Excise duty
-
సీఎన్జీపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలి
న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన సీఎన్జీని జీఎస్టీలో చేర్చే వరకు దీనిపై ప్రస్తుతమున్న ఎక్సైజ్ డ్యూటీని మోస్తరు స్థాయికి తగ్గించాలని కిరీట్ పారిఖ్ కమిటీ సూచించింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండడం తెలిసిందే. ప్రస్తుతం సీఎన్జీపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల స్థాయిలో వ్యాట్, సేల్స్ ట్యాక్స్ అమల్లో ఉన్నాయి. సహజ వాయువును గ్యాసియస్ రూపంలో విక్రయిస్తే దానిపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ విధించడం లేదు. సీఎన్జీగా మార్చి విక్రయిస్తే 14.5 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తోంది. దీనిపై రాష్ట్రాల స్థాయిలో 24.5 శాతం వరకు వ్యాట్ అమలవుతోంది. వినియోగదారుడికి ప్రయోజనం కలిగించే, మార్కెట్ ఆధారిత, పారదర్శక ధరల విధానం సిఫారసు చేసేందుకు ఏర్పాటైనదే కిరీట్ పారిఖ్ కమిటీ. పూర్తి అధ్యయనం, సంప్రదింపుల తర్వాత ఇటీవలే ఈ కమిటీ కేంద్రానికి తన సిఫారసులు అందజేయడం గమనార్హం. జీఎస్టీ కిందకు తేవాలి.. : సహజ వాయువు, సీఎన్జీని జీఎస్టీ కిందకు తీసుకురావాలని ఈ కమిటీ ముఖ్యమైన సూచన చేయడం గమనించాలి. ఇందుకు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడింది. ‘‘ఏకాభిప్రాయం సాధించేందుకు అవసరమైతే రాష్ట్రాలకు ఐదేళ్లపాటు ఆదాయంలో అంతరాన్ని సర్దుబాటు చేయాలి. అవసరమైన ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రక్రియను ఇప్పుడే ఆరంభించాలి’’అని కిరీట్ పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. గ్యాస్‌ను జీఎస్టీ కిందకు తెస్తే పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళనతో, గ్యాస్‌ను అధికంగా ఉత్పత్తి చేసే గుజరాత్ తదితర రాష్ట్రాలు ఉన్న విషయం గమనార్హం. రాష్ట్రాల అంగీకారంతో సీఎన్జీని జీఎస్టీ కిందకు తెచ్చే వరకు.. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ద్వారా తుది వినియోగదారుడిపై పడే భారాన్ని తగ్గించాలని కమిటీ సూచించింది. భాగస్వాముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు దీన్ని దీర్ఘకాలిక పరిష్కారంగా పేర్కొంది. జీఎస్టీ కిందకు గ్యాస్‌ను తీసుకురావడం అన్నది.. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా 6.2 శాతంగా ఉంటే, 2030 నాటికి 15 శాతానికి పెంచాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా కావడం గమనించాలి. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు సంబంధించిన దేశీ లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే సహజ వాయువు ధరలపై పరిమితులను పారిఖ్ కమిటీ సిఫారసు చేయడం తెలిసిందే. -
వస్తు సేవల పన్ను విధానం సూపర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అడ్డంకులను తగ్గించడం ద్వారా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం వ్యాపారాన్ని సులభతరం చేసిందని 90 శాతం మంది భారత్ పారిశ్రామిక ప్రతినిధులు భావిస్తున్నారని డెలాయిట్ సర్వే బుధవారం తెలిపింది. జీఎస్టీ విధానం అంతిమ వినియోగదారులకు సంబంధించి వస్తువులు, సేవల ధరల ప్రక్రియను సానుకూలం చేసిందని తెలిపింది. తమ సరఫరా చైన్లను పటిష్టం చేసుకోవడంలో కంపెనీలకు సైతం పరోక్ష పన్నుల విధానం దోహదపడుతోందని వివరించింది. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, వ్యాట్, 13 సెస్సులు వంటి 17 స్థానిక లెవీల స్థానంలో దేశవ్యాప్తంగా 2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జీఎస్టీ:5 సర్వే 2022’ పేరుతో జరిపిన ఈ సర్వేలో వెల్లడయిన మరికొన్ని అంశాలు.. ► నాలుగు వారాల పాటు జరిగిన సర్వేలో 234 మంది చీఫ్ ఎక్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), సీఎక్స్‌వో–1 స్థాయి ఇండివిడ్యువల్స్ పాల్గొని తమ అప్రాయాలను వ్యక్తం చేశారు. వినియోగదారులు, ఇంధన వనరులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, ప్రభుత్వ, ప్రజా సేవలు; లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ సహా పలు కీలక రంగాలపై జీఎస్టీ ప్రభావాన్ని సర్వే ట్రాక్ చేసింది. ► కీలక రంగాల్లోని తొంభై శాతం మంది సీఎక్స్‌వోలు జీఎస్టీ పరోక్ష పన్ను విధానాన్నికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ’ఒక దేశం, ఒకే పన్ను’ సంస్కరణ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అడ్డంకులను తగ్గించి, వ్యాపారాన్ని సులభంగా, ప్రభావవంతంగా మార్చిందని వారు అభిప్రాయపడ్డారు. అటు వ్యాపారవ్తేలకు ఇటు పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీ విధానం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. ► పన్నుల చెల్లింపునకు సంబంధించి ఆటోమేషన్, ఈ–ఇన్వాయిస్/ఈ–వే సౌకర్యాన్ని ప్రవేశపెట్ట డం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రయోజనకరమైన సంస్కరణ అని వారు తెలిపారు. ► వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి పన్ను వ్యవస్థ మరింత సరళతరం కావాలని విజ్ఞప్తి చేశారు. ► నెలవారీ, వార్షిక రిటర్న్స్ పక్రియను సులభతరం చేయడానికి సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడం కీలకమని తెలిపారు. ► ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మ్యాచింగ్‌ను సరళీకృతం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. పన్ను చెల్లింపుదారుల కోసం నిర్వహణా సంక్లిష్టతలను తగ్గించాలని, పన్ను వివాదాల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమలు కోరుతున్నాయి. ఆయా అంశాలు తీవ్రమైన దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలకు దారితీస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారీ పన్ను వసూళ్లే విజయ సంకేతం ఇటీవలి నెలల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ వ్యవస్థ గణనీయమైన విజయం సాధించిందనడానికి ఇదే ఉదాహరణ. వ్యవస్థ పట్ల పన్ను చెల్లింపుదారుల స్నేహ పూర్వక విధానాన్ని ఇది సూచిస్తోంది. ఈ పన్ను విభాగం మరింత విస్తృతంగా ప్రజాదరణ పొందడానికి మరిన్ని చర్యలు అమల్లోకి వస్తాయని అభిప్రాయపడుతున్నాం. – మహేశ్ జైసింగ్, డెలాయిట్ విశ్లేషణ విభాగం ప్రతినిధి ఎకానమీకి శుభ సంకేతం గత మూడు నెలల్లో వరుసగా రూ. 1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి సంకేతం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సంఖ్యలతో సహా ఇతర ఆర్థిక విభాగాల్లో రికవరీ పరిస్థితి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పటిష్ట ఆడిట్లు, ప్రభుత్వ చర్యలు పన్ను ఎగవేతల నిరోధానికి దోహదపడుతున్నాయి. – ఎంఎస్ మణి డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
గుడ్‌న్యూస్: పెట్రో ధరలపై భారీ ఊరట.. భారీగా తగ్గించిన కేంద్రం
-
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకూడదంటే.. ఇక అదొక్కటే మార్గం..?
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో అప్పటి నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ మంటను చల్లార్చేందుకు కేంద్రం ప్రభుత్వం అచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో చాలా మంది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తుంది. అయితే, కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా ఉండటానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది. ప్రపంచ ముడిచమురు ధరల ప్రభావం నుంచి వినియోగదారులను రక్షించడానికి డీజిల్, పెట్రోల్ విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని రూ.10-12 తగ్గించాల్సి అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం ముందు వేరే మార్గం లేదని మాజీ ఆర్థిక కార్యదర్శి తెలిపారు. "ఆదాయంపై ప్రభావం పడకుండా చమురు రిటైల్ ధరలు తగ్గే మార్గం లేదు. ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 నుంచి రూ.12కు తగ్గించాల్సి ఉంది. ప్రస్తుతం వేరే మార్గం లేదు" అని సుభాష్ చంద్ర గార్గ్ సీఎన్ బిసీ-టీవీ18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మార్చి 7న బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధరలు 139 డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు రష్యన్ చమురుపై నిషేధాన్ని విధిస్తాయని వచ్చిన వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగిన తర్వాత రూపాయి మారకం విలువ భారీగా క్షీణించింది. ఇది దేశీయ ఇంధన ధరలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. చమురు ధరలు పెంచడం వల్ల ద్రవ్యోల్పణం పెరిగి జీడిపీ మీద ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపారు. అలాగే, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది అని సుభాష్ అన్నారు. (చదవండి: అబ్బే..అలాంటిదేం లేదు! రష్యా వార్నింగ్‌తో మాట మార్చిన అమెరికా?) -
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా..?
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగినప్పటి నుంచి బంగారం, చమరు ధరలు భారీగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రోజు బ్యారెల్ బ్రెంట్ క్రూయిడ్ ఆయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. అయితే, ఒకవైపు అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరగడంతో ఆ ధరల నుంచి మన దేశ ప్రజలకు ఉపశమనం అందించడానికి కేంద్రం మార్గాలను అన్వేషిస్తోంది. వినియోగదారులపై చమురు ధరల ప్రభావం పడకుండా ఉండటానికి లీటరు పెట్రోల్, డీజిల్'పై రూ.8-10 ఎక్సైజ్ సుంకన్నీ తగ్గించడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు బిజినెస్ టుడే మీడియాకు తెలిపాయి. గత ఏడాది నవంబర్ నెలలో 68 డాలర్లు ఉన్న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర నేడు 115 డాలర్లకు చేరుకుంది. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పులేదు. "అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు ఇప్పటి వరకు లీటరుకు రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్బిఐ ఎకోర్యాప్ కొద్ది రోజుల క్రితం తన నివేదికలో తెలిపింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లయితే, అప్పుడు ఖజానాకు లక్ష కోట్ల రూపాయలు నష్ట వస్తుంది. కాబట్టి, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చమురు ధరల ప్రభావం వినియోగదారుడి మీద పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే పరిస్థితి చక్కదిద్దుకొనే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగిన ప్రకారం దేశంలో చమురు ధరలను పెంచితే ద్రవ్యోల్బణం 52-65 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, రేట్లు పెరగకుండా చూడటం కోసం ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు సుమారు రూ.7 తగ్గించినట్లయితే, అప్పుడు నెలకు రూ.8,000 కోట్ల ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుంది అని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. చూడాలి మరి మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. (చదవండి: కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిస్తున్న బ్యాంకులు..!) -
Union Budget 2022: విశాఖ ఉక్కుకు రూ.910 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీల ప్రస్తావన లేకపోయినప్పటికీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు )కు కేంద్రం బడ్జెట్లో రూ.910 కోట్లు కేటాయించింది. వెనకబడిన జిల్లాలకు నిధులు, దుగరాజపట్నం పోర్టు తదితర హామీలకు నిధులు కేటాయించలేదు. విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ యూనివర్సిటీకి రూ.150 కోట్లు, వైజాగ్ పోర్టు ట్రస్టుకు రూ.207 కోట్లు కేటాయించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గత బడ్జెట్‌తో పోలిస్తే పెరిగింది. గత బడ్జెట్లో రూ.30,356.31 కోట్లు వస్తే.. ఈ సారి రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు రానుంది. దీంట్లో కార్పొరేషన్ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్ రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.446.34 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ.33.18 కోట్లు. చదవండిః చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుల దుర్మరణం -
మద్యంపై పన్ను తగ్గింపు
సాక్షి, అమరావతి: తెలంగాణ సహా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని అరికట్టడానికి, నాటు సారా తయారీని నిరోధించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లను తగ్గించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్, ఏక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్లను తగ్గించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్య నియంత్రణలో భాగంగా మద్యం వినియోగం తగ్గించడానికి ధరలను ప్రభుత్వం గతంలో పెంచిన విషయం తెలిసిందే. దీంతో కొందరు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారు. నాటు సారా తయారు చేస్తున్నారు. ఈ రెండింటినీ కట్టడి చేయడానికి మద్యం మీద పన్ను రేట్లను తగ్గించారు. దీనివల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై 15 నుంచి 20 శాతం మేర ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం రూ.200 ఉన్న మద్యం బాటిల్.. సవరించిన రేట్ల ప్రకారం రూ.150కు లభించే అవకాశం ఉంది. అదే విధంగా అన్ని రకాల బీర్లపై రూ.20 మేర ధరలు తగ్గనున్నాయి. అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంకన్నా 10 శాతం అదనంగా మద్యం ధరలు ఉంటాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలు; ఎవరి వాటా ఎంత?
కేంద్ర ప్రభుత్వం ఈనెల 3వ తేదీన పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే. వెనువెంటనే అదేరోజు రాత్రి కూడబలుక్కున్నట్లుగా బీజేపీ పాలిత, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర రాష్ట్రాలూ తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి. పెట్రో ధరలను ఎప్పటికప్పుడు పెంచుతూ పోయింది కేంద్రమే కాబట్టి... మరింత ఉపశమనం కూడా కేంద్రమే ఇవ్వాలని తెలంగాణ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు వాదించాయి. రాష్ట్రాల ఆదాయవనరులు పరిమితం... అసలే కోవిడ్ సంక్షోభ సమయం కాబట్టి తాము తగ్గించలేమని అశక్తతను వ్యక్తం చేశాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్‌లపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వస్తున్న ఆదాయం ఎంత? అందులో రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఎంత? ఇస్తున్నదెంత? అనే విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి మంగళవారం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం... 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో 1.78 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఇది రెట్టింపు కంటే ఎక్కువైంది. మొత్తం 3.72 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. కారణం కేంద్రం పన్నులు భారీగా పెంచడమే. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా 41 శాతం. అంటే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిన రూ. 3.72 లక్షల కోట్ల రూపాయల్లో రాష్ట్రాల వాటా (41 శాతం లెక్కన) కింద కేంద్రం రూ. 1,52,520 కోట్ల రూపాయలను చెల్లించాలి. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే ఈ 41 శాతం పన్నుల వాటాలో ఏ రాష్ట్రానికి ఎంతివ్వాలనేది ఫైనాన్స్ కమిషన్ (జనాభా దామాషా పద్ధతిన) నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం రాష్ట్రాలకు ఎక్సైజ్ డ్యూటీలో తమ వాటా అందుతుంది. కానీ 2020–21 ఆర్థికానికి 1.52.520 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు పంచాల్సిన కేంద్ర ఇచ్చిందెంతో తెలుసా? రూ. 19,972 కోట్లు మాత్రమే. అంటే 2020–21లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటాలో ఏకంగా 1,32,548 కోట్లను కేంద్రం తమ బొక్కసంలో వేసేసుకుంది. ఎందుకిలా? సమాఖ్య వ్యవస్థలో కేంద్ర సర్కారు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన న్యాయమైన వాటాను ఎలా తగ్గించగలదు? అనే కదా మీ సందేహం? అసలు మతలబు ఇదీ... కేంద్ర ప్రభుత్వ పెట్రోల్, డీజిల్‌లపై వసూలు చేసే పన్నును ఎక్సైజ్ డ్యూటీ పద్దు కింద నేరుగా వసూలు చేస్తే... రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా దక్కుతుంది. ఇక్కడే కేంద్రం మతలబు చేస్తోంది. ఎక్సైజ్ డ్యూటీ పద్దు కింద నామమాత్రంగా చూపి... మిగతా పన్నును అంతా వివిధ సెస్సుల రూపంలో చూపెడుతోంది. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే డివైజిబుల్ పూల్ (రాష్ట్రాలతో పంచుకునేది) కిందకు వస్తుంది. ఈ పద్దు కింద చూపే దాంట్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. సెస్సుల రూపంలో వచ్చే దాంట్లో పైసా కూడా రాష్ట్రాలకు దక్కదు. గంపగుత్తగా వచ్చినదంతా కేంద్ర ఖజానాను వెళుతుంది. అదెలాగో ఈ రెండు పట్టికల్లో చూద్దాం. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన తర్వాత ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులో ఏ పద్దు కింద ఎంత రాబడుతుందో చూద్దాం. – నేషనల్ డెస్క్, సాక్షి -
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘వ్యాట్’ తగ్గింపు.. మరింత తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం అదేబాటలో నడిచాయి. తమ వంతుగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించాయి. దీంతో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత కిందికి దిగొచ్చాయి. కర్ణాటక, పుదుచ్చేరి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, సిక్కిం, బిహార్, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, దాద్రా నగర్ హవేలి, డయ్యూడామన్, చండీగఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, లద్ధాఖ్‌లో ‘వ్యాట్’ తగ్గింది. కాంగ్రెస్-దాని భాగస్వామ్య పక్షాలు, వామపక్షాలు, ఇతర పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజస్తాన్, పంజాబ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో వ్యాట్ వాత యధాతథంగా కొనసాగుతోంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత దేశంలోనే అత్యధికంగా రాజస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.111.10, డీజిల్ రూ.95.71, ముంబైలో పెట్రోల్ రూ.109.98, డీజిల్ రూ.94.14 పలుకుతోంది. అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా మిజోరాంలో లీటర్ డీజిల్ ధర రూ.79.55కు చేరింది. చదవండి: (మాజీ మంత్రిని నిర్బంధించిన రైతులు.. చేతులు జోడించి క్షమాపణ చెప్పాకే..) -
‘ఆ ఎన్నికలు అయిపోగానే ఇంధన ధరలు పెంచుతారు’
లక్నో: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించి.. ప్రజలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఉప ఎన్నికలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీజేపీ.. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై స్పందించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తిరిగి ఇంధన ధరలు పెంచుతారని తెలిపారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుంది. దాన్ని నివారించడం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది’’ అని తెలిపారు. (చదవండి: పెట్రో పరుగుకు బ్రేకులు...! వాహనదారులకు కేంద్రం శుభవార్త..!) ‘‘తగ్గించిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతో కాలం ఉండవు. 2022లో యూపీ ఎన్నికలు అయిపోగానే.. మళ్లీ ఇంధన ధరలకు రెక్కలు వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరు 50 రూపాయలకు తగ్గిస్తే.. అప్పుడు ప్రజలకు నిజమైన ఉపశమనం లభిస్తుంది’’ అన్నారు. ఇక శివసేన నేత సంజయ్ రౌత్ కూడా పెట్రోల్, డీజిల్ లీటర్ ధర 50 రూపాయలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. చదవండి: వాహనదారులకు షాకింగ్ న్యూస్...! -
18 నెలల్లోనే పెట్రోల్‌పై రూ.35.98 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తూనే ఉన్నాయి. గత ఏడాది మే నుంచి ఇప్పటిదాకా.. కేవలం 18 నెలల్లోనే లీటర్ పెట్రోల్ రూ.35.98, డీజిల్ చొప్పున రూ.26.58 ధరలు పెరిగాయి. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటేసింది. డీజిల్ సైతం రూ.100 మార్కును అధిగవిుంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి భారత్‌లోనూ పెంచకం తప్పడం లేదని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ, అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడల్లా కేంద్రంం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచేస్తుండడంతో ఆ ప్రయోజనం వినియోగదారులకు దక్కడం లేదు. ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై 31.80 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది. పెట్రో ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం అంటే మన కాళ్లను మనం నరుక్కున్నట్లే అని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి వ్యాఖ్యానించారు. ఈ సొమ్ముతోనే ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మరో 35 పైసలు పెంపు దేశంలో శనివారం సైతం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24కు, డీజిల్ రూ.95.97కు ఎగబాకింది. -
పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ వసూళ్లు 48 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 48 శాతం ఎగిసింది. ఏప్రిల్–జులై మధ్య కాలంలో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ. 1 లక్ష కోట్లు పైగా వసూలయ్యాయి. గత ఆరి్థక సంవత్సరం ఇదే వ్యవధిలో వసూలైనది రూ. 67,895 కోట్లు. తొలి నాలుగు నెలల్లో అదనంగా వచి్చన రూ. 32,492 కోట్లు .. పూర్తి ఆరి్థక సంవత్సరంలో చమురు బాండ్లకు ప్రభుత్వం కట్టాల్సిన రూ. 10,000 కోట్ల కన్నా మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. సింహ భాగం వసూళ్లు పెట్రోల్, డీజిల్‌పై సుంకాల ద్వారానే నమోదయ్యాయి. ఎకానమీ కోలుకునే కొద్దీ అమ్మకాలు మరింత పెరిగితే గత ఆరి్థక సంవత్సరంతో పోలిస్తే ఈసారి వసూళ్లు అదనంగా రూ. 1 లక్ష కోట్ల పైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సబ్సిడీ ధరపై వంటగ్యాస్, కిరోసిన్, డీజిల్ మొదలైనవి విక్రయించడం వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు వచి్చన నష్టాలను భర్తీ చేసేందుకు గత యూపీఏ ప్రభుత్వం వాటికి రూ. 1.34 లక్షల కోట్ల విలువ చేసే బాండ్లను జారీ చేసింది. ఆరి్థక శాఖ వర్గాల ప్రకారం వీటికి సంబంధించి ఈ ఆరి్థక సంవత్సరం రూ. 10,000 కోట్లు కట్టాల్సి ఉంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువుపై మాత్రమే ఎక్సైజ్ సుంకం విధిస్తున్న సంగతి తెలిసిందే. -
కేంద్ర ప్రభుత్వానికి ఇం‘ధనం’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు ఆల్‌టైం గరిష్ట స్థాయి నుంచి భారీగా దిగివచ్చినా దేశీయంగా ఇంధనాల రేట్లు మాత్రం రికార్డు గరిష్ట స్థాయిలో తిరుగాడుతున్నాయి. వీటిపై ప్రభుత్వం పన్నుల మోత మోగిస్తుండటమే ఇందుకు కారణం. గడిచిన ఆరేళ్లలో ఇలా పెట్రోల్, డీజిల్‌పై పన్నుల వసూళ్లు 300% పెరిగాయి. మోదీ సర్కార్ ఏర్పాటైన తొలి ఏడాది 2014–15లో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో పెట్రోల్‌పై రూ. 29,279 కోట్లు, డీజిల్‌పై రూ. 42,881 కోట్లు కేంద్రం వసూలు చేసింది. వీటికి సహజ వాయువును కూడా కలిపితే 2014–15లో వీటిపై ఎక్సైజ్ రూపంలో రూ. 74,158 కోట్లు ప్రభుత్వానికి చేరాయి. ఈ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో ఏకంగా రూ. 2.95 లక్షల కోట్లకు చేరాయి. కేవలం పెట్రోల్, డీజిల్‌పై పన్నుల వసూళ్లు రూ. 2.94 లక్షల కోట్లకు పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభకు తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో.. పెట్రోల్, డీజిల్, సహజ వాయువుపై విధించే ట్యాక్సుల వసూళ్ల రూపంలో వచ్చేది 2014–15లో 5.4%గా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం 12.2%కి పెరిగిందని ఆయన వివరించారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 2014లో లీటరుకు రూ. 9.48గా ఉండగా అదిప్పుడు రూ. 32.90కి పెరిగింది. డీజిల్‌పై రూ. 3.56 నుంచి రూ. 31.80కి చేరింది. -
అధిక పెట్రో ధరలు భారమే
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్న ప్రజా డిమాండ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. వీటి ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆమె అంగీకరిస్తూనే.. పన్నుల తగ్గింపు అన్నది కేంద్రం, రాష్ట్రాలు కలసి నిర్ణయం తీసుకుంటేనే సాధ్యపడుతుందన్నారు. దేశంలో రాజస్తాన్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు చేరుకోగా.. రిటైల్ ధరలో 60 శాతం కేంద్రం, రాష్ట్రాలకు పన్నుల రూపంలో వెళుతుండడం గమనార్హం. డీజిల్ రిటైల్ ధరలో 56 శాతం పన్నుల రూపంలోనే ఉంటోంది. కరోనా కారణంగా గతేడాది అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు పడిపోయిన సమయంలో మంత్రి సీతారామన్ ఎక్సైజ్ సుంకాలను పెంచడం ద్వారా ఆదాయ లోటు లేకుండా జాగ్రత్తపడ్డారు. పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 వరకు ఆమె ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. ఈ విషయమై ఆర్థిక మంత్రి శుక్రవారం మీడియా ముఖంగా స్పందించారు. తగ్గించాల్సిన అవసరం ఉందంటూనే.. అందుకే తాను ధర్మసంకటం పదాన్ని ప్రయోగించినట్టు చెప్పారు. ‘‘ఈ విషయమై కేంద్రం, రాష్ట్రాలు చర్చించుకోవాల్సి ఉంది. ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఒక్కటే పన్నులు విధించడం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు వసూలు చేసుకుంటున్నాయి’’ అని పరిస్థితిని ఆమె వివరించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకే వెళుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకువస్తే పన్నుల భారం తగ్గుతుందన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. దీనిపై నిర్ణయం తీసు కోవాల్సింది జీఎస్టీ కౌన్సిల్ అని పేర్కొన్నారు. ఈ నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన తీసుకువెళతారా? అన్న మీడియా ప్రశ్నకు.. సమావేశానికి ముందు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కెయిర్న్ ఆర్బిట్రేషన్‌పై అప్పీల్ కెయిర్న్ ఎనర్జీకి భారత్ 1.4 బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుపై అప్పీల్ చేయడం తన విధిగా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. దేశ సార్వభౌమ యంత్రాంగానికి ఉన్న పన్ను విధింపు హక్కును ప్రశ్నించినప్పుడు అప్పీల్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ‘‘రెట్రోస్పెక్టివ్ పన్ను అంశంలో మా విధానాన్ని స్పష్టంగా వెల్లడించాము. 2014 నుంచి 2020 వరకు ఏటా దీన్నే పునరావృతం చేశాం. ఇందులో స్పష్టత లేకపోవడమేమీ కనిపించలేదు’’ అని మంత్రి చెప్పారు. ఆర్థిక ఉద్దీపనల భారాన్ని ప్రజలపై వేయం... ప్రభుత్వం ప్రకటించిన అన్ని ఆర్థిక ఉద్దీపనలకు కావాల్సిన నిధులను రుణాలు, ఆదాయాల రూపంలో సమకూర్చుకుంటామే కానీ, ప్రజలపై భారం వేయబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులపై ఇందుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా చార్జీ ఉండదన్నారు. ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందే కానీ, ప్రజల నుంచి కాదని చెప్పారు. క్రిప్టో కరెన్సీల నియంత్రణపై ఆర్బీఐతో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు. -
అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్!
ప్రస్తుతం పెరిగిపోతున్న ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ఇతర రాష్ట్రాలలో పెట్రోల్ ధర రూ.100 కూడా దాటేసింది. దింతో ప్రజానీకం ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా దేశంలో చమురు ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.75, డీజిల్ రూ.68 కు దిగొస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అన్నారు. రాజకీయ నాయకులు సంకల్పం తీసుకోలేకపోవడం వల్ల భారతదేశంలో చమురు ఉత్పత్తి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నట్లు ఎస్బీఐ ఆర్థిక నిపుణులు తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే అమ్మకపు పన్ను/వ్యాట్ పన్నులే వారికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్, ఎక్సైజ్ సుంకం, సెస్, వ్యాట్ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు నష్టం తప్పదు. అందువల్ల చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై 50 నుంచి 60 శాతం పన్నులు విధిస్తున్నాయి. ఒకవేళ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అత్యధికంగా 28శాతం పన్ను మాత్రమే విధించాల్సి ఉంటుంది. నిజంగా తెస్తే మాత్రం వినియోగదారులపై రూ.30 వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.75, లీటర్ డీజిల్ రూ.68కే రానున్నట్లు ఆర్థికవేత్తలు తెలిపారు. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్ర, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని, ఇది దేశ జీడీపీలో కేవలం 0.4శాతమేనని వారు పేర్కొన్నారు. చమురు వినియోగం రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని భవిష్యత్ లోకి పూడ్చుకోవచ్చు అని తెలిపారు. అంతేగాక, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలని ఆర్థికవేత్తలు సూచించారు. అంటే.. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు వచ్చే లాభాలను, ధరలు పెరిగినప్పుడు వచ్చే లోటుతో పూడ్చుకోవాలన్నారు. అలా చేస్తే వినియోగదారులపై ఎలాంటి భారం పడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చమురు ధర విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే! ఈపీఎఫ్ వడ్డీరేటు యథాతథం -
పెట్రోల్‌తో డీజిల్ ధర సమానం! ఎందుకు?
ఈ నెల(జూన్) మొదటి నుంచీ దాదాపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా అధిక ఎక్సయిజ్ డ్యూటీలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)ల మార్జిన్లు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు విదేశీ మార్కెట్లో ఇటీవల ముడిచమురు ధరలు బలపడుతుండటం కూడా కారణమవుతున్నట్లు తెలియజేశారు. దేశీ అవసరాల కోసం దాదాపు 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. దీంతో డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ధరలను ప్రభావితం చేస్తుంటాయని ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్సయిజ్ పెంపు సాధారణంగా విదేశాలలో పెట్రోల్ కంటే డీజిల్ ధరలే అధికంగా ఉంటాయి. ఇందుకు ఉత్పత్తి వ్యయాలే కారణం. అయితే దేశీయంగా డీజిల్ కంటే పెట్రోల్ ధరలే ప్రీమియంలో కదులుతుంటాయి. ఇందుకు ఎక్సయిజ్ డ్యూటీ, వ్యాట్(వీఏటీ) ప్రభావం చూపుతుంటాయి. కానీ ప్రస్తుతం దేశంలోనూ పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ ధరలు సమానంగా మారాయి. ఇందుకు అధిక ఎక్సయిజ్ డ్యూటీలు, పెరిగిన పెట్రో కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు కారణమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కొద్ది రోజులుగా ఎక్సయిజ్ డ్యూటీలతోపాటు, వ్యాట్ పెరుగుతూ పోవడంతో పెట్రోల్ ధరలకు డీజిల్ సమానమైనట్లు వివరించాయి. ఫలితంగా ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు ఒకే స్థాయికి చేరినట్లు తెలియజేశాయి. ధరలు తగ్గినా కోవిడ్-19 నేపథ్యంలో గత రెండు నెలల్లో ముడిచమురు ధరలు డీలాపడినప్పటికీ తిరిగి పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 42 డాలర్ల స్థాయిలో కదులుతోంది. ఇదే సమయంలో డాలరుతో మారకంలో రూపాయి విలువ 75 ఎగువనే నిలుస్తోంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం డ్యూటీలను పెంచుతూ వచ్చింది. అయితే రిటైల్ ధరలపై ప్రభావం పడకుండా వీటిని హెచ్చిస్తూ వచ్చింది. ఫలితంగా ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్‌కు రూ. 20గా ఉన్న ఎక్సయిజ్ డ్యూటీ ప్రస్తుతం రూ. 33కు ఎగసింది. ఈ బాటలో డీజిల్‌పై ఎక్సయిజ్ డ్యూటీ లీటర్‌కు రూ. 16 నుంచి రూ. 32కు పెరిగింది. 2014లో పెట్రోల్‌పై పన్నులు లీటర్‌కు . 9.5గా నమోదుకాగా.. డీజిల్‌పై ఇవి రూ. 3.5గా అమలైనట్లు ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావించారు. పెట్రోల్‌పై వ్యాట్ రూ. 15.3 నుంచి పెరిగి 17.7కు చేరగా.. డీజిల్‌పై మరింత అధికంగా రూ.9.5 నుంచి రూ. 17.6కు ఎగసింది. విదేశాలలో చమురు ధరలు పతనమై తిరిగి కోలుకున్నప్పటికీ గత మూడు నెలల్లో అంటే మే చివరి వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు యథాతథంగా కొనసాగాయి. ఇదే సమయంలో పెట్రో మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు లీటర్ ధరపై రూ. 2-3 నుంచి రూ. 13-19 వరకూ ఎగశాయని.. తిరిగి ప్రస్తుతం 5 స్థాయికి చేరాయని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. పెట్రోల్, డీజిల్ ధరల్లో 70 శాతంవరకూ ఎక్సయిజ్, వ్యాట్ ఆక్రమిస్తుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు. -
బండి ఓకే.. ఆయిలే గుదిబండ!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్స్ మార్కెట్లలో ఇండియా కూడా ఒకటి. కొనేది కారైనా, బైకైనా మనోళ్లు చూసేది మాత్రం వాల్యూ ఫర్ మనీ! అందుకే కార్ల కోసం మారుతి సుజుకీ వైపు, బైకుల కోసం హీరో కంపెనీ వైపు చూస్తారు. హీరో ఇండియాలో అతి పెద్ద బైకుల తయారీ కంపెనీ. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. బైకులు, కార్లు కొనే ముందు ఓ సారి పెట్రోల్, డీజిల్ ధరల గురించి సగటు భారతీయుడు ఆలోచిస్తున్నాడు. గడచిన పదేళ్లలో వాహనాల ఇంధన రేట్లు పెరగడం ఒక ఎత్తైతే, ఈ పదిహేను రోజుల్లో పెరిగిన తీరు మరో ఎత్తు. పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశానికి ఎగబాకడం వినియోగదారుల్లో గుబులుపుట్టిస్తోంది. దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 రూపాయలను తాకాయి. ఇలా వాహనదారుల ముక్కుపిండి వసూలు చేస్తున్న మొత్తం నిజంగా ఆయిల్ కంపెనీలకే వెళ్తుందా అంటే సమాధానం లేదు అనే చెప్పాలి. (అప్లికేషన్లో దగ్గు మందు.. తెచ్చింది కరోనా మందు) ప్రతి లీటరుకు చెల్లిస్తున్న మొత్తంలో 60 శాతానికిపైగా పన్ను కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. మే ఆరో తేదీన ఢిల్లీలో లీటరు పెట్రోల్ రేటు 71.26 రూపాయలు కాగా, లీటరు డీజిల్ ధర 69.39. వీటి నుంచి పన్నుతీసేస్తే లీటరు పెట్రోల్ అసలు ధర 18.28 రూపాయలుగా, లీటరు డీజిల్ ధర 18.78 రూపాయలుగా తేలింది. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 32.98 రూపాయలు, లీటరు డీజిల్ పై 31.83 రూపాయల ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. ఇక ఢిల్లీ ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 16.44 రూపాయల వ్యాట్ విధిస్తోండగా, లీటరు డీజిల్ పై 16.26 రూపాయల పన్ను వడ్డిస్తోంది. అతి కొద్ది మొత్తం డీలర్ మార్జిన్ కింద పోతోంది. వీటన్నింటినీ కలిపితే లీటరు ఆయిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 శాతానికి పైగా పన్ను వేస్తున్నాయి.(ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు) కరోనా వైరస్ వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో ఆయిల్ పై పన్ను శాతం 75ని తాకింది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 55 శాతం పైగా సుంకాలను చమురుపై వడ్డిస్తున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ సెక్టార్ నుంచి భారత ప్రభుత్వానికి 2.14 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1.50 లక్షల కోట్లను చమురు రంగం ఆర్జించిపెట్టింది. -
పెట్రో మంట
ముడిచమురు అంతర్జాతీయంగా భారీగా పడిపోయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం రికార్డు స్థాయి వైపు పరుగులు పెడుతున్నాయి. జూన్ 6న మొదలైన రేట్ల పెంపు దాదాపుగా ప్రతీ రోజు కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీ సంగతి తీసుకుంటే జూన్ 6న లీటరు పెట్రోల్ రేటు రూ.71.26గా ఉండగా, జూన్ 17 నాటికి రూ.77.28కి చేరింది. డీజిల్ రేటు లీటరుకు రూ.69.39గా ఉండగా, రూ. 75.79కి ఎగిసింది. ఇదే తీరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో రేటు రూ. 100 కూడా దాటేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ట్యాక్సులు, కమీషన్లు లేకుండా వాస్తవానికి డీలరు స్థాయిలో రూ.22.44 స్థాయిలో ఉన్న పెట్రోలు ధర.. రిటైల్‌గా కొనుగోలుదారు స్థాయికి వచ్చేటప్పటికి ఏకంగా అనేక రెట్లు పెరిగిపోవడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు, వ్యాట్ మోత మోగిస్తుండటమే కారణం. ఇంధనాల రేటులో దాదాపు 60 శాతం పైగా భాగాన్ని ఇవే ఆక్రమిస్తున్నాయి. ఎందుకంటే.. కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్‌డౌన్‌తో పన్ను ఆదాయాలకు గండి పడిన నేపథ్యంలో కొంత భాగాన్నైనా పూడ్చుకునేందుకు ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేటు 30 డాలర్ల దిగువకు పడిపోయినప్పుడు కేంద్రం మే 5న ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై రూ.10 మేర (లీటరుకు), డీజిల్‌పై రూ.13 మేర పెంచింది. ఇలా వచ్చే ఆదాయాన్ని ఇన్ఫ్రా, ఇతరత్రా అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లిస్తామని తెలిపింది. ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంధనాలపై సుంకాలు, పన్నులను తగ్గించే ఆస్కారం ఉండకపోవచ్చని తెలిపాయి. అటు చమురు కంపెనీలు తమ ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకు రేట్లను క్రమంగా పెంచుకుంటూ పోతున్నాయి. ఈ పెంపు 30 పైసలు.. 40 పైసల స్థాయికి తగ్గినా.. మొత్తం మీద చూస్తే జూన్ ఆఖరు దాకా రేట్ల పెంపు కొనసాగడం మాత్రం తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. సుంకాల భారం.. దేశ రాజధాని ఢిల్లీ సంగతి తీసుకుంటే లీటరు పెట్రోలు వాస్తవ ధర రూ. 22.44. వ్యాట్, ఎక్సైజ్ సుంకం, డీలర్ల కమీషన్ ఇవన్నీ కలిపితే మంగళవారం నాటి రిటైల్ రేటు ఏకంగా రూ. 76.73 పలికింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్స్ఛైజ్ సుంకం పెట్రోల్‌పై లీటరుకు రూ. 32.98గా, డీజిల్‌పై లీటరుకు రూ. 31.83గా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రాష్ట్రాన్ని బట్టి మారుతుంటుంది. మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, కర్ణాటక మొదలైనవి అత్యధికంగా 30% వ్యాట్ విధిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, డీలర్ కమీషన్ విషయానికొస్తే.. పెట్రోల్ బంకు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇది రూ. 2–4 మధ్య ఉంటుంది. ఢిల్లీ సంగతి తీసుకుంటే పెట్రోల్‌పై డీలరు కమీషన్ లీటరుకు రూ. 3.57, డీజిల్‌పై రూ. 2.51గా ఉంది. పెట్రోలియం రంగంపై పన్నులతో కేంద్రానికి రూ. 3.48 లక్షల కోట్లు, రాష్ట్రాలకు రూ. 2.27 లక్షల కోట్లు వస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. -
వినియోగదారులకు మరో బురిడీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోగా, ఆ ప్రయోజనాన్ని మన ప్రభుత్వాలు వినియోగదారులకు చేరనివ్వడం లేదు. సొంత ఖజానాలో జమ చేసుకుంటున్నాయి. ముడి చమురు ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాల్సింది పోయి కొన్ని రాష్ట్రాల్లో పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తాజాగా ఎక్సైజ్ సుంకం పెంచగా, కొన్ని రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.10, లీటర్ డీజిల్‌పై రూ.13 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచింది. పెట్రోల్, డీజిల్ మొత్తం ధరలో పన్నుల వాటా 70 శాతానికి చేరింది. ఈ పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి దాదాపు రూ.1.6 లక్షల కోట్ల అదనపు ఆదాయం రానుంది. ప్రస్తుతం ఎక్సైజ్ సుంకం పెంచినప్పటికీ వినియోగదారులపై ఎలాంటి ప్రభావంపడదు. ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పడిపోయింది. ఆ లాభాన్ని పొందుతున్న ఆయిల్ కంపెనీల నుంచి ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం వసూలు చేయనుంది. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. సుంకాన్ని కేంద్రం పెంచకపోయి ఉంటే చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు కొంతైనా తగ్గించేందుకు ఆస్కారం ఉండేది. దాంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరేది. రాష్ట్రాల నిర్వాకం పెట్రోల్, డీజిల్‌పై ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచేసింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటర్‌కు రూ.1.67, డీజిల్ ధర రూ.7.10 చొప్పున పెరిగింది. దీనివల్ల ఢిల్లీ సర్కారుకు రూ.700 కోట్ల అదనపు ఆదాయం రానుంది. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పెంపు ద్వారా రూ.2,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హరియాణా సర్కారు సైతం పెట్రోల్‌పై రూపాయి, డీజిల్‌పై రూ.1.1 చొప్పున వ్యాట్‌ను పెంచింది. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాట్‌ను పెంచాయి. ధరల పెంపును వెనక్కి తీసుకోవాలి: రాహుల్ గాంధీ ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై మరింత భారం మోపుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం హిందీ భాషలో ట్వీట్ చేశారు. ఈ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పెట్రోపై పన్ను బాదుడు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 కొనసాగుతున్న సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సంక్షోభంతో వినిమయ డిమాండ్ తీవ్రంగా క్షీణించి, ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్న తరుణంలో ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో , పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ. 13 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఈ పెంపు నేటి నుంచే అమలులోకి వచ్చింది. తాజా పెంపు వల్ల కేంద్ర ఖజానాకు రూ. 1.6 లక్షల కోట్ల ఆదాయం లభించనుంది. దీనితో పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 32.98 కు, డీజిల్‌పై రూ.31.83 పెరిగింది. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ ) ఒక వైపు పలు రాష్ట్రాలు పెట్రో ధరలపై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకోగా తాజాగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని మరోసారి పెంచుతూ నరేంద్ర మోదీ సర్కార్ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ భారం ఆయిల్ కంపెనీలపై వుంటుందని, రీటైల్ అమ్మకాలపై వుండదని స్పష్టం చేసింది. . కాగా గత మార్చి నుంచి ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. అటు ఈ కరోనా కల్లోలంతో భారీ పతనాన్ని నమోదు చేసిన చమురు ధరలు గరిష్ట స్థాయి నుండి 60శాతం క్షీణించాయి. (పెట్రో షాక్, నష్టాల్లో మార్కెట్లు) -
పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల తగ్గుదల ఫలితం ఇకపై దేశీయ వినియోగదారుకు అందదు. ఎందుకంటే, ఆ మేరకు కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. ఈ నిర్ణయంతో పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. దీని ఫలితంగా కేంద్రానికి రూ.39వేల కోట్ల ఆదాయం అదనంగా సమకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని అభివృద్ధి పథకాలు, మౌలికరంగ వసతుల కోసం వెచ్చించనున్నట్లు కేంద్రం తెలిపింది. తాజా పెంపుతో లీటరు పెట్రోల్‌పై స్పెషల్ ఎౖక్సైజ్ డ్యూటీ రూ.8 వరకు చేరుకోగా డీజిల్‌పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.4కు పెరిగినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ శనివారం జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. అదనంగా రోడ్ సెస్సు.. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.1 చొప్పున పెరిగి రూ.10కి చేరింది. అంతిమంగా ఎక్సైజ్ డ్యూటీ లీటరు పెట్రోల్‌పై రూ.22.98కు, డీజిల్‌పై 18.83కు చేరుకున్నట్లయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.69.87, డీజిల్ రూ.62.58కి అందుబాటులో ఉంది. మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను లీటరుకు రూ.9.48, డీజిల్‌పై రూ.3.56గా ఉంది. కాంగ్రెస్ మండిపాటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్జైజ్ డ్యూటీ పెంపును కాంగ్రెస్ విమర్శించింది.అంతర్జాతీయంగా తగ్గిన ధరల ప్రభావం ఆ మేరకు వినియోగదారుకు అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. -
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19 అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న వేళ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. లీటరుకు మూడు రూపాయల చొప్పున సుంకాన్ని పెంచినట్లు పేర్కొంది. అదే విధంగా పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని రూ. 2 నుంచి 8 రూపాయలకు, డీజిల్‌పై రూ.4కు పెంచుతున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఇక రోడ్ సెస్‌ను కూడా పెంచినట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్‌పై వరుసగా లీటరుకు రూ.1, రూ. 10 పెంచింది. కాగా అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న వేళ.. కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉన్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచిన నేపథ్యంలో ఇంధన ధరలు నామమాత్రంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్రం తాజా నిర్ణయంతో రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం రావొచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మద్యం.. తగ్గుముఖం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధ ప్రభావాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మూడు నెలల పాలనలో ప్రజల కళ్లకు కట్టినట్లు ఆచరణలో చూపించారు. దీంతో మద్యం ఆదాయం భారీగా తగ్గిపోయింది. అయినా మహిళల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది ఆగస్టు వరకు పోల్చి చూస్తే ఈ ఏడాది ఆగస్టు వరకు ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం ఏకంగా రూ.678.03 కోట్లు తగ్గిపోయిందని అకౌంటెంట్ జనరల్ నివేదిక స్పష్టం చేస్తోంది. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడం స్వయంగా చూసిన వైఎస్ జగన్ దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఆ మేరకు ప్రకటన చేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా ఇప్పటికే 400కు పైగా మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఇక అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలన్నీ బంద్ కానున్నాయి. మద్యం దుకాణాల తగ్గింపు మరోవైపు గతంలో మాదిరి మద్యం విక్రయాలకు టార్గెట్లు పెట్టలేదు. ఆదాయం తగ్గడానికి వీల్లేదని, వీలైనంత ఎక్కువ మద్యం తాగించాలనే చాటుమాటు ఆదేశాలు కూడా ఇవ్వలేదు. ఫలితంగా మద్యం ఆదాయం తగ్గిపోవడమే ముఖ్యమంత్రి జగన్‌చిత్తశుద్ధికి నిదర్శనం. వచ్చే నెల నుంచి 20 శాతం మద్యం దుకాణాలను అంటే.. 4,380 నుంచి 3,500కి తగ్గించేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి కనిపించవు. ఒకరికి ఎలాంటివైనా సరే మూడు బాటిళ్లకు మించి విక్రయించరు. ఇప్పటికే బెల్ట్ షాపులు మూతపడ్డాయి. డి–అడిక్షన్ కేంద్రాలకు నిధులను రూ.500 కోట్లకు పెంచారని, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం వల్ల కొత్తగా 16 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. -
రిటైర్మెంట్ రోజే బెనిఫిట్స్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో రిటైౖరైన ఉద్యోగికి ఎటువంటి జాప్యం లేకుండా చివరి రోజే టర్మినల్ బెనిఫిట్స్ అందజేయాల్సి ఉందని, ఈ విషయంలో ఇంకా స్పష్టమైన ఆదేశాలిస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు 30 మంది స్పెషలిస్టు వైద్యులను ఇటీవల నియమించామని చెప్పారు. హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌లో బుధవారం గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘంతో జరిగిన 36వ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘాల సూచనలపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఖాళీల భర్తీలో అర్హులైన సింగరేణి ఉద్యోగులకు 60 శాతం అవకాశం కల్పించడం, కొత్త బూట్లు, ఆర్వో మంచినీటి ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక సమస్యలపై వారంలోగా డైరెక్టర్ల స్థాయిలో చర్చించి సానుకూలంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో అద్భుత ప్రగతి ఈ ఏడాది లాభాల బోనస్ చెల్లింపుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఐదేళ్లుగా లాభాల బోనస్ ప్రకటించిన మాదిరిగానే ఈ సారి కూడా మెరుగైన స్థాయిలో ప్రకటించబడుతుందని శ్రీధర్ స్పష్టం చేశారు. దేశంలో మరే ఇతర ప్రభుత్వ సంస్థల్లో కూడా సింగరేణి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడం లేదని, ఇవి ఇలాగే కొనసాగించాలంటే సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా భూగర్భ గనుల్లో నష్టాలు భారీగా తగ్గించాలని, ఓసీ గనుల్లో యంత్రాల వినియోగం, పనిగంటలు పెరగాలని సూచించారు. దీనికి కార్మిక సంఘాలు కూడా తమ వంతు బాధ్యతగా కార్మికులకు అవగాహన కలిగించాలని కోరారు. సంస్థ గత ఐదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించిందనీ, రానున్న కాలంలో కూడా లక్ష్యాల మేర కంపెనీని అభివృద్ధి చేస్తే రెట్టింపు సంక్షేమ ఫలాలు అందుకోగలమని, దీనికి కార్మిక సంఘాలు, అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషిచేస్తూ, సహకరించాలని కోరారు. సింగరేణి భవిష్యత్తు ప్రణాళికలను ఈ సందర్భంగా ఆయన కార్మిక నేతలకు వివరించారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులు చేపట్టి లాభదాయక మైనింగ్ ద్వారా లాభాలను ఆర్జించడానికి పథకాలు రూపొందిస్తున్నామని చెప్పారు. రూ.50 వేల కోట్ల టర్నోవర్.. 5 వేల కోట్ల లాభాలు రానున్న ఐదారేళ్ల కాలంలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి, తద్వారా 50 వేల కోట్ల టర్నోవర్, 5 వేల కోట్ల లాభాలను ఆర్జించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, తద్వారా మహారత్న హోదా కూడా లభించి మరిన్ని మెరుగైన అభివృద్ధి అవకాశాలు పొందనున్నామని శ్రీధర్ వివరించారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ప్రాతినిధ్య సంఘం అధ్యక్షుడు వై.గట్టయ్య, కార్యదర్శి ఎం.రంగయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు రమేశ్, కార్యదర్శి ఎన్.వి.రాజశేఖర్‌లు పలు అంశాలను సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎస్.శంకర్, ఎస్.చంద్రశేఖర్, భాస్కర్‌రావు, బలరాం తదితరులు పాల్గొన్నారు. -
రూ.27,467 కోట్ల పన్నులు!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఐదేళ్లలో వివిధ రకాల పన్నుల రూపంలో రూ.27,467 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.13,105 కోట్లు, కేంద్రానికి రూ.14,362 కోట్లను పన్నులు, ఇతర రూపాల్లో చెల్లించింది. గత ఐదేళ్లలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, లాభాల్లో గణనీయ వృద్ధి సాధించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులు కూడా భారీగా పెరిగాయి. ఐదేళ్లలో రెట్టింపైన పన్నులు వివిధ సంస్థల మాదిరిగానే సింగరేణి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలురకాల పన్నులు, డివిడెండ్ల రూపంలో సొమ్ము చెల్లిస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్, స్టేట్ జీఎస్టీ, కాంట్రాక్టు ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, రాయల్టీ వంటి 9 రకాల పన్నులు చెల్లిస్తోంది. కేంద్రానికి డివిడెండ్‌తో పాటు సెంట్రల్ జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, స్వచ్ఛ భారత్ సెస్, కృషి కల్యాణ్ సెస్, జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్, క్లీన్ ఎనర్జీ సెస్, ఎన్ఎంఈటీ వంటి 21 రకాల పన్నులను ఏటా చెల్లిస్తోంది. 2014–15లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,996.58 కోట్లు, కేంద్రానికి రూ.1,863.11 కోట్లు కలిపి మొత్తం రూ.3,859.69 కోట్లు చెల్లించింది. 2018–19లో రాష్ట్రానికి రూ.3,348.4 కోట్లు, కేంద్రానికి రూ.3,680.45 కోట్లు కలిపి మొత్తం రూ.7,028.85 కోట్లు చెల్లించింది. ఏ పన్ను ఎంత? గత ఐదేళ్ల కాలంలో సింగరేణి రాయల్టీల రూపంలో రూ. 8,678.82 కోట్లను రాష్ట్ర ఖజానాకు చెల్లించింది. రూ.1,240.67 కోట్ల వ్యాట్, రూ.485.33 కోట్ల సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, రూ.342.05 కోట్ల స్టేట్ జీఎస్టీ, రూ.78.83 కోట్ల వర్క్ కాంట్రాక్టు ట్యాక్స్, రూ.66.94 కోట్ల ఎంట్రీ ట్యాక్స్ చెల్లించింది. దీనికి అదనంగా డివిడెండ్ల రూపంలో రాష్ట్రానికి ఐదేళ్లలో రూ.420.66 కోట్లు చెల్లించింది. కేంద్రానికి చెల్లిస్తున్న వాటిలో క్లీన్ ఎనర్జీ సెస్‌దే అగ్రస్థానం. గత ఐదేళ్లలో రూ.4,864.41 కోట్ల క్లీన్ ఎనర్జీ సెస్ చెల్లించింది. రూ.4,095.86 కోట్ల జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్, రూ.2,441.56 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్, రూ.986.64 కోట్ల సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రూ.395.73 కోట్ల సర్వీస్ ట్యాక్స్, రూ.342.05 కోట్ల సెంట్రల్ జీఎస్టీ, రూ.201.37 కోట్ల స్టోయింగ్ ఎక్సైజ్ డ్యూటీ, రూ.124.42 కోట్ల కస్టమ్స్ డ్యూటీ చెల్లించింది. దీనికి అదనంగా గత ఐదేళ్లకు కేంద్రానికి రూ.402.6 కోట్ల డివిడెండ్లను చెల్లించింది. 6 జిల్లాల అభివృద్ధికి రూ.1,844 కోట్లు సింగరేణి గనులు విస్తరించిన 6 జిల్లాల్లోని సమీప గ్రామాల అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కార్యక్రమం కింద సింగరేణి సంస్థ 2016–17 నుంచి 2019 ఏప్రిల్ వరకు రూ.1,844 కోట్లు సంబంధిత జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి చెల్లించింది. -
ఏటీఎఫ్‌పై తగ్గిన ఎక్సైజ్ డ్యూటీ
న్యూఢిల్లీ: ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విమాన ఇంధనంగా పిలిచే ఏటీఎఫ్‌పై డ్యూటీని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించిన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా తగ్గింపు అక్టోబరు 11 (గురువారం) నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.74.56 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో గతేడాది జులై నుంచి ఇప్పటివరకు విమాన ఇంధన ధర 58.6 శాతం పెరిగింది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం శుభవార్త
-
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వాతపెడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, దేశీయంగా వాహనదారులకు జేబులకు భారీగా చిల్లు పడుతోంది. కేవలం క్రూడాయిల్ ధరలే కాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పన్నుల వల్లే ఈ మేర పెట్రోల్, డీజిల్ ధరలు కాకపుట్టిస్తున్నాయని విపక్షాలు, వాహనదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ధరలు పెరుగుతుండటంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. అటు విపక్షాలు, ఇటు వాహనదారుల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్లతో, దిగొచ్చిన కేంద్రం ఎట్టకేలకు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని రూ.1.50 తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అంతేకాక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా లీటరు పెట్రోల్, డీజిల్ ధరను రూపాయి తగ్గిస్తున్నట్టు తెలిపారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2.50 తగ్గాయి. తగ్గించిన ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని జైట్లీ పేర్కొన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో, రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను రూ.2.50 తగ్గించాలని అరుణ్‌జైట్లీ ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పెరిగాయని, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 86 డాలర్లను దాటిందని మంత్రి అన్నారు. దీంతో కరెన్సీ మార్కెట్‌తో పాటు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం పడిందని జైట్లీ అన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను తీసుకుందని, కానీ అంతర్జాతీయ అంశాలు భారత మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో రూ.21,000 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని జైట్లీ తెలిపారు. డీజిల్, పెట్రోల్ ధరలను డీరెగ్యులేషన్ చేయాలని తాము భావించడం లేదని జైట్లీ చెప్పారు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ పెరగడం, దేశీయంగా రూపాయిని కూడా భారీగా కుప్పకూల్చుతుంది. రూపాయి ఎఫెక్ట్, చమురు ధరల సెగ స్టాక్ మార్కెట్లను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు జైట్లీ ప్రకటించడంతో, వెంటనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్లు నష్టాల బాట పట్టాయి. -
35 రూపాయలకే పెట్రోల్!
