయ్యాయి. ఇందులో ఎనిమిది లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల వాటా 22 శాతంగా ఉండగా.. ప్రధానమైన అన్–లిస్టెడ్ కంపెనీల విక్రయాలు 18 శాతం, ఇతర కంపెనీల విక్రయాలు 60 శాతంగా ఉన్నాయి. 2017 ఎఫ్‌వైలో మొత్తం 2.03 లక్షల గృహాలు విక్రయం కాగా ఇందులో టాప్ 8 లిస్టెడ్ కంపెనీల విక్రయాల వాటా 6 శాతంగా ఉంది. నాన్–లిస్టెడ్ సంస్థల విక్రయాలు 11 శాతం, ఇతరు ల వాటా 83 శాతంగా ఉంది. 2021 ఎఫ్వైలోని లిస్టెడ్ కంపెనీల సేల్స్‌లో అత్యధికంగా 66.4 లక్షల చ.అ. విక్రయాలతో గోద్రెజ్ ప్రాపర్టీస్ ముందు వ రుసలో నిలువగా.. 50.4 లక్షల చ.అ. విక్రయాలలో బెంగళూరు కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ నిలిచింది. క్యూ3లో సేల్స్ అధరహో.. 2021 ఎఫ్వై ఏప్రిల్–డిసెంబర్లో 8 లిస్టెడ్ కంపెనీలు 2.123 కోట్ల చ.అ.లో విక్రయాలను పూర్తి చేశాయి. కోవిడ్–19 ఫస్ట్ వేవ్ 2020 ఎఫ్వైతో పోల్చితే విక్రయాలలో 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2020 ఎఫ్వై ఏప్రిల్–డిసెంబర్లో 2.088 కోట్ల చ.అ. విక్రయాలను చేశాయి. ఎఫ్వై 21లో తొలి మూడు త్రైమాసికాల విక్రయాలను గమనిస్తే.. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో సేల్స్ బాగా జరిగాయి. జూలై–సెప్టెంబర్ (క్యూ2)తో పోలిస్తే క్యూ3 విక్రయాలలో 77 శాతం వృద్ధి నమోదయింది. 8 లిస్టెడ్ కంపెనీలు ఏప్రిల్–జూన్ (క్యూ1)లో 51.6 లక్షల చ.అ. విక్రయాలను పూర్తి చేయగా.. క్యూ2లో 58 లక్షల చ.అ., క్యూ3లో 1.027 కోట్ల చ.అ. విక్రయాలను చేశాయి. జనవరి–మార్చి (క్యూ4)లో ఇప్పటివరకు బ్రిగేడ్, ఒబెరాయ్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్ మూడు కంపెనీలు మాత్రమే ఫలితాలను ప్రకటించాయి. ఇవి 32.1 లక్షల చ.అ.లుగా ఉన్నాయి. లిస్టెడ్, ప్రధాన కంపెనీలివే... ► 8 లిస్టెడ్ కంపెనీలివే: బ్రిగేడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, కోల్టే–పాటిల్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్, ఒబెరాయ్ రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పూర్వాంకర, శోభా. ► ప్రధాన కంపెనీలివే: మైహోమ్ కన్స్ట్రక్షన్స్, అపర్ణా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్, అసెట్జ్ ప్రాపర్టీ, ఏటీఎస్ గ్రీన్, కాసాగ్రాండ్ బిల్డర్స్, కల్పతరు, లోధా గ్రూప్, పిరామల్ రియల్టీ, రన్వాల్ గ్రూప్, సలార్పూరియా సత్త్వా, శ్రీరామ్ ప్రాపర్టీస్, సిగ్నేచర్ గ్లోబల్, సన్‌టెక్ రియల్టీ, టాటా హౌసింగ్ డెవలపర్మెంట్ కో, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, వాధ్వా గ్రూప్, వీటీపీ రియల్టీ. -
‘బ్రాండెడ్’ బాటిళ్లలో ప్లాస్టిక్ కణాలు...!
పీల్చే గాలి, తినే ఆహారం...చివరకు దాహాన్ని తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు తాగాలంటేనే భయపడాల్సిన పరిస్థితులొచ్చేశాయి. పేరొందిన బ్రాండెడ్ మినరల్ వాటర్ కంపెనీలకు చెందిన బాటిల్ నీళ్లలో సూక్ష్మస్థాయిలో ప్లాస్టిక్ ముక్కలున్నట్టు వెల్లడైంది. పూర్తిగా శ్రేయస్కరమైనవని, ఎలాంటి సందేహం లేకుండా తాగేయవచ్చునని భావించే వాటర్ బాటిళ్లలో 90 శాతం కంటే ఎక్కువ వాటిలో అతిచిన్న ప్లాస్టిక్ అవశేషాలున్నట్టు బయటపడింది. కుళాయిల్లోని (నల్లాలు) నీటి కంటే రెండురెట్లు అధికంగా ఈ వాటర్‌బాటిళ్లలో ప్లాస్టిక్ ఫైబర్లున్నట్టు న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేలింది . భారత్‌తో సహా అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో, థాయ్‌లాండ్, లెబనాన్, కెన్యాలలో కొనుగోలు చేసిన బాటిళ్లను పరీక్షించినపుడు విస్మయం కలిగించే ఈ అంశం వెలుగుచూసింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహేచ్‌ఓ) స్పందిస్తూ మంచినీళ్లలో ప్లాస్టిక్ వల్ల వాటిల్లే ప్రమాదాన్ని వెంటనే సమీక్షించనున్నట్టు ప్రకటించింది. ఒక్కో లీటర్లో 10వేల ప్లాస్టిక్ అవశేషాలు.. ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లోని 19 ప్రాంతాల నుంచి 11 రకాల ప్రజాదరణ పొందిన 259 బ్రాండెడ్ మినరల్ వాటర్ బాటిళ్లను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. ప్రతీ లీటర్ మంచినీళ్ల సీసాలో సగటున 325 ప్లాస్టిక్ కణాలున్నట్టు గుర్తించారు. ఒక్కో లీటర్ బాటిల్లో అత్యధికస్థాయిలో 10 వేల ప్లాస్టిక్ అవశేషాలున్నట్టు తెలిసింది. మొత్తం 259 బాటిళ్లలో కేవలం 19 సీసాల్లో మాత్రమే ఎలాంటి ప్లాస్టిక్ లేదని తేలింది. జర్నలిజం ప్రాజెక్ట్ ఆర్బ్ మీడియా సూచన మేరకు న్యూయార్క్స్టేట్ యూనివర్శిటీ వాటర్ బాటిళ్లలోని నీటిని విశ్లేషించే పని చేపట్టింది. కుళాయిల నీళ్లపై గతంలో తాము నిర్వహించిన పరిశోధనతో పోల్చి చూస్తే ‘బాటిల్డ్ వాటర్’’లో మైక్రోప్లాస్టిక్ రెండింతలున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై అధ్యయనానికి ఆర్బ్మీడియా అనుసరించిన విధానాన్ని నెస్ట్లే తప్పుబట్టింది. నైల్రెడ్డై సాంకేతికతో కచ్చితమైన ఫలితాలు వెలువడే అవకాశాలు లేవని సీబీసీ ఏజెన్సీకి ఈ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తాము కఠినతరమైన పద్ధతుల ద్వారా నీటి ఫిల్టరేషన్‌ను చేపడుతున్నట్లు కోకాకోలా బీబీసీకి వెల్లడించింది. అయితే అత్యంత హెచ్చుస్థాయిలో శుద్ధిచేపట్టినపుడు కూడా పర్యావరణంలో అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న ప్లాస్టిక్ ఫైబర్లు అందులో కనిపించే అవకాశాలున్నాయని పేర్కొంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బ్రాండెడ్ పేరుతో కల్తీ దందా
మొయినాబాద్(చేవెళ్ల): సాధారణ బియ్యం, కందిపప్పులను బ్రాండెడ్ పేర్లతో ప్యాకింగ్ చేస్తున్న గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. గోదాంలోని బియ్యం, కందిపప్పుతోపాటు ఇతర సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ రోడ్డులో ఉన్న ఓ వ్యవసాయ క్షత్రంలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. మొయినాబాద్ సీఐ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బేగంబజార్‌కు చెందిన రాంనివాస్సోలంకీకి మొయినాబాద్ మండలంలో జేబీఐఈటీ కళాశాల సమీపంలో అమ్డాపూర్ రోడ్డు పక్కన వ్యవసాయ క్షేత్రం ఉంది.అందులో గరిమ ఎంటర్ప్రైజెస్ పేరుతో గోదాం నిర్మించాడు. ఒడిశా నుంచి తక్కువ ధరకు సాదారణ బియ్యం, కందిపప్పు కొనుగోలు చేసి ఇక్కడి గోదాంకు తీసుకొస్తారు. గోదాంలో వాటిని బ్రాండెడ్ పేర్లతో ప్యాకింగ్ చేస్తారు. కోహినూర్ బాస్మతి రైస్, రియల్ డైమండ్, ఇండియా గేట్ వంటి బ్రాండ్ల పేర్లతో తయారు చేసిన కవర్లలో బియ్యాన్ని, అంకుల బ్రాండ్‌తో తయారు చేసిన కవర్లలో కందిపప్పును ప్యాక్ చేసి నగరంలోని బేగం బజార్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.ఎస్ఓటీ సీఐ ప్రవీణ్‌రెడ్డి, ఏఎస్సై అంతిరెడ్డి సిబ్బందితో వచ్చి దాడి చేశారు. గోదాంలో 200 టన్నుల బియ్యం, 12 టన్నుల కందిపప్పు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు సాధారణ గోధుమ పిండి ఉంది. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బ్రాండెడ్ పేర్లతో ప్యాక్ చేసిన 200 టన్నుల బియ్యం, 12 టన్నుల కందిపప్పును స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, కందిపప్పు విలువ సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుందని.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. రెండేళ్లుగా ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. -
గతవారం బిజినెస్
ఎన్ఎస్ఈ సీఈఓగా వైదొలిగిన చిత్రా రామకృష్ణ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)ఎండీ, సీఈఓగా చిత్రా రామకృష్ణ అనూహ్యమైన పరిస్థితుల్లో వైదొలిగారు. 1992లో ఎన్ఎస్ఈ ఏర్పడినప్పటి నుంచి వివిధ హోదాల్లో ఆమె సేవలందించారు. త్వరలో రానున్న ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) విషయంలో బోర్డు సభ్యులతో ఏర్పడిన విభేదాల వల్లే ఆమె తన పదవి నుంచి వైదొలిగారని సమాచారం. షెడ్యూల్ ప్రకారమైతే, ఆమె పదవీ కాలం 2018 మార్చి వరకూ ఉంది. ఎన్ఎస్ఈ మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే ఆమె వైదొలిగినట్లు తెలియజేసింది. ఇక ఎన్ఎస్ఈ తాత్కాలిక సీఈఓగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవిచంద్రన్ వ్యవహరిస్తారు. ⇔ డిపాజిట్ చేయండి... టాక్‌టైమ్ పొందండి.. అధిక సేవింగ్స ఖాతాల ప్రారంభమే ప్రధాన లక్ష్యంగా కస్టమర్లను ఆకర్షించడం కోసం ఎరుుర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు ఖాతాలో డిపాజిట్ చేసే ప్రతి రూపారుుకి ఒక నిమిషం టాక్‌టైమ్‌ను (ఎరుుర్‌టెల్ నుంచి ఎరుుర్‌టెల్‌కు) ఉచితంగా అందిస్తామని పేర్కొంది. ఈ సౌకర్యం తొలిసారి చేసిన డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1,000ల డిపాజిట్‌తో బ్యాంక్ ఖాతాను తెరిచాడనుకోండి... అతను తన ఎరుుర్‌టెల్ మొబైల్ నంబర్‌పై 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను పొందొచ్చు. ఈ టాక్‌టైమ్‌తో దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఎరుుర్‌టెల్ నంబర్కై నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ⇔ మార్చి 31 వరకు జియో సేవలు ఫ్రీ.. రిలయన్స జియో నూతన సంవత్సర కానుకగా ‘జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ ప్రకటించింది. ప్రస్తుత కస్టమర్లకు డిసెంబర్ 3తో ముగిసిపోతున్న ఉచిత సేవలను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. డేటా, దేశీయంగా వారుుస్, వీడియో కాల్స్, జియో యాప్స్‌ను ప్రస్తుత కస్టమర్లతోపాటు కొత్తగా చేరే వారు సైతం మార్చి వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపారు ⇔ నవంబర్‌లో నీరసించిన తయారీ రంగం దేశీయ తయారీ రంగంపై నోట్ల రద్దు ప్రభావం పడింది. నిక్కీ మార్కెట్ ఇండియా మ్యానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అక్టోబర్‌లో 54.4 శాతంతో 22 నెలల గరిష్ట స్థారుుకి చేరగా... మరుసటి నెల నవంబర్‌లో ఇది 52.3 శాతానికి దిగొచ్చింది. నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన ఫలితంగా నోట్లకు కొరత ఏర్పడి వినియోగంతోపాటు, సరుకుల తయారీ, నూతన ఆర్డర్లు తగ్గడమే దీనికి కారణం. పీఎంఐ సూచీ 50కి పైన ఉంటే దాన్ని విస్తరణగా, అంతకంటే దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. ⇔ ఇన్ఫ్రా పరుగులు మౌలిక రంగ వృద్ధి అక్టోబర్‌లో రికార్డు స్థారుుకి చేరుకుంది. గత ఆరు నెలల కాలంలోనే అత్యధికంగా అక్టోబర్‌లో 6.6 శాతంగా నమోదైంది. స్టీల్, రిఫైనరీ రంగాల అద్భుత పనితీరు ఈ స్థారుు వృద్ధికి తోడ్పడ్డారుు. మౌలికంలో భాగమైన విద్యుదుత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి మాత్రం భారీగా పడిపోరుుంది. మౌలికంలో భాగమైన ఎనిమిది రంగాలు... బొగ్గు, ముడి చమురు, సహజవాయువు,, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుదుత్పత్తి వృద్ధి రేటు గతేడాది అక్టోబర్‌లో కేవలం 3.8 శాతంగానే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5 శాతంగా నమోదవగా.. తాజాగా అది 6.6 శాతానికి చేరుకుంది. ⇔ విప్రో ‘ఎకో ఎనర్జీ’ వ్యాపారం విక్రయం ప్రధాన వ్యాపారమైన ఐటీపై మరింత దృష్టి సారించే దిశగా విప్రో తన ఎకో ఎనర్జీ వ్యాపార విభాగాన్ని 70 మిలియన్ డాలర్ల (రూ.469 కోట్లు)కు చుబ్ అల్బా కంట్రోల్ సిస్టమ్స్‌కు విక్రరుుంచనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ యునెటైడ్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (యూటీసీ)కు పరోక్ష అనుబంధ సంస్థే చుబ్ అల్బా. ‘‘ప్రధాన ఐటీ వ్యాపారంపై మరింత దృష్టి సారించిన నేపథ్యంలో అందులో భాగం కాని ఎకో ఎనర్జీ వ్యాపార నుంచి వైదొలగాలని నిర్ణరుుంచినట్టు విప్రో వెల్లడించింది. ఈ డీల్ 2017 ప్రథమార్థంలో పూర్తి అవుతుందని తెలిపింది. ⇔ రెండు కంపెనీలుగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్! ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో నలుగుతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీని రెండుగా విడగొట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి .. నిర్వహణకు ఒక సంస్థను, హోల్డింగ్ కంపెనీగా మరొకదాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చని శాంసంగ్ వివరించింది. ⇔ ఈటీఎఫ్‌ల్లో రూ.9,723 కోట్ల ఈపీఎఫ్‌వో పెట్టుబడులు ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో రూ.9,723 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. వీటిపై రాబడి 9.17 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో ఆ ప్రభావం నుంచి తట్టుకునేందుకు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్‌లలో ఈ మేరకు పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో వద్ద ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రూ.7.49 లక్షల కోట్ల నిధులు ఉన్నట్టు వెల్లడించారు. ఈపీఎఫ్‌వో గతేడాది ఆగస్ట్ నుంచి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ⇔ సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 7.3 శాతం భారత్ మరోసారి ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది. దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 7.3 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంతో పోలిస్తే క్షీణించినట్టు తెలుస్తోంది. అరుుతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సానుకూల వృద్ధి నమోదైంది. సాగు రంగంలో ఆశాజనక పరిస్థితులు, సేవలు, వాణిజ్య రంగాల పనితీరు మెరుగవడం వృద్ధి రేటు పెరగడానికి తోడ్పడింది. నోట్ల రద్దు ప్రభావంతో మూడో త్రైమాసికంలో ఈ స్థారుులో వృద్ధి రేటు కొనసాగకపోవచ్చనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ⇔ వృద్ధి రేటును ఒక శాతం తగ్గించిన క్రిసిల్ ట్ల రద్దు కారణంగా ఆర్థిక రంగం కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్... దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో వేసిన అంచనా 7.9 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. అదే సమయంలో వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం సైతం అంచనా వేసిన 5 శాతం కంటే తక్కువగా 4.7 శాతంగా ఉంటుందని తెలిపింది. డీమానిటైజేషన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సైతం ఇదే విధమైన అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.9 శాతానికి దిగి వస్తుందని తెలిపింది. ⇔ రూ. 4 లక్షల కోట్లకు ద్రవ్య లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ద్రవ్య లోటు రూ. 4.23 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాల్లో ఇది 79.3 శాతం. గతేడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల్లో 74 శాతమే. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు 2016-17లో సుమారు రూ. 5.33 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 3.5 శాతం)గా ఉండొచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. ⇔ బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ సుంకం ఎత్తివేత బ్రాండెడ్ బంగారు కారుున్లపై ఉన్న ఒక శాతం ఎకై ్సజ్ డ్యూటీని కేంద్రం ఎత్తివేసింది. 99.5 శాతం అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బ్రాండెడ్ బంగారు కారుున్లపై ఎకై ్సజ్ డ్యూటీ ఇకపై ఉండదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ తన నోటిఫికేషన్లో పేర్కొంది. వెండి కారుున్లకు ఉన్న ఎకై ్సజ్ డ్యూటీ మినహారుుంపు కొనసాగుతుందని తెలిపింది. ఇక, బంగారం, వెండి ఆభరణాల తయారీదారులు తయారు చేసే ప్రీషియస్ మెటల్ లేదా మెటల్ ఆధారిత వస్తువులపై మాత్రం ఒక శాతం ఎకై ్సజ్ డ్యూటీ కొనసాగుతుందని వెల్లడించింది. -
పెప్సోడెంట్ పేస్టు.. పియర్స్ సబ్బు.. చింపాంజీ సోకులు!
