న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. పెట్రోల్‌పై రూ. 2.25, డీజిల్‌పై రూపాయి చొప్పున పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే రిటైల్ ధరలపై ఈ ప్రభావం పడకుండా చమురు కంపెనీలు జాగ్రత్తపడ్డాయి. ప్రస్తుతానికి ఈ భారాన్ని తామే భరించాలని నిర్ణయించాయి. జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు, త్వరలోనే ఢిల్లీలోనూ ఎన్నికలు జరగనుండటం కూడా ఇందుకు కారణం. ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం గత మూడు వారాల్లో ఇది రెండోసారి. ఈ పెరుగుదలతో చమురు సంస్థలకు 4వేల కోట్ల రూపాయల ఆదాయం లభించనుంది.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు
Published Wed, Dec 3 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement