న్యూఢిల్లీ: వ్యాపారవర్గాలకు పీవోఎస్ టెర్మినల్స్‌ను ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసే దిశగా ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ‘‘సారథి’’ పేరిట డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. రియల్ టైమ్ డేటా బేస్ పరిశీలన, లైవ్ వీడియో ధృవీకరణ ద్వారా దరఖాస్తు ప్రక్రియను ఇది క్రమబద్ధీకరిస్తుందని బ్యాంక్ ప్రెసిడెంట్ సంజీవ్ మొఘె తెలిపారు.
దీనితో క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ ప్రక్రియతో పని లేకుండా, దరఖాస్తును ప్రాసెస్ చేసిన 45 నిమిషాల్లోనే ఇన్‌స్టాల్ చేసేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. సాంప్రదాయ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు రోజుల తరబడి సమయం పట్టేస్తుందని, ఈ విధానంలో పేపర్ రహితంగా కేవలం నాలుగు అంచెల్లోనే పీవోఎస్ టెర్మినల్స్ ఇన్‌స్టాలేషన్ పూర్తవుతుందని మొఘె చెప్పారు.
ఇదీ చదవండి: SpiceJet: ఆ ఉద్యోగులకు నిజంగా పండగే! రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు.. బెనిఫిట్లు మామూలుగా లేవుగా..
Comments
Please login to add a commentAdd a comment