అయోధ్యకు వచ్చే రామభక్తులకు ఇప్పుడు మరొక కానుక అందనుంది. అదే బంగారు రామాయణ దర్శనభాగ్యం. ఈ రామాయణాన్ని నూతన రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించారు.
ఈ ప్రత్యేక బంగారు రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్, అతని భార్య సరస్వతి రామాలయ ట్రస్ట్‌కు అందించారు. శ్రీరామ నవరాత్రులలో మొదటి రోజున ఈ రామాయణ ప్రతిష్ఠాపన జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ్ దంపతులు పాల్గొన్నారు.
చెన్నైకి చెందిన వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ ఈ బంగారు రామాయణాన్ని తయారు చేసింది. గర్భగుడిలోని రామ్‌లల్లా విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై ఈ రామాయణాన్ని ప్రతిష్ఠించారు. ఈ రామాయణ గ్రంథం పైభాగంలో వెండితో చేసిన రాముడి పట్టాభిషేక దృశ్యం కనిపిస్తుంది. ఈ రామాయణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో రామాలయ నిర్మాణ ఇన్‌చార్జి గోపాల్‌రావు, పూజారి ప్రేమ్‌చంద్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment