
ఒక దేశంలో నడి రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు పెట్టారు. ఏదో ఒకటి రెండో కాదు ఏకంగా చాలావరకు విద్యుత్ స్తంభాలన్ని రోడ్డు మధ్యలోనే ఉన్నాయి. ఈ ఘటన పాకిస్తాన్‌లో ఒక జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని షామా జునేజో అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో రహదారిపై కనిపిస్తున్న విద్యుత్ స్తంభాలను చూస్తే ఏదో ప్రమాదవశాత్తు ఏర్పాటు చేసినట్లు లేదు. ఎందుకంటే విద్యుత్ స్తంభాలన్ని అలానే సెంటర్‌లో ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులకు ఎంత ప్రమాదకరం అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదీ కూడా శీతకాలంలో మరింత ప్రమాదకరమని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ మాజీ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దర్ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ హయాంలో జరిగిందా అని వీడియోని పోస్ట్ చేసిన షామా జునేజో ప్రశ్నిస్తున్నారు.
یہ کھمبے عثمان بوزدار کے دور میں لگے یا چوہدری پرویز اِلٰہی کے؟ pic.twitter.com/zxR52A3CW0
— Shama Junejo (@ShamaJunejo) October 4, 2022
(చదవండి: 11,602 లాలీపాప్‌లతో వెరైటీ రికార్డు.. కండిషన్స్ ఆప్లై!)