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ చింపాంజీకి రాజభోగాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇది సాధారణ చింపాంజీ కాదు.. ఓ కోటీశ్వరుడు పెంచుకున్నది!! ఈ మధ్యేనే హైదరాబాద్ జూకి వచ్చిన ఈ చింపాంజి పేరు సుజీ (28). సహారా గ్రూపు చైర్మన్ సుబ్రతా రాయ్ పెంచుకున్న ఈ చింపాజీని ఇప్పుడు నగరంలోని జూ కు తీసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన సుజీ ప్రస్తుతం జూలో కూడా అదే రాజభోగాలు అనుభవిస్తోంది. ఉదయాన్నే పళ్లు తోమడంతో తన దైనందిన జీవితాన్ని మొదలుపెట్టే సుజీ.. ఇందుకు పెప్సోడెంట్ టూత్ పేస్టు తప్ప మరొకటి వాడదు. ఆ తర్వాత స్నానానికి సకల సౌకర్యాలతో కూడిన బాత్ రూమ్, షాంపూ, పియర్స్ సబ్బు ఉండాల్సిందే. స్నాన కార్యక్రమం ముగిశాక కొబ్బరినూనెతో శరీరంపై మర్దన చేసుకుంటుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన తర్వాత చక్కని కాఫీ సేవిస్తుంది. ఎప్పుడూ నెస్ కేఫ్ కాఫీని తాగే సుజీ.. అప్పుడడప్పుడూ కాంప్లాన్ ను హెల్త్ డ్రింక్ గా భావిస్తూ తీసుకుంటుంది. ఆ తర్వాత బ్రెడ్, ఫ్రూట్ జామ్, కొన్ని పండ్లతో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేస్తుంది. లంచ్ కోసం తేనె, పండ్లు, కార్న్ ఫ్లేక్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుంది. కాడ్ బరీ చాక్లెట్స్ అంటే పిచ్చెత్తిపోయే సుజీ కేవలం మినరల్ వాటరే తాగుతుంది. అది కూడా తన బాటిల్ లో మాత్రమే. జూ అధికారులు సుజీ పడుకోవడానికి రోజూ కొత్త బ్లాంకెట్స్ ఇవ్వాల్సిందే.. వాడినది ఇచ్చి దాన్ని మోసం చేయడం అసాధ్యం. ఇక ఎండ వేడిమి ఉంటే కచ్చితంగా కూలర్, ఫ్యాన్ ఉండాల్సిందే. దోమలు లేకుండా ఉంచడం కోసం ఆలౌట్ లాంటి లిక్విడ్ సదుపాయం కూడా తప్పదు మరి. ఈ విషయంపై అధికారులను అడగగా ప్రస్తుతం జైలులో ఉన్న సుజీ పాత యజమాని సుబ్రతా రాయ్‌కి కూడా ఇలాంటి సదుపాయాలు ఉండవని అంటున్నారు. -
‘జనరిక్’ మందు.. జేబులు నిండు
సంగారెడ్డి క్రైం: మందుల వ్యాపారమంతా ‘జన రిక్’ మయంగా మారింది. బ్రాండెడ్ మందుల కొనుగోలు పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారడంతో వివిధ మందుల కంపెనీలు అదే ఫార్మూలాతో అతి తక్కువ ధరకు ‘జనరిక్’ పేరుతో మందులను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. అయితే జనరిక్ మందులను భారీగా కొనుగోలు చేస్తున్న మెడికల్ దుకాణాల యజమానులు రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వినియోగదారులకు డిస్కౌంట్ ఇవ్వకుండా బ్రాండెడ్ ధరకే జనరిక్ మందులను విక్రయించేస్తున్నారు. లాభాలు కూడా బాగా వస్తుండడంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జనరిక్ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. పేరుమారినా రేటు మారదు దాదాపు ఫార్మ కంపెనీలన్నీ బ్రాండెడ్ (ఎథికల్) మందులతో పాటు జనరిక్ మందులను తయారు చేసి మార్కెట్లోకి పంపుతున్నాయి. ఎథికల్ మందులు బ్రాండెడ్ పేరుతో ఉండగా, అదే ఫార్మూలాతో తయా రై చిన్నపాటి పేరు మార్పిడితో జనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చాయి. బ్రాండెడ్ మందుల విక్రయాలపై మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులకు పెద్దగా లాభాలు ఉండకపోవడంతో, వారంతా ఎక్కువగా జనరిక్ మందుల విక్రయంపైనే ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు జనరిక్ మందులపై ఉన్నఎంఆర్పీకి, మెడికల్ వ్యాపారులకు లభించే ధరకు భూమికి, ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటోంది. ఎంఆర్పీలో అత్యధిక శాతం డిస్కౌంట్‌ను వినియోగదారుడికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ డిస్కౌంట్‌ను ఏ ఒక్క దుకాణ దారుడు కూడా వినియోగదారులకు ఇవ్వడం లేదు. బాండెడ్ మందుల ధరలతో సమానంగా ఈ మందులను కూడా విక్రయిస్తున్నారు. జనరిక్ మందులు హైదరాబాద్ నగరంతో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి మెదక్ జిల్లాకు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. జనరిక్ మందుల ప్యాకెట్లు ఒకటి కొంటే మరొకటి అదనం వంటి ఆఫర్లను సైతం ఆయా కంపెనీలు అందిస్తుంటాయి. అంతేగాక ఎక్కువగా అమ్మకాలు జరిపే మెడికల్ ఏజెన్సీల వారికి విదేశీ ప్రయాణ సౌకర్యం సైతం ఆయా కంపెనీలు కల్పిస్తుంటాయి. దీంతో మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు...మెడికల్ షాప్‌లకు ఎక్కువగా ఈ మందులనే అంటగడుతున్నారు. దీంతో మెడికల్ షాపు యజమానులు కూడా జనరిక్ మందులను బ్రాండెడ్ మందుల ధరకు రోగులకు విక్రయిస్తున్నారు. జనరిక్ మందుల గురించి తెలిసిన వారెవరైనా ప్రశ్నిస్తే మాత్రం డిస్కౌంట్ ఇస్తారు...లేకపోతే అసలు ధరకు మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే జనరిక్ మందులపై ఉన్న ఎంఆర్పీ, ఏజెన్సీలకు అందుతున్న ధర మధ్య తేడాను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ సవరణ సైతం తెచ్చింది. వెంటనే మందుల ధరలు తగ్గించడంతోపాటు ఆ ధరను ఆ మందులపై ముద్రించాలని ఆయా కంపెనీలను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఎంఆర్పీ కొంత వరకు తగ్గినప్పటి కీ, వ్యత్యాసం ఇంకా ఉన్నట్టు తెలుస్తోంది. శాంపిల్స్ సైతం విక్రయాలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నిరక్షరాస్యతను కొందరు మెడికల్ దుకాణాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ కంపెనీల ద్వారా డాక్టర్లకు మాత్రమే అందుతున్న శాంపిల్స్‌ను సైతం విక్రయిస్తున్నారు. ఈ మందులను డాక్టర్లు మాత్రమే రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉచితంగా అందజేయాల్సి ఉంటుంది. కానీ మెడికల్ దుకాణాల్లో సైతం ఈ శాంపిల్స్ విరివిగా లభ్యమవుతున్నాయి. అసలు మందులేవో? ఫిజీషియన్ శాంపిల్స్ ఏవో? తెలియని గ్రామీణులు నిలువునా మోసపోతున్నారు. లాభార్జనే ధ్యేయంగా మెడికల్ షాపులను ఏర్పాటు చేసుకున్న కొందరు వ్యక్తులు ఇతరుల బి.ఫార్మాసీ, డి.ఫార్మాసీ ధ్రువపత్రాలను అద్దెకు తెచ్చుకొని దుకాణాలను నడుపుతున్నారు. రోగులకు ఇచ్చే మందులు ఏమైనా ముప్పు తె చ్చిపెడితే తమకేం నష్టం లేదుగా అన్న ధీమాతో వ్యాపారం చేస్తున్నారు. విడిగా నిర్వహిస్తున్న మందుల దుకాణాల్లోనూ ఫార్మాసిస్టు లేకపోగా కనీసం ఇంటర్ ఉత్తీర్ణత పొందిన వారు సైతం కరువయ్యారు.