చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సినీ ఫక్కీలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. రాజకీయ ప్రత్యర్ధులు కారుపై నాటు బాంబులతో దాడి చేసి నడిరోడ్డుపైనే హత్య చేశారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంగా పూర్తిగా ధ్వంసమైంది. కాగా, ఈ హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. బీజేపీ నేత పీపీజీ శంకర్.. శ్రీపెరంబుదూరు పక్కనున్న వరకపురం పంచాయతీ కౌన్సిల్ అధ్యక్షుడిగా, బీజేపీ ఎస్సీ ఎస్టీ విభాగం రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నారు. అయితే, పార్టీ విధులు ముగించుకుని శంకర్.. గురువారం రాత్రి చెన్నై నుంచి కారులో బెంగళూరు జాతీయ రహదారి మీదుగా తన ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో శంకర్.. పూనమలీ సమీపంలోని నజరత్‌పేట జంక్షన్ వద్దకు కారు రాగానే ఓ ముఠా కారుపై నాటు బాంబు విసిరింది. దీంతో శంకర్ కారు దిగి పరుగు తీశాడు.
దీంతో, ప్రత్యర్థి ముఠా.. శంకర్‌ను వెంబండించింది. అనంతరం, శంకర్‌ను వారు దారుణం హత్య చేశారు. ఇక, ఈ హత్య సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శంకర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అయితే, శంకర్ హత్యకు ఎన్నికల సమయంలో జరిగినా గోడవలే కారణమా? లేక రియల్ ఎస్టేటుకు సంబంధించిన వ్యవహారమే కారణమా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
BJP functionary PPG Shankar hacked to death near Nazarethpet. A gang hurled country made bombs at his car in which he was travelling, along the Chennai-Bengaluru National Highway in the wee hours of Friday. pic.twitter.com/AATpdu72Kn
— TOIChennai (@TOIChennai) April 28, 2023
ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్ అమరులకు ఘన నివాళులు
Comments
Please login to add a commentAdd a comment