సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 3.0 కొనసాగుతున్న సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సంక్షోభంతో వినిమయ డిమాండ్ తీవ్రంగా క్షీణించి, ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్న తరుణంలో ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో , పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ. 13 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఈ పెంపు నేటి నుంచే అమలులోకి వచ్చింది. తాజా పెంపు వల్ల కేంద్ర ఖజానాకు రూ. 1.6 లక్షల కోట్ల ఆదాయం లభించనుంది. దీనితో పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 32.98 కు, డీజిల్‌పై రూ.31.83 పెరిగింది. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ )
ఒక వైపు పలు రాష్ట్రాలు పెట్రో ధరలపై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకోగా తాజాగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని మరోసారి పెంచుతూ నరేంద్ర మోదీ సర్కార్ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ భారం ఆయిల్ కంపెనీలపై వుంటుందని, రీటైల్ అమ్మకాలపై వుండదని స్పష్టం చేసింది. . కాగా గత మార్చి నుంచి ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. అటు ఈ కరోనా కల్లోలంతో భారీ పతనాన్ని నమోదు చేసిన చమురు ధరలు గరిష్ట స్థాయి నుండి 60శాతం క్షీణించాయి. (పెట్రో షాక్, నష్టాల్లో మార్కెట్లు)
Comments
Please login to add a commentAdd a comment