ఫైల్ ఫొటో
వేలూరు: రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ 30 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి 2017 ఆగస్టులో మొదటి సారి రెండు నెలలు ఫెరోల్ ఇచ్చారు. ప్రస్తుతం తండ్రి కుయిల్‌నాథన్ అనారోగ్యం క్షీణించడంతో తన కుమారుడిని పెరోల్‌పై విడుదల చేయాలని తల్లి అర్పుదమ్మాల్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నేపథ్యంలో 30 రోజులు పెరోల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వేలూరు సెంట్రల్ జైలులో ఉన్న పేరరివాలన్‌ను శుక్రవారం తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తండ్రికి వైద్యం చేయించేందుకు మాత్రమే పేరరివాలన్ బయటికి వెళ్లవచ్చని పోలీసులు తెలిపారు.
చదవండి: రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్
Comments
Please login to add a commentAdd a comment