ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న కరెన్సీ నోట్లు
హైదరాబాద్: ఓ ఇంటికి ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను మార్చేందుకు రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఓ ఎలక్ట్రికల్ లైన్‌ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంఘటన బుధవారం తార్నాకలో చోటు చేసుకుంది. లాలాగూడలోని టీఎస్‌పీఎస్సీడీసీల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.వెంకటేశ్వర్లుకు లాలాగూడ ప్రాంతంలో మహ్మద్ షాహిద్ అలీ తన ఇంటికి ఉన్న కమర్షియల్ విద్యుత్ కనెక్షన్‌ను డొమెస్టిక్ కేటగిరిగా మార్చాలని దరఖాస్తు పెట్టుకున్నాడు.
ఆ దరఖాస్తును కొన్నిరోజుల నుంచి వెంకటేశ్వర్లు పెండింగ్‌లో పెట్టాడు. దీనిపై షాహిద్ అలీ ప్రశ్నించగా రూ.ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారి సూచన మేరకు ఆరు వేల రూపాలను బుధవారం కార్యాలయంలో అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. లైన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లును అరెస్టు చేసి ఏసీబీ అడిషినల్ స్పెషల్ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment