parole
-
హర్యానా ఎన్నికల్లో ‘డేరా బాబా’ ప్రభావమెంత?
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. సీఎం పదవికి నాయబ్ సింగ్ సైనీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఇదిలాఉండగా డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు బెయిల్ మంజూరు చేయడంపై అనేక విమర్శలు తలెత్తాయి. బీజేపీనే డేరా బాబాకు ఎన్నికలకు ముందు పెరోల్ ఇచ్చిందనే ఆరోపణలు వినిపించాయి.జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్‌కు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు 20 రోజుల పెరోల్ లభించింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో మద్దతు కోసం రామ్‌రహీమ్‌కు పెరోల్ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో రామ్‌రహీమ్ విడుదల ఏ పార్టీకి కలసివచ్చిందనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.డేరా మద్దతుదారులున్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 15, బీజేపీ 10, ఐఎన్ఎల్డీ రెండు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 53.57 శాతం, బీజేపీకి 35.71 శాతం, ఐఎన్ఎల్డీకి 7 శాతం, స్వతంత్రులకు 3.57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పరిణామాలు చూస్తే ఈ 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికంగా ప్రయోజనం పొందింది.మీడియా కథనాల ప్రకారం హర్యానా ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని రామ్‌రహీమ్ సత్సంగ కార్యక్రమంలో తన అనుచరులను కోరాడు. ప్రతి అనుచరుడు కనీసం ఐదుగురు ఓటర్లను బూత్‌కు తీసుకురావాలని సత్సంగం సందర్భంగా ఈ సూచించినట్లు పలు వార్తలు వినిపించాయి. డేరా బాబా గతంలో శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌లకు మద్దతును అందించారు. 2007 హర్యానా ఎన్నికలు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో డేరా బాబా బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. అయితే 2014లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు అందించారు. ఇది కూడా చదవండి: గుండెపోటుతో యూట్యూబర్ కన్నుమూత -
పెరోల్‌పై డేరా బాబా విడుదల.. ఆశ్రమంలో సందడి
రోహ్ తక్(హర్యానా): డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా)పెరోల్ పై విడుదలయ్యారు. రోహ్తక్లోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన పోలీసు భద్రత మధ్య యూపీలోని తన బర్నావా ఆశ్రమానికి చేరుకున్నారు. దీంతో ఆశ్రమంలో సందడి వాతావరణం నెలకొంది.రామ్ రహీమ్‌కు ఇరవై రోజుల పెరోల్ మంజారయ్యింది. ఈ పెరోల్ వ్యవధిలో రామ్ రహీమ్ ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, హర్యానాలోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉంది. అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ రహీమ్ 20 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అతనికి పెరోల్ మంజూరైంది. పెరోల్ నిబంధనల ప్రకారం డేరా చీఫ్ హర్యానా ఎన్నికలకు దూరంగా ఉండాలి. #WATCH हरियाणा: डेरा सच्चा सौदा प्रमुख गुरमीत राम रहीम सिंह को 20 दिन की पैरोल मिलने के बाद रोहतक की सुनारिया जेल से रिहा कर दिया गया। pic.twitter.com/0pUomsdRrt— ANI_HindiNews (@AHindinews) October 2, 2024రామ్ రహీమ్ పెరోల్ దరఖాస్తును జైలు అధికారులు ఎన్నికల కమిషన్‌కు పంపారు. పెరోల్ లభిస్తే తాను ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఉండేందుకు సిద్ధమని డేరా చీఫ్ తెలిపారు. 2017లో తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 16 ఏళ్ల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురికి కూడా 2019లో జైలు శిక్ష పడింది.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
ఎన్నికల వేళ డేరా బాబాకు పెరోల్ ఆమోదం.. ఈసీకి కాంగ్రెస్ లేఖ
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలవేళ.. ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. దీనిపై హర్యానా పీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మంగళవారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.హర్యానా ఎన్నికల సమయంలో జైలు నుంచి డేరా బాబాను విడుదల చేయడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది. అదేవిధంగా 2019లొ డేరా బాబా చేతిలో హత్యచేయబడిన జర్నలిస్ట్ కుమారుడు సైతం గుర్మీత్ సింగ్ పెరోల్‌ను వ్యతిరేకించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటం.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలు, ఓటింగ్ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆయన ముఖ్యంగా ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే సందేశాలను హర్యానా ప్రజలకు పంపటం ద్వారా ఓటింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంద’ని అన్నారు. డేరా బాబాకు పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ప్రస్తుతం బీజేపీ పాలించే హర్యానాలో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈసారి హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాహోరీగా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటాన్ని హర్యానా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2017లో జైలు పాలైన డేరా బాబా.. 2020లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 40 రోజుల పాటు పెరోల్‌పై విడుదల కావటం గమనార్హం. ఎన్నికల ముందే డేరా బాబాను ఇలా పెరోల్‌పై విడుదల చేయటంపై కాంగ్రెస్, ప్రజా సంఘాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.చదవండి: MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్ -
హర్యానా ఎన్నికలకు పెరోల్‌పై డేరా బాబా రాక?
రోహ్తక్: ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి 20 రోజుల తాత్కాలిక పెరోల్ కోసం అభ్యర్థించారు. అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఆయన పెరోల్‌కు అభ్యర్థించారు. దీంతో ఈ ఎన్నికలకు ముందే రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.రామ్ రహీమ్ ఈ ఏడాది ఆగస్టు 13న 21 రోజుల పెరోల్‌పై రోహ్తక్ జిల్లాలోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చారు. గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానాలో లక్షలాదిమంది అనుచరులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వస్తే, అది ఎన్నికలపై పెను ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాలో అక్టోబరు 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కూడా చదవండి: పదేళ్ల ‘మన్ కీ బాత్’లో.. ప్రధాని మోదీ భావోద్వేగం -
‘అమ్మ చనిపోయింది.. ఆఖరి చూపులకూ వెళ్లలేకపోయా’
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన 'ఎమర్జెన్సీ' రోజులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. తనను 18 నెలల పాటు జైలులో పెట్టిన నాటి ప్రభుత్వం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా పెరోల్ ఇవ్వలేదన్నారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ చేసిన 'నియంతృత్వ' ఆరోపణలపై స్పందింస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించిన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు. "ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి నాకు పెరోల్ ఇవ్వలేదు. ఇప్పుడు వారు ( కాంగ్రెస్ ) మమ్మల్ని నియంతలు అంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్‌నాథ్ సింగ్ వయస్సు 24 సంవత్సరాలు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1977 మార్చి వరకు కొనసాగిన జేపీ ఉద్యమంలో మిర్జాపూర్-సోన్‌భద్రకు ఆయన కన్వీనర్‌గా పనిచేశారు. "అప్పుడు నాకు కొత్తగా పెళ్లైంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన నన్ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు జైలుకు తీసుకెళ్లారు. ఏకాంత నిర్బంధంలో ఉంచారు" అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఒక సంవత్సరం జైలులో గడిపిన తరువాత, ఆయన్ను విడుదల చేస్తారా అని అడిగిన రాజ్‌నాథ్ సింగ్ తల్లికి ఎమర్జెన్సీని మరో సంవత్సరం పొడిగించారని బంధువు ఆమెకు తెలియజేశారు. ఆ దిగులుతో ఆమెకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి 27 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తనకు పెరోల్ రాకపోవడంతో తల్లి అంత్య క్రియలకు వెళ్లలేకపోయానని, దీంతో తన సోదరులే అంత్యక్రియలు నిర్వహించారని వివరించారు. తాను జైలులోనే గుండు గీయించుకున్నానని తెలిపారు. -
డేరా బాబాకు ఎదురు దెబ్బ
ఇద్దరు మహిళల అత్యాచార కేసులో దోషి అయిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రామ్ రహీమ్‌కు తరచుగా పెరోల్ ఇవ్వటంపై హర్యానా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక నుంచి హైకోర్టు నుంచి కచ్చితమైన అనుమతి లేకుండా రామ్ రహీమ్‌కు ఎటువంటి పేరొల్ మంజూరు చేయకూడదని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 19న ఆయన పెరోల్ మంజూరు అయింది. ఇప్పటివరకు గడిచిన పది నెలల్లో ఇది ఏడోసారి కాగా, మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో తొమ్మిదోసారి ఆయన పెరోల్ పొందారు. తాజాగా ఆయన మరోసారి తనకు పెరోల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. హర్యానా ప్రభుత్వం తీవ్ర అసహం వ్యక్తం చేసింది. గతంలో రమ్ రహీం వలే.. ఎంతమంది దోషులకు పెరోల్ ఇచ్చారో? ఎన్ని రోజులు ఇచ్చారో? ఎంత మందికి పెరోల్స్ ఆమోదం పొందాయో అనే పూర్తి వివరాలు తమకు సమర్పించాలని హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే రామ్ రహీం మూడు ముఖ్యమైన సందర్భాల్లో 91 రోజులు పెరోల్‌పై జైలు బయట వచ్చారు. 21 రోజులు నవంబర్‌లో, 30 రోజులో జూలైలో, 40 రోజులు గత జనవరిలో తన పుట్టిన రోజు సందర్భంగా పెరోల్ పొందారు. ఇక..తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీంను 2017లో హర్యానాలోని పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. అయినకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తనకు తరచు పెరోల్ జారీ చేయటంలో రాజకీయ కోణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో నిర్వమించు పలు ఎన్నికలు. ఎందుకుంటే రామ్ రహీం అభిమానులు, భక్తులు ఎక్కువగా మాల్వా సామాజిక వర్గానికి ఉన్నారు. అయితే ఆ సామాజిక వర్గం ఓట్లు హర్యానాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ సమాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో 69 సీట్లలో ప్రాబల్యం కలిగిఉంటారు. ఈ నేపథ్యంలో రామ్ రహీంకు పెరోల్ వచ్చేలా చేసి.. తన అనుచరులు, భక్తులైన మాల్వా సామాజిక వర్గం ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 2022, ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికల సయయంలో 21 రోజుల పెరోల్ పొందారు. అదే ఏడాది హర్యానా మున్సిపల్ ఎన్నికల వేళ జూన్‌లో కూడా 30 రోజుల పెరోల్ పొందారు. గత ఏడాది అక్టోబర్‌లో సైతం హర్యానాలోని అదమ్‌పూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆయనకు 40 రోజులు పెరోల్ లభించింది. -
థాయ్ మాజీ ప్రధానికి పెరోల్
బ్యాంకాక్: జైలు శిక్ష అనుభవిస్తున్న థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్ర(76) పెరోల్ మీద విడుదలయ్యారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వం అతడిని పెరోల్‌పై విడుదల చేసింది. మరో ఆరు నెలల్లో షినవత్ర శిక్ష ముగియనుంది. 15 ఏళ్ల ప్రవాసం వీడి గతేడాది దేశంలో అడుగు పెట్టిన వెంటనే ఆయనను జైలుకు తరలించారు. అనారోగ్యం కారణంగా జైలు నుంచి వెంటనే పోలీస్ ఆస్పత్రికి తరలించి నిర్బంధంలో ఉంచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన షినవత్రకు అవినీతి ఆరోపణలపై 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో షినవత్ర కుటుంబ సభ్యులే కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 70 ఏళ్లు దాటి అనారోగ్యం బారిన పడినందున మిగిలిఉన్న జైలు శిక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఇదీ చదవండి.. కనీసం చివరిచూపు చూసుకోనువ్వండి -
జైల్లో ప్రేమించుకుని.. పెరోల్‌పై బయటకువచ్చి పెళ్లి!
కోల్‌కతా: వివాహాలు స్వర్గంలో నిర్ణయిస్తారని పెద్దలు అంటుంటారు. సరిగ్గా ఇద్దరి ఖైదీల జీవితంలో అలానే జరిగింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వారిద్దరూ అనుకోకుండా జైలులో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని ఓ జైలులోని ఇద్దరు ఖైదీల ప్రత్యేక ప్రేమకథ చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. అస్సాంకి చెందిన అబ్దుల్ హసీమ్, పశ్చిమబెంగాల్ కి చెందిన షానారా ఖతున్ వేర్వేరు హత్య కేసుల్లో బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ లో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. హసీమ్‌కు 8 ఏళ్లు, షహనారాకు 6 ఏళ్లు శిక్ష విధించి ఇద్దరినీ తీసుకొచ్చి ఈ జైలులో ఉంచారు. అనుకోకుండా జైల్లో ఉండగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. వీరిద్దరికీ జైలులో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది. ఖైదీలిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి వారి కుటుంబాలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే పెరోల్‌పై విడుదలైన తర్వాత వాళ్లి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. తూర్పు బర్ధమాన్‌లోని మోంటేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్‌లో ముస్లిం చట్టం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెరోల్ అనంతరం వీరువురు అదే జైలుకు తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. చదవండి ఫ్రెండ్స్ తో కలిసి యువతిపై గ్యాంగ్‌రేప్.. యువతి ఆత్మహత్యాయత్నం -
ఖైదీ హనీమూన్‌కి పెరోల్
శివాజీనగర: హత్య కేసులో జైలు శిక్షకు గురైన ఓ కోలారు జిల్లావాసికి కోర్టు జీవితఖైదు విధించడంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఏప్రిల్ 5న కోర్టు ఆదేశంతో పెరోల్ (సెలవు) పొంది ఏప్రిల్ 11న పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్ 20వ తేదీకి సెలవు ముగిసింది. అయితే ఆ సమయం చాలదని, హనీమూన్‌కి 60 రోజులు సెలవు కావాలని హైకోర్టులో పిటిషన్వేశాడు. జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న ధర్మాసనం ఈ అర్జీని విచారించింది. అతనికి పెరోల్‌ను మంజూరు చేస్తూ షరతులను కూడా విధించింది. ప్రతి ఆదివారం ఒకసారి నేరం జరిగిన పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించారు. -
ప్రేమకు తలొగ్గిన కోర్టు..లవర్‌ను పెళ్లి చేసుకునేందుకు హత్యకేసు దోషికి పెరోల్
బెంగళూరు: కర్ణాటక హైకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఓ హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి.. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రేమికుల మనసును గెలుచుకున్నాయి. 'ఇతడ్ని విడుదల చేడయం అనివార్యం. లేకపోతే జీవితాంతం ప్రేమను కోల్పోతాడు. జైలులో ఉన్న ఇతడు.. తన ప్రేయసి వేరే వాళ్లను పెళ్లి చేసుకుందని తెలిస్తే భరించలేడు. అందుకే ఎమర్జెన్సీ పెరోల్ వినతికి అంగీకరిస్తున్నాం.' అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రేయసిని పెళ్లాడేందుకు పెరోల్ పొందిన ఇతని పేరు ఆనంద్. ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో యావజ్జీవ శిక్ష పడింది. అయితే అతని సత్ప్రవర్తన కారణంగా శిక్షను 10 ఏళ్లకు తగ్గించారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్షాకాలం పూర్తయింది. ఇంకో 4 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంది. అయితే నీతా అనే యువతి, ఆనంద్ 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జైలులో ఉండటంతో పెళ్లి చేసుకోలేకపోయారు. దీంతో తనకు వేరే వాళ్లతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు చూస్తున్నారని, ఆనంద్‌కు పెరోల్ మంజూరు చేస్తే అతడ్నే పెళ్లి చేసుకుంటానని నీతా కోర్టును ఆశ్రయించింది. ఆనంద్ తల్లి కూడా ఈమెకు మద్దతుగా నిలిచింది. ఈ ప్రేమ గురించి తెలుసుకున్న న్యాయస్థానం.. ఇద్దరు ఒక్కటి కావాలని పెరోల్ మంజూరు చేసింది. దీంతో ఏప్రిల్ 5న ఆనంద్ జైలు నుంచి విడుదల కానున్నాడు. మల్లీ 20వ తేదీ సాయంత్రం తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేయాలనే నిబంధన లేకపోయినప్పటికీ ఇది అసాధారణ పరిస్థితి అని భావించి కోర్టు ఈ తీర్పునిచ్చింది. చదవండి: మద్యం నిషేధించాలని వినతి..బీజేపీ ఎమ్మెల్యే సమాధానం విని బిత్తరపోయిన మహిళ -
మరో వివాదంలో డేరా బాబా.. తల్వార్‌తో కేక్ కట్టింగ్.. వీడియో వైరల్..
చండీగఢ్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఇటీవలే పెరోల్‌పై విడుదలైన డేరా బాబా రామ్ రహీం మరో వివాదంలో చిక్కుకున్నాడు. చాలా కాలం తర్వాత జైలు జీవితం నుంచి విముక్తి లభించిన ఆనందంలో ఆయన సంబరం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద తల్వార్‌తో కేక్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో డేరా బాబాను జైలు నుంచి విడుదల చేసిన బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలు, అదంపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే ప్రభుత్వం ఆయనను జైలు నుంచి విడుదల చేసిందని మండిపడ్డారు. డేరా బాబా నిర్వహించిన వేడుకల్లో బీజేపీ నేతలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. Rape convict Ram Rahim celebrated his freedom by cutting a cake with a sword. Several of his followers joined him in his celebration. It's absolute shamelessness on the part of the Haryana government. They have done this to gain votes: @BrindaAdige@aishvaryjain pic.twitter.com/4oYnYcpSVH — TIMES NOW (@TimesNow) January 23, 2023 సీర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించించి సీబీఐ కోర్టు. 2017లో ఈ తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి సుంజారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు డేరా బాబా. అయితే అక్టోబర్ 2022లో 40 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన ఆయన.. మరో మూడు నెలల్లోనే మరోసారి 40 రోజుల పెరోల్‌పై విడుదల అయ్యాడు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. డేరా బాబాపై ఓ హత్య కేసు కూడా ఉంది. చదవండి: మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి -
డేరా బాబాకు 40 రోజుల పెరోల్
చండీగఢ్: డేరా సచా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా(55)కు కోర్టు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గుర్మీత్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గతంలోనూ అంటే గత ఏడాది అక్టోబర్ 14వ తేదీన కోర్టు ఇతడికి పెరోల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఈయన యూపీలోని బర్నావా ఆశ్రమానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచే ఆన్లైన్ ద్వారా పలు సత్సంగ్‌లు నిర్వహించారు. వీటికి కొందరు హరియాణా బీజేపీ నేతలు సైతం హాజరయ్యారు. తాజా పెరోల్ సమయంలో ఈ నెల 25న జరగనున్న డేరా మాజీ చీఫ్ షా సత్నామ్ సింగ్ జయంత్యుత్సవాల్లో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు -
Unnao Case: నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని..రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ
ఉన్నావ్ కేసు నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు మధ్యంతర బెయిల్ మంజురైన సంగతి తెలిసిందే. నాటి ఉన్నావ్ అత్యాచార ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ దీన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు లేఖ రాసింది. వాస్తవానికి నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తన కుమార్తె పెళ్లి కోసం తనను విడుదల చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే అతను విడుదలైతే తమ ప్రాణాలకు ముప్పు ఉందని, అలాగే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యులను సైతం ప్రభావితం చేస్తాడని బాధిత మహిళ లేఖలో ఫిర్యాదు చేసింది. అతను జైలు వెలుపల ఉంటే తమకు అత్యంత ప్రమాదమని ఆ మహిళ పేర్కొంది. ఇదంతా సెంగార్ కుటుంబం పన్నిన కుట్ర అని కుమార్తె వివాహం పేరుతో బెయిల్‌పై విడుదలయ్యేందుకు ఆడుతున్న నాటకమని లేఖలో ఆరోపించింది. ఇదిలా ఉండగా, కుమార్తె వివాహానికి హాజరయ్యేలా ఢిల్లీ హైకోర్టు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు పెరోల్‌పై సెంగార్‌ను విడుదల చేయాలని ఆదేశించడం గమనార్హం. మధ్యంతర విడుదలకు సంబంధించిన దరఖాస్తు తనకు అందలేదని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది మెహమూద్ ప్రాచా సోమవారం తెలియజేయడంతో, కోర్టు సెంగార్ తరపు న్యాయవాదిని కాపీని అందించాలని కోరింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. వాస్తవానికి కుల్దీప్ సింగ్ సెంగార్‌కి ఉన్నావ్ 2017 అత్యాచార ఘటనలో దోషిగా తేలడంతో ట్రయల్ కోర్టు జీవత ఖైదు శిక్ష విధించింది. దీన్ని సెంగార్ సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీలు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అదీగాక బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో కూడా సెంగార్‌కు, అతని సోదరుడు అతుల్ సింగ్ సెంగార్తో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: కాంగ్రెస్ తొలి జాబితా .. ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్) -
విడుదలకు సిద్ధమైన తమిళ సినిమా 'పెరోల్'
తమిళసినిమా: ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మధుసూదన్ నిర్మిస్తున్న చిత్రం పెరోల్. ద్వారకా రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆర్ఎస్ కార్తీక్, లింగ, కల్పిక, మనీషా మురళి, వినోదిని, వైద్యనాథన్, జానకి సురేష్, మైక్ మణి, శివం, డేనియల్ ఇమానువేల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్‌కుమార్ అమల్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివరాలు తెలుపుతూ నిర్మాత తనపై నమ్మకం ఉంచి చిత్రాన్ని తెరకెక్కించడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. ఇది కుటుంబ నేపథ్యంలో మనం చూడని కోణాన్ని ఆవిష్కరించే విభిన్న కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటీనటులు పూర్తి అంకితభావంతో నటించారని చెప్పారు. ఇందులో పురుషులు కలిగించే సమస్యలను స్త్రీలు పరిష్కరిస్తారన్నారు. ఇందులో నటించిన నటీమణులు ఆ భావోద్వేగాలను చక్కగా ప్రతిఫలింపజేశారన్నారు. చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్ఎస్ కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం ఒక తల్లికి ఇద్దరు కొడుకుల మధ్య జరిగే కథ అని తెలిపారు. ఇది నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే కథలు బలంగా ఉంటాయన్నారు. అలా ఇందులోని పాత్రలన్నీ ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయన్నారు. ఇలాంటి చిత్రాలు విజయం సాధిస్తే మరిన్ని మంచి కథా చిత్రాలు వస్తాయన్నారు. నాలాంటి నవ సంగీత దర్శకులకు ఇది డ్రీమ్ చిత్రమని రాజ్‌కుమార్ అమల్ పేర్కొన్నారు. దీనికి పని చేయటం చాలా మంచి అనుభవంగా పేర్కొన్నారు. తన ప్రతిభను చాటుకోవడానికి మంచి స్కోప్గా ఉన్న చిత్రం పెరోల్ అని అన్నారు. -
జడ్జి గారూ.. నాకు పిల్లలు కావాలి!
దేశ న్యాయవ్యవస్థలో ఇదొక విచిత్రమైన ఆదేశం!. సంతానం పొందే హక్కు కింద.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి భార్య కోర్టుకు ఎక్కింది. దీంతో భార్యతో కాపురం చేసుకునేందుకు వీలుగా.. సదరు భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది కోర్టు. నంద్లాల్(34) అనే వ్యక్తి ఓ కేసులో అజ్మీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తమకు పిల్లలు కావాలని, అందుకు తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని ఆమె రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఫర్జాంద్ అలీతో కూడిన బెంచ్.. ఆమె భావోద్వేగాలని అర్థం చేసుకుంది. రుగ్వేదంతో పాటు అన్ని మతాల్లోనూ ఆడవాళ్లకు పిల్లలను కనే హక్కు ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సంప్రదాయాల్ని అమితంగా గౌరవించే మన దేశంలో గృహిణిలకు ఉన్న ప్రథమ హక్కు పిల్లల్ని కనడం అని, కాబట్టి అతనికి పదిహేను రోజుల పెరోల్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. నందలాల్‌కు గతంలోనూ కోర్టు పెరోల్ మంజూరు చేయించింది. 2021 మొదట్లో 20 రోజుల పెరోల్ ఇవ్వగా.. ఆ టైంలో అతని ప్రవర్తన సక్రమంగా ఉండడంతో ఈసారి మళ్లీ ఇస్తున్నట్లు తెలిపింది. నేరం చేసింది ఆమె భర్త అని, అలాంటప్పుడు ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు ఆమె సంతానం పొందే హక్కును ప్రాథమిక హక్కులతో పోలుస్తూ.. సదరు భర్తను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. -
అమానుష చర్య: ఆ హత్య కేసులో తండ్రి కొడుకులిద్దరికి జీవిత ఖైదు!!
జాత్యాహంకార విద్వేషపూరిత చర్యలు ఇంకా పలు దేశాల్లో నిగురు గప్పిన నిప్పువలే రగులుతున్నాయి. ఎంతో మంది గొప్పగొప్ప మహోన్నత వ్యక్తుల ఈ జాడ్యాన్ని విడిచిపెట్టండని చెబుతున్న ఇంకా పలువురు తమ అహంకారపూరిత దర్పాన్ని అభాగ్యులపై రుద్దుతు విద్వేషచర్యలకు పాల్పడుతూనే ఉంటున్నారు. ఇలాంటి చర్యలను అరికట్టేందుకే పటిష్టమైన చట్టాలను తీసుకువస్తున్నప్పటికీ ఈ పైశాచిక చర్యలకు అడ్డుకట్ట వేయలేకపోవడం బాధకరం. అయితే ఇప్పుడు అచ్చం అలాంటి జాత్యాహంకారంతో ఓ తండ్రి కొడుకులు ఒక నల్ల జాతీయుడిని అమానుషంగా చంపి కటకటాలపాలయ్యారు. అసలు విషయంలోకెళ్లితే.... అమెరికా న్యాయస్థానం తాజాగా అహ్మద్ అర్బరీ అనే 25 ఏళ్ల నల్లజాతీయుడిని వెంబడించి హత్య చేసినందుకు గానూ ముగ్గురు శ్వేతజాతీయులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాదు తండ్రి కొడుకులకు పెరోల్ (బెయిల్ పై విడుదలవ్వడం) మంజూరు చేయడానికి కూడా కోర్టు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి తిమోతీ వాల్మ్స్లీ మాట్లాడుతూ... "అర్బరీ తాను జాగింగ్‌కి వెళ్లుతున్నప్పడు ఇదే చివరి జాగింగ్ అవుతుందని అనుకుని ఉండడు . అతను ప్రాణాల కోసం పరిగెడుతుంటే ఏ మాత్ర జాలి దయ లేకుండా అత్యంత క్రూరంగా వెంటాడి వెంబడించి చంపారు. అంతేకాదు ఇది జాత్యాహంకార పూరిత హత్య నేరంగా అభివర్ణించారు. పైగా ఆ సమయంలో ఆ యువకుడిలో కలిగిన భయాందోళనలు ఏవిధంగా ఉంటాయో ఊహించగలను" అంటూ భావోద్వేగం చెందారు. ఈ మేరకు మాజీ పోలీస్ ఆఫీసర్ గ్రెగ్ మెక్ మైఖేల్ అతని కొడుకు ట్రావిస్ మైఖేల్ ఫిబ్రవరి 23, 2020న పోర్ట్ సిటీ ఆఫ్ బ్రున్స్విక్ పరిసరాల్లో పరిగెడుతున్న మహ్మద్ అర్బీని తుపాకులతో వెంబడించి దారుణంగా చంపారని అన్నారు. ఈ క్రమంలో గ్రెగ్ మైఖేల్ పక్కింటి వ్యక్తి అయిన రోడీ బ్రయాన్ ఈ హత్య నేరానికి సహకరించినట్లు పేర్కొన్నారు. పైగా ఈ ముగ్గురు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఈ హత్యా నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ మేరకు తండ్రి కొడుకులిద్దరిని ఎలాంటి పెరోల్ లేకుండా జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలని, పైగా ఈ హత్యా నేరానికి సహకరించిన బ్రయానికి 30 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం పెరోల్‌కి అవకాశం కల్పిస్తున్నట్లు న్యాయమూర్తి వాల్మ్స్లీ పేర్కొన్నారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే అర్బరీ కుటుంబ మద్దతుదారులు నల్లజాతీయులను తగిన న్యాయం జరిగిందని, మీ అబ్బాయి ఒక చరిత్ర సృష్టించాడంటూ అర్బరీ కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే నిందితుల తరుపున న్యాయవాదులు ఇది అనుకోని చర్యగానూ, నేరస్తుడనే అనుమానంతో కాల్పులు జరిపారే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అంటూ కప్పిపుచ్చేందకు ప్రయత్నించారు. మరోవైపు బ్రయాన్ తరుపు న్యాయవాది అతను కేవలం ఆ ఘటనను సెల్ఫోన్లో వీడియో తీశాడే తప్ప మరేం చేయలేదు, పైగా పశ్చాత్తాపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే కోర్టు వాటన్నింటిని తోసి పుచ్చింది. దీంతో మెక్ మేఖేల్స్, బయోన్ తరపు న్యాయమూర్తులు పై కోర్టుకు అప్పీలు చేయాలని యోచిస్తున్నారు. -
నళినికి నెల రోజుల పెరోల్
సాక్షి, చెన్నై: రాజీవ్‌హత్య కేసులో దోషి నళినికి నెల రోజులు పెరోల్ మంజూరైంది. ఈ కేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఏడుగురిలో నళిని ఒకరు. వీరిని ముందస్తుగా విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ 2018లో గవర్నర్‌కు సిఫారసు చేసినా రాజ్‌భవన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. దాంతో గవర్నర్ అనుమతి లేకుండా తనను ముందస్తుగా విడుదల చేయాలని నళిని తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నళిని తరఫున తల్లి పద్మ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఆరోగ్యం సరిగాలేదని, ఈ దశలో కూతురు తనతో ఉండాలని కోరుకుంటున్నానని, పెరోల్ మంజూరు చేయాలని హైకోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ గురువారం న్యాయమూర్తులు వీఎన్ ప్రకాష్, ఆర్. హేమలత బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. నళినికి నెల రోజులు పెరోల్ ఇవ్వడానికి తమిళనాడు సర్కారు నిర్ణయించినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నళినికి పెరోల్ మంజూరైంది. -
మేం ఇంటికి వెళ్లం.! జైల్లోనే బాగుంది, పిల్లాడిలా మారం చేస్తున్న ఖైదీలు
లక్నో: కరోనా విపత్కాలంలో మధ్యంతర బెయిల్ ద్వారా జైలు నుంచి భయటకు వచ్చేందుకు ఖైదీలు భయపడుతున్నారు. మీరు కోటి రూపాయిలు ఇచ్చినా సరే మేం ఇంటికి వెళ్లం..! జైల్లోనే బాగుందంటూ ఖైదీలు పిల్లాడిలా మారం చేస్తున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు దేశంలో పలు జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను జైళ్ల శాఖ అధికారులు పేరోల్ మీద విడుదల చేస్తున్నారు. అయితే ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్న 9 జైళ్లలో 10,123 మంది ఖైదీలు బెయిల్ , పెరోల్‌పై విడుదలయ్యారు. ట్రయల్స్ కింద 8,463 మందిని మధ్యంతర బెయిళ్లపై విడుదల చేయగా, 1,660 మంది దోషులకు 60 రోజుల పెరోల్ ఇచ్చారు. ఘజియాబాద్ జిల్లా జైలు నుంచి అధిక సంఖ్యలో 703 మంది అండ్రీడియల్స్ బెయిల్‌పై విడుదల కాగా, కాన్పూర్ జిల్లా జైలులో 78 మందికి పెరోల్ ఇచ్చారు. అయితే చాలా మంది ఖైదీలు జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యేందుకు ఇష్టపడడం లేదని యూపీ జైళ్లశాఖ డీజీ ఆనంద్ కుమార్ తెలిపారు. " రాష్ట్రంలో 21 మంది దోషులు పెరోల్ నిరాకరించారు. ఆయా జిల్లాల్లో నమోదవుతున్న కరోనా కేసులకు భయపడి విడుదలయ్యేందుకు ఇష్ట పడడం లేదు. అయినా సరే జైళ్లలో కరోనా నిబంధనల్ని పాటిస్తూ ప్రతి ఖైదీని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు. -
30 రోజుల పెరోల్‌పై పేరరివాలన్ విడుదల
వేలూరు: రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ 30 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి 2017 ఆగస్టులో మొదటి సారి రెండు నెలలు ఫెరోల్ ఇచ్చారు. ప్రస్తుతం తండ్రి కుయిల్‌నాథన్ అనారోగ్యం క్షీణించడంతో తన కుమారుడిని పెరోల్‌పై విడుదల చేయాలని తల్లి అర్పుదమ్మాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో 30 రోజులు పెరోల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వేలూరు సెంట్రల్ జైలులో ఉన్న పేరరివాలన్‌ను శుక్రవారం తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తండ్రికి వైద్యం చేయించేందుకు మాత్రమే పేరరివాలన్ బయటికి వెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. చదవండి: రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్ -
న్యూజిలాండ్‌లో చరిత్రలోనే అరుదైన తీర్పు
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ మసీదులో హింసాకాండకు పాల్పడిన ముష్కరుడు బ్రెంటన్ టారెంట్కు పెరోల్ లేని జీవితఖైదును విధిస్తూ గురువారం కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న 51మంది అమాయకపు ప్రాణాలను బలితీసుకొని ఆ దుర్మార్గాన్ని ఫేస్బుక్లో చిత్రీకరించిన ట్రెంటన్ను అమానవీయ వ్యక్తిగా కోర్టు పేర్కొంది. ఘటన సమయంలో 3 ఏళ్ల శిశువు తన తండ్రి కాలికి చుట్టుకొని ఉంటే ఉద్దేశపూర్వకంగా ఈ పసిప్రాణాన్ని కూడా చంపేసిన బ్రెంటన్ అత్యంత దుర్మార్గుడిగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తికి పెరోల్ లేని జైవిత ఖైదు విధిస్తున్నాం అని న్యాయమూర్తి కామెరాన్ మాండర్ తీర్పు చెప్పారు. అయితే న్యూజిలాండ్ చరిత్రలో ఇప్పటివరకు పెరోల్ లేని జీవితఖైదును ఎవరికి విధించలేదు. (చైనా తీరుపై యూకే, యూఎస్, జర్మనీ విమర్శలు) గతేడాది మార్చిలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని అల్ నూర్ మరియు లిన్‌వుడ్ మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్న వారిపై ముష్కరుడు బ్రెంటన్ నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తదనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పోస్ట్ చేసి రక్షసానందం పొందాడు. నిందితుడు బ్రెంటన్పై ఇదివరకే 51 హత్యారోపణలు, 40 హత్యాయత్నాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. మొదట తనకు ఏం తెలియదని బుకాయించినా విచారణలో తను చేసిన నేరాలను అంగీకరించాడు. న్యూజిలాండ్ చరిత్రలో గతేడాది జరిగిన హింసాకాండ అత్యంత బాధాకరమైన ఘటన అని ప్రాసిక్యూటర్ మార్క్ జరీఫె అన్నారు. ఇక ఈ ఘటనలో తమవాళ్లను పొట్టనపెట్టేకొని తీరని శోకాన్ని మిగిల్చిన బ్రెంటన్కు అత్యంత కఠినమైన శిక్ష వేయాలని బాధితులు కోర్టు ఎదుట తమ గోడును వెళ్లగక్కారు. (యూఎస్‌లో దారుణం: ‘మీ అమ్మ, బామ్మను చంపేశా’ ) -
200 మంది ఖైదీలు కనిపించడం లేదు!
సాక్షి, చెన్నై: జైలు జీవితం ఓ శాపమైతే...పెరోల్ పొందడం ఖైదీలకు ఒక వరం. ఈ వరాన్ని వరప్రసాదంగా స్వీకరించిన ఖైదీలు జైలుకు టాటా..బైబై అంటూ చెక్కేస్తున్నారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో పెరోల్‌పై బయటకు వచ్చిన 200 మందికి పైగా ఖైదీలు కనపడకుండా పోయారంటూ జైళ్లశాఖ లబోదిబోమంటోంది. మంత్రుల సిఫార్సుతో పెరోల్ పొందినవారే వీరిలో అధికం కావడంతో మింగలేక, కక్కలేక బావురుమంటున్నారు. పరారీలో ఉన్న పెరోల్ ఖైదీలను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తమిళనాడులో 9 కేంద్ర కారాగారాలుండగా, వీటిల్లో 13వేల మంది ఖైదీలున్నారు. వీరిలో 2,500లకు పైగా శిక్షాఖైదీలు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న నళినీ పెరోల్ పొంది మరలా జైల్లోకి రాగా, పేరరివాళన్, రాబర్ట్‌పయాస్ ప్రస్తుతం పెరోల్‌పై బయటే ఉన్నారు. న్యాయస్థానం, జైళ్లశాఖ ద్వారా ఖైదీలు పెరోల్ పొందుతున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ.. తన భర్త నటరాజన్ అనారోగ్యానికి గురైనపుడు, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్‌పై చెన్నైకి వచ్చి వెళ్లారు. కేరళలో పోలీసు కాల్పుల్లో మరణించిన మావోయిస్ట్ మణివాచకం భార్య కలా, సోదరి చంద్రలకు సైతం కోర్టు పెరోల్ మంజూరు చేసింది. శిక్షా ఖైదీలైనా, విచారణ ఖైదీలైనా జైల్లో వారి స్రత్పవర్తనను అనుసరించి పెరోల్‌ను మంజూరు చేయడం సహజం. ఒక ఏడాది కాలంలో 15 రోజులపాటూ పెరోల్ మంజూరు చేసే అధికారాన్ని జైలు సూపరింటెండెంట్ కలిగి ఉన్నారు. జైళ్లశాఖ డీఐజీ రెండేళ్లకు నెలరోజులు, ప్రభుత్వమే అనుకుంటే ఎన్నిరోజులైనా పెరోల్ మంజూరు చేయవచ్చు. ఖైదీల కుటుంబసభ్యుల్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు, పొంగల్, దీపావళి ముఖ్యమైన పండుగలు, సమీప బంధువులకు తీవ్ర అనారోగ్యం, మరణం వంటి అశుభాలు చోటుచేసుకున్నా పెరోల్ మంజూరు చేస్తున్నారు. జైల్లో ఉండగా తీవ్ర అనారోగ్యానికి గురై, మరో ప్రయివేటు ఆసుపత్రిలో చేరిస్తే కోలుకుంటారని జైలు అధికారులు భావించిన పక్షంలో కూడా పెరోల్ మంజూరు చేస్తారు. ఈ పెరోల్ రోజులను శిక్షాకాలం నుంచి మినహాయించరు. ఐదేళ్ల శిక్షను అనుభవిస్తున్న ఖైదీ నెలరోజులు పెరోల్ పొందినా ఐదేళ్ల శిక్షాకాలాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. పెరోల్లో ఉన్నపుడు పారిపోకుండా ఉండేందుకు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ప్రతిరోజూ సంతకం చేయాల్సి ఉంటుంది. లేకుంటే పోలీసు బందోబస్తు పెడతారు. ఏ కారణం చేత పెరోల్ మంజూరైందో ఖైదీ దానికే పరిమితం కావాలి, మరో శుభం, లేదా అశుభ కార్యాలకు వెళ్లకూడదు. ఈ నిబంధనలను మీరినట్లయితే పెరోల్‌ను రద్దుచేయడంతోపాటూ అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. పెరోల్‌పై ఛలో ఛలో: ఇలా అనేక కారణాలతో పెరోల్‌పై విడుదలైన ఖైదీల్లో తిరిగి జైలుకు చేరుకోని సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కొంతకాలం క్రితం సేలం జైలు నుంచి పెరోల్‌పై బయటకు వెళ్లిన ఇద్దరు ఖైదీలు జైలుకు మరలా రాలేదు. వీరిద్దరిలో ఒకరు మాత్రమే పట్టుబడగా మరో వ్యక్తి ఆచూకీ తెలియలేదు. 1982 నుంచి ఈ ఏడాది వరకు 200 మంది ఖైదీలకు పైగా పెరోల్‌పై బయటకు వచ్చి పత్తాలేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. జైలు అధికారులను కాదని ప్రభుత్వం ద్వారా పెరోల్ మంజూరు చేయించుకున్న ఖైదీలే వీరిలో ఎక్కువగా ఉండడం గమనార్హం. దీంతో ప్రభుత్వ సిఫార్సుతో పెరోల్ మంజూరు చేయడం నిలిచిపోగా జైలు అధికారులు, న్యాయస్థానానికే పరిమితం చేశారు. దీంతో పెరోల్ పొందే ఖైదీల సంఖ్య తగ్గిపోయింది. పెరోల్ ఖైదీలు పరారైతే జైలు అధికారులు అతడి నివాసానికి సమీపంలోని పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇస్తున్నారు. అయితే పెరోల్ ఖైదీల పరారీ కేసులపై పోలీసులు పెద్దగా ఆసక్తిచూపకపోవడంతో వారు పట్టుబడడం లేదు. వారు ఎక్కడ దాక్కుని ఉన్నారనే సమాచారం కూడా అధికారులకు దొరకలేదు. దీంతో ఇలా పారిపోయిన పెరోల్ ఖైదీలను పట్టుకునేందుకు ప్రభుత్వమే ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని జైలు అధికారులు కోరుతున్నారు. ఈ విషయమై జైలు అధికారులు మాట్లాడుతూ, జైళ్లశాఖను చూసే మంత్రుల సిఫార్సుతో పెరోల్ పొందినవారే ఎక్కువగా పారిపోతున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న తరువాత పెరోల్‌కు సిఫార్సు చేయడాన్ని మంత్రులు నిలిపివేశారని అన్నారు. ప్రస్తుతం శిక్షాఖైదీలకు మాత్రమే పెరోల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. -
కూతురి పెళ్లి కోసం
నళినీ శ్రీహరన్ పెరోల్‌ను మద్రాస్ హైకోర్టు పొడిగించింది. కూతురు పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడం కోసం తనను విడుదల చేయాలని నళిని చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఆమెకు నెల రోజుల సమయాన్ని ఇస్తూ, జూలై 25న విడుదల చేసింది. ఆ గడువు ముగిసినప్పటికీ పెళ్లి పనులు పూర్తి కాకపోవడంతో కోర్టు మరో మూడు వారాల సమయాన్ని నళినికి మంజూరు చేసింది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళిని ఇరవై ఐదేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన హృదయం
తమిళనాడు, వేలూరు: వేలూరు సెంట్రల్ జైలు నుంచి నళిని 28 సంవత్సరాల అనంతరం పెరోల్‌పై విడుదల అయ్యారు. ఆమెను కుమార్తె వివాహ ఏర్పాట్ల కోసం వేలూరు సత్‌వచ్చారిలోని ఒక ఇంట్లో ఉంచారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ మొత్తం ఏడుగురు శిక్ష అనుభవిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో నళిని కుమార్తె వివాహ ఏర్పాట్లు కోసం పెరోల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 5న విచారణ జరిగింది. ఈ కేసులో నళిని నేరుగా వెళ్లి ఆమె తన కుమార్తె జన్మించినప్పటి నుంచి ఇంత వరకు ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేదని కనీసం తల్లిగా ఎటువంటి సేవను చేయలేదని తెలిపి ఆమె వాదనలను వినిపించింది. దీంతో విచారణ జరిపిన న్యాయమూర్తి 30 రోజులు పెరోల్ ఇస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా నళిని 30 రోజులు పెరోల్‌పై ఎక్కడ ఉండబోతున్నారు అనే విషయాలనుపది రోజుల్లో జైలు అధికారులకు తెలియజేయాలని తీర్పునిచ్చింది. నళినికి తల్లి పద్మ, కాట్పాడి బ్రహ్మపురానికి చెందిన ఒక మహిళ జామీను సంతకం చేశారు. దీంతో నళిని వేలూరు రంగాపురంలోని పులవర్ నగర్లో ద్రావిడ సిద్ధాంతాలకు చెందిన తమిళ పేరవై రాష్ట్ర జాయింట్ కార్యదర్శి సింగరాయర్ ఇంటిలో ఉంటూ వివాహ ఏర్పాట్లను చేసేందుకు నిర్ణయించడంతో ఆమె న్యాయవాది పుహలేంది ద్వారా జైలు అధికారులకు నకలను సమర్పించారు. ఇదిలా ఉండగా ఈనెల 20న సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి పెరోల్‌పై బయటకు వస్తారని ఆశించారు. అయితే ఉన్నతాధికారుల నుంచి సమగ్రమైన ఆదేశాలు రాక పోవడంతో ఆమె రాక నిలిచి పోయింది. దీంతో నళినిని పెరోల్‌పై విడుదల చేయాలని బుధవారం సాయంత్రం వేలూరు సెంట్రల్ జైలు అధికారులకు ఆదేశాలు రావడంతో గురువారం ఉదయం 9.55 గంటలకు ఆమెను పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను పోలీస్ బందోబస్తుతో సత్‌వచ్చారిలోని రంగాపురంలో ఉన్న ద్రావిడ సిద్ధాంతాల తమిళ్ పేరవై ప్రధాన కార్యదర్శి సింగారాయర్ ఇంటి వద్దకు తీసుకొచ్చారు. నళిని తల్లి పద్మ, బంధువులు కన్నీటితో హారతి: నళిని పెరోల్‌పై బయటకు వస్తారని తెలుసుకున్న నళిని తల్లి పద్మ, బంధువులు రంగాపురంలోని ఇంటి వద్దకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు రంగాపురంలోని ఇంటి వద్దకు చేరుకున్న నళినికి తల్లి పద్మ హారతి పట్టారు. 28 సంవత్సరాల అనంతరం నళిని బయట ప్రపంచానికి రావడంతో నళిని తల్లి పద్మతో పాటు బంధువులు హారతి పట్టారు. ఆ సమయంలో బంధువులు, తల్లి పద్మ, నళినిని చూసి కన్నీటి పర్వతమయ్యారు. రాజకీయనాయకులు, మీడియాతో మాట్లాడడంపై నిషేధం 30 రోజుల పెరోల్‌పై వచ్చిన నళిని రాజకీయ నాయకులతో పాటు మీడియాతో మాట్లాడకూడదని కోర్టు నిబంధనలు విధించడంతో ఎవరూ ఆమెను కలవలేక పోయారు. వారం రోజుల్లో లండన్ నుంచి వేలూరు రానున్న కుమార్తె లండన్‌లో ఉన్న నళిని కుమార్తె హరిద్ర వారం రోజుల్లో వేలూరుకు రానున్నారు. నళిని 30 రోజుల పాటు వేలూరు రంగాపురంలో ఉండడంతో ఆమె కుమార్తె వివాహం కూడా వేలూరులోనే జరగవచ్చునని తెలుస్తుంది. కుమార్తె వివాహం గురించి మురుగన్ ఇంత వరకు పెరోల్ కోరలేదు. వివాహ తేదీని బట్టి పెరోల్ కోరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు: నళిని ఉంటున్న రంగాపురంలోని ఇంటి వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె ఉంటున్న ఇంటిలో మొదటి అంతస్తులో నళిని ఉండబోతున్నారు. దీంతో నళినిని చూసేందుకు ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడతారు అనే విషయాలను పోలీసులు రిజిస్టర్లో నమోదు చేయనున్నారు. -
నరరూప రాక్షసుడికి పెరోల్!
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియదర్శిని మట్టూ హత్య కేసులో దోషి సంతోష్ కుమార్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు మూడు వారాల పాటు పెరోల్ మంజూరు చేసింది. లా పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం అతడు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం మన్నించింది. ఈ క్రమంలో మే 24 పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో.. మే 21న జైలు నుంచి అతడిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. కాగా ఢిల్లీ యూనివర్సిటీ లా విద్యార్థిని ప్రియదర్శిని మట్టూ(25) 1996 జనవరిలో హత్యకు గురయ్యారు. మాజీ ఐపీఎస్ కుమారుడైన సంతోష్ కుమార్ ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. దారుణంగా హతమార్చాడు. ఈ నేపథ్యంలో 2006లో సంతోష్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి ఉరిశిక్ష విధించింది. దీంతో 2010లో సంతోష్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఉరిశిక్షను.. యావజ్జీవ శిక్షగా మారుస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. -
పెళ్లి కోసం పెరోల్.. తోసిపుచ్చిన హైకోర్టు
ముంబై : గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెళ్లి కోసం తనకు 45 రోజుల పెరోల్ ఇవ్వాలని అబూ సలేం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వీకే తహిల్ రామిణి, న్యాయమూర్తి ఎంఎస్ సోనక్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం అతడి పిటిషన్‌ను తోసిపుచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా అబూ సలేంకు పెరోల్ ముంజూరు చేయలేమని ధర్మాసనం పేర్కొంది. ఓ కేసు విచారణ నిమిత్తం లక్నోకు తరలించేటప్పడు ముంబ్రాకు చెందిన కౌసర్ బాహర్ అనే మహిళతో ప్రేమలో పడ్డానని.. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చానని అబూసలేం గతంలో వెల్లడించాడు. కౌసర్ కూడా తనకు అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు. తాను చాలా ఏళ్లుగా జైలులో ఉన్నానని, ఒక మహిళకు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానని, అందువల్ల తనకు పెరోల్ కల్పించాలని అబూ సలేం తన పిటిషన్లో పేర్కొన్నాడు. గతంలో పలు కేసుల్లో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులను అతడి లాయర్ ఫర్హానా షా ధర్మాసనం ముందు ఉంచారు. వీటన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం అతడి అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంను, గతేడాది టాడా ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసిన సంగతి విదితమే. కాగా అతడు ప్రస్తుతం తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
లాలూకు మూడు రోజుల పెరోల్
రాంచీ/పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడు రోజుల పాటు పెరోల్ మంజూరైంది. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ బిహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యరాయ్‌ను ఈ నెల 12న పట్నాలో వివాహం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని లాలూ కోరారు. అయితే ఆంక్షలతో కూడిన మూడు రోజుల పెరోల్ మాత్రమే మంజూరు చేసినట్టు జార్ఖండ్ జైళ్ల శాఖ ఐజీ హర్‡్ష మంగ్లా మీడియాకు తెలిపారు. అయితే పెరోల్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది స్పష్టంగా చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఆయన ప్రయాణం చేసే సమయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోరని తెలిపారు. పెరోల్ నేపథ్యంలో లాలూకు పలు ఆంక్షలు విధించారు. ఆయన బయట ఉన్న మూడు రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు. పార్టీ నేతలతో కానీ, కార్యకర్తలతో కానీ కలవకూడదు. ఎలాంటి రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొన కూడదు. ఆయన చేసే ప్రతీ పని వీడియోలో రికార్డు అవుతుంది. కాగా, పెరోల్‌పై గురువారం విడుదలైన వెంటనే పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు పట్నా వెళ్లారు. విమానాశ్రయంలో కుమార్తె మీసా భారతి, కొడుకులు తేజ్‌ప్రతాప్, తేజస్వి యాదవ్‌లు ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాంచీ నుంచి పట్నా వరకు లాలూ వెంట ఆర్జేడీ జనరల్ సెక్రెటరీ బోలా యాదవ్ ఉన్నారు. పెరోల్ ముగిసిన తరువాత మే 14న లాలూ తిరిగి రాంచీకి వెళ్తారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆయన రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
లాలూకు పెరోల్
పట్నా : తన కుమారుడు తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదురోజుల పెరోల్ మంజూరైంది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ తన కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు మే 9 నుంచి 13 వరకూ పెరోల్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. రాంచీ ఎస్పీ, జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో లాలూకు పెరోల్ మంజూరైంది. పెరోల్‌పై నిర్ణయం తీసుకునేందుకు జైలు అధికారులు అడ్వకేట్ జనరల్ సలహాను పరిగణనలోకి తీసుకున్నారు. లాలూకు ఇప్పటికే రాంచీకి చెందిన రిమ్స్ ఫిట్నెస్ ధృవీకరణ పత్రం ఇచ్చింది. బుధవారం సాయంత్రం లాలూ రాంచీ నుంచి పట్నాకు బయలుదేరి వెళతారని ఆర్జేడీ నేత భోలా యాదవ్ తెలిపారు. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్, బీహార్ మాజీ సీఎం దుర్గా ప్రసాద్ రాయ్‌ల మనవరాలు ఐశ్వర్యాల వివాహ నిశ్చితార్థం ఏప్రిల్ 18న పట్నాలోని హోటల్ మౌర్యలో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఐశ్వర్యా మెహందీ వేడుక మే 12న కుటంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుంది. -
హీనాతో పెళ్లి.. అబూ సలేంకి ఝలక్
సాక్షి, ముంబై : ముంబై పేలుళ్ల దోషి.. మాజీ డాన్ అబూ సలేంకు ఝలక్ తగిలింది. వివాహం కోసం అతను దాఖలు చేసుకున్న పెరోల్‌ను పోలీసులు తోసిపుచ్చారు. మే 5వ తేదీన సయ్యద్ బహర్ కౌసర్ అలియాస్ హీనాను పెళ్లి చేసుకునేందుకు సలేం సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో 45 రోజుల పెరోల్ కోసం నవీ ముంబై కమిషనర్‌ను సలీం అభ్యర్థించాడు. అయితే పోలీసులు మాత్రం సలేం అభ్యర్థనను తిరస్కరించారు. ఈ విషయాన్ని తలోజా జైలు సూపరిడెంట్ శుక్రవారం ధృవీకరించారు. కాగా, హీనా తొలిసారిగా 2014లో సలీంతోపాటు రైల్లో ప్రయాణించి(ముంబై నుంచి లక్నోకు) వార్తల్లో నిలిచారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో సలేం దోషిగా తేలటంతో.. ప్రత్యేక న్యాయస్థానం అతనికి జీవిత ఖైదును విధించింది. అప్పటి నుంచి తలోజా జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. కాగా, అబూ సలేంతో పెళ్లి జరిపించాలంటూ ముంబ్రాకు చెందిన 25 ఏళ్ల హీనా అప్పట్లో న్యాయ పోరాటానికి సైతం దిగింది. ఈమేరకు ప్రత్యేక అనుమతి కోరుతూ ముంబై టాడా కోర్టును ఆశ్రయించింది. అతనితో నిఖా జరిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది కూడా. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సలేంకు మరణశిక్ష విధించకపోవటానికి కారణం ఇదే... -
మొదటి అడుగు
ఇప్పటివరకూ తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో అలరించారు బెంగళూరు బ్యూటీ అనుష్కా శెట్టి. ఆ మాటకొస్తే మాతృభాష కన్నడ కంటే తెలుగులోనే అత్యధిక చిత్రాలు చేశారామె. ఈ ఏడాది మలయాళ చిత్రసీమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. అది కూడా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి సరసన కథానాయికగా నటించనున్నారని సమాచారమ్. ‘అరుంధతి’ సినిమా తర్వాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న అనుష్క అప్పుడప్పుడూ హీరోలతోనూ జోడీ కడుతున్నారు. అనుష్క నటించిన ‘భాగమతి’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఏ తెలుగు సినిమా కూడా అనుష్క చేతిలో లేదు.అయితే గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట అనుష్క. తాజాగా మలయాళం నుంచి ఆఫర్ రావడం, మమ్ముట్టి వంటి స్టార్ హీరోకి జోడీ కావడంతో ఓకే చెప్పారట అనుష్క. మమ్ముట్టి హీరోగా శరత్ సందిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెరోల్’ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలయ్యాక శరత్ దర్శకత్వంలోనే మమ్ముట్టి ఓ భారీ బడ్జెట్ సినిమా చేయనున్నారట. ఆ చిత్రంలోనే అనుష్క నటించనున్నారని సమాచారం. -
విచారణ ఖైదీల పరిస్థితి బాధాకరం
న్యూఢిల్లీ: విచారణ ఖైదీలకు (అండర్ ట్రయల్) బెయిల్ వచ్చినా పేదరికం కారణంగా బాండ్/పూచీకత్తు సమర్పించలేక తీహార్ జైలులోనే కొట్టుమిట్టాడుతున్నారని, ఇదీ చాలా బాధాకరమైన అంశమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వారికి ఊరట కలిగించేలా ట్రయల్ కోర్టులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మార్గదర్శకాలు ఇచ్చింది. ఎంతటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలైనా ఎటువంటి పరిస్థితుల్లోనూ వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు వెలువరించిందని ధర్మాసనం స్పష్టం చేసింది. లా కమిషన్ కూడా విచారణ ఖైదీల విషయంలో రిస్క్ అస్సెస్మెంట్ చేసి.. బెయిల్ షరతులను పూర్తి చేయలేక జైలులోనే మగ్గుతున్న వారిని విడుదల చేయాలని సూచించిందని పేర్కొంది. ఇలాంటి కేసుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలని, బెయిల్ వచ్చినా విచారణ ఖైదీ ఎందుకు విడుదల కాలేదనే విషయంపై సమీక్షించి బెయిల్ షరతులను మార్చాలంది. వారి కోసం చట్టం! న్యూఢిల్లీ: చేయని తప్పునకు శిక్ష అనుభవించిన బాధితులకు పరిహారం ఇచ్చేలా మన దేశంలో చట్టం ఉందా?.. ఢిల్లీ హైకోర్టు సూచన మేరకు ఈ విషయమై లా కమిషన్ పరిశీలన మొదలుపెట్టింది. చేయని తప్పునకు శిక్ష అనుభవించిన, తీవ్రంగా విచారించబడిన బాధితులకు పరిహారం ఇచ్చేందుకు చట్టపరమైన పరిష్కారాలు లేకపోవడంపై హైకోర్టు ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి బాధితులకు ధనం, ఇతర పరిహారం ఇచ్చేందుకు అమెరికాలో 32 రాష్ట్రాల్లో చట్టాలున్నా యని నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎస్ బాజ్‌పాయ్ నివేదికను ప్రస్తావించింది. -
శశికళ మళ్లీ బయటకు.. డౌటే?
సాక్షి, చెన్నై : పెరోల్ గడువు ముగియటంతో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ నటరాజన్ తిరిగి జైలుకు పయనం అయ్యారు. భర్త నటరాజన్ అనారోగ్యం దృష్ట్యా బెంగళూరు కోర్టు ఆమెకు ఐదు రోజుల పెరోల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం తన మద్ధతుదారులకు, కార్యకర్తలకు అభివాదం చేసి అనంతరం ఆమె బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు బయలుదేరారు. సాయంత్రానికి ఆమె పరప్పన అగ్రహార జైల్లో రిపోర్టు చేయనున్నారు. కాగా, పెరోల్‌ను వ్యక్తిగత కారణాలకు మాత్రమే వినియోగించుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలపై చర్చలు జరపొద్దని నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే ఆమె వాటిని అతిక్రమించినట్టు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐదు రోజుల్లో ఆమె కేవలం రెండు రోజులు మాత్రమే ఆస్పత్రికి వెళ్లి భర్తను పరామర్శించారని.. అక్కడ కూడా ఐదారు గంటల కంటే ఎక్కువ సేపు లేదని ఆరోపణలు వినిపించాయి. ఇక మిగతా సమయమంతా పార్టీ కార్యకలాపాల్లోనే ఆమె మునిగి తేలిందని.. దినకరన్, న్యాయ నిపుణులతో పార్టీపై పట్టు కోసం చర్చలు జరిపిందన్న వార్తలు వచ్చాయి. దీంతో పరప్పన అగ్రహార జైలు ఆ అంశంను పరిశీలించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెకు పెరోల్ మంజూరు అవుతుందా? అన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నమ్మకు జేజేలు
రెండు రోజులు అభిమానులు, మద్దతుదారులు కాస్త సంయమనం పాటించినా, నాలుగో రోజు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. చిన్నమ్మ శశికళకు జేజేలు పలుకుతూ, మేళ తాళాల నడుమ ఆహ్వానం పలకడం గమనార్హం.నాలుగో రోజుగా భర్త నటరాజన్‌ను పరామర్శించిన శశికళ, అభిమానుల పిల్లలకు జయలలిత, జయకుమార్ అనే నామకరణం చేశారు. సాక్షి, చెన్నై : పెరుంబాక్కంలోని గ్లోబల్ హెల్త్ సిటీలో అవయ మార్పిడి శస్త్ర చికిత్సతో ఐసీయూలో ఉన్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు పెరోల్ మీద చిన్నమ్మ శశికళ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరు పరప్పన అగ్రహార చెర నుంచి బయటకు వచ్చిన చిన్నమ్మకు మద్దతుదారులు తొలిరోజు బ్రహ్మరథం పట్టారు. పెరోల్ మీద బయటకు వచ్చిన వారికి ఇంతటి ఆహ్వానమా..? అని పెదవి విప్పిన వాళ్లూ ఉన్నారు. మరుసటి రోజు అభిమానోత్సాం సద్దుమణిగింది. మద్దతుదారుల జాడ కాన రాలేదు. అయితే, ఆస్పత్రికి ప్రతిరోజూ చిన్నమ్మ వచ్చి పరామర్శించి తిరిగి టీ నగర్‌లోని ఇంటికి వెళుతున్నారు. ఈ సమయంలో బంధువులు, కుటుంబీకులతో మంతనాల్లో చిన్నమ్మ బిజీబిజీ అయ్యారని సమాచారం. రెండు రోజుల పాటుగా మద్దతుదారులు, అభిమానుల ఉత్సాహం సద్దుమణిగిన నేపథ్యంలో హంగామా ముగిసినట్టుందంటూ ఎద్దేవా చేసే వాళ్లూ పెరిగారని చెప్పవచ్చు. అందుకే కాబోలు నాలుగో రోజు మంగళవారం పెద్దఎత్తున మద్దతుదారులు తరలి వచ్చి మరీ చిన్నమ్మకు జేజేలు పలకడం గమనార్హం. అభిమానుల హడావుడి టీ.నగర్‌లోని నివాసం నుంచి ఉదయాన్నే ఆస్పత్రికి చిన్నమ్మ బయలుదేరారు. ఈ సమయంలో ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో మహిళా మద్దతుదారులు చేరుకుని చిన్నమ్మకు జేజేలు కొట్టడమే కాకుండా. ఆమెకు ఉన్న దిష్టి అంతా తొలగి పోవాలంటూ దిష్టి గుమ్మిడి కాయల్ని కొట్టి మరీ అభిమానాన్ని చాటుకున్నారు. పెరుంబాక్కంకు వెళ్లే మార్గంలో అక్కడక్కడ మద్దతుదారులు చేతులు ఊపుతూ, జిందాబాద్‌లు కొడుతూ ఆహ్వానం పలికారు. ఇక, ఆస్పత్రి ఆవరణలో పండుగ వాతావరణం తలపించే రీతిలో మేళ తాళాలు హోరెత్తాయి. డప్పు వాయిదాల జోరు నడుమ బ్రహ్మరథం పట్టారు. ఆస్పత్రిలో భర్త నటరాజన్‌ను పరామర్శించిన అనంతరం వెలుపలకు వచ్చిన చిన్నమ్మను మద్దతుదారులు చుట్టుముట్టారు. అభిమానుల పిల్లలకు నామకరణం కన్నగి నగర్‌కు చెందిన ఇలవరసన్, అన్నపూర్ణ దంపతులు తమ పాపకు పేరు పెట్టాలని విన్నవించారు. ఆ పాపకు జయలలిత అని నామకరణం చేశారు. అలాగే, భారతీ నగర్‌కు చెందిన ఎలుమలై, లక్ష్మి దంపతుల మగ బిడ్డకు జయకుమార్ అని పేరు పెట్టారు. మద్దతుదారుల్ని పలకరిస్తూ చిన్నమ్మ కాన్వాయ్ టీ.నగర్ వైపు సాగింది. నేటితో ముగియనున్న పెరోల్ బుధవారంతో పెరోల్ ముగియనుండడంతో చిన్నమ్మకు వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, చిన్నమ్మ రాకతో అన్నాడీఎంకే కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆశతో ఉన్న దినకరన్‌కు మిగిలనుంది ఏమిటో..! అని దినకరన్‌ను ప్రశ్నించగా, మంత్రులు జోకర్ల వలే మాట్లాడుతున్నారని విమర్శించే పనిలో పడ్డారు. పళనిస్వామిపై ఆగ్రహం సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి చిన్నమ్మ దృష్టి అంతా పార్టీ వ్యవహారాల మీదు సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సీఎం పళని స్వామికి సన్నిహితులుగా ఉన్న వారితో శశికళ తన మద్దతుదారుల ఫోన్ ద్వారా మాట్లాడినట్టు ప్రచారం. పళనిస్వామి తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు, పలువురు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై అసహనాన్ని వ్యక్తంచేసినట్టు సమాచారం. పార్టీని రక్షించుకునే విధంగా ముందుకు సాగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ నిర్వీర్యం కావడానికి వీలు లేదని మద్దతుదారులకు సూచించినట్టు తెలిసింది. -
పెరోల్‌పై విడుదలైన శశికళ
-
శశికళకు పెరోల్.. దినకరన్‌కు మరో షాక్
-
జైలు నుంచి చెన్నైకి శశికళ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీఎస్ శశికళ నటరాజన్ కు ఎట్టకేలకు పెరోల్ మంజూరు కావడంతో శుక్రవారం బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదల అయ్యారు. ఆమెకు జైలు వద్ద దినకరన్‌తో పాటు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఆమె భర్త నటరాజన్ అనారోగ్యం కారణంగా అయిదురోజుల పాటు పెరోల్ లభించిన విషయం తెలిసిందే. కాగా ఆమె వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం కావాలని జైళ్లశాఖ సూచించింది. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకునేందుకు తనను పెరోల్ పై విడుదల చేయాల్సిందిగా శశికళ కర్నాటక జైళ్ల శాఖను తొలుత కోరగా.. వారు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆమె కర్ణాటక కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఇరు రాష్ట్రాల స్పందనను కోరగా.. అభ్యంతరం లేదని తమిళనాడు ప్రభుత్వం, కర్నాటక ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. దీంతో జైళ్ల శాఖ ఆమెకు పెరోల్ ఇచ్చింది. నిజానికి ఆమె 15 రోజుల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఐదు రోజులకు మాత్రమే ఆమెకు కోర్టు పెరోల్ మంజూరు చేసింది. అదే సమయంలో వ్యక్తిగత అవసరాల కోసమే పెరోల్ ను వినియోగించుకోవాలని... రాజకీయ కార్యక్రమాలను హాజరు కావొద్దని ఆమెను కోర్టు ఆదేశించింది. కాగా, అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ ప్రస్తుతం కర్నాటక లోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆయనకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. రెండాకుల గుర్తు కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తక్షణమే విచారణ ప్రారంభించాలని ఈసీని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. కాగా రెండాకుల గుర్తుల అంశాన్ని కొంత కాలం వాయిదా వేయాలంటూ దినకరన్ దాఖలు చేసిన అభ్యర్థనను గురువారం మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ గుర్తు విషయంలో సెప్టెంబర్ 15న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరగతిన తేల్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువు విధించాలని దినకరన్ కోరగా.. అందుకు మధురై బెంచ్ న్యాయమూర్తులు వేణుగోపాల్, అబ్దుల్ ఖుద్ధోష్లు నిరాకరించారు. ముందుగా చెప్పినట్లు అక్టోబర్ 31లోగా ఈ వ్యవహారాన్ని తేల్చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది కూడా. దీంతో దినకరన్ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
శశికళకు పెరోల్‌పై మాకు నో ప్రాబ్లమ్
-
'శశికళకు పెరోల్‌పై మాకు నో ప్రాబ్లమ్'
-
'శశికళకు పెరోల్‌పై మాకు నో ప్రాబ్లమ్'
సాక్షి, చెన్నై : అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఆమెకు పెరోల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు వివరించింది. దీంతో ఆమెకు పెరోల్ లభించేందుకు అవకాశం లభించినట్లయింది. గత కొంతకాలంగా తన భర్త నటరాజన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్ చికిత్స పొందుతున్నారు. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. దీంతో ఆయనను చూసేందుకు తనకు అనుమతించాలని, పదిహేను రోజులపాటు తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ జైలు శాఖకు విజ్ఞప్తి చేసుకోగా నిరాకరించింది. అయితే, జైలుశాఖ నిరాకరించగా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ వైఖరి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఆమెకు పెరోల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో బహుశా ఆమెకు పెరోల్ లభించే అవకాశం ఏర్పడింది. -
శశికళకు ఎదురుదెబ్బ
-
శశికళకు ఎదురుదెబ్బ
బెంగళూరు : శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు పెరోల్ ఇచ్చేందుకు జైలు శాఖ నిరాకరించింది. అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసేందుకు తనకు పదిహేను రోజులు పెరోల్ ఇవ్వాలని శశికళ దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం ఏఐఏడీఎంకే నేత టీటీవీ దినకరన్ చెప్పారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్ చికిత్స పొందుతున్న విషయం విదితమే. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే, ఆమెకు పెరోల్ కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అటు శశికళకు, దినకరన్‌కు నిరాశ ఎదురైంది. -
డబ్బు కట్టకపోతే యాంబీ వ్యాలీ వేలమే
సహారా అధినేత సుబ్రతారాయ్ పెరోల్ గడువును సుప్రీంకోర్టు జూలై 20 వరకు పొడిగిచ్చింది. జూలై 15 వరకు రూ.552 కోట్లను సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని, లేకపోతే సహారా గ్రూపుకు చెందిన విలువైన యాంబీ వ్యాలీని వేలం వేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ జూలై 20కు వాయిదావేసింది. అయితే ఆ రూ.552 కోట్ల చెల్లింపులకు మరింత సమయమివ్వాలనే సహారా గ్రూపు సుప్రీంకోర్టును కోరింది. వారి అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఒకవేళ ఈ నగదును జూలై 15 వరకు కట్టకపోతే, తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. తాత్కాలికంగా అయితే యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపుతున్నామని, కానీ రూ.552 కోట్లను చెల్లించపోతే, యాంబీ వ్యాలీ వేలం ప్రక్రియ వెనువెంటనే ప్రారంభమవుతుందని తెలిపింది. కాగ, గత విచారణ సందర్భంగా రూ.709.82 కోట్లను డిపాజిట్ చేయడానికి సుబ్రతారాయ్‌కు నేటి వరకు అవకాశమిచ్చింది. ఇందుకు అనుగుణంగా తాత్కాలిక బెయిల్‌ను కూడా నేటి(జూలై 5) వరకు పొడిగించింది. జూన్ 15, జూలై 15న సెబీకి వరుసగా రూ.1,500 కోట్లు, రూ.552.22 కోట్లు చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఇంతక్రితమే సహారా రెండు చెక్కులను డిపాజిట్ చేసింది. అయితే ఈ డబ్బును సమకూర్చలేకపోవడాన్ని తీవ్రంగా తీసుకున్న సుప్రీంకోర్టు, మహారాష్ట్రలో సంస్థకు చెందిన రూ.34,000 కోట్ల విలువైన యాంబీ వ్యాలీ జప్తునకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
పెరోల్‌పై వచ్చి బాహుబలి 2 చూసి జంపయింది
అహ్మదాబాద్: పైకి చూడటానికి ఆమె ఒక సన్యాసి. పేరు జై శ్రీ గిరి. ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతూ ఓ ఆలయాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది తొలి రోజుల్లో (జనవరిలో) గుజరాత్ పోలీసులు ఆమె ఆశ్రయంపై దాడులు నిర్వహించగా బిత్తరపోయే విషయాలు వెలుగుచూశాయి. పెద్ద మొత్తంలో అక్రమ మార్గంలో బంగారం కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయింది. తన ఆశ్రమంలో కోట్ల విలువైన బంగారు బిస్కెట్లతోపాటు మద్యం సీసాలు కూడా పెద్ద మొత్తంలో లభించాయి. దీంతో ఆమెను అరెస్టు చేశారు. అప్పటి నుంచి విచారణ ఖైదీగా ఉంచిన పోలీసులు ఇటీవలె ఆరోగ్య పరీక్షల నిమిత్తం పెరోల్‌పై నలుగురు పోలీసులను గార్డులగా ఇచ్చి బయటకు పంపించారు. అయితే, ఆరోగ్య పరీక్షల పేరిట బయటకు వచ్చిన ఆమె పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత తనకు కొంత విరామం కావాలంటూ బ్రతిమిలాడుకుంది. అహ్మదాబాద్‌లోని హిమాలయన్ మాల్‌కు తన వ్యక్తిగత లాయర్, పోలీసు గార్డులతో వెళ్లింది. ఏం చక్కా నచ్చిన ఫుడ్డు లాగించేసి.. అనంతరం తాఫీగా మసాజ్ చేయించుకుంది. ఆ వెంటనే భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి ఇప్పటికీ విజయవంతంగా దూసుకెళుతున్న బాహుబలి 2 చిత్రాన్ని చూసింది. ఆ సమయంలో నిరంతరం ఫోన్లో మాట్లాడిన ఆమె తన పెరోల్ మరింత పొడిగించే అవకాశం ఉందా అని కనుక్కుంది. అయితే, ఎప్పుడైతే ఆమె పెరోల్ గడువు పొడిగించడం లేదని తెలిసిందో ఆ వెంటనే తాను వాష్ రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి అటునుంచి అటే పారిపోయింది. దీంతో బిత్తరపోవడం ఆమెకు కాపలాగా ఉన్న గార్డుల వంతైంది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి గార్డుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె పారిపోయిందంటూ వారిని, ఆమె న్యాయవాదిని అరెస్టు చేశారు. ఈ నలుగురు గార్డులకు కూడా ఈ మధ్య శిక్షణ పూర్తయిందట. ప్రస్తుతం ఇతర పోలీసులు ఆమెను పట్టుకునే పనిలో పడ్డారు. ఈమె దాదాపు రూ.5కోట్ల విలువైన బంగారాన్ని అక్రమ మార్గంలో ఈ ఏడాది జనవరిలో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
సంజయ్ దత్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురు
ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్రా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పెరోల్ పై సంజయ్ దత్ విడుదలను తప్పుపట్టింది. 8 నెలల ముందే జైలు నుంచి ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. సంజయ్ ముందస్తు విడుదలపై సమాధానం చెప్పాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. కాగా, 1993 ముంబై బాంబుపేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నారన్న నేరంపై కోర్టు సంజయ్ దత్‌కు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సత్ర్పవర్తన కారణంగా ఎనిమిది నెలల శిక్ష మిగిలి ఉండగానే జైలు నుంచి విడుదల చేశారు. -
సత్ప్రవర్తనతో పెరోల్‌పై వెళ్లి.. 9 హత్యలు!
హత్యానేరంలో జీవితఖైదు శిక్ష పడి, తొమ్మిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఖైదీని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అయితే ఈలోపే అతడు మరో 9 మందిని హతమార్చాడు. హరియాణాకు చెందిన సతీష్ అలియాస్ కాలా అలియాస్ మౌనా అనే గ్యాంగ్‌స్టర్ అంతకుముందు జైల్లో ఉండగా సత్ప్రవర్తనకు గాను పెరోల్ లభించి బయటకు వెళ్లాడు. అప్పటినుంచి ఇక మళ్లీ జైలుకు తిరిగి రాకుండా తొమ్మిది మందిని హత్య చేశాడు. గుర్‌గ్రామ్ క్రైం బ్రాంచి వాళ్లు దాదాపు డజను వరకు హత్యల కేసులను విచారిస్తుండగా అందులో మొత్తం ఐదుగురు కరడుగట్టిన ఖైదీలను గుర్తించారు. వాళ్లంతా ఒక పౌల్ట్రీ ఫారంలో దాక్కుని ఉండగా విశ్వసనీయ సమాచారం అంది వాళ్లను పట్టుకున్నారు. 2008లో పెరోల్ వచ్చిన సతీష్.. ఆ తర్వాత సందీప్ గడోలి అనే గ్యాంగ్‌స్టర్‌కు ప్రధాన అనుచరుడైన రాజు సేథిని హతమార్చాడు. ఇది సుపారీ హత్య అని, గుర్‌గ్రామ్‌కు చెందిన బీరేందర్ సింగ్ దైమా అలియాస్ బిందార్ గుజ్జర్ అనే వ్యక్తి ఈ సుపారీ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. 2015లో దీపావళి రోజున ఓ పెట్రోలు బంకు దగ్గర సేథిని తుపాకితో కాల్చి చంపేశారు. ఈ హత్య తర్వాత గుర్‌గ్రామ్‌లో గ్యాంగ్‌వార్ చెలరేగింది. ఆ తర్వాత 2016 ఫిబ్రవరిలో ఐదుగురు క్రైం బ్రాంచి అధికారులు గడోలిని ముంబై హోటల్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చారు. ఇందుకోసం బిందార్ గుజ్జర్ పోలీసులకు రూ. 5 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ బూటకపు ఎన్కౌంటర్ కేసులో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు. అయితే, గుర్‌గ్రామ్‌లో జరిగిన ఓ రియల్ ఎస్టేట్ హత్యతో మళ్లీ సతీష్ మీద పోలీసుల దృష్టి పడింది. భరత్ భూషణ్ అనే ఆ వ్యాపారిని తన కార్యాలయం పక్కనే ఉన్న ఖాళీ ప్లాటులో పలురౌండ్లు కాల్చి మరీ చంపారు. ఆ ప్రాంతంలో సతీష్ ప్రభావం నానాటికీ పెరగడంతో పోలీసులు గట్టిగా దృష్టిసారించారు. అప్పుడే వాళ్లకు సతీష్, అతడి గ్యాంగు సభ్యులు హిస్సార్ సమీపంలోని హైబల్పూర్ గ్రామంలో గల ఓ పౌల్ట్రీ ఫాంలో దాగున్నట్లు తెలిసింది. దాంతో అక్కడ దాడిచేసి అందరినీ పట్టుకున్నట్లు గుర్‌గ్రామ్ కమిషనర్ సందీప్ ఖిర్వార్ తెలిపారు. సతీష్‌తో పాటు అతడి ప్రధాన అనుచరుడు అరవింద్ అలియాస్ పండిట్ కూడా పట్టుబడ్డాడు. ఇంకా నరేష్ అలియాస్ పహల్వాన్, సురేందర్ అలియాస్ ఫౌజీ, అశ్వని అలియాస్ పన్ను కూడా అరెస్టయినవారిలో ఉన్నారు. వాళ్ల దగ్గర రెండు నాటు రివాల్వర్లు, ఒక పిస్టల్, 30 బుల్లెట్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. -
పెరోల్ పొడిగించాలంటే రూ. 5,092 కోట్లు!
