POS
-
45 నిమిషాల్లోనే పీవోఎస్ ఇన్స్టాల్! యాక్సిస్ బ్యాంక్ ‘సారథి’తో..
న్యూఢిల్లీ: వ్యాపారవర్గాలకు పీవోఎస్ టెర్మినల్స్‌ను ఇన్స్టాల్ చేసే ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసే దిశగా ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ‘‘సారథి’’ పేరిట డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. రియల్ టైమ్ డేటా బేస్ పరిశీలన, లైవ్ వీడియో ధృవీకరణ ద్వారా దరఖాస్తు ప్రక్రియను ఇది క్రమబద్ధీకరిస్తుందని బ్యాంక్ ప్రెసిడెంట్ సంజీవ్ మొఘె తెలిపారు. దీనితో క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ ప్రక్రియతో పని లేకుండా, దరఖాస్తును ప్రాసెస్ చేసిన 45 నిమిషాల్లోనే ఇన్స్టాల్ చేసేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. సాంప్రదాయ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు రోజుల తరబడి సమయం పట్టేస్తుందని, ఈ విధానంలో పేపర్ రహితంగా కేవలం నాలుగు అంచెల్లోనే పీవోఎస్ టెర్మినల్స్ ఇన్స్టాలేషన్ పూర్తవుతుందని మొఘె చెప్పారు. ఇదీ చదవండి: SpiceJet: ఆ ఉద్యోగులకు నిజంగా పండగే! రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు.. బెనిఫిట్లు మామూలుగా లేవుగా.. -
పీవోఎస్ మెషీన్ల డిమాండ్ రయ్ రయ్!
♦ 2022కి 310 కోట్ల ట్రాన్సాక్షన్లు ♦ అసోచామ్ నివేదిక బెంగళూరు: దేశంలో డీమోనిటైజేషన్ తర్వాత పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాల వినియోగం పెరిగింది. వీటి ద్వారా జరిగే లావాదేవీలూ ఊపందుకున్నాయి. 2016లో 16 లక్షలుగా ఉన్న పీవోఎస్ పరికరాల సంఖ్య వచ్చే ఐదేళ్లలో 30 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధితో 76 లక్షలకు చేరొచ్చని అసోచామ్ అంచనా వేసింది. ఇది ఆర్‌ఎన్‌సీవోఎస్ బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో కలిసి తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ‘డీమోనిటైజేషన్ తర్వాత పీవోఎస్ లావాదేవీలు చాలా రెట్లు పెరిగాయి. దేశంలో 2016 నవంబర్ 8కి ముందు వరకు దాదాపు 96 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరిగేవి. కానీ తర్వాత వీటి శాతం 80కి తగ్గింది’ అని అసోచామ్ నేషనల్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ తెలిపారు. దేశంలో 74 కోట్ల డెబిట్/క్రెడిట్ కార్డులున్నాయని, దీంతో పీవోఎస్ పరికరాల సంఖ్య బాగా పెరిగే అవకాశముందన్నారు. గతేడాది రూ.63,500 కోట్లుగా ఉన్న పీవోఎస్ లావాదేవీల విలువ 2022కి రూ.7.5 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. -
పీవోఎస్ మెషీన్ల దిగుమతికి నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే దిశగా వ్యాపార సంస్థలు మరిన్ని పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను సమకూర్చునేందుకు ప్రభుత్వం నిబంధనలు సడలించింది. దిగుమతి చేసుకునే పీవోఎస్ మెషీన్లకు మార్చి 31 దాకా భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) లేబులింగ్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతిపాదనకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆమోదముద్ర వేసింది. నిర్దిష్ట మోడల్ పీవోఎస్ దిగుమతికి సంబంధించి బీఐఎస్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ నంబరును ఎక్సైజ్, కస్టమ్స్ విభాగానికి సదరు వర్తకులు చూపించిన పక్షంలో క్లియరెన్స్ లభిస్తుంది. దేశీయంగా నగదు రహిత, డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పీవోఎస్ మెషీన్లను దిగుమతి చేసుకుంటున్నందున ప్రత్యేక మినహాయింపు కల్పించాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖను కేంద్ర ఆర్థిక శాఖ కోరిన నేపథ్యంలో తాజా సడలింపు ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా దిగుమతి చేసుకున్న పీవోఎస్ మెషీన్లకు బీఐఎస్ సర్టిఫికేషన్, లోగో తప్పనిసరి. ఇవి ఉంటేనే దేశీయంగా వాటి విక్రయాలకు కస్టమ్స్ విభాగం అనుమతినిస్తుంది. ఎస్బీఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో 15.1 లక్షల పీవోఎస్ మెషీన్లు ఉన్నాయి. అయితే, డిజిటైజేషన్ పెరిగే పక్షంలో అదనంగా 20 లక్షల పైచిలుకు అవసరం కావొచ్చని అంచనా. -
పీవోఎస్ పరికరాలు మరింత చౌక
ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేసిన కేంద్రం న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లపై సుంకాలను ఎత్తివేసింది. దీంతో ఇవి మరింత చౌకగా మారనున్నారుు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పీవోఎస్ పరికరాలకు డిమాండ్ పెరిగిపోరుుంది. వీటి వినియోగాన్ని మరింత పెంచేందుకు గాను... పీవోఎస్ మెషీన్లతోపాటు, వాటి తయారీలో వాడే అన్ని రకాల పరికాలపై 12.5 శాతం ఎక్సైజ్ డ్యూటీ, 4 శాతం ప్రత్యేక అదనపు డ్యూటీల నుంచి మినహారుుస్తున్నట్టు, ఇది వచ్చే మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని అధికార వర్గాలు తెలిపారుు. సుంకాల రద్దు ఫలితంగా పీవోఎస్ మెషీన్లు 16.5 శాతం మేర ధరలు తగ్గనున్నారుు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 90 శాతం పీవోఎస్ మెషీన్లు దిగుమతి అవుతున్నాయని ఆ వర్గాలు తెలిపారుు. -
ప్రీపెయిడ్ కార్డ్‌తో రూ. 1,000 నగదు పొందొచ్చు
ముంబై: బ్యాంకుల నుంచి పొందే ప్రీపెయిడ్, గిఫ్ట్ కార్డ్‌లను కలిగిన వినియోగదారులు ఇకనుంచీ దుకాణదారుల(పీవోఎస్) వద్దనుంచి రోజుకి రూ. 1,000 వరకూ నగదు తీసుకోవచ్చు. ఇందుకు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంకు గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్లాస్టిక్ మనీ వినియోగంలో కస్టమర్లకు మరింత వెసులుబాటును కల్పించే బాటలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఇందుకు డెబిట్ కార్డ్‌లను మాత్రమే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఆర్ఐ పెట్టుబడులకు గ్యారంటీ కాగా ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు) తరఫున దేశీయ కంపెనీల ఈక్విటీలు, డిబెంచర్లలో పెట్టుబడులకు గ్యారంటీ ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది.