inspector
-
Abids CI: అడ్డు తొలగించుకునేందుకే అసత్య ప్రచారం
శాలిగౌరారం(నల్గొండ) : అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, తనను ఇంటిలో నుంచి బయటకు వెళ్లగొట్టి, మరో మహిళతో సహజీవనం చేస్తూ.. తన అడ్డు తొలగించుకునేందుకు అసత్య ప్రచారం చేస్తున్న తనభర్త అయిన హైదరాబాద్‌లోని ఆబిడ్స్ సీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) కుంభం నర్సింహపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఐ భార్య కుంభం సంధ్య కోరారు. మండలంలోని బండమీదిగూడెంలో తన తల్లిగారింటి వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తనగోడును వెల్లబోసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన కుంభం నర్సింహతో తనకు 2012 ఏప్రిల్ 18న వివాహం జరిగిందన్నారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.18.50 లక్షలు ఇవ్వడంతోపాటూ పది తులాల బంగారు ఆభరణాలను పెట్టారన్నారు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టడంతో గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు పెట్టి అదనంగా మరో రూ. 2 లక్షలు అప్పజెప్పారన్నారు. అంతటితో ఆగకుండా తన తల్లిదండ్రుల వ్యవసాయ భూమిలో భాగం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారన్నారు. ప్రస్తుతం తమకు కుమార్తె(10), కుమారుడు(05) ఉన్నారన్నారు. తన భర్త వేధింపులు తట్టుకోలేక తన ఇద్దరు పిల్లలతో తన తల్లిగారింటి వద్ద ఉండడంతో తనపై పిల్లల కిడ్నాప్ కేసు పెట్టారని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న తనభర్త సీఐ కుంభం నర్సింహపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సీఐ నర్సింహను ఫోన్లో వివరణ కోరగా.. తన భార్యతో గొడవలు జరుగుతున్న విషయం వాస్తవమేనన్నారు. విడాకుల కోసం తాను కోర్టును ఆశ్రయించానని, కేసు కోర్టులో ఉండడంతో కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఈ విషయంపై మాట్లాడతానన్నారు. -
కేసు మూసేసినా ధన దాహం తీరలేదు!
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యగా తేలిన మిస్సింగ్ కేసులో అనుమానితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో షాహినాయత్‌గంజ్ ఠాణా మాజీ ఇన్స్పెక్టర్ బాలు చౌహాన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ కేసు క్లోజ్ అయినా ధనదాహం తీరని ఇన్స్పెక్టర్ వేధించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం కొసమెరుపు. షాహినాయత్‌గంజ్ ఠాణా పరిధిలో నివసించే ఓ వ్యక్తి అప్పుల బాధతో గత నెల 5న అదృశ్యమయ్యాడు. దీనిపై గత నెల 7న కుటుంబీకుల ఫిర్యాదుతో షాహినాయత్‌గంజ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు కొలిక్కిరాకుండానే గత నెల 11న అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆ వ్యక్తి మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. అప్పు ఇచి్చన వారి వేధింపుల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో నమోదైన కేసులు షాహినాయత్‌గంజ్ ఠాణాకు బదిలీ చేయించుకుంటారు. అయితే బాలు చౌహాన్ మాత్రం ఆ కేసును అక్కడే ఉంచి.. ఇక్కడ నమోదైన మిస్సింగ్ కేసును గత నెల 19న క్లోజ్ చేశారు. ఆ కేసులో అనుమానితులుగా ఉన్న అప్పు ఇచ్చిన వ్యక్తులను పిలిచి నిందితులుగా చేరుస్తానంటూ బెదిరించాడు. ఓ వ్యక్తిని మాత్రం తీవ్రంగా హెచ్చరించిన బాలు చౌహాన్ అలా కాకుండా ఉండాలంటే తనకు రూ.1.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నెల 23, 24 తేదీల్లో చౌహాన్ వేధింపులు ఎక్కువ కావడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు ఇన్స్పెక్టర్ను కలిసి, అతడితో రూ.50 వేలకు బేరసారాలు చేసి, ఆ మొత్తం తతంగాన్ని ఆడియో రికార్డు చేశాడు. ఈ సాక్ష్యాన్ని ఏసీబీ అధికారులకు అందించాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు ఉన్నతాధికారులు బాలు చౌహాన్‌పై ఈ నెల 3న బదిలీ వేటు వేశారు. దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి ఏసీబీ అధికారులు శుక్రవారం అతడిని అరెస్టు చేశారు. -
ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, నిఖిల్ మృతి.. చెరువు వద్ద ఏం జరిగింది?
కామారెడ్డి క్రైం: భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. వీరంతా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఎస్ఐ మృతదేహాన్ని వెలికితీశారు. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది. బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది బయటకు వెళ్లడి కావడం లేదు. -
నాగోలు పీఎస్ ఎస్ఐ, ఏఎస్ఐ సస్పెన్షన్
నాగోలు: నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత యువకుడిపై దాడి ఘటనలో కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ బదిలీ వేటు వేశారు. దీనిలో భాగంగానే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యలను కూడా సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి చర్యలు తీసుకున్నారు. ఎల్బీనగర్లోని భరత్‌నగర్ కాలనీ చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు ప్రైవేట్ ఉద్యోగి. ఇతనికి నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్, అతని కుమారుడు (16) మైనర్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గౌతమ్ పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. దీంతో తనపై జరిగిన దాడి ఘటన గురించి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. -
యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం..
నాగోలు: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోసి బదిలీ వేటు వేశారు. ఇదే కేసులో నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యపై అధికారులు చర్య తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. నాగోలు ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా ఎల్బీనగర్ డీఐ సుధాకర్‌ను నియమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్బీనగర్లోని భరత్‌నగర్ కాలనీకి చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు (20) ప్రైవేట్ ఉద్యోగి. నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్ అతని కుమారుడు (16), గౌతమ్‌ల మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న నాగోలు సాయినగర్ కాలనీలో స్నేహితుడి ఇంట్లో నిద్రస్తున్న గౌతమ్‌పై మల్లేష్, నరేష్ అనిల్, జ్యోతి, నాగరాజు, పవన్‌కుమార్, మరో ఇద్దరు మైనర్లు దాడి చేశారు. భవనం పైఅంతస్తు నుంచి కిందకు లాక్కు వచ్చి రాయి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో గౌతమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గౌతమ్ మృతి చెందినట్లు భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం గాయపడిన గౌతమ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. బాధితుడు గౌతమ్ తనపై జరిగిన దాడిపై ఈ నెల 21న నాగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ.. ఇన్స్పెక్టర్ పరశురాం స్పందించలేదు. దీంతో బాధితుడు తగిన ఆధారాలతో ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 22న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు జువైనల్ అఫెండర్లను హోంకు తరలించారు.ఉప్పల్ ఎస్ఐపై కూడా.. ఉప్పల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, పోకరీలతో అంటకాగుతున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎస్ఐ సీహెచ్ శంకర్‌పై రాచకొండ సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్రేమ జంట ఇచి్చన ఫిర్యాదుపై ఉప్పల్ ఎస్ఐ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించాడని, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు శనివారం ఉప్పల్ ఎస్ఐ శంకర్‌పై విచారణకు ఆదేశించి, ఆదివారం శంకర్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐతో పాటు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా డీఐ మన్మథరావును నియమించారు. -
యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం..
సాక్షి, హైదరాబాద్: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోసి బదిలీ వేటు వేశారు. ఇదే కేసులో నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యపై అధికారులు చర్య తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. నాగోలు ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా ఎల్బీనగర్ డీఐ సుధాకర్‌ను నియమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్బీనగర్లోని భరత్‌నగర్ కాలనీకి చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు (20) ప్రైవేట్ ఉద్యోగి. నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేశ్, అతని కుమారుడు (16), గౌతమ్‌ల మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న నాగోలు సాయినగర్ కాలనీలో స్నేహితుడి ఇంట్లో నిద్రస్తున్న గౌతమ్‌పై మల్లే‹Ù, నరే‹Ù, అనిల్, జ్యోతి, నాగరాజు, పవన్‌కుమార్, మరో ఇద్దరు మైనర్లు దాడి చేశారు. భవనం పైఅంతస్తు నుంచి కిందకు లాక్కు వచ్చి రాయి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో గౌతమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గౌతమ్ మృతి చెందినట్లు భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లి పోయారు.అనంతరం గాయపడిన గౌతమ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో చేరి్పంచారు. బాధితుడు గౌతమ్ తనపై జరిగిన దాడిపై ఈ నెల 21న నాగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ.. ఇన్స్పెక్టర్ పరశురాం స్పందించలేదు. దీంతో బాధితుడు తగిన ఆధారాలతో ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 22న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు జువైనల్ అఫెండర్లను హోంకు తరలించారు. ఉప్పల్ ఎస్ఐపై కూడా.. ఉప్పల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, పోకరీలతో అంటకాగుతున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎస్ఐ సీహెచ్ శంకర్‌పై రాచకొండ సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్రేమ జంట ఇచ్చి న ఫిర్యాదుపై ఉప్పల్ ఎస్ఐ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించాడని, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు శనివారం ఉప్పల్ ఎస్ఐ శంకర్‌పై విచారణకు ఆదేశించి, ఆదివారం శంకర్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐతో పాటు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా డీఐ మన్మథరావును నియమించారు. -
ఓటీటీల్లో ఒక్క రోజే పది సినిమాలు.. ఆ రెండే కాస్తా స్పెషల్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. అసలే వేసవి సెలవుల కాలం. ఇక ఫ్యామీలీ అంతా సినిమా చూసేందుకు ఓటీటీలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ శుక్రవారం థియేటర్లలోనూ టిల్లు స్క్వేర్, కలియుగం పట్టణంలో లాంటి చిత్రాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయోనని సినీ ప్రియులు ఆరా తీస్తున్నారు. ఈ వీకెండ్లో టాలీవుడ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషితో పాటు అభినవ్ గోమటం నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయి రా స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ రెండు కాస్తా అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు ఆసక్తికర చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. మరి ఏయే సినిమా ఏ ఓటీటీల్లో వస్తుందో మీరు ఓ లుక్కేయండి. ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన సినిమాలివే.. అమెజాన్ ప్రైమ్ ఇన్స్పెక్టర్ రిషి (వెబ్ సిరీస్) - మార్చి 29 మస్తు షేడ్స్ ఉన్నాయి రా(టాలీవుడ్ సినిమా)- మార్చి 29 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పట్నా శుక్లా (హిందీ చిత్రం) - మార్చి 29 మధు (డాక్యుమెంటరీ) - మార్చి 29 రెనెగడె నెల్ల్ (వెబ్ సిరీస్) - మార్చి 29 ద బ్యూటిఫుల్ గేమ్ - మార్చి 29 నెట్‌ఫ్లిక్స్ ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) - మార్చి 29 హార్ట్ ఆఫ్ ది హంటర్ (హాలీవుడ్) - మార్చి 29 ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ) - మార్చి 30 బుక్ మై షో ది హోల్డోవర్స్ (హాలీవుడ్) - మార్చి 29 జియో సినిమా ఎ జెంటిల్మెన్ ఇన్ మాస్క్ (వెబ్ సిరీస్) - మార్చి 29 -
Suman Kumari: స్నైపర్ గురి
800 మీటర్ల దూరం.. అంటే ముప్పావు కిలోమీటరు నుంచి కూడా గురి తప్పకుండా కాల్చే రైఫిళ్లు స్నైపర్లు. వీటిని ఉపయోగించే వారిని కూడా స్నైపర్లు అనే అంటారు. ఇంతకాలం మగవాళ్లే స్నైపర్లుగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి అత్యంత కఠినమైన శిక్షణ పొంది మన దేశ తొలి మహిళా స్నైపర్‌గా అర్హతను పొందింది. 1984 ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో 1988లో ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ పేరుతో స్వర్ణదేవాలయంలో మిగిలి ఉన్న సిక్కు వేర్పాటువాదులను ఏరివేసే మిలటరీ చర్య జరిగింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సమయంలో ఇరువర్గాల్లోనూ ప్రాణనష్టం ఎక్కువ. కాని ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’లో మిలటరీ సిబ్బంది ప్రాణనష్టం జరక్కుండా సిక్కు వేర్పాటువాదులను అణిచివేయగలిగారు. దీనికి కారణం స్వర్ణ దేవాలయాన్ని మారణాయుధాలతో పై నుంచి కాపలాకాస్తున్న ఐదుగురు వేర్పాటువాదులను చాలా దూరం నుంచి కాల్చి చంపడం. మొదటిసారి ‘స్నైపర్స్’ ఉపయోగం వల్ల కలిగిన ప్రయోజనం అది. స్నైపర్ అంటే శత్రునిర్మూలన ఏదో సినిమాలో ‘నన్ను చూడాలంటే నీ జీవితం సగం తగలడిపోయి ఉండాలి’ అని బ్రహ్మానందం అంటాడు. స్నైపర్ రంగంలో దిగాడంటే శత్రువు జీవితం ముగింపు దశలో ఉందని అర్థం. స్నైపర్లు శత్రువును బంధించడానికి కాదు. నిర్మూలించడానికి. మనదేశంలో ముందు నుంచి కూడా అత్యాధునిక ఆయుధాల పట్ల కాకుండా సంప్రదాయ ఆయుధాల పట్ల మొగ్గు ఉండటం వల్ల స్నైపర్లను ఆదరించింది లేదు. కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకూ కూడా శత్రువును కాల్చి చంపగల స్నైపర్ రైఫిల్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలియడానికి ఆ కాలంలో మన మిటలరీ యోధులు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చేది. 1980లలోనే కొద్దిగా స్నైపర్స్ ఉపయోగం తెలిసింది. ఇటీవల సరిహద్దుల వెంబడి వివిధ దేశాల దాడులను ప్రతిఘటించడానికి స్నైపర్లు సమర్థంగా ఉపయోగపడుతున్నాయని వాటిని ఉపయోగించే నిపుణులను తయారు చేస్తున్నారు. మధ్యప్రదేశ్– మహౌలోని ‘ఇన్ఫాంట్రీ స్కూల్’లో, ‘ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్’ కేంద్రంలో స్నైపర్స్ శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకూ మగవాళ్లకే సాగిన ఈ శిక్షణ సుమన్ కుమారి వల్ల స్త్రీలకు కూడా ఇవ్వడం మొదలైంది. పంజాబ్‌లో చూసి హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021లో బి.ఎస్.ఎఫ్.లో ఇన్స్పెక్టర్ హోదాలో చేరింది. పంజాబ్‌లో ఆమెకు విధులు కేటాయించారు. అక్కడ ఉండగా సరిహద్దు దేశాల నుంచి శత్రువులు స్నైపర్లతో మనవారి మీద దాడులు చేయడం సుమన్ గమనించింది. మన వద్ద తగినంత మంది స్నైపర్లు లేరని కూడా అవగాహన చేసుకుంది. అంతే. తనకు తానే స్నైపర్‌గా శిక్షణ తీసుకునేందుకు అనుమతి అడిగింది. ‘సాధారణంగా స్నైపర్‌గా తీసుకునే శిక్షణ కఠినమైనది. మగవారే వెనకాడుతారు. శిక్షణలో సగం మంది వెనుతిరుగుతారు. కాని సుమన్ 8 వారాల పాటు శిక్షణను సమర్థంగా పూర్తి చేసింది. 56 మంది ఉన్న బ్యాచ్‌లో ఆమె మాత్రమే మహిళ. శిక్షణ బాగా పూర్తి చేసిన వారిని ‘ఆల్ఫా’ అని, ‘బ్రేవో’ అని నైపుణ్యాన్ని బట్టి విభజిస్తాం. కాని సుమన్ ప్రతిభ అంతకు మించింది. అందుకే ఆమెకు ఇన్స్ట్రక్టర్ హోదా ఇచ్చాం. దాని అర్థం ఆమె స్నైపర్ మాత్రమే కాదు స్నైపర్ శిక్షకురాలు కూడా’ అని ఒక మిలటరీ అధికారి తెలియచేశారు. ఎప్పుడెప్పుడు హైజాక్‌లు, కిడ్నాప్‌లు, టెర్రరిస్ట్ అటాక్‌లు, ముఖ్య నేతలను బందీలుగా పట్టుకోవడం, సరిహద్దులు దాటి శత్రువులు రావడం వంటి సందర్భాలలో స్నైపర్లు రంగంలో దిగుతారు. పరిసరాలకు తగినట్టుగా పై తొడుగులు (కామూఫ్లాజ్) ధరించి శత్రువుకు వీలైనంత దగ్గరగా వెళ్లి తూటాతో సమాధానం చెప్పడమే వీరు చేసేపని. సుమన్ సేవలు ఇకపై దేశానికి రక్షణ ఇస్తాయి. ‘నేను స్నైపర్ కావడం స్త్రీలకు స్ఫూర్తినిస్తుందనే అనుకుంటున్నాను. మిలటరీలోకి మరింతమంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను’ అందామె. -
ఆ కేసు కథ కంచికేనా?
సాక్షి, హైదరాబాద్: ఇతర కేసుల మాట ఎలా ఉన్నా.. అత్యాచారం ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులకు మాత్రం పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. బాధితురాలిని వెంటనే భరోసా సెంటర్‌కు పంపడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా తోడయ్యే వాటి విషయంలో మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటారు. అయితే బంజారాహిల్స్ ఠాణాలో ఇన్స్పెక్టర్గా పని చేసి, లంచం ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదై, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ అధికారి తీరు మాత్రం దీనికి భిన్నం. తన వద్దకు వచ్చిన బాధితురాలికి న్యాయం చేయడం మాట అటుంచి ‘పెద్దలైన’ నిందితులతో కలిసి ఆమెనే బెదిరించాడు. ఈ కారణంగానే దారుణమైన ఉదంతానికి సంబంధించిన ఈ కేసు నమోదు దాదాపు నాలుగు నెలలు ఆలస్యమైంది. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు కేసును సీసీఎస్‌కు బదిలీ చేయడంతో పాటు సదరు ఇన్స్పెక్టర్ను నిందితుడిగా చేర్చాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అప్పట్లోనే ఫిర్యాదు చేసిన బాధితురాలు... జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ ఛైర్మన్ మురళీ ముకుంద్, ఆయన కుమారుడు ఆకర్ష్ కృష్ణ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నివసిస్తున్నారు. వీరి వద్ద పని చేస్తున్న ఓ దళిత యువతిపై (22) అత్యాచారం చేశారన్నది ప్రధాన ఆరోపణ. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు గత ఏడాది జూన్‌లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న మురళీ ముకుంద్ కుటుంబీకులు ఈ కేసు నమోదు కాకుండా చూడటానికి ఆ బాధితురాలినే బెదిరించాలని పథకం వేశారు. ఈ విషయాన్ని అప్పట్లో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన ప్రోద్భలంతో ముకుంద్ కుటుంబీకులు బాధితురాలిపై ఓ ‘చిత్రమైన కేసు’ పెట్టారు. ఆమె తమ ఇంట్లో పని చేస్తూ ఐఫోన్‌లోని సిమ్‌కార్డులు తస్కరించినట్లు అందులో ఆరోపించారు. ఈ ఫిర్యాదును బాధితురాలికి చూపించిన సదరు ఇన్స్పెక్టర్ బెదిరింపులకు దిగారు. ముకుంద్ కుటుంబీకులపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోకపోతే ఈ ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. ఆమెకు జరిగిన అన్యాయానికి రేటు... అక్కడితో ఆగకండా ఆ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించాడు. పలుమార్లు ఆమెకు ఫోన్ చేసిన సదరు అధికారి పదేపదే బెదిరింపులకు దిగాడు. ఓ దశలో ఆమెకు జరిగిన అన్యాయానికి రూ.1.7 లక్షల రేటు కట్టిన ఇన్స్పెక్టర్ ముకుంద్ కుటుంబీకుల నుంచి ఆ మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ సెటిల్మెంట్ చేసినందుకు సదరు అధికారికి భారీ మొత్తమే ముకుంద్ కుటుంబీకుల నుంచి అందినట్లు తెలిసింది. ఈ ఖాకీ బెదిరింపులకు భయపడిన బాధితురాలు తన ఫిర్యాదును వెనక్కు తీసుకుని మిన్నకుండిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన పరిణామాలతో ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న బాధితురాలు ధైర్యం చేసి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు విషయాన్ని అప్పటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వారి ఆదేశాల మేరకు ఈ కేసును మహిళ భద్రత విభాగం అధికారులకు అప్పగించారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వాస్తవాలు.. తమ దర్యాప్తులో భాగంగా మహిళ భద్రత విభాగం బాధితురాలిని సంప్రదించింది. ఆమె నుంచి వాంగ్మూలం సైతం నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే గత ఇన్స్పెక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై మహిళ భద్రత విభాగం అధికారులు నగర పోలీసు కమిషనర్‌కు నివేదిక అందించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బంజారాహిల్స్ మాజీ ఇన్స్పెక్టర్పై కేసు నమోదుకు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టంలో ఓ కీలకాంశం ఉంది. ఈ ఆరోపణల కింద వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి నిరాకరించిన, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులనూ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దీని ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అత్యాచారం కేసును దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) బదిలీ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మురళీ ముకుంద్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మాజీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకునే అంశానికి అనివార్య కారణాల నేపథ్యంలో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. -
పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ సతీశ్ సస్పెండ్
రంగారెడ్డి: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్గా కె.సతీశ్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడవక ముందే భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. 2004 బ్యాచ్‌కు చెందిన సతీశ్ 2023 జూన్ 14న పహాడీషరీఫ్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆరు మాసాల్లో స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల అంశం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సీపీ విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. ఈ వివాదంలో ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారా...? మరెవరైనా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారా అని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. ఏడాది గడవకుండానే.. రెండు నుంచి మూడేళ్లపాటు విధులు నిర్వహించాల్సిన ఎస్ఎహెచ్ఓలు పహాడీషరీఫ్ పీఎస్‌లో మాత్రం ఏడాది కూడా పనిచేయడం లేదు. రకరకాల కారణాలతో బదిలీలు, సస్పెండ్ అవుతున్నారు. ►2020 జూలై 23న సీఐగా బాధ్యతలు చేపట్టిన విష్ణువర్ధన్‌రెడ్డి ఏడాది తిరగకుండానే 2021 జూలై 15న అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ►2021 ఆగస్టు 4న బాధ్యతలు చేపట్టిన సి.వెంకటేశ్వర్లు 14 నెలలు పనిచేసి 2022 అక్టోబర్ 4న అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. ► అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ 2023 మార్చిలో రాజకీయ ఫిర్యాదులతో బదిలీ అయ్యారు. మూడు నెలల పాటు డీఐ కాశీ విశ్వనాథ్ ఇన్చార్జి ఎస్హెచ్ఓగా కొనసాగారు. ► 2023 జూన్ 14న బాధ్యతలు చేపట్టిన సతీశ్ ఆరు నెలలు గడవక ముందే భూ వివాదం ఆరోపణలతో 2024 జనవరి 7న సస్పెండ్ అయ్యారు. స్నేక్ గ్యాంగ్ ఉదంతం నుంచి స్నేక్ గ్యాంగ్ లాంటి ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన పహాడీషరీఫ్ పీఎస్‌పై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా ఉంటుంది. ఒకవైపు హత్యలు, హత్యాయత్నాల లాంటి నేరాలకు ఆస్కారం ఉండడం.. ఆపై నగర శివారు కావడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్న ఈ ఠాణా పరిధిలో విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. పై స్థాయి అధికారుల ఆదేశాల కోసం భూ వివాదాలలో తలదూర్చి స్థానిక పోలీసులు తమ మెడకు చుట్టుకున్న సందర్భాలు సైతం గతంలో వెలుగు చూశాయి. ఏదేమైనా తరచూ ఎస్హెచ్ఓలు మారుతుండడంతో నేరాల నివారణ, ఈ ప్రాంతంపై పట్టు సాధించడం కొత్తగా వచ్చిన అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. -
బోరబండ ఇన్స్పెక్టర్పై వేటు
హైదరాబాద్: బోరబండ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్‌పై వేటు పడింది. ఆయన్ను సిటీ కమిషనరేట్‌కే ఎటాచ్ చేస్తూ కొత్వాల్ సందీప్ శాండిల్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాల నేపథ్యంలో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచి్చన యువకుడి హత్య కారణంగా మరో ఇన్స్పెక్టర్పై చర్యలకు కమిషనర్ రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ తమ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల వంటి అసాంఘిక శక్తులపై కన్నేసి ఉంచాలని కొత్వాల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రౌడీషీటర్లకు సంబంధించిన రికార్డులు కలిగి ఉండాలని, వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు ఇన్స్పెక్టర్లే స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వీరిని బైండోవర్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వడం, వారి ఇళ్లను సందర్శించి కదలికలపై నిఘా ఉంచడం సైతం ఇన్స్పెక్టర్ల బాధ్యతగా సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. దైనందిన విధుల నేపథ్యంలో ఈ వ్యవహారాల్లో ఎస్సై సహాయం తీసుకోవాలే తప్ప పూర్తిగా వారిపై విడిచిపెట్ట కూడదని ఆదేశాలు జారీ చేశారు. వీటి అమలును పర్యవేక్షించడానికి ఆయన మంగళవారం నుంచి ఠాణాల తనిఖీలు ప్రారంభించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని పలు పోలీసుస్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోరబండ ఠాణాలో సరైన రికార్డులు లేకపోవడం, రౌడీషీటర్ల వ్యవహారం ఎస్సైలే పర్యవేక్షించడం వంటివి సందీప్ శాండిల్య దృష్టికి వచ్చాయి. దీంతో ఇన్స్పెక్టర్ రవికుమార్‌ను నిలదీసిన ఆయన రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లారా? అంటూ ప్రశ్నించారు. తన వెంట వచ్చి కనీసం నలుగురి ఇళ్లైనా చూపాల్సిందిగా ఆదేశించారు. కొత్వాల్ వాహనం వరకు వెళ్ళిన రవికుమార్ ఆ వ్యవహారాలను ఎస్సైలు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్ శాండిల్య ఆయన్ను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తుర్వులు జారీ చేశారు. మరోపక్క రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని కొత్వాల్ పదేపదే స్పష్టం చేస్తున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారు? ఎవరితో వైరాలు ఉన్నాయి? తదితర అంశాలపై కన్నేయాల్సిందిగా ప్రత్యేక విభాగాలకు ఆదేశించారు. అయితే ఎస్సార్‌నగర్ రౌడీషీటర్ షేక్ షరీఫ్ సోమవారం రాత్రి యువకుడు తరుణ్‌ను హత్య చేశాడు. ఇది మంగళవారం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ వీరి మధ్య వైరం ఉన్నా, పలుమార్లు ఘర్షణలు జరిగినా రౌడీషీటర్ పై నిఘా ఉంచడం, చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక విభాగాలు నిర్లక్ష్యం వహించాయని కొత్వాల్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన మరో ఇన్స్పెక్టర్పై వేటుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు బుధవారం వెలువడే అవకాశం ఉంది. -
వసూళ్ల బాగోతం.. బంజారాహిల్స్ సీఐకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏసీబీ కార్యాలయానికి నరేందర్‌ను తరలించారు. సీఐతో పాటు ఎస్ఐ, హోంగార్డును ఏసీబీ తరలించింది. సీఐ నరేందర్‌ను 20 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది. స్కెలాంజ్ పబ్ యజమానులను ప్రశ్నించిన ఏసీబీ.. స్టేట్మెంట్ రికార్డు చేసింది. పబ్ వ్యవహారంతో పాటు... మిగతా వసూళ్ల పైనా ఏసీబీ ఆరా తీస్తోంది. 9న విచారణకు హాజరుకావాలి.. ఏసీబీ నోటీసులు.. నరేందర్ వసూళ్ల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీఐ, ఎస్ఐ హోం గార్డ్లకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను ఏసీబీ జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్‌ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్ దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. చదవండి: మెట్రో రైలులో యూట్యూబర్ హల్చల్.. ప్రయాణికులను షాక్ -
బంజారాహిల్స్ సీఐ నరేందర్‌కు అస్వస్థత
-
బంజారా హిల్స్ సీఐ కేసులో కీలక విషయాలు
-
ఏసీబీ వలలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్
-
రూ 6 వేలు లంచం తీసుకుంటూ దొరికిన లైన్ ఇన్స్పెక్టర్
హైదరాబాద్: ఓ ఇంటికి ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను మార్చేందుకు రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఓ ఎలక్ట్రికల్ లైన్ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంఘటన బుధవారం తార్నాకలో చోటు చేసుకుంది. లాలాగూడలోని టీఎస్పీఎస్సీడీసీల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జి.వెంకటేశ్వర్లుకు లాలాగూడ ప్రాంతంలో మహ్మద్ షాహిద్ అలీ తన ఇంటికి ఉన్న కమర్షియల్ విద్యుత్ కనెక్షన్‌ను డొమెస్టిక్ కేటగిరిగా మార్చాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ దరఖాస్తును కొన్నిరోజుల నుంచి వెంకటేశ్వర్లు పెండింగ్‌లో పెట్టాడు. దీనిపై షాహిద్ అలీ ప్రశ్నించగా రూ.ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు ఆరు వేల రూపాలను బుధవారం కార్యాలయంలో అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లును అరెస్టు చేసి ఏసీబీ అడిషినల్ స్పెషల్ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు. -
ఎస్సీ రైల్వే ఐజీగా అరోమా సింగ్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఇన్స్పెక్టర్ జనరల్–కమ్–ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌గా అరోమా సింగ్ ఠాకూర్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్సర్వీస్ 1993 బ్యాచ్‌కు చెందిన ఆమె ఇంతకుముందు వాయువ్య జోన్లో ఇదే బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై దక్షిణ మధ్య రైల్వేకు వచ్చారు. తూర్పు రైల్వే పరిధిలోని హౌరా డివిజన్, జైపూర్ డివిజన్, వడోదర రైల్వే స్టాఫ్ కాలేజీ, జబల్పూర్, ఝాన్సీ, దక్షిణ రైల్వే, పెరంబూర్ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలోని వివిధ పోస్టుల్లో పనిచేశారు. ఆమె పని తీరుకుగాను మూడు పర్యాయాలు ఇండియన్ పోలీసు సేవా పతకాలు దక్కాయి. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ జానకి
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళా ఇన్స్పెక్టర్(సీఐ) లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ జానకి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పీర్జాదిగూడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ సెక్షన్లో జానకి ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, శానిటేషన్ వస్తువులు సరఫరా చేసే వ్యక్తి నుంచి సీఐ జానకి లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ శానిటేషన్ ఇన్స్పెక్టర్ జానకీ. దీంతో, సదరు బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు. ఈ క్రమంలో 20వేలు ఇస్తుండగా జానకిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ఆఫీసులో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. 15 రౌండ్ల కాల్పులు.. కస్టడీలోనే ఖతం చేశారు -
ఎవరీ భరత్?: ఏడాదిగా విధులకు డుమ్మా.. అయినా డీఎస్పీగా ప్రమోషన్
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ పోలీసుశాఖలో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఓ పోలీసు అధికారి ఏడాదికి పైగా కనిపించడం లేదు. వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించి చివరికి వరంగల్ డీఐజీకి అటాచ్డ్‌లో ఉన్న సదరు అధికారి ఏమయ్యాడనేది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇన్స్పెక్టర్లుగా ఉన్న 1996 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐలకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ)లుగా పదోన్నతి పొందనున్నారు. సుమారు రెండేళ్ల కిందట 1995 బ్యాచ్‌కు సంబంధించిన పదోన్నతుల జాబితా వెలువడే సమయంలో 1996 బ్యాచ్‌కు చెందిన కొందరు కోర్టుకు వెళ్లడం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మందికి బ్రేక్ పడింది. ఇందులో మల్టీజోన్–1 చెందిన వారు 38 మంది ఉన్నారు. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత ఆ జాబితా (1995 బ్యాచ్) క్లియర్ కాగా.. ప్రభుత్వం చొరవతో 1996 బ్యాచ్‌కు చెందిన వారికి కూడ డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఇటీవల లైన్ క్లియరైంది. ఇందులో మల్టీజోన్–1లోని 38 జాబితాను కూడా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ జాబితాలోని ఒకరు సర్వీసు నుంచి తొలగించబడగా, ఇద్దరు మృతిచెందారు. మిగిలిన 35 మందిలో భరత్‌కుమార్ ఏడాదిగా విధులకు హాజరు కావడం లేదని పదోన్నతుల జాబితాలోని రిమార్క్స్‌లో ఐజీ పేర్కొన్నారు. బి.భద్రయ్యగా ఉన్న ఆయన భరత్‌కుమార్‌గా పేరు మార్చుకున్నారు. రెండేళ్ల కిందటి వరకు ఇంటెలిజెన్స్‌లో పని చేసిన భరత్.. పదోన్నతుల జాబితా వెల్లడి నాటికి ‘ఏడాదికి పైగా విధులకు గైర్హాజర్’గా పేర్కొనడంపై పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ఎస్ఐగా, సీఐగా పని చేసిన సమయంలో కూడా కొన్ని అంశాల్లో వివాదస్పదం అయ్యాడు. రియల్ ఎస్టేట్ రంగంలో కాలుపెట్టిన ఆయన డీఎస్పీ పదోన్నతుల జాబితా వెలువడే సమయానికి ఎక్కడికెళ్లాడు? ఏం చేస్తున్నాడు? అన్నది చర్చగా మారింది. విధులకు హాజరుకాకుండా.. ఉన్నతాధికారులకు కనిపించకుండా పోయిన ఈ ‘నాలుగోసింహం’ విషయం హాట్‌టాఫిక్‌గా మారింది. -
చిన్న శిక్షతో సరిపెడతారా?
సాక్షి, అమరావతి : ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్ కమిషనర్‌ను, అతనికి సాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా, హిందూపురం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్‌పై నామమాత్రపు చర్యలు తీసుకున్నారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు సమాజానికి సంరక్షకులని, అలాంటి పోలీసు తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని స్పష్టం చేసింది. రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించడం చాలా చిన్న శిక్ష అని, ఇలాంటి శిక్ష విధించడం ద్వారా సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని ప్రశ్నించింది. కింది కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేసిన పోలీసు అధికారికి చిన్న శిక్ష విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వొకేట్ కమిషనర్, కోర్టు సిబ్బందిని ఇస్మాయిల్ కొట్టారంటూ అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా మలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐ ఇస్మాయిల్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. తదుపరి విచారణకు సైతం హాజరు కావాలని ఇస్మాయిల్‌ను ధర్మాసనం ఆదేశించింది. -
మహిళా సీఐ సస్పెండ్
శివాజీనగర: విధుల్లో అలసత్వం, అవినీతి ఆరోపణలతో నగరంలో శివాజీనగర మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుమ ను పై అధికారులు సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ దయానంద్ ఉత్తర్వులిచ్చారు. కొన్నిరోజుల క్రితం ఈ పోలీస్‌స్టేషన్‌లో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఎస్ఐ సవిత రూ.5 వేలు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ రెడ్‌హ్యాండ్‌గా చికకారు. ఇందులో సీఐ సుమ పాత్ర ఉందని వినిపించింది. సీనియర్ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలు కూడా ఆమైపె ఉన్నాయి. ఉన్నతాధికారులు చెప్పి పంపిన కేసుల్లో కూడా ఆమె లంచం డిమాండ్ చేసి, ఇచ్చేవరకూ పనిచేసేది కాదని ఆరోపణలున్నాయి. ఇంతకుముందు డీసీపీ భీమాశంకర్ గుళేద్ హెచ్చరించినా కూడా ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు లంచం, అలసత్వం, దుష్ప్రవర్తన తదితర ఆరోపణల కింద ఆమైపె సస్పెన్షన్ వేటు వేశారు. -
అయ్యగారు పార్టీ ఇస్తున్నారు. 5 కిలోల చికెన్ కొట్టి ఇవ్వు.!
దొండపర్తి(విశాఖ దక్షిణ): అయ్యగారు పార్టీ ఇస్తున్నారు. 5 కిలోల చికెన్ కొట్టి ఇవ్వు.! ఓయ్.. ఇన్స్పెక్టర్ గారి ఇంట్లో ఫంక్షన్.. నువ్వు బియ్యం బస్తాలు ఇవ్వాలి.! ఇదిగో.. మా సార్ కోసం మసాలా ఐటెమ్స్ కట్టేసి బ్యాగ్‌లో పెట్టు.! ఇదీ నగర శివారు ప్రాంతమైన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుళ్ల దందా.. సీఐ పార్టీ ఇస్తున్నారని చెప్పి.. ఆ స్టేషన్ పరిధిలోని చికెన్ షాపుల నుంచి కిరాణా షాపుల వరకు ప్రతి ఒక్కరినీ దోచుకుతింటున్నారు ఖాకీలు. కొంత మంది కానిస్టేబుళ్లు ఉదయం నుంచే బ్యాగులు పట్టుకుని షాపుల మీద పడ్డారు. చికెన్ షాపుల వద్దకు వెళ్లి సీఐ ఇంట్లో ఫంక్షన్ ఉందని ఒకరు.. సీఐ పార్టీ ఇస్తున్నారని మరొకరు చెప్పి 2 కిలోల నుంచి 5 కిలోల వరకు డబ్బులు ఇవ్వకుండా పట్టుకుపోయారు. రోజు వారి వ్యాపారంపై జీవనం సాగించే ఇటువంటి చిన్న వ్యాపారుల నుంచి కిలోలకు కిలోలు చికెన్ కొట్టేయడంతో వారు బయటకు చెప్పుకోలేక మదనపడుతున్నారు. అలాగే రిటైల్ దుకాణాలకు వెళ్లి రైస్ బ్యాగులు, ఇతర వంట, మసాల సామాన్లు సైతం కట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. ప్రతిసారీ అదే తంతు ఈ స్టేషన్ సిబ్బంది వ్యవహారం పట్ల స్థానిక వ్యాపారులు విసుగెత్తిపోతున్నారు. ఖాకీ డ్రెస్ ఉందన్న కారణంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సీఐ పేరు చెప్పి సాగిస్తున్న ఈ దందా నిజంగా ఇన్స్పెక్టర్ కోసమా? లేదా కానిస్టేబుళ్ల నిర్వాకమా? అన్నది తేలాల్సి ఉంది. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి మార్కెట్ దందా చేయడంలో ఈ స్టేషన్ పరిధిలో సిబ్బంది సిద్ధహస్తులుగా పేరుపొందారు. చిరు వ్యాపారులు, దుకాణదారుల నుంచి ఉచితంగా సామాన్లు పట్టుకుపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలనుకున్నా.. ఆ తర్వాత మిగిలిన వారు తమపై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేస్తారన్న భయంతో వ్యాపారులు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. సీఐ వ్యవహార శైలి అంతే.. ఈ స్టేషన్ సీఐ వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది. విందులు, వినోదాలపై అమితాసక్తి ఉన్న ఈ అధికారి పనిచేసిన చోటల్లా ఏదో వివాదంలో చిక్కుకుంటూ వస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల నుంచి మందలింపులతో పాటు ఓ మహిళ వివాదం విషయంలో సస్పెన్షన్‌కు సైతం గురయ్యాడు. అయినప్పటికీ అతని వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రాలేదని సహచర సిబ్బందే చెబుతుండడం గమనార్హం. ఓ అతిథి గృహంలో పార్టీ కోసమే కానిస్టేబుళ్లు మార్కెట్లో దందాకు దిగారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగా సీఐయే కానిస్టేబుళ్లకు చెప్పి పంపించాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఇటువంటి సిబ్బందిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. -
ఎస్పీ చెంతకు ఎలుక పంచాయితీ..ప్రశ్నించిన పాపానికి దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: కర్రీ పాయింట్లో కొనుగోలు చేసిన పప్పులో ఎలుక వచ్చిందని ప్రశ్నించిన పాపానికి తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను బాధితులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... అనంతపురం నగరంలోని కమలానగర్లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే ఊటకూరి దుర్గాంజలి దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 2న మధ్యాహ్నం 2.56 గంటలకు దుర్గాంజలి... ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్లో రూ.30 చెల్లించి పప్పు, రూ.20 చెల్లించి చెట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లి అన్నంలోకి పప్పు వేసుకోగా అందులో చచ్చిన ఎలుక వచ్చింది. వెంటనే ఆ ప్లేటును తీసుకెళ్లి కర్రీపాయింట్ నిర్వహిస్తున్న యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అది చూసిన వారు హోటల్లోని ఆహార పదార్థాల్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు పడడం సర్వ సాధారణమంటూ సమాధానం ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీంతో కక్షకట్టిన ముత్యాలరెడ్డి కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తులతో తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తూ భయాందోళనకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు) -
ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావుపై వేటు
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు విభాగంలో పనిచేస్తూ క్రమశిక్షణను అతిక్రమించిన వారిపై నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వేటువేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న 55 మందిపై శాఖపరమైన అంతర్గత విచారణ చేపట్టి వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరంతా గతేడాది డిసెంబర్ 25 నుంచి గత శుక్రవారం మధ్య వరకు చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. వీరిలో ఇటీవల అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదైన మారేడ్‌పల్లి మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు కూడా ఉన్నారు. వేటుపడిన వారిలో ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతోపాటు మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఉన్నారు. బాధితులు, సాక్షులపై ప్రభావం లేకుండా... సాధారణంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులపై శాఖపరమైన విచారణ జరిపిన తర్వాత ఈ తరహా చర్యలు తీసుకుంటారు. వనస్థలిపురంలో కేసు నమోదైన ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు వ్యవహారశైలి దృష్ట్యా విచారణ సమయంలో సాక్షులు, బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉందని అధికారులు భావించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సీపీ అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో లాలాగూడ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.శ్రీనివాసరెడ్డి ఓ మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎడ్ల శ్రీనివాస్ అదనపుకట్నం కోసం భార్యను వేధించడంతోపాటు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం నెరిపారు. దీంతో వీరిద్దరినీ కూడా డిస్మిస్ చేస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీచేశారు. మరికొందరు పోలీసులపైనా చర్యలు ఈ ముగ్గురితోపాటు పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన మరికొందరిపైనా కఠినచర్యలు తీసుకున్నారు. ఓయూ ఠాణాలో ప్రొబెషనరీ ఎస్సైగా పనిచేసిన బి.నర్సింహ ఓ మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆర్ఎస్సై గొల్ల నిరంజన్పైనా తీవ్రమైన నేరారోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరినీ విధుల నుంచి తొలగించారు. ఇలా మొత్తమ్మీద ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక సబ్–ఇన్స్పెక్టర్, 11 మంది కానిస్టేబుళ్లు, ఒక ఆఫీస్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ సహా మరొకరు సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు. రిజర్వ్డ్ కేటగిరీలో ఇన్స్పెక్టర్, హెడ్–కానిస్టేబుల్, 19 మంది కానిస్టేబుళ్లుసహా మరొకరిపై వేటు పడింది. వీరిలో 13 మంది ప్రొబెషన్‌లో ఉండగానే తొలగించబడ్డారు. వీరిలో కొందరు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, హత్య తదితర కేసుల్లో నిందితులుగా ఉండటం, అవినీతి చర్యలకు పాల్పడటం సహా ఇతర అనైతిక చర్యలకు పాల్పడ్డారు. ఖాకీ దుస్తులు వేసుకుని సమాజానికి సేవ చేయాల్సిన పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. (చదవండి: లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌రావు అరెస్టు) -
తలపై గన్ గురిపెట్టి రేప్.. మాజీ సీఐ నాగేశ్వర రావు రేపిస్టే: పోలీసుల ధృవీకరణ!
సాక్షి, హైదరాబాద్: ఓ నిందితుడి భార్యపై హైదరాబాద్‌లోని మారేడుపల్లి ఠాణా మాజీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) కోరట్ల నాగేశ్వరరావు అత్యాచారం చేశాడని వనస్థలిపురం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితురాలితో తనకు వివాహేతర సంబంధం ఉందని కస్టడీ సమయంలో పలుమార్లు బుకాయించిన మాజీ సీఐ నాగేశ్వర రావును లైంగిక సామర్థ్య (పొటెన్సీ) పరీక్షలు నిర్వహించగా అందులో వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో పాటూ మెజి్రస్టేట్ సమక్షంలో బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసిన మహిళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్పీ) స్థాయి అధికారిణి.. నిందితుడు బాధితురాలి కణతపై తుపాకీ పెట్టి అత్యాచారం చేశాడని, తగిన ఆధారాలతో సహా తుది నివేదిక సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న పలువురి స్టేట్మెంట్లను రికార్డు చేసి, సాధ్యమైనంత త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు వనస్థలిపురం పోలీసులు కసరత్తు చేస్తున్నారు. తుపాకీ తీసుకెళ్లలేదన్నది నాటకమే.. వృత్తిరీత్యా సీఐ కావటంతో తుపాకీ క్యారీ చేసే అలవాటు ఉన్న నాగేశ్వర రావు సంఘటన జరిగిన రోజు కూడా బాధితురాలి ఇంటికి గన్ తీసుకెళ్లాడు. కస్టడీ విచారణలో మాత్రం తాను తుపాకీ తీసుకెళ్లలేదని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కావాలంటే మారేడుపల్లి ఠాణా రికార్డులను పరిశీలించుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో పీఎస్ రికార్డులను, సీసీటీవీ కెమెరాలను, ఇతరత్రా సాంకేతిక అంశాలను పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. సంఘటన జరిగిన మర్నాడు ఉదయం తుపాకీ స్టేషన్‌లోని ఒక అధికారికి ఇచ్చి, సరెండర్ చేసినట్లుగా రికార్డ్‌లో రాపించినట్లు విచారణలో బయటపడింది. ఠాణాలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. సంఘటన జరిగిన తెల్లారి నాగేశ్వర రావు స్టేషన్‌కు వచి్చనట్లు ఎక్కడా రికార్డు కాలేదు. దీంతో సీఐ ఫోన్ లొకేషన్‌ను పరిశీలించగా.. ఆ సమయంలో నాగేశ్వర రావు ఇంట్లోనే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. దీంతో కేసును తప్పుదారి పట్టించే యత్నం చేసిన నాగేశ్వర రావుపై వనస్థలిపురం పోలీసులు తప్పుడు డాక్యుమెంట్లు, సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులు కూడా నమోదు చేశారు. రూ.30 లక్షలు డిమాండ్.. బాధితురాలితో తనకు వివాహేతర సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు సమరి్పంచడంలో సీఐ విఫలమయ్యాడని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సీఐ ఫోన్ కాల్ రికార్డ్లను పరిశీలిస్తే.. ఎక్కడా కూడా బాధితురాలితో సంభవించినట్లు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఇదే విషయంపై సీఐను ప్రశ్నించగా.. బాధితురాలితో కేవలం వాట్సాప్ కాల్, మెసేజ్‌లు మాత్రమే చేసేవాడినని తెలిపినట్లు తెలిసింది. బాధితురాలి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక ఇంకా రాలేదని వివరించారు. బాధితురాలి భర్తపై ఉన్న కేసులు ట్రయల్‌కు రానున్నాయని, దీన్ని ఆసరాగా చేసుకొని ఆమెను లోబరుచుకోవాలని భావించిన సీఐ.. వివాహిత ఇంటికి వెళ్లి ఉంటాడని ఓ పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అంతేతప్ప డీసీపీ స్థాయి అధికారి ఒకరు నాగేశ్వరరావుపై వ్యక్తిగత కక్షతో ఆయన్ని ఇరికించాడని వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఆయన తెలిపారు. కాగా.. సంఘటన జరిగిన తర్వాత అవతలి పార్టీ సీఐను రూ.30 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయని ఆయన పేర్కొన్నారు. -
ప్రేమ పేరుతో వివాహితను వంచించిన ఏఆర్ ఎస్ఐ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో అతనో ఎస్ఐ. ఉద్యోగం వచ్చిన అనంతరం కాలేజీ రోజుల్లో తనతో పాటు చదువుకున్న ఓ వివాహితను ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో లొంగతీసుకున్నాడు. వివాహం చేసుకోవాలని ఆ మహిళ కోరడంతో ముఖం చాటేశాడు. మచిలీపట్నం నరసింహనగర్‌కు చెందిన విశ్వనాథపల్లి గణేష్ జిల్లా ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో ఎస్ఐ. కొంతకాలం క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమైన పెనమలూరుకు చెందిన ఓ వివాహితను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. అతడి మోజులో పడిన మహిళ భర్తతో గొడవ పడి విడాకులు తీసుకుంది. అనంతరం తనను వివాహం చేసుకోమని గణేష్‌ను కోరింది. అప్పటికే ఆమెపై మొహం మొత్తిన గణేష్ వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. న్యాయం కోరుతూ సోమవారం దిశ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎస్పీ పి.జాషువా ఆదేశాలతో రంగంలోకి దిగిన దిశ డీఎస్పీ రాజీవ్‌కుమార్.. నిందితుడిపై రేప్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయటంతో పాటు రిమాండ్‌కు తరలించారు. -
హత్య వెనుక అసలు నిజం దాచిన ఇన్స్పెక్టర్.. రెండేళ్ల తర్వాత..
సాక్షి, చెన్నై: హత్య కేసును ఆత్మహత్యగా మార్చేసిన ఓ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు వేస్తూ తిరునల్వేలి డీఐజీ ప్రవేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఆర్ముగనేరి స్టేషన్ ఇన్స్పెక్టర్గా బాలాజీ పనిచేస్తున్నారు. ఈయన రెండేళ్ల క్రితం తిరుచ్చి జిల్లా సెందురై స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో శ్రీవిశ్వపురంలో రౌడీ కాశి రాజన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, ఇది హత్య అనే ఆరోపణలు వచ్చినా, కేసును మాత్రం ఆత్మహత్యగా మార్చేసి ముగించాడు. విషం తాగి మరణించినట్టుగా నిర్ధారించేశాడు. అయితే ఈ వ్యవహారంపై ఫిర్యాదులు హోరెత్తడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అదే సమయంలో అక్కడి నుంచి బాలాజీని ఆర్ముగనేరికి బదిలీ చేశారు. విచారణలో కాశి రాజన్ మరణం వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్టు వెలుగు చూసింది. కాశి రాజన్ వెన్నంటి ఉన్న వారే హతమార్చినట్టు వెలుగు చూసింది. ఈ కేసులో ఏడుగురిని కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. హత్యను ఆత్మహత్యగా మార్చేసిన ఇన్స్పెక్టర్ బాలాజీని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ఇన్‌స్టాలో పరిచయం, ఆపై స్నేహం.. చివరికి యువతిని నమ్మించి.. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
రామభద్రపురం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్‌లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. అయితే 2020లో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది. దీంతో గోపాలకృష్ణ నుంచి కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్‌పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో గడుపుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్ రైట్స్ సంఘం సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇంటి దొంగ గుట్టురట్టు.. అసలు సూత్రధారి బ్యాంకు మేనేజరే!) -
క్లబ్ టెకీల అంశంలో... మరో ఇన్స్పెక్టర్కు పబ్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్బుల్లో నడుస్తున్న గబ్బు దందాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్న ఇన్స్పెక్టర్లపై వేటు పడుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కొత్వాల్ సీవీ ఆనంద్ చర్యలు తీసుకుంటున్నారు. వెస్ట్‌జోన్ పరిధిలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ వ్యవహారంలో అప్పటి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర సస్పెండ్ అయ్యారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున బయటపడిన క్లబ్ టెకీల వ్యవహారంలో మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) ఇన్స్పెక్టర్ ఎస్.సైదులుపై బదిలీ వేటు పడింది. సైదులును కమిషనర్ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో అదనపు ఇన్స్పెక్టర్ గడ్డం కాశికి బాధ్యతలు అప్పగించారు. (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!) -
Hyderabad: మద్యం మత్తులో ఏకంగా ఇన్స్పెక్టర్ను ఢీకొట్టాడు..
-
హైదరాబాద్‌లో తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్.. రాష్ట్రంలో ముగ్గురే!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శాంతిభద్రతల విభాగం ఠాణాకు తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా ఇన్స్పెక్టర్ కె.మధులత నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసుస్టేషన్లో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కీలక విభాగాల్లో విధులు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మధులత 2002లో ఎస్సైగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. సిద్దిపేట వన్ టౌన్ ఠాణాకు ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అనంతరం సిద్దిపేట రెండో టౌన్, జోగిపేట, ములుగు, సిద్దిపేట రూరల్ శాంతిభద్రల విభాగం ఠాణాలకు ఎస్హెచ్ఓగా పని చేశారు. ఆపై సైబరాబాద్ (ఉమ్మడి) వచ్చిన మధులత నాచారం పోలీసుస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2012లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. సరూర్‌నగర్ మహిళ పోలీసుస్టేషన్లో పాటు ఐటీ కారిడార్ ఉమెన్ పోలీసుస్టేషన్లకు ఇన్స్పెక్టర్గా సేవలు అందించారు. అనంతరం సీఐడీలో రెండున్నరేళ్లు, నగరానికి వచ్చిన తర్వాత దక్షిణ మండలం ఉమెన్ పోలీసుస్టేషన్, స్పెషల్ బ్రాంచ్‌ల్లో పని చేశారు. సైబరాబాద్‌లో అభయ సహా పలు కీలక కేసుల దర్యాప్తులోనూ మధులత కీలకంగా వ్యవహరించారు. అన్ని స్టేషన్లలోనూ ఉండాలి మహిళలు తమ శక్తి ఏమిటో గుర్తించుకోవాలి. వారిపై ఎంతో నమ్మకం ఉంచి హోంమంత్రి, నగర పోలీసు కమిషనర్ మధులతకు ఈ అవకాశమిచ్చారు. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగి అన్ని పోలీసుస్టేషన్లలో మహిళ ఎస్హెచ్ఓలు ఉండే రోజు వస్తుందని ఎదురు చూద్దాం. – చందన దీప్తి, నార్త్‌జోన్ డీసీపీ పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి తొలిసారిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం ఠాణాకు మహిళ అధికారిని నియమించాం. మధులత తన పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి. మరింత మంది మహిళలు పోలీసు విభాగంలోకి రావాలి. – మహమూద్ అలీ, హోమ్ మంత్రి రాష్ట్రంలో ముగ్గురే.. 174 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ కమిషనరేట్‌లో తొలిసారిగా మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమించాం. రాష్ట్రంలో 700 పోలీసుస్టేషన్లు ఉండగా ముగ్గురు మాత్రమే మహిళ ఎస్హెచ్ఓ ఉన్నారు. ఇన్స్పెక్టర్ మధులత తన విధులు సమర్థంగా నిర్వహించి రాబోయే మహిళ ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు మార్గదర్శకంగా నిలవాలి. – సీవీ ఆనంద్, కొత్వాల్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ బాధ్యతలు సద్వినియోగం చేసుకుని సీపీ నమ్మకాన్ని నిలబెడతా. పురుష అధికారులకు దీటుగా పని చేస్తూ 24/7 అందుబాటులో ఉంటా. మిగిలిన మహిళా అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా ఉండేలా పనిచేసి శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటా. – మధులత, లాలాగూడ ఇన్స్పెక్టర్ -
ఉమెన్స్ డే స్పేషల్!...స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళలకు పట్టం
సాక్షి, హైదరాబాద్: ఉమెన్స్ డే నేపథ్యంలో ఏటా నగర పోలీసు విభాగం వివిధ రకాల కార్యక్రమాల నిర్వహిస్తూ వస్తోంది. ప్రస్తుత కొత్తాల్ సీవీ ఆనంద్ దీనికి భిన్నంగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిటీ పోలీసు విభాగంలో ఓ మహిళ ఇన్స్పెక్టర్ను శాంతిభద్రతల విభాగం పోలీసుస్టేషన్‌కు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) నియమిస్తున్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ, కొత్వాల్ ఆనంద్ సమక్షంలో లాలాగూడా ఎస్హెచ్ఓగా సదరు అధికారిణి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒకప్పుడు పోలీసు విభాగంలో మహిళా సిబ్బంది, అధికారిణిల సంఖ్య తక్కువగా ఉండేది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కేటాయించారు. దీంతో నానాటికీ వీరి సంఖ్య పెరుగుతోంది. అదనపు డీజీ నుంచి కానిస్టేబుళ్ల వరకు కలిపి ప్రస్తుతం 3803 మంది ఉన్నారు. హోంగార్డులు వీరికి అదనం. ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న వారి సంఖ్యే 31గా ఉంది. అయితే వీరిలో ఏ ఒక్కరూ శాంతిభద్రతల విభాగం ఠాణాకు ఎస్హెచ్ఓగా లేరు. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటి వరకు ఇలాంటి నియామకం జరగలేదు. అటవీ, ఎక్సైజ్, ఆర్టీఏ, రెవెన్యూల్లో మహిళలను దీనికి సమానమైన హోదాల్లో నియమిస్తున్నా... పోలీసుల్లో మాత్రం జరగలేదు. కేవలం మహిళ ఠాణాలు, ఉమెన్ సేఫ్టీ, భరోస, లేక్ పోలీస్ స్టేషన్ వంటి వాటికే మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. ఇది వారిలో ఆత్మన్యూనతా భావానికి కారణం అవుతోందని, ఫలితంగా ప్రతిభ ఉన్న వారికీ తమ పనితీరు ప్రదర్శించే అవకాశం ఉండట్లేదని సీపీ భావించారు. ఒక మహిళకు ఎస్హెచ్ఓగా అవకాశం ఇస్తే ఆ స్ఫూర్తితో ప్రస్తుతం డిపార్ట్మెంట్లో ఉన్న, భవిష్యత్‌లో అడుగుపెట్టనున్న వాళ్లూ సమర్థవంతంగా పని చేస్తారని భావించారు. దీంతో ఉమెన్స్‌డే నేపథ్యంలో నగరంలోని ఓ పోలీసుస్టేషన్‌కు మహిళను ఎస్హెచ్ఓగా నియమిస్తున్నారు. దీనికి సంబంధించి కమిషనరేట్ అధికారులు దాదాపు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. నగరంలో ఉన్న ఉమెన్ ఇన్స్పెక్టర్ల ప్రొఫైల్, వారు గతంలో పని చేసిన ప్రాంతాల్లో, పోస్టులు, సామర్థ్యం తదితరాలను తెలుసుకున్నారు. దాదాపు ప్రతి అధికారిణినీ కమిషనరేట్‌కు పిలిచిన అధికారులు శాంతిభద్రతల విభాగంలో ఉండే సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన సమర్థత తదితరాలను వివరించారు. ఈ కసరత్తు తర్వాత మహిళ ఇన్స్పెక్టర్ను ఎంపిక చేశారు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. మహిళ అధికారిణుల ప్రతిభ ఆధారంగా ఎస్‌హెచ్‌ఓల్లోనూ 33 శాతం వీరే ఉండేలా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. (చదవండి: గోల్డెన్...ఫైట్) -
రౌడీషిటర్లకు కౌన్సెలింగ్
బంజారాహిల్స్: రౌడీషీటర్లు స్రత్పవర్తన కలిగి ఉండాలని నేర సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషిటర్లకు గురువారం అడ్మిన్ ఎస్ఐ మహేశ్‌తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత నేరుగా ఇంటికి చేరుకోవాలని అనవసరంగా రోడ్లపైన తిరగవద్దన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు అందితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రౌడీషిటర్ల కదలికలపై పోలీసుల నిఘా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాత్రిపూట పెట్రో, బ్లూకోట్స్ పోలీసులు రౌడీషీటర్లు నివసించే ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నామన్నారు. స్థానికులు కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. -
చొరబడేందుకు కాచుకు కూర్చున్నారు
శ్రీనగర్/జమ్మూ: గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది మిలిటెంట్లు సరిహద్దు అవతల వేచి చూస్తున్నట్టు సమాచారం అందిందని కశ్మీర్ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ సోమవారం తెలిపారు. చొరబాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దు వెంబడి గస్తీ పెంచామని చెప్పారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. తాలిబన్ల ముప్పు, అఫ్గానిస్తాన్ నుంచి కశ్మీర్‌కు ఆయుధాలు సరఫరా అవుతాయనే వార్తలపై స్పందిస్తూ.. ఇప్పటివరకైతే అలాంటి సమాచారమేం లేదన్నారు. అయినా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, నిఘా పెంచామని చెప్పారు. కొంత మంది గైడ్లు నియంత్రణ రేఖ దాటి అవతలివైపునకు వెళ్లారని.. ఇటువైపు వచ్చాక వాళ్లపైన, వాళ్ల కుటంబాలపైనా నిఘా పెడతామన్నారు. యాంటీ డ్రోన్ పద్ధతులు వాడుతున్నాం సరిహద్దులో డ్రోన్ల సమస్య ఉందని, గతేడాది కూడా కొన్ని తమకు కనిపించాయని, అయితే మనవైపు రాలేదని ఐజీ వివరించారు. ఈ ఏడాది యాంటీ డ్రోన్ పద్ధతులను వాడుతున్నామని, డ్రోన్లు కూడా సమకూర్చుకుంటున్నామని తెలిపారు. సరిహద్దు అవతలివైపు నుంచి నార్కోటిక్ డ్రగ్స్ పంపేందుకు ప్రయత్నిస్తున్నారని, కొన్నింటిని ఇప్పటికే సీజ్ చేశామని తెలిపారు. సరిహద్దుల్లో 2021లో దాదాపు రూ. 88 కోట్ల విలువైన మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ: జమ్మూ ఐజీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించడంతో అప్రమత్తమయ్యామని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ డీకే బోరా చెప్పారు. సరిహద్దు అవతలి నుంచి చొరబాట్లు జరగొచ్చని.. ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేయొచ్చని సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి యాంటీ డ్రోన్ ఎక్సర్సయిజ్లు, టన్నెల్స్‌ను గుర్తించడం ముమ్మరం చేశామన్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ పెంచామని తెలిపారు. వీలైనంత ఎక్కువ మందిని సరిహద్దులో మోహరించామన్నారు. -
పడుపువృత్తి బ్రోకర్ల నుంచి రూ. లక్షల్లో లంచం..
సాక్షి, చెన్నై(తమిళనాడు): మసాజ్ సెంటర్లు, స్పాలు, స్టార్ హోటళ్లు, రిసార్టుల్లో వ్యభిచారం నిర్వహించుకునేందుకు అనుమతివ్వడమే కాకుండా.. బ్రోకర్ల నుంచి లక్షల్లో లంచం పుచ్చుకున్న ఇద్దరు ఇన్స్పెక్టర్ల పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా వారి ఇళ్లల్లో విస్తృతంగా మంగళవారం సోదాలు నిర్వహించింది. వివరాలు.. ప్రస్తుతం కీల్పాకం నేర విభాగం ఇన్స్పెక్టర్గా శాంవిన్సంట్, సైదాపే ట శాంతి భద్రతల విభాగం ఇన్స్పెక్టర్గా శరవణన్ పని చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వరకు ఈ ఇద్దరూ వ్యభిచార నిర్మూలన విభాగం ఇన్స్పెక్టర్లుగా పనిచేశారు. ఈ సమయంలో ఆ ఇద్దరూ విదేశీ, స్వదేశీ మోడల్స్‌ను చెన్నైకు రప్పించే బ్రోక ర్ల నుంచి లక్షల్లో లంచం పుచ్చుకుని చూసి చూడనట్టు వ్యవహరించినట్టు ఏసీబీకి ఫిర్యాదులందాయి. దీనిపై రహస్య విచారణ చేపట్టిన ఏసీబీ వర్గాలు ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లపై కేసు నమోదు చేసింది. అంతే కాకుండా, మంగళవారం ఉదయాన్నే వారి ఇళ్లల్లో సోదాలు చేసింది. కీల్పాకం పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉన్న శాం విన్సంట్, పులియాంతోపు పోలీసు క్వార్టర్స్‌లోని శరవణన్ ఇంటిలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
ఎక్సైజ్ సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖపట్నంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు పక్కదారి పట్టిన వ్యవహారంలో మర్రిపాలెం ఎక్సైజ్ సీఐ సీహెచ్.నాగశ్రీనివాసరావు, ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటుపడింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ రజత్‌భార్గవ ఉత్తర్వులిచ్చారు. విశాఖలోని మర్రిపాలెం స్పెన్సర్స్, లక్ష్మీనగర్, మల్కాపురం, శాంతిపురం మద్యం షాపుల్లో సూపర్వైజర్లు, సేల్స్మెన్లు నకిలీ రశీదులతో రూ.33.5 లక్షలు పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ సీఐ సీహెచ్ నాగశ్రీనివాసరావు పాత్ర ఉండడంతో అతడిని సస్పెండ్ చేశారు. ఈ అక్రమాలతో సంబంధం ఉన్న హెడ్ కానిస్టేబుల్ కొండయ్య, కానిస్టేబుళ్లు జయరామ్, రామానాయుడులను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బెండపూడి శ్రీనివాసులు తెలిపారు. ఎస్ఐ విమలాదేవిపై చర్యలు తీసుకోవాలని ఎౖక్సైజ్ కమిషనర్‌కు సిఫార్సు చేసినట్లు చెప్పారు. చదవండి: విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం.. మత్తు.. చిత్తు: అక్రమ రవాణాపై ఉక్కుపాదం -
సుల్తాన్‌బజార్ సీఐ లక్ష్మణ్ కుటుంబానికి చేయూత
సాక్షి, హైదరాబాద్: 2009 బ్యాచ్ ఎస్సైలు మరోసారి తమ పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ బ్యాచ్‌మేట్ కుటుంబానికి చేయూతనందించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లోని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.లక్ష్మణ్ ఇటీవల నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లక్ష్మణ్ దంపతులిద్దరూ కన్నుమూశారు. లక్ష్మణ్ మృతితో ఆంధ్ర– తెలంగాణలో పనిచేస్తున్న అతని 2009 బ్యాచ్‌కి చెందిన 1,100 మంది పోలీసు అధికారులు స్పందించి రూ.35 లక్షలు పోగుచేశారు. గురువారం లక్ష్మణ్ దినకర్మలో అతని పిల్లలు ఆకాంక్ష, సహశ్‌కు ఆ డబ్బును అందజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న 2012 బ్యాచ్ ఎస్సైలు కూడా క్రిష్ణయ్య నేతృత్వంలో తమ వంతుగా రూ.4.5 లక్షలు సహాయం అందించారు. కార్యక్రమంలో 2009 బ్యాచ్ సొసైటీ సభ్యులు జి.శ్రీనివాస్, బి.ప్రమోద్, ఎస్కే లతీఫ్, బగ్గని శ్రీనివాస్, మందల రాజు పాల్గొన్నారు. -
మాస్క్ పెట్టుకోలేదారా.. ఇన్స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు!
కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ముఖానికి మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అసలు మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇంట్లోంచి అడుగు కిదిపితే చాలు ముఖానికి మాస్కులు వేసుకోక తప్పడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే మాస్క్ పెట్టుకొని పెట్టుకొని ఓ రకంగా ప్రజలకు విసుగొస్తుంది. కానీ ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్కులు ధరించడం తప్పనిసరి. తాజాగా ఓ యువకుడు మాస్క్ పెట్టుకోలేదని ఆడిగినందుకు కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రంలో నిత్యం 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రభుత్వం మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటోంది. పోలీసులు తమ ప్రత్యేక వాహనాల్లో రౌండ్స్ కొడుతూ ఎక్కడైనా ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే.. రఫ్పాడిస్తున్నారు. ఈ క్రమంలో ఖుషీ నగర్లో ఓ యవకుడు మాస్క్ లేకుండా దర్జాగా వెళ్తుంటే.. కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే అతన్ని ఆపి జీపులో ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరకు పంపాడు. ఇన్స్పెక్టర్ ఆ కుర్రాడి కాలర్ పట్టుకొని... "మాస్క్ పెట్టుకోమని ఇంతలా చెబుతుంటే ఎందుకంత నిర్లక్ష్యం.. ఇంత బలుపేంటి... మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు.. పెట్టుకోమని చెబుతున్నాం కదా" అంటూ ఫైర్ అయ్యి చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఆ యువకుడు పెట్టుకుంటాను సార్ అని అమాయకుడిలా నటిస్తుంటే.. పోనీలే అని అతనికి ఫైన్ వెయ్యకుండా వదిలాడు ఇన్స్పెక్టర్. అంతే ఆ క్షణంలో ఆ కుర్రాడు ఇన్స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు. షాకైన ఇన్స్పెక్టర్.. రేయ్ అనేసరికి. అక్కడి నుంచి పరుగందుకున్నాడు. అతన్ని పట్టుకుందామని పరుగెత్తిన కానిస్టేబుల్‌కి అతన్ని పట్టుకోవడం కుదరలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండి.. చదవండి: ఆక్సిజన్ కొరత: ఢిల్లీలో మరో 20 మంది కరోనా రోగులు మృతి ఏ మాస్క్ ఎలా వాడాలి? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. -
మహిళా పోలీస్‌పై ఇన్స్పెక్టర్ అత్యాచారం
లక్నో : మహిళా పోలీస్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ సస్పెండయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్కు చెందిన రాకేశ్ యాదవ్.. క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత అక్టోబర్ 29న ఓ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను తను ఉన్న హోటల్ గదికి తీసుకురావల్సిందిగా ఓ మహిళా పోలీస్‌ను ఆదేశించాడు. హోటల్ గదికి వెళ్లిన ఆమెపై అత్యాచారం చేశాడు. (పిల్లల కళ్ల ముందే సెల్ఫీ వీడియో తీసుకొని..) ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆమె ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. అయితే దాన్ని అలసుగా తీసుకున్న రాకేశ్ తరుచుగా ఆమెకు ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఇన్స్పెక్టర్ కోసం గాలిస్తున్నారు. -
కీచక ఇన్స్పెక్టర్.. మైనర్‌ను వ్యభిచారకూపంలోకి ఆపై..
సాక్షి, చెన్నై: 13 ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచారకూపంలోకి దించి, లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఎన్నూరు ఇన్స్పెక్టర్ పుహలేంది బుక్కయ్యాడు. ఆయన్ను మహిళా పోలీసులు అరెస్టు చేశారు. వాషర్మెన్ పేట మహిళా పోలీసుల్ని షబీనా అనే మహిళ రెండు రోజుల క్రితం ఆశ్రయించింది. తన అక్క సమిత భానుతో పాటు మరి కొందరు 13 ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించారని, ఆమెపై ప్రతిరోజూ లైంగిక దాడి జరుగుతున్నట్టు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారంతో ఇన్స్పెక్టర్ ప్రియదర్శిని నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఎనిమిది మందిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సమయంలో బీజేపీకి చెందిన రాజేంద్రన్ పోలీసులకు చిక్కాడు. (డార్లింగ్ పేరుతో యూట్యూబ్‌లో భార్య నగ్న చిత్రాలు) చిక్కిన ఇన్స్పెక్టర్... రాజేంద్రన్ వద్ద జరిపిన విచారణలో తాను, ఎన్నూరు నేర విభాగం ఇన్స్పెక్టర్ పుహలేంది ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్టు చెప్పాడు. ఇన్స్పెక్టర్ పుహలేందిపై మహిళా పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ఆ బాలికను తన వాహనంలో పుహలేంది తీసుకెళ్లినట్టు, రాజేంద్రన్ కార్యాలయంలోకి వెళ్లినట్టుగా ఆధారాలు చిక్కినట్టు సమాచారం. దీంతో పుహలేంది అడ్డంగా బుక్క య్యాడు. సోమవారం రాత్రి ఆయన్ను మహిళా ఇన్స్పెక్టర్ ప్రియదర్శిని నేతృత్వంలోని బృందం అరెస్టు చేసింది. లైంగిక దాడి కేసులో ఓ ఇన్స్పెక్టర్ అరెస్టు సమాచారం స్థానికంగా చర్చకు దారి తీసింది. ఆయనపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ సమాచారంతో ఆ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. (సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సజీవ దహనం చేసిన అత్తింటివారు) -
నేనే రాజు.. నేనే మంత్రి !
సర్కిల్ పరిధిలోని ఓ గ్రామంలో వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలిక ఇంట్లో చెప్పకుండా ఓ అబ్బాయితో వెళ్లింది. బాలిక తల్లిదండ్రులు స్టేషన్‌కు వెళ్లి ఆ అధికారి కాళ్లపై పడి కుమార్తెను అప్పగించాలని ప్రాధేయపడ్డారు. ఇక్కడ కూడా తన తీరు మార్చుకోని ఇన్స్పెక్టర్, మీ అమ్మాయిని అప్పగించాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు తమవి, అంత ఇచ్చుకోలేమని బతిమిలాడి రూ.15 వేలు ముట్టచెప్పారు. దీంతో బాలికను వారికి అప్పగించిన ఇన్స్పెక్టర్, అబ్బాయి వారి నుంచి రూ.50 వేలు తీసుకుని ఎలాంటి కేసు లేకుండా చేశాడు. సాక్షి, వరంగల్ / వరంగల్ క్రైం : ఆ పోలీస్‌స్టేషన్‌లో ఆయన చెప్పిందే వేదం. అక్కడకు వచ్చే బాధితులు సుంకం కట్టకుండా బయటకు వెళ్లడం సాధ్యం కాదు. కేసు ఏదైనా సరే సుంకం కట్టాల్సిందే. కొత్త నిబంధనలు, ప్రతీ కేసుకో లెక్క, ఆ లెక్కకో రేటు కట్టి మరీ వసూలు చేయడం ఆయన నైజం! ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ‘గబ్బర్ సింగ్’లా పోలీస్ స్టేషన్లో పద్ధతులు మార్చేశాడు. సదరు అధికారి విధులు నిర్వర్తించే కాజీపేట సబ్ డివిజన్లోని ఓ పోలీసుస్టేషన్‌కు బాధితులు వెళ్లి ఫిర్యాదు చేయాలంటేనే జంకుతున్నారు. ఆ ఇన్స్పెక్టర్ స్టేషన్లో బాధ్యతలు తీసుకుని సుమారు 10 నెలలు గడిచింది. అప్పటి నుంచి ఒక్కో పనికి ఒక్కో రేట్ చొప్పున ఫిక్స్ చేసి నెలనెలా రూ.లక్షలు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పంట కోత సీజన్లో హార్వెస్టర్ల యాజమానుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేసిన ఆ ఇన్స్పెక్టర్ తనకు తానే సాటి అని నిరూపించుకున్నట్లు సొంత శాఖలోనే చర్చ సాగుతోంది. పోస్టింగ్‌కు ఖర్చు చేశాం కదా! మామూళ్లకు తెగబడిన ఆ ఇన్స్పెక్టర్ను ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే చెప్పే సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ‘రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నాం... ఆ పెట్టుబడి కూడా రాబట్టుకోలేకపోతే ఉద్యోగం ఎందుకు’ అంటూ చెబుతుండడం గమనార్హం. ఆ ఇన్స్పెక్టర్ వచ్చిన ప్రతీ అవకాశాన్ని డబ్బు రూపంలో మార్చుకోవడం సిద్దహస్తుడిగా చెబుతారు. అవినీతికి కేరాఫ్‌గా నిలిచిన ఆయన వైఖరిపై వరుస ఫిర్యాదులు అందడంతో ఇంటలెజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అండ ఉంది.. లాక్డౌన్ సమయంలో పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్న సదరు ఇన్స్పెక్టర్ డబ్బు తీసుకుని తక్కువ మొత్తంలో స్టాక్‌ను చూపెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో అప్పటి ఉన్నతాధికారుల నుంచి మందలింపునకు గురైనా ఆయన తీరులో మార్పు రాలేదు. రాష్ట్ర స్థాయిలో పేరు ఉన్న ఓ కీలక ప్రజాప్రతినిధి, మంత్రి పేరు చెప్పుకుంటూ వారి అండదండలు తనకు ఉన్నాయని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం వివాదాస్పదంగా మారింది. ఆ కీలక ప్రజాప్రతినిధి అన్న అండదండలు తనకు ఉన్నాయని, తన పోస్టింగ్‌కు ఎలాంటి ఢోకా లేదని ధీమాతో ఉన్న సదరు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఎన్నెన్నో లీలలు ఓ గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదని, తల్లీకుమార్తెలు కలిసి హత్య చేశారని గ్రామంలో ప్రచారం జరిగింది. అయితే, పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడంతో కనీసం ఆత్మహత్య కేసు కూడా నమోదు చేయకుండా దహన సంస్కరాలు చేయించేశారు. ఇక్కడ కూడా ఇన్స్పెక్టర్ కీలకంగా వ్యవహరించారని సమాచారం. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే, ఏం ఏం జరిగిందో తెలియదు కానీ కేసు నమోదు కాలేదు. యువకుడి అంత్యక్రియలు సాధారణంగా జరిగిపోయాయి. ఊరూరా తిరిగి జాతకాలు చెప్పుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తూ డివైఢర్‌ను ఢీకొని మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాక బండి అప్పగించటానికి రూ.10 వేలు డిమాండ్ చేశారు. ఎందుకని ప్రశ్నిస్తే కేసు నమోదు చేస్తేనే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది కాబట్టి, రూ.10వేలు ఇవ్వాల్సిందేనని ఇన్స్పెక్టర్ సమాధానం చెప్పాడు. సర్కిల్ పరిధిలో ఓ వ్యక్తి కారుతో మరో వ్యక్తిని ఢీకొట్టడంతో పెద్ద మనుషుల సమక్షంలో చర్చించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి పరిహారంగా రూ. 65 వేలు ఇప్పించగా వివాదం సమసిపోయింది. కానీ విషయం ఇన్స్పెక్టర్కు తెలియగానే ఎవరూ ఫిర్యాదు చేయకున్నా కారును తీసుకువచ్చి, రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో చేసేదేం రూ.70 వేలు సమర్పించుకుని కారు విడిపించుకున్నారు. భార్యాభర్తల మధ్య వివాదం పంచాయితీగా మారింది. విడిపోవటానికి భర్త నుంచి భార్యకు నష్టపరిహారంగా రూ. 8.75 లక్షలు చెల్లించాలని కుల పెద్దలు నిర్ణయించారు. ఆ తర్వాత భర్త ఇన్స్పెక్టర్ను ఆశ్రయించడంతో రూ.50 వేలు తీసుకుని భార్య తరపు వారిని బెదిరించి రూ.3 లక్షలకు పరిహారాన్ని తగ్గించారనే ఆరోపణలు వచ్చాయి. వివాదంలో ఉన్న స్థలం వెంచర్‌గా మారింది. దీనికి గాను స్థలం అమ్ముకున్న వ్యక్తి నుంచి రూ.5 లక్షలు, కొనుక్కున్న వ్యక్తి నుంచి రూ.2 లక్షలు బహుమతి రూపంలో ఇన్స్పెక్టర్ తీసుకున్నట్లు సర్కిల్ పరిధిలో చర్చ జరిగింది. గుట్కాల వ్యాపారాన్ని చూసీచూడనట్లు ఉండటానికి వ్యాపారులు నెలనెలా రూ.2.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో తీసుకొచ్చే గుట్కాలు ఇక్కడి నుంచే జిల్లా కేంద్రానికి సరఫరా అవుతుండడం గమనార్హం. మండలం, సర్కిల్ పరిధిలో ఉన్న రెండు, మూడు వాగుల నుంచి నిత్యం సుమారు 70 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి నెలకు రూ.10 వేలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మనసున్న రాజేశ్వరి
సాక్షి, చెన్నై: చెన్నైలో పనిచేస్తున్న మహిళా ఇన్స్పెక్టర్ రాజేశ్వరి మనసున్న మహిళగా మరోమారు నిరూపించుకున్నారు. తన వద్దకు వచ్చి మొరపెట్టుకున్న చూపు లేని ఓ యువతికి వివాహం నిమిత్తం 16 రకాల వస్తువులతో సారెను అందించి మానవీయతను చాటుకున్నారు. చెన్నై సెక్రటేరియెట్ కాలనీ పోలీసుస్టేషన్లో రాజేశ్వరి సీఐగా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో ఈమె సేవలు అభినందనీయం. రోడ్డుపై అనాథగా పడి ఉన్న వృద్ధురాలి మృతదేహానికి అన్నీతానై అంత్యక్రియలు సైతం జరిపించారు. సాయం అంటూ తన వద్దకు ఎవరైనా వస్తే చేతనైనంత సహకారం అందిస్తున్నారు. ఈపరిస్థితుల్లో తన పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న చూపు లేని (అంధురాలు) సుకన్య వారం రోజుల క్రితం రాజేశ్వరిని కలిశారు. తన తల్లిదండ్రులు ఎప్పుడో మరణించారని, తాను, తన సోదరి ప్రీతి పిన్ని సురేఖ పర్యవేక్షణలో ఉన్నట్టు పేర్కొన్నారు. చిన్నాన్న కూలి పనులు చేస్తున్నాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు వివరించారు. 16 రకాల వస్తువులతో సారె .... తనకు కోయంబత్తూరుకు చెందిన యువకుడితో సెప్టెంబర్ 4న పెరంబలూరులో వివాహం జరగనున్నట్టు పేర్కొన్నారు. తన వివాహానికి ఏదేని నగదు సాయం చేయాలని సుకన్య విజ్ఞప్తి చేసుకుంది. అయితే, తాను వివాహానికి పెద్దగా సాయం చేయలేనంటూ ఇన్స్పెక్టర్ తొలుత నిరాకరించారు. ఒట్టి చేత్తో సుకన్య పోలీసుస్టేషన్ నుంచి వెనుదిరిగింది. శుక్రవారం ఇన్స్పెక్టర్ రాజేశ్వరికి సుకన్య ఫోన్ చేసి కనీసం చిన్న ముక్కు పుడక లేదా, చెవిదిద్దులైనా సాయం చేయాలని కోరింది. దీంతో సుకన్య చెబుతున్నది వాస్తవమేనా అని రాజేశ్వరి ఆరా తీయడంతో ఆమె పేదరికం వెలుగు చూసింది. దీంతో ఒక్క ముక్కుపుడక ఏమిటి, చెవి దిద్దులు, వెండిపట్టీలు, బీరువా, మంచం, పట్టు చీర పాటుగా మరికొన్ని చీరలు, ఫ్యాన్, మిక్సీ, గ్రైండర్, వాటర్ హీటర్ అంటూ ఇంటి సామన్లతో 16 రకాల సారెను తన వంతుగా రాజేశ్వరి కొనుగోలు చేసి ఇవ్వడానికి నిర్ణయించారు. శనివారం రాత్రి తన స్టేషన్‌కు సుకన్యను పిలిపించారు. ఈ సమాచారంతో ఆ పరిసర వాసులు సైతం ఆస్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సుకన్యను కొత్త పెళ్లి కూతుర్ని చేసినట్టుగా పట్టు చీర కట్టించి, పూలమాల వేసి , తన వంతుగా ఆ సారెను అందించి మనస్సున్న రాజేశ్వరిగా అందరి మదిలో ఈ మహిళా ఇన్స్పెక్టర్ ముద్ర వేసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఆశీర్వాదం తీసుకున్న సుకన్య ఆనందానికి అవధులు లేదు. పుట్టింటి సారెగా రాజేశ్వరి ఇచ్చిన కానుకకు తోడుగా ఆ కాలనీ వాసులు పలువురు ముందుకు వచ్చి తమ వంతు సాయానికి సిద్ధమయ్యారు. -
లంచం కేసు.. సీఐ శంకరయ్య అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్యను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కేసు వివాదంలో లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి శంకరయ్య ఇంటిలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటిలో భారీగా నగదు, నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంకరయ్యను ఈ రోజు సాయంత్రం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.శంకరయ్యతో పాటు ఏఎస్ఐ రాజేందర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. (ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ) -
కారులో పోలీసు అధికారి మృతదేహాం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ స్ఫెషల్ సెల్‌కి చెందిన ఇన్స్పెక్టర్ ఒకరు తన కారులో శవమై కనిపించారు. ఢిల్లీలోని కేశవపురంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరో ఒక వ్యక్తి కారులో కదలికలు లేకుండా పడి ఉన్నారంటూ స్థానిక పోలీసు స్టేషన్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసు ఆయనని ఢిల్లీ స్ఫెషల్ సెల్ ఇన్స్పెక్టర్ విశాల్ కన్వాకర్(45) గా గుర్తించారు. 1998 బ్యాచ్‌కు చెందిన ఆయన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్లో పనిచేస్తున్నారు. (ఆసుపత్రులకు వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్) అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఈ విషయం గురించి అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందిచారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం పూర్తి అయితే కానీ పూర్తి వివరాలు తెలియమని వారు పేర్కొన్నారు. (ఆరుగురికి కరోనా; ఈడీ ప్రధాన కార్యాలయం సీజ్) -
కరీంనగర్ టు టౌన్ సీఐపై ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఆయనో పోలీస్ అధికారి.. తన సమీప బంధువులకు చెందిన కారును అపహరించారు. కారు యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి, తప్పుడు వివరాలతో ఇన్సూరెన్స్ సైతం క్లయిమ్ చేశారు. చివరకు ఫోరెన్సిక్ ఆధారాలు ఆయన నిందితుడని ప్రాథమికంగా తేల్చాయి. కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన ఇన్స్పెక్టర్ దేవరెడ్డి.. సదరు నేరం చేశారనడానికి అవసరమైన ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఓయూ పోలీసులు మూడు రోజుల క్రితం సీఆర్పీసీ 41 (ఏ) సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. సోమవారంలోపు తమ ఎదుట హాజరై ఆరోపణలకు సంబంధించి వివరణనివ్వాలని స్పష్టం చేశారు. దీంతో కరీంనగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ దేవరెడ్డిని కమిషనర్ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హబ్సిగూడలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో నివసించే రాగిడి లక్ష్మారెడ్డి భార్య రజని వెర్నా కారు (ఏపీ29 ఏఈ 0045).. 2013, మార్చి 11న చోరీకి గురైంది. దీనిపై మార్చి 14న, తర్వాత అనేకసార్లు ఉస్మానియా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె తన వాహనం ఆచూకీ కనిపెట్టడానికి భర్తతో కలసి ప్రయత్నాలు ప్రారంభించారు. 2017, డిసెంబర్ 17న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లి ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే 2015, ఏప్రిల్ 4న దేవరెడ్డి ఆ వాహనానికి ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా తీసుకున్నారని, ఆ సందర్భంలో యజమాని పేరు, వివరాలను ‘రజని.ఆర్ కేరాఫ్ దేవరెడ్డి’గా పేర్కొన్నారని తెలుసుకున్నారు. దీంతో ఆమె జరిగిన విషయం చెప్పి, ఇన్సూరెన్స్ కంపెనీని వివరాలు కోరారు. కోర్టు ఆదేశాల మేరకు..: ఇదిలా ఉండగా దేవరెడ్డి ఆధీనంలో ఉన్న ఆ కారు ప్రమాదానికి గురైంది. 2018, జనవరి 18న రజని మాదిరిగా సంతకాలు చేసి సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లయిమ్ కూడా పొందారు. హైదరాబాద్ మెట్టుగూడలోని ఆలుగడ్డ బావి ప్రాంతానికి చెందిన దేవరెడ్డి ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో సీఐగా పని చేస్తున్నారు. ఈ తతంగంపై రజని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు దేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మార్చి 25న ఓయూ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దేవరెడ్డిని నిందితుడిగా పేర్కొంటూ చోరీ, ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలు చేర్చారు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 2018, జనవరిలో క్లయిమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాలను ఓయూ పోలీసులు సంపాదించారు. ఆ సమయంలో దేవరెడ్డి తన డ్రైవింగ్ లైసెన్సును దాఖలు చేశారని, క్లయిమ్ ఫామ్స్‌పై రజనీ మా దిరిగా సంతకం ఉన్నట్లు గుర్తించారు. దీంతో రజని నుంచి సంతకాల నమూనాలు తీసుకున్న పోలీసులు వాటితో పాటు క్లయిమ్ ఫామ్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. క్లయిమ్ ఫామ్‌పై సంతకం చేసింది రజని కాదని ‘ఫోరెన్సిక్’ తేల్చింది. దీని ఆధారంగా ఓయూ పోలీసులు దేవరెడ్డిని నిందితుడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో సోమవారంలోపు తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ఫిర్యాదు చేసినవారు నిందితుడి సమీప బంధువులే అని పేర్కొన్నారు. నోటీసుల నేపథ్యంలో దేవరెడ్డిని కరీంనగర్ కమిషనరేట్‌కు ఎటాచ్ చేశారు. ‘మా కారును దేవరెడ్డి చోరీ చేశాడని 2013లోనే ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశాం. అప్పట్లో ఆ ఠాణాలో పనిచేసిన వారు దేవరెడ్డికి వత్తాసు పలుకుతూ మా ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో ప్రాథమిక ఆధారాలు సేకరించి కోర్టును ఆశ్రయించాం. అప్పుడు కేసు నమోదై, దర్యాప్తు ప్రారంభమైంది’అని రాగిడి లక్ష్మారెడ్డి ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. -
పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాది, ఎస్ఐల బాహాబాహి
తిరువొత్తియూరు: చెన్నై సమీపంలోని పట్టాభి రాం పోలీసుస్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్, న్యాయవాది పరస్పరం దాడులు చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పట్టాభిరాం పోలీసుస్టేషన్లో జగదీశన్ సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ కేసుకు సంబంధించి ఐనావరంకు చెందిన న్యాయవాది కార్తీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో సబ్ ఇన్స్పెక్టర్, న్యాయవాదికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. అనంతరం ఇద్దరు వేర్వేరుగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జాయింట్ కమిషనర్ జగదీశన్‌ను తాత్కాలికంగా బాధ్యతల నుంచి తొలగించారు. -
మహిళా ఇన్స్పెక్టర్ భర్త ఆత్మహత్య
తమిళనాడు, టీ.నగర్: అన్నానగర్‌లో మహిళా ఇన్స్పెక్టర్ భర్త సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నై అన్నానగర్ పోలీసు క్వార్టర్స్‌లో నివసిస్తున్న సుచిత్రాదేవి (40) ఇన్స్పెక్టర్. ఈమె మొదటి భర్త బాలాజి అనారోగ్యం కారణంగా 2009లో మృతి చెందారు. ఈమెకు దక్షన్ (10) అనే కుమారుడు వున్నాడు. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. సుచిత్రాదేవి హార్బర్లో మేనేజర్‌గా పని చేస్తున్న గోపీనాథ్ (35)ను 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి లక్షణ (03) అనే కుమార్తె ఉంది. సోమవారం సుచిత్రాదేవి భర్తతో ఫోన్లో మాట్లాడారు. ఆ సమయంలో నగదు కోరినట్లు సమాచారం. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఇంటికి వచ్చిన గోపీనాథ్ పడక గదికి నిద్రించేందుకు వెళ్లాడు. సుచిత్రాదేవి తలుపులు తట్టగా తెరచుకోలేదు. తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న అన్నానగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ఆసుపత్రికి పంపారు. దీనిపై మహిళా ఇన్స్పెక్టర్ సుచిత్రాదేవి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
మూసిన తలుపులు
ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించాడు. అదొక పడకగది. అందులోని సామాన్లన్నీ పొందికగానే ఉన్నాయి. గది మధ్యలోని మంచంపై ఇంటి యజమాని చలపతిరావు వెల్లకిలా పడుకుని ఉన్నాడు. కాని ఆయన నిద్రపోవడం లేదు. శాశ్వత నిద్రలో ఉన్నాడు. చలపతిరావుకి డెబ్బయ్యేళ్లు ఉంటాయి. నగరంలో ఆయనకు రెండు రెడీమేడ్ బట్టల షాపులు ఉన్నాయి. నగర శివార్లలో ఉన్న ఈ ఇల్లు ఆయన స్వార్జితం.చలపతిరావు భార్య రెండేళ్ల కిందటే క్యాన్సర్‌తో చనిపోయింది. భార్య పోయాక ఆయన తన రెండు షాపుల్నీ ఇద్దరు కొడుకులకు అప్పగించి, తాను ఇంటికే పరిమితమయ్యాడు. పెద్దకొడుకు రాజేష్‌కి ఐదేళ్ల కిందట పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్‌కి తాగుడు అలవాటు ఉంది. ఇదే విషయమై తండ్రీ కొడుకుల మధ్య నెల్లాళ్ల కిందట పెద్ద గొడవే జరిగింది. రాజేష్ తండ్రి మీద అలిగి, ఇల్లు వదిలేసి భార్యాపిల్లలతో అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. చిన్నకొడుకు రమేష్‌కి ఇంకా పెళ్లి కాలేదు. ప్రస్తుతం తండ్రికి తోడుగా అతనొక్కడే ఉన్నాడు. ఆ రోజు ఉదయం ఏడుగంటలకు చలపతిరావు ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి, చలపతిరావు అనుమానాస్పద స్థితిలో మరణించాడని చెప్పడంతో ఇన్స్పెక్టర్ విజయ్ సిబ్బందితో సహా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.మృతదేహాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తుండగా, ఓ మూల కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తున్న రమేష్‌ని ఇన్స్పెక్టర్ విజయ్ పలకరించాడు. ఏం జరిగిందో చెప్పమన్నాడు. ‘‘సార్! నిన్న రాత్రి పనిమనిషి వంట చేసి వెళ్లిపోయాక నేను, నాన్నగారు భోజనాలు చేశాం. నాన్నగారు పది గంటలకల్లా తన గదిలోకి వెళ్లి పడుకున్నారు. నేనొక అరగంట టీవీ చూసి నా గదిలోకి వెళ్లి పడుకున్నాను. తెల్లవారాక పనిమనిషి వచ్చి కాలింగ్ బెల్ కొడితే నేను లేచి వెళ్లి తలుపు తెరిచాను. నిజానికి రోజూ నాన్నగారే తలుపు తెరిచేవారు. ఆయన ఎందుకు లేవలేదో చూడ్డానికి నేను ఆయన గదిలోకి వెళ్లాను. నాన్నగారిని ఎంత లేపినా లేవలేదు. నేను ఆందోళన చెంది మా ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్ చేశాను. ఆయన వచ్చి పరీక్షించి, నాన్నగారు పోయారన్నారు. తర్వాత ఆయనే ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచారు. ’’ అన్నాడు రమేష్.అక్కడే ఉన్న డాక్టర్, పనిమనిషి రమేష్ మాటల్ని సమర్థించారు. ‘‘మృతుని శరీరం కొద్దిగా రంగు మారింది. ఆయనపై విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానంతో నేను మీకు ఫోన్ చేశాను’’ అన్నాడు డాక్టర్. విజయ్‌కి ఒక విషయం అర్థం కాలేదు. ఇంటి ముఖద్వారానికీ, పెరటి వాకిలికీ లోపలి నుంచి గొళ్లెం వేసి ఉంది. అలాంటప్పుడు హంతకుడు ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? హత్య చేసి బయటకు ఎలా వెళ్లాడు? అసలిది హత్య కాదేమో! చలపతిరావు గుండెపోటు వల్ల మరణించి ఉంటాడేమో అనుకున్నాడు. తండ్రి మరణవార్త తెలియగానే చలపతిరావు పెద్దకొడుకు రాజేష్ తన భార్యతో కలసి అక్కడకు వచ్చాడు. తండ్రి శవం పక్కన కూర్చుని భోరున ఏడవసాగాడు. తర్వాత తమ్ముడు రమేష్‌ని చూడగానే కోపంగా లేచాడు. ‘‘ఈ దుర్మార్గుడే నా తండ్రిని చంపాడు. వీడు నా సొంత తమ్ముడు కాదు. వీడొక అనాథ. నాన్నగారు జాలిపడి వీణ్ణి దత్తత తీసుకున్నారు. పెంచిన తండ్రినే పొట్టన పెట్టుకున్నాడు. వీణ్ణి ప్రాణాలతో వదలను’’ అంటూ రాజేష్ రమేష్‌ని కొట్టబోయాడు. పోలీసులు జోక్యం చేసుకుని రాజేష్‌ని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఫోరెన్సిక్ నిపుణులు శవాన్ని పరీక్షించడం ముగించి, విషప్రయోగం వల్ల చలపతిరావు మరణించాడని ధ్రువీకరించారు. ఇన్స్పెక్టర్ విజయ్ ఇల్లంతా గాలించాడు. స్టోర్‌రూమ్‌లో ఒక క్లోరోఫాం బాటిల్‌తో పాటు దూది, విషం సీసా, వాడిన సిరంజీ దొరికాయి. హత్య ఎలా జరిగిందో విజయ్‌కి బోధపడింది. హంతకుడెవరో అర్థమైంది. వెంటనే రమేష్‌ని అదుపులోకి తీసుకున్నాడు.∙∙ పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్య రాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది. ముందుగా క్లోరోఫాంతో స్పృహ తప్పించి, తర్వాత సిరంజ్‌తో విషాన్ని ఇంజెక్ట్ చెయ్యడం వల్ల మరణం సంభవించింది. సంఘటనా స్థలంతో పాటు ఇంట్లోని మిగతా చోట్ల చలపతిరావు, రమేష్, పనిమనిషి వేలిముద్రలు తప్ప ఇంకెవరి వేలిముద్రలూ లభించలేదు. మరోపక్క ఇన్స్పెక్టర్ విజయ్ ఇన్వెస్టిగేషన్లో రమేష్ నిజంగానే చలపతిరావు దత్తపుత్రుడని తెలిసింది. ఒకప్పుడు రమేష్ తల్లిదండ్రులు చలపతిరావు ఇంట్లో పనిచేసేవారు. రమేష్ చిన్నతనంలో వారిద్దరూ కరెంట్ షాక్ వల్ల మరణించారు. అనాథగా మిగిలిన రమేష్‌ని చలపతిరావు దత్తత తీసుకున్నాడు. తన సొంత కొడుకు రాజేష్‌తో సమానంగా రమేష్‌ని చదివించాడు. తన భార్య పోయాక తనకు ఉన్న ఆస్తుల్ని ఇద్దరికీ చెరిసగం చెందేట్లు వీలునామా రాశాడు. ఇన్స్పెక్టర్ విజయ్ రమేష్‌పై ఎంత బలప్రయోగం చేసినా అతడు నేరాన్ని అంగీకరించలేదు. ‘‘నాలాంటి అనాథకి జీవితాన్ని ప్రసాదించిన దేవుడులాంటి మనిషిని నేనెందుకు చంపుతాను సార్! పైగా హత్య చేశాక అంత నిర్లక్ష్యంగా ఆధారాలు వదులుతానా?’’ అని వాదించాడు. విజయ్‌కి రమేష్ మాటల్లో నిజాయతీ కనిపించింది. ఎక్కడో పొరపాటు జరిగింది. మరోసారి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఏదైనా క్లూ దొరకొచ్చు అనుకుని మళ్లీ చలపతిరావు ఇంటికి వెళ్లాడు. ఇల్లంతా పరిశీలించాక పెరటి వాకిలి దగ్గరకొచ్చాడు. ఆ వాకిలి పక్కన ఒక పెద్ద కిటికీ ఉంది. పెరట్లోకి వెళ్లి ఆ కిటికీని పరిశీలించాడు. కిటికీకి ఉన్న చెక్కల ఫ్రేమ్ మధ్య మెటల్ గ్రిల్ బిగించి ఉంది. ఆ గ్రిల్‌కి నాలుగు మూలల్లో నాలుగు బోల్టులు ఉన్నాయి. విజయ్ కానిస్టేబుల్ చేత స్పానర్ తెప్పించి ఆ బోల్టుల్ని విప్పించాడు. బోల్టులు విప్పగానే గ్రిల్ మొత్తం కిటికీ ఫ్రేమ్ నుంచి వేరయిపోయింది. ఇప్పుడా ఫ్రేమ్ మధ్యలోంచి ఒక మనిషి సునాయాసంగా లోపలికి దూరవచ్చు. హంతకుడు ఇంట్లోకి ఎలా దూరాడో విజయ్‌కి ఇప్పుడు బోధపడింది. హంతకుడు ఎవరో కూడా తెలిసిపోయింది. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే రాజేష్‌ని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. దెబ్బలకు తాళలేక రాజేష్ నిజం కక్కేశాడు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి రమేష్ అంటే ద్వేషం. వాడు పెంపుడు కొడుకు అయినా నాన్న వాణ్ణి నాతో సమానంగా ప్రేమించేవాడు. చివరికి తన ఆస్తిపాస్తుల్లో సగం వాడికి చెందేలా వీలునామా రాశాడు. దాంతో నాకు రమేష్‌ని చంపాలన్నంత కోపం వచ్చింది. రమేష్‌ని చంపితే ఆస్తి మొత్తం నాకే వచ్చేస్తుంది. కానీ వాణ్ణి చంపితే పోలీసులు ముందు నన్నే అనుమానిస్తారు. అందుకే నాన్నని చంపేసి ఆ నేరం రమేష్ మీదపడేలా పథకం పన్నాను. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు రమేష్ హత్యానేరంపై జైలుకెళితే నా పగ చల్లారుతుంది. ఆస్తి మొత్తం నాకే వచ్చేస్తుంది. అందుకే పథకం ప్రకారం విషప్రయోగంతో నాన్నని చంపేశాను. నిజానికి మా ఇంటి వెనుక కిటికీ గ్రిల్‌ని నేను చాలా కాలం కిందటే బోల్టులతో విప్పడానికి అనువుగా మార్పించాను. నేను తాగి ఆలస్యంగా ఇంటికెళ్లినప్పుడు నాన్న నన్ను చెడామడా తిట్టేవాడు. ఆ బాధ పడలేక ఆ కిటికీని అలా మార్పించి, రాత్రిళ్లు రహస్యంగా కిటికీ తెరిచి, ఇంట్లోకి వచ్చేవాణ్ణి. ఈ రహస్యం నా భార్యకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆ రోజు రాత్రి ఆ కిటికీలోంచే ఇంట్లోకెళ్లి క్లోరోఫాంతో నాన్నకు స్పృహ తప్పించి, ఆయనకు విషాన్ని ఇంజెక్ట్ చేశాను. తర్వాత విషం సీసా, సిరంజిని స్టోర్‌రూమ్‌లో ఉంచి, వచ్చిన దారిలోనే వెళ్లిపోయాను. నా చేతులకు గ్లౌజ్ ఉండటం వల్ల ఎక్కడా నా వేలిముద్రలు పడలేదు. మూసిన తలుపుల వెనుక జరిగిన ఈ హత్యా రహస్యాన్ని పోలీసులు ఎన్నటికీ ఛేదించలేరనుకున్నాను. కానీ మీరు ఆ రహస్యం తెలుసుకున్నారు’’ నిరాశగా అన్నాడు రాజేష్? -
స్టార్ట్డస్ట్
జూనియర్ ఆర్టిస్ట్ సునందను ఎవరో కత్తితో పొడిచి చంపేశారని పోలీస్ స్టేషన్‌కి సమాచారం వచ్చింది. ఇన్స్పెక్టర్ వేణుగోపాల్‌కి ఫోన్ చేసి ఎస్సై అన్వర్ ఈ సంఘటన గురించి చెప్పాడు. అతను ఇంకా రెడీకాలేదు. ‘వేళాపాళా లేని దరిద్రగొట్టు ఉద్యోగం’ అని గొణుక్కుంటూనే స్టేషన్‌కి వెళ్లాడు.‘ఎక్కడ మర్డర్ జరిగిన స్పాట్?’’ స్టేషన్లోకి ఎంటరవుతూనే ఎస్సైని ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్వేణుగోపాల్.‘‘ఎల్లారెడ్డిగూడా సార్’’‘‘సరే.. పద..!’’ అని పోలీసు వ్యాన్‌లో కొందరు పోలీస్ కానిస్టేబుల్స్‌ని తీసుకుని బయల్దేరాడు. సునంద ఉంటున్నది ఒక రేకుల ఇల్లు. రెండువందల గజాల స్థలంలో చుట్టూ కాంపౌండ్ వాల్ మధ్య రెండుగదుల ఇల్లు. ఇంటి ముందు పూల మొక్కలతో నీట్‌గా ఉంది. బెడ్రూమ్లో సునంద రక్తపు మడుగులో పడి ఉంది. పల్చటి నీలం రంగు నైటీ వేసుకుని ఉంది. ఆమెకు సుమారు నలభై ఏళ్లుండొచ్చు.బెడ్ మీద శవం పడి ఉంది. ఒక స్టూలు మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది సునంద కూతురు అనుపమ.‘‘వెపన్ దొరుకుతుందేమో వెతకండి..’’ అని ఎస్సైతో చెప్పాడు ఇన్స్పెక్టర్ వేణుగోపాల్.‘‘ఎస్సార్..’’ అని హెడ్‌తో కలసి ఇల్లు, బయట పూలమొక్కల మధ్య, పెరట్లోను వెతకసాగాడు ఎస్సై అన్వర్.‘‘చెప్పమ్మా! మీ అమ్మను ఎవరు హత్య చేసి ఉంటారు?’’ అనుపమను ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్.‘‘ఏమో సార్! తెలియడం లేదు..’’ అని చున్నీతో కన్నీళ్లు తుడుచుకుంది.‘‘మీ అమ్మ చనిపోవడం ఎప్పుడు గమనించావు?’’‘‘నేను పక్క రూమ్‌లో పడుకుంటాను సార్! అమ్మ లేటుగా వస్తుంటుంది. షూటింగ్లో ఆలస్యమవుతూ ఉంటుంది. గేటు మామూలుగా తెరుచుకునేట్టు గొళ్లెం పెట్టి, ఇంటికి తాళం వేసి వెనుక పెరట్లో నుంచి లోపలకు వెళ్లి పడుకుంటాను. అమ్మ దగ్గర డూప్లికేట్ ‘కీ’ ఉంటుంది. ఎప్పుడో వచ్చిపడుకుంటుంది. నైట్ షూటింగులప్పుడు అలాగే జరుగుతుంది. నిన్న రాత్రి కూడా నేను లాక్ చేసి పెరట్లో నుంచి ఇంట్లోకి వచ్చి పడుకున్నాను. రోజూ నేనే ముందు లేస్తాను. ఇల్లు ఊడ్చి టీ పెట్టిన తర్వాత అమ్మను నిద్ర లేపుతాను. అలాగే ఈరోజూ లేచాను. అయితే, ఇంటి తలుపుకి లోపల బోల్టు పెట్టి లేదు. అమ్మ లాక్ తీసి, లోపలకు వచ్చి బోల్టు పెట్టడం మర్చిపోయిందేమో అనుకున్నాను. టీ పెట్టి అమ్మ రూమ్‌లోకి వెళ్లి చూసే సరికి చనిపోయి ఉంది. నెత్తుటితో నైటీ తడిసిపోయి ఉంది సార్!..’’ అని ఏడవసాగింది అనుపమ. ఎస్సై వచ్చి ‘‘సార్! ఎక్కడా వెపన్ కనిపించలేదు.’’ అన్నాడు నెమ్మదిగా.‘‘అమ్మాయ్! మీ నాన్న ఎక్కడ?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘సార్! లేడు. నా చిన్నప్పుడే అమ్మా నాన్నా విడిపోయారు. ఇంట్లో అమ్మా నేనూ మాత్రమే ఉంటాం’’‘‘నువ్వు చదువుకుంటున్నావా?’’‘‘ఇంటర్ పాసయ్యాను సార్!’’‘‘తర్వాత కాలేజీలో చేరలేదా?’’‘‘మా అమ్మకు ఇష్టం లేదు నేను కాలేజీలో చేరడం. నన్ను సినిమాల్లో చేర్చాలని ట్రై చేస్తోంది. ఉద్యోగం చేస్తే ఏం సంపాదిస్తావు? సినిమా హీరోయిన్ అయితే కోట్లు సంపాదిస్తావు అంటుంది కాని నాకుచదువుకోవాలని ఉంది..’’అనుపమ మాటల్లో ఏదో క్లూ దొరుకుతున్నట్లుగా అనిపించసాగింది ఇన్స్పెక్టర్కి.‘‘చెప్పు! మీ అమ్మకు విరోధులు ఎవరైనా ఉన్నారా?’’‘‘నాకు తెలిసి ఎవరూ లేరు సార్! అమ్మ అందరితోనూ మంచిగా ఉంటుంది.’’‘‘మీ అమ్మ ఎవరికైనా డబ్బు ఎగ్గొట్టడం, అన్యాయం చెయ్యడంలాంటివి చేసి ఉండాలి. ఎవరైనా ఊరికే మర్డర్ చెయ్యరు కదా..?’’ ఇన్స్పెక్టర్ మాటలకు రెస్పాన్స్ ఇవ్వలేదు అనుపమ. మౌనంగా ఉండిపోయింది. అప్పుడప్పుడు చున్నీతో కన్నీళ్లు తుడుచుకుంటోంది.ఇంతలో ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్, ఫొటోగ్రాఫర్ వచ్చారు. వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. పోలీసు కుక్కని తీసుకొచ్చాడు ట్రైనర్. బెడ్ దగ్గర వాసన చూసి బయటకు పరుగెత్తింది. శ్రీనగర్ కాలనీరోడ్డు మీద నుంచి స్టేట్ హోమ్ దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. హంతకుడు హత్యచేసి నడుచుకుంటూ స్టేట్ హోమ్ వరకు వెళ్లాడు. అక్కడి నుంచి ఎటు వెళ్లాడో జాడ కనిపెట్టలేకపోయింది కుక్క. అంటేఅక్కడి నుంచి ఏదో ఒక వెహికల్లో వెళ్లిపోయాడు హంతకుడు అని డిసైడ్ అయ్యాడు ఇన్స్పెక్టర్.‘‘ఈ ఇల్లు మీ సొంతమేనా?’’ అనుపమని అడిగాడు ఇన్స్పెక్టర్.‘కాదు సార్! సోమరాజుది..’’‘సోమరాజు ఎవరు?’’మాటల్లోనే అక్కడకు వచ్చాడు సోమరాజు.‘‘సార్! నేనే సోమరాజు.. జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌ని. ఈ ఇల్లు నాదే. సునంద అద్దెకు ఉంటోంది’’ అన్నాడు.ఇన్స్పెక్టర్ అతన్ని ఎగాదిగాచూశాడు. ‘‘చెప్పండి సోమరాజూ! సునందను ఎవరు మర్డర్ చేసి ఉంటారు..?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘సునంద మంచిది సార్! ఎవరితోనూ తగాదాలు పడే మనిషి కాదు. ఎందుకు మర్డర్ చేశారో అర్థకావడం లేదు..’’ విచారంగా చెప్పాడు.‘‘మర్డర్ చేసిన వాడు దొంగ మాత్రం కాదు. ఎందుకంటే ఆమె వంటి మీద బంగారం అలాగే ఉంది. బీరువా తెరిచినట్లు లేదు. కేవలం ఏదో కసితోనే మర్డర్ చేశాడు.’’అన్నాడు ఇన్స్పెక్టర్.శవ పంచనామా చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఇంక్వెస్ట్ రిపోర్ట్ కోసం పంపించారు పోలీసులు. ఎల్లారెడ్డిగూడలో సునంద ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేసి వచ్చారు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ అన్సారీ, జనార్దన్‌లు.‘‘సార్! సునందకు, సోమరాజుకు ఇల్లీగల్ కనెక్షన్ ఉందని చెప్తున్నారు. ఆ స్థలం సోమరాజు కబ్జా చేసి ఆక్రమించుకున్నాడు. వాడి కన్ను అనుపమ మీద ఉంది. అనుపమకు బాగా చదువుకోవాలని ఉంది. బాగా చదివి డాక్టర్ అవుతానని చుట్టుపక్కల పిల్లలతో అంటుండేదట. అనుపమనుహీరోయిన్ చెయ్యాలని తల్లి సునంద, సోమరాజు ఆమె మీద ఒత్తిడి తెస్తున్నారట.’’‘‘ఆ సంగతి అనుపమే చెప్పింది. చదివి ఏం సంపాదిస్తావు? హీరోయిన్ అయితే కోట్లు సంపాదిస్తావు అని సునంద కూతురితో అంటుండేదట. అయితే అనుపమకు అదంతా ఇష్టంలేదు. అదే ఇప్పుడు ప్రాబ్లెమ్.’’‘‘సునంద ప్రాబ్లమ్ అదే సార్! అరకొర సంపాదనతో కూతుర్ని చదివిస్తోంది. మెడికల్ కాలేజీలో చదివించాలంటే అది ఆమె వల్ల కాదు. అనుపమ మెరిట్ స్టూడెంట్. ఎంసెట్‌లో ర్యాంకు తెచ్చుకుంటే వస్తుందని, కోచింగ్‌కు వెళతానని పట్టుబట్టింది. సునంద ఒప్పకోలేదు. కూతుర్ని కొడుతుందని, ఆమె ఏడుపులు బయటకు వినిపిస్తుంటాయని చెప్పారు.’’ జనార్దన్ చెప్పాడు.ఇన్స్పెక్టర్ తల ఊపాడు.‘‘జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ దగ్గర ఇంకొక సంగతి కూడా చెప్పారు.’’ అన్నాడు అన్సారీ.‘‘ఏంటది?’’‘‘టిప్పుఖాన్ అని ఒక గూండా ఉన్నాడట. వాడు సినిమాలకు ఫైనాన్స్ కూడా చేస్తాడట. వాడు తల్చుకుంటే అమ్మాయిలకు సినిమా చాన్సులు ఇప్పిస్తాడట. అయితే, వాడితో అమ్మాయిలు గడపాలట. అదంతా ఇక్కడ కాదు. టూరిజం అని సింగపూర్‌కో, బ్యాంకాక్‌కో తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తాడట. సోమరాజు టిప్పుఖాన్ గుడ్‌లుక్స్‌లో ఉన్నాడట. అనుపమ ఫొటోలు టిప్పుఖాన్కి చూపించి, హెల్ప్చెయ్యమని సునందని తీసుకెళ్లి అడిగించాడట. యూరప్ ట్రిప్ వెళ్తున్నాను. అనుపమని పంపించమన్నాడట. టాప్ హీరో పక్కన హీరోయిన్ చాన్స్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడట టిప్పుఖాన్. అనుపమఒప్పుకోవడం లేదట. సోమరాజు కూడా ఇంటికెళ్లి అనుపమను కొడుతున్నాడని చెప్తున్నారు.’’ చెప్పాడు అన్సారీ.ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడిపోయాడు.‘‘చదువుకుని జాబ్ సంపాదించుకుని గౌరవంగా బతకాలని అనుపమ ఆశపడుతోంది. తల్లే అడ్డుపడుతోంది. ఘర్షణ తల్లీకూతుళ్లదే..’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘అనుపమే తల్లిని చంపి ఉంటుందేమో సార్!’’ అన్సారీ సందేహం వెలిబుచ్చాడు.‘అనుపమకు అంత సాహసం ఉండదు. అనుపమ మేలు కోరే వారెవరో సునందను హత్య చేసి ఉంటారు.’’ అన్నాడు ఇన్స్పెక్టర్ వేణుగోపాల్.‘సార్! శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడా చౌరస్తాలో కరెంట్ పోల్ మీదఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీ తెచ్చాను’’ అన్నాడు ఎస్సై అన్వర్ వచ్చీరాగానే.పెన్‌డ్రైవ్ కంప్యూటర్‌కి అటాచ్ చేసి సీసీ కెమెరా రికార్డు చేసిన ఫుటేజీ చూస్తున్నారు. రాత్రి పదిగంటలకు అనుపమ, ఒక సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతోంది. అనుపమ ఏడుస్తుంటే అతను ఓదారుస్తున్నాడు. అతనికి దాదాపు యాభయ్యేళ్లు ఉన్నట్టుగా ఉంది. మనిషి లావుగా ఎత్తుగా ఉన్నాడు.‘‘హంతకుడు దొరికాడు పదండి.’’ అన్నాడు ఇన్స్పెక్టర్ సీట్లోంచి లేస్తూ..పోలీసు వ్యాను సరాసరి ఆ బ్యాంకు ముందు ఆగింది. సెక్యూరిటీ గార్డు తుపాకీ పట్టుకుని అటెన్షన్లో నిలబడ్డాడు పోలీసులను చూసి.‘‘దామోదర్!నిన్ను అరెస్టు చేస్తున్నాం.’’ అన్నాడు ఇన్స్పెక్టర్ వేణుగోపాల్.‘‘అరెస్టు చేస్తున్నారా? ఎందుకు?’’ అన్నాడు వెలవెలబోతున్న ముఖంతో.‘‘ఎందుకా? సునందను చంపినందుకు.’’‘నేనా..?’’‘‘ఆ.. నువ్వే.. పద..’’ అన్నాడు ఇన్స్పెక్టర్.బ్యాంకు మేనేజర్‌కి విషయం చెప్పి డ్యూటీ నుంచి తప్పించి, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు దామోదర్ని. అతను సునంద భర్త.విడాకులిచ్చాడు.అనుపమ అతని కూతురే. పెద్దగా శ్రమ లేకుండా సునందను హత్య చేసిన విషయం ఒప్పుకున్నాడు.‘‘నిజం సార్! సునందను నేనే హత్య చేశాను. అది నీచురాలు. సినిమాల్లో వేషాల కోసం నన్ను కాదని వెళ్లిపోయింది. దాని తిరుగుళ్లు భరించలేక విడాకులిచ్చాను. అది నా కూతుర్ని కూడా పాడు చేయాలని చూస్తోంది. అనుపమ అదంతా చెప్పుకుని ఏడుస్తోంది. ఆ రోజు అనుపమ తలుపు తీసింది. గదిలో నిద్రపోతున్న సునందను నేనే చంపాను. నా కూతురు జీవితం కాపాడుకోవడానికి హత్య చేశాను’’ చెప్పాడు దామోదర్. - వాణిశ్రీ -
కానిస్టేబుల్‌గా చేరి.. రూ.కోట్లు కొల్లగొట్టాడు
విశాఖ క్రైం: కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు... అక్కడి నుంచి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయికి చేరాడు... ఈ మధ్యలో అందినకాడికి దోచుకుని కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. అలా అక్రమార్జనతో భారీగా స్థిరాస్తులు సంపాదించి ఏసీబీకి చిక్కాడు ఏఎంవీఐ కొత్తపల్లి రవికుమార్. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలతో ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌తోసహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కొత్తపల్లి రవికుమార్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు సమాచారంతో విశాఖలోని శ్రీహరిపురం కోరమాండల్ గేటు వద్ద ఉన్న రవికుమార్ ఇంటిలో, గాజువాక, కుర్మన్నపాలెం, సీతమ్మధార టీఎస్ఎన్ కాలనీ, ఇసుకతోటలోని బంధువుల ఇళ్లుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో రవికుమార్ అన్నయ్య ఇల్లు, విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో నాలుగు జిల్లాలకు సంబంధించిన ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లుతోపాటు ఇంటిలో 120 గ్రాముల బంగారం, ఇండియన్ బ్యాంక్ లాకరులో 399 గ్రాముల బంగారు ఆభరణాలు, 180 గ్రాముల వెండి, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.55వేలు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.2కోట్లుపైగా ఉంటుందని... బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.30 కోట్లుపైనే ఉంటుందని వెల్లడించారు. విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో సోదాలు చేశామని తెలిపారు. సోదాల్లో సీఐలు ఎం.వి.గణేష్, రమణమూర్తి, గొలగాని అప్పారావు, ఎం.మహేశ్వరరావు, గఫూర్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 28 ఏళ్లు... రూ.30 కోట్లకుపైగా అక్రమార్జన విశాఖపట్నానికి చెందిన కొత్తపల్లి రవికుమార్ 1990లో రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అనంతరం విశాఖ నగరంలోని గాజువాక, మర్రిపాలెంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో 20 ఏళ్లుకుపైగా ఆయన పనిచేశారు. నాలుగేళ్ల కిందట 2014లో ఏఎంవీఐగా పదోన్నతిపై విజయనగరం బదిలీ అయ్యారు. అయితే విజయనగరం రవాణా శాఖలో కీలకంగా చక్రం తిప్పుతూ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఏసీబీ అధికారులు చెబుతున్న దాని ప్రకారం 28 ఏళ్ల సర్వీసులో రవికుమార్ రూ.30కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టాడు. గుర్తించిన ఆస్తులివీ... ♦ మల్కాపురం అజంతకాలనీలో 1040 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లాట్. ♦ మహారాణిపేటలోని వేంకటేశ్వరనగర్‌లో 44.19 చదరపు గజాల ఇంటి స్థలం. ♦ రవికుమార్ భార్య కొత్తపల్లి ఇందిరా ప్రియదర్శిని పేరుమీద మహారాణిపేట వేంకటేశ్వరనగర్‌లో 60 చదరపు గజా ల విస్తీర్ణంలోని మూడు ఇళ్ల స్థలాలు 2017లో కొనుగోలు చేశారు. ♦ విశాఖ బీచ్‌లోని నోవాటెల్ సమీపంలో 180 చదరపు గజాల విస్తీర్ణంలో గల స్థలంలో నిర్మిస్తున్న జీ ప్లస్ 1 భవనం. ఇక్కడే మరో ఖరీదైన ఇల్లు ఉంది. ♦ ఆరిలోవ శ్రీకాంత్‌నగర్‌లో 124 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ 1 భవనం. ♦ భీమిలి నియోజకవర్గంలోని కాపులుప్పాడ సమీప తిమ్మాపురంలో 144 చదరపు గజాల ఇంటి స్థలం. ♦ అదే గ్రామంలో మరో 145 చదరపు గజాల ఇంటి స్థలం. ♦ అక్కడే మరో 100 చదరపు గజాల ఇంటి స్థలం. ♦ విజయగనరం జిల్లా వేపాడ మండలం జాకీర్ గ్రామంలో 0.62 సెంట్లు స్థలం. ♦ విశాఖ జిల్లా అచ్యుతాపురంలో 0.17 సెంట్లు స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
నోటీసులు కొత్తేమి కావు
-
పెంట్‌హౌస్ రాబరీ
మూడున్నరకే చీకటి పడిపోయినట్టుగా కనిపిస్తోంది. రాత్రికి భారీ వర్షం పడే సూచనలున్నాయని వార్తల్లో చెబుతున్నారు. రాయల్ అపార్ట్మెంట్ నిశ్శబ్దంగా ఉంది. పెంట్‌హౌస్ నుంచి కేకలు వినబడుతున్నాయి. అది మూడంతస్తుల అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తులో నాలుగు, గ్రౌండ్ ఫ్లోర్లో మూడు ఫ్లాట్స్ ఉన్నాయి. పైన పెంట్‌హౌస్ ఉంది. బిల్డర్ జగ్గారావు ఫ్యామిలీతో పెంట్‌హౌస్‌లో ఉంటున్నాడు. పెంట్‌హౌస్‌పై నుంచి కేకలు వినబడుతూ ఉండటంతో మెయిన్ గేటు పక్కన ఉన్న ఔట్‌హౌస్‌లో జోగుతున్న వాచ్‌మేన్ అప్పారావు ఉలిక్కిపడ్డాడు. ఏదో జరిగిందని అర్థమై మెట్లెక్కి పైకి పరిగెత్తాడు. ఆ అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదు. కార్ పార్కింగ్ కూడా జగ్గారావు ఒక్కడికే ఉంది. మిగిలిన వారికి స్కూటర్ పార్కింగ్‌లే. అప్పారావు వెళ్లేసరికి సింధూరాణి ఆయాసపడిపోతూ ఉంది.‘‘ఏమైందమ్మా?’’ అని అడిగాడు అప్పారావు.‘‘సార్ పంపారని ఎవరో వచ్చారు. నిన్న ఇంట్లో పెట్టిన బ్రీఫ్‌కేస్ తెమ్మన్నారంటే నిజమే అనుకున్నాను. ఆయన నిన్న రాత్రి ఒక బ్రీఫ్‌కేస్ తెచ్చి బీరువాలో పెట్టమన్నారు. రేపు ఆఫీసుకి వెళ్లేటప్పుడు ఇవ్వమన్నారు. వెళ్లేటప్పుడు ఆయన అడగలేదు. నేను గుర్తు చెయ్యలేదు.’’ సింధూరాణి ఆయాసం పెరిగిపోయి మాట్లాడలేక ఆగింది. ఆమె అవస్థ గమనించి, ‘‘కూర్చోండమ్మా!’’ అన్నాడు అప్పారావు. ఆమె కూర్చుని చెప్పడం మొదలుపెట్టింది. ‘‘వచ్చిన ఇద్దరిలో ఎవరూ నాకు తెలిసిన వాళ్లు కాదు. బీరువాలోంచి బ్రీఫ్‌కేస్ తీశాను. ఇవ్వబోయే సమయానికి అనుమానం వచ్చింది. సరే, నేనే కాల్ చేసి అడుగుదామనుకున్నాను. టీపాయ్ మీదున్న ల్యాండ్‌లైన్ ఫోన్ డయల్ చేస్తున్నాను. సార్ నెంబర్ ఎంగేజ్ వస్తోంది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు. ఇంతలో వాళ్లలో ఒకడు టీపాయ్ మీద ఉంచిన బ్రీఫ్‌కేస్ తీసుకుని పరిగెత్తాడు. రెండోవాడూ వాడితోపాటు పోయాడు’’ చెప్పింది సింధూరాణి. ‘‘పోలీసులకు ఫోన్ చేశారా?’’ ఎవరో అడిగారు. ‘‘అమ్మా! ముందు సార్‌కి ఫోన్ చేయండి!’’ అన్నాడు అప్పారావు. సింధూరాణి తేరుకుని భర్తకి కాల్ చేసింది. అతను లైన్లోకి వచ్చాడు. ‘‘హలో!’’ అన్నాడు.‘‘ఏమండీ! చాలాసేపట్నుంచి మీకు ఫోన్ చేస్తున్నా. లైన్ కలవడం లేదు. దొంగతనం జరిగిందండీ..’’ అంటూ సింధూరాణి చెప్పడం మొదలుపెట్టింది. అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. వర్షం పెద్దదైనట్టు ఉంది. అందరూ రెయిన్కోట్లు వేసుకున్నారు. అవి కొంతమేర తడిసివున్నాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ వస్తూనే సోఫాలో కూలబడ్డాడు. అతనుబాగా లావుగా బాన పొట్టతో ఉన్నాడు. అన్ని మెట్లు ఎక్కి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చేసింది. ఎస్సై జోసఫ్, నలుగురు కానిస్టేబుల్స్ నిలబడి అందరివంకా చూస్తున్నారు.‘‘ఎవరయ్యా వాచ్‌మేన్?’’ అన్నాడు సీఐ. ‘‘సార్! నేనే..’’ అంటూ ముందుకు వచ్చాడు అప్పారావు.‘‘అందర్నీ పంపెయ్!’’ అన్నాడు.అప్పారావు అక్కడున్నవాళ్లని దూరంగా వెళ్లమని చెప్పి వచ్చాడు. ‘‘మీరేనా ఇందులో ఉండేది?’’ అన్నాడు సీఐ సింధూరాణితో. ‘‘ఔనండీ!’’‘‘మీ పేరు?’’‘‘సింధూరాణి’’‘‘మీవారు ఎవరు? ఏం చేస్తుంటారు?’’‘‘జగ్గారావండీ. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు.’’‘‘అలాగా? ఏం జరిగింది?’’సింధూరాణి జరిగింది చెప్పింది.‘‘బ్రీఫ్‌కేస్‌లో ఏమున్నదమ్మా?’’‘‘తెలీదండీ! రాత్రి తెచ్చి బీరువాలో పెట్టమన్నారు. పొద్దున ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ఇవ్వమన్నారు. ఆయన వెళ్లేటప్పుడు అడగలేదు. పాపిష్టిదాన్ని నేనూ గుర్తు చేసుకుని ఇవ్వలేదు. ఇచ్చివుంటే ఇదంతా జరిగేది కాదు.’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. సీఐ కళ్లు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి కళ్లు తెరిచాడు. ‘‘మీ వారేరీ?’’ అడిగాడు సింధూరాణిని.‘‘జరిగిందంతా చెప్పానండీ! వస్తుంటారు.’’ అంది. ‘‘జోసెఫ్ ఆయన నెంబర్ తీసుకుని కాల్ చెయ్యి. అర్జెంటుగా రమ్మను.’’ అన్నాడు ఎస్సైతో. ‘‘ఎస్ సార్!’’ అని సింధూరాణిని అడిగి జగ్గారావు సెల్ నెంబర్ తీసుకున్నాడు. కాల్ చేస్తుంటే రింగవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ‘‘సార్! ఆయన లిఫ్ట్ చేయడం లేదు.’’ చెప్పాడు జోసెఫ్.‘‘జర్నీలో ఉన్నాడేమో? ఓకే!’’ అన్నాడు సీఐ.‘‘వాచ్‌మేన్! ఇద్దరు మనుషులు మెయిన్‌గేట్ దాటి రావడం నువ్వు చూశావా?’’ ప్రశ్నించాడు సీఐ. ‘‘లేదండీ. నేనప్పుడు నా రూమ్‌లో ఉన్నాను.’’‘‘నువ్విక్కడ వాచ్మేన్వి. గేట్లో నుంచి వచ్చే పోయే వాళ్లని చూస్తుండొద్దా? ఏం చేస్తున్నావు? తాగి తొంగున్నావా?’’ గర్జించాడు సీఐ. అప్పారావు బెదిరిపోయాడు. ‘‘చూస్తూనే ఉంటానండీ. ఎవరోకళ్లు ఏదోక పని చెప్తుంటారండి. చెయ్యకపోతే కోపం. ఒక్కడ్నేనండి. ఎన్నని చెయ్యను!’’ నెమ్మదిగా చెప్పాడు అప్పారావు. ‘‘అట్లాంటప్పుడు ఆ పని చెప్పినవాళ్లని గేటు దగ్గర ఉండమని చెప్పాలి. ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఎట్లా?’’అప్పారావు మౌనంగా ఉండిపోయాడు. ‘‘అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెట్టించారా?’’అప్పారావు తల అడ్డంగా ఊపాడు. ‘‘సీసీ కెమెరాలు లేవు. లిఫ్ట్ లేదు. ఏం అపార్ట్మెంటమ్మా? ఏదైనా జరిగినప్పుడు మా చావుకొస్తుంది.’’ అసహనంతో అన్నాడు సీఐ. సీఐ మాటమాటకీ వాచ్ చూసుకుంటున్నాడు. ‘‘ఏవండీ! మీ ఆయన ఇంకా రాలేదు. ఎప్పుడొస్తారు?’’ సింధూరాణితో అన్నాడు.‘‘నేనూ ట్రై చేస్తున్నానండీ. ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు.’’ అంది ఆమె. ‘‘అయితే పోయిన బ్రీఫ్‌కేస్‌లో ఏముందో మీకు తెలియదన్నమాట?’’సింధూరాణి తల అడ్డంగా ఊపింది తెలియదన్నట్టుగా. అంతలో ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది. సింధూరాణి లిఫ్ట్ చేసి, ‘‘హలో!’’ అంది. అవతల చెప్పింది విని ఆమె ముఖం వివర్ణమయింది.‘‘ఎక్కడా?’’ అంది ఆందోళనపడుతూ. సింధూరాణి ఫోన్ పెట్టేసింది. అరవడం మొదలుపెట్టింది. ‘‘ఏమైందండీ!’’ అని అడిగాడు సీఐ.‘‘ఆయనకి గుండెపోటు వచ్చిందంటండీ! హాస్పిటల్లో చేర్పించారట. ఆఫీస్ వాళ్లు చెప్పారు.’’ ఏడుస్తూనే చెప్పింది సింధూరాణి. సీఐ మల్లికార్జున్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘బ్రీఫ్‌కేస్ పోయిందని తెలియగానే గుండెపోటు వచ్చిందంటే, దాంట్లో డబ్బు ఉండుంటుంది..!’’ అన్నాడు ఎస్సై వైపు చూస్తూ. ‘‘ఎస్ సార్!’’ అన్నాడు జోసెఫ్. ‘‘జోసెఫ్! వర్షం బాగా కురుస్తోంది. పాపం మేడమ్ ఎట్లా వెళ్తారు? ఆమెను హాస్పిటల్లో డ్రాప్ చెయ్. ఆయనకి ఎట్లా ఉందో డాక్టర్స్‌ని ఎంక్వయిరీ చేసి, నాకు కాల్ చెయ్! నేనిక్కడే ఉంటాను.’’ అన్నాడు సీఐ. ‘‘ఎస్ సార్!’’ అన్నాడు జోసెఫ్. ‘‘అమ్మా! మీరు మా వాళ్లతో వెళ్లండి. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. వర్రీ పడకండి. కష్టార్జితం ఎక్కడికీ పోదు. తప్పక దొరుకుతుంది.’’ ధైర్యం చెప్పాడు మల్లికార్జున్. ఎస్సైతో పాటు సింధూరాణి బయలుదేరింది. జగ్గారావు కోలుకున్నాడనీ, ఐసీయూ నుంచి రూమ్‌లోకి షిఫ్ట్ చేశారని సమాచారం వచ్చింది. సీఐ మల్లికార్జున్ తన స్టాఫ్‌తో హాస్పిటల్‌కి వెళ్లాడు. రూమ్‌లో అతని భార్య సింధూరాణి లేదు. వేరే ఇంకొక ఆమె ఉంది. ఎర్రగా పొడుగ్గా ఉంది. ఆమె పక్కన టీనేజ్ కుర్రాడు, పదేళ్ల పాప ఉన్నారు. ‘‘హలో సార్!’’ అని పలకరించాడు సీఐ. ‘‘నమస్తే!’’ అని లేవబోయాడు జగ్గారావు. ‘‘మీరు లేవొద్దు. ప్లీజ్!’’ అని ఆమె వైపు చూసి, ‘‘మీరు?’’ అన్నాడు ప్రశ్నార్థకంగా. ‘‘నా వైఫ్ రాజేశ్వరి. వీళ్లు నా పిల్లలు’’ చెప్పాడు జగ్గారావు. మల్లికార్జున్ షాక్ తిన్నట్టయ్యాడు. ఈవిడ వైఫ్ అయితే, మరి సింధూరాణి? గురుడికి ఇద్దరు భార్యలా? అనుకున్నాడు. ‘‘ఓకే! చెప్పండి జగ్గారావుగారూ. బ్రీఫ్‌కేస్‌లో ఏముంది?’’ ప్రశ్నించాడు సీఐ. ‘‘యాభై లక్షలు క్యాష్ సార్!’’ విచారంగా అన్నాడు.‘‘మై గాడ్! ఫిఫ్టీ ల్యాక్స్? అంత డబ్బు ఇంటికి తీసుకెళ్లినట్టు మీ స్టాఫ్‌లో ఎవరికైనా తెలుసా?’’‘‘మా అకౌంటెంట్‌కి తెలుసు.’’ ‘‘ఓకే.. అమ్మా! మీరు కొంచెం బయటకు వెళ్తారా?’’ రాజేశ్వరి వైపు చూసి అన్నాడు సీఐ మల్లికార్జున్. రాజేశ్వరి పిల్లల్ని తీసుకుని గది బయటికి వెళ్లిపోయింది. ‘‘ఏమండీ! మీకు ఇద్దరు భార్యలా?’’‘‘ఔనండీ! సింధూరాణికి పిల్లలు లేరు. తర్వాత రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను.’’ చెప్పాడు జగ్గారావు. యాభై లక్షల క్యాష్ పోవడంతో అప్సెట్ అయ్యాడు జగ్గారావు. ఒక స్థలం కొనుగోలు చేయడానికి అంత క్యాష్ సమకూర్చుకునేసరికి చాలా కష్టమైంది. ఫ్రెండ్స్, తోటి బిల్డర్స్ దగ్గర సేకరించుకోవాల్సి వచ్చింది. స్థలం యజమాని క్యాష్ ఇవ్వమని ఒత్తిడి చేయడంతో అంత క్యాష్ తెచ్చి పెద్ద భార్య సింధూరాణి ఇంట్లో ఉంచాడు. ఉదయం వెంట తెచ్చుకోవాల్సింది కానీ ఈ రోజుకి అవసరం లేదని ఊరుకున్నాడు. అందుకే ఇలా జరిగింది. ‘‘మీ బ్రీఫ్‌కేస్ ఏ రంగులో ఉంది?’’‘‘సిమెంట్ కలర్ సార్!’’ అన్నాడు జగ్గారావు. జగ్గారావు ఆఫీసుకెళ్లి అకౌంటెంట్ని విచారించాడు సీఐ. అతను రామశర్మ. రిటైరైపోయిన వృద్ధుడు. అతను తనకు ఏం తెలియదని నొచ్చుకున్నాడు అనుమానించినందుకు. రామశర్మ అనుమానించదగ్గ మనిషి కాదని మల్లికార్జున్‌కి అర్థమైంది. ‘‘సార్! సింధూరాణి భర్త మీద చాలా కోపంగా ఉంది. తరచుగా ఘర్షణ పడుతుంటుందని వాచ్‌మేన్ అప్పారావు చెప్పాడు. అపార్ట్మెంట్లో ఆడవాళ్లు కొన్ని సంగతులు చెప్పారు. జగ్గారావు పెద్ద భార్య దగ్గరికి వారానికి ఒకసారి కూడా రాడట. ఎక్కువగా రెండో భార్య, పిల్లలతోనే గడుపుతాడట. గచ్చిబౌళిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో రెండో భార్యకు విల్లా కొని ఇచ్చాడట. అప్పట్నుంచి సింధూరాణి భర్త మీద మండి పడుతున్నదట.’’ చెప్పాడు ఎస్సై. సీఐకి కేసులో క్లూ దొరుకుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇంతలో హెడ్ కానిస్టేబుల్ వాచ్‌మేన్ అప్పారావుని పట్టుకొచ్చాడు. స్టేషన్లోకి గడగడలాడుతూ వచ్చాడు అప్పారావు. వచ్చీ రావడంతోనే కాళ్ల మీద పడిపోయాడు. ‘‘సార్! నాకేం తెలీదు.’’ అన్నాడు ఏడుస్తూ. ‘‘నీకు తెలీదుగాని ఒక సంగతి చెప్పు! ఆ రోజు పొద్దున జగ్గారావు కారులో వెళ్లిపోయాడు. సాయంకాలం మూడున్నర, నాలుగు గంటలకు దొంగతనం జరిగింది. ఈ లోపల పెంట్‌హౌస్‌కి ఎవరు వచ్చారు?’’ ప్రశ్నించాడు. అప్పారావు అతని పేరు చెప్పాడు. ఆ ఇల్లు కూడా తనకి తెలుసు అన్నాడు. వాచ్‌మేన్‌ని వెంటపెట్టుకుని సీఐ స్టాఫ్‌తో పోలీస్ వ్యాన్‌లో బయలుదేరాడు.పోలీసులు తన ఇంటికి రావడంతో బెదిరిపోయాడు భిక్షపతి. ఇల్లంతా గాలిస్తే దొరికింది బ్రీఫ్‌కేస్. అది బరువుగానే ఉంది. తను ఓపెన్ చేయలేదన్నాడు. పోలీస్ స్టేషన్లో తలవంచుకుని నిలబడి ఉంది సింధూరాణి. ‘‘చెప్పవమ్మా! బ్రీఫ్‌కేస్ మీ నాన్నకు ఇచ్చి పంపి, దొంగలు ఎత్తుకెళ్లారని ఎందుకు నాటకం ఆడావు?’’ గద్దించాడు సీఐ. ‘‘మా ఆయన నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడండీ. చిన్న పెళ్లానికి కోటి రూపాయలు పెట్టి విల్లా కొనిచ్చాడు. నేను అదే అడిగితే నువ్వుండే పెంట్‌హౌస్ నీకే రాసిస్తాను అన్నాడు. అదీ చెయ్యడం లేదు. నాకీ పెంట్ హౌస్ వద్దు. ఇది అనాథరైజ్డ్. దీనికి విలువలేదు. పది లక్షలకు కూడా ఎవరూ కొనరు. నాకూ విల్లా కొనివ్వు అని అడిగాను. పిల్లా జెల్లా లేరు నీకెందుకే విల్లా అని తిట్టాడండీ. ఏం చేయమంటారు? అందుకే బ్రీఫ్ కేస్ దొంగలెత్తుకెళ్లారని నాటకం ఆడాను. నాకు తెలుసు, అందులో యాభై లక్షలున్నాయని.’’ తప్పు ఒప్పుకుంటూ చెప్పింది సింధూరాణి. వాణిశ్రీ -
సండే క్రైమ్‌స్టోరీ : అదృశ్యకరణి!
ప్రాచీన కళాఖండాలు, ఆర్ట్ పీసెస్ అమ్మే మల్హోత్రా ఎదురుగా సఫారీసూట్లో ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. అతడు చెప్పిన ఒక ఆఫర్ మల్హోత్రాకు తెగ నచ్చేసింది. ఆ యువకుడు తనతో పాటు తెచ్చుకున్న ఓ లెదర్ బ్యాగులోంచి ఒక పల్చటి తెల్లటి వస్త్రాన్ని తీశాడు. మల్హోత్రా దాని వంక ఆశ్చర్యంగా చూశాడు. ‘‘దీన్ని అదృశ్యకరణి అంటారు’’ అని ఆ యువకుడు జిప్ బ్యాగులోంచి మరొక చిన్న సీసా తీసి అందులోని ద్రవాన్ని కొంత ఆ వస్త్రానికి పూసి, తనపై ఆ గుడ్డను కప్పుకున్నాడు. మరుక్షణం మల్హోత్రా ముందు ఎవ్వరూ లేరు. మల్హోత్రా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. రెండు నిమిషాల తర్వాత మల్హోత్రా ముందు కుర్చీలో ప్రత్యక్షమయ్యాడు ఆ యువకుడు.‘‘ఆశ్చర్యంగా ఉంది. దీన్నెలా సంపాదించావు?’’ అన్నాడు మల్హోత్రా. ‘‘అదంతా మీకనవసరం. మీకు కావాలా వద్దా?’’ సూటిగా అడిగాడు సూట్‌వాలా. అనుమానంగా చూశాడు మల్హోత్రా. మరోసారి ఆ వస్త్రాన్ని తనపై కప్పుకొని అదృశ్యమయ్యాడు సూట్‌వాలా. క్షణం తర్వాత గది తలుపు దగ్గర తేలాడు.‘‘చెప్పు దీన్ని ఎంతకమ్ముతావు నాకు?’’ ఆశ్చర్యానందాలతో అడిగాడు మల్హోత్రా. ‘‘పది లక్షలు.’’ అన్నాడతను. బేరసారాలు జరుగుతున్నాయి. సూట్‌వాలా చెప్పిన రేటుకే మల్హోత్రా ఆ వస్త్రాన్ని కొనక తప్పలేదు. సూట్‌వాలా వస్త్రాన్ని, చిన్న సీసాలోని ద్రవాన్నీ మల్హోత్రాకిచ్చి చెప్పాడు – ‘‘మీరు ఈ వస్త్రంపై, ఈ సీసాలోని ద్రవం ఒక ఐదు చుక్కలు పూసి కప్పుకుంటే అదృశ్యమవుతారు. కానీ ఈ వస్త్రం ప్రభావం రెండు గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత మీరు అందరికీ మామూలుగా కనిపిస్తారు’’ అన్నాడు. ‘‘రెండు గంటలు కావస్తుండగా, మళ్లీ ఈ వస్త్రంపై ద్రవాన్ని పూస్తే, మళ్లీ మాయమవుతారా?’’ ఆసక్తిగా అడిగాడు మల్హోత్రా. ‘‘లేదు. రెండు వాడకాల మధ్య కనీసం పన్నెండు గంటలు గ్యాప్ ఉండాలి. వస్త్రాన్ని చెక్ చేసుకోండి’’ అని తన బ్యాగ్ తీసుకొని గది బయటకు నడిచాడు ఆ యువకుడు. మల్హోత్రా మనసు ఆనందంతో ఉరకలేస్తోంది. వస్త్రంపై ద్రవాన్ని పూసి కప్పుకొని అద్దంలో చూసుకున్నాడు. అద్దంలో ఎవరూ లేరు. తన ఒంటిపై నుండి వస్త్రాన్ని తీయగానే మళ్లీ మల్హోత్రా ప్రతిరూపం అద్దంలో కనిపించింది. కాసేపు పనివాడు మున్నాను ఈ ఆటతో ఆట పట్టించి నవ్వుకున్నాడు. ‘‘పది లక్షలు చిల్ల పెంకుల్లా ధారబోసి ఈ వస్త్రాన్ని కొన్నాను. వెంటనే దీన్ని ఉపయోగించి పెట్టుబడిని రాబట్టుకోవాలి’’ అనుకున్నాడు మల్హోత్రా. కాసేపు ఆలోచించి, ఆ వస్త్రాన్నీ, ద్రవాన్నీ ఒక జిప్ బ్యాగులో ఉంచుకుని తన కారులో బయలుదేరి కరోల్‌బాగ్‌లో ఒక ప్రసిద్ధి పొందిన జ్యువెలరీ షాపు సమీపంలో తన కారు పార్క్ చేసి, బ్యాగులోంచి వస్త్రాన్ని తీసి, దానిపై ఐదు చుక్కల ద్రవాన్ని పూసి తనపై కప్పుకొని, డోర్ తీసి కారు దిగాడు. తన ఉనికిని చుట్టుపక్కల వాళ్లెవరూ గమనించకపోవడం చూసి నవ్వుకుంటూ జాగ్రత్తగా రోడ్డు దాటి ‘మయూర్‌షా జ్యువెలర్స్’ దుకాణంలోకి వెళ్లాడు. ఒక కస్టమర్ గ్లాస్ డోర్లోంచి లోనికి ప్రవేశిస్తుండగా అతని వెనుకనే అదృశ్య రూపంలో ఉన్న మల్హోత్రా ఆ షాపులోనికి వెళ్లిపోయాడు. చౌకీదారు ముందు వెళ్లిన కస్టమర్‌కు మాత్రమే అభివాదం చేశాడు. మల్హోత్రా ఉనికినే గుర్తించలేదు. మల్హోత్రా షాపంతా కలియదిరుగుతూ షోకేసుల్లో పేర్చిన రకరకాల వజ్రాల హారాలు, బ్రేస్లెట్స్, నగల వంక ఆనందంగా చూశాడు. వాటి జోలికి వెళ్లడం ప్రమాదం. ‘కళ్ల ముందే నగలు మాయమైతే ఏ సేల్స్‌మేన్ కూడా ఊరుకోడు కదా!’ అనుకున్నాడు.కౌంటర్ ముందున్న మయూర్‌షా ముందున్న ట్రేలో రకరకాల నగలున్నాయి. షాపు మూసే సమయం కావడంతో మయూర్‌షా, ఆ నగలన్నింటినీ, క్యాష్ టేబుల్ కింది రేక్‌లో ఉంచి తాళం వేసి, తాళంచెవి సొరుగుపై ఉంచి షాపంతా కలియదిరుగుతూ పనివాళ్లకు షోకేసులు మూసి లాక్ చేయమని పురమాయిస్తున్నాడు.ఇదే అదనుగా మల్హోత్రా, షా టేబుల్ సొరుగుపై ఉన్న తాళం చెవి సహాయంతో ఆ రేక్ తెరిచి, ఆ నగలన్నింటినీ తన టేబుల్లో కూరుకున్నాడు. షా అటువేపు రావడం గమనించి, రేక్ మూసి తాళం వేసి, కొందరు కస్టమర్స్ స్వింగ్ డోర్స్ తెరచుకొని బయటకు వెళ్తూ ఉంటే, వారి వెనుకే ఆ షాపు నుంచి బయటకు నడిచాడు. తన ఉనికిని ఎవ్వరూ గమనించకపోవడం అతణ్ని ఆనంద పారవశ్యంలో ముంచింది.మల్హోత్రా కారు డోర్ తీసుకుని, డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం ఆ రద్దీలో ఎవ్వరూ గమనించలేదు. ఆనందంతో ఇల్లు చేరుకొని, డోర్ లాక్ చేసుకొని బెడ్రూమ్లోకి నడిచాడు మల్హోత్రా. జేబులోంచి నగలు తీసి ఆనందంతో చూసుకొని, వాటినీ, మాయవస్త్రం ద్రవం ఉన్న జిప్ బ్యాగ్‌నూ ఒక అలమారాలో ఉంచాడు. తనకు బాగా తెలిసిన ఒక నగల వర్తకుడు కరంచంద్కి ఫోన్ చేసి, తన వద్ద కొన్ని మేలిమి నగలున్నాయని, వాటిని కొనడానికి మరుసటి రోజు పొద్దున ఎనిమిదింటికే సొమ్ము తీసుకొని రమ్మని పురమాయించాడు. తరువాత బట్టల బీరువాలోంచి షాంపెయిన్ బాటిల్ బయటకు తీసి ఆనందంగా కాసేపు తాగి నిద్రకు ఉపక్రమించాడు. కాసేపట్లోనే గాఢంగా నిద్రపట్టిందతనికి. ఆలస్యంగా నిద్ర లేచిన మల్హోత్రా స్నానం చేసి గబగబా తయారయ్యాడు. తొమ్మిదింబావైనా ఎందుకో కరంచంద్ ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే, క్యాష్ రెడీ చేసుకోవడం ఆలస్యమైందనీ, దారిలో ఉన్నాననీ చెప్పాడు. పదిగంటలకు కాలింగ్ బెల్ మోగింది. కరంచంద్ వచ్చి ఉంటాడని తలుపు తీసిన మల్హోత్రా ఎదురుగా యూనిఫామ్‌లోని పోలీసులనూ, మయూర్షాను చూసి కంగుతిన్నాడు. ‘‘మీరు నిన్న రాత్రి వీరి దుకాణంలో చోరీ చేసిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. మర్యాదగా చెప్పండి, ఆ నగలు ఎక్కడ దాచారో’’ అంటున్నాడు ఇన్స్పెక్టర్. మల్హోత్రాకు మతిపోయినట్లైంది. ‘‘నిన్న రాత్రి వీడు చోరీ చేస్తుంటే ఎవ్వరూ గమనించలేదు. సీసీటీవీలోనూ నిన్న వీడు కనబడలేదు. ఏం మాయ చేశాడో ఏమో! మళ్లీ ఈరోజు ఉదయం తొమ్మిదింటికి షాపు తెరిచి, నగలు మిస్సవడంతో రాత్రి తాలూకు సీసీటీవీ ఫుటేజీ చూసేసరికి వీడు నగలు చోరీచేస్తూ టీవీలో కనబడ్డాడు. దగ్గరలో పార్క్ అయిన కార్ల వివరాలు ట్రాఫిక్ పోలీసుల సీసీటీవీలో రికార్డయ్యాయి. వాటిద్వారా ఇతని ఆచూకీ కనుక్కున్నాం’’ అప్పుడే అక్కడకు చేరుకున్న డీఎస్పీకి వివరిస్తున్నాడు షా. పోలీసు దెబ్బల భయంతో, మల్హోత్రా గాబరాగా రాత్రి తాను నగలు ఉంచిన అలమారా తెరిచాడు. అందులో నగలు కానీ, మాయా వస్త్రం ఉన్న జిప్ బ్యాగ్ కానీ కనబడలేదు. సఫారీ సూట్ యువకుడి వద్ద అటువంటిదే మరొక వస్త్రం ఉండి ఉండాలి. దాన్ని గదిలోంచి బయటకు నడవగానే కప్పుకొని తన బెడ్రూమ్లోనే దాగి ఉండి, తాను నిద్రపోయాక నగలు, జిప్ బ్యాగ్ చోరీ చేసి వెళ్లిపోయి ఉండొచ్చు. మాయావస్త్రం ప్రభావం రెండు గంటల తర్వాత తగ్గడంతో సీసీటీవీలో తానున్న దృశ్యాలు కనిపించి ఉండొచ్చు. మల్హోత్రా చెప్పేది ఎవ్వరూ వినిపించుకోలేదు. దిగాలుగా పోలీసుల వెనక నడిచాడు మల్హోత్రా. రాచపూటి రమేష్ -
నవరత్నాలు
శ్యామలానగర్ ఎనిమిదో నంబర్ వీధిలోకి ప్రవేశించాడు నల్ల సత్యం. అప్పుడు సాయంకాలం ఆరు కావొచ్చింది. వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ వీధిలో అంతా ధనవంతులే. పెద్దపెద్ద మేడల్లో నివాసం ఉంటారు. కార్లలో తిరుగుతుంటారు. నడిచే జనం చాలా తక్కువ. పట్టపగలు కూడా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది.నల్ల సత్యం గేదెను తోలుకెళ్లడం చూశారు వీధి మొదట్లో ఉన్న ఆటోవాలాలు.‘‘ఏంది సత్యం, రేచలమ్మగారికి పాలు పొయ్యడానికా?’’ అని అడిగాడు జానీ.‘‘ఔనన్నా..! ఇప్పటికే ఆలస్యం అయింది’’ అన్నాడు సత్యం.‘‘ఏం తిప్పలు సత్యం? మీ ఇంటి దగ్గరే పాలు పిండి తీసుకెళ్లి పోయవచ్చుగా! గేదెను తోలుకెళ్లి ఆవిడగారి ముందు పిండాలా?’’ అన్నాడు జానీ నవ్వుతూ.‘‘ఇంటి దగ్గర పిండి తీసుకెళ్తే రేచలమ్మ ఒప్పుకోదు. తను చూస్తుండగా పిండాలంటుంది’’ అన్నాడు సత్యం.నల్ల సత్యం రేచల్ ఇంటి గేటు తీసుకుని గేదెను లోపలకి తోలుకెళ్లాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎంతకీ తలుపు తెరుచుకోలేదు.‘‘అమ్మగారూ! అమ్మగారూ..!’’ అని తలుపు తట్టాడు.ఎవరూ పలకలేదు. నల్ల సత్యం తలుపు నెట్టాడు. బార్లా తెరుచుకుంది. ‘‘అమ్మగారూ.. అమ్మగారూ..!’’ అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్లాడు సత్యం. ఎవరూ పలకడం లేదు.‘ఎవరూ లేరా ఏంది?’ అనుకుంటూ బెడ్రూమ్ తలుపు నెట్టాడు. తలుపు తెరుచుకుంది. ఆ దృశ్యం చూసి గట్టిగా కేకలు పెట్టాడు. రేచల్ నేల మీద నెత్తురు మడుగులో చచ్చిపడుంది.సత్యం రోడ్డు మీదకు పరిగెత్తాడు. ‘‘అమ్మగార్ని చంపేశారు’’ అంటూ అరవసాగాడు. శ్యామలానగర్ ఎనిమిదో నంబర్ వీధి జనంతో నిండింది. రేచల్ చనిపోయిందని తెలిసి గుంటూరులో ఉన్న బంధుమిత్రులు చాలామంది వచ్చారు. ఆమె భర్త విలియమ్స్ చర్చిఫాస్టర్ కావడంతో పరిచయస్తులు ఎక్కువే. వాళ్లకి ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. విలియమ్స్, రేచల్ మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు.పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉంది శ్యామలానగర్. రేచల్ హత్యవార్త తెలియగానే ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తన సిబ్బందితో చేరుకున్నాడు.రేచల్‌ని ఎవరో కత్తితో పొడిచి చంపారు. బీరువా అంతా వెతికినట్టు చిందరవందరగా పడిన దుస్తులు, వస్తువులను బట్టి తెలిసింది. బీరువాలో డబ్బు ఎక్కువ లేదు. పదివేలు పోయి ఉండొచ్చునన్నాడు విలియమ్స్. బంగారు నగలు ఏమీలేవు ఇంట్లో. అంతా లాకర్లో పెట్టామని కూడా చెప్పాడు.రేచల్, విలియమ్స్ దంపతులు ఒంటరిగా ఉంటున్నట్లు కనిపెట్టిన దొంగలు ప్లాన్డ్గా వచ్చారు. కానీ అనుకున్నంత ఏమీ దొరకలేదు. అనవసరంగా నిండు ప్రాణం తీశారు దుర్మార్గులు అని వాపోయారంతా.రేచల్కి అరవై ఏళ్లున్నా చాలా ఆరోగ్యంగా ఉంది. పని మనిషిని కూడా పెట్టుకోదు. ఇంటి పని అంతా తనే స్వయంగా చేసుకుంటుంది. గార్డెనింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. కాంపౌండ్‌లో ఉన్న మొక్కలే ఆ విషయం చెబుతాయి.‘‘రేచల్కి డెయిరీ మిల్క్ అంటే ఇష్టం ఉండదు. వెన్న తీసిన పాలు రుచిగా ఉండవంటుంది. ఖరీదు ఎక్కువైనా ఫ్రెష్ మిల్క్‌నే ఇష్టపడుతుంది. నల్ల సత్యం ఇంటికొచ్చి గేదె పాలు పిండి పోస్తాడు’’ అని పోలీసులకు చెప్పాడు విలియమ్స్. రేచల్ శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు పోలీసులు. ‘‘సార్! రేచల్ హత్య డబ్బు, నగలు దొరుకుతాయని దొంగలు చేశారని నాకు అనిపించడం లేదు’’ అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఎస్సై రంగనాథ్. ‘‘ఇంకెవరు చేసి ఉంటారు? ఆమె భర్త ఫాస్టర్. ఆయనకు శత్రువులు ఉంటారా?’’అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రవీణ్.‘‘ఎందుకుండరు సార్? ఆయనేమైనా అజాతశత్రువా? నేరాలు డబ్బు కోసం, ఆడవాళ్ల వ్యవహారంలో, ఆస్తుల తగాదాల వల్ల ఎక్కువగా జరుగుతాయి కదా సార్!’’ అన్నాడు రంగనాథ్.ప్రవీణ్, రంగనాథ్‌లు వెళ్లేసరికి విలియమ్స్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంట్లో బంధువులున్నారు. విలియమ్స్ వాళ్లని ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.‘‘విలియమ్స్ గారూ! చెప్పండి మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అంటే మీ భార్యను హత్య చేసేంత పగబట్టిన వాళ్లు?’’ అడిగాడు ప్రవీణ్.విలియమ్స్ తల అడ్డంగా ఊపాడు.‘‘లేదండీ! మాకు శత్రువులు ఎవరు ఉంటారు?’’ అన్నాడు.‘‘శత్రువులు బయట ఎక్కడో ఉంటారనుకోవద్దు సార్! ఇంట్లో కూడా ఉంటారు. ఈ మధ్య మీ ఆస్తి పంపకాలు జరిగాయనీ, కొడుకు, కోడళ్ల మధ్య ఘర్షణలు జరిగాయని మా ఎంక్వైరీలో తేలింది. ఆ వివరాలు చెప్తారా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.విలియమ్స్ ఇన్స్పెక్టర్వైపు ఆశ్చర్యంగా చూశాడు. ‘‘ఇన్స్పెక్టర్ గారూ! నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఆల్ఫ్రెడ్ డాక్టర్. గుంటూరు జనరల్ హాస్పిటల్లో సర్జన్. రెండోవాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. బెంగళూరులో ఉన్నాడు. మీరన్నది నిజమే. నాకు గుంటూరు హిందూ కాలేజీ వెనుక అగ్రహారంలో ఓ పాత బిల్డింగ్ ఉంది. వెయ్యి గజాల్లో చిన్నచిన్న కొట్లున్న బిల్డింగ్ అది. ఆస్తులు పంచుతున్నప్పుడు ఆ బిల్డింగ్ తనకు రాసివ్వమన్నాడు పెద్దోడు. తను డాక్టర్ కనుక ఆ బిల్డింగ్ పడగొట్టి హాస్పిటల్ కడతానన్నాడు. చిన్నోడిని రెంటచింతలలో ఉన్న పది ఎకరాల పొలం తీసుకోమన్నాడు. అయితే చిన్నోడి భార్య అడ్డం తిరిగింది. బిల్డింగ్‌లో సగం, పొలంలో సగం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. ఆమె తరఫు బంధువులు కూడా నన్ను అలా చేయడం న్యాయమని బలవంతపెట్టారు. నా భార్య మాత్రం పెద్దోడికి బిల్డింగ్ ఇవ్వడమే న్యాయం అంది. రెండో కోడలు జెస్సీ నా భార్యతో పోట్లాడింది. జెస్సీకి ఆవేశం ఎక్కువే! ‘అంతు తేలుస్తాను’ వంటి మాటలు వాడింది’’ చెప్పాడు విలియమ్స్. ‘‘చివరికి ఎలా పరిష్కారం చేశారు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘నేను చెప్పినట్టు బిల్డింగ్ పెద్దోడికి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఆస్తి పంచడం కుదరదు. మేమే మా ఇష్టం వచ్చినట్లు విల్లు రాసి, మా తదనంతరం చెందేట్టుగా రిజిస్టర్ చేస్తాం’’ అని రేచల్ బెదిరించింది. ‘‘ఆ తర్వాత ఏం జరిగింది?’’‘‘ఆల్ఫ్రెడ్ తమ్ముడికి నచ్చజెప్పాడు. మీరు ఇప్పట్లో గుంటూరు రారు. బెంగళూరులో స్థిరపడతారు. ఇక్కడ ఆస్తి ఉన్నా మీకేం ఉపయోగం? నాకైతే ఉపయోగం. కావాలంటే రేటు కట్టి సగం క్యాష్ ఇస్తా. పొలం చెరి సగం పంచుకుందామన్నాడు. హెన్రీ కూడా అన్న మాట విన్నాడు. ఆ బిల్డింగ్ ఆల్ఫ్రెడ్‌కి రాసిచ్చాం’’ చెప్పాడు విలియమ్స్.‘‘ఇదంతా మీ చిన్న కోడలు జెస్సీకి నచ్చని వ్యవహారం. దీనికి వత్తాసు పలికిన అత్త మీద ఆమెకు కోపం ఉండి ఉంటుంది కదా?’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘కోపం ఉంటే ఉంటుంది కానీ అత్తను చంపేంత ఉందని అనుకోను’’ అని నిట్టూర్చాడు విలియమ్స్.‘‘అయితే దొంగలు చేసిన హత్యే అని నమ్ముతున్నారా?’’‘‘నా నమ్మకంతో పనేముంది? నేరస్తుడిని ఆ జీసస్ బయటపెడతాడు’’ అని విలియమ్స్ దేవుణ్ని తలుచుకున్నాడు.‘‘మీకు ఒక కూతురు కూడా ఉంది కదా? ఆమెకు ఆస్తిలో భాగం ఇవ్వలేదా?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్.‘‘మా అమ్మాయి పెళ్లిలో అల్లుడికి పది లక్షలు కట్నంగా ఇచ్చాం. ఇప్పుడు మేమున్న ఈ ఇల్లు మా తదనంతరం అమ్మాయికే అని విల్లు రాసిచ్చాం’’ చెప్పాడు విలియమ్స్.‘‘మీ అల్లుడు ఏం జాబ్ చేస్తాడు?’’‘‘మా అల్లుడు చార్లెస్ బీటెక్ చదివాడు. జాబ్ చేయడం తనకి ఇష్టం ఉండదు. ఏదో బిజినెస్ చేస్తానంటున్నాడు. ప్రస్తుతం ఏటుకూరు రోడ్డులో జిన్నింగ్ మిల్లును లీజుకు తీసుకొని నడుపుతున్నాడు’’ చెప్పాడు విలియమ్స్. జనరల్ హాస్పిటల్ నుంచి ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కి పిలుపు వచ్చింది. సూపరింటెండెంట్ ఒకసారి కలుసుకోమన్నారు. ప్రవీణ్ వెళ్లి ఆయన్ని కలిశాడు. ‘‘ఇన్స్పెక్టర్ గారూ! రేచల్ బాడీ పోస్ట్‌మార్టమ్ చేస్తున్నప్పుడు ఆమె కుడిచెయ్యి గుప్పిట మూసుకొని ఉంది. మీరెవరూ గమనించి ఉండరు. డాక్టర్లు తెరిచి చూస్తే, ఈ రింగ్ బయటపడింది’’ పోస్మార్టమ్ రిపోర్టుతో పాటు ఆ ఉంగరాన్ని ఇచ్చాడు హాస్పిటల్ సూపరింటెండెంట్.ఇన్స్పెక్టర్ దాన్ని తీసుకున్నాడు. నవరత్నాలు పొదిగిన ఉంగరం అది . ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయల్దేరాడు ఇన్స్పెక్టర్.నవరత్నాలు పొదిగిన ఉంగరం చూడగానే విలియమ్స్ ఆశ్చర్యపోయాడు. ‘‘ఇన్స్పెక్టర్! మీకు ఈ రింగ్ ఎక్కడిది?’’ అడిగాడు విలియమ్స్.‘‘చెప్పండి! ఈ ఉంగరం ఎవరిది?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్.‘‘ఈ రింగ్ మా అల్లుడు చార్లెస్ది’’ అన్నాడు. చార్లెస్‌ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చారు.‘‘మిస్టర్ చార్లెస్! మీ అత్త రేచల్‌ని ఎందుకు మర్డర్ చేశారు?’’ కఠినంగా ధ్వనించింది ప్రవీణ్ కంఠం. ‘‘మా అత్తను నేను మర్డర్ చేశానా? నో.. సార్!... నో.. నేను చెయ్యలేదు’’ వెలవెలపోతున్న ముఖంతో చెప్పాడు చార్లెస్.‘‘మమ్మల్ని బుకాయించకండి. మీ అత్తను మీరే చంపారు. కత్తితో పొడిచారు. ఆ పెనుగులాటలో మీ ఉంగరం ఆమె చేతిలోకి వచ్చింది. మీరు అది గమనించలేదు. ఎక్కడో జారిపోయిందని అనుకున్నారు. ఆ హత్య దొంగలు చేశారని అనుకోవాలని బీరువాలో డబ్బు తీసుకొని బట్టలను చిందరవందరగా పడేశారు’’ చెప్పాడు ఇన్స్పెక్టర్.చార్లెస్ ఉంగరం వైపు చూశాడు. తర్వాత తలవంచుకొని చెప్పసాగాడు. ‘‘సార్! మా అత్త మాకు చాలా అన్యాయం చేసింది. ఆమెకు కొడుకుల మీదనే ప్రేమ. కూతురు పరాయిది. పది లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం? ఇంకేంది మీకిచ్చేది అని వాదించింది. న్యాయానికి ఇప్పుడు ఆస్తిలో కూతురికి కూడా భాగం ఇవ్వాలి. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మా మామ ఆ బిల్డింగ్‌ని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చారు. నా భార్యకు కూడా ఇచ్చి ఉంటే, పెద్ద బామ్మర్ది మా భాగానికి వెలకట్టి డబ్బు ఇచ్చేవాడు. నాకు ఇప్పుడు క్యాష్ చాలా అవసరం. బిజినెస్‌కి పెట్టుబడి కావాలి. అది ఇవ్వకుండా అడ్డుపడింది మా అత్తే. చివరికి మా మామ తాము ఉంటున్న ఇల్లును తదనంతరం నా భార్యకు రాశారు. తదనంతరం అంటే ఎప్పుడు? వాళ్లు పోయాక? ఇప్పట్లో పోతారా? ఏ ఇరవై ఏళ్ల తర్వాత సంగతి. అప్పుడు మాకేం ఉపయోగం. అందుకే మా అత్తను చంపాను. మా మామకు తర్వాత నచ్చజెప్పి అమ్మేయాలని ప్లాన్ వేశాను’’ చెప్పాడు చార్లెస్.‘‘చార్లెస్! మీకు అన్యాయం జరిగిందని పిల్లనిచ్చిన అత్తను చంపుతారా? ఘోరం కాదా? కోర్టుకి వెళ్లి న్యాయం పొందాల్సింది. హత్యలు పరిష్కారం కావు?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. చార్లెస్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు.‘‘నవరత్నాలు అదృష్టం తెచ్చిపెడతాయని నమ్ముకున్నావు. కానీ అవే నిన్ను జైలుపాలు చేశాయి’’ చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రవీణ్. - వాణిశ్రీ -
నాకొద్దు ఈ ఉద్యోగం; మహిళా ఇన్స్పెక్టర్ రాజీనామా
సాక్షి, చెన్నై: పనిభారంతో ఓ మహిళా ఇన్స్పెక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సమాచారం గురువారం వెలుగులోకి వచ్చింది. మరో రెండేళ్లలో పదవీ విరమణ పొందాల్సిన తాను ఇన్నాళ్లు పడ్డ బాధలు, ప్రస్తుతం పడుతున్న కష్టాలను ఓ లేఖ రూపంలో ఆమె ఉన్నతాధికారులకు ఏకరువు పెట్టినట్టు సమాచారం.రాష్ట్ర పోలీసు శాఖలో పని భారం పెరిగినట్టు గత కొంత కాలంగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు తోడు మానసిక ఒత్తిళ్లకు లోనైన వారు ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడుతూ వస్తున్నారు. గత నెల చెన్నై కానిస్టేబుల్ అరుణ్ రాజ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్ని కలవరంలో పడేసింది. ఆ ఘటన మరువక ముందే ఐనావరం స్టేషన్లోనే సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సతీష్‌కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం మరింతగా కలకలం రేపింది. అలాగే, విధుల్లో ఉన్న వాళ్లు పనిభారం, ఒత్తిళ్ల కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు ముగ్గురు విధుల్లోనూ గుండె పోటుతో మరణించారు. కేవలం పనిభారం కారణంగా, ఉన్నతాధికారుల వేదింపులతో అనేకచోట్ల ఈ ఘటనలు చోటుచేసుకుంటూ వస్తున్నట్టు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనేకమంది పోలీసులు స్పందిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ మద్రాసు హైకోర్టుకు సైతం చేరాయి. పోలీసు బాసులకు, హోం శాఖకు అక్షింతలు వేసే రీతిలో కోర్టు స్పందించింది. దీంతో పోలీసులకు మానసిక ఒత్తిడి తగ్గించే రీతిలో యోగా తరగతులు ప్రతి వారం నిర్వహించే పనిలో పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పని భారంతో తన ఉద్యోగాన్ని వదులుకుంటూ రాజీనామా చేస్తూ ఓ మహిళా ఇన్స్పెక్టర్ లేఖ రాసి పెట్టి వెళ్లడం వెలుగులోకి రావడంతో చర్చకు దారి తీసింది. ఆలస్యంగా వెలుగులోకి.. సెంబియం మహిళా పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఇదయ కళ పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి ఓ లేఖ రాసి పెట్టి ఆమె వెళ్లి ఉండటం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అందులో పనిభారం మరింతగా పెరిగిందని, పనిచేయలేని పరిస్థితి ఉందని, సహ అధికారులు సహరించడం లేదని వివరిస్తూ, తాను పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ తాను రాజీనామా చేస్తున్నామని అందులో ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే, ఉన్నతాధికారులు మాత్రం ఆమె మెడికల్ సెలవుల్లో ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. 1981లో పోలీసు శాఖలో చేరిన ఆమె 2020లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ సమయంలో ఆమె పని భారంతో పదవిని వదలుకోవడం గమనార్హం. ఇదే రకంగా అనేక స్టేషన్లలో పనిచేస్తున్న మహిళా సిబ్బందే కాదు, కింది స్థాయి వారు అనేకమంది రాజీనామా అంటూ లేఖల్ని ఉన్నతాధికారులకు పంపినట్టు సమాచారం. -
చేతికి దొరికితే చాలు సినీ ఫక్కీలో..
సాక్షి, చెన్నై: సందు దొరికితే చాలు.. గుడినీ గుడిలో లింగాన్నీ మింగేసే ఘనులున్న ఈ రోజుల్లో.. తనకు దొరికిన రూ. 40లక్షలను ఇన్స్పెక్టర్ ‘గాంధీ’ సంబంధీకులకు అప్పగించి పేరు నిలుపుకున్నాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలివి.. శుక్రవారం రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతుల్లో విరుదునగర్ జిల్లా ముత్తు నాయకన్ పట్టికి చెందిన వ్యాపార వేత్త క్రిస్టోఫర్(70) కూడా ఉన్నారు. ఆయన ప్రయాణించిన కారులో రూ. 40 లక్షలు ఉండటాన్ని తిరుమంగళం ఇన్స్పెక్టర్ గాంధీ గుర్తించారు. ఆ మొత్తాన్ని భద్ర పరిచారు. ఇన్స్పెక్టర్ ఆదివారం ముత్తునాయకన్ పట్టికి వెళ్లి మృతుడు క్రిస్టోఫర్ కుమార్తె మేరికి రూ. 40 లక్షలను అప్పగించారు. తండ్రి వ్యాపార నిమిత్తం తీసుకెళ్లిన ఆ సొమ్ము పోయిందనుకున్నామని.. అయితే, ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి ఇవ్వడం అభినందనీయమని మేరి అన్నారు. చేతికి దొరికితే చాలు సినీ ఫక్కీలో కాజేసే పోలీసులు ఉన్న ఈ కాలంలో తన పేరుకు తగ్గట్టు గాంధీ తన ఔదార్యాన్ని చాటుకోవడంతో ముత్తు నాయకన్ పట్టి ప్రజలు ఆయన్ను అభినందనల్లో ముంచెత్తారు. -
ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మధ్య ఘర్షణ
క్రిష్ణగిరి (సూళగిరి): క్రిష్ణగిరి జిల్లా మత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్, ప్రత్యేక బృందం సబ్ ఇన్స్పెక్టర్ల మధ్య ఏర్పడిన గొడవల్లో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. గాయాలపాలైన వీరు మత్తూరు ఫ్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రిష్ణగిరి జిల్లా మత్తూరు పోలీస్‌స్టేషన్‌లో తేని జిల్లాకు చెందిన రామ్ ఆండవర్(53) ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతడు సేలం, హొగేనకల్ పోలీస్స్టేషన్లలో పనిచేశాడు. మత్తూరు పోలీస్‌స్టేషన్‌లో పోచ్చంపల్లి సమీపంలోని జింగల్కదిరంబట్టి గ్రామానికి చెందిన పార్థిభన్(52) ప్రత్యేక బృందం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం పార్థిభన్ యూనిఫాం ధరించక కుండా ఆలస్యంగా విధులకు రావడంతో ఇన్ స్పెక్టర్ నిలదీశాడు. దీంతో వీరిమధ్య గొడవ జరిగింది. ఈ గొడవల్లో ఆవేశం చెందిన ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకొన్నారు. గాయాలపాలైన వీరిని తోటి ఉద్యోగులు మత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకొన్న జిల్లా ఎస్పీ మహేస్కుమార్ విచారణ చేపట్టాలని ఊత్తంగేరి డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. -
నిర్లక్ష్యానికి ఫలితం
⇔ గుడుంబా నియంత్రణలో పలువురు అధికారుల ఉదాసీనత ⇔ రాష్ట్ర కార్యాలయానికి మానుకోట ఎక్సైజ్ సీఐ సరెండర్ ⇔ మరో ఇన్స్పెక్టర్కు అదనపు బాధ్యతలు ⇔ మరికొందరు అధికారులపైనా చర్యలకు రంగం సిద్ధం సాక్షి, వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లా ఎౖMð్సజ్ అధికారులకు ‘గుడుంబా’ దెబ్బ తగులుతోంది. గుడుంబా తయారీ, అమ్మకాల నియంత్రణలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉమ్మడి జిల్లాలోని అధికారులపై ఎక్కువగా ఉంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలను గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఈ పరిస్థితి చాలా తక్కువగా ఉంది. దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారు. అధికారుల తీరుతోనే.. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎక్సైజ్ అధికారుల తీరుతోనే గుడుంబా నియంత్రణలో విఫలమవుతున్నారని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించారు. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే గుడుంబా నియంత్రణ ఆశించిన విధంగా లేదని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. గుడుంబా తయారీ, అమ్మకాలు ఎక్కువగా జరిగే మహబూబాబాద్ జిల్లాలోని కొందరు అధికారుల వైఖరి ప్రభుత్వానికి నష్టం చేసేలా ఉందని సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా మహబూబాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె.తిరుపతిపై చర్యలు తీసుకున్నారు. గుడుంబా నియంత్రణపై పట్టించుకోనట్లుగా వ్యవహరించారనే కారణంతో కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ రామకృష్ణకు మహబూబాబాద్ స్టేషన్ అదనపు బాధ్యతలను అప్పగించారు. గుడుంబా నియంత్రణ, బెల్లం అమ్మకాల విషయంలో పట్టించుకోనట్లుగా ఉంటున్న మరికొందరు అధికారులపైనా త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా స్థాయి అధికారిపైనా త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. కేసుల నమోదు, పరిష్కారం, గుడుంబా నియంత్రణ, ఉద్యోగుల విషయంలో ఈ అధికారి వ్యవహరించే తీరుపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందినట్లు సమాచారం. త్వరలోనే ఈ అధికారిపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఉదాసీనంగా.. రాష్ట్రంలో ఎక్కడా గుడుంబా ఉండొద్దనే రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండేళ్లుగా ఈ విషయంలో గట్టిగా వ్యవహరిస్తోంది. నాటుసారా, గుడుంబా తయారీ, అమ్మకాలను రూపుమాపడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ అధికారులు పనిచేశారు. అయితే, ఏడాదిగా ఈ విషయంలో కొంత మెతకగా వ్యవహరించారు. దీంతో గుడుంబా తయారీ, అమ్మకాలు మళ్లీ బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో ఉన్నతస్థాయిలో భారీ మార్పులు చేసింది. గుడుంబా నియంత్రణలో కఠినంగా వ్యవహరించిన అధికారులకు మళ్లీ బాధ్యతలు అప్పగించింది. ఇలా ఉన్నతస్థాయిలో మార్పులు చేసినప్పటి నుంచి గుడుంబా నియంత్రణ చర్యలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా అధికారులు మాత్రం ఇంకా మారడంలేదు. యథావిధిగా గుడుంబా నియంత్రణ విషయంలో ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు. -
షీనా బోరా కేసు విచారణాధికారి భార్య అనుమానాస్పద మరణం
ముంబై: షీనా బోరా హత్య కేసులో విచారణ అధికారి భార్య ఆకస్మికమరణం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారి భార్య అనుమానాస్పద రీతిలో మరణించింది. దర్యాప్తు బృందంలోని పోలీస్ అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ శాంతక్రూజ్ ప్రాంతంలోని ఇంటిలో మంగళవారం రాత్రి చనిపోయారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ధ్యానేశ్వర్ చనిపోయి వున్నభార్యను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ముంబై పోలీస్ ప్రెస్ నోట్ ప్రకారం పోలీస్ అధికారి ఉదయం 03:30 గంటలకు ఇంటికి వచ్చి భార్య ఎంతకీ తలుపు తీయలేదు. ఫోన్ చేసినా ఫలితం లేదు. చివరకి ఏదో విధంగా తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులోఉన్న భార్య ను చూసి షాకైన అధికారి పై అధికారులకు సమాచారం అందించారు. మరోవైపు ఈ సంఘటన అనంతరం కొడుకు కూడా కనిపించకుండా పోయాడు. అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. సంఘటనా స్థలంలో హత్య సమయంలో ఉపయోగించిన ఆయుధంగా భావిస్తున్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు మొదలుపెట్టారు. -
నేతల చేతుల్లో లాఠీ
ఇన్స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం? – సిఫారసు లేఖ ఉన్న వారికే పోస్టింగులు – 15 మంది సీఐలకు స్థానచలనం కలిగే అవకాశం - ప్రాధాన్యత కలిగిన సర్కిళ్లకు పోటీ - నాయకుల చుట్టూ కొందరి ప్రదక్షిణ – బదిలీల జాబితా వారం రోజుల్లో బయటకు వచ్చే అవకాశం కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీల చర్చ జోరుగా సాగుతోంది. సుమారు 15 మందికి పైగా సీఐలకు ఈ విడత స్థానచలనం తప్పనిసరి అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులతో పాటు వారికి సన్నిహితంగా మెలిగే ద్వితీయ శ్రేణి నాయకుల చుట్టూ కొందరు ఇన్స్పెక్టర్లు చక్కర్లు కొడుతున్నారు. జిల్లాలో సర్కిళ్లతో కలిపి ఉన్నవి 19, అప్‌గ్రేడ్ సర్కిళ్లు 14. ఇన్స్పెక్టర్ల సంఖ్య ఇందుకు రెట్టింపు ఉండటంతో పోటీ తీవ్రమయ్యింది. వివిధ ఆరోపణలతో ప్రస్తుతం 12 మంది ఇన్స్పెక్టర్లు వీఆర్‌లో ఉన్నారు. వీరంతా తిరిగి స్టేషన్ దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు ఆదేశాల మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణతో చర్చించి బదిలీల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు చర్చ జరుగుతోంది. మరో వారం రోజుల్లో బదిలీల జాబితా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రాధాన్యత కలిగిన సర్కిళ్ల కోసం ఇన్స్పెక్టర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం. మొదటి నుంచీ తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 డిసెంబర్ మొదటి వారంలో నియోజకవర్గ పరిధిలో 37 మంది సీఐలకు బదిలీలు జరిగాయి. తమ వారికి తగిన స్థానాలు దక్కలేదనే కారణంతో తెలుగు తమ్ముళ్లు అప్పట్లో బ్రేకులు వేయించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో 14 మంది, అక్టోబర్ మొదటి వారంలో 16 మంది ఇన్స్పెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉంది. ఈ బదిలీల్లో కూడా నాయకులు ఇచ్చిన సిఫారసు లేఖల ఆధారంగానే జాబితా సిద్ధమైనట్లు సమాచారం. పోస్టింగులు ఆశిస్తున్న ఇన్స్పెక్టర్లు మరికొంత మంది నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బదిలీల్లో వీఆర్‌లో ఉన్న సుమారు 9 మందికి పోస్టింగులు దక్కిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వీఆర్‌లో ఉన్న పలువురు ప్రాధాన్యత కలిగిన సర్కిళ్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల సిఫారసు లేఖల కోసం ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారనే చర్చ సాగుతోంది. రెండేళ్లు పూర్తయిన వారికి బదిలీల్లో ప్రాధాన్యత రెండేళ్ల పాటు ఒకే సర్కిల్లో పనిచేసిన ఇన్స్పెక్టర్లకు బదిలీ తప్పదనే చర్చ నేపథ్యంలో ప్రాధాన్యత కలిగిన సర్కిళ్ల కోసం ఇన్స్పెక్టర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఏళ్ల తరబడి లూప్‌లైన్ పోస్టుల్లో ఉన్న ఇన్స్పెక్టర్లు కూడా సర్కిళ్లను దక్కించుకునేందుకు అధికారులపై ఒత్తిడి చేయించినట్లు సమాచారం. ప్రస్తుతం డీసీఆర్బీలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా కర్నూలు వన్‌టౌన్ పోస్టింగ్ వేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం శ్రీశైలంలో పనిచేస్తున్న సీఐ పార్థసారధితో పాటు మరో ఇద్దరు శ్రీశైలం సర్కిల్‌ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. వన్‌టౌన్‌లో పనిచేస్తున్న కృష్ణయ్య కోసిగి సర్కిల్లో పాగా వేసేందుకు ఆ ప్రాంత నాయకుల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. శిరివెళ్లలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి నంద్యాల తాలూకాకు, అక్కడున్న మురళీధర్‌రెడ్డి ఆళ్లగడ్డ సర్కిల్‌కు బదిలీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి టీటీడీ విజిలెన్స్ విభాగానికి నియమితులైనట్లు సమాచారం. నంద్యాల వన్‌టౌన్‌లో పనిచేస్తున్న ప్రతాప్‌రెడ్డి ఏసీబీకి, ఆదోని పీసీఆర్‌లో ఉన్న శ్రీనివాసమూర్తి శ్రీశైలం, కర్నూలు ఎస్బీ–2లో ఉన్న ములకన్న నంద్యాల వన్‌టౌన్‌కు, కర్నూలు తాలూకాలో పనిచేస్తున్న నాగరాజు యాదవ్‌ను నందికొట్కూరుకు అధికార పార్టీ నేతలు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. బదిలీల్లో భాగంగా వారికి ఆయా సర్కిళ్లు దక్కే అవకాశముంది. వీఆర్‌లో ఉన్న చక్రవర్తి కూడా అధికార పార్టీ నేతల ఆశీస్సులతో ప్రాధాన్యత కలిగిన సర్కిల్‌కు నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
బ్రేక్ఇన్స్పెక్టర్ అరెస్టు
కాకినాడ రూరల్ : ఏసీబీ దాడుల్లో పట్టుబడిన బ్రేక్ఇన్స్పెక్టర్ రావు అప్పారావును అరెస్టు చేశారు. కాకినాడ డీటీసీ కార్యాలయంలో బ్రేక్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న రావు అప్పారావు ఇంటిపైన, అతని స్నేహితులు, బంధువుల ఇళ్లపైన గురువారం రెండోరోజు కూడా ఏసీబీ అధికారులు దాడులు కొనసాగాయి. అతని డ్రైవర్ శ్రీనివాస్, బినామీగా ఉన్న బొడ్డు రామారావు, సత్యనారాయణలను వారి వారి ఇళ్ల వద్దే ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఈ దాడుల్లో పట్టుబడిన పలు పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు, బంగారు, డబ్బు సీజ్ చేసి అప్పారావును అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. అప్పారావును విజయవాడ కోర్టుకు తరలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో తాము పరిశీలించిన వడ్డీలకు ఇచ్చిన అప్పులు రూ. 2 కోట్లు పైబడి ఉన్నాయన్నారు. -
మస్కా!
పట్టుకోండి చూద్దాం హరి, యమునలు చిలకా గోరింకల్లా కనిపించి కనువిందు చేస్తారు. కొన్నిసార్లు మాత్రం... పాము, ముంగిసల్లా పోట్లాడుకొని చుట్టుపక్కల వాళ్లను భయపెడతారు. అందుకే వారి సంసారం చాలామందికి ఒక పజిల్లా అనిపిస్తుంటుంది. ‘వాళ్లు కలిసి ఉంటారా? కలిసి ఉన్నట్లు నటిస్తుంటారా?’ అనేది చాలామంది సందేహం. ఒక రోజు ఊరి నుంచి హరి నాన్నగారు నారాయణరావు వచ్చాడు. వారం రోజుల పాటు ఉన్నాడు. మామగారు రావడం, ఇంట్లో వారం రోజుల పాటు ఉండడం యమునకు నచ్చలేదు. అలా అని ముఖం మూడ్చుకొని కూర్చోలేదు. మామగారిని చాలా మర్యాదగా చూసుకుంది. అందుకేనేమో... నారాయణరావు వెళుతూ వెళుతూ కోడలితో అన్నాడు...‘‘నాకు కూతురు లేని లోటును తీర్చావు’’ యమున చిన్నగా నవ్వుతూ... ‘‘నా మామయ్యకు ఈ మాత్రం సేవ చేయాలేనా...’’ అంది. నారాయణరావు వెళ్లిపోయిన తరువాత ఇల్లు యుద్ధరంగంగా మారింది. ‘‘మీ ఇంట్లో వాళ్లకు సేవ చేయడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా?’’ అని గట్టిగా అడిగింది యమున. ‘‘నీ బుద్ధ్ది మారదా? వచ్చిన వ్యక్తి మా నాన్నగారు... పరాయి వ్యక్తి కాదు... సొంత మామనే అవమానిస్తున్నావు. నువ్వు మనిషివా? రాక్షసివా!’’ ఆ రోజంతా తగాదా పడుతూనే ఉన్నారు భార్యాభర్తలు. ఇద్దరి మధ్య మాటలు లేవు. మరుసటి రోజు జ్వరంతో హరి ఆఫీసుకు వెళ్లలేదు. మంచంలో నిద్రపోయి దగ్గుతున్న హరి దగ్గరికి యమున వచ్చింది... ‘‘లేవండీ... హాస్పిటల్‌కు వెళదాం’’ అన్నది. ఈ మాటకు హరి చలించిపోయాడు. మరోమాట మాట్లాడకుండా భార్యతో పాటు హాస్పిటల్‌కు వెళ్లాడు. ‘‘నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా గొడవ పడ్డారు. ఇప్పుడు చూడు... ఎలా నవ్వుతూ వెళుతున్నారో’’ అనుకున్నారు ఇరుగు పొరుగు. హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్నప్పుడు... ‘థ్యాంక్స్’ అన్నాడు హరి. ‘‘థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా?’’ అంది యమున. ‘‘అమ్మో... నీతో ఎలా మాట్లాడినా సమస్యే’’ అన్నాడు అభయ్ నవ్వుతూ యమున భుజం మీద చేయివేస్తూ. ‘‘రేపు ఆదివారం కదా... ఎప్పటిలాగే ఇంట్లో వంటావార్పు బంద్. యస్ఆర్నగర్లో రుచులు అనే కొత్త రెస్టారెంట్ పెట్టారు. రేపు అక్కడ భోజనం చేద్దాం’’ అంది యమున. ‘‘ఓకే’’ అని బదులిచ్చాడు హరి. ఆ తరువాత మూడు వారాల్లో... గోపి విషయంలో మాత్రం ఒకసారి తగాదా జరిగింది. గోపి, యమున కోలిగ్. గోపితో సన్నిహితంగా ఉండడం హరికి నచ్చలేదు. ‘‘అతడు నా అన్నలాంటి వాడు... ఏవేవో ఊహించుకొని మనసు పాడు చేసుకోకు’’ అని యమున వివరణ ఇవ్వడంతో తగాదా అక్కడికక్కడే ముగిసింది. ఆ తరువాత మూడు వారాలకు... ఆ రోజు ఆదివారం. యమున ఎవరినో కూరలు తరిగే కత్తితో పొడిచి చంపిందనే వార్త ఫోన్లో విని పరుగు పరుగునా పోలిస్‌స్టేషన్‌కు వెళ్లాడు హరి. ఇంట్లోకి దూరిన అగంతకున్ని ఆత్మరక్షణ కోసమే యమున హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ‘‘అసలు ఏం జరిగింది?’’ యమునను ప్రశ్నించాడు హరి. ‘‘డోర్‌బెల్ మోగగానే మీరేమో అనుకొని తీశాను. తలకు మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి నా మీదికి రాబోయాడు. ఏం చేయాలో తోచక... చేతిలో ఉన్న కూరగాయల కత్తితో పొడిచాను...’’ అని ఏడుస్తూ చెప్పింది యమున. ‘‘ఇందులో ఏదో తిరకాసు ఉంది. మీతో కొద్దిసేపు మాట్లాడాలి’’ అని తన గదిలోకి తీసుకెళ్లి యమునను ఎంక్వైరీ చేశాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ఆమె చెప్పిన విషయం విని ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇంతకీ... యమున ఇన్స్పెక్టర్తో ఏం చెప్పింది? అసలు ఇన్స్పెక్టర్ యమునను ఎందుకు అనుమానించాడు? Ans:- ‘డోరు బెల్ మోగగానే మీరేమో అనుకొని తలుపు తీశాను’ అని చెప్పింది యమున. వచ్చింది భర్తే అని తెలిసినప్పుడు చేతిలో కత్తి పట్టుకొని ఎందుకు వెళ్లింది? ప్రతి ఆదివారం ఇంట్లో వంట చేయరు. మరి కూరలు తరిగే కత్తి ఆమె చేతిలో ఎందుకు ఉన్నట్లు?..’ ఈ కారణాలతోనే యమునను అనుమానించాడు ఇన్స్పెక్టర్. భర్తను చంపడానికే యమున కత్తితో వెళ్లింది. డోర్ తీసీతీయగానే... ఎదుటి వ్యక్తి ఎవరా? అనేది కూడా ఆలోచించకుండా ఆవేశంగా అగంతుకుడిని కత్తితో పొడిచింది. -
ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్. కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ కౌన్సిలర్ వెంకట నాంచారయ్యకు స్థానికంగా పెట్రోల్ బంకు ఉంది. బంక్ స్థలం డాక్యుమెంట్లను తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయాలంటూ ఆయన గత పదిరోజులుగా రెవెన్యూఇన్స్పెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. ఆర్ఐ శ్రీనివాసరావు మాత్రం రూ.10 వేలు ఇవ్వందే పని కాదని తేల్చిచెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఉప్పందించాడు. వారి సూచనల మేరకు బుధవారం సాయంత్రం ఆర్ఐ కార్యాలయంలో డబ్బు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
కీలకం!
పట్టుకోండి చూద్దాం ఆ ఇల్లు ఎప్పుడూ పిల్లాపాపలతో సందడిగా ఉంటుంది. అలాంటిది రెండు మూడురోజులుగా ఒంటరిదీవిలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది రవి ఒక్కడే. ఒక పెళ్లికి హాజరు కావడానికి రవి అమ్మానాన్నలు, ముగ్గురు అన్నయ్యలు, వదినలు, పిల్లలు రాజమండ్రి వెళ్లారు. పరీక్షలు ఉండడం వల్ల ఇంట్లోనే ఉండిపోయాడు రవి. కొన్ని గంటల పాటు ఏకధాటిగా చదువుకున్న తరువాత రిలాక్స్ కావడం కోసం ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం రవి అలవాటు. ఆ రోజు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న రవి దృష్టి అక్కడ ఉన్న పాత సామాను మీద పడింది. వాటన్నిటినీ ఇంటి వెనకాల ఉన్న స్టోర్‌రూమ్‌లో పెట్టడానికి కీ కోసం వెదికాడు. స్టోర్‌రూమ్‌కు సంబంధించి ఇంట్లో ఒకటే ‘కీ’ ఉంది. అది పోతే తాళం పగలగొట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు స్టోర్‌రూమ్‌లో కొన్ని వస్తువులను ఒక మూలకు పెట్టాడు. ఎంతో కాలం నుంచి ఆ రూమ్‌లో ఉన్న కొన్ని వస్తువులను చూసి బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాడు. పాత క్రికెట్ బ్యాట్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ఈ బ్యాట్ కొనడానికి తాను అమ్మానాన్నలను ఎంత బతిమిలాడింది గుర్తు తెచ్చుకున్నాడు. దీంతో పాటు ఆ బ్యాట్‌తో ఎన్ని మ్యాచ్‌లు ఆడింది, ఎక్కడ ఆడింది, ఎవరెవరితో ఆడింది గుర్తు తెచ్చుకున్నాడు. గదిలో ఒక్కొక్క వస్తువు ఒక్కో జ్ఞాపకాన్ని గుర్తుతెస్తుంది. ఈ జ్ఞాపకాల్లో ఉండగానే బయట అలికిడి వినబడడంతో- ‘ఎవరూ?’ అంటూ స్టోర్‌రూమ్ నుంచి బయటికి వచ్చాడు రవి. ఎవరూ కనిపించలేదు. మళ్లీ స్టోర్‌రూమ్‌లోకి వెళ్లి పాత వస్తువులు, పుస్తకాలను చూస్తూ చాలాసేపు గడిపాడు. ఆ తరువాత స్టోర్‌రూమ్‌కు తాళం వేసి చదువుకోవడానికి స్టడీరూమ్‌కు వెళ్లాడు. ‘ఇంకా సగం వస్తువులు బయటే ఉండిపోయాయి. రేపు ఉదయం వాటి పని చూడాలి’ అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే... బయట మిగిలిన కొన్ని వస్తువులను సర్దడానికి స్టోర్‌రూమ్ తాళం తీశాడు. లోపలికి వెళ్లాడో లేదో... భయంతో గట్టిగా అరిచాడు. స్టోర్‌రూమ్‌లో ఒక మూల శవం! ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలిసులకు సమాచారం అందించాడు. ‘‘ఇతడిని ఎప్పుడైనా చూశావా?’’ శవాన్ని చూపిస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎప్పుడూ చూడలేదు’’ జవాబు ఇచ్చాడు రవి. ‘‘స్టోర్‌రూమ్ ఎన్ని రోజులకు ఒకసారి ఓపెన్ చేస్తారు? ఈ గది తాళం చెవులు ఇంకా ఎవరెవరి దగ్గర ఉన్నాయి?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘అరుదుగా మాత్రమే స్టోర్‌రూమ్‌లోకి వెళతాం. గదికి సంబంధించి ఒక్క కీ మాత్రమే ఉంది’’ చెప్పాడు రవి. ‘‘ఉన్నది ఒక్కటే కీ. అది కూడా మీ ఇంట్లోనే ఉంది. ఇది నీ పనే అని మాకు అనిపిస్తుంది’’ అని రవిని అనుమానించాడు ఇన్స్పెక్టర్. ‘‘నాకు ఎలాంటి పాపం తెలియదు’’ అని నెత్తినోరు బాదుకున్నాడు రవి. కొద్దిసేపటి తరువాత... ఏ ఇన్స్పెక్టర్ అయితే రవిని అనుమానించాడో అదే ఇన్స్పెక్టర్... ‘‘సారీ...నిన్ను అనవసరంగా అనుమానించాను. ఈ హత్య బయటివాళ్ల పనే’’ అని చెప్పాడు. వేసిన తాళం వేసినట్లుగానే ఉంది. మరి రాత్రికి రాత్రే ఆ గదిలోకి శవం ఎలా చేరింది? ఈ కోణంలో చూసినప్పుడు రవిని బలంగా అనుమానించడం తప్ప వేరే దారి లేదు. అయినప్పటికీ ఇన్స్పెక్టర్ నరసింహ ‘ఇది నీ పని కాదు...బయటి వాళ్ల పని’ అని బలంగా ఎలా చెప్పగలిగాడు? అద్దంలో ఆన్సర్ స్టోర్‌రూమ్‌లో ఏదైనా క్లూ దొరుతుందేమోనని కొద్దిసేపు వెదికాడు ఇన్స్పెక్టర్. చిన్న ఆధారం కూడా దొరకలేదు. గది నుంచి బయటికి వస్తున్నప్పుడు అతని దృష్టి తాళంపై పడింది. దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించడం ప్రారంభించాడు. ఒక చోట చిన్నగా మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ కోడ్ కనిపించింది. అది రెండు సంవత్సరాల క్రితం నాటి తాళం అనే విషయం తెలిసిపోయింది. రవి ఇంటి తాళం అయిదు సంవత్సరాల క్రితం నాటిది... చూడడానికి రెండూ ఒకేలా కనిపిస్తాయి. జరిగింది ఏమిటంటే, రాత్రి రవి స్టోర్‌రూమ్‌లో ఉన్నప్పుడు...డోర్‌కు ఉన్న తాళం చెవి స్థానంలో తాను తీసుకువచ్చిన తాళం చెవిని తగిలించాడు హంతకుడు. తన దగ్గర ఉన్న రెండో కీతో ఆ గది తలుపులు తెరిచి అందులో శవాన్ని పెట్టి తిరిగి తాళం వేశాడు. కుడివైపు నుంచి అద్దం పెట్టుకుని చదవండి -
చైనా పోలీసులకు బుడతడు ఝలక్
బీజింగ్: సాధారణంగా చిన్న పిల్లలు కొత్త వ్యక్తులను చూస్తే భయపడుతుంటారు. ప్రేమగా పిలుస్తున్నా దగ్గరకు వెళ్లే సాహసం కూడా చేయరు. అలాంటిది కోపంతో గుడ్లురుమి చూస్తే.. ఇక వారు భయపడకుండా ఉంటారా.. కానీ చైనాలో మాత్రం అలా జరగలేదు. పట్టుమని రెండేళ్లు కూడా నిండుగా ఉండని చైనా బాలుడు అలా కన్నెర్ర చేసిన పోలీసులపైకి కర్ర విసిరే పనిచేశాడు. తన తల్లిదండ్రుల షాపును బలవంతంగా మూయిండచడానికి వచ్చిన పోలీసులపైకి వెళ్లాడు. అది కూడా ఒట్టి చేతులతో కాదు.. అక్కడే ఉన్న ఒక స్టీలు పైపులాంటి వస్తువుతో. దాన్ని చేతబూని దగ్గరకు వస్తున్న పోలీసులను అడుగెస్తే పడతాయ్ అని హెచ్చరిస్తున్నట్లు తన శక్తిమేరకు ఆ కర్రను విసురుతూ వారి ఆగిన తర్వాత దాన్ని కిందపడేశాడు. ఈ సంఘటనను దగ్గరుండి చూసిన కొందరు వ్యక్తులు ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో హల్ చేస్తుండగా.. బుడ్డవాడు అంత పనిచేసే వాతావరణం కల్పించిన పోలీసు అధికారులపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. -
హత్యా? ఆత్మహత్యా?!
పట్టుకోండి చూద్దాం ‘‘ ‘‘ఓసారి జరిగినదంతా రివైండ్ చేసుకో’’ అన్నాడు. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాడు అప్పలస్వామి. ముందురోజు ఉదయం పదిన్నర కావస్తుండగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని ఫోన్ మోగింది. ‘‘హలో’’ అన్నాడు కానిస్టేబుల్ అప్పలస్వామి. ‘‘సర్. రోడ్ నంబర్ 12 నుంచి మాట్లాడుతున్నాను సర్. మా అపార్ట్మెంట్లోని రెండో ఫ్లోర్లో ఉండే ఓ సారు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు వెంటనే రావాలి’’ అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి కంగారుగా. ‘‘అవునా? వివరాలు చెప్పు’’ అన్నాడు అప్పలస్వామి. అతను చెప్పినవన్నీ నోట్ చేసుకుని ఇన్స్పెక్టర్ దగ్గరకు పరుగెత్తాడు. అందరూ కలిసి సదరు అపార్ట్‌మెంట్‌కు బయలుదేరారు. అపార్ట్మెంట్లోని జనమంతా కిందే ఉన్నారు. చనిపోయిన వ్యక్తి గురించే అనుకుంటా... మాట్లాడుకుంటున్నారు. పోలీసుల్ని చూస్తూనే మాటలు ఆపేసి అలర్ట్ అయ్యారు ‘‘ఎక్కడ?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఫ్లాట్ నంబర్ 205 సర్’’ అన్నాడు వాచ్‌మేన్. వెంటనే ఆ ఫ్లాట్‌కి వెళ్లారు. తలుపు తీసేవుంది. హాల్లో సోఫా దగ్గర కింద కూర్చున్నాడా వ్యక్తి. తల వెనక్కి వాలిపోయింది. నుదుటి మీద బుల్లెట్ గుర్తు ఉంది. రక్తం చింది ముఖమంతా కారింది. ఓ చేతిలో తుపాకి, మరో చేతిలో ఒక క్యాసెట్ ఉన్నాయి. జేబులోంచి ఖర్చీఫ్ తీశాడు ఇన్స్పెక్టర్. దాన్ని క్యాసెట్ మీద వేసి క్యాసెట్ తీసుకున్నాడు. ఎదురుగా ఉన్న టీపాయ్ మీదే టేప్ రికార్డర్ ఉంది. క్యాసెట్ పెట్టి ఆన్ చేశాడు. ‘‘నేను జీవితంతో విసిగిపోయాను. చాలా విరక్తిగా ఉంది. ఒంటరితనం భయపెడుతోంది. బతుకంటేనే రోత పుడుతోంది. నాకే ఎందుకిలాంటి జీవితాన్నిచ్చాడో దేవుడు! అందుకే ఇక ఈ జీవితం వద్దనుకుంటున్నాను. దీన్నించి పారిపోవాలనుకుంటున్నాను.’’ రికార్డర్ ఆగిపోయింది. రివైండ్ చేసి, ఫార్వార్డ్ చేసి చూశాడు. ఆ మాటలు తప్ప ఇంకేమీ లేవు. ‘‘ఈయనకి ఎవరూ లేరా?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘లేదు సార్. భార్య చనిపోయింది. పిల్లలు లేరు. చాలాకాలంగా ఈ సార్ ఒక్కరే ఈ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఈ మధ్య చాలా దిగులుగా ఉంటున్నారు. కానీ ఇంత పని చేస్తారని అనుకోలేదు’’ అన్నాడు వాచ్‌మేన్. ‘‘చాలా మంచి మనిషి సర్. తన పనేంటో తను చూసుకుపోయేవారు. కానీ ఎవరికైనా కష్టం వచ్చిందంటే సాయపడటానికి అందరికంటే ముందుండేవారు. ఈయన ఇలా చేస్తారని అనుకోలేదు’’ అన్నాడొకాయన. ‘‘అవును సర్. మా పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవారు. వద్దన్నా ఏదో ఒకటి తెచ్చి ఇస్తూ ఉండేవారు’’ అంటూ కళ్లొత్తుకుంది ఇంకొకావిడ. అందరూ చెప్పింది విన్నాడు ఇన్స్పెక్టర్ ప్రకాశ్. ఒంటరితనం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అనిపించింది. వెంటనే బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి స్టేషన్‌కి బయలుదేరాడు. ‘‘మొత్తం రివైండ్ చేశాను సర్. ఏమీ అర్థం కాలేదు’’ అన్నాడు అప్పలకొండ బుర్ర గోక్కుంటూ. చిన్నగా నవ్వి, ‘‘ఓసారి క్యాసెట్ మళ్లీ ఆన్ చెయ్’’ అన్నాడు ప్రకాశ్. అప్పలస్వామి క్యాసెట్ పెట్టి విన్నాడు. ఏమీ అర్థం కాలేదు. మళ్లీ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. ‘‘చివర్లో ఏం వినిపించింది?’’ అన్నాడు ప్రకాశ్. ‘‘గన్ పేలిన సౌండ్ సర్’’ ‘‘అదే అసలు రహస్యం బయటపెట్టింది’’ అప్పటికీ అప్పలస్వామికి ఆ రహ స్యం ఏమిటో అర్థం కాలేదు. పోనీ మీకు అర్థమైందా? ఆ వ్యక్తిది ఆత్మహత్య కాదు హత్య అని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు? -
హంతకుడెవరు?
