Installed
-
అయోధ్యలో బంగారు రామాయణం
అయోధ్యకు వచ్చే రామభక్తులకు ఇప్పుడు మరొక కానుక అందనుంది. అదే బంగారు రామాయణ దర్శనభాగ్యం. ఈ రామాయణాన్ని నూతన రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఈ ప్రత్యేక బంగారు రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్, అతని భార్య సరస్వతి రామాలయ ట్రస్ట్‌కు అందించారు. శ్రీరామ నవరాత్రులలో మొదటి రోజున ఈ రామాయణ ప్రతిష్ఠాపన జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ్ దంపతులు పాల్గొన్నారు. చెన్నైకి చెందిన వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ ఈ బంగారు రామాయణాన్ని తయారు చేసింది. గర్భగుడిలోని రామ్‌లల్లా విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై ఈ రామాయణాన్ని ప్రతిష్ఠించారు. ఈ రామాయణ గ్రంథం పైభాగంలో వెండితో చేసిన రాముడి పట్టాభిషేక దృశ్యం కనిపిస్తుంది. ఈ రామాయణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో రామాలయ నిర్మాణ ఇన్చార్జి గోపాల్‌రావు, పూజారి ప్రేమ్‌చంద్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్స్టాల్ చేసిన రోజు నుంచే వారంటీ
న్యూఢిల్లీ: వినియోగదారులు కొనుగోలు చేసిన ఉత్పత్తిని ఇన్స్టాల్ (ఏర్పాటు చేయడం/పనిచేయించడం) చేసిన రోజు నుంచే వారంటీని అమలు చేయాలని వైట్‌గూడ్స్ (కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు) తయారీ సంస్థలు, విక్రేతలను కేంద్రం కోరింది. అంతే కానీ కొనుగోలు చేసిన తేదీని వారంటీ/గ్యారంటీకి పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి వారంటీ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి పరిశ్రమల సంఘాలు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, పీహెచ్‌డీసీసీఐ, శామ్సంగ్, ఎల్జీ, ప్యానాసోనిక్, బ్లూస్టార్, కెంట్, వర్ల్‌పూల్, వోల్టాస్, బాష్, హావెల్స్, ఫిలిప్స్, తోషిబా, డైకిన్, సోనీ, హిటాచి, ఐఎఫ్బీ, గోద్రేజ్, హయర్, యూరేకా ఫోర్బ్స్, లైడ్ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ లేఖ రాశారు. ఉత్పత్తిని వినియోగించని కాలానికి వారంటీని అమలు చేయడం అనుచిత వాణిజ్య విధానంగా ‘వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019’ స్పష్టం చేస్తున్నట్టు తన లేఖలో పేర్కొన్నారు. పండుగల సీజన్లో పెద్ద ఎత్తున అమ్మకాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ విషయమై ప్రధానమంత్రి సందేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
45 నిమిషాల్లోనే పీవోఎస్ ఇన్స్టాల్! యాక్సిస్ బ్యాంక్ ‘సారథి’తో..
న్యూఢిల్లీ: వ్యాపారవర్గాలకు పీవోఎస్ టెర్మినల్స్‌ను ఇన్స్టాల్ చేసే ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసే దిశగా ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ‘‘సారథి’’ పేరిట డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. రియల్ టైమ్ డేటా బేస్ పరిశీలన, లైవ్ వీడియో ధృవీకరణ ద్వారా దరఖాస్తు ప్రక్రియను ఇది క్రమబద్ధీకరిస్తుందని బ్యాంక్ ప్రెసిడెంట్ సంజీవ్ మొఘె తెలిపారు. దీనితో క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ ప్రక్రియతో పని లేకుండా, దరఖాస్తును ప్రాసెస్ చేసిన 45 నిమిషాల్లోనే ఇన్స్టాల్ చేసేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. సాంప్రదాయ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు రోజుల తరబడి సమయం పట్టేస్తుందని, ఈ విధానంలో పేపర్ రహితంగా కేవలం నాలుగు అంచెల్లోనే పీవోఎస్ టెర్మినల్స్ ఇన్స్టాలేషన్ పూర్తవుతుందని మొఘె చెప్పారు. ఇదీ చదవండి: SpiceJet: ఆ ఉద్యోగులకు నిజంగా పండగే! రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు.. బెనిఫిట్లు మామూలుగా లేవుగా.. -
అరే ఏంది ఇది? రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలా?. వీడియో వైరల్
ఒక దేశంలో నడి రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు పెట్టారు. ఏదో ఒకటి రెండో కాదు ఏకంగా చాలావరకు విద్యుత్ స్తంభాలన్ని రోడ్డు మధ్యలోనే ఉన్నాయి. ఈ ఘటన పాకిస్తాన్లో ఒక జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని షామా జునేజో అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రహదారిపై కనిపిస్తున్న విద్యుత్ స్తంభాలను చూస్తే ఏదో ప్రమాదవశాత్తు ఏర్పాటు చేసినట్లు లేదు. ఎందుకంటే విద్యుత్ స్తంభాలన్ని అలానే సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులకు ఎంత ప్రమాదకరం అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదీ కూడా శీతకాలంలో మరింత ప్రమాదకరమని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ మాజీ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దర్ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ హయాంలో జరిగిందా అని వీడియోని పోస్ట్ చేసిన షామా జునేజో ప్రశ్నిస్తున్నారు. یہ کھمبے عثمان بوزدار کے دور میں لگے یا چوہدری پرویز اِلٰہی کے؟ pic.twitter.com/zxR52A3CW0 — Shama Junejo (@ShamaJunejo) October 4, 2022 (చదవండి: 11,602 లాలీపాప్‌లతో వెరైటీ రికార్డు.. కండిషన్స్ ఆప్లై!) -
హద్దుల్లేకుండా.. హల్లో!
భువనేశ్వర్: రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మొబైల్ ఫోన్ నెట్వర్కు అందుబాటులోకి రానున్నదని కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్ సాంకేతిక సమాచారం, రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని సోమవారం మీడియాతో సమావేశమయ్యారు. త్వరలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 4వేల మొబైల్ టవర్ల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సమగ్రంగా 6వేల గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ లేదన్నారు. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలకు నెట్వర్క్ సదుపాయం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో 3,933 గ్రామీణ ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు ఆదేశించారన్నారు. ఏ ఒక్క గ్రామం మొబైల్ నెట్వర్క్ లేకుండా ఇబ్బందులు పడకూడదని సూచించారన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహించి, కేబినెట్ నోట్ ప్రవేశ పెట్టామన్నారు. పూర్వోదయ మిషన్‌లో భాగంగా ఈ చర్య చేపడుతున్నట్లు వివరించారు. బీఎస్ఎన్ఎల్కు పునరుజ్జీవం దివాలా తీసిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ల్)కు నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు పునరుజ్జీవం కల్పించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యతో ఈ సంస్థ గతేడాది నిర్వహణ లాభాల (ఆపరేటింగ్ ప్రాఫిట్) స్థాయికి పునరుద్ధరణ సాధించిందన్నారు. బీఎస్ఎన్ల్కు రెండు విడతల్లో ఆర్థిక వనరులు కల్పించిందని తెలిపారు. తొలివిడత కింద 2019లో రూ.90వేల కోట్లు, మలివిడతగా రూ.45వేల కోట్లు ఈ ఏడాది మంజూరు చేశారని ప్రకటించారు. దీంతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు పునరుజ్జీవం పొందాయన్నారు. దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, 4జీ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 5జీ వ్యవస్థ ప్రయోగాత్మక దశలో తుది మెరుగులు దిద్దుకుంటోందని, ఫోన్, రేడియోకు 5జీ టెక్నాలజీ అనుసంధానంతో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కనీవినీ ఎరుగని నిధులు.. రాష్ట్రంలో రైల్వేరంగం సమగ్ర అభివృద్ధికి బడ్జెట్లో కనీవినీ ఎరుగని స్థాయిలో నిధులు కేటాయించారు. యూపీఏ హయాం కంటే 2022–23 బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామన్నారు. 2009 నుంచి 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి ఏటా సగటున సుమారు రూ.800 కోట్ల నిధులు కేటాయించారని గుర్తుచేశారు. 2014–2019 మధ్య బీజేపీ ప్రభుత్వం ఏటా సగటున రూ.4,126 కోట్లు రాష్ట్ర రైల్వే రంగానికి కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర రైల్వే రంగానికి రూ.9,734 కోట్లు కేటాయించడం చారిత్రాత్మకంగా వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 12 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. -
జీమెయిల్ సరికొత్త రికార్డు..! ప్రపంచజనాభా కంటే ఎక్కువగా..!
గూగుల్ రూపొందించిన ఈ-మెయిల్ సర్వీస్ జీ మెయిల్ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అత్యధికంగా ఇన్స్టాల్ఐనా నాల్గవ యాప్‌గా జీ-మెయిల్ నిలిచింది. 10 బిలియన్ల మైలు రాయి..! ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోజీమెయిల్ యాప్ 10 బిలియన్(1000 కోట్ల) ఇన్‌స్టాల్‌లను సాధించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 బిలియన్లకు పైగా ఇన్స్టాల్ఐనా మైలురాయిని గూగుల్‌కు చెందిన మరో మూడు యాప్స్ గూగుల్ ప్లే సర్వీసెస్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ నిలిచాయి. ఇక్కడ విశేషమేమిటంటే ప్రపంచ జనాభా కంటే అధికంగా యాప్స్ డౌన్లోడ్స్ జరిగాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో..! జీమెయిల్ పేరుతో ఈమెయిల్ సేవలను గూగుల్ ఏప్రిల్ 2004 ప్రారంభించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ భారీ ఆదరణను సాధించింది. కాలానుగుణంగా జీమెయిల్ అత్యధిక సంఖ్యలో అద్బుతమైన ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మీట్స్‌ను యాప్‌కు జోడించింది. అంతేకాకుండా యూజర్లు ఆడియో, వీడియో కాల్స్‌ను చేసుకునే ఫీచర్నుకు అందుబాటులోకి తెచ్చింది జీమెయిల్. చదవండి: ఓలాపై ‘గుత్తాధిపత్య ధరల’ ఆరోపణలు కొట్టివేత -
కోల్‌కతా కోటలో చందమామ
సాక్షి, కోల్‌కతా : తారల మధ్య తళుకులీనే చందమామ నేలరాలింది. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ లాన్స్‌లో కొలువుతీరింది. త్రీడీ చందమామను అమర్చిన ఆ ప్రాంతమంతా వీక్షకులతో కిక్కిరిసిపోయింది. నాసా లూనార్ రీకనైసెన్స్ ఆర్బిటర్ కెమెరా ఇమేజరీ ఉపయోగించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడంతో చిన్నాపెద్దా కళ్లముందు నిలిచిన చందమామను కళ్లింతలు చేసుకుని చూశారు. బ్రిటష్ కౌన్సిల్ చేపట్టిన మ్యూజియం ఆఫ్ ద మూన్ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ హాల్లో త్రీడీ ఇన్స్టలేషన్ను ఉంచారు. బెంగళూర్, ముంబయి, ఉదయ్పూర్లలోనూ గతంలో మ్యూజియం ఆఫ్ ది మూన్‌ను ప్రదర్శనకు ఉంచారు. నిజమైన చందమామ కంటే అయిదు లక్షల రెట్లు చిన్నదిగా ఈ నకలు చందమామ ఉంటుంది. 23 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ మూన్ చిన్నారులు, యువతను అమితంగా ఆకట్టుకుంది. బ్రిటిష్ ఆర్టిస్ట్ ల్యూక్ జెర్రామ్ ఈ మూన్‌ను నేలపై నిలిపారు. శాస్త్రం, కళల సమ్మేళనంతో ఈ ఆవిష్కరణ సాధ్యమైందని, ఇది బ్రిటిష్ కౌన్సిల్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని అధికారులు పేర్కొన్నారు. -
మ్యూజియంలో అలరించనున్న బంగారు టాయిలెట్!
న్యూయార్క్ః అమెరికా ప్రజలను 'గోల్డెన్ టాయిలెట్' అలరించనుంది. 18 కారెట్ల బంగారంతో తయారైన టాయిలెట్ సీటుతో అమెరికా మ్యూజియంలోని బాత్ రూం లో త్వరలో కొలువుదీరనుంది. ఆ కళాత్మక రూపం కేవలం సందర్శకుల దర్శనార్థమే కాక, వినియోగించేందుకు కూడ వీలుపడేట్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ లోని గగెన్హీమ్ మ్యూజియంలో మారాజియో కాటలెన్ రూపొందించిన పద్ధెనిమిది క్యారెట్ల పూర్తి ఫంక్షనల్ గోల్డ్ టాయిలెట్ ను పబ్లిక్ టాయిలెట్ల స్థానంలో స్థాపించనున్నారు. ప్రతి ఒక్కరూ మ్యూజియంలోని టాయిలెట్ ను సందర్శించే అవకాశం ఉందని, దీనికి తోడు తలుపును మూసి మంచి అనుభవాన్ని కూడ పొందే వీలుందని గగెన్హీమ్ ప్రచారకర్త మోలీ స్టీవర్డ్ తెలిపారు. అమెరికాలోని మారాజియో కాటలెన్ మొదటిసారి రూపొందించిన ఈ కళాత్మక టాయిలెట్... మ్యూజియంలో ప్రదర్శనతోపాటు, ప్రజల వినియోగానికి కూడ వీలుగా ఉండేట్లు సృష్టించారని స్టీవర్ట్ తెలిపారు. ఈ బంగారు టాయిలెట్ కళాకారుడి సృజనాత్మకతను సూచిస్తుందని ఆయన వివరించారు. 2011 లో కళా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన 55 ఏళ్ళ కళాకారుడు కాటలెన్.. ఆసమయంలో కళాప్రపంచ డిమాండ్లకు స్ఫూర్తిదాయకమవ్వడంతో అతడి పని తీరును గుర్తించి, ప్రోత్సహించిన అమెరికాలోని గగెన్హీమ్ మ్యూజియం.. అక్కడ ప్రదర్శనకు ఉంచేందుకు వీలుగా ప్రత్యేక రూపాన్ని సృష్టించేందుకు అతడిని తిరిగి ప్రోత్సహించినట్లు వెల్లడించారు. ఆర్థిక అసమానతలను రూపుమాపడమే ఇతివృత్తంగా తాను టాయిలెట్ థీమ్ ను ఎంచుకొన్నానని, అయితే అది సందర్శకుల వినియోగానికి వీలుగా ఉండాలన్న దృష్టితో రూపొందించినట్లు కళాకారుడు కాటలెన్ చెప్తున్నాడు. ప్రజలు నా పనిని గుర్తించాలన్న ఉద్దేశ్యంతో దీన్ని తయారు చేయలేదని, వారి సందర్శనకు, అనుభవాలకు మంచి అవకాశాన్ని కల్పించే కళారూపం కావాలని కాటలెన్ తెలిపాడు. అయితే ఈ విలాసవంతమైన రూపం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే దీన్నిమ్యూజియం లోని యూనిసెక్స్ బాత్రూంలో ఏర్పాటు చేస్తున్నట్లు మ్యూజియం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి కూడ ప్రత్యేకంగా ఓ ఫుల్ టైం సెక్యూరిటీ గార్డును నియమిస్తారని, అతడు రెస్ట్ రూం బయట నిలబడి ఉంటాడని, ప్రజలు ఎటువంటి దశ్చర్యలకు పాల్పడకుండా అప్పుడప్పుడు లోపల చెక్ చేస్తుంటాడని ప్రచారకర్త మోలీ స్టీవర్ట్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక టాయిలెట్ ను సందర్శించి మంచి అనుభవాన్ని పొందేందుకు సహకరించాలే తప్ప.. ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని సూచించారు. దీర్ఘకాల ప్రయోజనం కోసమే అమెరికా ఈ టాయిలెట్ ను మ్యూజియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.