⇒ ఏప్రిల్ 7లోపు డిపాజిట్ చేయాలి ⇒ సహారా రాయ్‌కు సుప్రీం గడువు న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను పొడిగించడానికి సుప్రీంకోర్టు కీలక షరతు విధించింది. ఏప్రిల్ 7వ తేదీలోపు సెబీ–సహారా అకౌంట్లో రూ.5,092.6 కోట్లు డిపాజిట్ చేయాలని సహారాను ఆదేశించింది. తన ఆస్తులు అమ్మడానికి ఆరు నెలల గడువు కావాలని గ్రూప్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించింది. తనకు సమర్పించిన జాబితాలోని ఆస్తులు అమ్మడానికి ఆమోదముద్ర వేసింది. మదుపరులకు డబ్బు పునఃచెల్లించడానికి వీలుగా తగిన చర్యలు తీసుకోడానికి తగిన అన్ని చర్యలపై దృష్టి సారించాల్సిందేని స్పష్టం చేసింది. ఏప్రిల్ 7లోపు డిపాజిట్ చేయడానికి వీలుగా తనకు సమర్పించిన జాబితాలోని 15 ఆస్తుల్లో పదమూడింటిని అమ్మవచ్చని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అలాగే మరో జాబితాల్లో ఉన్న తనఖాలోలేని ఆస్తుల అమ్మకానికీ సుప్రీం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం చెల్లింపు తరువాత పెరోల్ గడువును మరికొంతకాలం పొడిగించి మొత్తం డబ్బు డిపాజిట్ చేసే మార్గాలను అన్వేషించే అవకాశం కల్పిస్తామని సుప్రీం సూచించింది. ఇంటర్నేషనల్ రియల్టీ సంస్థకు సూచనలు... కాగా న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్లో సహారా వాటాలను 550 మిలియన్ డాలర్లకు కొనడానికి ముందుకు వచ్చిన ఒక అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థకు...రాజన్ గొగోయ్, ఏకే శిక్రీలు కూడా ఉన్న ఈ త్రిసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ దిశలో తన విశ్వసనీయతను నిరూపించుకోడానికి రూ.750 కోట్లను ఏప్రిల్ 10వ తేదీ లోగా అత్యున్నత స్థాయి న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
పెరోల్ పొడిగిస్తాం కానీ..రూ.600 కోట్లు చెల్లించు!
సహారా చీఫ్ సుబ్రతా రాయ్ పెరోల్ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. 2017 ఫిబ్రవరి 6వరకు పెరోల్ గడువు పొడిగిస్తున్నట్టు సుప్రీం సోమవారం పేర్కొంది. అయితే జైలు బయట ఉండటానికి ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు రూ.600 కోట్లను డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం సహారా చీఫ్‌ను ఆదేశించింది. ఒకవేళ డబ్బును డిపాజిట్ చేయని పక్షంలో సరెండర్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 25న కూడా సుప్రీంకోర్టు సుబ్రతా రాయ్ పెరోల్‌ను నవంబర్ 28వరకు పొడిగించింది. ఈ పొడిగింపుకు సహారా గ్రూప్ రూ.200 కోట్లు డిపాజిట్ చేసింది. మరో రూ.200 కోట్లను నవంబర్ ఆఖరికల్లా చెల్లించనున్నట్టు సహారా పేర్కొంది. కాగ, సుబ్రతారాయ్ తల్లి గత మే నెలలో మరణించడంతో కోర్టు మానవతా దృక్పథంతో ఆయనకు పెరోల్ మంజూరు చేసింది. ఆ తర్వాత డిపాజిట్ దారులకు డబ్బు వెనక్కి ఇచ్చేందు కోసం నాటి నుంచి ఆయన పెరోల్‌ను కోర్టు పొడిగిస్తూ వస్తోంది. నేటితో ముగుస్తున్న ఆయన పెరోల్ గడువును అపెక్స్ కోర్టు మరోసారి పొడిగించింది. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి రెండు సహారా గ్రూప్ సంస్థలు రూ.25,000 కోట్లు వసూలు చేయడం.. వడ్డీతో సహా మొత్తం రూ.35,000 కోట్లు దాటి వాటిని తిరిగి చెల్లించడంలో ఆ సంస్థలు వైఫల్య చెందాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ సంస్థల చీఫ్ సుబ్రతారాయ్ 2014 మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. అనంతరం ఆయన పెరోల్‌పై బయటికి వచ్చారు. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు(సగం నగదు రూపంలో, సగం బ్యాంకు గ్యారెంటీ రూపంలో) చెల్లించాలని మార్చి 26న సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిలో సగం మొత్తం సహారా నగదు రూపంలో సహారా చెల్లించింది. కానీ బ్యాంకు గ్యారెంటీ తరుఫును ఇవ్వాల్సిన రూ.5000 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. -
పెరోల్ పై కొనసాగనున్న రాయ్!
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, సంస్థకు సంబంధించి మరో ఇరువురు డెరైక్టర్లు- అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబే అక్టోబర్ 24 తరువాతా పెరోల్‌పై కొనసాగడానికి మార్గం సుగమం అయ్యింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28 ఆదేశాలకు అనుగుణంగా గడువుకన్నా రెండు రోజుల ముందుగానే శుక్రవారం సెబీకి సహారా రూ.200 కోట్లు డిపాజిట్ చేసింది. ఈ ఏర్పాటు కొనసాగడానికి నవంబర్ 28వ తేదీలోపు సహారా మరో రూ.200 కోట్లు చెల్లించాలని సుప్రీం బెంచ్ ఆదేశించింది. కాగా సెబీ సహారా అకౌంట్లో డిసెంబర్ 2018 నాటికి రూ.12,000 కోట్లు జమచేయడానికి సంబంధించి రోడ్‌మ్యాప్‌తో తాము సిద్ధమని రాయ్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు శుక్రవారం విన్నవించారు. -
ఇక వారికి పెరోల్ ఇవ్వరట
ముంబయి: హత్యలు చేసినవారికి, అత్యాచారాలకు పాల్పడినవారికి పెరోల్ ఇవ్వకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు బాలకాలికల అక్రమ రవాణాలకు పాల్పడే వారికి కూడా ఈ పెరోల్ సౌకర్యం ఉండదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర హోమంత్రిత్వశాఖ గతవారం పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు తమను పెరోల్‌పై విడుదల చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. వాటిపై నిర్ణయం తీసుకోకుండా నిలిపి ఉంచింది. లైంగిక దాడి కేసుల్లో, హత్య కేసుల్లో నిందితులకు పెరోల్ ఇవ్వకూడదనే నిర్ణయంపై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే ప్రస్తుతం వచ్చిన పెరోల్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోనుంది. కుప్పలుకుప్పలుగా పెరోల్ అప్లికేషన్లు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
సెప్టెంబర్ 16 వరకూ సుబ్రతారాయ్ పెరోల్ పొడిగింపు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను సెప్టెంబర్ 16 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే తదుపరి వాయిదాలోపు రూ.300 కోట్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డిపాజిట్ చేయాలని, లేదంటే తిరిగి జైలుకు పంపవలసి వస్తుందని స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు- మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమయిన కేసులో దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇటీవలే తల్లి మరణంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. బెయిల్‌కోసం చెల్లించాల్సిన రూ.10,000 కోట్లకు సంబంధించి... సుప్రీం ఆదేశాల మేరకు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తూ, పెరోల్‌పై కొనసాగుతున్నారు. జూలై 11వ తేదీ ఆదేశాల మేరకు నిర్దేశిత రూ.300 కోట్లు చెల్లించడంతో ఆయన తాజా పెరోల్ గడువు పొడిగింపు ఉత్తర్వ్యును పొందగలిగారు. -
ఆచూకీ చెప్పమంటే.. ప్రాణాలు తీసుకున్నాడు!
♦ రెండు రోజుల కిందట పోలీసుస్టేషన్ పైనుంచి దూకిన యువకుడు ♦ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ♦ మృతుడు పరారైన జీవిత ఖైదీకి స్వయూనా తమ్ముడు ♦ అన్న ఆచూకీ చెప్పమన్నందుకే తమ్ముని అఘాయిత్యం.. మార్కాపురం : హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై బయటకొచ్చి తప్పించుకుని తిరుగుతున్న కురుకుందు శ్రీనివాసులు తమ్ముడు వెంకట్రావును రెండు రోజుల కిందట మార్కాపురం రూరల్ పోలీసులు విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లగా పైనుంచి కిందకు దూకటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనను పోలీసులు గోప్యంగా ఉంచి క్షతగాత్రుడికి గుంటూరులో చికిత్స చేయిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకట్రావు గురువారం సాయంత్రం మృతి చెందాడు. వివరాలు.. పలు హత్య కేసుల్లో మార్కాపురం మండలం అమ్మవారిపల్లెకు చెందిన కురుకుందు శ్రీనివాసులు నిందితుడు. నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత కాల శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది మే 31న శ్రీనివాసులు సోదరుడు చిన్న వెంకటేశ్వర్లు మతి చెందటంతో పెరోల్‌పై స్వగ్రామం వచ్చాడు. ముద్దాయి వెంట ముగ్గురు పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నారు. అంత్యక్రియల అనంతరం శ్రీనివాసులు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. ముద్దాయి శ్రీనివాసులును ఇటీవల అమ్మవారిపల్లెకు వచ్చినట్లు రూరల్ పోలీసులకు సమాచారం అందటంతో రెండు రోజుల కిందట అక్కడికి వెళ్లి ఆయన మరో తమ్ముడు వెంకట్రావును విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసుస్టేషన్‌పైకి ఎక్కి భవనం నుంచి కిందకు దూకాడు. కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మతి చెందాడు. ఈ విషయంపై మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబును వివరణ కోరగా ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి పరారైన ముద్దాయి కురుకుందు శ్రీనివాసులు అమ్మవారిపల్లె ప్రాంతంలో సంచరిస్తున్నాడనే సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి వెళ్లారని, అక్కడ ఉన్న ముద్దాయి తమ్ముడు వెంకట్రావును తీసుకొచ్చి విచారణకు ప్రయత్నించారని చెప్పారు. ముద్దాయి ఫోన్ నంబర్‌ను అడగ్గా తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుస్టేషన్ భవనం పైకి ఎక్కి దూకటంతో గాయాలయ్యాయని, చికిత్స పొందుతూ మతి చెందాడని డీఎస్పీ వివరణ ఇచ్చారు. -
సహారా చీఫ్ కు నాలుగు వారాల పెరోల్
తల్లి అంత్యక్రియల్లో పాల్గొనే వెసులుబాటు న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ తల్లి ఛహాబీ రాయ్ (95) శుక్రవారం ఉదయం లక్నోలో మృతిచెందారు. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ... సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు నాలుగువారాల పెరోల్ మంజూరు చేసింది. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్ సంస్థలు రెండు రూ.25,000 కోట్లు వసూలు చేయడం... వడ్డీతో సహా ఈ మొత్తం రూ.35,000 కోట్లు దాటిన వైనం, తిరిగి చెల్లించడంలో వైఫల్యం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన 2014 మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమల్లో సహారా విఫలమవుతోంది. ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకోవడంలో వైఫల్యం అవుతుండడంతో ఇటీవలే ఈ బాధ్యతలనూ సుప్రీంకోర్టు సెబీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో తల్లి తుదిశ్వాస విడవడంతో, ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుకల్పిస్తూ... రాయ్‌కి పెరోల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రాయ్ న్యాయవాది కపిల్ సిబల్ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే శిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను ఆమోదించింది. రాయ్‌తోపాటు జైలులో ఉన్న సహారా డెరైక్టర్ అశోక్ రాయ్ చౌదరికి కూడా సుప్రీం పెరోల్ మంజూరు చేసింది. కాగా ఈ నాలుగువారాలూ రాయ్ పోలీస్ ప్రొటెక్టివ్ కస్డడీలో ఉంటారని పెరోల్ మంజూరు సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. అంతక్రితం పారిపోవడానికి తన క్లెయింట్ ప్రయత్నం చేయడంటూ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. -
నళినికి ఒక రోజు పెరోల్
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన దోషి నళిని శ్రీహరణ్‌కు పెరోల్ మంజూరైంది. 24గంటలపాటు ఆమె జైలు బయట ఉండేందుకు కోర్టు అనుమతించింది. తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మద్రాస్ కోర్టు ఆమెకు ఈ అవకాశం కల్పించింది. గత నెలలో చెన్నైలో ఆమె తండ్రి చనిపోవడంతో 12గంటల ఎమర్జెన్సీ పెరోల్‌పై ఆమెను విడుదల చేశారు. కాగా, అంత్యక్రియల అనంతర కార్యక్రమాలకు మరోసారి హాజరయ్యేందుకు మూడు రోజులపాటు అనుమతించేలా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆమె మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆమెను గత 24 సంవత్సరాలుగా వెల్లోర్లోని ప్రత్యేక సెల్ లో ఉంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 24 సంవత్సరాలుగా జైలులో ఉంటున్న తనను సత్ప్రవర్తన కింద పరిగణించి విడిచిపెట్టాలని కూడా ఆమె గత డిసెంబర్లో కోర్టుకు వెళ్లారు. -
పెరోల్ కోసం నళిని వినతి
వేలూరు: రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నళిని మూడు రోజుల పెరోల్ కోసం వినతి చేసినట్లు న్యాయవాది పుగయేండి తెలిపారు. రాజీవ్ హంతకులు మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లతో పాటు మొత్తం ఏడుగురు వేలూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నళిని న్యాయవాది పుగలేంది మహిళా జైల్లో ఉన్న నళిని పరామర్శించి మాట్లాడారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నళిని తండ్రి శంకర్ నారాయణన్ గత వారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తండ్రి 16వ రోజు కార్యం కోసం ఈనెల 8,9,10 తేదీల్లో మూడు రోజుల పెరోల్ కోసం వేలూరు మిహ ళా జైలు సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి వద్ద ఈనెల 2వ తేదీన నళిని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ వినతిపై ఈనెల 7వ తేదీన కోర్టులో దాఖలు చేసి విచారించనున్నారన్నారని తెలిపారు. ఏడుగురి విడుదల గురించి 2014లో అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. ఏడుగురిని విడుదల చేసేందుకు ఎన్నికల కోడ్ ఆటంకం కాదన్నారు. -
రాజీవ్ హత్య కేసులో నిందితురాలికి పెరోల్
నళినికి 12 గంటల పెరోల్- తండ్రి అంత్యక్రియలకు హాజరు తాను నిర్దోషినని పునరుద్ఘాటన చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళినీ శ్రీహరన్‌కు ఆమె తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బుధవారం 12 గంటల పెరోల్ మంజూరైంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇచ్చిన పెరోల్‌పై ఆమె వేలూరు జైలు నుంచి చెన్నైకి చేరుకుని తండ్రి శంకర నారాయణ్(91) అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత మళ్లీ జైలు వెళ్లారు. తాను నిర్దోషిని అని, రాజీవ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెన్నైలో మీడియాతో అన్నారు. ఈ కేసులో తనతోపాటు శిక్ష అనుభవిస్తున్న మిగతావారి విడుదల కోసం తమిళనాడు సీఎం జయలలిత చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు తన విడుదలకు సహకరించాలని కోరారు. 2004లో తన సోదరి పెళ్లికి పెరోల్‌పై విడుదలైన నళిని ఆ తర్వాత బయటి ప్రపంచాన్ని చూడడం ఇదే తొలిసారి. రాజీవ్ హత్య కేసులో ఆమెకు 1998లో ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించగా, 2000లో నాటి తమిళనాడు గవర్నర్ ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. తాను 24ఏళ్లకు పైగా జైల్లో ఉన్నాను కనుక ముందస్తుగా విడుదల చేయాలని ఆమె గత ఏడాది మద్రాస్ హైకోర్టును కోరారు. -
'పెరోల్ ఇవ్వమంటున్నారు.. మీరేమంటారు?'
న్యూఢిల్లీ: టీచర్ల నియామకాల్లో అవతవకలకు పాల్పడి ప్రస్తుతం పదేళ్ల కాలానికి జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాశ్ చౌతాలా తన వైద్యం కోసం దాఖలు చేసుకున్న పెరోల్ బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. అయితే, ఇప్పటికే చౌతాలా పిటిషన్‌ను హర్యానా ప్రభుత్వం వ్యతిరేకించింది కూడా. 82 ఏళ్ల చౌతాలా తన కాళ్లకు పక్షవాతంవచ్చిందని, వైద్యం చేయించుకునేందుకు 60 రోజులపాటు పెరోల్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, దీనిపై హైకోర్టుకు వెళ్లండంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారు తిరిగి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోర్టుకు కౌంటర్ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. -
పెరోల్ కోసం మరోసారి సంజయ్ దరఖాస్తు
ముంబై: పుణేలోని ఎరవాడ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ మరోసారి పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెలరోజులు పెరోల్ కోసం ఆయన పిటిషన్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ముంబై వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్‌దత్ గతంలో పలుమార్లు పెరోల్ మీద బైటికి వచ్చారు. ఒకసారి నూతన సంవత్సర వేడుకల కోసం, భార్య మాన్యత అనారోగ్యం కారణంగా పెరోల్ మీద బెయిల్ పొందడం, ఈ సందర్భంగా కొన్ని వివాదాలు కూడా నెలకొనడం, మళ్లీ జైలు సరెండర్ అవ్వడం తెలిసిందే. -
గావ్లీకి 15 రోజు పెరోల్ మంజూరు
సాక్షి, ముంబై: కార్పొరేటర్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే అరుణ్ గావ్లీకి పెరోల్ మంజూరైంది. బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ ధర్మాసనం (బెంచి) గురవారం ఆయనకు 15 రోజుల పెరోల్ ఇచ్చింది. కొడుకు మహేశ్ గావ్లీ పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు 30 రోజులు పెరోల్ మంజూరు చేయాలని నాగపూర్ జైలు పరిపాలన విభాగానికి మార్చిలో గావ్లీ దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే జైలు అధికారులు పెరోల్ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో గావ్లీ బాంబే హై కోర్టులోని నాగపూర్ బెంచికి పిటిషన్ పెట్టుకున్నారు. గావ్లీ తరఫున న్యాయవాదులు రజనీశ్ వ్యాస్, మీర్ నగం అలీ పిటిషన్‌ను కోర్టుకు విన్నవించారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది. గావ్లీ కుమారుడి పెళ్లి నాగపూర్‌కు చెందిన కృతిక అహిర్‌తో మే తొమ్మిదో తేదీన మహాలక్ష్మిలోని రేస్ కోర్స్‌లో జరగనుంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాతో పాటు నగరంలోని ప్రముఖ రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు. -
21 మంది అనంతపురం జిల్లా ఖైదీలకు పెరోల్
‘శ్వేతపత్రాలు’గా ఉన్న ఆన్లైన్ జీవోలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లా ఓపెన్ ఎయిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలకు ఒకేరోజు పెరోల్ మంజూరు చేసింది. ఒకేరోజు 21 మంది ఖైదీలకు ఒక్కొక్కరికి 30 రోజుల చొప్పున పెరోల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హోం శాఖ గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు రాజమండ్రి, కడప సెంట్రల్ జైళ్ళల్లో ఉన్న మరో నలుగురికీ పెరోల్ ఇచ్చింది. మొత్తంగా ఒకేరోజు 25 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు చేయడం ఇదే తొలిసారి. న్యాయస్థానంలో నేరం నిరూపితమై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు నిర్ణీత కాలం శిక్ష పూర్తి చేసిన తరవాత కొన్ని రోజుల పాటు జైలు నుంచి బయటకు విడిచిపెట్టడాన్నే పెరోల్ అంటారు. ఇతర ఉత్తర్వుల మారిదిగానే పెరోల్ జీవోలను హోం శాఖ ఆన్లైన్లో ఉంచినప్పటికీ ఖైదీతో పాటు కేసులకు సంబంధించిన పూర్వాపరాలను మాత్రం ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు. -
సంజయ్ దత్ ఇంకో నాలుగు రోజులు..
ముంబై : బాలీవుడ్ హీరో సంజయ్ దత్ మరో నాలుగు రోజుల పాటు జైల్లో గడపాల్సి ఉంది. అక్రమ ఆయుధాల కేసు, ముంబై పేలుళ్ల కేసులో సంజు భాయ్ ప్రస్తుతం పుణే జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ తన శిక్షా కాలంలో అదనంగా మరో నాలుగు రోజులు పాటు జైల్లోనే ఉండాలని మహారాష్ట్ర హోంమంత్రి రామ్ షిండే తెలిపారు. సంజయ్ దత్ గత డిసెంబర్ 24వ తేదీన 14 రోజుల ఫర్లాగ్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, అందువల్ల తన ఫర్లాగ్‌ను పొడిగించాలని సంజయ్‌దత్ జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు, పోలీసులకు మధ్య సమన్వయ లోపం కారణంగా కొంత గందరగోళం నెలకొంది. అయితే ఈ విషయంలో నిర్ణయం తేలకపోవడంతో, జనవరి 8వ లొంగిపోవడానికి జైలుకొచ్చిన సల్లూభాయ్ నాలుగు రోజులు పాటు జైలు బయటే ఉండిపోయాడు. మరోవైపు సంజయ్‌కు చికిత్స అందించేందుకు ఫర్లాగ్‌ను పొడిగించాల్సిన అవసరం లేదని పోలీసులు భావించినందున దరఖాస్తును తిరస్కరించామని జైలు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంజయ్ తిరిగి జనవరి 11వ తేదీన అధికారుల ఎదుట లొంగిపోయాడు. ఈ గందరగోళానికి రాష్ట్ర హోం మంత్రి రామ్ షిండే వివరణ ఇచ్చారు. సంజయ్ దత్ ఫర్లాంగ్ గడువు, జనవరి 8వ తేదీతోనే ముగిసిందని స్పష్టం చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నాలుగు రోజులు జైలు బయట గడిపిన ఆ నాలుగు రోజులు సంజయ్ శిక్షాకాలానికి అదనంగా కలుపుతామని షిండే తెలిపారు. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసిన సంబంధిత అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. జైలు మాన్యువల్ నుంచి స్పష్టత వచ్చిన అనంతరం తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా మంత్రి వెల్లడించారు. -
పెళ్లి చేసుకునేందుకు ఖైదీకి పెరోల్
తిరువొత్తియూరు: పుళల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి వివాహం చేసుకునేందుకుగాను 20 రోజుల పాటు పెరోల్‌పై విడుదలకు హైకోర్టు ఆదేశించింది. కోయంబత్తూరుకు చెందిన ఫాతిమా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తన కుమారుడు ఎస్ అహ్మద్ కోవై బాంబు పేలుడు కేసులో శిక్షకు గురై జైలులో ఉన్నాడని తెలిపారు. ఇతనికి ఈనెల ఏడో తేదీ వివాహం చేయడానికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వివాహం కోసం తన కుమారుడికి 20 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేయడానికి జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి శివజ్ఞానం విచారించారు. అహ్మద్‌కు వే సిన జైలు శిక్షను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలో ఉన్న దృష్ట్యా, ఖైదీ వివాహం చేసుకునేందుకు 20 రోజుల వరకు విడుదల చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. -
సంజయ్‌దత్‌కు నిబంధనలు వర్తించవా?
* బాలీవుడ్ నటునికి సెలవులు, పెరోల్‌ను సవాలుచేస్తూ పిటిషన్ * ప్రభుత్వాన్ని సమాధానం కోరి బొంబాయి హైకోర్టు సాక్షి, ముంబై: అక్రమ ఆయుధాలు కల్గి ఉన్న కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు తరుచుగా లభిస్తున్న పెరోల్, సెలవులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సమాధానం ఇవ్వాలని బొంబాయి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పుణే జైలు సూపరింటెండెంట్, పుణే డివిజనల్ కమిషనర్లు తమకు గల విచక్షణాధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ తుషార్ పబాలే అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు వీఎం కనాడే, రేవతి మోహితే డేరేల ధర్మాసనం విచారణ జరిపింది. డిసెంబర్ 2013-మార్చి 2014 మధ్య కాలంలో సంజయ్‌దత్ పెరోల్‌పై విడుదలైన సమయంలో పబాలే ఈ పిటిషన్ దాఖలు చేశారు. పబాలే తరఫు న్యాయవాది నిఖిల్ చౌదరి తన వాదనలు వినిపిస్తూ, ఓ ఖైదీ సెలవుపై బయటకు వచ్చిన తరువాత కనీసం ఒక సంవత్సరం పాటు జైలులో ఉండాలన్నారు. అంటే మరోసారి సెలవు మంజూరు కావాలంటే 365 రోజుల పాటు ఆ ఖైదీ శిక్షను అనుభవించాలి. ఒకవేళ మధ్యలో అతడు పెరోల్‌పై విడుదలైతే, ఆ రోజులను శిక్షా కాలంగా లెక్కించకూడదని పేర్కొన్నారు. సంజయ్‌దత్‌కు అక్టోబర్ 2013లో 28 రోజుల పాటు సెలవు మంజూరైంది. తిరిగి డిసెంబర్ 2013లో నెల రోజుల పెరోల్ లభించింది. ఆ తరువాత ఆ పెరోల్‌ను మరో నెల రోజులు అనగా ఫిబ్రవరి 21 వరకు పొడిగించారు. తన భార్యకు అనారోగ్యంగా ఉందంటూ దత్ తన పెరోల్‌ను మరో నెల రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అతని విజ్ఞప్తిని పుణే డివిజనల్ కమిషనర్ ఆమోదించడంతో సంజయ్ దత్ 2014 మార్చి 21న తిరిగి జైలుకు వెళ్లారు. దీంతో అక్టోబర్ 2013 నుంచి డిసెంబర్ 2014 మధ్య దత్ సెలవు, పెరోల్‌పై మొత్తంగా నాలుగు నెలలు జైలు వెలుపల ఉన్నారు. తిరిగి డిసెంబర్ 24, 2014లో దత్ సెలవుపై బయటకు వచ్చారు. రెండోసారి సెలవు మంజూరు కావడానికి సంజయ్ దత్ జైలులో 365 రోజులు గడపలేదని న్యాయవాది ఆరోపించారు. పెరోల్‌పై విడుదలైన కాలాన్ని శిక్షా కాలంగా పరిగణించరాదని చెప్పారు. మే 16, 2013లో లొంగిపోయిన నాటి నుంచి సంజయ్ దత్ జైలు వెలుపల 134 రోజులు ఉన్నారని పేర్కొంటూ ఖైదీల పెరోల్, సెలవుల విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. -
సంజయ్ దత్ పెరోల్‌పై పిల్
సాక్షి, ముంబై: అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో దోషిగా యేర్వాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు తరుచూ పెరోల్ ఎలా మంజూరు చేస్తున్నారని బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రదీప్ భాలేకర్ అనే సామాజిక కార్యకర్త దత్‌కు తరుచూ కోర్టు పెరోల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దత్‌కు ఇప్పటివరకు మూడుసార్లు పెరోల్ మంజూరైంది. కాని దత్‌తోపాటు శిక్ష అనుభవిస్తున్న మిగతా ఖైదీలపై జైలు పరిపాలన విభాగం ఎందుకు దయ చూపించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం అదే జైలులో పెరోల్ కోసం 438 మంది ఖైదీల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని బాలేకర్ పిల్లో స్పష్టం చేశారు. దత్ 1993లో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో ఖైదీగా ఉన్నారు. ఆయనకు తరుచూ పె రోల్ మంజూరుచేస్తే ఇతర ఖైదీలూ పెరోల్ మంజూరుచేయాలని డిమాండ్ చేసే ప్రమాదం ఉంది. కాగా, ఈ వ్యాజ్యంపై వచ్చే వారం విచారణ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖైదీల్లో దోషులుగా తేలిన వారి సంఖ్య 27,740 ఉంది. అదే విధంగా జ్యుడీషియల్ కస్టడీలో 99,036 మంది ఉన్నారు. -
బెయిల్ లేదు.. పెరోల్ లేదు
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ కు విముక్తి కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయనకు బెయిల్ లేదా పెరోల్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. న్యూయార్క్, లండన్ లో ఉన్న సహారా హోటళ్లను అమ్మేందుకు లేదా తనఖా పెట్టేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. ఎక్కడ, ఎప్పుడు ఆస్తులు అమ్మేందుకు సంప్రదింపులు జరిపినా పోలీసుల పర్యవేక్షణలోనే జరగాలని సుబ్రతారాయ్ ను ఆదేశించింది. ఆస్తుల అమ్మకానికి సంబంధించి జైలు వెలుపల క్లయింట్లతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలీసుల పర్యవేక్షణలో సంప్రదింపులు కొనసాగించొచ్చని తెలిపింది. తనకు ‘దయతో’ తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సుబ్రతారాయ్ సుప్రీంకోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
దయతో బెయిల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న తనకు ‘దయతో’ తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ శుక్రవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తద్వారా గ్రూప్ ఆస్తులను విక్రయించి రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్- సెబీ వద్ద డిపాజిట్ చేయాల్సిన రూ.10,000 కోట్ల సమీకరించడానికి వీలుకలుగుతుందని వివరించారు. దీనిపై న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసుకుంది. ఐటీ అఫిడవిట్‌కు 2 వారాల గడువు... కాగా కేసుకు సంబంధించి గ్రూప్ కంపెనీలు తనకూ రూ.7,000 కోట్ల పన్ను చెల్లింపులు జరపాల్సి ఉందని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ వివరాలు తెలుపుతూ రెండు వారాల్లో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. -
ఆస్తులు అమ్ముకుంటాం.. పెరోల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆస్తుల విక్రయానికి వీలు కల్పిస్తూ తనకు కనీసం 40 రోజుల పెరోల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టును గురువారం కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా మదుపుదారుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు డబ్బు వసూలు చేసిన కేసులో గత 4 నెలలుగా ఆయన తీహార్ జైలులో కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు కట్టాలని కోర్టు షరతు విధించింది. ఈ నిధుల సమీకరణకు వీలు కల్పించాలని ఇప్పటికే సహారా చీఫ్ పలు ప్రతిపాదనలతో కోర్టు ముందుకు వచ్చారు. వీటిని సుప్రీం తోసిపుచ్చింది. ప్రస్తుత పెరోల్ విజ్ఞప్తి ఈ దిశలో తాజాది. న్యూయార్క్, లండన్లలో లగ్జరీ హోటళ్లను విక్రయిస్తామని సహారా పేర్కొంది. అయితే విదేశాల్లో ఉన్న ఆస్తుల విక్రయానికన్నా ముందు దేశీయంగా ఉన్న ఆస్తులను మొదట ఎందుకు విక్రయించకూడదని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సహారా న్యాయవాది రాజీవ్ ధావన్‌ను ప్రశ్నించారు. దీనికి ధావన్ సమాధానం ఇస్తూ, తద్వారా రూ.5,000 కోట్ల సమీకరణ కష్టమని వివరించారు. ఈ పరిస్థితుల్లో న్యూయార్క్‌లోని డ్రీమ్ డౌన్‌టౌన్, ప్లాజా హోటళ్లను, అలాగే లండన్‌లోని గ్రాస్‌వీనర్ హౌస్‌ను తొలుత విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనితో... ఒకవేళ విదేశాల్లోని ఆస్తుల విక్రయింపు ప్రక్రియ పర్యవేక్షణ ఎలా అన్న విషయంలో సలహాలను ఇవ్వాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీని బెంచ్‌కు సూచించింది. కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఐటీ షాక్... మరోవైపు గ్రూప్ చెల్లించాల్సిన పన్నుల విషయంలో ఆదాయపు పన్నుల (ఐటీ) శాఖ కూడా రంగంలోకి దిగింది. పన్నుగా సంస్థ రూ.7,000 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. విచారణలో భాగంగా తమ వాదనలూ వినాలని కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆదాయపు పన్నుకు సంబంధించి ఐటీ చేసిన వాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దీనిని కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేస్తుందని తెలిపారు. -
సంజయ్ దత్ కు మరో 30 రోజుల పెరోల్ పొడిగింపు
1993 ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో 30 రోజులపాటు పెరోల్ ను మహారాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. భార్య మాన్యత అనారోగ్యం పాలుకావడంతో గత డిసెంబర్ 6 తేదిన ఒక నెలపాటు పెరోల్ ను మంజూరు చేసింది. వాస్తవానికి 30 రోజుల పెరోల్ గడువు మంగళవారంతో పూర్తికానుంది. అయితే తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని సంజయ దత్ చేసిన విజ్క్షప్తికి పూణే డివిజనల్ కమిషనర్ ప్రభాకర్ దేశ్ ముఖ్ మరో 30 రోజులపాటు పెరోలు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగిఉన్నారనే ఆరోపణలపై సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్షను సుప్రీం కోర్టు విధించిన సంగతి తెలిసిందే. మాన్యత లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. -
పెరోల్‌ను రద్దు చేయండి
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు పరోల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అఖిల బారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు ఆయన ఇంటి ముందు గురువారం ఆందోళనకు దిగారు. అక్రమంగా ఆయుధాలు సరఫరా చేశాడన్న కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్‌కు పదేపదే పరోల్ ఇవ్వడం సబబు కాదని మండిపడ్డారు. నెలరోజుల పాటు సంజయ్‌కు ఇచ్చిన పరోల్‌ను రద్దు చేసి పుణేలోని యెరవాడ సెంట్రల్ జైలుకు తరలించాలని ఏబీవీపీ నగర కార్యదర్శి యదునాథ్ దేశ్‌పాండే డిమాండ్ చేశారు. కఠిన శిక్షలు పడిన ఓ వ్యక్తికి రెండు నెలల్లో రెండుసార్లు పరోల్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. భార్య మన్యతకు ఆరోగ్యం బాగా లేదన్న విషయం ఒప్పించేలా లేదని, ఆమె అర్ధరాత్రి పార్టీలకు హాజరవుతోందని తెలిపారు. ఇక్కడ ఆందోళన జరుగుతుందన్న విషయం తెలిసిన నగర పోలీసులు దత్ నివాసానికి చేరుకున్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఆశీష్ చౌహన్తో పాటు మరో 15 మంది కార్యకర్తలను అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. వీళ్లు పదేపదే ఆందోళనలు చేస్తుండటంతో ఇంటి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేందుకు దత్ ఇష్టపడటం లేదు. ఆనారోగ్యంతో బాధపడుతున్న భార్య మాన్యతను చూసుకునేందుకు నెలరోజులపాటు పరోల్‌పై గత వారంలో దత్ జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. -
సంజయ్‌దత్‌కు పెరోల్
సాక్షి, ముంబై: పుణేలోని ఎరవాడ కారాగారంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు మరోసారి నెల రోజుల పెరోల్ లభించింది. ఈ విషయాన్ని జైళ్ల అదనపు డెరైక్టర్ జనరల్ మీరా బోర్వాంకర్ నిర్దారించారు. పుణే డివిజనల్ క మిషనర్ ప్రభాకర్ దేశ్‌ముఖ్ పెరోల్‌ను మంజూరు చేశారు. దీంతో శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దత్ కారాగారం నుంచి బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబసభ్యులు సంజయ్‌దత్‌తో జరుపుకునేందుకు వీలుక లిగింది. వాస్తవానికి దత్‌కు ఈ నెల ఆరో తేదీనే పెరోల్ మంజూరైంది. అయితే దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాన్యత కనిపించడంతో ఆమె అరోగ్యం బాగానే ఉందని, అయితే జైలు నుంచి బయటపడేందుకు దత్ అబద్ధాలు చెప్పాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో హోం మంత్రి పాటిల్ దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ఆ తర్వాత ఏంజరిగిందనే విషయం వెలుగులోకి రాకపోయినప్పటికీ 30 రోజుల పెరోల్ లభించింది. -
సంజయ్ దత్‌కు మళ్లీ పెరోల్.. విడుదల!
బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్‌దత్ మరోసారి పెరోల్ మీద విడుదలయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య మాన్యతను చూసుకోడానికి అనుమతించాలని అతడు కోరడంతో నెలరోజుల పాటు పెరోల్ మీద విడుదల చేశారు. దీంతో ఎర్రవాడ సెంట్రల్ జైలు నుంచి దత్ విడుదలై ముంబై చేరుకున్నాడు. తన భార్యకు గుండెల్లో నెప్పిగా ఉందని, ఉన్నట్టుండి నెల రోజుల నుంచి బరువు కూడా తగ్గిపోతోందని దత్ చెప్పాడు. ఆమె కాలేయంలో పెద్ద కణితి ఉందని, అలాగే ఆమె హృదయస్పందన కూడా సరిగా లేదని కార్డియాలజిస్టు అజయ్ చౌఘలే తెలిపారు. దీంతో మాన్యతను చూసుకోడానికి వీలుగా సంజూబాబాకు మరోసారి పెరోల్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఆరోగ్య కారణాలతోనే సంజయ్ దత్‌కు 15 రోజుల పెరోల్ ఇచ్చి, దాన్ని మరో 15 రోజులు పొడిగించారు. దీంతో అక్టోబర్ నెలంతా సంజయ్‌దత్ జైలు బయటే ఉన్నారు. ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌కు 42 నెలల జైలుశిక్ష పడింది. వాస్తవానికి ఐదేళ్ల శిక్ష పడినా, అప్పటికే 18 నెలల జైలుజీవితం ముగియడంతో మిగిలిన 42 నెలలు మాత్రమే శిక్ష వేశారు. -
మున్నాకు మళ్లీ పెరోల్‌పై వివాదం
ముంబై: అక్రమ ఆయుధాల కేసులో పుణే ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు రెండోసారి పెరోల్ మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాల ఆందోళనతో దిగివచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టింది. జైలు అధికారులు సిఫార్సుపై పుణే డివిజనల్ కమిషనర్ ప్రభాకర్ దేశ్‌ముఖ్ శుక్రవారం సంజయ్‌దత్‌కు పెరోల్ మంజూరు చేశారు. రెండు నెలల క్రితం తన అనారోగ్య కారణాలతో పెరోల్‌పై బయటకు వచ్చిన సంజయ్‌దత్.. ఈ సారి తన భార్య మాన్యత అనారోగ్య కారణాన్ని చూపించారు. కాగా, మాన్యత ఒక పుట్టినరోజు పార్టీకి హాజరైన ఫొటోలు శనివారంనాడు పేపర్లలో ప్రచురితం కావడంతో ఆమె అనారోగ్యంపై ప్రశ్నలు తలెత్తాయి. దీంతో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు జైలు ముందు నల్ల జెండాలతో ఆందోళన నిర్వహించారు. బాలీవుడ్ నటుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జైలు అధికారులపై విరుచుకుపడ్డారు. పెరోల్ రద్దు చేయకపోతే జైల్ భరో నిర్వహిస్తామని హెచ్చరించారు. మరోపక్క బీజేపీ కూడా జైలు అధికారుల చర్యపై మండిపడింది. దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని, సంజయ్‌కు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో బీజేపీ ఉపనేత గోపీనాథ్ ముండే డిమాండ్ చేశారు. దీంతో మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ పెరోల్ మంజూరుపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. మాన్యత కాలేయంలో కణితి: డాక్టర్ పెరోల్‌కు తన భార్య అనారోగ్యాన్ని సంజయ్‌దత్ కారణంగా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో మాన్యతకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అజయ్ చౌగులే వివరణ ఇచ్చారు. ఆమె కాలేయంలో కణితి ఉందని, అంతేగాక హృద్రోగ లక్షణాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నామని, అవి పూర్తయిన తర్వాత శస్త్రచికిత్స అవసరాన్ని గురించి ఆలోచిస్తామన్నారు. -
సంజయ్ దత్‌కు పెరోల్‌పై దుమారం
ఒకే ఏడాదిలో సంజయ్‌దత్‌కు ఏకంగా మూడుసార్లు పెరోల్ మంజూరు కావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. భార్య మాన్యతాదత్‌కు బాగాలేదంటూ ఇతడు పెరోల్ పొందగా, ఆమె సినిమా ప్రదర్శనకు హాజరైన ఫొటోలు శనివారం వార్తాపత్రికల్లో రావడంతో ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. పుణే/ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు స్వల్ప వ్యవధిలోనే మరోసారి పెరోల్ రావడంపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది. సామాన్య ఖైదీలు దరఖాస్తు చేస్తే ఏవో కారణాలు చూపుతూ పెరోల్ తిరస్కరిస్తారని, సినీ, రాజకీయ ప్రముఖులను మాత్రం అడిగిందే తడవుగా విడుదల చేస్తున్నారని సామాజిక సంఘాల కార్యకర్తలు విమర్శించారు. 1993 పేలుళ్ల కేసులో దోషిగా తేలిన దత్ ప్రస్తుతం యెరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. భార్య అనారోగ్యాన్ని కారణ ంగా చూపుతూ దత్ ఈ అక్టోబర్‌లోనూ నెల రోజులపాటు పెరోల్ పొందాడు. భార్య మాన్యతాదత్ ఆరోగ్యం బాగాలేనందున మరోసారి నెలపాటు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ దత్ చేసిన అభ్యర్థనపై పుణే డివిజనల్ కమిషనర్ ప్రభాకర్ దేశ్‌ముఖ్ సానుకూలంగా స్పందించి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మాన్యతాదత్ సినిమా ప్రదర్శనకు హాజరవుతూ ఉత్సాహంగా కనిపించిన ఫొటోలు పలు వార్తాపత్రికల్లో శనివారం ఉదయం దర్శనమిచ్చాయి. దీంతో దత్ దరఖాస్తుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పలు సామాజిక సంఘాలు శనివారం ఆందోళనకు దిగాయి. ట్విటర్, ఫేస్బుక్ వంటి సామాజిక సంబంధాల సైట్లలోనూ ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. ఈ వివాదంపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ పెరోల్ మంజూరుపై విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు. ‘ఏయే కారణాలతో పెరోల్ మంజూరు చేశారో పరిశీలించడానికి వీలుగా సంబంధిత పత్రాలను కోరాం’ అని వివరణ ఇచ్చారు. జైలు ఎదుట ఆర్పీఐ ఆందోళన పుణే: దత్‌కు నెలరోజుల వ్యవధిలోనే మరోసారి పెరోల్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) కార్యకర్తలు యెరవాడ జైలు ఎదుట శనివారం నిరసన తెలిపారు. నల్లజెండాలు, బ్యానర్లు ప్రదర్శిస్తూ దత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సినీనటుణ్ని కూడా సామాన్య ఖైదీ మాదిరిగానే పరిగణించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జైలు వద్ద శుక్రవారం రాత్రి నుంచే భద్రతను కట్టుదిట్టం చేశామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ట్విటర్లో జనాగ్రహం సామాజిక సంబంధాల సైట్ ట్విటర్లోనూ ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం కనిపించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎంతమాత్రమూ సమర్థించలేమని నెటిజనులు స్పష్టం చేశారు. ఈ నేరగాడు (దత్) వచ్చే ఏడాది కూడా విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఎంపీ, దత్ సోదరి ప్రియకు కృతజ్ఞతలు!! -మిత్రాజోషి, ముంబై సిగ్గుచేటు! సంపన్నుడు, సినీనటుడు సంజయ్‌దత్‌కు మరోసారి హాలీడే ప్యాకేజీ (పెరోల్) వచ్చింది. వేలాది మంది అమాయకులు మాత్రం జైళ్లలో మగ్గుతూనే ఉంటారు. -నందితా ఠాకూర్, ముంబై ప్రతిసారీ ఈ పెరోల్ నాటకాలు ఆడే బదులు దత్ నుంచి ఒకేసారి రూ.100 కోట్లు తీసుకొని విడుదల చేస్తే బాగుంటుంది!! -అజ్ఞాత వ్యక్తి -
సంజయ్ దత్ కు నెల రోజుల పెరోల్ మంజూరు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు 30 రోజుల పెరోల్ ను ఎర్రవాడ జైలు అధికారులు మంజూరు చేశారు. దాంతో పూణేలోని ఎర్రవాడ జైలు నుంచి మరోసారి పెరోల్ పై సంజయ్ దత్ విడుదల కానున్నారు. తన భార్య మాన్యత అనారోగ్యంతో బాధపడుతుందని సంజయ్ దత్ చేసిన పెరోల్ పిటిషన్ జైలు అధికారులు పరిశీలించారు. ఆ తర్వాత సంజయ్ కు పూణే డివిజినల్ కమిషనర్ పెరోల్ ను మంజూరు చేశారు. వైద్యం నిమిత్తం అక్టోబర్ ఒకటవ తేదిన సంజయ్ రెండు వారాల పెరోల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆతర్వాత ఆ పెరోల్ ను మరో రెండు వారాలు పొడిగించారు. దాంతో సంజయ్ అక్టోబర్ 30 తేదిన తిరిగి జైలుకు చేరుకున్నారు. తాను కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాను. అయితే మునపటి కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. త్వరలో బయటకు రావాలని దేవుడ్ని ప్రార్ధించండి అని అక్టోబర్ 30 తేదిన సంజయ్ అన్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు 42 నెలల జైలుశిక్షను కోర్టు ఖారారు చేసిన సంగతి తెలిసిందే. -
సంజయ్‌దత్‌కు 14 రోజుల పెరోల్ మంజూరు
బాలీవుడ్ హీరో సంజయ్‌దత్‌కు కొద్ది ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 14 రోజుల పెరోల్ మంజూరైంది. చికిత్స చేయించుకోడానికి వీలుగా ఈ ఊరటను కోర్టు మంజూరుచేసింది. అక్రమ ఆయుధాల కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడిన సంజయ్ దత్.. ఈ సంవత్సరం మే 16వ తేదీ నుంచి పుణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్ దత్ వద్ద కూడా కొన్ని ఆయుధాలు లభించాయి. వాటిలో ఏకే-57 లాంటి రైఫిళ్లు కూడా ఉన్నాయి. ఆత్మరక్షణ కోసమే వాటిని ఉంచుకున్నట్లు చెప్పినా, వాటికి తగిన లైసెన్సు లేకపోవడంతో సంజూబాబాపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు సుదీర్ఘ కాలం పట్టడంతో ఇటీవలే సంజయ్‌దత్ జైల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. జైల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని నాటకాలు ప్రదర్శించి అక్కడ దేశభక్తిని పెంపొందించేందుకు సంజయ్ ప్రయత్నించారు. పెరోల్ మంజూరు కావడంతో సంజయ్‌దత్ ఈరోజు సాయంత్రం లోపులే పుణె ఎరవాడ జైలు నుంచి విడుదల కానున్నారు. -
అనుమానంతో అఘాయిత్యం
ఉప్పల్, న్యూస్‌లైన్: అనుమానం పెనుభూతమైంది... కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతను పెరోల్‌పై బయటకు వచ్చి భార్యను అతికిరాతకంగా పొడిచి చంపి పారిపోయాడు. రామంతాపూర్ గాంధీనగర్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన ఎస్. వీరు (36) చార్మినార్‌లో ట్రైలరింగ్ పని చేసేవాడు. 12 ఏళ్ల క్రితం అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే సంగీతను ప్రేమించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈకేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన వీరు.. తనపై కేసులు ఎత్తేశారని నమ్మబలికి రామంతాపూర్ గాంధీనగర్‌కు చెందిన బసంతి కూతురు నందిని(30)ను 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు ధనుష్ (8) సంతానం. అనంతరం ప్రియరాలి హత్య కేసులో వీరుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భర్త జైలుకు వెళ్లినప్పటి నుంచి నందిని అమ్మగారి ఇంటిపక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ.. దుస్తుల షాపులో పని చేస్తూ జీవిస్తోంది. ఏడేళ్ల తర్వాత ఈనెల 3న పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన వీరు భార్య వద్దే ఉంటున్నాడు. ఇంటికి వచ్చిన రోజు నుంచి అనుమానంతో ఆమెతో గొడవ పడుతున్నాడు. కుమారుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లి.. తన కొడుకును తీసుకుపోతానని పలుమార్లు గొడవపడ్డాడు. ఇదిలా ఉండగా, సోమవారం మధ్యాహ్నం నందిని భోజనం చేస్తుండగా ఇంటికి వచ్చిన వీరు ఆమెతో గొడవకు దిగాడు. అప్పటికే భార్యపై అనుమానం పెంచుకున్న వీరు.. తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపు, ఛాతి, కాళ్లపై విచక్షణారహితంగా పొడిచాడు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న కుమారుడు తల్లిపై దాడిని అడ్డుకోబోగా అతడిని కూడా కత్తితో గాయపర్చి పారిపోయాడు. వెంటనే ధనుష్ పక్కనే ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లి.. ఆమెను తీసుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న నందినిని రామంతాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందని హత్యతో గాంధీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.