గతవారం బిజినెస్ | last week business special story | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Dec 5 2016 3:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

last week business special story

ఎన్‌ఎస్‌ఈ సీఈఓగా వైదొలిగిన చిత్రా రామకృష్ణ
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)ఎండీ, సీఈఓగా చిత్రా రామకృష్ణ అనూహ్యమైన పరిస్థితుల్లో వైదొలిగారు. 1992లో ఎన్‌ఎస్‌ఈ ఏర్పడినప్పటి నుంచి వివిధ హోదాల్లో ఆమె సేవలందించారు. త్వరలో రానున్న ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) విషయంలో బోర్డు సభ్యులతో ఏర్పడిన విభేదాల వల్లే ఆమె తన పదవి నుంచి వైదొలిగారని సమాచారం. షెడ్యూల్ ప్రకారమైతే,  ఆమె పదవీ కాలం 2018 మార్చి వరకూ ఉంది. ఎన్‌ఎస్‌ఈ మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే ఆమె వైదొలిగినట్లు తెలియజేసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ తాత్కాలిక సీఈఓగా సీనియర్  ఎగ్జిక్యూటివ్ రవిచంద్రన్ వ్యవహరిస్తారు. 

డిపాజిట్ చేయండి... టాక్‌టైమ్ పొందండి..
అధిక సేవింగ్‌‌స ఖాతాల ప్రారంభమే ప్రధాన లక్ష్యంగా కస్టమర్లను ఆకర్షించడం కోసం ఎరుుర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు ఖాతాలో డిపాజిట్ చేసే ప్రతి రూపారుుకి ఒక నిమిషం టాక్‌టైమ్‌ను (ఎరుుర్‌టెల్ నుంచి ఎరుుర్‌టెల్‌కు) ఉచితంగా అందిస్తామని పేర్కొంది. ఈ సౌకర్యం తొలిసారి చేసిన డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1,000ల డిపాజిట్‌తో బ్యాంక్ ఖాతాను తెరిచాడనుకోండి... అతను తన ఎరుుర్‌టెల్ మొబైల్ నంబర్‌పై 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను పొందొచ్చు. ఈ టాక్‌టైమ్‌తో దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఎరుుర్‌టెల్ నంబర్‌కై నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు.

మార్చి 31 వరకు జియో సేవలు ఫ్రీ..
రిలయన్‌‌స జియో నూతన సంవత్సర కానుకగా ‘జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ ప్రకటించింది. ప్రస్తుత కస్టమర్లకు డిసెంబర్ 3తో ముగిసిపోతున్న ఉచిత సేవలను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. డేటా, దేశీయంగా వారుుస్, వీడియో కాల్స్, జియో యాప్స్‌ను ప్రస్తుత కస్టమర్లతోపాటు కొత్తగా చేరే వారు సైతం మార్చి వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపారు

నవంబర్‌లో నీరసించిన తయారీ రంగం
దేశీయ తయారీ రంగంపై  నోట్ల రద్దు ప్రభావం పడింది. నిక్కీ మార్కెట్ ఇండియా మ్యానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అక్టోబర్‌లో 54.4 శాతంతో 22 నెలల గరిష్ట స్థారుుకి చేరగా... మరుసటి నెల నవంబర్‌లో ఇది 52.3 శాతానికి దిగొచ్చింది. నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన ఫలితంగా నోట్లకు కొరత ఏర్పడి వినియోగంతోపాటు, సరుకుల తయారీ, నూతన ఆర్డర్లు తగ్గడమే దీనికి కారణం. పీఎంఐ సూచీ 50కి పైన ఉంటే దాన్ని విస్తరణగా, అంతకంటే దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు.

ఇన్‌ఫ్రా పరుగులు
మౌలిక రంగ వృద్ధి అక్టోబర్‌లో రికార్డు స్థారుుకి చేరుకుంది. గత ఆరు నెలల కాలంలోనే అత్యధికంగా అక్టోబర్‌లో 6.6 శాతంగా నమోదైంది. స్టీల్, రిఫైనరీ రంగాల అద్భుత పనితీరు ఈ స్థారుు వృద్ధికి తోడ్పడ్డారుు. మౌలికంలో భాగమైన విద్యుదుత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి మాత్రం భారీగా పడిపోరుుంది. మౌలికంలో భాగమైన ఎనిమిది రంగాలు... బొగ్గు, ముడి చమురు, సహజవాయువు,, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుదుత్పత్తి వృద్ధి రేటు గతేడాది అక్టోబర్‌లో కేవలం 3.8 శాతంగానే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5 శాతంగా నమోదవగా.. తాజాగా అది 6.6 శాతానికి చేరుకుంది.

విప్రో ‘ఎకో ఎనర్జీ’ వ్యాపారం విక్రయం
ప్రధాన వ్యాపారమైన ఐటీపై మరింత దృష్టి సారించే దిశగా విప్రో తన ఎకో ఎనర్జీ వ్యాపార విభాగాన్ని 70 మిలియన్ డాలర్ల (రూ.469 కోట్లు)కు చుబ్ అల్బా కంట్రోల్ సిస్టమ్స్‌కు విక్రరుుంచనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ యునెటైడ్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (యూటీసీ)కు పరోక్ష అనుబంధ సంస్థే చుబ్ అల్బా. ‘‘ప్రధాన ఐటీ వ్యాపారంపై మరింత దృష్టి సారించిన నేపథ్యంలో అందులో భాగం కాని ఎకో ఎనర్జీ వ్యాపార నుంచి వైదొలగాలని నిర్ణరుుంచినట్టు విప్రో వెల్లడించింది. ఈ డీల్ 2017 ప్రథమార్థంలో పూర్తి అవుతుందని తెలిపింది.

రెండు కంపెనీలుగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్!
ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో నలుగుతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీని రెండుగా విడగొట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి .. నిర్వహణకు ఒక సంస్థను, హోల్డింగ్ కంపెనీగా మరొకదాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చని శాంసంగ్ వివరించింది.

ఈటీఎఫ్‌ల్లో రూ.9,723 కోట్ల ఈపీఎఫ్‌వో పెట్టుబడులు
ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో రూ.9,723 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. వీటిపై రాబడి 9.17 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో ఆ ప్రభావం నుంచి తట్టుకునేందుకు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్‌లలో ఈ మేరకు పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో వద్ద ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రూ.7.49 లక్షల కోట్ల నిధులు ఉన్నట్టు వెల్లడించారు. ఈపీఎఫ్‌వో గతేడాది ఆగస్ట్ నుంచి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది.

సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 7.3 శాతం
భారత్ మరోసారి ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది. దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 7.3 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంతో పోలిస్తే క్షీణించినట్టు తెలుస్తోంది. అరుుతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సానుకూల వృద్ధి నమోదైంది. సాగు రంగంలో ఆశాజనక పరిస్థితులు, సేవలు, వాణిజ్య రంగాల పనితీరు మెరుగవడం వృద్ధి రేటు పెరగడానికి తోడ్పడింది. నోట్ల రద్దు ప్రభావంతో మూడో త్రైమాసికంలో ఈ స్థారుులో వృద్ధి రేటు కొనసాగకపోవచ్చనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

వృద్ధి రేటును ఒక శాతం తగ్గించిన క్రిసిల్
ట్ల రద్దు కారణంగా ఆర్థిక రంగం కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్... దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో వేసిన అంచనా 7.9 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. అదే సమయంలో వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం సైతం అంచనా వేసిన 5 శాతం కంటే తక్కువగా 4.7 శాతంగా ఉంటుందని తెలిపింది. డీమానిటైజేషన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సైతం ఇదే విధమైన అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.9 శాతానికి దిగి వస్తుందని తెలిపింది.

రూ. 4 లక్షల కోట్లకు ద్రవ్య లోటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ద్రవ్య లోటు రూ. 4.23 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాల్లో ఇది 79.3 శాతం. గతేడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల్లో 74 శాతమే. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు 2016-17లో సుమారు రూ. 5.33 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 3.5 శాతం)గా ఉండొచ్చని బడ్జెట్‌లో అంచనా వేశారు.

⇔  బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ సుంకం ఎత్తివేత
బ్రాండెడ్ బంగారు కారుున్లపై ఉన్న ఒక శాతం ఎకై ్సజ్ డ్యూటీని కేంద్రం ఎత్తివేసింది. 99.5 శాతం అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బ్రాండెడ్ బంగారు కారుున్లపై ఎకై ్సజ్ డ్యూటీ ఇకపై ఉండదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. వెండి కారుున్లకు ఉన్న ఎకై ్సజ్ డ్యూటీ మినహారుుంపు కొనసాగుతుందని తెలిపింది. ఇక, బంగారం, వెండి ఆభరణాల తయారీదారులు తయారు చేసే ప్రీషియస్ మెటల్ లేదా మెటల్ ఆధారిత వస్తువులపై మాత్రం ఒక శాతం ఎకై ్సజ్ డ్యూటీ కొనసాగుతుందని వెల్లడించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement