
కోర్టు నుంచి బయటకు వస్తున్న మురుగన్
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో మురుగన్ వేలూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఇతని భార్య నళిని ప్రస్తుతం పెరోల్‌పై విడుదలై కాట్పాడిలోని బ్రహ్మపురంలో ఉంటోంది. ఈనేపథ్యంలో తన బంధువులతో కలిసి మాట్లాడేందుకు 6 రోజుల పెరోల్ ఇప్పించాలని మురుగన్ జైలు అధికారులకు వినతిపత్రం అందజేశాడు. అయితే మురుగన్ గదిలో సిమ్‌కార్డు దొరకడం, మహిళా పోలీసుల వద్ద అసభ్యంగా నడుచుకోవడం, వాట్సాప్ వీడియోలో ఇతర దేశాల్లోని బంధువులతో మాట్లాడిన కేసులు పెండింగ్‌లో ఉన్నందున జైళ్లశాఖ పెరోల్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఇదిలా ఉండగా ఈ కేసు విచారణలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మురుగన్ ఈనెల 2వ తేదీ నుంచి దీక్ష చేపట్టారు. అప్పటి నుంచి జైలులోని వైద్యాధికారులు తరచూ మురుగన్‌కు గ్లూకోస్ ఎక్కిస్తున్నారు. అయితే వాట్సాప్‌లో ఇతర దేశాలకు ఫోన్‌లో మాట్లాడిన కేసుపై మురుగన్ సోమవారం సాయంత్రం పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ వేలూరు కోర్టులో హాజరు పరిచారు. కేసుకు సంబంధించిన సాక్షిగా.. జైలు కానిస్టేబుల్ తంగమాయన్ హాజరయ్యారు. ఆ సమయంలో న్యాయవాది లేకుండా మురుగన్ నేరుగా అతని కేసును వాదించుకున్నాడు. జైలు కానిస్టేబుల్ తంగమాయన్‌ను సుమారు అర్ధగంట పాటు మురుగన్ క్రాస్ ప్రశ్నలు వేశారు. అనంతరం ఈ కేసును న్యాయవాది పద్మకుమారి వాయిదా వేశారు. అనంతరం మురుగన్‌ను జైలుకు తరలించారు.
చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది
Comments
Please login to add a commentAdd a comment