తిరువొత్తియూరు: చెన్నై సమీపంలోని పట్టాభి రాం పోలీసుస్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, న్యాయవాది పరస్పరం దాడులు చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పట్టాభిరాం పోలీసుస్టేషన్‌లో జగదీశన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ కేసుకు సంబంధించి ఐనావరంకు చెందిన న్యాయవాది కార్తీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో సబ్ ఇన్‌స్పెక్టర్, న్యాయవాదికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. అనంతరం ఇద్దరు వేర్వేరుగా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జాయింట్ కమిషనర్ జగదీశన్‌ను తాత్కాలికంగా బాధ్యతల నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment