పీవోఎస్ పరికరాలు మరింత చౌక
ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేసిన కేంద్రం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లపై సుంకాలను ఎత్తివేసింది. దీంతో ఇవి మరింత చౌకగా మారనున్నారుు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పీవోఎస్ పరికరాలకు డిమాండ్ పెరిగిపోరుుంది. వీటి వినియోగాన్ని మరింత పెంచేందుకు గాను... పీవోఎస్ మెషీన్లతోపాటు, వాటి తయారీలో వాడే అన్ని రకాల పరికాలపై 12.5 శాతం ఎక్సైజ్ డ్యూటీ, 4 శాతం ప్రత్యేక అదనపు డ్యూటీల నుంచి మినహారుుస్తున్నట్టు, ఇది వచ్చే మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని అధికార వర్గాలు తెలిపారుు. సుంకాల రద్దు ఫలితంగా పీవోఎస్ మెషీన్లు 16.5 శాతం మేర ధరలు తగ్గనున్నారుు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 90 శాతం పీవోఎస్ మెషీన్లు దిగుమతి అవుతున్నాయని ఆ వర్గాలు తెలిపారుు.