న్యూఢిల్లీ : ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డులను బ్రేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అవి పెరగడమే తప్ప, తగ్గడం కనిపించడం లేదు. దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేయకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యోగా గురువు బాబా రామ్‌దేవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగానే ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ ప్రభుత్వం తనకు అనుమతి ఇచ్చి, పన్నుల్లో ఉపశమనం కల్పిస్తే, లీటరు పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.35 నుంచి రూ.40కే అందిస్తానని అన్నారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, అంతేకాకుండా 28 శాతం శ్లాబ్‌ను తీసేయాలని బాబా రాందేవ్ సూచించారు. ఎన్డీటీవీ యువ కాంక్లేవ్ సదస్సులో మాట్లాడిన బాబా రాందేవ్ సమకాలీన అంశాలపై ఆసక్తికరంగా స్పందించారు. పెట్రోల్, డీజిల్‌పై మోదీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించకపోవడంపై రాందేవ్ బాబా పలు ప్రశ్నలను లేవనెత్తారు. పన్నులను వాహనదారుల నుంచి కాకుండా.. ధనవంతలను నుంచి వసూలు చేయాలన్నారు. ఇంధనాలపై పెరుగుతున్న ధరలు, మోదీ ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయన్నారు. రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ అంశాలు, మోదీ ప్రభుత్వం పన్నుల్లో ఉపశమనం కల్పించడానికి నిరాకరించడం ఇవన్నీ ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై మొత్తంగా రూ.19.48 ఎక్సైజ్ డ్యూటీని, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీని విధిస్తోంది. అది కాక, రాష్ట్రాలు వ్యాట్‌లను విధిస్తున్నాయి. ఇంధన ధరలతో పాటు ఇతర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని బాబా రాందేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో నానాటికీ అసహనం పెరిగిపోతోందని రాందేవ్ పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలపై మోదీ ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేదంటే ఆయనకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చాలా విధానాలు బాగున్నాయని, కానీ కొన్నింటిన్నీ సవరించాల్సి ఉందని చెప్పారు. వీటిలో అతిపెద్ద సమస్య ధరల పెరుగుదలేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీపై కొంత మంది విమర్శలు చేస్తున్నారని, విమర్శలు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాందేవ్ అన్నారు. రాఫెల్ డీల్‌పై కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రాందేవ్.. అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉన్నానని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను బీజేపీ తరుఫున ప్రచారం చేయకపోవచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు. -
ఆల్-టైమ్ గరిష్టంలో పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. పెరగడమే తప్ప, ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. వాహనదారులకు చుక్కలు చూపిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి, రూ.82.06గా నమోదైంది. ముంబైలో కూడా 15 పైసలు పెరిగి, ఆల్-టైమ్ గరిష్టంలో రూ.89.44 మార్కును టచ్ చేసింది. పెట్రోల్‌కు తగ్గ రీతిలో డీజిల్ ధరలు కూడా సామాన్యులకు వాత పెడుతున్నాయి. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర 6 పైసలు పెరిగి రూ.73.78గా నమోదైంది. అలాగే ముంబైలో రూ.78.33గా ఉంది. రాజధానుల పరంగా పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంది కోల్‌కతాలోనే. ఈ నగరంలో లీటరు పెట్రోల్‌ను రూ.83.91 వద్ద, లీటరు డీజిల్‌ను రూ.75.53 వద్ద విక్రయిస్తున్నారు. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.85.31కి, డీజిల్ ధర రూ.78 కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.86.85గా, లీటరు డీజిల్ ధర రూ.80.19గా నమోదైంది. జనవరి 1 నుంచి ఢిల్లీలో పెట్రోల్ ధర 15.4 శాతం పెరిగింది. అంటే రూ.69.97 నుంచి ప్రస్తుతం రూ.82.06కు చేరుకున్నాయి. డీజిల్ ధర కూడా 22 శాతం ఎగిసింది. ఇంతలా పెట్రోల్, డీజిల్ సామాన్యులను గడగడలాడిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధనపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం లేదు. ఆగస్టు నుంచి అయితే ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప అసలు తగ్గడం లేదు. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం, డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం ఈ ధరల పెరుగదలకు మరింత తోడ్పడుతోంది. -
‘పాలు, బెంజ్‌పై ఒకటే పన్ను కుదరదు’
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ కింద 18 శాతం ఏకీకృత పన్ను రేటు ఆచరణ సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మెర్సిడెస్ కారుకు, పాలకు ఒకే పన్ను విధించలేమని కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చుతూ మోదీ తేల్చిచెప్పారు. ఏకీకృత పన్ను విధానంతో ఆహార, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని అన్నారు. జీఎస్టీ అమలైన ఏడాది అనంతరం పరోక్ష పన్నుల వసూళ్లు 70 శాతం పెరిగాయని, చెక్‌పోస్ట్‌లను తొలగించి 17 పన్నులు, వివిధ రకాల 23 సెస్‌లను ఒకే పన్ను వ్యవస్థలోకి తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. కేంద్ర పరిధిలో ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను రాష్ట్రాల్లో వ్యాట్ వంటి పన్నుల స్ధానంలో జీఎస్టీ పరోక్ష పన్ను వ్యవస్థను సరళతర చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, వర్తకులు, ఇతర భాగస్వాములు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా జీఎస్టీలో మార్పులు చేపడతామని చెప్పారు. జీఎస్టీలో 18 శాతంతో ఒకే పన్ను రేటు ఉండాలని కాంగ్రెస్ కోరుతున్నదని, అయితే ప్రస్తుతం జీరో, 5 శాతం పన్ను పరిధిలో ఉన్న ఆహారోత్పత్తుల ధరలు 18 శాతం పరిధిలోకి తెస్తే వాటి ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలు, మెర్సిడెస్ కారుపై ఒకే రకమైన పన్నులు వేయలేమని ప్రధాని స్పష్టం చేశారు. -
పెట్రోల్, డీజిల్‌పై 5 రూపాయల తగ్గింపు..!?
ముంబై : వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ధరల తగ్గింపు ఎలా అనే సాధ్యాసాధ్యాలపై తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఇంధనంపై ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు 4 రూపాయల నుంచి 5 రూపాయల మేర కిందకి దిగిరానున్నాయి. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన అనంతరం, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించేందుకు రాష్ట్రాలను సైతం వాల్యు యాడెడ్ ట్యాక్స్(వ్యాట్)ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించబోతోంది. ఈ క్రమంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా విక్రయాలపై వారి కమిషన్ తగ్గించుకోనున్నాయి. మోదీ ప్రభుత్వంలో ఓ సీనియర్ ఉన్నతాధికారి పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్లాన్ వివరాల గురించి హిందూస్తాన్ టైమ్స్‌కు చెప్పారు. ఉన్నతాధికారి ఇచ్చిన సమాచారం మేరకు.. ఇంధన ధరలు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉందని, త్వరలోనే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ఉంటుందని తెలిసింది. కానీ రేట్ల తగ్గింపులో రాష్ట్రాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాలని పేర్కొన్నారు. కేవలం కేంద్రం ఒక్కటే ఈ భారాన్ని మోసలేదని, రాష్ట్రాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలన్నీ సహకరిస్తే, ఇంధన ధరలపై వినియోగదారులకు ఉపశమనం కల్పించవచ్చని తెలిపారు. మరోవైపు లెఫ్ట్ పాలన నడుస్తున్న కేరళలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క రూపాయి తగ్గాయి. ఇంధనంపై విక్రయ పన్నును తగ్గించి తాము, పెట్రోల్, డీజిల్ ధరలను రూపాయి మేర తగ్గిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. 2016-17లో దేశీయ బాస్కెట్లో బ్యారల్‌కు 47.56 డాలర్లు పలికిన క్రూడ్ ధర, 2017-18 నాటికి 56.43 డాలర్లకు పెరిగింది. మార్చి నాటికి ఇది 63.80 డాలర్లకు, ఏప్రిల్ నాటికి మరింత ఎగిసి 69.30 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారల్ క్రూడ్ ధర 75 డాలర్లుగా ఉంది. ఇది గతవారం అత్యధిక స్థాయిలో 80 డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే. దేశీయంగా కూడా వరుసగా 16 రోజుల పాటు గరిష్ట స్థాయిలను నమోదు చేసిన ఇంధన ధరలు, నిన్నటి నుంచి పైసల్లో తగ్గుముఖం పట్టాయి. నేడు(గురువారం) దేశీయంగా లీటరు పెట్రోల్‌పై 7 పైసలు, లీటరు డీజిల్‌పై 5 పైసలు ధర తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది. పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్లా దూసుకుపోతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ ధరలు పెరగడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా చెలరేగాయి. ఇంధన ధరలపై విధించే పన్నుల్లో కేంద్రం 25 శాతం, రాష్ట్రాలు విధించే పన్నులు 21.2 శాతం, డీలర్ మార్జిన్లు 4.7 శాతం ఉంటాయి. -
పెట్రో మంటకు త్వరలో పరిష్కారం
న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరిగిపోతూ సామా న్యుడికి గుదిబండగా మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తగిన పరిష్కారం కనుగొనే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ వారంలోనే పలు చర్యలు తీసుకోనుందని వెల్లడించారు. సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతోపాటు మరిన్ని చర్యలు తీసుకోవచ్చన్నారు. ఈ మేరకు పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ చర్చలు జరుపుతోందని వివరించారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ, ముంబైలలో పెరిగిన పెట్రోలు ధర.. తాజాగా చెన్నైలోనూ రికార్డు స్థాయికి చేరుకుంది. మంగళవారం లీటరుకు రూ.79.79 పలికింది. డీజిల్ ధర కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో డీజిల్ ధర రూ.68.08. -
17 రోజుల్లో 14 సార్లు పెంపు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పైపైకి ఎగుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పైకి ఎగిశాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర నాలుగేళ్ల గరిష్టానికి చేరగా.. డీజిల్ ధర కూడా రికార్డు స్థాయికి చేరింది. గత 17 రోజుల్లో ఇప్పటి వరకు 14 సార్లు ఈ ధరలు పెరిగినట్టు తెలిసింది. 2018 మార్చి 18 నుంచి కొనసాగింపుగా ఈ ధరలు పెరుగుతూనే ఉన్నాయని వెల్లడైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం నేడు పెట్రోల్ ధరలు ఢిల్లీలో లీటరు రూ.73.95 ఉండగా.. కోల్‌కత్తాలో రూ. 76.66గా, ముంబైలో రూ.81.8గా, చెన్నైలో రూ.76.72గా రికార్డయ్యాయి. డీజిల్ ధరలు కూడా ఢిల్లీలో లీటరుకు రూ.64.82గా, కోల్‌కత్తాలో రూ.67.51గా, ముంబైలో రూ.69.02గా, చెన్నైలో రూ.68.38గా నమోదయ్యాయి. 2017 జూన్‌లో రోజువారీ సమీక్ష చేపట్టినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా.. పెరుగుతూనే ఉన్నాయి.క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాటు, రూపాయి-డాలర్ ఎక్స్చేంజ్ రేటు, దేశీయంగా పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని తెలిసింది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్లకు చేరుకుంది. మంగళవారం కూడా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశీయంగా పెట్రల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలను చేరుకున్నాయని వెల్లడైంది. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు గరిష్టాలను చేరుతుండటంతో, వెంటనే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వెనువెంటనే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై విముఖత వ్యక్తం చేస్తోంది. గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య కాలంలో తొమ్మిది సార్లు ఎక్సైజ్ డ్యూటీలు పెంచిన ప్రభుత్వం, ధరలు పెరుగుతున్నప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రమే ఎక్సైజ్ డ్యూటీను తగ్గించింది. దీంతో ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించకుండా... వినియోగదారులపై భారం మోపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మళ్లీ రూ.80 మార్కు దాటిన పెట్రోల్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గరిష్ట స్థాయిల్లో ఈ ధరలు సోమవారం నమోదయ్యాయి. సోమవారం లీటరు పెట్రోల్ ధర 15 పైసలు, లీటరు డీజిల్ ధర 7 పైసలు పెరిగింది. దీంతో ముంబైలో మరోసారి రూ.80 మార్కును పెట్రోల్ ధర అధిగమించి, రూ.81.17గా నమోదవుతోంది. డీజిల్ రూ.68.30గా ఉంది. ముంబైలో స్థానిక పన్ను లేదా వ్యాట్ రేట్లు అత్యధికంగా ఉండటంతో, అక్కడ ధరలు మోత మోగుతున్నాయి. ఇక ఢిల్లీలో 2014 మార్చి నుంచి అత్యంత గరిష్ట స్థాయిల్లోకి పెట్రోల్ ధర ఎగిసింది. లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.73.31గా, డీజిల్ ధర రూ.64.14గా రికార్డయ్యాయి. డిసెంబర్ మధ్య నుంచి లీటరు పెట్రోల్ ధర కనీసం రూ.4, డీజిల్ ధర రూ.5.77 మేర పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్లో వీటిపై రెండు రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. కానీ స్థానిక పన్నుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో, ధరలు పైకి ఎగుస్తూనే ఉన్నాయి. రెండు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 8 రూపాయల రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను విధిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైన అంతర్జాతీయ ఆయిల్ ధరలు ప్రస్తుతం తగ్గుతున్నాయి. కానీ దేశీయంగా మాత్రం ఆ ప్రభావం కనుబడుట లేదు. -
ఒక్కసారిగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం తీసుకున్న ఎక్సైజ్ సుంకం కోత నిర్ణయంతో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు కిందకి దిగొచ్చాయి. రోజువారీ సమీక్ష నేపథ్యంలో బుధవారం ఉదయం ఆరుగంటలకు జరిపిన సమీక్షలో ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.2.25, కోల్‌కత్తాలో రూ.2.25, ముంబైలో రూ.2.38, చెన్నైలో రూ.2.41 తగ్గినట్టు తెలిసింది. దీంతో నేటి రిటైల్‌లో లీటరు డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.56.89గా, కోల్‌కత్తాలో రూ.59.55గా, ముంబైలో రూ.60.43గా, చెన్నైలో రూ.59.89గా నమోదయ్యాయి. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లో ఈ విషయం వెల్లడైంది. అదేవిధంగా పెట్రోల్ ధరలు కూడా తగ్గిన్నట్టు ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ డేటాలో తేలింది. ఢిల్లీ, కోల్కత్తా, ముంబైలలో లీటరు పెట్రోల్ ధర రూ.2.5 తగ్గినట్టు వెల్లడైంది. అదేవిధంగా చెన్నైలో ఈ తగ్గింపు రూ.2.6గా ఉంది. దీంతో నేటి రిటైల్‌లో లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.68.38గా, కోల్‌కత్తాలో రూ.71.16గా, ముంబైలో రూ.77.51గా, చెన్నైలో రూ.70.85గా నమోదయ్యాయి. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్స్చేంజ్ సుంకం తగ్గించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తున్నారు. తగ్గింపు అనంతరం ఈ సుంకాలు వరుసగా రూ.19.48, రూ.15.33గా ఉంటాయి. -
వాహనదారులకు తీపికబురు
సాక్షి,న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రెండు రూపాయల మేర తగ్గించింది. నూతన ఎక్సైజ్ డ్యూటీ బుధవారం నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. సెప్టెంబర్‌లో ముడిచమురు ధరలు ఏకంగా 12 శాతం మేర పెరిగాయి. భారత వినియోగదారులు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పెట్రో ధరలను చెల్లించాల్సి రావడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులూ పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలు తెస్తున్నాయి. ఇక పెట్రో ఉత్పత్తులపై ఎక్సయిజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కొంత మేర దిగిరానున్నాయి. -
అదనపు బాదుడు రూ. 4,691 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రజల జీవన ప్రమాణాలపై నేరుగా ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం అదనపు పన్నుల రూపంలో భారీగా వసూలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫిబ్రవరి 05, 2015న రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై తొలిసారిగా అదనపు వ్యాట్‌ను ప్రవేశపెట్టింది. వీటిపై లీటరుకు రూ. 4 పన్ను విధించింది. అప్పటికే వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులకు ఇది అదనం. కేవలం ఈ అదనపు వ్యాట్‌తో ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రజల జేబు నుంచి అదనంగా రూ. 4,691 కోట్లు ప్రభుత్వం చాకచక్యంగా లాగేసింది. ఈ మొత్తం సాధారణంగా రాష్ట్రం వసూలు చేస్తున్న వ్యాట్, కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకాలకు పూర్తిగా అదనం. తెలియకుండా జేబు ఖాళీ: ప్రస్తుతం మనం కొనుగోలు చేస్తున్న ప్రతీ లీటరు పెట్రోల్ ధరలో రూ. 20.95 నేరుగా రాష్ట్ర ఖజానాకు వెళ్లిపోతుంది. కానీ ఫిబ్రవరి 2015కు ముందు ఇది రూ.13.99గా ఉండేది. అంటే ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పైన పన్ను రేట్లను తెలియకుండా 49.74 శాతం పెంచేసింది. ఇదే విధంగా డీజిల్‌పై లీటరు పన్ను రేటు రూ. 8.86 నుంచి రూ.14.87కు అంటే 67.83 శాతం పెరిగిపోయింది. గడిచిన రెండేళ్లలోనే పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 16,714 కోట్లు వచ్చాయి. ముడిచమురు పేరుతో.. రాష్ట్ర ఖజానా రూ.16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిపోతుండటంతో వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతుందంటూ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అదనపు వ్యాట్‌ను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు ఇంధన రేట్లు గరిష్ట స్థాయికి చేరుకునిప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనికరం చూపించడంలేదని వినియోగదారులు విమర్శిస్తున్నారు. కేంద్రం తక్కువేమి కాదు... కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్ సుంకాన్ని డీజిల్‌పై 380 శాతం, పెట్రోల్‌పై 120 శాతం పెంచింది. అంతర్జాతీయ మార్కోట్లో ధరలు తగ్గుతున్నా కూడా ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోయింది. దీంతో 2014లో లీటర్ డీజిల్‌పై రూ.3.56గా ఉన్న ఎక్సైజ్ సుంకం రూ.17.33కు, పెట్రోల్‌పై రూ.9.48 నుంచి రూ.21.48 శాతానికి పెరిగిపోయింది. దీంతో 2013–14లో రూ.77,982 కోట్లుగా ఉన్న ఎక్సైజ్ సుంకం వసూళ్లు 2016–17 నాటికి రూ. 2,42,691 కోట్లు దాటింది. అంటే మూడేళ్లలో అదనంగా రూ.1,64,709 కోట్లు బాదేశారన్నమాట. 42 శాతం రాష్ట్రానికి.. కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకంలో ఆయా రాష్ట్రాలకు 42 శాతం వెనక్కి వస్తాయి. అంటే ప్రతీ లీటర్ పెట్రోలు మీద కేంద్రం ప్రభుత్వం వసూలు చేస్తున్న రూ. 21.48లో రూ. 9.02లు రాష్ట్ర ఖజానికి వస్తాయి. అదే విధంగా డీజిల్‌పై వసూలు చేస్తున్న రూ. 17.33లో రూ. 7.27 రాష్ట్రానికి వెనక్కి వచ్చేస్తాయి. ఈ విధంగా చూస్తే గడిచిన రెండున్నర ఏళ్లలో డీజిల్‌పై కేంద్రం నుంచి రూ. 6,127 కోట్లు, పెట్రోల్‌పై రూ. 2,976 కోట్లు రాష్ట్ర ఖజానాకి వచ్చాయి. ఈ విధంగా అధిక సుంకాలతో ఎడాపెడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులను వాయించేస్తున్నాయి. -
సర్కారు ‘మందు’ చూపు!
అధికారం కోల్పోయినా మరో మూడేళ్లు బార్ల వ్యాపారం కొనసాగేలా వ్యూహం - ఏడాదికే పరిమితమైన లైసెన్స్‌ను ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం - ఈ లెక్కన బార్ లైసెన్సుల రెన్యూవల్‌కు ఓ మంత్రి భారీగా వసూళ్లు - రూ.332.8 కోట్లు దండుకోవడానికి మంత్రాంగం - కొత్తగా 85 బార్లకు అనుమతి.. జూలై 1 నుంచి నూతన బార్ల విధానం సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఒకెత్తయితే బాబు సర్కారు ఇంకో అడుగు ముందుకేసి అధికారం పోయాక కూడా మద్యం వ్యాపారాల్లో మునిగితేలేలా నూతన బార్ల విధానం తీసుకు వచ్చింది. సాధారణంగా ఏడాదికోసారి బార్ల లైసెన్స్‌ల ను రెన్యువల్ చేస్తారు. ప్రస్తుతం ఇదే విధానం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాటు బార్ల లైసెన్స్‌లను మంజూరు చేసేందుకు వీలుగా నూతన బార్ల విధానాన్ని తీసుకువచ్చింది. అంటే రెండేళ్ల తర్వాత అధికారం కోల్పోయినా సరే, మరో మూడేళ్ల పాటు బార్ల లైసెన్స్‌లు కొనసాగాల న్నదే వ్యూహం. గతంలో ఉన్న బార్ లైసెన్స్‌లు గత ప్రభుత్వానికి చెందిన వారివనే సాకుతో మొత్తం లైసెన్స్‌లను రద్దు చేస్తూ.. తమ వారికి ఇచ్చుకునేందుకు వీలుగా ఎవరు ముందు దరఖాస్తు చేస్తే వారికే లెసెన్స్లంటూ తీసు కొచ్చిన విధానాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీం తో మద్యం వ్యాపారం లేదా వ్యాపారుల ద్వారా భారీగా దండుకోడానికి వ్యూహం రూ పొందించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్స్‌దారుల నుంచే భారీగా ముడుపులు పొందేందుకు వీలుగా నూతన బార్ల విధానాన్ని తెరపైకి తెచ్చింది. సాధారణంగా ఏడాది లేదా రెండేళ్లకు బార్ల లైసెన్స్‌లను మంజూరు చేయాలి. అలాంటిది ఐదేళ్లకు లైసెన్స్‌లను మంజూరు చేసే విధానం తీసుకువచ్చింది. రెండేళ్లకు లైసెన్స్ మంజూరు చేస్తే సరిపోతుందని అధికారులు ప్రతిపాదిం చినా వినకుండా, ప్రభుత్వపెద్దలు ఐదేళ్లకు లైసెన్స్ మంజూరు చేయాలని నిర్ణయం తీసు కున్నారు. ఈ మేరకు ఈ నెల 15న క్యాబినెట్ సమావేశంలో ఆమోదించారు. ఇందుకు అను గుణంగా ఒక మంత్రి ప్రస్తుత బార్ లైసెన్స్ దారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తు న్నారు. ఒక్కో బార్ లైసెన్స్‌దారు నుంచి రూ.40 లక్షల చొప్పున వసూళ్ల పర్వం ప్రారంభించారు. మధ్యవర్తిత్వం లేకుం డా నేరుగా తననే సంప్రదిం చాలనే సంకేతా లను ఆ మంత్రి పంపు తున్నారని ఎక్సైజ్ వర్గాలే పేర్కొంటున్నాయి. ఈ లెక్కన కొత్తగా మంజూరయ్యే బార్ల తో సహా సర్కారు పెద్దలు రూ.332.8 కోట్లు దండుకో నున్నారని స్పష్టమవుతోంది. ఐదేళ్లకు లైసెన్స్ మంజూరు చేస్తున్నందున వ్యాపారంలో స్థిరత్వం నెలకొంటుందని ప్రభు త్వం ఈ విధానాన్ని సమర్థించు కోజూస్తోంది. ప్రస్తుత బార్ లైసెన్స్దారులందరూ అర్హులే: ప్రస్తుత బార్ల లైసెన్స్‌ల కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. వచ్చే నెల 1 నుంచి నూతన బార్ల లైసెన్స్ విధానం అమ ల్లోకి వస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ప్రస్తుత బార్ లైసెన్సుదారులందరూ కొత్తగా లైసెన్స్ పొందేందుకు అర్హులేనని నూతన బార్ల విధానంలో పేర్కొన్నారు. ఒక బార్ లైసెన్స్ కోసం ఒకటికన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో లైసెన్స్ మంజూరు చేస్తారు. ఆన్లైన్లో బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మంచినీరు దొరక్కపోయినా బార్లు మాత్రం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసు కొచ్చిన నూతన బార్ల విధానంపై ఎక్సైజ్ శాఖ వర్గాలే విస్తుపోతున్నాయి. మామూళ్ల కోసం ఇంత బరితెగింపా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 747 బార్లుండగా, కొత్తగా 85 బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేయాలని నిర్ణయించింది. 30 వేల జనాభాకొక బార్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే బార్లు ఏర్పాటు చేయరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. జాతీయ రహదారులకు 500 మీటర్లలోపు, రాష్ట్ర రహదారులకు 220 మీటర్లలోపు బార్లను అనుమతించరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం ఆదేశాలను పాటిస్తే బార్ల సంఖ్య సగం తగ్గిపోనున్న నేపథ్యంలో రాష్ట్ర రహదారులను జిల్లాల్లో జిల్లా ప్రధాన రహదారులగా పేరు మార్చుతూ బార్ల లైసెన్స్‌లను మంజూరు చేయాలని నిర్ణయించింది. లైసెన్సు ఫీజు తగ్గింపు స్థానంలో అదనపు ఎక్సైజ్ డ్యూటీ బార్ లైసెన్స్ ఫీజుపై సర్వీసు పన్ను చెల్లించాల్సి ఉన్నందున, ఆ పన్ను మొత్తం కేంద్రానికే వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ ఫీజును తగ్గించింది. తద్వారా తగ్గిన ఆదాయాన్ని అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరుతో రాబట్టుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం 50 వేల జనాభా లోపు గల బార్ల లైసెన్స్ ఫీజు రూ.25 లక్షలుండగా రూ.15 లక్షలకు తగ్గించారు. 5 లక్షలలోపు జనాభా గల ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.40 లక్షలుండగా రూ.30 లక్షలకు తగ్గించారు. 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.50 లక్షలుండగా రూ.40 లక్షలకు తగ్గించారు. -
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్!
నోట్ల రద్దు, ఇతర కారణాలతో తగ్గిన రాబడి - అవినీతి, అధికారుల నిర్లక్ష్యమూ కారణమే - పెరిగిన మద్యం విక్రయాల ఆదాయం - ఫరవాలేదనిపించిన అమ్మకపు పన్ను - ముగిసిన 2016–17 ఆర్థిక సంవత్సరం - కేంద్ర పన్నుల్లోంచి వచ్చే రాష్ట్రవాటాపైనే సర్కారు ఆశలు! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మూడో ఆర్థిక సంవత్సరం ఈ మార్చి 31తో ముగిసిపోయింది. 2016–17లో రిజిస్ట్రేషన్ల ద్వారా ఊహించినంత ఆదాయం రాకపోవడం సర్కారు అంచనాలను దెబ్బ తీసింది. నోట్ల రద్దు ప్రభావంతో డిసెంబర్ నుంచి వరుసగా స్టాంపులు–రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో మద్యం అమ్మకాలతో వచ్చే రాబడి పెరగడం రాష్ట్ర ఖజానాకు కొంత ఊరటనిచ్చింది. మరోసారి లక్ష్యానికి దూరంగా.. వార్షికాదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో స్టాంపు లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈసారి కూడా చతికిల పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్న దశలో కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కోలుకోలేని దెబ్బతీసింది. వాస్తవానికి 2016–17లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు వార్షికాదాయ లక్ష్యాన్ని (స్టాంపుడ్యూటీ మాత్రమే) రూ.4,291.99 కోట్లుగా నిర్దేశించింది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.3,549 కోట్లు మాత్రమే సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నవంబర్ వరకు ప్రతి నెలా రూ.330 కోట్ల వరకు ఆదాయం రాగా.. డిసెంబర్లో రూ.243 కోట్లు, జనవరిలో రూ.222 కోట్లకు తగ్గిపో యింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. మొత్తంగా లక్ష్యంలో 82.7 శాతం ఆదాయం లభించినా.. అది గతేడాది (83.7 శాతం) కన్నా తక్కువే. అవినీతి, నిర్లక్ష్యమే కారణం! మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో తనిఖీలు సక్రమం గా చేయకపోవడంతో కిందిస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, మార్కెట్ విలువ కంటే తక్కువగా లెక్కించి రిజిస్ట్రేషన్ల ఆదాయానికి గండికొట్టారని కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఏడేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు చేయకపోవడం, కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఐదేళ్లకు పైగా ఒకే స్థానంలో పనిచేస్తుండడం కూడా అవినీతికి ఆస్కారమి చ్చినట్టయిందనే ఆరోపణలున్నాయి. మరో వైపు ఈ శాఖకు మూడేళ్లుగా పూర్తిస్థాయి కమిషనర్ కూడా లేరు. ఇన్చార్జిగా ఉన్న అధికారికే మరో రెండు విభాగాల బాధ్యత లను కూడా అప్పగించడం కూడా ఇబ్బం దికరంగా మారిందని చెబుతున్నారు. ఇక 10 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. తగ్గిన పన్నేతర ఆదాయం రాష్ట్రంలో పన్నేతర రాబడి గణనీయంగా తగి ్గపోయింది. ఫీజులు, జరిమానాలు, డివిడెండ్లు, లాభాలు, అటవీ ఉత్పత్తులు, ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం ఈ పద్దులో ఉంటుంది. 2015–16లో పన్నేతర రాబడి ద్వారా రూ.17,542 కోట్లు సమకూరుతాయని అంచనా వేయగా.. జనవరి నాటికి రూ.2,728 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఆదుకున్న మద్యం విక్రయాలు రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చిన ఆదాయం చివరి నాలుగు నెలల్లో భారీగా పెరిగింది. మద్యం ఉత్పత్తులపై పన్ను ద్వారా రూ.4,543 కోట్లు రాబట్టాలని అంచనా వేయగా.. జనవరి నాటికే ఆ మేర ఆదాయం సమకూరడం గమనార్హం. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా అక్టోబర్‌లో రూ.291 కోట్లు, నవంబర్‌లో రూ.201 కోట్లురాగా.. డిసెంబర్లో ఏకంగా రూ.564 కోట్లు సమకూరాయి. నాలుగు నెలలకోసారి మద్యం కంపెనీలు చెల్లించే వాటా జమకావటంతో జనవరిలో రూ.812 కోట్లు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ రాబడి పెరిగింది. ఇక అమ్మకపు పన్ను (సేల్స్ ట్యాక్స్) ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది పొడవునా నిలకడగా కొనసాగింది. -
గతవారం బిజినెస్
ఎన్ఎస్ఈ సీఈఓగా వైదొలిగిన చిత్రా రామకృష్ణ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)ఎండీ, సీఈఓగా చిత్రా రామకృష్ణ అనూహ్యమైన పరిస్థితుల్లో వైదొలిగారు. 1992లో ఎన్ఎస్ఈ ఏర్పడినప్పటి నుంచి వివిధ హోదాల్లో ఆమె సేవలందించారు. త్వరలో రానున్న ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) విషయంలో బోర్డు సభ్యులతో ఏర్పడిన విభేదాల వల్లే ఆమె తన పదవి నుంచి వైదొలిగారని సమాచారం. షెడ్యూల్ ప్రకారమైతే, ఆమె పదవీ కాలం 2018 మార్చి వరకూ ఉంది. ఎన్ఎస్ఈ మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే ఆమె వైదొలిగినట్లు తెలియజేసింది. ఇక ఎన్ఎస్ఈ తాత్కాలిక సీఈఓగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవిచంద్రన్ వ్యవహరిస్తారు. ⇔ డిపాజిట్ చేయండి... టాక్‌టైమ్ పొందండి.. అధిక సేవింగ్స ఖాతాల ప్రారంభమే ప్రధాన లక్ష్యంగా కస్టమర్లను ఆకర్షించడం కోసం ఎరుుర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు ఖాతాలో డిపాజిట్ చేసే ప్రతి రూపారుుకి ఒక నిమిషం టాక్‌టైమ్‌ను (ఎరుుర్‌టెల్ నుంచి ఎరుుర్‌టెల్‌కు) ఉచితంగా అందిస్తామని పేర్కొంది. ఈ సౌకర్యం తొలిసారి చేసిన డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1,000ల డిపాజిట్‌తో బ్యాంక్ ఖాతాను తెరిచాడనుకోండి... అతను తన ఎరుుర్‌టెల్ మొబైల్ నంబర్‌పై 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను పొందొచ్చు. ఈ టాక్‌టైమ్‌తో దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఎరుుర్‌టెల్ నంబర్కై నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ⇔ మార్చి 31 వరకు జియో సేవలు ఫ్రీ.. రిలయన్స జియో నూతన సంవత్సర కానుకగా ‘జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ ప్రకటించింది. ప్రస్తుత కస్టమర్లకు డిసెంబర్ 3తో ముగిసిపోతున్న ఉచిత సేవలను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. డేటా, దేశీయంగా వారుుస్, వీడియో కాల్స్, జియో యాప్స్‌ను ప్రస్తుత కస్టమర్లతోపాటు కొత్తగా చేరే వారు సైతం మార్చి వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపారు ⇔ నవంబర్‌లో నీరసించిన తయారీ రంగం దేశీయ తయారీ రంగంపై నోట్ల రద్దు ప్రభావం పడింది. నిక్కీ మార్కెట్ ఇండియా మ్యానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అక్టోబర్‌లో 54.4 శాతంతో 22 నెలల గరిష్ట స్థారుుకి చేరగా... మరుసటి నెల నవంబర్‌లో ఇది 52.3 శాతానికి దిగొచ్చింది. నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన ఫలితంగా నోట్లకు కొరత ఏర్పడి వినియోగంతోపాటు, సరుకుల తయారీ, నూతన ఆర్డర్లు తగ్గడమే దీనికి కారణం. పీఎంఐ సూచీ 50కి పైన ఉంటే దాన్ని విస్తరణగా, అంతకంటే దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. ⇔ ఇన్ఫ్రా పరుగులు మౌలిక రంగ వృద్ధి అక్టోబర్‌లో రికార్డు స్థారుుకి చేరుకుంది. గత ఆరు నెలల కాలంలోనే అత్యధికంగా అక్టోబర్‌లో 6.6 శాతంగా నమోదైంది. స్టీల్, రిఫైనరీ రంగాల అద్భుత పనితీరు ఈ స్థారుు వృద్ధికి తోడ్పడ్డారుు. మౌలికంలో భాగమైన విద్యుదుత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి మాత్రం భారీగా పడిపోరుుంది. మౌలికంలో భాగమైన ఎనిమిది రంగాలు... బొగ్గు, ముడి చమురు, సహజవాయువు,, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుదుత్పత్తి వృద్ధి రేటు గతేడాది అక్టోబర్‌లో కేవలం 3.8 శాతంగానే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5 శాతంగా నమోదవగా.. తాజాగా అది 6.6 శాతానికి చేరుకుంది. ⇔ విప్రో ‘ఎకో ఎనర్జీ’ వ్యాపారం విక్రయం ప్రధాన వ్యాపారమైన ఐటీపై మరింత దృష్టి సారించే దిశగా విప్రో తన ఎకో ఎనర్జీ వ్యాపార విభాగాన్ని 70 మిలియన్ డాలర్ల (రూ.469 కోట్లు)కు చుబ్ అల్బా కంట్రోల్ సిస్టమ్స్‌కు విక్రరుుంచనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ యునెటైడ్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (యూటీసీ)కు పరోక్ష అనుబంధ సంస్థే చుబ్ అల్బా. ‘‘ప్రధాన ఐటీ వ్యాపారంపై మరింత దృష్టి సారించిన నేపథ్యంలో అందులో భాగం కాని ఎకో ఎనర్జీ వ్యాపార నుంచి వైదొలగాలని నిర్ణరుుంచినట్టు విప్రో వెల్లడించింది. ఈ డీల్ 2017 ప్రథమార్థంలో పూర్తి అవుతుందని తెలిపింది. ⇔ రెండు కంపెనీలుగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్! ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో నలుగుతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీని రెండుగా విడగొట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి .. నిర్వహణకు ఒక సంస్థను, హోల్డింగ్ కంపెనీగా మరొకదాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చని శాంసంగ్ వివరించింది. ⇔ ఈటీఎఫ్‌ల్లో రూ.9,723 కోట్ల ఈపీఎఫ్‌వో పెట్టుబడులు ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో రూ.9,723 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. వీటిపై రాబడి 9.17 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో ఆ ప్రభావం నుంచి తట్టుకునేందుకు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్‌లలో ఈ మేరకు పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో వద్ద ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రూ.7.49 లక్షల కోట్ల నిధులు ఉన్నట్టు వెల్లడించారు. ఈపీఎఫ్‌వో గతేడాది ఆగస్ట్ నుంచి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ⇔ సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 7.3 శాతం భారత్ మరోసారి ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది. దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 7.3 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంతో పోలిస్తే క్షీణించినట్టు తెలుస్తోంది. అరుుతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సానుకూల వృద్ధి నమోదైంది. సాగు రంగంలో ఆశాజనక పరిస్థితులు, సేవలు, వాణిజ్య రంగాల పనితీరు మెరుగవడం వృద్ధి రేటు పెరగడానికి తోడ్పడింది. నోట్ల రద్దు ప్రభావంతో మూడో త్రైమాసికంలో ఈ స్థారుులో వృద్ధి రేటు కొనసాగకపోవచ్చనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ⇔ వృద్ధి రేటును ఒక శాతం తగ్గించిన క్రిసిల్ ట్ల రద్దు కారణంగా ఆర్థిక రంగం కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్... దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో వేసిన అంచనా 7.9 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. అదే సమయంలో వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం సైతం అంచనా వేసిన 5 శాతం కంటే తక్కువగా 4.7 శాతంగా ఉంటుందని తెలిపింది. డీమానిటైజేషన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సైతం ఇదే విధమైన అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.9 శాతానికి దిగి వస్తుందని తెలిపింది. ⇔ రూ. 4 లక్షల కోట్లకు ద్రవ్య లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ద్రవ్య లోటు రూ. 4.23 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాల్లో ఇది 79.3 శాతం. గతేడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల్లో 74 శాతమే. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు 2016-17లో సుమారు రూ. 5.33 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 3.5 శాతం)గా ఉండొచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. ⇔ బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ సుంకం ఎత్తివేత బ్రాండెడ్ బంగారు కారుున్లపై ఉన్న ఒక శాతం ఎకై ్సజ్ డ్యూటీని కేంద్రం ఎత్తివేసింది. 99.5 శాతం అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బ్రాండెడ్ బంగారు కారుున్లపై ఎకై ్సజ్ డ్యూటీ ఇకపై ఉండదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ తన నోటిఫికేషన్లో పేర్కొంది. వెండి కారుున్లకు ఉన్న ఎకై ్సజ్ డ్యూటీ మినహారుుంపు కొనసాగుతుందని తెలిపింది. ఇక, బంగారం, వెండి ఆభరణాల తయారీదారులు తయారు చేసే ప్రీషియస్ మెటల్ లేదా మెటల్ ఆధారిత వస్తువులపై మాత్రం ఒక శాతం ఎకై ్సజ్ డ్యూటీ కొనసాగుతుందని వెల్లడించింది. -
చిల్లరపేరిట బీరుపై బాదుడు!
-
సర్కారుకు ‘చిల్లర’ కిక్కు
మందుబాబుల జేబుకు చిల్లు మద్యంపై 6 నుంచి 10 శాతం ధరల వడ్డింపు ఎమ్మార్పీలో రూ. 5 ఉంటే.. రౌండ్‌ఫిగర్‌గా రూ. 10కి పెంపు ప్రభుత్వానికి ఏటా రూ.600 కోట్ల ఆదాయం శనివారం నుంచే అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం దుకాణదారుల విజ్ఞప్తి మేరకే పెంచినట్లు కమిషనర్ ప్రకటన సాక్షి, హైదరాబాద్ మందుబాబుల జేబులు లూటీ కానున్నాయి! రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచేసింది. వివిధ రకాల మద్యంపై 6 శాతం నుంచి 10 శాతం ధరలు వడ్డించింది. ఈ ధరల పెంపుతో సర్కారు ప్రతినెలా దాదాపు రూ.50 కోట్ల (ఏడాదికి రూ.600 కోట్లు) అదనపు ఆదాయం ఆర్జించనుంది. తెలంగాణ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) పంపిన ధరల పెంపు ప్రతిపాదనలను ఏడాది పాటు పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం శనివారం నుంచే వాటిని అమల్లోకి తెచ్చింది. రూ. 5తో ముడిపడి ఉన్న మద్యం అమ్మటం ఇబ్బందిగా ఉందని, రూ.5 చిల్లర, నాణేలను తిరిగివ్వటం సమస్యగా మారినందున ధరలు పెంచినట్లు ప్రకటించింది. రూ.5తో ముడిపడి ఉన్న మద్యం ధరలను రూ.10 ఉండేలా సవరించింది. ఉదాహరణకు మార్కెట్లో రూ.105 ఉన్న బీరును రూ.110 పెంచింది. మరోవైపు వ్యాట్ సవరణ పేరుతో ప్రీమియం మద్యంపై పది శాతం వరకు ధరలు వడ్డించింది. కొంతకాలంగా మద్యం వ్యాపారులు గరిష్ట చిల్లర ధరలో రూ.5ను తొలగించాలని, రౌండప్‌గా రూ. 10 చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ పాటించట్లేదని, రూ.5 చిల్లర తిరిగివ్వటం లేదంటూ కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీన్ని పరిష్క రించేందుకు ధరలను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ప్రతి నెలా రూ.50 కోట్ల ఆదాయం పెరుగుతుందన్నారు. పన్ను విధానంలో మార్పు.. మద్యంపై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీ, ట్యాక్స్ విధానం సంక్లిష్టంగా ఉంది. 130 శాతం నుంచి 190 శాతం వరకు వ్యాట్ స్లాబ్‌లు అమల్లో ఉన్నాయి. ఐఎంఎఫ్ఎల్ మద్యానికి సంబంధించి ఆరు కేటగిరీల్లో ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఈ శ్లాబులన్నీ రద్దు చేసి మద్యంపై 70 శాతం వ్యాట్, బీర్, వైన్, లిక్కర్‌పై నాలుగు రకాల ఎక్సైజ్ డ్యూటీలుండేలా పన్ను విధానాన్ని మార్చాలని గతేడాది ఎక్సైజ్ విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ పన్నుల సవరణతో స్వల్పంగా భారం పడుతుందని, అరవై శాతం అమ్మకాలు జరిగే సాధారణ, మీడియం, ప్రీమియం బ్రాండ్లపై బాటిల్‌కు రూ.5 ధర పెరుగనుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రీమియం బ్రాండ్లపై 180 మిల్లీలీటర్ల బాటిల్‌కు రూ.30 నుంచి రూ.40 చొప్పున ధర పెరుగుతుంది. ఆదాయం కోణంలోనే.. ఆశించినంత ఆదాయం రాకపోవటం, నోట్ల రద్దుతో అంచనాలు తలకిందులవటంతో రాష్ట్ర సర్కారు ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. అందుకే ఇంతకాలం పెండింగ్‌లో పెట్టిన మద్యం ధరల పెంపు ఫైలును ముందుకు కదిపింది. మద్యం ధరల పెంపుతో సర్కారు కంటే ఎక్కువగా మద్యం వ్యాపారులు, డిస్టిలరీల యాజమాన్యాలకు లాభాల పంట పండనుంది. మద్యం ప్రియులపై వడ్డించనున్న రూ.600 కోట్ల అదనపు భారంలో వ్యాట్ రూపంలో ఖజానాకు చేరేది దాదాపు రూ.250 కోట్లు మాత్రమే. మిగతా రూ.350 కోట్లు డిస్టిలరీల యాజమాన్యాలు, రిటైలర్లు, మద్యం వ్యాపారుల గల్లా పెట్టెల్లోకి చేరుతుంది. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్లకోసారి మద్యం ధరలపై సమీక్ష జరుగుతుంది. కానీ ఇక్కడ మూడేళ్లుగా పెంచటం లేదని.. డిస్టిలరీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అందుకే అటు డిస్టిలరీల యాజమాన్యాలు, మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూరటంతో పాటు.. ఇటు ఖజానాకు కాస్తో కూస్తో ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను పెంచేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక మేరకే చీప్ లిక్కర్, మీడియం లిక్కర్, ప్రీమియం లిక్కర్, విదేశీ మద్యం ధరలను పెంచింది. -
బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ సుంకం ఎత్తివేత
న్యూఢిల్లీ: బ్రాండెడ్ బంగారు ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఉన్న ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం ఎత్తివేసింది. 99.5 శాతం అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ డ్యూటీ ఇకపై ఉండదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ తన నోటిఫికేషన్లో పేర్కొంది. వెండి కాయిన్లకు ఉన్న ఎక్సైజ్ డ్యూటీ మినహారుుంపు కొనసాగుతుందని తెలిపింది. ఇక, బంగారం, వెండి ఆభరణాల తయారీదారులు తయారు చేసే ప్రీషియస్ మెటల్ లేదా మెటల్ ఆధారిత వస్తువులపై మాత్రం ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ చర్యతో బంగారు కారుున్లు చౌకగా మారతాయని, వ్యవస్థీకృత రంగాన్ని ప్రోత్సాహాన్నిస్తుందని పీజీ జ్యుయలర్ ఎండీ బల్‌రామ్‌గార్గ్ అన్నారు. వాస్తవంగా బ్రాండెడ్ ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని 2011లో అమల్లోకి తెచ్చారు. -
పీవోఎస్ పరికరాలు మరింత చౌక
ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేసిన కేంద్రం న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లపై సుంకాలను ఎత్తివేసింది. దీంతో ఇవి మరింత చౌకగా మారనున్నారుు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పీవోఎస్ పరికరాలకు డిమాండ్ పెరిగిపోరుుంది. వీటి వినియోగాన్ని మరింత పెంచేందుకు గాను... పీవోఎస్ మెషీన్లతోపాటు, వాటి తయారీలో వాడే అన్ని రకాల పరికాలపై 12.5 శాతం ఎక్సైజ్ డ్యూటీ, 4 శాతం ప్రత్యేక అదనపు డ్యూటీల నుంచి మినహారుుస్తున్నట్టు, ఇది వచ్చే మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని అధికార వర్గాలు తెలిపారుు. సుంకాల రద్దు ఫలితంగా పీవోఎస్ మెషీన్లు 16.5 శాతం మేర ధరలు తగ్గనున్నారుు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 90 శాతం పీవోఎస్ మెషీన్లు దిగుమతి అవుతున్నాయని ఆ వర్గాలు తెలిపారుు. -
వైన్... ఇక చౌక!
రాష్ట్రంలో వైన్‌పై వ్యాట్‌ను 150 శాతం నుంచి 70 శాతానికి తగ్గించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో విక్రయించే దేశీయ తయారీ వైన్ చౌకగా లభించనుంది. వైన్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రభుత్వం భారీగా తగ్గించింది. దేశంలో తయారయ్యే వైన్ మీద వాణిజ్య పన్నుల శాఖ 150 శాతం పన్ను విధిస్తుండగా, దానిని 70 శాతానికి తగ్గించింది. అలాగే వైన్ మీద ఎక్సైజ్ డ్యూటీ, దేశీయ తయారీ పన్నులను కూడా క్రమబద్ధీకరించింది. రూ. 2 వేల లోపు ధర గల కార్టన్ (కేసు) వైన్ ప్రాథమిక ధరపై 28% ఉన్న ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా 90 శాతానికి పెంచింది. కాగా ఇప్పటి వరకు రూ. 2 వేలకు పైబడిన వైన్ కేసు ప్రాథమిక ధరపై 15% లేదా రూ. 560లలో గరిష్టంగా ఉన్న మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీగా విధిస్తున్నారు. దానిని క్రమబద్ధీకరించి రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు గల వైన్ కేసు ప్రాథమిక ధరపై 15% లేదా రూ.1,800లలో గరిష్ట మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీగా విధించనున్నారు. ఇక రూ. 3వేల పైబడి ధర గల వైన్ కార్టన్ల ప్రాథమిక ధరలపై 10% పన్ను లేదా రూ. 450 లలో గరిష్ట మొత్తాన్ని పన్నుగా విధించనున్నారు. అంటే ఎక్కువగా విక్రయించే తక్కువ ధర గల వైన్ ఉత్పత్తులపై పన్నును పెంచిన ప్రభుత్వం అధిక ధర గల వైన్ తయారు చేసే కంపెనీలకు పన్ను తగ్గించింది. దీంతో వ్యాట్ సగానికి పైగా తగ్గినా సర్కార్ ఆదాయానికి ఢోకాలేని పరిస్థితి. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా దేశంలో పూర్తి ద్రాక్ష పండ్లతో తయారయ్యే వైన్ బాటిళ్ల ఎంఆర్పీ ధరలు 30 నుంచి 35% వరకు తగ్గనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ తెలిపారు. ఫోర్ట్‌ఫైడ్ వైన్ ధర సీసాకు రూ. 5 పెరుగుతాయని వివరించారు. -
ఆర్ఐఎల్ హజీరా ప్లాంట్‌పై ‘ఎక్సైజ్’ఎగవేత ఆరోపణ
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) హజీరా తయారీ యూనిట్‌పై దాదాపు రూ.25 కోట్ల మేర ఎక్సైజ్ సుంకం ఎగవేత ఆరోపణలు వచ్చాయి. సెంట్రల్ రెవెన్యూ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ డెరైక్టరేట్ జనరల్ (డీజీసీఈఐ) ఈ కేసు విచారణను ప్రారంభించిందనీ, ఆర్ఐఎల్ నుంచి కొన్ని వివరణలు కోరిందని అధికార వర్గాలు తెలిపాయి. సంస్థలో ఉత్పత్తిచేసి, పెయింట్ కర్మాగారాలకు విక్రయించే కెమికల్ జీలీన్ మిశ్రమ (నాఫ్తా విచ్ఛిత్తి ద్వారా పొందిన రసాయనం) వర్గీకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు ప్రధాన ఆరోపణ. ఈ కెమికల్‌ను మినరల్ ఆయిల్గా వర్గీకరించి 14 శాతం సుంకం చెల్లించాల్సి ఉండగా, ఆర్గానిక్ కెమికల్గా చూపించి 12.5 శాతం సుంకం చెల్లించిందన్నది ఆరోపణ. తోసిపుచ్చిన ఆర్ఐఎల్ కాగా ఆర్ఐఎల్ ప్రతినిధి ఒకరు ఈ అంశంపై మాట్లాడుతూ, పూర్తి నియమ నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు తరచూ తమ కార్యకలాపాల రికార్డులను ఆడిట్ చేస్తున్నారనీ వివరించారు. కెమికల్ వర్గీకరణ విధం సరైనదేనని అన్నారు. తమ వాదన విషయంలో ఆర్ఐఎల్ ముంబైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారం. డీజీసీఈఐకు ఈ నివేదికను ఆర్ఐఎల్ సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఆభరణాలపై ఎక్సైజ్ సుంకం..తొలగించేది లేదు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణ న్యూఢిల్లీ: వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎక్సైజ్ సుంకం తొలగించే ప్రశ్నేలేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. విలాసవంతమైన వస్తువులను పన్ను పరిధి నుంచి తొలగించడం సరికాదన్నది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆర్థికమంత్రి ఇచ్చిన సమాధానంతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై మాట్లాడుతూ, ఆభరణాలపై సుంకం విధింపు ఈ రంగంలో వ్యాపారాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. 40 రోజుల నుంచీ వర్తకులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అయితే ఈ విమర్శలను ఆర్థికమంత్రి తోసిపుచ్చారు. సామాన్య వ్యక్తి వినియోగించే సబ్బులు, టూత్ పేస్ట్‌లు, రేజర్,పెన్సిల్, ఇంక్, ఫ్రూట్ జ్యూస్, బేబీ ఫుడ్ వంటి నిత్యావసర వస్తువులమీదే పన్ను విధిస్తున్నప్పుడు... లగ్జరీ వస్తువులను పన్ను పరిధి నుంచి తప్పించాలని భావించడం సరికాదని పేర్కొన్నారు. ఇమిటేషన్ ఆభరణాలమీదే 6 శాతం పన్ను విధిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వేధింపులుగా భావించకూడదు... పన్ను విధింపు స్వర్ణకారులు, వర్తకులను వేధించడంగా భావించడం తగదని జైట్లీ అన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ.12 కోట్ల పైన టర్నోవర్‌ను పన్ను పరిధిలోకి తీసుకోవడం జరిగిందని, ఈ యేడాది దీనిని రూ. 6 కోట్లకు ప్రభుత్వం తగ్గిస్తోందని పేర్కొన్న జైట్లీ... చిన్న, మధ్య వర్తకులు, స్వర్ణకారులపై పన్ను ప్రభావం ఏమాత్రం ఉండదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలని కోరారు. -
సమ్మె తాత్కాలికంగా విరమించిన జువెలర్స్
న్యూఢిల్లీ: బంగారు వ్యాపారులు ఎక్సైజ్ సుంకం విధింపునకు వ్యతిరేకంగా 42 రోజుల నుంచి (మార్చి 2) చేస్తోన్న సమ్మెను తాత్కాలికంగా విరమించారు. దేశ రాజధాని ఢిల్లీలో జువెలర్స్ సమ్మె బాట వదిలారు. జువెలర్స్‌పై ఎక్సైజ్ అధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండవన్న ప్రభుత్వపు హామీ నేపథ్యంలో సమ్మెను ఏప్రిల్ 24 వరకు నిలిపివేస్తున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురిందర్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలో కూడా సమ్మెను ఏప్రిల్ 24 వరకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు మహా రాష్ట్ర రాజ్య సరాఫా సువర్ణకార్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఫతేచంద్ రాంకా వెల్లడించారు. ప్రభుత్వం తన ఎక్సైజ్ సుంకం విధింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఏప్రిల్ 25 నుంచి తిరిగి సమ్మెను ప్రారంభిస్తామని బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ వర్మ హెచ్చరించారు. జువెలరీ పరిశ్రమకు 42 రోజుల సమ్మె కారణంగా రూ. లక్ష కోట్లమేర నష్టం వచ్చింటుందని అంచనా. -
'ఏం చెప్పినా.. ఎక్సైజ్ డ్యూటీ మా వల్ల కాదు'
ముంబై :వెండియేతర ఆభరణాలపై ఎక్సైజ్ డ్యూటీని ఒక శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జ్యువెలర్లు, బులియన్ ట్రేడర్స్ చేస్తున్న బంద్ నిరవధింగా కొనసాగుతోంది. కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీని తాము చెల్లించలేమంటూ వారు మరోసారి స్పష్టం చేశారు. నాన్ సిల్వర్ జ్యువెలర్స్‌పై ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన బడ్జెట్లో లో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత మార్చి 2 నుంచి వారు బంద్ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ డ్యూటీని చెల్లించేది లేదంటూ జ్యువెల్లరీ కంపెనీలు వాదిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తమకు సమ్మతంగా లేదంటున్నాయి. అలాగే రూ.2 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు కల్గిన వ్యక్తులందరి దగ్గర పాన్ కార్డ్ కలిగి ఉండాలనే నిర్ణయాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. కాగా, వారు చేస్తున్న డిమాండ్ పై పరిశీలన జరిపేందుకు మాజీ చీఫ్ ఎకానమిక్ అడ్బయిజరీ అశోక్ లహరీ నేతృత్వంలో ప్రభుత్వం ఓ ప్యానెల్ ను ఏర్పాటుచేసింది. ఇది 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదక సమర్పిస్తుంది. -
34వ రోజుకు జువెలర్స్ సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా జువెలర్స్ చేస్తోన్న నిరవధిక సమ్మె సోమవారం నాటికి 34వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు జువెలరీ అసోసియేషన్స్ సోమవారం కూడా పలు చోట్ల ధర్నాల రూపంలో నిరసనను తెలియజేశాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురిందర్ కుమార్ జైన్ తెలిపారు. -
సమ్మె నిరవధికంగా కొనసాగిస్తాం
♦ ఏఐబీజేఎస్‌ఎఫ్ ప్రకటన ♦ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా ♦ ఎత్తివేయాలని డిమాండ్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు ఎక్సైజ్ సుంకం విధింపు చ ర్యను నిరసిస్తూ చేస్తున్న సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని ఆల్ ఇండియా బులియన్, జువెలర్స్, స్వర్ణకార్ ఫెడరేషన్ (ఏఐబీజేఎస్‌ఎఫ్) ప్రకటించింది. అలాగే వచ్చే వారం నుంచి వివిధ మార్గాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తామని తెలిపింది. బంగారు షాపుల తాళాలను జైట్లీకి అందించడం, దున్నపోతు ముందు ఈల ఊదడం, జిల్లా కేంద్రాల్లో బెల్స్ మోగియడం, ఎంపీల ఇంటి ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, డిమాండ్ల ప్రదర్శన, దుకాణాల రిజిస్ట్రేషన్ కాగితాలను ఆర్థిక మంత్రి పేరుకి మార్చడం, మానవహారాలుగా ఏర్పడటం వంటి తదితర నిరసన కార్యక్రమాలను చేస్తామని వివరించింది. దేశవాప్తంగా ఉన్న దాదాపు 375 జువెలరీ ట్రేడ్ అసోసియేషన్స్ ప్రతినిధులు సమ్మె కొనసాగింపునకు సుముఖంగా ఉన్నారని ఏఐబీజేఎస్‌ఎఫ్ ప్రకటించింది. కేంద్రం జువెలరీ పరిశ్రమలో ఇన్స్పెక్టర్ రాజ్ పరిస్థితులు రావని హామీ ఇచ్చినప్పటి నుంచి జీజేఎఫ్, ఏబీజేఏ, జీజేఈపీసీ వంటి దిగ్గజ జువెలరీ పరిశ్రమ అసోసియేషన్స్ సమ్మెకు దూరంగా ఉన్నప్పటికీ ఏఐబీజేఎస్‌ఎఫ్ మాత్రం ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెను కొనసాగిస్తోంది. -
సమ్మె ఆగదు: జువెలర్స్
ముంబై: కేంద్ర ప్రభుత్వం 1 శాతం ఎక్సైజ్ సుంకం ప్రతిపాదనను వెనక్కు తీసుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని జువెలర్స్ స్పష్టంచేశారు. తాము ఒకవేళ షాపులు తెరిస్తే.. ఎక్సైజ్ సుంకాన్ని సమతించినట్లేనని, అప్పుడు ఇన్స్పెక్టర్ రాజ్ విధానం మళ్లీ వచ్చినట్లువుతుందని తెలిపారు. సుంకం నుంచి చేతివృత్తుల వారు, కార్మికులు మినహాయింపు: ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్సైజ్ సుంకం విధింపు నుంచి చేతివృత్తుల వారిని, కార్మికులను మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది. వీరు రిజిస్ట్రేషన్, సుంకం చెల్లింపు, రిటర్న్ దాఖలు, అకౌంట్స్ రాయడం వంటి పనులు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. గురువారం జరిగిన రెవెన్యూ కార్యదర్శి, జువెలరీ పరిశ్రమ ప్రతినిధుల సమావేశపు నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
రెడీమేడ్ గార్మెంట్స్ పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేయాలి
విజయవాడ: రెడీమేడ్ గార్మెంట్స్‌పై ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేయాలంటూ వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. విజయవాడ రెడీమేడ్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేశారు. రెడీమేడ్ రంగాన్ని రక్షించండి, రెడీమేడ్ దుస్తులపై ఎక్సైజ్ డ్యూటీ వద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని పలువురు వ్యాపారులు హెచ్చరించారు. -
బంగారు నగలపై ఎక్సైజ్ సుంకం తగదు
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారు ఆభరణాలపై 1 శాతం సుంకం విధిస్తూ కేంద్రమంత్రి తీసుకున్న నిర్ణయం సరికాదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్ జీరోఅవర్‌లో ఈ విషయంపై ఎంపీ మాట్లాడుతూ రెవెన్యూ పెంచుకునేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చిన్న, సన్నకారు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఈ నిర్ణయంతో బం గారు నగల వ్యాపారులు ఈనెల 2వ తేదీనుంచి దేశవ్యాప్త సమ్మెను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఒక శాతం ఎక్సైజ్ సుంకం పెంచడం వల్ల ఆభరణాల హబ్‌గా పేరు న్న హైదరాబాద్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇక్కడ 5 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల దేశంలో ఈ రంగానికి ప్రతి రోజు రూ. 7 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందన్నారు. 14రోజుల పాటు జరిగిన నిరవధిక సమ్మె వల్ల రూ. 98 వేల కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. ప్రధాని స్వచ్ఛ భారత్, మేడిన్ ఇండియా అంటూ ముందుకు సాగుతుంటే.. కేంద్రం మాత్రం స్థాని కంగా తయారయ్యే బంగారు నగలపై ఎక్సైజ్ సుంకం విధిస్తోందని విమర్శించారు. గతంలోనూ ఆభరణాలపై ఎక్సైజ్ సుంకం విధిస్తే.. బంగారు వ్యాపారులు మూడు వారాలపాటు బంద్ నిర్వహించ డంతో కేంద్రం దాన్ని ఎత్తివేసిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా నగల వ్యాపారులు, చేతివృత్తిదారుల స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని సుంకాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. -
బంగారం వ్యాపారుల ఆందోళన
ఎక్సైజ్ సుంకం ఎత్తి వేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఇల్లందులో బంగారు వ్యాపారులు బుధవారం ర్యాలీ చేపట్టారు. బులియన్ మర్చంట్ అసోసియేషన్, బులియన్ మర్చంట్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వెంటనే ఎక్సైజ్ సుంకం తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. -
జువెలర్స్ కు పన్నుపై వెనక్కితగ్గని కేంద్రం
♦ పన్ను చెల్లింపునకు సరళ ప్రక్రియే ఉంటుందని వెల్లడి ♦ 14వ రోజుకు చేరిన సమ్మె సాక్షి, హైదరాబాద్: జువెలరీ వర్తకులపై 1 శాతం ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనను ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం దీనికి సంబంధించి కొంత వివరణ ఇచ్చింది. పన్ను చెల్లింపునకు ప్రత్యేక విధానమేమీ ఉండదని... ప్రక్రియ మొత్తం చాలా సరళంగా ఉంటుందని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ కమిషనర్-1 ఎం. శ్రీనివాస్, కమిషనర్-2 సునీల్జైన్ పేర్కొన్నారు. దీనిపై సరైన సమాచారం లేకపోవడంవల్లే జువెలర్లు ఆందోళన చెందుతున్నారని మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. రెండు రోజుల్లోనే జువెలర్లు రిజిస్టర్ చేసుకోవచ్చని. ఆన్లైన్లో పన్నును చెల్లించవచ్చని, రిటర్న్ ఫైల్ చేయొచ్చని వివరించారు. మరోపక్క, కేంద్రం వెనక్కితగ్గకపోవడంతో ఆభరణాల విక్రేతలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా సమ్మె మంగళవారం 14వ రోజుకు చేరింది. కేవలం గడిచిన ఏడాదిలో రూ.12 కోట్లకు మించి టర్నోవర్‌ను నమోదుచేసిన ఆభరణాల తయారీదారులు మాత్రమే ఈ 1% ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించాల్సి వస్తుందని... అందరికీ వర్తించదని కమిషనర్లు పేర్కొన్నారు. వెండి ఆభరణాలపై పన్ను ఉండదని కూడా తేల్చిచెప్పారు. మరోపక్క, కేవలం జాబ్ వర్క్ ఆధారంగా ఆభరణాలను తయారు చేసే నగల తయారీదారులు సెంట్రల్ ఎక్సైజ్ విభాగం వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వీయ మదింపు ఆధారంగా స్వచ్ఛందంగా జువెలర్లు ఈ పన్నును చెల్లించే విధంగా విధానం ఉంటుందని వెల్లడించారు. వర్తకులకు ఉన్న సందేహాలు తీర్చేందుకు వారితో త్వరలో ఓపెన్‌హౌస్ డిబేట్(చర్చాగోష్టి)ను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపుతో పాటు రూ. 2 లక్షల విలువైన కొనుగోళ్లకు కస్టమర్ల పాన్ నంబర్‌ను తప్పనిసరి చేయడాన్ని జువెలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ‘పాన్’ తప్పనిసరి చేసిననాటినుంచి ఆభరణాల విక్రయ వ్యాపారం 20 శాతం మేర పడిపోయిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురిందర్ కుమార్ జైన్ చెప్పారు. మరోపక్క, జువెలర్లకు మద్దతుగా ఢిల్లీలో ఈ నెల 17న బంద్ చేయనున్నట్లు కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఎక్సైజ్ సుంకంపై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: ఎంపీ మిథున్‌రెడ్డి
బంగారంపై కేంద్రం ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకం విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా సుదుంలో ఓ స్కూల్ వార్షికోత్సవానికి వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిని బంగారు వర్తకులు కలసి ఎక్సైజ్ సుంకం ఎత్తివేసేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే, చిత్తూరు న్యూట్రిన్ ఫ్యాక్టరీపై న్యాయం పోరాటం చేసి తొలగించబడిన కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. -
సుంకంపై సమరం
పాతబస్తీలోని బంగారు వ్యాపారులు కదం తొక్కారు. బంగారంపై ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా శనివారం సాయంత్రం చార్‌కమాన్ గుల్జార్హౌస్వద్ద భారీ స్థాయిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కదం తొక్కిన బంగారు వ్యాపారులు చార్మినార్: అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య పిలుపు మేరకు పాతబస్తీలోని బంగారు వ్యాపారులు రెండో రోజైన శనివారం చార్‌కమాన్ వద్ద నిరాహార దీక్షలు కొనసాగించారు. చార్‌కమాన్ జ్యువె ల్లర్స్ అండ్ సరాఫా అసోసియేషన్, సిద్దంబర్‌బజార్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్స్, కాలికమాన్ చార్మినార్ జ్యువెల్లర్స్, శాలిబండ జ్యువెల్లర్స్ అసోసియేషన్, కాలికమాన్ చార్‌కమాన్ స్వర్ణకారుల సంఘం, చార్‌కమాన్ బెంగాలీ గోల్డ్‌స్మిత్ సంఘం, చార్‌కమాన్ హైదరాబాద్ జెమ్స్ సంఘ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బడ్జెట్లో బంగారంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 11 రోజులుగా తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలుపుతున్నా...కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సుంకాల పెంపును ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఆందోళనలో భాగంగా శనివారం సాయంత్రం చార్‌కమాన్ గుల్జార్‌హౌస్ వద్ద వ్యాపారులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
పుస్తెలకూ పసిడి కరువే
అమలాపురం టౌన్: పసిమివన్నె పసిడి నిత్యావసరవస్తువు కాకపోవచ్చు. అయినా బంగారం వ్యాపారులు పాటిస్తున్న బంద్ ప్రభావం.. లగ్గసరి నేపథ్యంలో హెచ్చుగానే ఉంది. చివరికి తాళిబొట్టు తయూరీకి అవసరమైన బంగారం కూడా కొనలేక వధూవరుల కుటుం బాలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. బంగారం విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించినందుకు నిరసనగా బంగారు వర్తకులు చేపట్టిన బంద్ ఈనెల 17 వరకూ జరగనుంది. దేశ వాప్తంగా బంద్ జరుగుతుండటంతో ఎక్కడ, ఎవరికి బంగారం అవసరమైనా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న రెండు వేలకు పైగా బంగారు దుకాణాలు ఈనెల 9 నుంచి మూతపడ్డారుు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం తదితర పట్టణాల్లోనే కాక మండల కేంద్రాల్లో ఉన్న పసిడి దుకాణాలూ తెరుచుకోక రోజుకు రూ.కోట్లలో అమ్మకాలు నిలిచిపోయాయి. ఈనెల 11,15 తేదీల్లో పెళ్లిళ్లకు బలమైన ముహూర్తాలు ఉండటంతో ఆ కుటుంబాలకు బంగారం లేదా నగలు కొనుగోలు చేయటం అత్యవసరం. ఈ రెండు ముహూర్తాల్లో జిల్లాలో మూడు వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతున్నట్లు అంచనా. కాలం మారిపోయి ఇప్పుడు పెళ్లిళ్లకు వధూవరులకు, ఇతర సంప్రదాయాలకు బంగారు నగలను తయారు చేయించటం లేదు. అప్పటికప్పుడు దుకాణాలకు వచ్చి రెడీమేడ్ నగలను వచ్చి కొనుగోలు చేయటం పరిపాటైంది. చివరకు మంగళ సూత్రాలు కూడా రెడీమేడ్‌వి వినియోగిస్తుండటంతో ముహూర్తం దగ్గర పడ్డా సూత్రం సిద్ధం కాకపోవటంతో కంగారు పడుతున్నారు. జిల్లాలో దుకాణాలు 9 రోజుల పాటు మూత పడటంతో పెళ్లి ఇళ్ల వారికి ఏమీ చేయలేని నిస్సహాయత ఎదురవుతోంది. ఏ విజయవాడో, హైదరాబాదో వెళ్లి కొందామన్నా వీలు కాని పరిస్థితి. ఈ క్రమంలో పెళ్లి ఇళ్ల వారు బంగారు దుకాణ యజమానుల వద్దకు వెళ్లి బతిమాలుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి బంగారు వర్తకుల బంద్ గురించి తెలియక నగరాలు, పట్టణాల్లోని దుకాణాలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొత్త బంగారముందా.. మిత్రులారా! కాట్రేనికోన మండలం దొంతుకుర్రుకు చెందిన ఓ కుటుంబంలో ఈనెల 15న పెళ్లి జరగనుంది. వారు బంగారు నగల కొనుగోలుకు శుక్రవారం అమలాపురంలోని ఓ పెద్ద నగల దుకాణానికి వచ్చారు. బంద్ గురించి తెలిసి దుకాణ యజమాని ఇంటికి వెళ్లి నగల కోసం అడిగారు. యూనియన్ నిబంధనల ప్రకారం దుకాణాలు తెరవకూడదని, తాను చేయగలిగిందేమీ లేదని ఆయన చేతులెత్తేశారు. రాత్రి పది గంటల తర్వాతైనా దుకాణం తెరిచి నగలు అమ్మమని, కనీసం మంగళ సూత్రానికైనా బంగారం అమ్మమని పెళ్లింటి వారు బతిమాలారు. ఈ పరిస్థితి జిల్లా అంతటా ఉంది. పెళ్లిళ్లకు కచ్చితంగా కొత్త బంగారమే వాడతారు. అందులోకి మంగళ సూత్రానికి విధిగా కొత్త బంగారం కావాల్సి రావటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎవరైనా బంధువులు, స్నేహితులు గతంలో కొనుగోలు చేసిన కొత్త బంగారం ఉందేమోనని కొందరు అన్వేషణలో పడ్డారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం మార్కెట్లకు బంగారం కొనుగోలుకు వచ్చి నిరాశతో తిరిగి వెళుతున్న వినియోగదారుల సంఖ్య శుక్రవారం ఎక్కువగా కనిపించింది. మరో పక్క ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేసేవరకూ బంద్ విరమించేది లేదనిముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల బులియన్ యూనియన్ల నుంచి సంకేతాలు వస్తున్న క్రమంలో ఈ బంద్ మరిన్ని రోజులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
పదో రోజుకు జ్యువెలరీ సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ ఆభరణాలు, బులియన్ వర్తకులు చేస్తున్న సమ్మె పదవ రోజుకు చేరింది. ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 2 నుంచి జరుగుతోంది. కాగా 12 కోట్ల టర్నోవర్ మించిన వ్యాపారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. 1981, 2012ల్లో కూడా రత్నాలు, ఆభరణాలపై ఎక్సైజ్ సుంకాన్ని విధించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. సురక్షిత సాధనంగా పుత్తడి: కాగా, ధరల్లో ఒడిదుడుకులున్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ 670-685 టన్నులకు పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ఆభరణాల కంటే నాణాలు, కడ్డీలకే డిమాండ్ బాగా ఉంటుందని పేర్కొంది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులుండడం, స్టాక్ మార్కెట్లు బలహీనతలు, కరెన్సీ విలువలు తగ్గడం వల్ల సురక్షిత సాధనంగా పుత్తడి ఉంటుందని వివరించింది. -
ఈ నెల 7 వరకూ ఆభరణాల వర్తకుల సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా గత 3 రోజులుగా సమ్మె చేస్తున్న ఆభరణాల వర్తకులు దీన్ని ఈ నెల ఏడవ తేదీ వరకూ పొడిగించారు. రత్నాలు, బంగారు ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకం విధించడం పరిశ్రమ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) చైర్మన్ జి.వి. శ్రీధర్ చెప్పారు. ఎక్సైజ్ సుంకం విధింపుపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నామని చెప్పారు. తమ సమస్యలను పరిశీలిస్తానని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని, అయినప్పటికీ తమ సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు. గతంలో ఈ విధంగానే ఎక్సైజ్ సుంకం విధించారని, కానీ సానుకూల ఫలితాలు రానికారణంగా తొలగించారని జీజేఎఫ్ మాజీ చైర్మన్, డెరైక్టర్ బచ్చరాజ్ బమల్వ చెప్పారు. కాగా 12 కోట్ల టర్నోవర్ మించిన వర్తకులపై మాత్రమే వెండి-యేతర ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తామని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. రూ. రెండు లక్షలు, అంతకు మించిన ఆభరణాల కొనుగోలు చేస్తే పాన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధనను కూడా ఆభరణాల వర్తకులు వ్యతిరేకిస్తున్నారు. పాన్ నంబర్ తప్పనిసరి నిబంధనను రెండు లక్షలకు కాక రూ. 10 లక్షలకు మించిన కొనుగోళ్లకు వర్తింపజేయాలని కోరుతున్నారు. 3 రోజుల సమ్మెతో పరిశ్రమకు రూ.21 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. -
పార్వతీపురంలో బంగారు దుకాణాల మూసివేత
కేంద్ర బడ్జెట్లో బంగారంపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ పన్నును రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో బుధవారం దుకాణాలు మూసివేశారు. మెయిన్రోడ్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ రామకృష్ణకు వినతిపత్రం అందించారు. మూడు రోజుల్లోగా తమ డిమాండ్‌కు స్పందించకపోతే బంగారు దుకాణాల నిరవధిక బంద్ చేస్తామని బంగారు వర్తక సంఘం ప్రకటించింది. -
'పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలి'
చెన్నై: కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలనే ఎన్డీఏ సర్కారు అనుసరిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెంచిన ఎక్సైజ్ డ్యూటీ వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచారని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడం దారుణమని పేర్కొన్నారు. చముర ధరల నియంత్రణను ఆయిల్ కంపెనీలకు అప్పగించడాన్ని తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని జయలలిత కోరారు. -
పెట్రోల్, డీజిల్‌పై మళ్లీ ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూపాయి, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి 50 పైసలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. శనివారం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుతోంది. జనవరి నెలలోనే 2వ తేదీన లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్ పై లీటరుకు రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచింది. -
మినరల్ వాటర్ కంటే చవకైన చమురు
-
మినరల్ వాటర్ కంటే చవకైన చమురు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం కొనసాగుతోంది. భారీగా పడిపోయిన ధరలతో ముడి చమురు ఇప్పుడు అధికారికంగా మినరల్ వాటర్ కంటే చవకైంది. గతవారం 11.5 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగివచ్చిన ముడి చమురు ధరలు మరింతగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 29.24 డాలర్లకు (రూ.1,956.45) తగ్గింది. దీంతో లీటర్ క్రూడాయిల్ ధర రూ. 12కు చేరింది. లీటర్ మినరల్ వాటర్ కంటే ఇది 20 శాతం తక్కువ. మినరల్ వాటర్ బాటిల్ ధర రూ. 15గా ఉంది. ఈ నెల 7న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర రూ. 159 డాలర్లకు చేరింది. డిమాండ్‌ను మించిన సరఫరాకు భారీగా పేరుకుపోయిన నిల్వలు తోడవటంతో ముడిచమురు రేట్లు భారీగా పతనమవుతున్నాయి. క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు తగ్గించకపోవడంతో వినియోగదారులకు ఊరట లభించడం లేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 59.35, లీటర్ డీజిల్ ధర రూ. 45గా ఉంది. -
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఓవైపు పెట్రోల్, డీజిల్ తగ్గుతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుతోంది. డిసెంబర్ 31న పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల్లోనే వీటిపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్ పై లీటరు రెండు రూపాలయ చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. కాగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఐదుసార్లు ఎక్సైజ్ డ్యూటీ ప్రజలకు తెలపకుండా బడ్జెట్ శాంక్షన్ లేకుండా పెట్రోలు పదార్ధాలపై పెంచుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. -
లీటరు పెట్రోలుకు 25 రూపాయలే...
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆ పాపం తమది కాదని అంతర్జాతీయ మార్కెట్దని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పడం, అవును కాబోలు! అనుకొని వినియోగదారులు తలాడించడం తరచుగా జరిగేదే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేందుకు, తగ్గించేందుకు భారతీయ చమురు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పుకోవడమూ షరా మామూలే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే అంతకన్నా ఎక్కువ ధర ఎందుకు పెరుగుతుంది? తగ్గినప్పుడు ఎందుకు తక్కువ తగ్గుతుందన్న విషయాల్లోకి లోతుగా వెళ్లం, వెళ్లినా ప్రభుత్వం తీరే అంతా! అని సరిపెట్టుకుంటాం. ప్రస్తుతం పెట్రోలు ఉత్పత్తి రేటుకన్నా దేశీయ మార్కెట్లో లభిస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు రెట్టింపు, అంటే వంద శాతం ఎక్కువగా ఉందంటే ఆశ్చర్యం వేస్తోంది. ఢిల్లీ నగరాన్ని ప్రమాణికంగా తీసుకుంటే ఇక్కడ లీటరు పెట్రోలును 60.70 రూపాయలకు విక్రయిస్తున్నారు. అక్టోబర్ చివరివారం లెక్కల ప్రకారం లీటరు పెట్రోలు ఉత్పత్తి చేయడానికి ఆయిల్ రిఫైనరీస్‌కు అక్షరాల 24.75 రూపాయలు ఖర్చు అవుతుంది. రవాణా ఖర్చులను, లాభాలను లెక్కేసుకొని ఆయిల్ కంపెనీలు పెట్రోల్ పంపులకు 27.24 రూపాయలకు లీటరు చొప్పున విక్రయిస్తున్నాయి. దానిపై డీలర్ కమిషన్ లీటరుకు 2.26 రూపాయలు. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం 19.06 రూపాయలు, వ్యాట్, రాష్ట్రం విధించే అమ్మకం పన్ను కలిపితే మరో 12.14 రూపాయలు. మొత్తంగా కలిపి వినియోగదారుడికి వచ్చేసరికి లీటరుకు 60.70 రూపాయలు పడుతోంది. అలాగే, ఢిల్లీలోని పెట్రోలు పంపులో లీటరు డీజిల్ ధర 45.93 రూపాయలు. చమురు కంపెనీలకు ఖర్చయ్యేది కేవలం లీటరుకు 24.86 రూపాయలే. కొంత మార్జిన్‌ను కలుపుకొని పెట్రోలు పంపులకు విక్రయిస్తాయి. దీనిపై డీలర్ కమిషన్ 1.43 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం 10.66 రూపాయలు. వ్యాట్, అమ్మకం పన్ను కలుపుకుంటే మరో 6.79 రూపాయలు. మొత్తం కలపి వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి లీటరుకు 45.93 రూపాయలు అయింది. నవంబర్ 7వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరు పెట్రోలుపై 1.60 రూపాయలు, డీజిల్‌పై 40 పైసలు పెంచిన విషయం తెల్సిందే. వాటిని కలిపితే మరింత పెరుగుతోంది. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పన్నులు తక్కువగా ఉండడం వల్ల అక్కడ వినియోగదారుడికి కారుచౌకగా పెట్రోలు లభిస్తుంది. అమెరికాలో ఏ ప్రభుత్వమైనా పెట్రోలుపై పన్నులు పెంచితే ఆ ప్రభుత్వం పడిపోతుంది. భారత్‌లాంటి దేశంలో ఆ పరిస్థితులు ఎప్పుడొస్తాయో! -
పెరగనున్న జనరల్ మోటార్స్ వాహనాల ధరలు
న్యూఢిల్లీ : జనరల్ మోటార్స్ ఇండియా వాహనాల ధరలను మళ్లీ పెంచడానికి రంగం సిద్ధంచేస్తోంది. దీంతో వచ్చే నెల నుంచి కంపెనీకి చెందిన పలు వాహనాల ధరలు 2 శాతంమేర పెరగనున్నాయి. వాహన ధరల పెంపునకు విదేశీ మారక ద్రవ్యంలో ఒడిదుడుకులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎంట్రీ లెవెల్ కారు స్పార్క్‌తో కలుపుకొని జనరల్ మోటార్స్ దేశంలో ఎనిమిది మోడళ్లను విక్రయిస్తోంది. ఎక్సైజ్ సుంకం రాయితీలు ముగియడం వల్ల కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో (జనవరిలో) వాహనాల ధరలను రూ.61,000 వరకూ పెంచిన విషయం తెలిసిందే. -
టీవీలు, ఫ్రిజ్‌ల ధరలూ పెరుగుతున్నాయ్
గోద్రెజ్, హేయర్, వర్ల్‌పూల్, పానాసానిక్ ఉత్పత్తుల రేట్లు 2-5 శాతం వరకూ పెంపు... న్యూఢిల్లీ: వినియోగ వస్తువుల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. ఎక్సైజ్ సుంకం 10 శాతం నుంచి 12 శాతానికి పెరగడం, రూపాయి క్షీణతతో ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం వంటి కారణాల వల్ల ధరలను పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు అంటున్నాయి. గోద్రేజ్ అప్లయెన్సెస్, హేయర్, వర్ల్‌పూల్, పానాసానిక్, దైకిన్ తదితర కంపెనీలు ధరలను 2-5% రేంజ్లో పెంచుతున్నాయి. మోడళ్లను బట్టి తమ ఉత్పత్తుల ధరలు 3-5% వరకూ పెంచుతున్నట్లు హేయర్ ఇండియా తెలిపింది. కొత్త స్టాక్‌కు ఈ ధరలు వర్తిస్తాయని పేర్కొంది. గోద్రెజ్ అప్లయెన్సెస్ కూడా ఇదే రేంజ్లో పెంచాలని భావిస్తోంది. వర్ల్‌పూల్ సంస్థ ఈ నెల మూడో వారం నుంచి ధరలను 2-3% పెంచనున్నది. దైకిన్ సంస్థ ఏసీల ధరలను 4%వరకూ పెంచుతోంది. -
పెట్రోల్, డీజిల్‌పై రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంపు
రిటైల్ ధర మాత్రం యథాతథం న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌లపై కేంద్రం గురువారం లీటర్‌కు రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. కానీ దీని ప్రభావం వినియోగదారులపై ఉండదు. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు యథాతథంగానే ఉంటాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ నుంచి పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి ప్రభుత్వానికి సుమారు రూ. 6 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తాజాగా ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో వాస్తవానికి పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 3.22 చొప్పున, డీజిల్‌పై రూ. 3 చొప్పున ప్రభుత్వం తగ్గించాల్సి ఉంది. అయితే ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రత్యేకించి 15 వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది. కాగా, వంటగ్యాస్ వినియోగదారులు ఏడాదికి 12 సిలిండర్ల కోటా దాటాక కొనుగోలు చేసే సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరను మాత్రం రూ. 43.50 (ఢిల్లీలో) మేర తగ్గించింది. -
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. పెట్రోల్, డీజిల్ పై లీటరు రెండు రూపాలయ చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే రిటైల్ ధరలపై ఈ ప్రభావం పడకుండా చమురు కంపెనీలు జాగ్రత్తపడ్డాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ముడి చమురు ధరల తగ్గుదలను ఎక్సైజ్ సుంకం రూపంలో ఆయిల్ కంపెనీలు సర్దుబాటు చేశాయి. -
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. పెట్రోల్‌పై రూ. 2.25, డీజిల్‌పై రూపాయి చొప్పున పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే రిటైల్ ధరలపై ఈ ప్రభావం పడకుండా చమురు కంపెనీలు జాగ్రత్తపడ్డాయి. ప్రస్తుతానికి ఈ భారాన్ని తామే భరించాలని నిర్ణయించాయి. జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు, త్వరలోనే ఢిల్లీలోనూ ఎన్నికలు జరగనుండటం కూడా ఇందుకు కారణం. ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం గత మూడు వారాల్లో ఇది రెండోసారి. ఈ పెరుగుదలతో చమురు సంస్థలకు 4వేల కోట్ల రూపాయల ఆదాయం లభించనుంది. -
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. లీటర్ పెట్రోల్ కు రూ. 2.25, లీటర్ డీజిల్ కు రూపాయి చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచింది. పెంపు ప్రభావం వినియోగదారులపై ఉండబోదు. పెంచిన సుంకం ఈరోజు(మంగళవారం) నుంచి అమల్లోకి రానుంది. మూడు వారాల వ్యవధిలో ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. నవంబర్ 12న పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు రూ.1.50 చొప్పున పెంచింది. ప్రభుత్వ చమురు సంస్థలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గించాయి. అంతర్జాతీయంగా చమురు రేట్లలో తగ్గుదల కారణంగా పెట్రోల్ పై లీటర్ కు 91 పైసలు, డీజిల్ పై 84 పైసలు తగ్గించాయి. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచడంతో వాటి ధరలకు రెక్కొలొచ్చాయి. పెట్రోలు, డీజిల్ పై లీటరుకు రూ.1.50 చొప్పున ధరలు పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి రూ. 13 వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గురువారం పెట్రోల్, డీజిల్ పై లీటరకు రూ.1.50 సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గతంలో సాధారణ రకం లీటరు పెట్రోల్ పై ఉన్న రూ.1.20 ఎక్సైజ్ సుంకాన్ని రూ.2.70 పెంచగా, బ్రాండెడ్ పెట్రోల్ పై ఉన్న సుంకాన్ని రూ.2.35 నుంచి రూ. 3.85కు పెంచింది. అంతకుముందు సాధారణ రకం డీజిల్ పై ఉన్న రూ.1.46 ఎక్సైజ్ సుంకపు విలువను రూ.2.96కు పెంచగా, బ్రాండెడ్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.3.75 నుంచి రూ. 5.25 కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు
ముంబై: పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం పెట్రోల్, డీజిల్ పై లీటరకు రూ.1.50 సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో సాధారణ రకం లీటరు పెట్రోల్ పై ఉన్న రూ.1.20 ఎక్సైజ్ సుంకాన్ని రూ.2.70 పెంచగా, బ్రాండెడ్ పెట్రోల్ పై ఉన్న సుంకాన్ని రూ.2.35 నుంచి రూ. 3.85కు పెంచింది. డీజిల్ పై కూడా ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అంతకుముందు సాధారణ రకం డీజిల్ పై ఉన్న రూ.1.46 ఎక్సైజ్ సుంకపు విలువను రూ.2.96కు పెంచగా, బ్రాండెడ్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.3.75 నుంచి రూ. 5.25 కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఎల్పీజీ, కిరోసిన్ ధరల పెంపు నిలుపుదల
న్యూఢిల్లీ: ఎల్పీజీ, కిరోసిన్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో స్థానిక లెవీల కారణంగా ఇంధన ధరలు పెరగడంతో ప్రజలపై ఒకేసారి ఎక్కువ భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ వంటి లెవీలు పెరగడంతో కేరళలో ఎల్పీజీ సిలిండరు రూ.4.50 మేర, కర్ణాటకలో రూ.3, మధ్యప్రదేశ్‌లో రూ.4.50, యూపీలో రూ.1 చొప్పున పెరిగింది. హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో కిరోసిన్ ధర 2 పైసలు, 8 పైసల చొప్పున పెరిగింది. మరోవైపు రాష్ట్ర పన్నులు తగ్గడంతో అస్సాంలో సిలిండర్ ధర రూ.9.50, బీహార్‌లో రూ.1.50, మహారాష్ట్రలో రూ.3 మేర తగ్గింది. నవీ ముంబై, మహారాష్ట్రలలో కిరోసిన్ ధరలో లీటరుకు 11 పైసల నుంచి రూ.1.32 దాకా తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే వరకు పెంపును నిలుపుదల చేయాలని చమురు శాఖ ఆదేశాలు జారీచేసింది. -
పుంజుకున్న వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: అంతంత మాత్రం అమ్మకాలతో అతలాకుతలం అవుతున్న వాహన పరిశ్రమకు జూన్‌లో ఊరట లభించింది. ఈ జూన్‌లో కార్లు, ఇతర వాహనాల అమ్మకాలు పుంజుకున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు జూన్30తో ముగుస్తుందని, ఆ తర్వాత వాహనాల ధరలు పెరుగుతాయనే అంచనాలతో అమ్మకాలు పెరిగాయని నిపుణులంటున్నారు. ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పలువురు వాహన కొనుగోళ్లను వాయిదా వేశారని, కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం కూడా అమ్మకాల వృద్ధికి కారణమని వారంటున్నారు. గత రెండేళ్లుగా అమ్మకాల్లేక పెరిగిపోయిన నిల్వలను తగ్గించుకోవడానికి కార్ల కంపెనీలు భారీగానే డిస్కౌంట్లను, వివిధ ఆఫర్లను ఇస్తున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపును కొనసాగించాలని కేంద్రం నిర్ణయించడంతో అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. ఎక్సైజ్ సుంకం రాయితీ కొనసాగింపు కొనుగోలుదారుల సెంటిమెంట్స్‌ను మెరుగుపరచిందని, రానున్నది పండుగల సీజన్ అని అమ్మకాలకు ఢోకా లేదని ఈ కంపెనీలు ధీమాగా ఉన్నాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, ఫోర్డ్ కంపెనీలు అమ్మ కాలు వృద్ధి బాటన దూసుకుపోయాయి. జనరల్ మోటార్స్ ఇండియా, టాటా మోటార్స్ కంపెనీల అమ్మకాలు మాత్రం తగ్గాయి. మారుతీ సుజుకికి చెందిన ఎం800, ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్ఆర్లతో కూడిన మినీ సెగ్మెంట్ అమ్మకాలు 52% పెరిగాయి. ఎక్సెంట్, గ్రాండ్, శాంటాఫే కార్ల కారణంగా అమ్మకాల్లో 10 శాతం వృద్ధి సాధించామని హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. -
కార్ల కంపెనీలకు పండుగే
వాహనాలు, వినియోగ వస్తువులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొనసాగింపు - ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ అమలు - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన న్యూఢిల్లీ: గత ప్రభుత్వం తీసుకున్న ఎక్సైజ్ సుంకం(డ్యూటీ) తగ్గింపు నిర్ణయాన్ని మరో ఆరు నెలలపాటు కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పేర్కొన్నారు. ఫిబ్రవరిలో వెలువరించిన మధ్యంతర బడ్జెట్లో ఆటో, క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలకు వర్తించేలా అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించారు. ఈ గడువు జూన్ 30తో ముగియనుంది. ఫలితంగా కొత్త ప్రభుత్వం డ్యూటీ తగ్గింపును ఈ ఏడాది డిసెంబర్ 31వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆర్థిక వ్యసవ్థకు జవసత్వాలను చేకూర్చేందుకు వీలుగా డ్యూటీ తగ్గింపును కొనసాగించేందుకు జైట్లీ నిర్ణయించారు. దీంతో కార్లు, ఎస్‌యూవీలు, ద్విచక్ర వాహనాలతోపాటు, ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి వినియోగ వస్తువులు, తయారీ రంగానికి సంబంధించిన పరికరాలపై ఇప్పటికే వర్తిస్తున్న 6-2% మధ్య డ్యూటీ కోత ఈ ఏడాది చివరి వరకూ అమలుకానుంది. ఎక్సైజ్ తగ్గింపు పొడిగింపు వల్ల ఆదాయంలో కోత పడినప్పటికీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని జైట్లీ పేర్కొన్నారు. జూలై 10న బడ్జెట్‌ను ప్రకటించనున్నప్పటికీ, డ్యూటీలో కోత గడువు జూన్ 30తో ముగియనుండటంతో ప్రస్తుతం పొడిగింపు నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చిందని వివరించారు. పరిశ్రమలను ఆదుకునే బాటలో డిమాండ్ తగ్గి అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆటో, క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగ పరిశ్రమలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి 6-2% మధ్య ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించింది. దీంతో ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, వాణిజ్య వాహనాలపై 12% నుంచి 8%కు దిగివచ్చిన డ్యూటీ డిసెంబర్ చివరి వరకూ అదే స్థాయిలో అమలుకానుంది. ఈ బాటలో ఎస్‌యూవీలపై 24%(అంతక్రితం 30%), పెద్ద కార్లపై 24%(గతంలో 27%), మధ్యతరహా కార్లపై 20%(గతంలో 24%) చొప్పున వర్తింపు కొనసాగనుంది. ఇక క్యాపిటల్ గూడ్స్‌కు సంబంధించి 12% నుంచి 10%కు దిగివచ్చిన డ్యూ టీలు యథాతథంగా అమలుకానున్నాయి. వినియోగ వస్తువులపై కూడా 12% నుంచి 10%కు దిగివచ్చిన డ్యూటీలు మరో 6 నెలలపాటు కొనసాగనున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో తయారీ రంగం 0.7% క్షీణత(ప్రతికూల వృద్ధి)ను చవిచూసిన నేపథ్యంలో తాజా నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. మే నెలలో కార్లు రయ్... ఎక్సైజ్ డ్యూటీ కోత నేపథ్యంలో ఆటో కంపెనీలు కార్ల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రోత్సాహాన్నందించాయి. దీంతో వరుసగా రెండు నెలలపాటు క్షీణించిన ఆటో అమ్మకాలు మే నెలలో 3%పైగా పురోగమించాయి. ఇక దశాబ్ద కాలంలో తొలిసారిగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు 6.7% క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 2013-14లోనూ 4.65% చొప్పున నీరసించడం గమనార్హం. ప్రస్తుత ఎక్సైజ్ డ్యూటీ తీరిదీ.. ద్విచక్ర వాహనాలు 8% చిన్న కార్లు 8% వాణిజ్య వాహనాలు 8% ఎస్‌యూవీలపై 24% పెద్ద కార్లపై 24% మధ్యతరహా కార్లపై 20% క్యాపిటల్ గూడ్స్ 10% వినియోగ వస్తువులపై 10% తయారీ వ్యయాల ఒత్తిడికి చెక్ ఎక్సైజ్ డ్యూటీల కోత పొడిగింపు నిర్ణయం వినియోగ వస్తు రంగానికి ప్రోత్సాహాన్నిస్తుందని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు. రెండేళ్లుగా మందగించిన వినియోగ వస్తు పరిశ్రమకు డ్యూటీ తగ్గింపు పొడిగింపు నిర్ణయం ఉపశమనాన్ని కలిగిస్తుందని గోద్రెజ్ అప్లయన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ కమల్ నంది వ్యాఖ్యానించారు. ఇక ఇదే విధమైన అభిప్రాయాలను సీఈఏఎంఏ సెక్రటరీ జనరల్ సురేష్ ఖన్నా, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శతంను దాస్ గుప్తా సైతం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిశ్రమ ఎదుర్కొంటున్న తయారీ వ్యయాల ఒత్తిడి కొంతమేర తగ్గుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు. డ్యూటీ తగ్గింపు నిర్ణయంతో దేశీయంగా తయారీ రంగం ఊపందుకుంటుందని దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు శామ్సంగ్, ఎల్జీ వ్యాఖ్యానించాయి. ఆటో పరిశ్రమకు మేలు... ఎక్సైజ్ కోత కొనసాగింపు ఆటో పరిశ్రమకు మేలు చేస్తుందని మారుతీ సుజుకీ సీవోవో మయాంక్ పరీక్ పేర్కొన్నారు. ఇటీవల కొన్ని వారాలుగా పుంజుకున్న డిమాండ్ పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో ఆటో పరిశ్రమ కష్టాలలో చిక్కుకున్నదని, గత నెలలోనే కొంతమేర ఆశావహ పరిస్థితులు నెలకొన్నాయని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ వివరించారు. తాజాగా డ్యూటీ కోతను పొడిగించడం వల్ల డి మాండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. డ్యూటీ కోత పొడిగింపు సంతోషించదగ్గ పరిణామమని జనరల్ మోటార్స్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. బడ్జెట్లో కోతను మార్చి వరకూ పొడిగించడంతోపాటు, మరిన్ని ప్రోత్సాహకర చర్యలను ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం కార్లకు డిమాండ్‌ను పెంచుతుందని హ్యుందా య్ఇండియా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. తాజా నిర్ణయం ఆటో పరిశ్రమకు పెద్ద ఉపశమనమని సియామ్ ఈడీ విష్ణు మాథుర్ పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయం ద్రవ్యలోటు సమస్యలున్నా.. డ్యూటీ తగ్గింపు పొడిగింపు ద్వారా ఆర్థిక మంత్రి జైట్లీ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. ఇది పారిశ్రామికోత్పత్తి వృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. తాజా నిర్ణయం తయారీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నదని ఫిక్కీ మాన్యుఫాక్చరింగ్ కమిటీ చైర్మన్ ఎంఎం సింగ్ చెప్పారు. ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నదని అన్నారు. ఈ నిర్ణయం వృద్ధికి ఊత మివ్వడంతోపాటు, ఉద్యోగ అవకాశాలకు తెరలేపుతుందని పీహెచ్డీ చాంబర్ పేర్కొంది.