పట్టుకోండి చూద్దాం ఆగస్టు పదిహేను, 2007... హైదరాబాద్. సమయం ఆరున్నర కావస్తోంది. తన కజిన్ రిసెప్షన్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు ఇన్స్పెక్టర్ అవినాష్. అంతలో అతని ఫోన్ రింగయ్యింది. చూస్తే కానిస్టేబుల్ వీరభద్రం.‘‘ఏం వీరభద్రం... లీవ్ రోజున కూడా వదిలిపెట్టవా.... ఏం జరిగింది?’’... నవ్వుతూ అన్నాడు ఫోన్ తీసి. ‘‘సర్... మీరు త్వరగా రావాలి. గచ్చిబౌలిలో మర్డర్ జరిగిందని తెలిసింది’’ అన్నాడు వీరభద్రం కంగారుగా. ‘‘ఎవరు చెప్పారు?’’ అన్నాడు అవినాష్ అలర్ట అవుతూ. ‘‘శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు సర్. చనిపోయినతని కొడుకట.’’ ‘‘సరే మీరు వెళ్లండి. నేను ఇట్నుంచిటే వచ్చేస్తాను’’ అని ఫోన్ పెట్టేసి హుటాహుటిన బయలుదేరాడు అవినాష్. హతుడి ఇంట్లో దృశ్యం చూస్తూనే మతి పోయింది పోలీసులకి. చాలా దారుణంగా చంపేశారతణ్ని. ఒంటినిండా కత్తిపోట్లు ఉన్నాయి. మెడ తెగి వేళ్లాడుతోంది. గదంతా రక్తమే. వెంటనే బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి ఎంక్వయిరీ మొదలుపెట్టాడు అవినాష్. ఇంట్లోవాళ్ల మాటల్ని బట్టి పెద్దాయన రోజూ భోజనం చేసి రెండు గంటలకు పడుకుంటాడు. నాలుగున్నరకి లేస్తాడు. ఐదు గంటలకి మెల్లగా నడుచుకుంటూ దగ్గర్లో ఉన్న పార్కుకి వెళ్తాడు. గంటా రెండు గంటలు అక్కడే గడిపి ఇంటికొస్తాడు. ఈరోజు మాత్రం నాలుగున్నర దాటినా ఆయన లేవలేదు. కోడలికి అనుమానం వచ్చి ఐదింటికి తలుపు కొట్టింది. లోపల్నుంచి సమాధానం రాకపోవడంతో కిటికీలోంచి చూసింది. రక్తపు మడుగులో పడివున్న మామగార్ని చూసి షాకై భర్తకి ఫోన్ చేసింది. అతడొచ్చి చూసి పోలీసులకి ఫోన్ చేశాడు. ‘‘మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే హత్య రెండు నుంచి నాలుగ్గంటల మధ్యలో జరిగింది’’ అన్నాడు అవినాష్. శ్రీనివాస్ మాట్లాడలేదు. ‘‘ఇంత దారుణంగా పొడిచి పొడిచి చంపారు. ఆయన కచ్చితంగా కేకలు పెట్టేవుంటాడు. ఎవ్వరికీ వినిపించలేదా?’’ అన్నాడు శ్రీనివాస్ వైపు చూస్తూ. ‘‘నేనసలు ఇంట్లోనే లేను సర్. వయసు మీద పడటంతో నాన్న బిజినెస్ చూడలేక పోతున్నారు. నేనే చూసుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్‌కి కూడా రాను. ఉదయం వెళ్తే మళ్లీ రాత్రికే.’’ అతని మాటల్లో ఎక్కడా తడబాటు లేదు. ‘‘సరే. మొత్తం ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరినీ పిలవండి’’ అన్నాడు అవినాష్. క్షణాల్లో అతని ముందు అందరూ హాజరయ్యారు. ‘‘హత్య జరిగిన సమయంలో ఎవరు ఎక్కడున్నారో నాకు తెలియాలి’’ అన్నాడు అందరినీ తేరిపార చూస్తూ. ‘‘నేను కుకట్‌పల్లిలో ఉన్న మా షాప్‌లో ఉన్నాను’’ అన్నాడు శ్రీనివాస్. ‘‘నేనసలు రెండు రోజులుగా ఊళ్లోనే లేను సార్. మా అమ్మకి ఒంట్లో బాలేదంటే చూడ్డానికి మా ఊరెళ్లాను. ఇందాకే వచ్చాను. వచ్చేసరికి అయ్యగారు..’’... చెప్పాడు వాచ్‌మేన్. ‘‘నేను కూడా ఆ సమయానికి ఇంట్లో లేనయ్యా. అయ్యగారు పడుకునేముందు చెక్ ఇచ్చారు... బ్యాంక్‌లో వేసి రమ్మని. ఆ పనిమీదే వెళ్లాను’’ అన్నాడు డ్రైవర్. పెద్దాయన కోడలివైపు చూశాడు అవినాష్. ‘‘నాకు కూడా మధ్యాహ్నం పడుకోవడం అలవాటు సర్. మావయ్యగారు పడుకున్నాక నేనూ పడుకున్నాను. నాకే కేకలూ వినిపించలేదు’’ అందామె. ‘‘పక్క గదిలోనే ఉన్నా వినిపించలేదా కేకలు’’ అన్నాడు అవినాష్ అనుమానంగా. ఆమె ముఖంలో రంగులు మారాయి. ‘‘నిజం సార్. నాకేమీ వినిపించలేదు. వింటే వెంటనే లేచేదాన్ని కదా’’అంది భయపడుతూ. ‘‘అంత భయపడాల్సిన అవసరం లేదులెండి. హత్య చేసిందెవరో నాకు తెలిసిపోయింది’’ అంటూ బేడీలు అందుకున్నాడు అవినాష్. తిన్నగా వెళ్లి డ్రైవర్ చేతికి సంకెళ్లు వేశాడు. అందరూ విస్తుపోయారు. అతడే హంతకుడని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. మీకు అర్థమైందా... డ్రైవరే హంతకుడని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడో! -
రాక్షస క్రీడ
క్రైమ్ ఫైల్ జూన్ 19, 2011... ఇండోర్ (మధ్యప్రదేశ్)... ‘‘ఏంటి రమ్మన్నారు?’’... లోపల అడుగు పెడుతూనే అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి సర్. ఇది చూడండి’’... అన్నాడు డాక్టర్, తన చేతిలోని కాగితాన్ని ఇన్స్పెక్టర్ చేతిలో పెడుతూ. దాన్ని ఓ క్షణం పరిశీలించాడు ఇన్స్పెక్టర్. తర్వాత తలెత్తి అన్నాడు... ‘‘అంటే చనిపోయిన ముగ్గురిదీ కాకుండా అక్కడ మరొకరి రక్తం ఉందన్నమాట’’. ‘‘అవును సర్. అది కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది. అంటే ఆ సందర్భంలో అతను కూడా తీవ్రంగా గాయపడి ఉండాలి.’’ తల పంకించాడు ఇన్స్పెక్టర్. అతనికి ముందురోజు చూసిన సంఘటన కళ్లముందు కదలాడింది. శ్రీనగర్ నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. ఓ ఇంట్లో హత్య జరిగింది రమ్మని ఆ ఫోన్ సారాంశం. వెంటనే తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు ఇన్స్పెక్టర్. ఇంటి బయటే వణుకుతూ కనిపించింది ఒకామె. పాత ముతక చీర, ముడి వేసి జుత్తు, మెడలో ఉన్న రోల్డ్‌గోల్డ్ చెయిన్... చూస్తేనే ఇంట్లో పనిమనిషి అయి ఉంటుందని అర్థమవుతోంది. ‘‘నువ్వేనా ఫోన్ చేసింది?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘అవును సర్’’ అంది వణుకుతున్న స్వరంతో. ‘‘ఏం జరిగింది?’’ ‘‘నేను రోజూ పొద్దున్నే ఏడు గంటలకే ఈ ఇంట్లో పని చేయడానికి వస్తానండీ. ఈరోజు మా పిల్లోడికి ఒంట్లో బాలేదు. వాడిని ఆస్పత్రిలో చూపించి, పన్నెండు గంటలకి వస్తానని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను. తీరా వచ్చి బెల్ కొడితే ఎవరూ తలుపు తీయలేదు. తర్వాత చూస్తే బయట గొళ్లెం పెట్టివుంది. తీసి లోపలికెళ్లి చూశాను. లోపల... లోపల...’’ మాట పూర్తి చేయలేకపోయింది. నుదుటికి పట్టిన చెమటని చీర చెంగుతో తుడుచుకుంది. విషయం అర్థమైంది ఇన్స్పెక్టర్కి. గబగబా లోపలికి వెళ్లాడు. అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా కడుపులో దేవినట్టయ్యింది. హాలు, రెండు బెడ్రూమ్లు, వంట గది... అన్నింట్లోనూ ఎక్కడ చూసినా రక్తమే. హాల్లో అయితే నేలకు ఎరుపు రంగు పూశారా అన్నంతగా ఉంది రక్తం. ఆ రక్తపు మడుగులో పడివుంది ఇంటి యజమానురాలు మేఘా దేశ్‌పాండే (42) మృతదేహం. బెడ్ రూమ్‌లో మంచమ్మీద ఆమె తల్లి రోహిణీ ఫాడ్కే (70) మృతదేహం ఉంది. ఆమె శరీరం నుంచి కారిన రక్తంతో దిండు, దుప్పటి, పరుపు నానిపోయాయి. వంట గదికి, హాల్‌కి మధ్య ఉన్న తలుపు దగ్గర మరో మృతదేహం ఉంది. అది మేఘ కూతురు ఆశ్లేషది. ఇరవయ్యొక్కేళ్ల ఆ అమ్మాయి శరీరం కత్తిపోట్లతో చీరుకు పోయింది. బుల్లెట్లతో తూట్లు పడింది. దాదాపుగా అందరి శరీరాల మీదా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ‘‘తప్పించుకునే ప్రయత్నం చేసి వుంటారు సర్. అందుకే శరీరాలు ఎక్కడెక్కడో పడివున్నాయి’’ అన్నాడు కానిస్టేబుల్. ‘‘అవును. పాపం పెద్దావిడ కదల్లేదు కాబట్టి ఆవిణ్ని అక్కడే చంపేశారు’’ అన్నాడు ఇన్స్పెక్టర్ జరిగిన తీరును అంచనా వేస్తూ. పనిమనిషిని అడిగాడు... ‘‘ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు?’’ ‘‘ఎవరూ ఉండరు సర్. అయ్యగారు పుణెలో బ్యాంకులో పని చేస్తారు. మేఘమ్మగారు వాళ్లమ్మ గారితోటి, కూతురు ఆశ్లేషమ్మతోటి ఇక్కడ ఉంటారు. అయ్యగారు అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటారు’’.... చెప్పింది. ‘‘ఈ మధ్య కాలంలో వచ్చి వెళ్లారా?’’ ‘‘లేదండీ... రెండు మూడు నెలలకోసారి ఓ వారం రోజులు సెలవు పెట్టుకుని వస్తుంటారు. సొంత ఇల్లు కాబట్టి అమ్మగారు వాళ్లు ఇక్కడే ఉంటారు.’’ కేసు అంత తేలికగా విడిపోదని అర్థమైంది ఇన్స్పెక్టర్కి. బాడీస్‌ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించాడు. క్లూస్ టీమ్‌ని పిలిచి ఆధారాలు సేకరించ మన్నాడు. వెంటనే ఫోన్ చేసి మేఘ భర్త నిరంజన్ దేశ్‌పాండేని రప్పించాడు. అతడి ద్వారా ఇంట్లో ఉండాల్సిన ఐదు లక్షల విలువ చేసే నగలు, రెండు ఏటీఎం కార్డులు, లక్షన్నర నగదు మాయమైనట్టు తెలిసింది. కానీ ఎక్కడా వేలిముద్రలు కానీ, మరే చిన్న ఆధారం కానీ దొరకలేదు. దాంతో కేసు ఎలా డీల్ చేయాలా అని ఆలోచనలో పడ్డాడు. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాక అర్థమైంది... ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగిపోయాడు. ‘‘సర్’’ అంటూ హడావుడిగా క్యాబిన్లోకి వచ్చాడు కానిస్టేబుల్. ఏంటి అన్నట్టు చూశాడు ఇన్స్పెక్టర్. ‘‘మీరు చెప్పినట్టే ఎంక్వయిరీ చేశాం. ఒక వ్యక్తి తుపాకి తూటా తగిలిన గాయంతో హత్యలు జరిగిన ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ ఆస్పత్రిలో చేరాడట. అది కూడా హత్యలు జరిగిన కాసేపటికే.’’ చివ్వున లేచాడు ఇన్స్పెక్టర్. ‘‘వెరీగుడ్. హత్యలకు తుపాకీలను కూడా ఉపయోగించారు కాబట్టి వీడికి సంబంధం ఉండే చాన్స్ ఉంది. వాడి వివరాలన్నీ కనుక్కున్నారా?’’ ‘‘హాస్పిటల్లో వాడు ఇచ్చిన అడ్రస్, ఫోన్ నంబర్ ఫేక్ అని తేలింది సర్.’’ మళ్లీ ఆలోచనలో పడ్డాడు ఇన్స్పెక్టర్. ఎందుకో వాడు ఆ హత్యలతో సంబంధం ఉన్నవాడే అనిపిస్తోంది. కానీ ఎలా కనిపెట్టాలి వాణ్ని? చాలాసేపు మథనం జరిగిన తర్వాత బుర్రలో మరో ఆలోచన ఫ్లాష్‌లా మెదిలింది. కానిస్టేబుళ్లను పిలిచి ఏం చేయాలో చెప్పాడు. వాళ్లంతా దాన్ని ఫాలో అయిపోయారు. అంతే... రెండే రెండు రోజుల్లో కేసు మిస్టరీ విడిపోయింది. ‘‘శ్రీనగర్‌లో హత్యలు చేసింది హంతకుడు కాదు, హంతకి’’... తన చేతిలో ఉన్న పేపర్లో రాసిన ప్రధానవార్త శీర్షికను గట్టిగా చదివాడు ఇన్స్పెక్టర్. ఎదురుగా కూర్చుని ఉన్న యువతి తల దించుకుంది. ‘‘నేహావర్మ... చాలా మంచి పేరు. ప్లాన్ కూడా మంచిగానే వేశావ్. కాకపోతే అదృష్టం కలిసిరాక దొరికిపోయావ్.’’ చురుక్కున చూసింది నేహ. ‘‘మీరు తప్పుగా అనుకుంటున్నారు సర్. నేనే నేరమూ చేయలేదు. అసలు వాళ్లెవరో కూడా నాకు తెలీదు’’... అరిచినట్టే అంది. నవ్వాడు ఇన్స్పెక్టర్. ‘‘పోనీ వాళ్లు తెలుసేమో చూడు’’ అన్నాడు. వెంటనే అతడు చూపించిన వైపు చూసింది నేహ. అంతే... ఆమె ముఖం పాలిపోయింది. బిక్కమొగం వేసి బిత్తర చూపులు చూడసాగింది. ‘‘షాక్ తిన్నావ్ కదా! నీకే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు నాకెన్ని ఉండాలి? అందుకే మిమ్మల్ని ఇంత త్వరగా పట్టేశా. చాలా బాగా ప్లాన్ వేశారు. ఎక్కడా ఏ ఆధారమూ వదిలిపెట్టలేదు. కానీ పోలీసులు మీకంటే రెండు ఆకులు ఎక్కువే తిన్నారన్న విషయాన్ని మర్చిపోయారు’’ అంటూ నిజాన్ని ఎలా కనిపెట్టాడో వివరించాడు ఇన్స్పెక్టర్. హాస్పిటల్లో చేరిన వ్యక్తే నేరస్తుడై ఉంటాడన్న నమ్మకంతో సీసీ టీవీ ఫుటేజులు తెప్పించుకుని చూశాడు ఇన్స్పెక్టర్. ఆ వ్యక్తి రూపం ఎలా ఉంటుందో పట్టాడు. మరుక్షణం అతడి కోసం వెతుకులాట మొదలైంది. కానీ అతడు దొరికేలోపే మూడు ఏటీఎమ్స్‌లో నుంచి దేశ్‌పాండే కుటుంబస్తుల కార్డులతో ఎవరో డబ్బు డ్రా చేసిన విషయం బ్యాంకు వాళ్లు చెప్పారు. అది కూడా ఒకే సమయంలో. దాంతో నేరస్తుడు ఒక్కడు కాదు అన్న విషయం అర్థమైంది. వెంటనే ఆ ఏటీఎమ్స్లోని ఫుటేజులు కూడా సంపాదించారు. ఆస్పత్రిలోని వ్యక్తితో పాటు మరో వ్యక్తి, ఒక అమ్మాయి డబ్బులు డ్రా చేశారు. వాళ్లు తర్వాత కచ్చితంగా నగలు అమ్మడానికి ప్రయత్నిస్తారు. అందుకే అన్ని బంగారం షాపుల దగ్గరా నిఘా వేశారు. ఓ షాపు దగ్గర ముగ్గురినీ పట్టేశారు. ఇన్స్పెక్టర్ చెప్పింది విని ఖంగు తిన్నది నేహ. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక బొమ్మలా ఉండిపోయింది. ‘‘మౌనంగా ఉంటే కుదరదు మేడమ్. చెప్పు. అసలు దేశ్‌పాండే కుటుంబం నీకెలా తెలుసు? వాళ్లని అంత దారుణంగా ఎందుకు చంపారు?’’ ఇన్స్పెక్టర్ గర్జించేసరికి నోరు విప్పింది నేహ. ‘‘కొద్ది రోజుల క్రితం ఓ షాపింగ్ మాల్లో మేఘా దేశ్‌పాండేని చూశాను సర్. ఒంటి నిండా ఖరీదైన నగలున్నాయి. కావాలనే వెళ్లి పరిచయం చేసుకున్నాను. చాలా అందంగా ఉన్నారంటూ పొగిడాను. నేనో బ్యూటీషి యన్‌నని చెప్పాను. నేను ఆవిడకి చాలా నచ్చాను. దాంతో నా దగ్గరే బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటానని చెప్పింది. ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. చివరికి ఇంటికి సైతం వెళ్లేంతగా తనకి క్లోజ్ అయ్యాను. ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఉంటారని తెలిసి నా లవర్ రాహుల్, తన ఫ్రెండ్ మనోజ్‌తో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాను. బెదిరించి అన్నీ దోచుకెళ్లాలని మొదట అనుకున్నాం. కానీ నేను వాళ్లకి బాగా తెలుసు కాబట్టి ప్రమాదమని తెలిసి చంపేశాం.’’ ‘‘ఛీ. ముక్కూముఖం తెలియని నిన్ను నమ్మినందుకు... అంత దారుణంగా ప్రాణాలు తీస్తావా? తేలికగా డబ్బు సంపాదించడానికి మరో మార్గమే దొరకలేదా నీకు? నీలాంటివాళ్లు ఉండబట్టే నీడను కూడా నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.’’ ఆ మాటలు అంటున్నప్పుడు ఇన్స్పెక్టర్ ముఖం చూసివుంటే... అతని చూపుల్లోని అసహ్యానికి ఆ క్షణమే నేహ మనిషిగా చచ్చిపోయి ఉండేది. కానీ ఆమె అతనివైపు చూడలేదు. చూసే ధైర్యం చేయలేదు. రెండు క్షణాల తర్వాత లేడీ కానిస్టేబుల్‌తో ఇన్స్పెక్టర్ అన్న మాటలు వినిపించాయి... ‘‘జాలి లేకుండా సాటి ఆడవాళ్లు ప్రాణాలు తీసింది. నువ్వూ జాలిపడాల్సిన పని లేదు.’’ మరుక్షణం లేడీ కానిస్టేబుల్ లాఠీ గాల్లోకి లేచింది. నేహ కళ్ల నుంచి మొదటి సారిగా కన్నీరు ఉబకడం మొదలయ్యింది. - సమీర నేలపూడి -
నేర పరిశోధన
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 20 అది కోటె డీ అజూర్ ఎక్స్‌ప్రెస్‌లోని కంపార్ట్మెంట్ 813. రాత్రి ప్రయాణించే ఆ పెట్టెలోని ఒకరు బాగా వృద్ధుడు. తెల్ల జుట్టు. ముడతలు పడ్డ చర్మం. కళ్లద్దాలు. కాని ఆయన నీలం రంగు కళ్లల్లో చురుకుదనం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి యువకుడు. అతను ఏదో పుస్తకాన్ని చదువుతున్నాడు. కొద్ది క్షణాల తర్వాత ఆ ముసలాయన అడిగాడు. ‘‘మీరు బహుశ పోలీస్ ఇన్స్పెక్టర్ అయి ఉండాలి.’’ ఆ యువకుడి మొహంలో వెంటనే ఆశ్చర్యం కనిపించింది. ‘‘ఎలా అనుకున్నారు?’’ ‘‘మీ బ్రీఫ్‌కేస్ మీది ఇనీషియల్స్ ఎస్.పి. కాబట్టి మీరు సెర్నైన్ సిసిల్ అయి ఉండాలి. ఆ పేరుగల ఇన్స్పెక్టర్ ఇవాళ డూప్లక్స్ అనే గ్రామానికి ఓ వజ్రం దొంగతనం పరిశోధనకి వెళ్తున్నాడని స్థానిక దినపత్రికలో చదివాను.’’ ‘‘మీ తార్కిక జ్ఞానం బావుంది’’ అతను మెచ్చుకున్నాడు. ‘‘అది బాగా పని చేసిందో లేదో మీరు చెప్పనే లేదు’’ ఆ వృద్ధుడు ప్రశ్నించాడు. వెంటనే ఆ యువకుడు పుస్తకాన్ని బ్రీఫ్‌కేస్‌లో ఉంచి తన చేతిని చాపి చెప్పాడు. ‘‘నేను స్యూరెటే (నేర పరిశోధక సంస్థ)లో పని చేసే ఇన్స్పెక్టర్ సెర్నైన్ సిసిల్నే. మీరు?’’ ‘‘నా పేరు బెట్రాండ్. ప్యారిస్‌లో మేథమెటిక్స్ ప్రొఫెసర్ని.’’ ‘‘మీరు ఏదైనా మేథమెటికల్‌గా ఆలోచిస్తారనుకుంటాను?’’ ఆ యువకుడు అడిగాడు. ‘‘అవును.’’ ‘‘మనకి కొన్ని గంటలు ఉన్నాయి. నేను పరిశోధించబోయే కేసు గురించి చెప్తాను. వజ్రం దొంగ ఎవరో కనుక్కోగలరేమో దయచేసి ప్రయత్నించగలరా?’’ ఆ యువకుడు అడిగాడు. బెట్రాండ్ నవ్వి చెప్పాడు. ‘‘అలాగే. నేర పరిశోధన నాకూ అసక్తి కలిగించే విషయమే. అన్ని వివరాలూ చెప్పండి. నాకూ కాలక్షేపంగా ఉంటుంది.’’ ‘‘మీరు నిజాన్ని కనుక్కోగలిగితే మీరు స్యూరెటే సంస్థ కంటే గొప్పవారని ఒప్పుకుంటాను. డూప్లెక్స్లోని బేరన్ అనే ఓ ధనవంతుడి ఇంట్లో మొన్న రాత్రి జరిగిన పార్టీలో ఓ విలువైన వజ్రం దొంగతనానికి గురైందని మీకీ పాటికి తెలిసే ఉంటుంది.’’ ఆయన తెలుసన్నట్లుగా తల ఊపాడు. ‘‘ఆ కాక్టెయిల్ పార్టీకి ఆరుగురు అతిథులు హాజరయ్యారు. పార్టీ పూర్తయి సేవకులు వెళ్లాకే ఆ దొంగతనం జరిగింది. డిన్నర్ తర్వాత బేరన్... ‘టైగర్స్ హార్ట్’ అనే విలువైన వజ్రాన్ని లాకర్లోంచి తీసి తన అతిథులకి చూపించాడు. దాని విలువ ఇరవై లక్షల ఫ్రాంక్స్. అది ఒకరి చేతిలోంచి మరొకరి చేతిలోకి వెళ్లింది. తర్వాత చూస్తే ఎవరి చేతిలోనూ ఆ వజ్రం లేదు! మాయం అయింది. అందర్నీ అడిగితే అది ఎవరి దగ్గరా లేదని జవాబు వచ్చింది. ఈ ట్రిక్ చాలా పాతది. అంత విలువైంది ఎవరి చేతికీ ఇవ్వకూడదనే పాఠాన్ని బేరన్ ఆలస్యంగా నేర్చుకున్నాడు. తక్షణం అందర్నీ గదిలోనే ఉండమని స్యూరెటేకి ఫోన్ చేసాడు. నలుగురు పోలీసులు వెళ్లి ఆ ఆరుగురినీ క్షుణ్ణంగా వెదికారు.’’ ‘‘దీని గురించి పేపర్లో చదివాను. క్షుణ్ణంగా వేరే పదం. నగ్నంగా వేరే పదం. నగ్నంగా వెదికారు’’ ఆయన కరెక్ట్ చేసాడు. ‘‘అవును. అందుకు వారంతా అనుమతించారని పేపర్లో రాయలేదు. కాని అది ఎవరి దగ్గరా లేదు. వాళ్లు కూర్చున్న ఆ గదిని వెదికారు. వజ్రం బయటికి తీశాక ఎవరూ బాత్రూమ్లోకి వెళ్లకపోయినా దాన్నీ వెదికారు. అక్కడా లేదు. ఇల్లంతా చాలా క్షుణ్ణంగా వెదికారు. అయినా ఆ వజ్రం దొరకనే లేదు.’’ ‘‘ఈసారి క్షుణ్ణంగా పదాన్ని సరిగ్గా వాడారు’’ ఆయన నవ్వాడు. ‘‘నన్ను ప్యారిస్‌లోని స్యూరెటే హెడ్ క్వార్టర్స్ నించి ఆ వజ్రపు దొంగని పట్టుకోడానికి పంపుతున్నారు. మీరు ఆ ఆరుగురిలో ఎవరు దొంగో సూచించగలరా? వారి వివరాలు ఇప్పటికే వార్తల్లో చదివే ఉంటారుగా’’ ఆ యువకుడు అర్థించాడు. ‘‘చదివాను. బేరన్‌కి పిల్లల్లేరని చదివాను?’’ ‘‘అవును. పిల్లల్లేనివారు చేసే పనే ఆయన కూడా చేశాడు. ఓ పిల్లిని పెంచుకుంటున్నాడు.’’ చిన్నగా తల ఊపి ఆయన గొణిగాడు. ‘‘అనుకున్నాను. ఆ పిల్లి ఇంట్లోంచి బయటికి, బయటి నించి ఇంట్లోకి వెళ్లి రావడానికి ఓ తలుపుకి క్యాట్ డోర్ కూడా తప్పకుండా ఉండి ఉండాలి.’’ ‘‘ఉంది. నేనా రిపోర్ట్‌ని క్షుణ్ణంగా చదివాను.’’ ‘‘దాన్ని దొంగ ఉపయోగించి ఉంటాడు.’’ ‘‘ఏమిటి మీరనేది? అందులోంచి మనిషి వెళ్లలేడు’’... ఆ యువకుడు చెప్పాడు. ‘‘దొంగ ఆ పిల్లిని ఆ సమయంలో తన ఒళ్లో ఉంచుకుని ఉంటాడు. లేదా దగ్గరికి తీసుకుని దువ్వి ఉంటాడు. ఆ క్రమంలో ఆ పిల్లి కడుపు కింద ఆ వజ్రాన్ని బహుశా బబుల్గమ్తో అతికించి దాన్ని వదిలి ఉంటాడు. పోలీసులకి కాని, బేరన్‌కి కాని దాన్ని వెతకాలనే ఆలోచన వచ్చి ఉండదు. దాంతో పోలీసుల మధ్య నించి అది క్యాట్ డోర్‌ని తెరచుకుని బయటికి వెళ్లినప్పుడు, దానికోసం బయట వేచి ఉన్న తోడుదొంగ, బహుశ ఆ దొంగ భార్యో, ప్రియురాలో... ఆ పిల్లి నించి దాన్ని తీసుకుని ఉంటుంది. ఆ వ్యక్తి ఆ పిల్లికి పరిచయం ఉన్న వ్యక్తే అవడంతో అది అరిచి ఉండదు.’’ ఆ యువకుడు తల తాటించి చెప్పాడు. ‘‘ఈ ఆధారాల ప్రకారం ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోగలను అనుకుంటున్నాను.’’ పది రోజులదాకా ఆ ముసలాయన దినపత్రికని చూస్తూనే ఉన్నాడు. ఆ దొంగతనం గురించిన ఏ వార్తా రాలేదు. పదకొండో రోజు ఆయనకి ఇటలీలోని రోమ్ నించి ఓ టెలిగ్రాం వచ్చింది. అందులో ఇలా ఉంది. ‘ఆ దొంగని నేనే. ఆ రోజు పార్టీకి వెళ్లిన ఆ ఆరుగురు వ్యక్తుల్లో నేనూ ఒకడ్ని. మీ మేధాశక్తికి జోహార్లు. కాని రైల్లో నా బ్రీఫ్ కేస్ మీది ఇనీషియల్స్ విషయంలో మాత్రం మీరు పప్పులో కాలేశారు. నా పేరు సెవిల్ క్రోనిస్. ఇక దేశంలో ఉండటం మంచిది కాదని ఇటలీకి చేరుకున్నాను.’ - (ఆర్ధర్ పోర్కెస్ కథకి స్వేచ్ఛానువాదం) -
సిల్వియా లెకైన్స్... చెరిగిన చిరునవ్వు
క్రైమ్ ఫైల్ అక్టోబర్ 26, 1965... అమెరికాలోని ఇండియానా పోలిస్ ప్రాంతంలో ఉన్న ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగుతోంది. రెండు మూడుసార్లు మోగాక ఒక నడి వయస్కురాలు వచ్చి తలుపు తీసింది. ఎదురుగా పోలీసులు. ‘‘ఇక్కడ గెట్రూడ్ బెనెస్యూయ్‌స్కీ అంటే ఎవరు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘నేనే సర్. మీకు ఫోన్ చేసింది నేనే’’ అందామె ఆతృతగా. ‘‘ఏంటి... ఏం జరిగింది?’’ ‘‘నా ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటోన్న సిల్వియా లెకైన్స్ని ఎవరో చంపేశారు.’’ ‘‘ఎవరు? ఎందుకు చంపారు?’’ ‘‘తెలియదు సర్. సిల్వియా అంత మంచి అమ్మాయి కాదు. తనకు చాలా మంది అబ్బాయిలతో సంబంధం ఉంది. వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి ఇవాళ ఉదయమే తిరిగివచ్చింది. తనని దిగబెట్టడానికి కొందరు అబ్బాయిలు వచ్చారు. వాళ్లతో తను ఎందుకో గొడవ పడింది. దాంతో వాళ్లు తనని బేస్మెంట్ లోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టారు. తను చనిపోయింది’’... ఏడుస్తూ చెప్పింది. ఇన్స్పెక్టర్ బేస్మెంట్ వైపు నడిచాడు. అక్కడ నేలమీద... చెల్లాచెదురుగా పడేసి ఉన్న వస్తువుల మధ్య... దుప్పటి కప్పి ఉంది సిల్వియా దేహం. దుప్పటి తొలగించాడు ఇన్స్పెక్టర్. సిల్వియా నైట్ ప్యాంట్, టీషర్ట్ వేసుకుంది. టీషర్ట్ నిండా రక్తం. తల పగిలి రక్తం ధారకట్టింది. పెదవులు చిట్లిపోయాయి. ముఖం, చేతుల మీద ఎక్కడ చూసినా గాయాలే. ఆ కుర్రాళ్ల గురించి ఏమైనా తెలుసా అంటూ బెనెస్యూయ్స్కీని అడిగాడు ఇన్స్పెక్టర్. ఆమె తెలియదంది. దాంతో బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి దర్యాప్తు ఎలా చేయాలా అని ఆలోచనలో పడ్డాడు. ‘‘ఏమంటున్నారు డాక్టర్?’’.. షాక్ తిన్నట్టుగా అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘నిజం సర్. ఇది ఒక్కరోజులోనో, కొద్దిసేపటిలోనో జరిగిన హింస కాదు. కొన్ని నెలల పాటు చిత్రహింసలు పెట్టారు. ఒళ్లంతా గాయాలతో పుండై పోయింది. ఇంకా దారుణం ఏమిటంటే... ఆ అమ్మాయికి కొన్ని నెలలుగా సరైన ఆహారం కూడా పెట్టలేదు’’... ‘‘రేప్లాంటిదేమైనా...?’’ ‘‘రేప్ జరగలేదు. కానీ రేప్ కంటే దారుణమైన హింస జరిగింది. ఆమె జననాంగాలు దాదాపు ఛిద్రమైపోయాయి. పదహారేళ్ల లేత శరీరం... అంత బాధని ఎలా తట్టుకుందో అర్థమే కావడం లేదు. ఇది మనుషులు చేసే పని కాదు... ఛ.’’ ఆవేశం తన్నుకొచ్చింది ఇన్స్పెక్టర్కి. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మొదలుపెట్టాలో అర్థమైంది. వెంటనే బయలుదేరాడు. ‘‘నన్ను అనుమానిస్తున్నారా సర్? నా తప్పు ఉంటే నేనెందుకు మిమ్మల్ని పిలు స్తాను?’’... అరిచింది బెనెస్యూయ్‌స్కీ. ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూస్తున్నాడు. ఆ చూపుల నిండా సందేహాలే. ‘‘అలా చూస్తారేంటి సర్. సిల్వియాతో పాటు తన చెల్లెలు జెన్నీ కూడా నా దగ్గరే ఉంటోంది. కావాలంటే తనని అడగండి. నేనెలాంటిదాన్నో చెప్తుంది’’ అంటూ జెన్నీని పిలిచింది. గదిలోంచి వచ్చి, బెరుకుగా చూస్తూ నిలబడింది జెన్నీ. మెల్లగా వెళ్లి ఆమె తలపై చేయి వేశాడు ఇన్స్పెక్టర్. ‘‘చెప్పు తల్లీ. అక్కని ఎవరు చంపారు?’’ అన్నాడు అనునయంగా. ‘‘ఆ రోజు అక్కతో పాటు ఎవరో వచ్చారంకుల్. వాళ్లతో అక్క గొడవ పడింది. వాళ్లే చంపేశారు. మేమందరం వెళ్లేలోపే వాళ్లు పారిపోయారు.’’ బెనెస్యూయ్‌స్కీ చెప్పింది నిజమేనని అర్థమైంది ఇన్స్పెక్టర్కి. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ మరొకటి చెబుతోందే. ఏది నిజం? ఆలోచిస్తూ బయటికి నడిచాడు. జీపు ఎక్కి స్టార్ట్ చేశాడు. మరో క్షణంలో వెళ్లిపోయే వాడే. కానీ అంతలో ఎక్కడి నుంచో ఓ కాగితపు ఉండ వచ్చి ఒడిలో పడింది. తెరిచి చూశాడు. ‘‘నన్ను ఇక్కడ్నుంచి బయట పడెయ్యండి అంకుల్. ఏం జరిగిందో నేను చెప్తాను - జెన్నీ’’ ఒక్క అంగలో జీపు దిగాడు. జెన్నీ దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో చెప్పమ న్నాడు. తను చెప్పింది విన్నాక అతడి మనసు ద్రవించిపోయింది. సిల్వియా, జెన్నీల తల్లిదండ్రులు సర్కస్‌లో పని చేస్తారు. ఊళ్లు తిరుగు తారు. దానివల్ల పిల్లల చదువు పాడవు తోందని బెనెస్యూయ్‌స్కీ దగ్గర పేయింగ్ గెస్టులుగా పెట్టి వెళ్లారు. వారానికి ఇరవై డాలర్లు ఇస్తామని చెప్పారు. రెండు వారాలకు అడ్వాన్స కూడా ఇచ్చి వెళ్లారు. దాంతో రెండు వారాలు పిల్లల్ని బాగానే చూసింది బెనెస్యూయ్‌స్కీ. మూడోవారం డబ్బు పంపడం ఆలస్యం కావడంతో ఆమె నిజస్వరూపం బయటపడింది. డబ్బు లిస్తామని మోసం చేశారు మీ అమ్మా నాన్నలు, వాళ్లకు సిగ్గులేదు, నా ఇంట్లో పడి తినడానికి మీకూ సిగ్గులేదు అని తిట్టడం మొదలుపెట్టింది. స్కూలుకు పంపడం మానేసింది. వికలాంగురాలైన జెన్నీని కుంటిది అనేది. సిల్వియాని బూతులు తిట్టేది. సమాధానం చెప్పబోతే కొట్టేది. ఆలస్యంగానైనా డబ్బులు అందాయి. కానీ బెనెస్యూయ్‌స్కీ ప్రవర్తన మాత్రం మారలేదు. ఆ డబ్బుతో మిమ్మల్ని పోషించలేనంటూ తిండి పెట్టడం మానే సింది. ఆకలిని తట్టుకోలేక అల్లాడిపోయే వారు. సిల్వియా భరించేది. కానీ చెల్లెలు ఏడిస్తే తట్టుకోలేకపోయేది. ఓరోజు వంటింట్లోంచి దొంగతనంగా రొట్టె తెచ్చి చెల్లికి పెట్టింది. అది తెలిసి ఉగ్రరూపం దాల్చింది బెనెస్యూయ్‌స్కీ. సిల్వియాని విపరీతంగా కొట్టి, తీసుకెళ్లి బేస్మెంట్లో కట్టి పారేసింది. ఆమె హింసించేది చాలక తన పిల్లల్ని, వాళ్ల స్నేహితుల్ని, ఆడుకోవ డానికి వచ్చిన పక్కింటి పిల్లల్ని కూడా రెచ్చగొట్టేది. సిల్వియాని పంచింగ్ బ్యాగ్ అనుకుని ఆడుకొమ్మని చెప్పేది. దాంతో వాళ్లు వికృతంగా ప్రవర్తించేవారు. బెనెస్యూయ్‌స్కీ పెద్ద కూతురు పౌలా, సిల్వియా మీద వేడినీళ్లు పోసేది. రెండో కూతురు స్టెఫానీ... పదే పదే కడుపులో గుద్దేది. మిగతా పిల్లలంతా సిల్వియాను వివస్త్రను చేసి... ఒళ్లంతా బ్లేళ్లతో కోసే వారు. సూదులతో గుచ్చేవారు. బెనె స్యూయ్స్కీ అయితే కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి మరీ సిల్వియాను హింసించేది. జననాంగాల్లో గాజు సీసాలు పెట్టేది. టెస్ట్ చేస్తే నువ్వు చెడిపోయినదానివని తెలియ డానికే ఇలా చేశాననేది. సూదులను కాల్చి వాటితో ఆమె ఒంటి మీద ‘నేను చెడి పోయినదాన్ని’ అన్న అక్షరాలు వచ్చేలా గుచ్చింది. చెక్కదిమ్మలతో రహస్యాంగాల మీద కొట్టేది. భరించలేక కేకలు పెడితే పైశాచికానందాన్ని పొందేది! పాపం సిల్వియా... విరిగిన ఎముకలు బాధపెడుతుంటే, కోతలు వాతలు సలుపు తుంటే తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేది. ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఎలా బయటపడాలో అర్థం కాక, ఎలాగో తంటాలు పడి, పక్క ఊరిలో ఉంటోన్న తన అక్క డయానాకి ఉత్తరం రాసింది. కానీ తమ దగ్గరకు వచ్చి ఉండటానికి అలా ఎత్తు వేసిందనుకుని ఆ ఉత్తరాన్ని చించి పారేశారు డయానా, ఆమె భర్త. అయితే సిల్వియా తన అక్కకి ఉత్తరం రాసిన విషయం బెనెస్యూయ్స్కీకి తెలిసి పోయింది. వెంటనే సిల్వియాని వదిలించు కోవడానికి ప్లాన్ వేసింది. తనని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తే చస్తుంది అనుకుంది. తన మీదకు నేరం రాకుండా ఉండేందుకు, ‘నేను నా ప్రియుడితో పారిపోతున్నాను’ అంటూ ఉత్తరం రాసి, సిల్వియాతో సంతకం పెట్టించింది. ఆమె ఎత్తుగడను పసిగట్టిన సిల్వియా, పారిపోవాలని ప్రయ త్నించింది. ఒంట్లో సత్తువ లేదు. ఎక్కడికని పోతుంది! అందుకే పాపం దొరికిపోయింది. ఆ తర్వాత వాళ్లు పెట్టిన హింసను తాళలేక, ప్రాణాలే వదిలేసింది. ఇదంతా విని చలించిపోయాడు ఇన్స్పెక్టర్. బెనెస్యూయ్స్కీతో పాటు సిల్వియా ప్రాణాలు పోవడానికి కారణ మైన వాళ్లందరినీ కోర్టులో నిలబెట్టాడు. అయితే... రెండు పెళ్లిళ్లు విఫలమై, ఒంటరిగా కుటుంబాన్ని ఈదలేక, ఒక విధమైన మానసిక రుగ్మతకు గురవ్వడం వల్లే బెనెస్యూయ్‌స్కీ అలా చేసిందని భావించిన న్యాయస్థానం... మరణ శిక్ష వేయలేదు. ఆమెకు, ఆమె కూతురు పౌలాకి జీవితఖైదును విధించింది. మిగతా వాళ్లందరికీ వాళ్ల నేర తీవ్రతను బట్టి... రెండు నుంచి ఇరవయ్యొక్కేళ్ల వరకూ శిక్షలు విధించింది. అయితే, వీళ్లంతా తర్వాత బెయిలు మీద బయటికొచ్చేశారు. బెనెస్యూయ్‌స్కీ అయితే రెండేళ్లకే బయటికొచ్చింది. ఊపిరి తిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసే వరకూ మారు పేరుతో మరోచోట ప్రశాంతంగానే జీవించింది. మిగతావాళ్లు కూడా తమ కుటుంబాలతో సంతోషంగా జీవించారు. కానీ అక్క పడిన వేదనను కళ్లారా చూసిన జెన్నీ మాత్రం కొన్నేళ్ల వరకూ తేరుకోలేక పోయింది. వాళ్ల కుటుంబం సిల్వియాను మర్చిపోలేక నరక యాతన పడింది. ఆ చిట్టితల్లికి న్యాయం జరగలేదంటూ ఆవేదన చెందింది. అది నిజమేనేమో. ఏం పాపం చేసిందని సిల్వియా మూడు నెలల పాటు అంత నరకాన్ని చవిచూడాలి? ఏం అన్యాయం చేసిందని వాళ్ల చేతుల్లో అంత దారుణంగా మరణించాలి? కోర్టు ఇలా ఆలోచించక పోవడం, ఆ చిన్నారి చిరునవ్వును చెరిపేసినవాళ్లని అలా వదిలేయడం నిజంగా అన్యాయమేనేమో! -
మేరే పాస్ మాఁ హై!
