రథయాత్రలో తప్పిన ఘోర ప్రమాదం | A Fatal Accident Missed on a Chariot Trip | Sakshi
Sakshi News home page

రథయాత్రలో తప్పిన ఘోర ప్రమాదం

Published Thu, Jul 4 2019 7:16 PM | Last Updated on Thu, Jul 4 2019 7:17 PM

A Fatal Accident Missed on a Chariot Trip - Sakshi

సాక్షి, విజయనగరం : జిల్లాలోని పార్వతీపురంలో గురువారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఘోర ప్రమాదం తప్పింది. ఊరేగింపులో రథం వెళ్లి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం కూలిపోవడంతో భక్తులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. అధికారులు సకాలంలో స్పందించి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement