శరవణన్, విన్సంట్ (ఫైల్)
సాక్షి, చెన్నై(తమిళనాడు): మసాజ్ సెంటర్లు, స్పాలు, స్టార్ హోటళ్లు, రిసార్టుల్లో వ్యభిచారం నిర్వహించుకునేందుకు అనుమతివ్వడమే కాకుండా.. బ్రోకర్ల నుంచి లక్షల్లో లంచం పుచ్చుకున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా వారి ఇళ్లల్లో విస్తృతంగా మంగళవారం సోదాలు నిర్వహించింది. వివరాలు.. ప్రస్తుతం కీల్పాకం నేర విభాగం ఇన్‌స్పెక్టర్‌గా శాంవిన్సంట్, సైదాపే ట శాంతి భద్రతల విభాగం ఇన్‌స్పెక్టర్‌గా శరవణన్ పని చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం వరకు ఈ ఇద్దరూ వ్యభిచార నిర్మూలన విభాగం ఇన్‌స్పెక్టర్లుగా పనిచేశారు. ఈ సమయంలో ఆ ఇద్దరూ విదేశీ, స్వదేశీ మోడల్స్‌ను చెన్నైకు రప్పించే బ్రోక ర్ల నుంచి లక్షల్లో లంచం పుచ్చుకుని చూసి చూడనట్టు వ్యవహరించినట్టు ఏసీబీకి ఫిర్యాదులందాయి. దీనిపై రహస్య విచారణ చేపట్టిన ఏసీబీ వర్గాలు ఆ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై కేసు నమోదు చేసింది.
అంతే కాకుండా, మంగళవారం ఉదయాన్నే వారి ఇళ్లల్లో సోదాలు చేసింది. కీల్పాకం పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉన్న శాం విన్సంట్, పులియాంతోపు పోలీసు క్వార్టర్స్‌లోని శరవణన్ ఇంటిలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment