electrical supply
-
ఈ డివైజ్‌తో అందమైన ముఖ ఆకృతి మీ సొంతం!
ముఖాన్ని కాస్టీ కాస్మెటిక్స్‌తో, మేకప్‌తో తీర్చిదిద్దడం కంటే.. ఇలాంటి డివైస్ల సాయంతో తీర్చిదిద్దితే ఆ అందం ఎక్కువ కాలం నిలుస్తుంది. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ ఫేషియల్ మసాజర్‌ను ఉపయోగించి.. డబుల్ చిన్ను తగ్గించుకోవచ్చు. ముడతలు, గీతలు లేకుండా మృదువుగా మార్చుకోవచ్చు. ఈ స్కిన్ లిఫ్ట్ పరికరం.. హీటింగ్, వైబ్రేషన్‌తో పనిచేస్తుంది. ఇది కళ్లు, పెదవులు, బుగ్గలు ఇలా ప్రతి భాగంలోనూ ముడతలు, మచ్చలు, మొటిమలు, సన్‌స్పాట్‌లను పూర్తిగా మాయం చేస్తుంది. అలాగే ముఖ ఆకృతిని మార్చి.. డార్క్ సర్కిల్స్‌ని తగ్గిస్తుంది. ప్రత్యేకమైన గ్లోను అందిస్తుంది. ఎలక్ట్రిక్ డివైస్ అయిన ఈ మసాజర్.. ఎలాంటి ప్రమాదాలను కలిగించదు. స్కిన్ రిజువనేషన్ స్కిన్ కేర్ టూల్‌గా గుర్తింపు పొందిన ఈ మెషిన్‌కి చిత్రంలో చూపిన విధంగా చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన బేస్ లభిస్తుంది. దానిమీద ఈ టూల్‌ని అమర్చుకుని చార్జింగ్ పెట్టుకోవాలి. ఇందులో మొత్తం నాలుగు రంగుల ప్రత్యేకమైన మోడ్స్ ఉంటాయి. రెడ్, పర్పుల్‌తో పాటు బ్లూ కలర్లో రెండు మోడ్స్ ఉంటాయి. ఈ డివైస్‌ని ఎలా వాడాలో తెలుపుతూ ఒక బుక్లెట్ కూడా లభిస్తుంది. దీనికి రెండు హెడ్స్ ఉంటాయి. ఒకటి క్లీనింగ్ బ్రష్ హెడ్, రెండు మసాజింగ్ హెడ్. వాటిని మార్చుకుంటూ చర్మాన్ని మొదట శుభ్రం చేసుకుని.. తర్వాత మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం అందుతుంది. (చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!) -
ఎలక్ట్రానిక్స్‌లో దూసుకెళ్తున్న భారత్
ఒకప్పుడు మొబైల్ ఫోన్ అనగానే చైనాయే గుర్తొచ్చేది. డ్రాగన్ దేశం నుంచే వివిధ దేశాలకు లక్షలాదిగా మొబైళ్లు ఎగుమతి అయ్యేవి. పైగా స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ దాదాపు చైనాలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ ఫోన్ల తయారీలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2014–2023 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో 23 శాతం వార్షిక వృద్ధిరేటు సాధించుకుంటూ ప్రపంచంలో రెండవ అతి పెద్ద మొబైల్ ఉత్పత్తి దేశంగా అవతరించింది. ఈ మేరకు గ్లోబల్ రీసెర్చ్ ఆర్గ నైజేషన్ ‘కౌంటర్ పాయింట్’ నివేదించింది. భారత్ దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం విజయవంతం కావడంతో దేశంలో ఫోన్ల ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇండియాలో ఎలక్ట్రానిక్ రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఫోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం 2021 ఏప్రిల్‌లో పీఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఆయా సంస్థలకు రూ. 40,995 కోట్ల రాయితీలు ఈ పథకం కింద ఇచ్చింది. దీంతో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్‌లతో పాటు పలు కంపెనీలు ఫోన్ల ఉత్పత్తిని విపరీతంగా పెంచాయి. దేశీయ మార్కెట్లో విక్రయించడంతో పాటు పలు దేశాలకు ఎగుమతులు పెరిగాయి. ఈ అనూహ్య పెరుగుదలకు యాపిల్ ఐఫోన్ల ఒప్పంద తయారీ కంపెనీలైన ఫాక్స్‌కాన్, పెగట్రాన్, విస్ట్రన్లతో పాటు శాంసంగ్ ప్రధాన కారణం. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి సాధించేందుకు ‘ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్’ (ఐసీఈఏ) సుంకాలు తగ్గించి, మార్కెట్లో పోటీ తత్వాన్ని పెంచాలని చూస్తోంది. ఉత్పత్తులను మెరుగుపరచడం, కార్మిక సంస్కరణలు చేయడం, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించింది. 2025–26 నాటికి 600 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లు ఎగుమతి అవుతాయని భారత్ అంచనా వేస్తోంది. ఒకప్పుడు మన దేశం నుంచి మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు ఫోన్లు ఎగుమతి అవ్వగా... ప్రస్తుతం అమెరికా, నెదర్లాండ్, ఆస్ట్రియా, ఇటలీ వంటి యూరప్ దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘పేస్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్’ (పీఎంపీ), ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్’ (పీఎల్ఐ), ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి కార్యక్రమాలను కేంద్రం ప్రారంభించి స్థానిక తయారీ సంస్థలను ప్రోత్సహించింది. 2014లో దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 19 శాతం మాత్రమే ఉండేది. 2022 నాటికి 98 శాతం స్థానికంగా తయారు చేసిన ఫోన్లను భారత్ ఎగుమతి చేసింది. ఇప్పటికే ఇండియాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెల్ఫోన్లు, లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ మదర్ బోర్డులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వినియోగించే మైక్రో ప్రాసెసర్లు, చిప్సెట్స్ కూడా మన దేశంలోనే తయారు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇదే తరహాలో భారత్ ముందుకెళ్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత వృద్ధి సాధించేందుకు అవకాశం ఉంది. – తాడేపల్లి విజయ్ ‘ 78424 85865 -
పరారీలోనే ట్రాన్స్‌కో ఏఈ
మక్కువ/విజయనగరం ఫోర్ట్: విద్యుత్‌కనెక్షన్ మంజూరుకు మక్కువ మండలం ములక్కావలసకు చెందిన రైతు డి.ఈశ్వరరావు నుంచి ట్రాన్స్‌కో ఏఈ పోలాకి శాంతారావు రూ.60వేలు డిమాండ్ చేయడం... ఇప్పటికే రైతు రూ.20 వేలు చెల్లించగా.. మిగిలిన రూ.40వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈపై దాడిచేయడం.. ఆ సమయంలో అధికారులను గుర్తించి పొలాల్లోకి ఏఈ కారు వేగంగా నడపడం.. ఆయనను బైక్‌తో వెంబడించిన సీఐను కారుతో ఢీకొట్టి గాయాలు పాలుచేసిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులకు ఆదివారం రాత్రి చిక్కినట్టే చిక్కి పరారైన ట్రాన్స్ కో ఏఈ శాంతారావు ఆచూకీ 24 గంటలు గడచినా లభ్యం కాలేదు. ఏఈ ఆచూకీకోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు ఫోన్లో సంప్రదించారు. సరెండర్ అయ్యేలా సహకరించాలని కోరారు. ఆయన ఆచూకీ ఆ శాఖ అధికారులకూ దొరకకపోవడం గమనార్హం. శాంతారావు ఫోన్ నంబర్‌ను ఏసీబీ అధికారులు లోకేషన్ ట్రాప్ చేస్తున్నా.. పాపయ్యవలస గ్రామ సమీపంలోని పంట పొలాల వద్దే సిగ్నల్స్ చూపిస్తోంది. ఏఈ తన ఫోన్‌ను పొలంలో విసిరేసినట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏఈ కారును సీజ్ చేసిన అధికారులు ఏఈ శాంతారావు కారును పాపయ్యవలస గ్రామ సమీపంలోని పంట పొలాల మధ్యలో వదిలేసి పరారవ్వడంతో కారును ఏసీబీ అధికారులు సోమవారం సీజ్ చేసి మక్కువ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంతవరకు ఏఈ ఇంటికి గాని, స్నేహితుల ఇంటికి గాని ఆయన చేరలేదు. అధికారుల కళ్లుగప్పి పరారీలో ఉన్న ఏఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచీ అంతే... ఏఈ పొలాకి శాంతరావుపై ఆదినుంచి అవినీతిపరుడన్న ముద్ర ఉంది. విద్యుత్‌శాఖలో కాంట్రాక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఆ శాఖలోని లొసుగులన్నీ తెలుసుకున్నాడు. అదే శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఎక్కడ ఏ పని చేస్తే డబ్బులు వస్తాయో తెలుసుకున్న శాంతారావు... ఆ మార్గానే ఎంచుకున్నాడన్న విమర్శలు ఉన్నాయి. డెంకాడ, విజయనగరంలోని డీ–2 సెక్షన్, గంటస్తంభం ఏరియా, డి–3 విజయనగరం, వి.టి.ఆగ్రహారం ప్రాంతంలో పనిచేసి ఇటీవల మక్కువ మండలానికి బదిలీపై వెళ్లాడు. విద్యుత్‌స్తంభాలు మార్పు చేసినా, లైన్‌ను మార్చినా, అపార్ట్ మెంట్లు, ఇళ్లకు కనెక్షన్లు మంజూరు చేయాలన్నా చేయితడపాల్సిందే. లేదంటే పని పూర్తికాదన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతుల నుంచి ఎక్కువగా డబ్బులు వసూలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అతనికి రాష్ట్ర స్థాయిలో విద్యుత్‌శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు ఒకరు బంధువు కావడంతో అవినీతికి పాల్పడినా తనను ఏమి చేయారనే ధీమాతో ఉండేవారు. విజయనగరం, డెంకాడ మండలాల్లో పనిచేసినప్పడు అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా, ఎవరూ ఫిర్యాదుచేయలేదు. ఎట్టకేలకు మక్కువకు చెందిన రైతు ఏఈ అవినీతి దాహానికి తట్టుకోలేక ధైర్యంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆయన ఏసీబీ అధికారుల కళ్లుగప్పి పరారుకావడం ఆ శాఖ అధికారులను విస్మయం కలిగిస్తోంది. -
రూ 6 వేలు లంచం తీసుకుంటూ దొరికిన లైన్ ఇన్స్పెక్టర్
హైదరాబాద్: ఓ ఇంటికి ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను మార్చేందుకు రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఓ ఎలక్ట్రికల్ లైన్ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంఘటన బుధవారం తార్నాకలో చోటు చేసుకుంది. లాలాగూడలోని టీఎస్పీఎస్సీడీసీల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జి.వెంకటేశ్వర్లుకు లాలాగూడ ప్రాంతంలో మహ్మద్ షాహిద్ అలీ తన ఇంటికి ఉన్న కమర్షియల్ విద్యుత్ కనెక్షన్‌ను డొమెస్టిక్ కేటగిరిగా మార్చాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ దరఖాస్తును కొన్నిరోజుల నుంచి వెంకటేశ్వర్లు పెండింగ్‌లో పెట్టాడు. దీనిపై షాహిద్ అలీ ప్రశ్నించగా రూ.ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు ఆరు వేల రూపాలను బుధవారం కార్యాలయంలో అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లును అరెస్టు చేసి ఏసీబీ అడిషినల్ స్పెషల్ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు. -
‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్‌ను కలవరపెడుతున్న తాజా నివేదికలు!
టిబెట్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు (ఎల్‌ఎసి) సమీపంలో గల యార్లంగ్-త్సాంగ్పో నది (భారతదేశంలో దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు) దిగువ ప్రాంతాలపై ‘సూపర్’ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా తన ప్రణాళికలను కొనసాగిస్తున్నదంటూ మరోమారు నివేదికలు వెలువడ్డాయి. భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా.. ప్రముఖ భౌగోళికరాజకీయ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ నిక్కీ ఇటీవల..చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను రహస్యంగా నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. కాగా చైనా రూపకల్పనలోని ఈ మెగా ప్రాజెక్ట్ 60 గిగావాట్ల సామర్థ్యం కలిగి భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా ఉంది. కాగా చైనా చేపడుతున్న ఈ ఆనకట్ట నిర్మాణ కార్యకలాపాల నివేదికలు మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల స్థాయిని, భౌగోళిక పరిధిని చైనా ఎప్పుడూ వెల్లడించనందున అవి రహస్యంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నదిపై.. బ్రహ్మపుత్ర నది కైలాష్ పర్వతం సమీపంలోని అంగ్సీ హిమానీనదంపై ఉద్భవించింది. 3,969-కిలోమీటర్ల పరిధి కలిగివుంది. దీని ఉపనది యార్లంగ్-త్సాంగ్పో వైవిధ్యమైన వాతావరణ, జలసంబంధమైన మండలాలను కలిగి ఉన్న ఒక ప్రధాన నదీ వ్యవస్థగా అలరారుతోంది. ఇది టిబెట్ అటానమస్ రీజియన్ (టీఏఆర్) నుంచి విభిన్న ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో బ్రహ్మపుత్రగా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చివరకు బంగ్లాదేశ్‌లో డెల్టాను ఏర్పరుస్తుంది. తూర్పు దిశలో అనేక ఉపనదులను తనలో కలుపుకున్న తరువాత నది ఈశాన్యం వైపుకు మారుతుంది. హిమాలయాల తూర్పు చివర పర్వత ప్రాంతాల మధ్య పెద్ద ఇరుకైన మార్గం గుండా వెళ్లి తిరిగి చైనాను దాటుతుంది. భారత వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కు ఇరువైపులా 5,000 మీటర్ల పరిధిలో విస్తరించి భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు లోతైన గార్జ్ (యార్లంగ్ త్సాంగ్పో గ్రాండ్ కాన్యన్) ఏర్పడుతుంది. నీటి విడుదల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నది (సెకనుకు 19,825 క్యూబిక్ అడుగులు). ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ.. ‘ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం’ యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర వద్ద నది భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఉన్న ప్రదేశంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా యోచిస్తోందని సమాచారం. నవంబర్ 2020లో ఆనకట్ట గురించిన నివేదికలు వెలువడినప్పుడు చైనీస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్.. ‘చైనా యార్లంగ్-త్సాంగ్పో నదిపై ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇది ఆసియాలోని ప్రధాన జలాల్లో ఒకటి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ గుండా కూడా వెళుతుంది’ అని పేర్కొంది. కాగా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఛైర్మన్.. ‘చరిత్రలో దీనికి సమానమైనది లేదు. ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం. ఈ ఆనకట్ట 300 బిలియన్ల ఆదాయాన్ని అందించగలదని’ ప్రకటించారు. బీజింగ్ రూపొందించిన స్వచ్ఛమైన శక్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన రిపోర్టులు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. నీటి దోపిడీలో నిమగ్నమైన చైనా చైనా తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను నివారించేందుకు ఈ నదిని ఉత్తరం వైపు మళ్లించే అవకాశం కూడా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారతదేశానికి పలు చిక్కులు తలెత్తనున్నాయి. పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం తగ్గుతుందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. చైనా పలు ప్రధాన నదుల నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 డ్యామ్‌ల ప్రణాళికలను కలిగి ఉందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ తెలిపారు. టిబెటన్ పీఠభూమి నుండి ప్రవహించే అన్ని ప్రధాన నదులపై బహుళ డ్యామ్‌లను నిర్మింపజేస్తూ నీటి దోపిడీలో చైనా నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా యార్లంగ్-త్సాంగ్పో నదిపై పలు ప్రాంతాల్లో చైనా చిన్న డ్యామ్‌లను నిర్మించడం ప్రారంభించింది. ఇప్పుడు అతిపెద్ద ఆనకట్టలను నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తూ.. ఈ ఏడాది జనవరిలో జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పలు ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి, టిబెట్‌లోని మబ్జా జాంగ్బో (త్సాంగ్పో) నదిపై భారత్-నేపాలీ-చైనీస్ సరిహద్దు ట్రైజంక్షన్‌కు ఉత్తరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్యామ్ నిర్మిస్తున్నట్లు ధృవీకరించారు. ఇది ఆనకట్ట నిర్మాణ కార్యకలాపానికి సంబంధం లేనప్పటికీ, ఇది హిమాలయ సరిహద్దులోని పలు విభాగాలలో కొనసాగుతున్న అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తున్నదన్నారు. యూఎన్ కన్వెన్షన్ ఆన్ నాన్-నేవిగేషనల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్‌కోర్స్ ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ నదిలో జోక్యానికి వీటో అవకాశం కల్పించలేదు. చైనా ధోరణిపై భారత్ అప్రమత్తం 2002లో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం చైనా.. యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర జలసంబంధ సమాచారాన్ని మే, అక్టోబర్ మధ్య భారత్‌తో పంచుకోవాలి. తద్వారా వర్షాకాలంలో భారీ ప్రవాహం తలెత్తినప్పుడు భారతదేశం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే 2017 డోక్లామ్ సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత చైనా నది నీటి ప్రవాహ స్థాయిలను భారత్‌తో కమ్యూనికేట్ చేయడాన్ని అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నేపధ్యంలో చైనా ధోరణి విషయంలో భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతం యార్లంగ్-త్సాంగ్పో-బ్రహ్మపుత్ర మార్గంలో చైనా చేపడుతున్న ఆనకట్ట నిర్మాణం పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! -
ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు సక్సెస్
సాక్షి, హైదరాబాద్: జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో కొత్త విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల లభ్యత ఉండదు. మరోవైపు ఏటా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచుకోక తప్పని పరిస్థితి. కొత్తలైన్ల నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ల సరఫరా సామర్థ్యాన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం మార్గం. ఈ కోవలో చేపట్టిన 132 కేవీ నుంచి 220 కేవీకి ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు (అప్‌గ్రెడేషన్)కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ, ఎస్ఆర్పీసీ చైర్మన్ ప్రభాకర్‌రావు తెలిపారు. మహారాష్ట్రలోని పుణేలో శనివారం జరిగిన సదరన్ రీజియన్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయోగాత్మకంగా రెండు టవర్ల మధ్య ప్రస్తుత విద్యుత్ తీగల (కండక్టర్ల)ను తొలగించి వాటి స్థానంలో ‘హై టెంపరేచర్ లోసాగ్ కండక్టర్స్ (హెచ్‌టీఎల్‌ఎస్) తీగలను ఏర్పాటు చేయడంతో ఈ మేరకు విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో గచ్చిబౌలి నుంచి రామచంద్రాపురం వరకు 12 కి.మీ. పొడవునా 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ సామర్థ్యాన్ని 220 కేవీకి పెంచే ప్రాజెక్టును చేపట్టామన్నారు. అదనపు స్థలాలు అవసరం లేకుండానే హెచ్‌టీఎల్‌ఎస్ తీగలతో సరఫరా లైన్ల సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రభాకర్‌రావు వివరించారు. హెచ్‌టీఎల్‌ఎస్ తీగలు 210 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం తట్టుకొని అధిక సామర్థ్యంతో విద్యుత్‌ను ప్రసారం చేయగలుగుతాయి. సంప్రదాయ తీగలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కరిగిపోతాయి. ఎన్టీపీసీపై ఎస్ఆర్పీసీ అసంతృప్తి 2022 చివరిలోగా రామగుండంలోని 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేస్తామని ఆ సంస్థ చైర్మన్ హామీనిచ్చినా గడువులోగా పూర్తికాలేదని ప్రభాకర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు బయట నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని ఎస్ఆర్పీసీ చైర్మన్ హోదాలో ఆదేశించారు. -
కరెంటు తీగలపై కారు తాళాలు తీస్తూ వ్యక్తి దుర్మరణం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): విద్యుత్ తీగపై పడిన కారు తాళాన్ని తీస్తున్న వ్యక్తికి తీగలు తగలడంతో షాక్ కొట్టి ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన హాసన్ పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు... ఉదయగిరికి చెందిన మల్లప్ప ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నాడు. ఆయన ఇంటి రెండో అంతస్తులో ఉంటాడు. ఏమైందో కానీ ఆయన కారు తాళాలు ఇంటి ముందు వెళ్లే కరెంట్ తీగపై పడ్డాయి. ఇంట్లో చెత్తను ఊడ్చే ఇనుప కడ్డీతో తాళాలను తీసేందుకు యత్నించాడు. ఆ ఇనుప రాడ్ కరెంటు తీగలను తాకగానే పెద్ద మెరుపుతో కూడిన మంటలు వచ్చి షాక్ కొట్టింది. మల్లప్ప అక్కడికక్కడే మరణించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై బడావణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఇనుప కడ్డికీ కరెంట్ తగిలితే ప్రమాదమని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? అని ప్రజలు ఆశ్చర్యపోయారు. చదవండి: (బెంగళూరులో పెరిగిన సహజీవనం కల్చర్.. బాధితులంతా వారే) -
నీటి కష్టాల్లో కీవ్.. విద్యుత్ సరఫరా కేంద్రంపై రష్యా వైమానిక సేనల దాడులు
కీవ్: రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్ రాజధాని నగరం నీటి కష్టాల్లో మునిగిపోయింది. నీటి సరఫరాకు కీలకమైన విద్యుత్ సరఫరా కేంద్రంపై రష్యా వైమానిక సేనలు సోమవారం గగనతల దాడులను హఠాత్తుగా ఉధృతం చేశాయి. దీంతో నగరంలో చాలా ప్రాంతాల్లో నీటి రవాణా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. సోమవారం కీవ్ నగరంలో 80 శాతం వినియోగదారులకు నీటి సదుపాయం లేకుండాపోయిందని నగర మేయర్ విటలీ క్లిట్స్చోకో ఆందోళన వ్యక్తంచేశారు. కీవ్‌లో సోమవారం తెల్లవారుజాము నుంచే రష్యా దాడులతో పేలుళ్ల శబ్దాలు మార్మోగాయి. ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తూ చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా, రక్షణ, విదేశాంగ మంత్రులతో కలిసి కీవ్‌ను సందర్శిస్తున్న వేళ కీవ్‌పై బాంబు దాడులు జరగడం గమనార్హం. కీవ్ ఉత్తరప్రాంతంలో ఉక్రెయిన్, రష్యా సేనలు పరస్పర దాడులు చేసుకున్నాయి. డినిపర్ నది ఎడమవైపు తీరం దాడుల పొగతో నిండిపోయింది. కొన్ని చోట్ల రైళ్లకు విద్యుత్ సరఫరా ఆటంకాలు ఏర్పడ్డాయి. క్రిమియా ద్వీపకల్పంలో నల్ల సముద్రంలో తీర స్థావర నౌకలపై ఉక్రెయిన్ బాంబుదాడులు చేసిందని రష్యా ఆరోపిస్తుండగా, రష్యానే పేలుడుపదార్ధాలను సరిగా ‘నిర్వహించలేక’ పేలుళ్లకు కారణమైందని ఉక్రెయిన్ స్పష్టంచేసింది. నౌకలపై దాడులతో ఆగ్రహించిన రష్యా.. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతి ఒప్పందాన్ని తాజాగా రద్దుచేసుకుంది. దీంతో పలు దేశాలకు ధాన్యం సరఫరా స్తంభించి మళ్లీ ధరలు పెరిగే ప్రమాదం పొంచిఉంది. -
అరే ఏంది ఇది? రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలా?. వీడియో వైరల్
ఒక దేశంలో నడి రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు పెట్టారు. ఏదో ఒకటి రెండో కాదు ఏకంగా చాలావరకు విద్యుత్ స్తంభాలన్ని రోడ్డు మధ్యలోనే ఉన్నాయి. ఈ ఘటన పాకిస్తాన్లో ఒక జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని షామా జునేజో అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రహదారిపై కనిపిస్తున్న విద్యుత్ స్తంభాలను చూస్తే ఏదో ప్రమాదవశాత్తు ఏర్పాటు చేసినట్లు లేదు. ఎందుకంటే విద్యుత్ స్తంభాలన్ని అలానే సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులకు ఎంత ప్రమాదకరం అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదీ కూడా శీతకాలంలో మరింత ప్రమాదకరమని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ మాజీ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దర్ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ హయాంలో జరిగిందా అని వీడియోని పోస్ట్ చేసిన షామా జునేజో ప్రశ్నిస్తున్నారు. یہ کھمبے عثمان بوزدار کے دور میں لگے یا چوہدری پرویز اِلٰہی کے؟ pic.twitter.com/zxR52A3CW0 — Shama Junejo (@ShamaJunejo) October 4, 2022 (చదవండి: 11,602 లాలీపాప్‌లతో వెరైటీ రికార్డు.. కండిషన్స్ ఆప్లై!) -
గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి!
సాక్షి, ఆదిలాబాద్: గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా వారం ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకొనే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆగస్టు 31న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించడంతో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నవరాత్రులు సజావుగా జరిగేందుకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని గణేశ్ ఉత్సవ కమిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, విద్యుత్ అధికారులు పలు సూచనలు చేశారు. పోలీస్‌శాఖ సూచనలు.. ► గణేశ్ మండపాలను ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయరాదు. ►మండపాల వద్ద మద్యం సేవించరాదు. జూదం ఆడరాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు. ►మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ప్రతి రోజు వలంటీర్ల పేర్లను నమోదు చేసి సంతకం తీసుకోవాలి. ►మండపాలను గాలి, వానకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించాలి. రద్దీగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు ఏర్పా టు చేయాలి. వలంటీర్లు భక్తులను తనిఖీ చేశాకే మండపం వద్దకు పంపాలి. ►మండపంలోకి ఎలాంటి మండే పదార్థాలు లేదా పటాకులు ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూనెతో వెలిగించే దీపాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ►మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా వీడియో కెమెరాలు, సీసీటీటీలు ఏర్పాటు చేసుకోవాలి. ►రాత్రి వేళ మండపంలోకి పశువులు, కుక్కలు చొరబడకుండా అడ్డుగా కంచె ఏర్పాటు చేసుకోవాలి. ►ఆగస్టు 31న ఉదయం 6గంటల నుంచి సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై క్రాకర్లు కాల్చడం, పేల్చడం నిషేధం. ►సౌండ్ బాక్స్‌లను స్థానిక డీఎస్పీ అనుమతి లేకుండా ఉపయోగించరాదు. మండపం వద్ద ఒక బాక్స్ టైపు స్పీకర్ మండప ప్రాంగణంలో మాత్రమే ఇన్స్టాల్ చేయబడాలి. ►శబ్ధ స్థాయిలను అనుమతించదగిన ప రిమితుల్లోనే ఉంచాలి. భారత సర్వోన్న త న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్స్పీకర్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు. ►మండపాల వద్ద ఎలాంటి అసభ్యకరమైన పాటలు, ప్రకటనలు చేయకుండా భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలి. ►ఏదైన సమాచారం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి. విద్యుత్‌శాఖ సూచనలు.. ►వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. మండపాల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్ తీగలతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పూర్తిగా నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో షార్ట్ సర్క్యూట్లు, విద్యుత్ షాక్‌లు తగిలితే ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదముందంటున్నారు. ►మండపాల విద్యుద్దీకరణ పనులు లైసెన్స్డ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ ద్వారా మాత్రమే చేపట్టాలి. ►విద్యుత్ సరఫరా కోసం ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్‌గా అమర్చుకోవాలి. లైన్ల నుంచి వచ్చే వైర్ల నుంచి మండపానికి సరఫరా అయ్యే చోట ఈ బ్రేకర్‌ను అమర్చుకోవాలి. ►మండపానికి విద్యుత్ అందించే వైర్లు 2.5 చదరపు మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండరాదు. ► ప్రతి సర్క్యూట్‌పై 800 వాట్ల కంటే అధిక లోడ్ వేయరాదు. ►వరుస విద్యుద్దీపాల కోసం సిల్క్‌వైర్లను వాడడం మంచిదికాదు. దీని వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదముంటుంది. ►ప్రతి సర్క్యూట్‌కు ప్రత్యేకించి న్యూట్రల్ ఎర్త్‌వైర్‌ను తీసుకోవాలి. ►మండపాల వద్ద ఎర్తింగ్ గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. 25 ఎంఎం డయామీటర్, 3 మీటర్ల లోతైన గుంత తీసి ఎర్తింగ్ పైప్‌ను అమర్చుకోవాలి. ►మండపాల్లో విద్యుత్ ఎలక్ట్రిక్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను వాడరాదు. ►ప్రతి మండపం వద్ద 5 కేజీల కార్బన్డయాక్సైడ్ నిండి ఉన్న అగ్నిమాపక సిలిండర్లను అమర్చుకోవాలి. 2 బకెట్లలో ఇసుకను నింపి పెట్టుకోవడం మంచిది. -
నిరంతర విద్యుత్ సరఫరాలో రాజీ లేదు..
సాక్షి, అమరావతి : సీజన్ ఏదైనా ఏడాది పొడవునా నిర్విరామంగా వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, ఈ విషయంలో రాజీ లేదని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. బొగ్గు కొరత కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి 9 గంటలు పగటి పూట విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై విద్యుత్ అధికారులతో మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై నుంచి అక్టోబర్ వరకూ ఆ నాలుగు నెలల్లో విద్యుత్ కొరత రాకుండా ప్రతి రోజూ 500 మెగావాట్ల నుంచి 1500 మెగావాట్ల వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీసుకున్న ముందస్తు చర్యలను మంత్రి అభినందించారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఇంటికి కూడా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఈ ఏడాది వేసవిలో బహిరంగ మార్కెట్లో ధరలు అధికంగా ఉన్నా విద్యుత్ కొనుగోలుకు వెనకాడలేదని గుర్తుచేశారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న నెలల్లో కూడా కొంటామన్నారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ పృథ్వీతేజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊసులాడే ఫంగస్‌లు
లండన్: భూమి మీద పుట్టిన దాదాపు ప్రతి జీవి ఏదో రూపంలో సాటి జీవులతో సమాచార ప్రసారం చేస్తుంటాయి. మనిషి మాటల ద్వారా భావాన్ని ప్రసారం చేస్తే, జంతువులు పలు శబ్దాల ద్వారా, కదలికల ద్వారా చేస్తుంటాయి. వృక్షాలు రసాయన సంకేతాలతో సంభాషించుకుంటాయి. మరి జీవ పటంలో ఇంకా దిగువకు వెళ్లే కనిపించే శిలీంద్రాల సంగతేంటి? పుట్టగొడుగుల్లాంటి శిలీంద్రాలన్నీ మొద్దబ్బాయిల్లాంటివేనా? లేదా మనకు తెలీని రూపంలో వీటిలో సమాచార ప్రసారం జరుగుతుందా? వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్టు అండ్రూ అడమట్జీ్క చేపట్టిన నూతన పరిశోధన ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తోంది. శిలీంద్రాలు వాటికే సొంతమైన ఎలక్ట్రికల్ భాషలో ఊసులాడుకుంటాయని పరిశోధన సూచిస్తోంది. పుట్టగొడుగులు ఇరుగుపొరుగుతో సంభాషించేందుకు వాక్యాలను కూడా వాడతాయని పేర్కొంది. ప్రతి బహుకణ జీవిలో కూడా సమాచార ప్రసారానికి నాడులు కారణం. ఇవి విడుదల చేసే ఎలక్ట్రిక్ తరంగాల ఆధారంగానే జీవజాలంలో ప్రసారం సాధ్యమవుతోంది. ఫంగస్‌లో కూడా ఇలాంటి నాడులుంటాయి. వీటిని హైఫే అంటారు. ఒక ఫంగల్ కాలనీలోని జీవులన్నింటి హైఫేలన్నీ కలిసి భూమి ఉపరితలం దిగువన ఒక వలలాంటి నిర్మాణం (మైసీలియం)ను ఏర్పాటు చేస్తాయి. ఈ వల ద్వారా మొత్తం కాలనీకి సమాచారం అందుతుంది. ఈ నెట్‌వర్క్‌ను జీవుల్లోని నాడీ వ్యవస్థతో పోల్చవచ్చు. ఇలా కనుగొన్నారు చిన్న చిన్న ఎలక్ట్రోడులను ఉపయోగించి నాలుగు ప్రజాతుల ఫంగస్ మైసీలియంలు విడుదల చేసే విద్యుత్ ప్రేరణలను ఆండ్రూ రికార్డు చేశారు. వీటిని పరిశీలిస్తే ప్రతి ప్రేరణ తరంగధైర్ఘ్యం, తరచుదనం, కాలపరిమితి వేరేగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రేరణల నమూనాలను గణిత సూత్రాల ఆధారంగా విశ్లేషిస్తే అవి మానవ ప్రసంగ నమూనా(ప్యాటర్న్)తో పోలినట్లు గుర్తించారు. ఫంగస్ల భాషలో దాదాపు 50 వరకు పదాలు వివిధ వాక్యాల రూపంలో పేర్చడం గమనించినట్లు ఆండ్రూ చెప్పారు. ఒక్కో ఫంగస్ ప్రజాతిలో ఒక్కో రకమైన భాష వాడుకలో ఉందని, షైజోఫైలమ్ కమ్యూనే అనే ప్రజాతి అత్యంత క్లిష్టమైన భాషను వాడుతోందని తెలిపారు. దగ్గరలోని ఆహార లభ్యత, ప్రమాద హెచ్చరికలు, నష్టం కలిగించే అంశాల గురించి ఇవి మాట్లాడుకుంటాయని అంచనా వేశారు. ఫంగస్‌లు భూమిలోపల అంతర్గత నెట్‌వర్క్‌తో సమాచార ప్రసారం చేస్తాయని గతంలోనే అంచనాలున్నాయి. తాజా పరిశోధనతో ఈ సమాచార ప్రసారం ఆషామాషీగా జరగదని, మానవుల్లో జరిగినంత పకడ్బందీగా జరుగుతుందని తెలిసింది. ఫంగస్ల తెలివితేటలు, చేతనపై మరిన్ని పరిశోధనలకు తాజా సమాచారం ఉపయోగపడనుంది. సో, ఇకపై పుట్టగొడుగులు తినేముందు అవి ఏం చెబుతున్నాయో తెలుసుకోండి! -
ఇక అన్నీ కరెంటు ఇంజన్లే..
సాక్షి, హైదరాబాద్: త్వరలో రైళ్ల డీజిల్ ఇంజిన్లు కనుమరుగుకాబోతున్నాయి. వాటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజిన్లే రానున్నాయి. ఈమేరకు అన్ని రైల్వే లైన్లను విద్యుదీకరించే పనులను కేంద్రం వేగవంతం చేసింది. గత ఏడాది కాలంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 770 కి.మీ. మేర విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఇది జోన్ ఆల్‌టైం రికార్డు. అదీగాక ఇంత విస్తృతంగా మరే జోన్లో పనులు జరగలేదు. ఇందులో తెలంగాణ పరిధిలో 326 కి.మీ. ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కావటం విశేషం. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి జోన్ యావత్తు విద్యుదీకరణ పూర్తి చేయాలని రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు పూర్తయితే 20 నెలల్లో అన్నిలైన్లలో విద్యుత్ లోకోమోటివ్‌లే నడనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1,850 కి.మీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ భూభాగం పూర్తిగా ఉంటుంది. రాష్ట్రం పరిధిలో 1,850 కి.మీ. మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి లాంటి కొత్త ప్రాజెక్టుల పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు నిడివి ఇందులో కలపలేదు. గత ఏడాది పూర్తయిన 326 కి.మీ. కలుపుకొంటే ఇప్పటివరకు 1450 కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇక 400 కి.మీ.మేర మాత్రమే పనులు జరగాల్సి ఉంది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో త్వరలో వందశాతం విద్యుదీకరణ పూర్తవుతుందని జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. డీజిల్ ఇంజిన్‌తో భారీ వ్యయం ఖర్చు పరంగా చూస్తే డీజిల్ ఇంజిన్‌తో రైల్వేకు భారీగా వ్యయమవుతోంది. ప్రతి వంద కిలోమీటర్ల ప్రయాణానికి డీజిల్ ఇంజిన్‌తో రూ.65 వేలు ఖర్చు అవుతుండగా, ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో రూ.45 వేలు అవుతోంది. అంటే ప్రతి వంద కి.మీ.కు ఎలక్ట్రిక్ వినియోగంతో రూ.20 వేలు ఆదా అవుతుంది. అదీగాక పొగరూపంలో కాలుష్యం కూడా ఉండదు. కన్వర్షన్‌పై దృష్టి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీకి రూ.18 కోట్లు అవుతుంది. అదే డీజిల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌గా కన్వర్ట్ చేసుకోవటం తక్కువ ఖర్చుతో కూడుకున్న ది. రూ.2కోట్లతో ఓ ఇంజిన్‌ను కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న డీజిల్ ఇంజిన్లు బాగా పాతబడి ఉన్నాయి. వచ్చే ఏడెనిమిదేళ్లలో అవి పనికిరాకుండా పోయే పరిస్థితి. వాటిని మెరు గుపరిస్తే మరో పదేళ్లు వాడే వీలుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఉన్న డీజిల్ ఇంజిన్లను కన్వ ర్ట్ చేయటం ద్వారా తక్కువ వ్యయంతో కరెంటు ఇంజిన్లను పట్టాలెక్కించాలని రైల్వే భావిస్తోంది. -
దేశంలో అక్కడ 36 గంటలు కరెంట్ కట్.. ఆందోళనలో ప్రజలు
ఛండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం ఛండీగఢ్‌లోని ప్రజలు 36 గంటల పాటు అంధకారంతో మగ్గిపోయారు. కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిపిపోవడంతో నీటి సరఫరా, వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఎలక్ట్రిసిటీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఛండీగఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో ఛండీగఢ్‌లోని చాలా ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ లైట్లు వెలగలేదు. ఆన్లైన్ క్లాసులకు, ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఆసుపత్రుల్లో వైద్య సేవలను జనరేటర్ సాయంతో అందించినప్పటికీ కొన్ని శస్త్ర చికిత్సలను మాత్రం వాయిదా వేసినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, 36 గంటల పాటు కరెంట్ లేకపోవడంతో సెల్ ఫోన్లలో ఛార్జింగ్ లేక ప్రజలు పక్క నగరాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు క్యూ కట్టారు. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఛండీగఢ్ పాలనా యంత్రాంగం రంగంలోకి దిగింది. విద్యుత్ విభాగంలోని ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆరు నెలల పాటు సమ్మెలు చేయకుండా నిషేధం విధించింది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినప్పటికీ ఉద్యోగులు మాత్రం సమ్మె విరమించకపోవడం గమనార్హం. సిబ్బంది ఇప్పటికీ విధులకు హాజరు కాకపోవడంతో బుధవారం కూడా పలు ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, పంజాబ్, హర్యానా హైకోర్టు ‘విద్యుత్ సంక్షోభం’పై సుమోటో నోటీసును స్వీకరించింది. కేంద్రపాలిత ప్రాంత చీఫ్ ఇంజనీర్‌ను బుధవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. -
విద్యుత్ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
దక్షిణాదిన ఓరియంట్ ఎలక్ట్రిక్ ప్లాంటు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఓరియంట్ ఎలక్ట్రిక్ దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అయిదు ప్లాంట్లలో వినియోగం పూర్తి స్థాయికి చేరుకున్నందున కొత్త ఫెసిలిటీ అవసరమని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ జైన్ వెల్లడించారు. ఎలిగంజా సిరీస్ ఉత్పత్తులను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపాదిత ప్లాంటును ఎక్కడ, ఎంత మొత్తంతో ఏర్పాటు చేసేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ కేంద్రంలో ఫ్యాన్లతోపాటు ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తామన్నారు. కాగా, ఎలిగంజా సిరీస్‌లో ఫ్యాన్‌తో కూడిన షాండెలియర్స్‌ను ఆవిష్కరించారు. ధరల శ్రేణి రూ.17,500–23,500 మధ్య ఉంది. ప్రీమియం ఫ్యాన్ల విపణిలో ఓరియంట్కు 50 శాతం మార్కెట్ వాటా ఉందని కంపెనీ బ్రాండ్ హెడ్ అన్షుమన్ చక్రవర్తి తెలిపారు. ఓరియంట్ ఎలక్ట్రిక్ 2018–19లో సుమారు రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో 20 శాతం వృద్ధి నమోదు చేసింది. -
రథయాత్రలో తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, విజయనగరం : జిల్లాలోని పార్వతీపురంలో గురువారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఘోర ప్రమాదం తప్పింది. ఊరేగింపులో రథం వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం కూలిపోవడంతో భక్తులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. అధికారులు సకాలంలో స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
సమ్మె బాటలో మీటర్ రీడర్లు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ మీటర్ రీడర్లు ఆదివారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 1.45 కోట్లకుపైగా విద్యుత్ కనెక్షన్లుండగా, అందులో ఓ ఐదు లక్షల కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను సంస్థ రెగ్యులర్ ఉద్యోగులైన లైన్మన్లు, సహాయ లైన్మన్లు జారీ చేస్తున్నారు. మిగిలిన 1.4 కోట్ల కనెక్షన్లకు సంబంధించిన విద్యుత్ బిల్లుల జారీ బాధ్యతను డిస్కంలు ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాయి. ఈ కాంట్రాక్టర్ల వద్ద దాదాపు 1,450 మంది మీటర్ రీడర్లు ‘పీస్ రేటు’ విధానంలో పనిచేస్తున్నారు. అంటే, ఒక్కో బిల్లుకు ఇంత రేటు అని కాంట్రాక్టర్లు వీరికి జీతాలు చెల్లిస్తున్నారు. ఒక్కో బిల్లు జారీ చేసేందుకు డిస్కంలు కాంట్రాక్టర్లకు రూ.3 చెల్లిస్తుండగా, కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు 90 పైసల నుంచి రూ.1.50 వరకు చెల్లిస్తున్నారు. సుదూర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి బిల్లులు జారీ చేయాల్సివస్తే రూ.2 వరకు చెల్లిస్తున్నారు. అవసరాన్ని బట్టి మీటర్ రీడర్ల సేవలను నెలలో 12, 15, 19 రోజులు మాత్రమే వినియోగించుకుంటున్నారు. మిగిలిన రోజుల్లో వీరికి పని ఉండదు. నెలకు రూ.4 వేల నుంచి రూ.7 వేలు మాత్రమే సంపాదన లభిస్తోందని మీటర్ రీడర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. అందుకే పీసు రేటు విధానం రద్దు చేసి తమకు నెలకు 30 రోజుల పనిదినాలు కల్పించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నెలకు రూ.18 వేల కనీస వేతనం వర్తింపజేయాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మెకు దిగినట్లు తెలిపారు. ఒక్కో బిల్లుకు రూ.3 చొప్పున, 1.4 కోట్ల కనెక్షన్లకు బిల్లుల జారీ కోసం డిస్కంలు కాంట్రాక్టర్లకు ప్రతి నెలా రూ.4.2 కోట్లకు పైగా చెల్లిస్తున్నాయన్నారు. ఒక్కో మీటర్ రీడర్‌కు డిస్కంలు నేరుగా రూ.18 వేలు జీతం చెల్లిస్తే, 1,450 మందికి కేవలం రూ. 2.61 కోట్ల జీతాలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతో డిస్కంలతోపాటు కార్మికులు సైతం లాభపడతారన్నారు. కాంట్రాక్టర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు డిస్కంలు నేరుగా జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. నెలలోని 12/15/19 రోజులు బిల్లుల జారీకి పనిచేస్తామని, మిగిలిన రోజుల్లో తమ సేవలను ఇతర పనులకు వాడుకోవాలన్నారు. నెలలో సగానికి పైగా కాలాన్ని మీటర్ రీడింగ్‌కు వెచ్చిస్తుండడంతో మిగిలిన రోజుల్లో తమకు వేరే పనులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వారిని నియమించండి మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్తవారిని నియమించి బిల్లుల జారీ ప్రక్రియకు ఇబ్బంది లేకుండా చూడాలని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీ ఎ.గోపాల్‌రావు ఆదేశించారు. సమ్మెకు దిగిన వారి స్థానంలో కొత్తవారిని నియమించేలా కాంట్రాక్టర్లను కోరాలని సంస్థ పరిధిలోని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. -
కరెంట్ కోసం రోడ్డెక్కిన తుపాను బాధితులు
-
బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి నిలిపివేత
నెల్లూరు(ముత్తుకూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్కో విద్యుత్ ప్రాజెక్టులో బొగ్గు కొరత వల్ల రెండో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపేసినట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు ఆదివారం తెలిపారు. ఒకటో యూనిట్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 35 వేల టన్నుల మేరకే బొగ్గు నిల్వలున్నాయని తెలిపారు. రెండో యూనిట్‌కు కోల్ ఇండియా నుంచి బొగ్గు మంజూరు కాలేదని చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని, పదిరోజుల్లో రెండో యూనిట్‌కు బొగ్గు మంజూరయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.