పంచ్ శాస్త్ర ఒకే పేగు తెంచుకొని పుట్టిన ఇద్దరు కొడుకులు. వాళ్ల దారులు వేరు. ‘దారులు వేరైనా వాళ్లకు అమ్మ మీద ఉన్న ప్రేమ ఒక్కటే. ఆదర్శాలు వేరైనా... అమ్మ మీద ఉన్న అనురాగం ఒక్కటే. ఒకరు ఇన్స్పెక్టర్...చాలా మంచివాడు. ఒకరు... క్రిమినల్....చాలా చెడ్డవాడేమీ కాదు. కుటుంబం కోసం క్రిమినల్‌గా మారినవాడు. తనను ‘మంచి వాడు’ అని పిలుస్తున్నారా? ‘చెడ్డవాడు’ అని పిలుస్తున్నారా? అనేది అతనికి ముఖ్యం కాదు...తన కుటుంబం ఎంత సుఖంగా ఉందనేదే ముఖ్యం. ‘దీవార్’ సినిమా అంటే గుర్తుకు వచ్చేది పాటలు, ఫైట్లు కాదు...ఒకే ఒక్క డైలాగ్... ‘మేరే పాస్ మా హై’ నిరూపరాయ్ అనే అమ్మకు ఇద్దరు కొడుకులు. ఆ అమ్మ ఎలాంటిదంటే...బతికిన నాలుగు రోజులు ఆత్మగౌరవంతో బతకాలి. మోసానికి దూరంగా బతకాలి. ఏసీ భవనంలో నివసించే ‘సుఖం’ కంటే, కష్టంతో సంపాదించుకున్న సొమ్ముతో పూరి గూడిసెలో నివసించే ‘కష్టమే’ గొప్పదని నమ్ముతుంది. అమ్మ ఒడి అంటే... ఒక పాఠశాల. ఆ పాఠశాలలో ఎన్నో కథలు వినిపిస్తాయి. అవి కథలు మాత్రమే కాదు... జీవితాన్ని సక్రమమైన దారిలో నిర్మించుకోవడానికి అవసరమైన సాధనాలు. నిరూపరాయ్ ఇద్దరు కొడుకులు అమితాబ్, శశికపూర్లు ఆమె ఒడిలో ఎన్నో పాఠాలు నేర్చుకొని ఉండొచ్చు. అయితే, కాలక్రమంలో.... తల్లి చెప్పిన పాఠం చిన్నోడు శశికి వెలుగు దారిగా కనిపించింది. పెద్దోడికి... వెలుగే కనిపించని చీకటి నిండిన చాదస్తపు దారిగా కనిపించింది. ‘కన్నీటిని కన్నీటితో జయించలేము. కత్తితో జయించాలి. అన్యాయాన్ని న్యాయంతో కాదు... అంతకంటే అన్యాయంతో జయించాలి’ అనేది అమితాబ్ సిద్దాంతం. అందుకే అన్నదమ్ములు ఇద్దరి మధ్య బెర్లిన్ గోడలాంటి పెద్ద గోడ. అన్నదమ్ములిద్దరి మధ్య ‘మోరల్ క్లాష్’కు అదో బలమైన ప్రతీక. ‘‘తుమారే మేరే బీచ్ మే ఏక్ దీవార్ హై’’ అంటాడు ఇన్స్పెక్టర్ శశి. ఆ కాల్పనిక గోడకు చెరోవైపు నిల్చొని ఉన్నారు అమితాబ్, శశీలు. ‘‘నీ గోల పక్కన పెట్టు...అమ్మ నాతోనే ఉంటుంది. నీకు నా దగ్గర ఉండాలని లేకపోతే ఈ క్షణమే వెళ్లిపోవచ్చు’’ అంటాడు అమితాబ్. ఈ మాటలో ‘కఠినత్వం’ మాత్రమే కాదు...తన మీద తనకు అపారమైన ఆత్మవిశాసం ఉంది. మరి అమ్మ ఏమంటుంది? అదిగో ఆమె వైపు చూడండి. తలపై నెరిసిన ఆమె వెంట్రుకలు... పరిస్థితులతో పండి పోయిన వైనాన్ని సూచిస్తున్నాయి. పెద్ద కొడుకు అమితాబ్ మాటలు ఆసక్తిగా వింటోంది... అమితాబ్ అంటున్నాడు... ‘‘మేరా పాస్ బంగ్లా, గాడి సబ్ హై...’’ అప్పుడు అమ్మ చిన్నగా అంటుంది, ఆ చిన్న మాటల్లో ఎంత పెద్ద అర్థం ఉంది... ‘‘నేను చిన్నోడితో వెళుతున్నాను. నీ కొకటి చెప్పదల్చుకున్నాను నాయనా... నువ్వు సంపన్నుడివే కావచ్చు. అంతమాత్రాన... అమ్మను కొనే ప్రయత్నం చేయకు. నువ్వు ఎంత సంపన్నుడివైనా... అమ్మను కొనేంత సంపన్నుడివి ఇప్పుడే కాదు... ఎప్పుడూ కాలేవు. గుర్తుంచుకో..’’ ఈ సన్నివేశానికి వచ్చిన స్పందన...ఇంతా అంతా కాదు! అమ్మను కొనే సంపన్నుడు భూమి మీద పుట్టలేదు. పుట్టబోడు!! అన్నదమ్ముల మధ్య మాటల యుద్దం జరుగు తుంది. ‘‘నా మాట విను..’’ అని శశి మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అమితాబ్. ‘‘వినను’’ అంటూనే తన ఆదర్శం గురించి చెబు తున్నాడు శశి. ‘‘మాట్లాడితే ఆదర్శం అంటావు. నీ ఆదర్శాలన్నీ కలిసి ఒక రొట్టె తయారు చేసుకొని తినడానికి కూడా పనికి రావు...’’ శశిలో ఎలాంటి చలనం లేదు. ‘‘...ఇటు చూడు... ఇటు చూడు. నావైపు చూడు. నువ్వెలా ఉన్నావు. నేనెలా ఉన్నాను. ఇద్దరం ఒకే చోటు నుంచి బయలుదేరాం. ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? నేనెక్కడ ఉన్నాను? ఏముంది నీ దగ్గర? ఒంటి మీద యూనిఫాం, ఉండడానికి క్వార్టర్స్, తిరగడానికి జీప్ తప్ప...! మరి నా దగ్గర- ‘ఆజ్ మేరే పాస్ బంగ్లా హై... గాడి హై... బ్యాంకు బ్యాలెన్స్ హై... తుమ్హరా పాస్ క్యా హై?’ (ఇవ్వాళ నా దగ్గర బంగ్లా ఉంది. కారు ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. మరి నీ దగ్గర ఏముంది?) ఈ ప్రశ్నకు శశి ఇచ్చిన జవాబు భారతదేశాన్ని ఉర్రూతలూపేసింది. ‘మేరే పాస్ మా హై’ (నా దగ్గర అమ్మ ఉంది) అమ్మ గొప్పదనం గురించి చెప్పాలంటే అనంతమైన శ్లోకాలు అక్కర్లేదు. భావోద్వేగభరిత శోకాలు అక్కర్లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు అక్కర్లేదు. భారీ పుస్తకాలు అక్కర్లేదు. ఒక్క చిన్న మాట చాలు... అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది! - యాకుబ్ పాషా -
దేవాదాయశాఖ ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు
విశాఖపట్నం: దేవాదాయ శాఖ టౌన్ ఇన్ స్పెక్టర్ రాజకుమారిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు...కోర్టుకు సంబంధించిన రిపోర్టులను పట్టించుకోకపోవడంతో పాటు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల విచారణలో అలసత్వం ప్రదర్శించినందుకు ఆమెపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. సస్పెన్షన్ కు సంబంధించిన ఉత్తర్వులను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పుష్పవర్ధన్ వెల్లడించారు. -
ఇన్స్పెక్టర్పై దాడి చేసిన కానిస్టేబుల్‌పై కేసు
అబిడ్స్: ఎగ్జిబిషన్లో ఇన్స్పెక్టర్పై దాడి చేసిన కానిస్టేబుల్‌పై బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శనివారం రాత్రి విధుల్లో ఉన్న బేగంబజార్ ఇన్స్పెక్టర్ గంగసాని శ్రీధర్‌పై మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రవి కిరణ్ సినీఫక్కీలో దాడి చేశాడు. బాధిత ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఫిర్యాదుతో రాత్రి పొద్దుపోయాక సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి, అబిడ్స్ ఏసీపీ జైపాల్ విచారణ జరిపారు. కానిస్టేబుల్ రవి తీరుపై మండిపడ్డారు. అతనిపై ఐపీసీ 353, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతటా చర్చ... ఎగ్జిబిషన్లో బందోబస్తు విధుల్లో ఉన్న బేగంబజార్ ఇన్స్పెక్టర్ గంగసాని శ్రీధర్‌పై కానిస్టేబుల్ రవికిరణ్ దాడి చేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిబిషన్ లోపల కూర్చుని ఇతర సిబ్బందితో ముచ్చటిస్తున్న రవికిరణ్‌ను బందోబస్తులో ఉన్న శ్రీధర్ కూర్చోవద్దని మందలించారు. దీంతో కక్షగట్టిన కానిస్టేబుల్ రవికిరణ్ శనివారం రాత్రి ఇన్స్పెక్టర్ ఎగ్జిబిషన్ అజంతాగేటు వద్ద విధులు నిర్వర్తిస్తుండగా.. ముఖానికి మాస్క్, జాకెట్ ధరించి వెనుక నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్పై దాడి బలంగా కొట్టి పారిపోయాడు. సమీపంలోని మనోరంజితం కాంప్లెక్స్‌లోని 5వ ఫ్లోర్లో దాక్కున్న అతడిని సందర్శకులు దొంగా.. దొంగా అంటూ బయటకు లాక్కొచ్చి చితకబాదారు. చివరకు మానవతా దృక్పథంతో ఇన్స్పెక్టర్ శ్రీధర్ అతడిని సందర్శకుల నుంచి విడిపించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం విశేషం. అధికారుల ఆందోళన... ఇన్స్పెక్టర్ గంగసాని శ్రీధర్‌పై కానిస్టేబుల్ రవికిరణ్ దాడి చేయడంపై నగరంలోని పలువురు ఇన్స్పెక్టర్లు, ఏసీపీ స్థాయి అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని ఏ పోలీస్‌స్టేషన్, ఏసీపీ కార్యాలయంలో చూసినా రవికిరణ్ తీరుపైనే చర్చించుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. కమిషనర్ సీరియస్... బేగంబజార్ ఇన్స్పెక్టర్పై దాడి చేసిన కానిస్టేబుల్ రవి కిరణ్ తీరుపై నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అబిడ్స్ ఏసీపీ జైపాల్‌ల విచారణ నివేదిక ఆధారంగా నేడో.. రేపో కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. -
కథ మారింది
ఆవేశం... మనిషిని మనిషిలా ఉండనివ్వదు.ఎంతకైనా దిగజారుస్తుంది.ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది.అది తెలిసి కూడా ఆవేశాన్ని అణచుకోలేకపోయాడు ఆస్కార్ పిస్టోరియస్. ‘బ్లేడ్న్న్రర్’గా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఆస్కార్... ఆవేశమనే శత్రువును అణచుకోలేక అదే ప్రపంచం ముందు దోషిలా నిలబడ్డాడు. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు! అక్టోబర్ 21, 2014... దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా కోర్టు కిటకిటలాడుతోంది. ఎప్పుడూ లేనంత నిండుగా ఉంది. అక్కడున్న అందరి ముఖాల్లోనూ ఆతృత కనిపిస్తోంది. ఏం జరగబోతోంది అన్న ప్రశ్న అందరి కళ్లలోనూ కదలాడుతోంది. దు వరుసలో బెంచీమీద కూర్చున్న వ్యక్తి ముఖమైతే బాగా పాలిపోయింది. టెన్షన్ పడుతున్నట్టుగా పెదవులు అదురుతున్నాయి. భీతితోనో, బాధతోనో గానీ... కళ్లు మాటిమాటికీ చెమ్మగిల్లు తున్నాయి. తల దించుకుని పదే పదే వేళ్లతో కళ్లను ఒత్తుకుంటున్నాడు. తలో హాలులో చిన్నపాటి అలికిడి. న్యాయమూర్తి రావడంతో అందరూ లేచి నిలబడ్డారు. ఆవిడ కూర్చోగానే కూర్చున్నారు. న్యాయమూర్తి కాసేపు తన దగ్గరున్న కాగితాలను తిరగేసింది. అప్పుడప్పుడూ తలెత్తి కోర్టులో వారందరినీ పరిశీలించింది. మధ్యమధ్యన ఆ వ్యక్తివైపు కూడా నిశితంగా చూసింది. కాసేపటి తర్వాత చేతిలోని కాగితాలను టేబుల్ మీద పెట్టి పెదవి విప్పింది. ‘‘కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట... రీవా స్టీన్‌క్యాంప్‌ను తుపాకితో కాల్చి, ఆమె మరణానికి కారకుడైనందుకుగాను... ఆస్కార్ పిస్టోరియస్కు ఐదేళ్ల కారాగారశిక్ష విధించడమైనది.’’ అందరూ ఆశ్చర్యపోయారు. హతురాలి తల్లి అయితే హతాశురాలైంది. ‘‘ఇది అన్యాయం. నా కూతుర్ని పొట్టనబెట్టుకున్నవాడికి, ఓ నిండు జీవితాన్ని బలి తీసుకున్నవాడికి శిక్ష కేవలం అయిదేళ్లా?’’ అంటూ బావురుమంది. వేదనతో అక్కడ్నుంచి బయటకు వెళ్లిపోయింది.ఆ వ్యక్తి తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు. దుఃఖపడుతున్నాడనడానికి సాక్ష్యంగా అతడి భుజాలు రెండూ కదులుతున్నాయి. ‘‘మిస్టర్ పిస్టోరియస్... లేవండి వెళ్దాం’’ ఇన్స్పెక్టర్ గొంతు వినగానే కళ్లు తుడుచుకుని లేచాడా వ్యక్తి. ఓసారి చుట్టూ చూశాడు. దూరంగా నిలబడి తనవైపే చూస్తోన్న తల్లి, చెల్లిని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. బలవంతాన అదిమి పెట్టి, పోలీసుల వెంట వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు. అతడు పోలీసుల వాహనంలోకి ఎక్కుతుంటే కాస్త దూరం నుంచి చూస్తోన్న హతురాలి తల్లి అరుస్తోంది... ‘‘వాడు రాక్షసుడు. నా కూతురి ప్రాణాలు హరించాడు. ఈ శిక్ష వాడికి చాలదు. చూస్తూండండి. వాడు త్వరలో మరో నేరం చేసినా చేస్తాడు’’. ఆమె మాటలకు కొందరు అవాక్క య్యారు. కొందరు జాలిపడ్డారు. కొందరు ఆమెను తప్పుబట్టారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడింది ముక్కూ ముఖం తెలియని ఓ సామాన్య వ్యక్తి గురించి కాదు. ప్రపంచమే గొప్పగా చెప్పుకునే అథ్లెట్ గురించి. కాళ్లు లేకపోయినా కృత్రిమకాళ్లతో రికార్డులు సాధించిన పరుగుల వీరుడి గురించి. బ్లేడ్ రన్నర్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే... ఆస్కార్ పిస్టోరియస్ గురించి! త గొప్ప ఆటగాడు, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు... హత్య చేశాడా? ఎందుకు? అసలిది నిజమేనా? లేక తప్పుడు కేసా? అసలింతకీ ఏం జరిగింది? ఆస్కార్ నేరస్తుడా? అమాయకుడా? ఫిబ్రవరి 14, 2013... ‘‘ఏం జరిగింది సర్... అంబులెన్స్ కోసం ఫోన్ చేశారెందుకు?’’... లోపలకు అడుగు పెడుతూనే అడిగాడు అంబులెన్స్‌తో పాటు వచ్చిన మేల్ నర్స్. ఆస్కార్ మాట్లాడలేదు. నీళ్లు నిండిన కళ్లతో నిస్తేజంగా చూస్తున్నాడు. ‘‘చెప్పండి సర్. ఏం జరిగింది? మీ ఆరోగ్యం బాగానే ఉందా?’’ అన్నాడతను కంగారుగా. తన అభిమాన ఆటగాడికి ఏమయ్యిందోనన్న కంగారు అతడిలో. ఈసారి కూడా ఆస్కార్ సమాధానం చెప్పలేదు. అటు చూడమన్నట్టుగా చేతిని చాచాడు. చూసిన నర్స్ ఉలిక్కిపడ్డాడు. అక్కడ... నేలమీద... రక్తపు మడుగులో అచేతనంగా పడివుంది ఓ అమ్మాయి. ‘‘ఎవరు సర్... ఏమయ్యింది?’’ అన్నాడతను కంగారుగా. ప్రాణాలతో ఉందేమో చూద్దామని దగ్గరకు వెళ్లబోయాడు. అప్పుడు పెగిలింది ఆస్కార్ గొంతు. ‘‘తను చనిపోయింది’’ బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడతడు. ‘‘ఎలా సర్?’’ అన్నాడు అయోమయంగా. ‘‘నేనే చంపేశాను’’ బావురుమన్నాడు ఆస్కార్. అవాక్కయిపోయాడా వ్యక్తి. వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. విషయం పోలీసుల చెవిని వేశాడు. ‘‘తల, నడుము, భుజం... మూడు చోట్ల బుల్లెట్లు దిగాయి. అంత దారుణంగా ఎలా చంపగలిగారు మిస్టర్ పిస్టోరియస్?’’ సూటిగానే అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘కావాలని చేయలేదు సర్. బాత్రూమ్లో అలికిడి అవుతుంటే దొంగ దూరాడేమో అనుకున్నా. బయటకు రమ్మన్నా రాకపోవడంతో షూట్ చేశా. కానీ...’’ ‘‘కానీ లోపల ఉన్నది దొంగ కాదు. మీ ప్రియురాలు రీవా. మిమ్మల్ని నమ్మి, మీతోనే కలిసి జీవిస్తోన్న రీవా. త్వరలోనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటోన్న రీవా. అంతే కదూ?’’ ‘‘మీ మాటల్లో వ్యంగ్యం నాకు అర్థమయ్యింది సర్. కానీ నేను చెప్పింది నిజం. నేను తనని చంపలేదు. దొంగ అనుకుని షూట్ చేస్తే తను చనిపోయింది.’’ ‘‘అవునా... అయినా దొంగ బాత్రూములో ఎందుకుంటాడు మిస్టర్ పిస్టోరియస్?’’ ‘‘బాత్రూమ్లో ఓ కిటికీ ఉంది. దానిగుండా జొరబడ్డాడేమో అనుకున్నాను.’’ వెటకారంగా నవ్వాడు ఇన్స్పెక్టర్. ఆస్కార్ ఎన్ని చెప్పినా అతడు నమ్మలేదు. ఎందుకంటే, అతడు చెప్పేది నమ్మశక్యంగా లేదు కాబట్టి. ఆస్కార్‌ని ప్రాణంగా ప్రేమించింది రీవా స్టీన్‌క్యాంప్. ప్రముఖ మోడల్ అయిన ఆమె ఆస్కార్‌కి అర్ధాంగి కావాలని ఆశపడింది. చివరికి అతడి చేతిలోనే హత్యకు గురయ్యింది. స్కార్ చెప్పినదాని ప్రకారం... ఫిబ్రవరి పద్నాలుగు తెల్లవారుజామున నిద్రలో ఉండగా... బాత్రూమ్లో ఏదో అలికిడి వినిపించి మెలకువ వచ్చింది ఆస్కార్‌కి. ఎవరూ అని అరిచాడు. సమాధానం రాలేదు. దాంతో తుపాకీ తీసుకుని బాత్రూమ్ దగ్గరకు వెళ్లాడు. తలుపు లోపల నుంచి గడియ పెట్టి వుంది. ఎంత పిలిచినా లోపలి వ్యక్తి తలుపు తీయలేదు. దాంతో తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత ఎందుకో మంచం వైపు చూస్తే రీవా కనిపించలేదు. ఆస్కార్ అమాయకుడని అతడి అభిమానులు నమ్మినా... అతగాడి స్వభావం తెలిసినవాళ్లంతా అతడినే దోషి అంటున్నారు. బరిలో ఆత్మవిశ్వాసంలో పరుగులు తీసే ఆస్కార్... వ్యక్తిగత జీవితంలో ఆవేశంతో తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాడు. రెండుసార్లు పబ్లిక్ ప్లేసుల్లో కొట్లాటలకు దిగి, కోపాన్ని అణచుకోలేక తుపాకీతో కాల్పులు జరిపాడు. కేసుల పాలయ్యాడు. మూడేళ్ల పాటు క్రీడా రంగంలో నిషేధానికి గురయ్యాడు. కోపం వస్తే కంట్రోల్ తప్పిపోయే అతగాడు, రీవాని కావా లనే ఎందుకు చంపివుండకూడదు అన్నది పలువురి సందేహం. అది నిజమే కావచ్చు. కానీ న్యాయస్థానం అలా ఆలోచించనప్పుడు చేసేదేముంది! అన్యాయం జరిగింది అని భావిస్తే... రీవా ఆత్మశాంతికి ప్రార్థించడం తప్ప! అనుమానం వచ్చి క్రికెట్ బ్యాట్‌తో తలుపు పగులగొట్టాడు. లోపల కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది రీవా. తనను ఎలాగైనా కాపాడుకోవాలని అంబులెన్సు కోసం ఫోన్ చేసి, ఆమెను చేతుల్లో ఎత్తుకుని హాల్లోకి తీసుకొస్తుండగానే సమయం మించిపోయింది. రీవా ఊపిరి ఆగిపోయింది. ఇదీ ఆస్కార్ పోలీసులకు, కోర్టుకు చెప్పిన విషయం. అయితే జరిగినదానికీ, దొరికిన సాక్ష్యాలకీ, ఆస్కార్ చెప్పినదానికీ ఏమాత్రం పొంతన కుదరలేదు. రీవాకి బుల్లెట్లు తగిలిన విధానాన్ని బట్టి ఆమె వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చుని ఉంది. అప్పుడే ఆస్కార్ షూట్ చేశాడు. అతడి పిలుపు వినివుంటే ఆమె బదులు పలికేది కదా! లేచి తలుపు తీసేది కదా! అన్నిసార్లు పిలిచినా ఎందుకు మాట్లాడదు! పోనీ ఏదైనా గొడవ జరిగిందా? కోపంతో పలకలేదా? లేదంటే ఏ కారణం చేత అయినా అతడికి భయపడి దాక్కుని ఉందా? అలా అనుకున్నా నిలబడి ఉంటుంది కానీ ఎందుక్కూర్చుంటుంది? అలికిడి వినగానే కృత్రిమకాళ్లు అమర్చుకోకుండానే పాకుతూ బాత్రూమ్ దగ్గరకు వెళ్లానని, తర్వాత మంచం వైపు చూస్తే రీవా లేదని, దాంతో వెళ్లి కాళ్లు అమర్చుకుని వచ్చి తలుపు పగుల గొట్టానని, ఆమెను ఎత్తుకుని కిందికి తీసుకొచ్చానని ఆస్కార్ చెప్పాడు. నడవలేని వ్యక్తి ఎవరైనా.... తనతో పాటు ఒక మనిషి ఉన్నప్పుడు, అలికిడి అవగానే అదేంటో చూడమని ఆ మనిషితో చెప్తాడు కానీ, తనే ఎందుకు పాక్కుంటూ వెళ్తాడు? మరో విషయం... పిలిచినప్పుడు ఆమె కావాలని పలకకపోయినా, మొదటి బుల్లెట్ తగలగానే కేక పెడుతుంది కదా! అది విని అయినా ఇక కాల్చడం మానేయాలి కదా! ఈ ప్రశ్నల్లో వేటికీ ఆస్కార్ దగ్గర సమాధానం లేదు. దాంతో రీవా తల్లి చెప్పిన మాటలు నిజమేనేమో అనిపించింది పోలీసులకు. రీవా ఆస్కార్‌ని ప్రాణంగా ప్రేమించిందని, కానీ అతడు అసూయాపరుడని, పురుషాహంకారంతో రీవాని హింసించేవాడనీ ఆమె చెప్పింది. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన రీవా, అతడికి దూరమైపోవాలనుకుంటున్నట్టు ఆ రోజు రాత్రే తనతో చెప్పిందని అందామె. ఆ రాత్రి తెల్లవారకముందే రీవా మృత్యు వాత పడింది. బహుశా వదిలి వెళ్తానం దన్న కోపంతోనే రీవాని చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసిందామె. ఎలా చూసినా సాక్ష్యాలన్నీ ఆస్కార్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి. అందుకే అతడికి జీవితఖైదు పడొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ కేవలం ఐదేళ్లు శిక్ష వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. న్యాయమూర్తి మసిపాకు ఆస్కార్ చేసింది హత్య అనిపించలేదు. దొంగ అనుకునే కాల్పులు జరిపాడని నమ్మిందామె. అందుకే ఐదేళ్లు శిక్ష విధిస్తున్నానని చెప్పింది. కానీ అది న్యాయమేనా? అతడు చెప్పేదానిలో ఏ మాత్రం వాస్తవం ఉన్నట్టు అనిపించకపోయినా, దొరికిన సాక్ష్యాలన్నీ అతడే దోషి అని నిరూపిస్తున్నా... పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడంటూ తక్కువ శిక్షను వేయడం సబబేనా? ఇరవై తొమ్మిదేళ్ల వయసులో చేయని తప్పుకు బలైపోయిన రీవాకు న్యాయం జరిగినట్టేనా?!! - సమీర నేలపూడి -
మరణ రహస్యం.. భార్యను, పోలీస్ శాఖను మోసం చేశాడు
ముంబై: ఎక్కడికెళ్లినా అధికార దర్పం, గౌరవానికి కొదవలేదు. ఇన్స్పెక్టర్గారికి కింది స్థాయి సిబ్బంది నమస్కారం చేసి వెళ్తుంటారు. భార్య, పోలీస్ శాఖ అందరూ ఆయన ఇన్స్పెక్టరేనని నమ్మారు. చివరి రోజు కూడా పోలీసు మర్యాదలు అందుకున్నాడు. అయితే ఆయన మరణించిన తర్వాతే ఇన్స్పెక్టర్ కాదనే నిజం బయటపడింది. అందర్నీ నివ్వెరపరిచిన ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పుణె సమీపంలో మంగళవారం బ్రహ్మ వడ్గాన్కర్ (37) అనే వ్యక్తి భార్యతో కలసి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతను పుణెలో ఏసీబీ ఇన్స్పెక్టర్గా అందరికీ గుర్తింపు. ఈ వార్త తెలియగానే వచ్చిన పోలీసులు వడ్గాన్కర్ జేబులోని గుర్తింపు కార్డు, అధికార పత్రాలు, బదిలీ ఉత్తర్వులు చూసి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ఫోన్ చేశారు. డీజీపీ ప్రవీణ్ దీక్షిత్ వెంటనే స్పందించి ఆయనకు సాయం చేయాల్సిందిగా పుణె ఏసీబీ ఆఫీసుకు సమాచారం చేరవేశారు. ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. వడ్గాన్కర్ ఇన్స్పెక్టర్ కాదని ఒకప్పుడు పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసేవాడని తేలింది. కాగా ప్రమాదంలో వడ్గాన్కర్ మరణించగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. గుర్తింపు కార్డు, అధికార పత్రాలు, బదిలీ ఉత్తర్వులు నకిలీవని కనుగొన్నారు. ఈ విషయం ఆయన భార్యకు చెప్పగా తొలుత ఆమె నమ్మలేదు. పోలీసులు వివరాలు చెప్పడంతో ఆమె కలల ప్రపంచం కూలిపోయినట్టు అనిపించింది. పెళ్లికి ముందు ఇంగ్లండ్‌లో ఉన్న ఆమెకు ఓ వివాహ ప్రకటన ద్వారా వడ్గాన్కర్ పరిచయమయ్యాడు. ఆమె కుటుంబ సభ్యులు కట్నంగా బంగారు, నగదు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా పెళ్లికి అతని కుటుంబ సభ్యులు హాజరుకాలేదు. వారికి ఇష్టం లేకపోవడంతో రాలేదని పెళ్లికూతురు వారిని నమ్మించారు. పెళ్లియిన తర్వాత వడ్గాన్కర్ లాకర్లో పెడతానంటూ నగలు తీసుకెళ్లాడు. భార్యను, పోలీసులను మోసగించిన వడ్గాన్కర్ చివరకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతను మరెవరినైనా మోసం చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
9 నెలల చిన్నారిపై హత్యా నేరం.. ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
లాహోర్: పాకిస్థాన్‌లో తొమ్మిదేళ్ల చిన్నారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం, కోర్టులో హాజరు పరచడం.. ఆ దేశ న్యాయ వ్యవస్థపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ ఖాసీఫ్ మహ్మద్‌ను సస్పెండ్ చేశారు. మూసాఖాన్ అలియాస్ మహ్మద్ ఉమర్ అనే బుడతడిపై హత్యాయత్న నేరం అభియోగాలు మోపి లాహోర్ కోర్టులో హాజరపరిచిన విషయం తెలిసిందే. పేరు పిలవగా, ఏడుస్తున్న పిల్లాడిని ఎత్తుకుని అతని తాత కోర్టులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించి పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. 'అంత చిన్న పిల్లాడిని ఏ కేసులోనైనా ఎలా నిందితుడిగా చేరుస్తారు? ఇలాంటి పోలీసులతో ఏం సాధించగలం' అంటూ కోర్టులో విస్మయం వ్యక్తం చేశారు. పిల్లాడికి వెంటనే బెయిలివ్వడంతో పాటు అతనిపై అభియోగాలను ఉపసంహరించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద చర్యలు మినహా క్రిమినల్ కేసుల్లో నిందితులుగా చేర్చాలంటే వారి వయసు కనీసం 12 ఏళ్లు ఉండాలి. పోలీస్ అధికారి చట్టం కూడా తెలుసుకోకుండా కేసు నమోదు చేయడం పోలీస్ వ్యవస్థనే అభాసుపాలు చేసింది. లాహోర్ లో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న హోరాహోరీని ఆపేందుకు వెళ్లిన పోలీసులపై ఒక వర్గం దాడి చేసింది. ఈ సంఘటనలో ఒక పోలీసు చనిపోయాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరిపై కేసులు నమోదయ్యాయి. అందులో ఈ బుడ్డోడు కూడా ఉన్నాడు. -
భార్యపై వేధింపుల కేసులో ఎస్ఐ లొంగుబాటు
చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే విలన్ గా మారాడు. భార్యకు నరకయాతన చూపించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో కోర్టులో లొంగిపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. అనిల్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. శ్వేత అనే యువతిని పెళ్లిచేసుకున్నారు. కాగా ఏడాది నుంచి అనిల్ తనను వేధిస్తున్నాడని శ్వేత ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా తనకు న్యాయం జరగలేదని చెప్పింది. ఈ కేసులో అనిల్ సోమవారం న్యాయస్థానం ఎదుట లొంగిపోయారు. -
చెట్టును ఢీకొన్న కారు ...ఐదుగురి దుర్మరణం
హొసూరు, న్యూస్‌లైన్: క్రిష్ణగిరి జిల్లా పోచంపల్లి వద్ద బుధవారం తెల్లవారు జామున కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి అతివేగం కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. పోచంపల్లి సమీపంలోని అమ్మన్ఆలయ ప్రాంతానికి చెందిన కాట్టురాజా (45), తేని జిల్లాలోని కరుప్పుస్వామి ఆలయంలో మొక్కుబడి తీర్చునేందుకు తమ కుటుంబ సభ్యులతోపాటు అతని తన భార్య స్నేహితురాలు సెందామరైతో కలసి కారులో బయలుదేరారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డుపై వాహనాల రద్దీ లేకపోవడంతో, త్వరగా ఆలయానికి వెళ్లి, చీకటి పడేలోపే ఇంటికి చేరుకోవాలని కాట్టురాజా కారును వేగంగా నడిపినట్లు తెలిసింది. కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చింత చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కాట్టురాజా (45), అతని భార్య మలర్విళి (40), అత్తయ్య పద్మ (55) స్నేహితులు రాజేంద్రన్ (43), పళణి (42) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాల పాలైన కాట్టురాజా కొడుకు వసంత్ (7), కూతురు వశీక (15), సెందామరై (40)లను స్థానికులు ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. వెనుక సీట్లో కూర్చొవడం వల్ల కాట్టురాజా కొడుకు, కూతురు, సెందామరై ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. పోచంపల్లి ఇన్స్పెక్టర్ మురుగన్, బారూరు ఇన్స్పెక్టర్ మురుగేశన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.